Guntur Kaaram: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న కుర్చీ మడత పెట్టి సాంగ్!

సుపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ అంతగా ఆకట్టుకొలేకపొయింది.
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో వచ్చే ఊరమాస్‌ సాంగ్‌ కుర్చీమడతపెట్టి ఏ స్థాయిలో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పకరలేదు. ఈ సాంగ్ ప్రోమో విడుదలైనప్పటి నుంచి మిలియన్ల సంఖ్యలో రీల్స్‌ చేస్తూనే ఉన్నారు. విడుదలైన అన్ని ప్లాట్‌ఫాంలో వ్యూస్‌ కొల్లగొడుతోంది. తాజాగా మూవీ టీం కుర్చీ మడత పెట్టి ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. సోషల్‌ మీడియాలో పాపులర్ అయిన కుర్చీతాత డైలాగ్‌తో సాగే ఈ మాస్‌ బీట్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇప్పటికే చీరకట్టులో, మోడ్రన్‌ డ్రెస్సులలో అమ్మాయిలు కుర్చీమడతపెట్టి సాంగ్‌కు రీల్స్ తో టిండ్ అవుతున్నారు. ఈ సాంగ్‌లో మహేశ్ బాబు, శ్రీలీల ఇరగదీసే ఊరమాస్‌ స్టెప్పులతో దుమ్ములేపెశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related News