Saturday, November 16, 2024

IRCTC: మీ రైలు ఎక్కడుందో సులభంగా తెలుసుకోండి.. వాట్సప్ లో ఇలా మెసేజ్ చేస్తే చాలు..

IRCTC: భారతీయ రైల్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకుంటూ ప్రయాణీకులు సేవలను అందుబాటులోకి తెస్తుంది. అలాగే మరికొన్ని సేవలను పొందే విధానాన్ని సులభతరం చేస్తోంది.
ఇప్పటికే ప్రయాణీకులు రిజర్వేషన్ చేసుకున్న టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే దాని పీఎన్ ఆర్ ఆధారంగా రైల్వే అధికారిక వెబ్ సైట్స్ తో పాటు మరికొన్ని వెబ్ సైట్లు, రైల్వే శాఖకు సంబంధించి యాప్ ల ద్వారా తెలుసుకునే వీలుంది. అలాగే వాట్సప్ ద్వారా కూడా మన పీఎన్ ఆర్ స్థితిని తెలుసుకుని వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈసేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే మనం ప్రయాణిస్తున్న లేదా.. ప్రయాణించబోయే రైలు ఎక్కడ ఉందనే కరెక్ట్ లోకేషన్ ను తెలుసుకోవడానికి ఎప్పటినుంచో యాప్ అయితే అందుబాటులో ఉంది. ఇప్పుడు వాట్సప్ సేవలను కూడా భారతీయ రైల్వే అందిస్తోంది. మన రైలు నెంబర్ ఎంటర్ చేసి రైల్వే శాఖ సూచించిన పద్ధతి ప్రకారం మెసేజ్ చేస్తే రైలు ఎక్కడ ఉందనేది తెలుసుకోవచ్చు. గతంలో మన రైలు నిర్థిష్టంగా ఎక్కడ ఉందనేది తెలుసుకోవడం కష్టంగా ఉండేది. తీరా రైల్వే స్టేషన్ కు కంగారు కంగారుగా టైమ్ కి చేరుకుంటే.. ఆతర్వాత ఎంక్వైరీలో అడిగితే రైలు లేటు నడుస్తుందని చెప్తే నిరాశకు గురయ్యేవారు ప్రయాణీకులు. అయితే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కొన్ని సంవత్సరాల క్రితమే భారతీయ రైల్వే ఓ యాప్ ద్వారా రైలు ఎక్కడ ఉంది.. సరైన సమయానికి నడుస్తుందా లేదా ఆలస్యంగా నడుస్తుందా అని తెలుసుకునే విధానాన్ని ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

రైలు నెంబర్ ఆధారంగా ప్రయాణీకులు తాము ప్రయాణించే రైలు ఎక్కడుందో తెలుసుకుని దాని ఆధారంగా రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నారు. దీంతో ప్రయాణీకుల సమయం ఆదా అవుతుంది. రైలు ప్రయాణం సమయంలో సరైన భోజనం చేయాలంటే ఇబ్బంది పడేవాళ్లు ప్రయాణీకులు. రైలులో ఏది దొరికితే అదే తినాల్సి వచ్చేది. అది కూడా ప్యాంటీకార్ సర్వీస్ సిబ్బంది ఆహారం తీసుకొస్తేనే వారి నుంచి కొనుగోలు చేసే వారు ప్రయాణీకులు. కాని ఇప్పుడు తమకు కావల్సిన ఆహారాన్ని ఓ మెసెజ్ లేదా యాప్ లో ఆర్డర్ చేయడం ద్వారా పొందే సదుపాయాన్ని భారతీయ రైల్వే కల్పించింది. ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వాట్సప్ సేవలను కూడా భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్ సీటీసీ ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

వాట్సప్ లో భారతీయ రైల్వే తీసుకొచ్చిన చాట్ బాట్ ద్వారా రైల్వే ప్రయాణీకులు పీఎన్ ఆర్ స్థితితో పాటు రైలు యొక్క లోకేషన్ ను తెలుసుకోవచ్చు. ఏ రైల్వే స్టేషన్ కు ఏ సమయానికి చేరుకుంది. రైలు అంతకుముందు ఏ స్టేషన్ లో ఆగింది. తరువాత రాబోయే స్టేషన్ వివరాలను వాట్సప్ చాట్ బాట్ లో పొందవచ్చు. అలాగే వాట్సప్ సదుపాయం లేని వారు రైల్వే సహాయ కేంద్రం నెంబర్ 139కు డయల్ చేసి రైలు ఎక్కడుంది, తరువాత రాబోయే స్టేషన్ వివరాలతో పాటు, పీఎన్ ఆర్ స్థితిని తెలుసుకోవచ్చు. వాట్సప్ ద్వారా భారతీయ రైల్వే అందించే సేవలు ఎలా పొందాలో తెలుసుకుందాం.

రైల్వే శాఖకు చెందిన వాట్సప్ చాట్ బాట్ నెంబర్ 9881193322 నెంబర్ ను మన ఫోన్ లో సేవ్ చేసుకోవల్సి ఉంటుంది.
వాట్సప్ యాప్ ఓల్డ్ వెర్షన్ అయితే దానిని అప్ డేట్ చేసుకోవల్సి ఉంటుంది.

వాట్సప్ లో కాంటాక్ట్ లిస్ట్ ను రిఫ్రెష్ చేయాలి.

మనం ఫోన్ లో భారతీయ రైల్వేకు సంబంధించి వాట్సప్ సేవలను అందించే నెంబర్ ను ఏ పేరుతో సేవ్ చేసుకున్నామో అది ఓపెన్ చేసి అందులో హాయ్ అని మెసెజ్ చేయడం లేదా మన పీఎన్ ఆర్ లేదా రైలు నెంబర్ ను ఎంటర్ చేసినట్లయితే సేవలకు సంబంధించిన గైడ్ లెన్స్ ను పంపుతుంది. ఆ గైడ్ లైన్స్ ఫాలో అవడం ద్వారా మనకు కావల్సిన సేవలను పొందవచ్చు.
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రిజర్వేషన్ ఉన్న ప్రయాణీకులు ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. దీనికోసం ఐఆర్ సీటీసీకి చెందిన జూప్ యాన్ ని ఉపయోగించి ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ఈయాప్ ద్వారా చేసే ఫుడ్ నేరుగా మన సీటు దగ్గరకే డెలివరీ చేస్తారు.

జూప్ ని ఉపయోగించి ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి ముందుగా ఫోన్ లో వాట్సప్ చాట్ బాట్ నెంబర్ 702062070ని సేవ్ చేయాలి.

వాట్సప్ ఓపెన్ చేసి ఫుడ్ ఆన్ లైన్ ఆర్డర్ కు సంబంధించిన నెంబర్ ను ఏ పేరుతో సేవ్ చేశామో అది ఓపెన్ చేసి 10 అంకెల పీఎన్ ఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి.

ఆతర్వాత ఏ స్టేషన్ లో మనం ఫుడ్ పొందాలనుకుంటున్నామో ఎంపిక చేసుకోవాలి.
అలాగే ఏ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రెస్టారెంట్ ని సెలక్ట్ చేసుకోవచ్చు.

ఆహారాన్ని ఆర్డర్ చేసిన తర్వాత ఆన్ లైన్ లో నగదు చెల్లించి లావాదేవీని పూర్తి చేసిన తర్వాత.. చాట్ బాట్ నుంచి ఆహారాన్ని ట్రాక్ చేయవచ్చు. ఇలా భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్ సీటీసీ అందించే వాట్సప్ సేవలను రైల్వే ప్రయాణీకులు పొందవచ్చు.

Sukanya Samriddhi Yojana: 15ఏళ్లు నిండాక సుకన్య సమద్ధి యోజనలో డబ్బు డిపాజిట్‌ చేసుకోవచ్చా?

Sukanya Samriddhi Yojana: కేంద్ర ప్రభుత్వం బాలికల కోసమే ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం సుకన్య సమృద్ధి యోజన! అమ్మాయిల విద్య, పెళ్లిళ్లకు డబ్బు మదుపు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఒక కుటుంబం రెండు సుకన్య ఖాతాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. కుమార్తెలకు 15 ఏళ్లు నిండేంత వరకు ఇందులో డబ్బు మదుపు చేసుకోవచ్చు. అంతకు మించి మరికొన్నాళ్లు డబ్బు దాచుకునేందుకు అవకాశం ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం!

సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఎన్నాళ్లు డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు?

సుకన్య సమృద్ధి యోజన నిబంధనల ప్రకారం ఖాతా తెరిచిన 15 ఏళ్ల వరకు డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు. పదేళ్లలోపు వయసున్న బాలికల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షులు ఖాతా తెరవొచ్చు. ఉదాహరణకు బాలికకు తొమ్మిదేళ్లున్నప్పుడు ఖాతా తెరిస్తే 24 ఏళ్ల వరకు కొనసాగించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 15 ఏళ్లు డబ్బు జమ చేయాలి. ‘ఖాతా తెరిచిన 15 ఏళ్ల వరకు డిపాజిట్లు కొనసాగించాలి’ అని ఎస్ఎస్వై నిబంధనలు పేర్కొంటున్నాయి. అలాగే 21 ఏళ్లకు ఖాతా మెచ్యూర్ అవుతుంది. 9 ఏళ్ల వయసులో తెరిస్తే ఆమెకు 30 ఏళ్లు నిండాకే మెచ్యూరిటీ వస్తుంది.

ఎస్ఎస్వై ఖాతాను ఎన్నాళ్లు ఆపరేట్ చేయాలి?

బాలికలకు 18 ఏళ్లు నిండేంత వరకే తల్లిదండ్రులు లేదా సంరక్షులు సుకన్య సమృద్ధి ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. ‘ఖాతాదారుకు 18 ఏళ్లు నిండేంత వరకే సంరక్షులు ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. 18 ఏళ్ల తర్వాత ఖాతాదారు తన సొంత వివరాలను సమర్పించి ఖాతాను నిర్వహించుకోవచ్చు’ అని నిబంధనలు చెబుతున్నాయి.

ప్రీమెచ్యూర్ క్లోజ్ చేయొచ్చా?

సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ముందుగానే ముగించొచ్చు. ఇందుకు ఖాతాదారుకు 21 ఏళ్లు నిండి ఉండాలి. ఆమె పెళ్లి కోసమే డబ్బు అవసరమని ధ్రువీకరించాలి. పెళ్లికి నెల రోజుల ముందు, మూడు నెలల తర్వాత మరే ఉద్దేశంతోనూ ఖాతాను క్లోజ్ చేసేందుకు వీల్లేదు.

సుకన్య సమృద్ధి యోజన ఖాతాను మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చా?

ఐసీఐసీఐ బ్యాంకు వెబ్సైట్ ప్రకారం కస్టమర్లు మొదట సుకన్యా సమృద్ధి యోజన ట్రాన్స్ఫర్ రిక్వెస్టును ఇప్పటికే ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఇవ్వాలి. కొత్తగా ఏ బ్యాంకు లేదా శాఖలోకి మార్చాలనుకుంటున్నారో దాని అడ్రస్ ఇవ్వాలి. అప్పుడు ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసు ఒరిజినల్ డాక్యుమెంట్లైన ఖాతా పుస్తకం, అకౌంట్ ఓపెనింగ్ దరఖాస్తు, స్పెసిమన్ సిగ్నేచర్ వంటివి ఐసీఐసీఐకి పంపిస్తుంది. దాంతో పాటు ఎస్ఎస్వై ఖాతాలోని డబ్బుల చెక్కు లేదా డీడీని పంపిస్తుంది. యాక్సిస్ సహా ఏ ఇతర బ్యాంకులైనా ప్రాసెస్ ఇలాగే ఉంటుంది.

Jyothika – Suriya: సూర్య , జ్యోతిక విడాకులు క్లారిటీ.! జ్యోతిక ముంబై వెళ్ళడానికి కారణం అదే.!

సినీ పరిశ్రమలో చాలాకాలంగా నటీనటుల వ్యక్తిగత జీవితం గురించి అనేక చక్కర్లు కొడుతుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో స్టార్ కపూల్స్ విడాకుల రూమర్స్ తెగ వైరలవుతున్నాయి.
ఇప్పటికే బాలీవుడ్ కపూల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ డివోర్స్ తీసుకున్నారంటూ టాక్ నడిచింది. అయితే ఈ రూమర్స్ పై వీరిద్దరూ స్పందించలేదు. కానీ ఎప్పటికప్పుడు తమ కుటుంబాలతో కలిసి కనిపిస్తూ డివోర్స్ రూమర్స్ కు చెక్ పెడుతున్నారు. ఇక ఇటీవల కొన్ని నెలలుగా సౌత్ ఇండస్ట్రీలో బ్యూటీఫుల్ జోడి సూర్య, జ్యోతిక విడిపోయారని.. అందుకే జ్యోతిక తన పిల్లలను తీసుకుని ముంబై షిఫ్ట్ అయ్యారంటూ ప్రచారం నడిచింది. సూర్య ఫ్యామిలీతో జ్యోతికకు మనస్పర్థలు రావడమే ఇందుకు కారణమని.. అందుకే వీరు విడాకులు తీసుకున్నారంటూ టాక్ వినిపించింది. అయితే ఇప్పటివరకు వీరిద్దరు ఈ వార్తలపై స్పందించలేదు. కానీ మొదటిసారి జ్యోతిక డివోర్స్ రూమర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ముంబై షిఫ్ట్ కావడానికి గల కారణాలను వెల్లడించారు. పెళ్లి తర్వాత లకు దూరంగా ఉంది జ్యోతిక.. కానీ ఇప్పుడిప్పుడే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తమిళంలో పలు చిత్రాల్లో నటించి మరోసారి ప్రేక్షకులను అలరించింది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె హిందీలో రెండు ల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్, పిల్లల చదువుల కోసమే ముంబై వెళ్లామని.. పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వరలోనే చెన్నై తిరిగి వస్తామని అన్నారు జ్యోతిక. దీంతో వీరిద్దరి విడాకుల వార్తలకు చెక్ పడింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జ్యోతిక వరుస లతో బిజీగా ఉంటుంది. అటు ఇటీవలే ఆమె నటించిన కథల్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే జ్యోతిక నటించిన సైతాన్ టీజర్ రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైంది. చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న సూర్య, జ్యోతిక 2006 సెప్టెంబర్ 11న ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

ITR filing: ఐటీఆర్‌ డాక్యుమెంట్లు ఎంత కాలం భద్రపరచుకోవాలి? నిపుణుల సూచనలు ఇలా..

భాద్యత గల భారతీయ పౌరులు అందరూ ఏటా ఆదాయ పన్ను రిటర్న్(ITR) దాఖలు చేయాలి. ITRను సమర్పించిన తర్వాత, పన్ను శాఖ ఈ వివరాలన్నీ సరిపోలుతున్నాయో?
లేదో? తెలుసుకోవడానికి డిక్లరేషన్‌లు, చెల్లించిన పన్నులను తనిఖీ చేస్తుంది. చెల్లించిన పన్నులు, పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే, లేదా ఇతర లోపాలను అధికారులు గుర్తిస్తే, వారు నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది. అందుకే ఐటీఆర్‌కి సంబంధించిన డాక్యుమెంట్లను భద్రపరచుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులోఆదాయ పన్ను శాఖ నుంచి ఏవైనా విచారణలు ఎదురుకావచ్చు. బ్లాక్‌మనీ యాక్ట్‌ 2015 కింద ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఆధారాలు చూపించేందుకు అవసరం అవుతాయి.

* 10 సంవత్సరాల వ్యవధికి నోటీసు

బ్లాక్ మనీ చట్టం ప్రకారం.. పన్ను చెల్లింపుదారు తన ITR డాక్యుమెంట్లను ఎంతకాలం భద్రపరచుకోవాలనే అంశంపై నిర్దిష్ట కాలపరిమితిని పేర్కొనలేదు. కానీ ఇన్‌కం ఎస్కేపింగ్‌ అసెస్‌మెంట్ విషయంలో, ఆదాయ పన్ను శాఖ 10 సంవత్సరాల వ్యవధిలో ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 147 కింద నోటీసు జారీ చేయవచ్చు.

ఆదాయ పన్ను చెల్లింపుదారుడు తన ఐటీఆర్ పత్రాలను ఎంతకాలం ఉంచుకోవాలి అనే అంశంపై ముంబైకి చెందిన పన్ను, పెట్టుబడి నిపుణుడు బల్వంత్ జైన్ మాట్లాడుతూ.. బ్లాక్‌మనీ యాక్ట్ ప్రకారం, పన్ను చెల్లింపుదారుడు తన ఐటీఆర్ పత్రాలను ఎంత కాలం ఉంచుకోవాలనే నిర్దిష్ట సమయం పేర్కొనలేదన్నారు. అయితే ఇన్‌కం ఎస్కేపింగ్‌ అసెస్‌మెంట్ కింద నోటీసు పంపే అధికారం ఆదాయ పన్ను శాఖకు ఉందని, ఈ నోటీసును 10 సంవత్సరాల వరకు ఐటీఆర్ ఫైలింగ్ కోసం పంపవచ్చని తెలిపారు.

* ఐటీఆర్‌ డాక్యుమెంట్లు ఎంత కాలం ఉంచుకోవాలి?

ఇన్‌కం ఎస్కేపింగ్‌ అసెస్‌మెంట్, బ్లాక్ మనీ యాక్ట్ నిబంధనలపై డెలాయిట్ ఇండియా భాగస్వామి ఆర్తీ రౌటే మాట్లాడుతూ.. పన్ను చెల్లింపుదారు కనీసం 10 సంవత్సరాల పాటు తన పన్ను రికార్డులను భద్రపరచుకోవాలని అన్నారు. సాధారణంగా కొన్ని నెలల్లోనే పన్ను రిటర్న్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన సమాచారం అందుతుందని, పన్ను రిటర్న్‌ను దాఖలు చేసినప్పటి నుంచి నెలల తరబడి ఏవైనా ప్రాథమిక సర్దుబాట్లు జరుగుతాయని చెప్పారు.
అయితే సాధారణంగా పన్ను రిటర్న్‌ను అందించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి మూడు నెలల వ్యవధిలో ఎప్పుడైనా సవివరమైన అసెస్‌మెంట్ కోసం నోటీసును ఆశించవచ్చన్నారు. ఇన్‌కం ఎస్కేపింగ్ అసెస్‌మెంట్ సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌కి సంబంధించి 3 సంవత్సరాల గడువు ముగిసేలోపు నోటీసు పంపుతారని తెలిపార. ఇన్‌కం ఎస్కేపింగ్‌ అసెస్‌మెంట్ రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సందర్భాల్లో, నోటీసును 10 సంవత్సరాల వ్యవధి వరకు జారీ చేసే అవకాశం ఉందని వివరించారు.

Deloitte India నిపుణులు.. పన్ను చెల్లింపుదారులకు కనీసం 10 సంవత్సరాల పాటు ITR పత్రాలను ఉంచుకోవాలని సూచించారు. తద్వారా ఆదాయ పన్ను శాఖ నుంచి అందే నోటీసులకు పూర్తి ఆధారాలతో సమాధానం చెప్పగలరని పేర్కొన్నారు. బ్లాక్ మనీ యాక్ట్ ప్రకారం ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి ఎలాంటి కాలపరిమితి లేదని గమనించాలి. అందువల్ల పన్ను డాక్యుమెంట్లను ఎక్కువ కాలం నిర్వహించడం కష్టంగా ఉన్నప్పటికీ, పన్ను అధికారి నోటీసుకు ప్రతిస్పందించడానికి వీలుగా డాక్యుమెంట్లను కనీసం సాఫ్ట్ కాపీ రూపంలో భద్రపరచుకోవాలి.

Swapna Shastra: కలలో ఇవి కనిపిస్తే మీ తలరాత మారబోతోందని అర్థం.

Swapna Shastra: నిద్రలో కలలు కనడం సహజమైన ప్రక్రియ. కలలకు కాళ్లుండవు అన్నట్టు..ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతాయి, ఎక్కడి నుంచి ఎక్కడో పడేస్తాయి…ఇలలో ఊహించనివి కలలో జరిగిపోతుంటాయి.
వాస్తవానికి కలలు కనడం ఎవ్వరి అధీనంలోనూ ఉండదు. నిద్రపోయేముందు ఏం ఆలోచిస్తామో.. నిద్రలో మనసెక్కడ తిరుగుతుందో అదే కలగా కనిపిస్తుందంటారు. అందుకే ఇలలో సాధ్యం కాదు అనుకున్న విషయాలు చాలా కలలో జరుగుతుంటాయి. అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసే మరో ప్రపంచం. అయితే చాలా కలలు మీ భవిష్యత్ కు సంకేతం అంటారు స్వప్నశాస్త్ర నిపుణులు. ఈ కల మళ్లీ వస్తే బావుండును అనిపించేవి కొన్నైతే..అమ్మో ఇలాంటి కల మళ్లీ రాకూడదు అనిపించేవి కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా కలలో ఈ 5 కనిపిస్తే మీ తలరాత మారిపోతుదంటారు స్వప్నశాస్త్ర నిపుణులు.

తామర పూలు
కలలో తామర పూలు కనిపిస్తే అది మీ తలరాత మారబోతోందనడానికి సంకేతం. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక లాభాలు పొందుతారు. అప్పుల బాధలనుంచి విముక్తి కలుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి.

తేనెపట్టు
కలలో తేనెపట్టు చూసినట్లయితే అది చాలా శుభ సంకేతంగా భావిస్తారు. అలాంటి కల జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. వెంటాడిన ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది.

పాలిస్తున్న ఆవు
ఆవు దగ్గర దూడ పాలుతాగడం కనిపిస్తే చాలా మంచి కలగా చెబుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అకాస్మాత్తుగా ఆర్థిక లాభం ఉండొచ్చు. ఆస్తివివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. న్యాయపరమైన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు

చిలుక కనిపిస్తే
చిలుకలు కలలో కనిపిస్తే సంపదకు సంకేతంగా భావిస్తారు. ఎప్పటి నుంచో మీ చేతికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుందని అర్థం. మీ జీవితంలో పెద్ద ప్రయోజనం పొందుతారని అంటారు.

చీమలు కలలో కనిపిస్తే
చీమలు సంపదను కూడబెట్టడంలో మేటి. అందుకే కలలో చీమలు కనిపిస్తే శుభ సంకేతంగా చెబుతారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం, తెల్ల చీమలు కనిపిస్తే ఇంకా మంచిది. త్వరలోనే ఆర్థికంగా ఎదుగుతారని అర్థం.

గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు కలొస్తే
గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కల వస్తే ఎంతో శుభదాయకం. దీనర్థం మీరు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో మీకు మెరుగైన ఫలితాలు అందుతాయని అర్థం.వ్యాపారులు లాభపడతారని సంకేతం. ఉద్యోగస్థులైతే ఉన్నత హోదాలు పొంది మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు కలొస్తే ఓకే కానీ గుర్రంపైనుంచి పడుతున్నట్లు వస్తే కెరీర్ లో మీరు కూడా అలానే కిందకు దిగజారతారని అర్థం.

కలలో బంగారు నాణేలు కనిపిస్తే
కలలో బంగారు నాణేలను చూడటం సూర్యుడికి సంబంధించినది. సూర్యుడు ఉత్సాహానికి సూచన. ఏదైనా పనిని చేయాలా వద్దా అని నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంటే మాత్రం సంతోషంగా ఉంటాలి. మీరు చేయబోయే పని మీకు మంచి ఫలితాలనిస్తుందని ఈ కల అర్థం.

Bihar Politics: 9వ సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం

బీహార్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్ (Nitish Kumar) 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), కాంగ్రెస్‌తో 18 నెలల పాలనకు ముగింపు పలికిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన మహాఘటబంధన్ కూటమి నుంచి వైదొలగి బీజేపీలో చేరారు. దీంతో ఆర్జేడీతో జేడీయూ బంధం తెగిపోయింది.

Cashback Offer: ఖర్చు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేస్తున్న క్రెడిట్‌ కార్డ్‌లు, భలే ఛాన్స్‌!

Credit Cards With Attractive Cashback Offer: ఒకప్పుడు, క్రెడిట్ కార్డ్ల కోసం జనం వెంపర్లాడితే… ఇప్పుడు బ్యాంక్లు వెంటపడుతున్నాయి. క్రెడిట్ కార్డ్ కస్టమర్లను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన ఫీచర్లను ఎరగా వేస్తున్నాయి.

అలాంటి ఎరల్లో ఒకటి ‘క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్’.

క్యాష్ బ్యాక్ ఆఫర్తో ఉన్న క్రెడిట్ కార్డ్లు యూజర్లను బాగానే మెప్పిస్తున్నాయి. ఈ తరహా కార్డ్లపై వచ్చే క్యాష్ బ్యాక్.. ఖాతాదారుడి క్రెడిట్ కార్డ్ అకౌంట్లో జమ అవుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు నుంచి ఆ మొత్తాన్ని తగ్గించి బిల్ కట్టొచ్చు.

క్యాష్ బ్యాక్ అందించే 5 క్రెడిట్ కార్డ్లు (5 Credit cards offering attractive cashback)

5 క్రెడిట్ కార్డ్లు మంచి క్యాష్ బ్యాక్ అందిస్తున్నాయి. వీటిలో ఏ కార్డ్ ద్వారానైనా ఒక వ్యక్తి ఒక నెలలో రూ.లక్ష రూపాయలు ఖర్చు పెడితే.. అతనికి ఒక సంవత్సరంలో ఎంత డబ్బు క్యాష్ బ్యాక్ రూపంలో తిరిగి వస్తుందన్న లెక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి.

క్యాష్ బ్యాక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ (Cashback SBI Credit Card)
క్యాష్ బ్యాక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే.. ఈ కార్డ్ ద్వారా ఆన్లైన్లో చేసే ఖర్చుపై 5% డబ్బు తిరిగొస్తుంది. ఆఫ్లైన్ ద్వారా చేసే ఖర్చుపై 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఉదాహరణకు… ఒక వ్యక్తి ఒక నెలలో రూ.లక్ష రూపాయలను ఈ కార్డ్ ద్వారా ఖర్చు చేశాడనుకుందాం. అందులో, రూ. 20,000 మొత్తాన్ని ఆన్లైన్లో ఖర్చు చేసి, మిగిలిన రూ. 80,000 మొత్తాన్ని ఆఫ్లైన్లో ఖర్చు చేస్తే… అతనికి ఏడాదిలో వచ్చే మొత్తం క్యాష్బ్యాక్ రూ. 21,600 అవుతుంది.

హెచ్డీఎఫ్సీ మిలీనియా క్రెడిట్ కార్డ్ (HDFC Millenia Credit Card)
ఈ కార్డ్ ద్వారా… అమెజాన్, బుక్ మై షో, కల్ట్.ఫిట్, ఫ్లిప్కార్డ్, మింత్ర, సోనీ లివ్, స్విగ్గీ, టాటా క్లిక్, ఉబర్, జొమాటో ఫ్లాట్ఫామ్స్లో చేసే స్పెండింగ్ మీద 5% క్యాష్ తిరిగొస్తుంది. ఇతర ఖర్చులపై 1% క్యాష్ బ్యాక్ అందుతుంది. క్యాష్ బ్యాక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తరహాలోనే, ఈ కార్డ్ ద్వారా ఒక నెలలో రూ. 20,000 మొత్తాన్ని ఆన్లైన్లో ఖర్చు చేసి, మరో రూ. 80,000 మొత్తాన్ని ఆఫ్లైన్లో ఖర్చు చేస్తే… ఏడాదిలో వచ్చే క్యాష్బ్యాక్ రూ. 21,600 అవుతుంది.

యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ (Axis Bank Ace Credit Card)
ఈ కార్డ్ ద్వారా… బిల్లు చెల్లింపులపై 5% క్యాష్ బ్యాక్, స్విగ్గీ, జొమాటో, ఓలా ఫ్లాట్ఫామ్స్లో చేసే ఖర్చులపై 4% క్యాష్ బ్యాక్, ఇతర అన్ని స్పెండింగ్స్ మీద 2% క్యాష్బ్యాక్ వర్తిస్తుంది. ప్రతి నెలా.. బిల్ పేమెంట్లు & 4% క్యాష్బ్యాక్ వచ్చే కేటగిరీలపై రూ. 10,000 ఖర్చు చేసి; మరో రూ. 90,000 ఇతర విషయాల కోసం స్పెండ్ చేస్తే, ఆ వ్యక్తికి ఆ సంవత్సరంలో రూ. 20,400 డబ్బు తిరిగి వస్తుంది.

ఐసీఐసీఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ (ICICI Amazon Pay Credit Card)
ఈ కార్డ్ ద్వారా, అమెజాన్ ప్రైమ్ మెంబర్లు అమెజాన్లో ఏదైనా వస్తువు కొంటే 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ‘అమెజాన్ పే’ చెల్లింపులపై 2% క్యాష్ బ్యాక్, ఇతర వ్యయాలపై 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఉదాహరణకు… ఒక వ్యక్తి అమెజాన్లో రూ.10,000,అమెజాన్ పే ద్వారా రూ. 20,000, ఇతర అవసరాల కోసం రూ. 70,000 ఖర్చు చేస్తే.. అతనికి సంవత్సరానికి రూ. 19,200 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

స్టాండర్డ్ చార్టర్డ్ స్మార్ట్ క్రెడిట్ కార్డ్ (Standard Chartered Smart Credit Card)
స్టాండర్డ్ చార్టర్డ్ స్మార్ట్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్లో చేసే వ్యయంపై 2%, ఆఫ్లైన్లో చేసే ఖర్చులపై 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒక వ్యక్తి ప్రతి నెలా ఆన్లైన్ మోడ్లో రూ. 50,000, ఆఫ్లైన్ మోడ్లో రూ. 50,000 ఖర్చు చేస్తే, ఒక ఏడాదిలో రూ. 18,000 క్యాష్ బ్యాక్ రూపంలో అతనికి తిరిగి వస్తుంది.

సోదరుడు జగన్ YCP పార్టీకి కొత్త అర్థం చెప్పిన షర్మిల

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తనదైన శైలీలో అధికార వైపీపీ పార్టీపై, సోదరుడు సీఎం జగన్‌పై విమర్శలు కురిపించారు. సోదరుడు జగన్ వైసీపీ పార్టీకి షర్మిల కొత్త అర్థం చెప్పారు.
శనివారం షర్మిల కాంగ్రెస్ నాయకులతో కలిసి గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ప్రాజెక్ట్ నిర్వహణ తీరును చూసి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ప్రారంభించిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రాజెక్ట్ నిర్వహణకు ఏడాదికి కోటి రూపాయలు కూడా కేటాయించడం లేదని నిప్పులు చెరిగారు. వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను పట్టించుకోని మీరా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నిలబెట్టేవాళ్లని ప్రశ్నించారు.

వైఎస్సార్సీపీలో వైఎస్ఆర్ లేడని.. వైఎస్ఆర్ అంటే వైవీ సుబ్బారెడ్డి (Y), సాయిరెడ్డి (S), రామకృష్ణారెడ్డి (R) అని షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త అర్థం చెప్పారు. వైఎస్సార్సీపీ పార్టీలో వైఎస్ లేడని.. ఇది జగన్ రెడ్డి పార్టీ, నియంత పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఆశయాలను గాలికి వదిలేసి.. బీజేపీకి బానిసైన పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ ప్రారంభించిన ఎన్నో ప్రాజెక్ట్‌లను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుత జగన్ సర్కార్ పట్టించుకోలేదని షర్మిల ఫైర్ అయ్యారు.

RFCL Jobs: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్

RFCL Jobs:రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్ కెమికల్స్‌ కంపెనీలో ఐటిఐ విద్యార్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎన్‌ఎఫ్‌ఐఎల్‌, ఈఐఎల్‌, ఎఫ్‌సిఐఎల్‌ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ నిర్వహణలో రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో ఐటిఐ విద్యార్హతతో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మెకానికల్ విభాగంలో ఐటి విద్యార్హతతో అటెండెంట్‌ గ్రేడ్ 1లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో ఫిట్టర్‌ పోస్టులు 10, డీజిల్ మెకానిక్‌ 3, మెకానిక్‌ హెవీ వెహికల్‌ రిపేర్స్‌-మెయింటెయినెన్స్‌ లో 2 పోస్టులు భర్తీ చేస్తారు.

అటెండెంట్‌ గ్రేడ్1 ఎలక్ట్రికల్ విభాగంలో 15ఎలక్ట్రిషియన్ పోస్టులు భర్తీ చేస్తారు. అటెండెంట్‌ గ్రేడ్1 ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగంలో ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ విభాగంలో 4పోస్టులు, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్ పోస్టులు 5 భర్తీ చేస్తారు.

ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.rfcl.co.in వెబ్‌సైట్‌లోని కెరీర్స్‌ విభాగంలో లభిస్తాయి.

ఉద్యోగాల కోసం దరఖాస్తులను సమర్పించడానికి 2024 ఫిబ్రవరి22లోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సవరణలు, మార్పులు చేర్పులు, తేదీల వివరాలను కేవలం ఆర్‌ఎఫ్‌సిఎల్‌ వెబ్‌సైట్‌లో మాత్రమే పొందుపరుస్తారు.

IOCL Recruitment 2024: ఐవోసీఎల్‌లో 473 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..

మొత్తం ఖాళీల సంఖ్య: 473పైప్‌లైన్‌ రీజియన్లు: వెస్ట్రన్, నార్తెర్న్, ఈస్ట్రన్, సదరన్, సౌత్‌ ఈస్ట్రన్‌.
అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 12.01.2024 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.02.2024.
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేదీలు: 09.02.2024 నుంచి 18.02.2024 వరకు.
రాతపరీక్ష తేది: 18.02.2024.

వెబ్‌సైట్‌: https://www.iocl.com/

Bank Jobs: విశాఖ కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో 30 పీవో పోస్టులు.. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక

అర్హత: కనీసం 60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 20-30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.

ఎంపిక ఇలా
రెండంచెల్లో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష
ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు-100 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం మూడు విభాగాలుంటాయి. జనరల్‌ ఇంగ్లిష్‌ 30 ప్రశ్నలు-30 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 35 ప్రశ్నలు-35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ జనరల్‌ బ్యాంకింగ్‌ విభాగాల నుంచి 35 మార్కులకు-35 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. ఇది అర్హత పరీక్ష మాత్ర­మే. ఇందులో ప్రతిభ చూపిన వారిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.అభ్యర్థులు మెయిన్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.

250 మార్కులకు మెయిన్‌
మెయిన్‌ పరీక్ష మొత్తం 250 మార్కులకు ఉంటుంది. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ తర­హా పరీక్ష, 50 మార్కులకు డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ఉంటా­యి. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో 4 విభాగాలు నుంచి ప్రశ్నలుంటా­యి. జనరల్‌ ఇంగ్లిష్‌ 35 ప్రశ్నలు-40 మా­ర్కులు, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 30 ప్రశ్నలు-50 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ/కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు-50 మార్కు­లు, జనరల్‌/ఎకానమీ /బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ వి­భాగం నుంచి 60 ప్రశ్నలు-60 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు. ఈ పరీక్షలో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతితప్పు సమాధానానికి నాల్గోవంతు మార్కు కోత ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి లెటర్‌ రైటింగ్, ఎస్సే అండ్‌ ప్రిసైస్‌ రైటింగ్‌ ఉంటాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు.

ఇంటర్వ్యూ
మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి 1:4 నిష్పత్తి­లో పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ ఇంట­ర్వ్యూ 50మార్కులకు ఉంటుంది. ఇందులో ఎంపికైన వారిని తుదిగా ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

ముఖ్యసమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 28.01.2024
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2024
వెబ్‌సైట్‌: https://www.vcbl.in/

గూగుల్ లో సరికొత్త టెక్నాలజీ.. అందుబాటులో టెక్స్ట్ టు వీడియో జనరేట్ ఆప్షన్..


గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకు వస్తుంది.
. ఈ క్రమంలోనే ఇటీవల కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని సహాయంతో మీరు టెక్స్ట్ రాస్తే చాలు వీడియోలను సృష్టిస్తుంది. ఈ టెక్నాలజీ పేరు LUMIERE. ఈ LUMIERE అనేది టెక్స్ట్-టు-వీడియో జనరేషన్ మోడల్. ఈ టెక్నాలజీని ఉపయోగించి మీరు ఏదైనా కంటెంట్ ని ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన వీడియో క్రియేట్ అవుతుంది. అలాగే ఏదైనా ఇమేజ్ ని ఎంటర్ చేసినా వీడియో క్రియేట్ చేయగలుగుతుంది. దీని ద్వారా మీరు మోషన్ వీడియోలని కూడా సృష్టించవచ్చు. ఈ సాధనం ఎలా పనిచేస్తుందో తెలిపే వీడియో Xలో షేర్ చేశారు.
LUMIERE స్పేస్-టైమ్ U-నెట్ ఆర్కిటెక్చర్‌ తో పనిచేస్తుంది. ఇందులో టెక్స్ట్ ఎంటర్ చేసి వీడియోను రూపొందిస్తుంది. LUMIERE ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. అయినా Google AI ప్లాట్‌ఫారమ్‌ నుంచి దీన్ని యాక్సెస్ చేసి ఉపయోగించవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌కి వెళ్లిన తర్వాత, మీరు LUMIERE ట్యాబ్‌కు వెళ్లాలి. ఆ తరువాత మీరు కొత్త వీడియోని సృష్టించడానికి క్రియేట్ బటన్‌ను క్లిక్ చేయవచ్చు.
కొత్త వీడియోని సృష్టించడానికి వీడియో క్రియేట్ ఆప్షన్ ని క్లిక్ చేసి తర్వాత టెక్ట్స్ ను ఎంటర్ చేయాలి. తర్వాత క్రియేట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అలా చేసిన వెంటనే మీకు స్క్రీన్ పై వీడియో వచ్చేస్తుంది. ఈ టెక్నాలజీతో ఎన్నో అద్భుతమైన వీడియోలను మనకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు.

https://twitter.com/GoogleAI/status/1751003814931689487?t=yTt0wE6YcyMHuXRUY4rOfA&s=19



 

Chanakya Niti: సంపాదించిన డబ్బు శాశ్వతంగా ఉండాలంటే చాణక్యుడి చెప్పిన ఈ సూత్రాలు పాటించండి..

చాణక్యుడు గొప్ప జ్ఞాని. ఆయన ఆకాలంలో చెప్పిన మాటలు ఇప్పటికీ అనుసరణీయమే. జీవితంలోని అనేక అంశాల గురించి లోతైన అవగాహన ఉన్న వ్యక్తి చాణక్యుడు. తనకున్న జ్ఞానంతో, తన విధానాలతో చరిత్ర గతిని మార్చిన గొప్ప వ్యక్తి.
చాణక్యుడు తన వ్యూహాల ద్వారా చంద్రగుప్తుడిని రాజును చేశాడు. ఆయన చెప్పిన ఎన్నో వ్యాఖ్యలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం, సంబంధాలు, స్నేహం, శత్రువలు వంటి జీవితంలోని వివిధ అంశాలపై తన అభిప్రాయాలను చాణక్య నీతి పుస్తకం ద్వారా వెల్లడించారు.

చాణక్యుడు అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఆర్థిక సంబంధ విషయాల గురించి ప్రస్తావించారు. సంపద ఎలా సృష్టించాలి, దానిని ఎలా నిర్వహించాలి, డబ్బు ఎలా ఖర్చు పెడితే రెట్టింపు అవుతుంది లాంటి ఎన్నో విషయాలు చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ గురించి చాణక్యుడు చెప్పిన విషయాలు ఇప్పటికీ అనుసరణీయమే.

డబ్బు ఎలా సంపాదించాలి, ఆ డబ్బును ఎలా ఖర్చు చేస్తే ధనవంతులు కావొచ్చో చాణక్యుడు చెప్పిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అవసరమున్న చోటే ఖర్చు చేయాలి:

* సంపద దాచుకోవడం తెలిసి ఉండాలని చాణక్యుడు చెబుతాడు.
* చెడు సమయాల్లో డబ్బు సహాయం చేస్తుందని చాణక్య నీతి చెబుతోంది.
* ఆపద సమయంలో డబ్బు నిజమైన స్నేహితుడి పాత్ర పోషిస్తుందని చాణక్యుడు సూచించాడు.
* డబ్బు లేనప్పటి కంటే ఉన్నప్పుడు ఉండే ఆత్మవిశ్వాసం ఎక్కువ. పర్సులో 2వేల నోటు ఉన్నప్పుడు, రూపాయి కూడా లేనప్పుడు ఎలా ఉంటుందో గమనించండి.
* ఆర్థిక సమస్యల వల్ల శారీరక సమస్యలు, మానసిక సమస్యలు వస్తాయి. కుటుంబసభ్యుల మధ్య సఖ్యత ఉండదు. దంపతుల మధ్య గొడవలు జరుగుతాయి.
* ఆదాయానికి మించి ఖర్చు చేసే వారు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు.
* డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలి.
* అవసరానికి లగ్జరీకి మధ్య తేడా తెలుసుకుని ఖర్చు చేయాలని చెబుతోంది చాణక్య నీతి.
* అనవసరమైన చోట డబ్బు ఖర్చు చేస్తే అవసరమైనవి వదులుకోవాల్సి వస్తుందని చాణక్యుడి అర్థశాస్త్రంలో చెప్పబడింది.

అనైతిక పనులకు డబ్బు ఖర్చు చేయవద్దు:

* జీవితంలో విజయం సాధించాలంటే అనైతిక చర్యలకు పాల్పడవద్దని చాణక్య నీతి చెబుతోంది.
* చెడు అలవాట్లు ధనవంతుడిని కూడా పేదవాడిని చేస్తాయి.
* ధనవంతులు కావాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
* తప్పుడు చర్యల ద్వారా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం నిలవదు.

డబ్బు దాచుకోవాలి:

* డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది.
* డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉన్న వారు నష్టపోయే అవకాశాలు ఎక్కువ.
* రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడతామో.. ఆ రూపాయిని దాచుకోవడానికి కూడా కష్టపడాలి.
* డబ్బు పొదుపు చేయాలి.
* అత్యవసర నిమిత్తం డబ్బు పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన డబ్బుతో వ్యాపారం చేయాలి, పెట్టుబడి పెట్టాలి.

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చాణక్య సూత్రం:

లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో చాణక్యుడు వివరంగా చెప్పాడు. అలాగే లక్ష్మీదేవికి కోపాన్ని కలిగించే అంశాలు ఏమిటో కూడా వివరించాడు. దొంగతనం, జూదం, అన్యాయం, మోసం చేసి డబ్బు సంపాదించే వారు త్వరగా ధనవంతులు అవుతారు. కానీ వారి సంపదన చాలా త్వరగానే కరిగిపోతుంది. మోసం చేసి ఎవరినైనా బాధపెట్టి సంపాదించే డబ్బు ద్వారా అనేక సమస్యలు వస్తాయని చాణక్య నీతి చెబుతోంది.

Aadhaar Name Update: ఆధార్ కార్డుపై పేరు మార్చాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవండి

ఆధార్ కార్డ్ తీసుకున్న కొత్తలో వివరాల గురించి పెద్దగా పట్టించుకోకుండా ఎన్‌రోల్ చేసినవాళ్లు ఉన్నారు. ఆ తర్వాత ఎక్కడైనా ఆధార్ కార్డ్ (Aadhaar Card) తప్పనిసరిగా అవసరం అయినప్పుడు తప్పులు గుర్తించి ఆధార్ అప్‌డేట్ (Aadhaar Update) చేసి వివరాలు మార్చుకుంటున్నారు.
ఇలాంటి తప్పుల్లో పేరు తప్పుగా ఉండటం ఓ సమస్య. పేరులో అక్షరాలు మిస్ కావడం, అదనంగా అక్షరాలు రావడం, పూర్తి పేరు లేకపోవడం, కేవలం ఇనీషియల్‌తో పేరు ఉండటం లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేయడం కాస్త పెద్ద ప్రాసెస్ ఉండేది కానీ, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో సులువుగా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకుంటున్నారు.

మరి మీరు కూడా మీ ఆధార్ కార్డుపై తప్పుగా ఉన్న పేరును సరిచేసుకోవాలని అనుకుంటున్నారా? చాలా సింపుల్. ఆన్‌లైన్‌లోనే కొన్ని వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేయొచ్చు. ఒకవేళ మీ పేరు మార్చాలనుకుంటే ఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.
ఆధార్ కార్డులో పేరు అప్‌డేట్ చేయండిలా

Step 1- ముందుగా https://ssup.uidai.gov.in/ssup/ పోర్టల్ ఓపెన్ చేయండి.

Step 2-ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

Step 3- క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

Step 4- ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

Step 5- సర్వీసెస్ ట్యాబ్‌లో Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి.

Step 6- ఆ తర్వాత Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.
Step 7- ఆధార్ కార్డులో ఉన్న మీ పేరు స్క్రీన్ పైన కనిపిస్తుంది.

Step 8- మీరు ఏ విధంగా మీరు పేరు మార్చాలనుకుంటే ఆ పేరు ఎంటర్ చేయాలి.

Step 9- అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.

Step 10- ఆన్‌లైన్ అప్‌డేట్ కోసం రూ.50 చెల్లించి ప్రాసెస్ పూర్తి చేయాలి.
యూఐడీఏఐ 27 ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అప్‌డేట్ కోసం అంగీకరిస్తుంది. వాటిపై పేరు, ఫోటో తప్పనిసరిగా ఉండాలి. పాస్‌పోర్ట్

పాన్ కార్డ్ , రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో ఉన్న బ్యాంక్ ఏటీఎం కార్డ్, ఫోటో ఉన్న క్రెడిట్ కార్డ్ , కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయొచ్చు.

All Districts ZP PF Slips Download – Annual Account Slips Download – Latest PF Slips Download

Download All Districts ZP PF Slips. Andhra Pradesh Zilla Parishad Provident Fund Annual ZP PF All Districts ZP PF Slips Download Available. At present some districts uploaded ZP PF Slips to download at their respective districts ZP PF Slips Website. And other districts ZP PF Slips can be download from state level website. These districts ZP PF Slips available at state level ANANTHAPUR, CHITTOR, KRISHNA, NELLOR, PRKASAM, SRIKAKULAM, VISAKHAPATNAM, VIJAYANAGARAM, WESTGODAVARI ZP PF Districts. Other All Districts ZP PF Slips will be available at their respective district websites. District websites shown below

All Districts ZP PF Slips Download – Annual Account Slips Download – Latest PF Slips Download

FOR ANANTHAPUR, CHITTOR, KRISHNA, NELLOR, PRKASAM, SRIKAKULAM, VISAKHAPATNAM, VIJAYANAGARAM, WESTGODAVARI ZPPF SLIPS password will be : emp123456 VISIT https://zpgpf.ap.gov.in/

To download ZPPF Slips

Your ZP PF number is : 123456

Your user name is  123456 and  your password will be : emp123456

ALL DISTRICTS ZPPF ANNUAL ACCOUNT SLIPS
ZPPF Slips Guntur District ZPPF Slips Guntur District DOWNLOAD
ZPPF Slips Krishna District ZPPF Slips Krishna District DOWNLOAD
ZPPF Slips Ananthapur District ZPPF Slips Ananthapuram District DOWNLOAD
ZPPF Slips Chittoor District ZPPF Slips Chittoor District DOWNLOAD
ZPPF Slips Nellore District ZPPF Slips Nellore District  DOWNLOAD
ZPPF Slips Prakasam District ZPPF Slips Prakasam District DOWNLOAD
ZPPF Slips Srikakulam District

 

ZPPF Slips Srikakulam District DOWNLOAD
ZPPF Slips Visakhapatnam District

 

ZPPF Slips Visakhapatnam District DOWNLOAD (OR)

ZPPF Slips Visakhapatnam District DOWNLOAD

ZPPF Slips Vizianagaram District

 

ZPPF Slips Vizianagaram District DOWNLOAD
ZPPF Slips West Godavari District

 

ZPPF Slips West Godavari District DOWNLOAD
ZPPF Slips East Godavari District

 

ZPPF Slips East Godavari District DOWNLOAD
ZPPF Slips Kurnool District

 

ZPPF Slips Kurnool District DOWNLOAD
ZPPF Slips Kadapa District ZPPF Slips Kadapa District DOWNLOAD

Vastu Tips: ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పెట్టడమే ఆర్థిక ఇబ్బందులకు మూలం.. మరి ఎక్కడ పెట్టాలంటే..

మన దేశంలో ఇప్పటికీ చాలా మంది వాస్తు శాస్త్రంలోని పద్ధతులను, నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ శాస్త్రాన్ని అనుసరించి ఇంట్లో ప్రతి వస్తువును, గదిని సరైన దిశలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఊడ్చే చీపురుని కూడా ఎలా పడితే పడేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ధనానికి మూలమైన లక్ష్మీదేవికి కోపం వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే చీపురు విషయంలోకొన్ని నియమాలను కచ్చితంగా పాటించి తీరాలి. లేకపోతే కుటుంబంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన హిందూ ధర్మంలో చీపురు చాలా పవిత్రమైనది. సాక్షాత్ లక్ష్మీదేవి ప్రతీకగా కూడా చీపురును భావిస్తారు. అందువల్ల మన ఇంట్లో చీపురును వాడేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చీపురు విషయంలో చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు చూద్దాం..

ముఖ్యంగా విరిగిపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు అనేదే నిల్వ ఉండదు. అలాగే చీపురు కింద వేసి తొక్కకూడదు. అలా చేస్తే లక్ష్మి దేవికి ఆగ్రహం కలిగిస్తుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వంట గదిలో చీపురును ఉంచకూడదు. కిచెన్లో చీపురును ఉంచితే ఇంట్లోనివారికి ఆహారం దొరకడం కష్టంగా మారుతుంది. చీపురే కాదు.. ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ధనం, ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు. అలాగే చీపురును ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకూడదు. చీపురుని వాడిన తర్వాత దానిని అడ్డంగా పెట్టి.. ఏదైనా తలుపు వెనకాల ఉంచాలి. అలాగే పాడైపోయిన చీపురుతో ఇంటిని ఊడవకూడదు. అదే విధంగా సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటిని ఊడవకూడదు. ఒకవేళ ఊడ్చినా చెత్తను బయట పడెయ్యకూడదు. చీపురును ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. ఏదైనా మూల ప్రదేశాలలో మాత్రమే పడుకోబెట్టాలి. అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును చూడకూడదు.అలాగే పాడైపోయిన చీపురును ఎప్పుడు పడితే పడేయకూడదు. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజున, ఏకాదశి వంటి పవిత్రమైన రోజుల్లో చీపురును పడవేయకూడదు. కేవలం శనివారం మాత్రమే పారేయాలి. అమావాస్య రోజున కూడా ఈ పని చేయవచ్చు. అయితే ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా పాడేయాలి. విరిగిపోయిన చీపురును పారే కాలువలో ఎట్టి పరిస్థితుల్లో పడేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లే అవుతుంది. అలాగే చీపురును ఎల్లప్పుడు కూడా మంగళవారం, శనివారం, అమావాస్యల రోజుల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. ముఖ్యంగా కృష్ణ పక్షంలో కొనడం మంచిది. ఇంట్లో పసిబిడ్డలు పుట్టినప్పుడు కూడా పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఇంట్లో అప్పటివరకు ఉపయోగించిన చీపురును మళ్లీ ఉపయోగించకూడదని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అంతేకాదు పండుగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు, రోహిణి నక్షత్రం,హస్త నక్షత్రం, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనూరాధ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో చీపురు కొనకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

chanakya niti: జీవితంలో ప్రతిఒక్కరూ తెలుసుకోవలసిన అతిపెద్ద పాఠం.. ఇది తెలిస్తే ఓటమి ఎదురుకాదు!

చాణక్యుడి విధానాలు మెరుగైన జీవితానికి ఎంతో ఉపయోగకరమైవిగా పరిగణిస్తారు. వాటిని అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కలత చెందడు. అతను కష్ట సమయాల్లోనూ ధైర్యాన్ని వీడడు.
కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి ఒక మార్గాన్ని కనుగొంటాడు. ఇతరులను విజయవంతం చేసేలా ప్రేరేపించేవాడే నిజమైన విజయుడని ఆచార్య చాణక్య తెలిపారు.

సంపదల దేవత లక్ష్మీదేవి కూడా అలాంటి వారికి ప్రసన్నురాలవుతుందని చాణక్య నీతి చెబుతోంది. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. తన లక్ష్యాన్ని కూడా సాధించలేడు.

ఇప్పుడు ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని అమూల్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. చాణక్య విధానం ప్రకారం ఒక వ్యక్తి ఇతరుల తప్పుల నుండి నేర్చుకుంటే, అతను ఎప్పుడూ ఓడిపోడు.

ఎవరిమీద వారు ప్రయోగాలు చేద్దామనుకుంటూ వయసు మీరిపోతుంది తప్ప ప్రయోజనం ఉండదు. మీరు విజయం సాధించాలనుకుంటే, ఇతరుల అనుభవాల నుంచి తెలుసుకోవడానికి వెనుకాడకూడదు.

మనతో సమానమైన స్థితి కలిగిన వారితోనే స్నేహం చేయాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మనకన్నా అధికులు లేదా అల్పులతో స్నేహం ఎక్కువ కాలం నిలవదని చాణక్య తెలిపారు.

పాము, మేక మరియు పులి ఒకదానితో ఒకటి ఎప్పటికీ స్నేహంగా ఉండలేవు. అదేవిధంగా, వ్యతిరేక స్వభావం గల వ్యక్తులతో ఎప్పుడూ స్నేహం చేయకూడదు.

జ్ఞానాన్ని అనేది అమృతాన్ని అందించే ఆ కామధేనువు లాంటిది. అందుకే జ్ఞానం ఎప్పుడు, ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లి స్వీకరించాలని చాణక్యుడు చెప్పాడు. జ్ఞానం ఎప్పుడూ వ్యర్థం కాదు. ‘స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అంటే రాజు అతని రాజ్యంలో మాత్రమే గౌరవం అందుకుంటాడు.

పండితులను, జ్ఞానవంతులను అన్నిచోట్లా గౌరవం అందుకుంటారు. జ్ఞానం అనేది సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి అక్కరకు వచ్చే శక్తి అని చాణక్య తెలిపారు.

మనిషి తన మతాన్ని ఎల్లప్పుడూ సంపద కంటే పైస్థాయిలో ఉంచాలని ఆచార్య చాణక్య తెలిపారు.

ఇలా చేస్తే ఆడపిల్లల చదువులు, పెళ్లికి రూ. 63 లక్షలకు పైగా పొందొచ్చు!

దేశవ్యాప్తంగా ఇప్పటికి ఆడపిల్లల చదువులు, వారి అభివృద్ధి పట్ల చిన్న చూపు ఉంది. అయితే దీన్ని రూపుమాపి ఆడపిల్లల అభివృద్ధికి సహాయంగా ఉండటానికి, వారి కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ పథకంలో చేరడం ద్వారా ఆడపిల్లల చదువులు, పెళ్లిలకు వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆర్థిక చింత లేకుండా ఉండవచ్చు.

టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో కూడా, కొన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎక్కువగా చేరడం లేదు. స్కీమ్‌ల గురించి సరైన అవగాహన లేకపోవడం వలన వారు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ముఖ్యంగా ఆడపిల్లల గురించి తీసుకొచ్చిన చిన్న మొత్తాల పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన గురించి కొంత మందికి సరైన అవగాహన లేకపోవడం వలన ఈ పథకంలో ఉండే ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.

సుకన్య సమృద్ధి యోజన పథకం పూర్తి వివరాలు ఒకసారి చూడండి..

* ఈ పథకాన్ని పోస్ట్‌ఆఫీస్ కార్యాలయాల్లో ఓపెన్ చేయవచ్చు.

* అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని పదేళ్ల వయసున్న ఆడపిల్లల తల్లిదండ్రులు అర్హులు.

* ఒక బాలికపై ఒక్క ఖాతా మాత్రమే తెరిచే అవకాశం ఉంది.

* రూ. 250 చెల్లించి ఖాతాను తీసుకోవాల్సి ఉంటుంది.

* ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు జమ చేయవచ్చు.

* ఖాతాను ప్రారంభించిన నాటి నుంచి కనీసం 14 ఏళ్లు, గరిష్ఠం 21 ఏళ్ల వరకు ఖాతా నిర్వహించవచ్చు.

* ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకానికి 7.6 శాతం వార్షిక వడ్డీ ఇస్తోంది. ఈ వడ్డీరేటును ప్రభుత్వం సవరిస్తూ ఉంటుంది.

ఉదాహరణ: ఈ పథకంలో ప్రతి ఏడాది రూ.10,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో మొత్తం రూ. 1,50,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ. 2,74,344 వడ్డీ కలిపి మొత్తం రూ. 4,24,344 లాభం వస్తుంది. అదే ఏడాదికి రూ. 1,00,000 జమ చేస్తే 15 ఏళ్లలో మొత్తం రూ. 15,00,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ. 27,43,436 వడ్డీ కలిపి మొత్తం రూ. 42,43,436 లాభం పొందవచ్చు. ఒక వేళ రూ. 1,50,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో మొత్తం రూ. 22,50,000 అవుతుంది. తరువాత మెచ్యూరిటీ సమయంలో రూ. 41 లక్షలకు పైగా వడ్డీతో కలిపి మొత్తం రూ. 63 లక్షలకు పైగా చేతికి వస్తాయి.

High BP – Low BP – హై బీపీ-లోబీపీ మధ్య వ్యత్యాసం..? ఇదే

ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. అటువంటి సమస్యలలో సర్వసాధారణమైనది హై బీపీ, లో బీపీ. శరీరంలోని రక్త ప్రసరణ హెచ్చుతగ్గులవుతుంది. దీని వల్ల శరీరంపైనా, ఆరోగ్యంపైనా అనేక దుష్ప్రభావాలుపడుతుంటాయి.

మన శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి గుండె పనిచేసినప్పుడు రక్తపోటు పరిస్థితి వస్తుంది, గుండె శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సాధారణ పద్ధతిలో పంప్ చేయగలిగినంత వరకు, దానిని సాధారణ రక్తపోటు అంటారు. రక్త ప్రసరణలో సమస్యలను రక్తపోటు(బ్లడ్ ప్రజర్) సమస్యలు అంటారు. రక్తపోటు వ్యాధి రెండు రకాలు – ఒకటి అధిక రక్తపోటు అంటే హై బీపీ, దీనినే హైపర్‌టెన్షన్ అనికూడా అంటారు.
రెండవది లో బీపీ తక్కువ రక్తపోటు. రక్తపోటు వ్యాధి లక్షణాలను తెలుసుకోవడం ద్వారా, మీరు రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించవచ్చు.

అధిక రక్తపోటు- ప్రభావాలు

అధిక రక్తపోటు లేదా రక్తపోటు అనేది ఒక తీవ్రమైన పరిస్థితి, దీనిలో మన గుండె శరీరంలో రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేదు. ఈ సమస్యను సకాలంలో అదుపు చేసుకోకపోతే గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు రీడింగ్‌లలో, సిస్టోలిక్ 130 నుంచి 139 mm Hg మధ్య ఉంటుంది. డయాస్టొలిక్ 80 నుంచి 90 mm Hg మధ్య ఉంటుంది.

తక్కువ రక్తపోటు (లోబీపీ) హైపోటెన్షన్ లేదా తక్కువ రక్తపోటు పరిస్థితిలో గుండె శరీరానికి సగటు ప్రమాణం కంటే తక్కువ రక్తాన్ని పంపుతుంది. ఈ వ్యాధిలో, రోగికి అనేక సమస్యలు ఉండవచ్చు. తక్కువ రక్తపోటు రీడింగ్‌లలో 90 mm Hg కంటే తక్కువ సిస్టోలిక్ 60 mm Hg కంటే తక్కువ డయాస్టొలిక్ ఉంటుంది. మనిషి సాధారణ బీపీ సిస్టోలిక్ – 120 mmHg, డయాస్టొలిక్ 80 mm Hg ఉంటుంది.

అధిక రక్తపోటు- లక్షణాలు..

అధిక రక్తపోటు సమస్యలో నిర్దిష్ట లక్షణాలు లేవు. ఈ కారణంగా అధిక బీపీని సులభంగా గుర్తించలేరు. హైబీపీతో బాధపడేవారికి మొదట్లో తరచూ తలనొప్పి వస్తుంటుంది. అధిక బీపీ సమస్య చల్లని వాతావరణంలో ఎక్కువగా పెరుగుతుంది. ఇది తలనొప్పి, భయము ,విపరీతమైన చెమటను కలిగిస్తుంది. అధిక రక్తపోటు పరిస్థితి సరైన రోగనిర్ధారణ పరిశోధన ద్వారా మాత్రమే తెలుస్తుంది.

తక్కువ రక్తపోటు(లోబీపీ) లక్షణాలు..

తక్కువ రక్తపోటు లక్షణాలు

విపరీతమైన అలసట
మైకము లేదా మూర్ఛ
చూపు మందగించడం
మనస్సు అస్థిరత
తేమతో కూడిన చర్మం.

అధిక రక్తపోటును నివారించే మార్గాలు..

హై బీపీ సమస్య రాకుండా ఉండాలంటే రెగ్యులర్ హెల్తీ అండ్ బ్యాలెన్స్ డ్ డైట్ తీసుకోవాలి.
ఆహారంలో ఉప్పును తగ్గించాలి. గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే ఏమైనా సందేహాలుంటే వైద్యనిపుణులను సంప్రదించండి.

కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు కూడా తినండి.
ఊబకాయం వల్ల అధిక బీపీ సమస్య వస్తుంది కాబట్టి బరువును అదుపులో ఉంచుకోండి.
మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

తక్కువ రక్తపోటును నివారించడానికి చిట్కాలు
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి.
మద్యం, ధూమపానం తీసుకోవడం మానుకోండి.
తక్కువ కార్బోహైడ్రేట్లను తీసుకోండి.కడుపు నిండా తినకండి.
రోజులో కొంచెం కొంచెంగా తింటూ ఉండండి.

NTPC Jobs నెలకు రూ.55,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి?

NTPC Jobs:  central government jobs with salary of Rs.55,000 per month..

ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన కాంపిటీషన్ ఉంది. గవర్నమెంట్ జాబ్స్ వందల్లో ఉంటే పోటీ పడే వారి సంఖ్య మాత్రం లక్షల్లో ఉంటుంది. అయినప్పటికీ సరైన ప్రణాళిక..
అంకితభావం ఉన్నట్లైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఏకంగా రూ. 55 వేల జీతాన్ని పొందొచ్చు. మరి ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ వపర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) లిమిటెడ్, ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 223 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఎన్టీపీసీ అధికారిక వెబ్ సైట్ ను  https://www.ntpc.co.in/  పరిశీలించాల్సి ఉంటుంది.

 

Indian Army: బీటెక్, డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో 381 ఉద్యోగాలు – దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

Indian Army SSC Technical and Non Technical Recruitment: ఇండియన్ ఆర్మీలో 63వ, 34వ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) టెక్నికల్, నాన్-టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.
దీనిద్వారా మొత్తం 381 ఖాళీలను భర్తీచేయనున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. టెక్నికల్ కోర్సులకు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్; నాన్-టెక్నికల్ కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ కోర్సు అక్టోబర్ 2024లో ప్రీ- కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీలో ప్రారంభం కానుంది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు జనవరి 23న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండు దశల రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వివరాలు..
* మొత్తం ఖాళీల సంఖ్య: 381.

➥ 63వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) పురుషులు: 350 పోస్టులు

ఇంజినీరింగ్ స్ట్రీమ్:సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్.

➥ 34వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మహిళలు: 29 పోస్టులు

ఇంజినీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్.

➥ ఎస్ఎస్సీ డబ్ల్యూ (టెక్నికల్): 1 పోస్టు

➥ ఎస్ఎస్సీ డబ్ల్యూ (నాన్-టెక్నికల్): 1 పోస్టు
➥ ఎస్ఎస్సీ డబ్ల్యూ (నాన్-టెక్నికల్): 1 పోస్టు

అర్హత:టెక్నికల్ విభాగాలకు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్; నాన్-టెక్నికల్ విభాగాలకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:01.10.2024 నాటికి 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పే స్కేల్:రూ.56,100- రూ.1,77,500.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.01.2024.

➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.02.2024.

➥ కోర్సు ప్రారంభం: అక్టోబర్ 2024.

Notification

Website

Fancy Number: ఫ్యాన్సీ మొబైల్ నెంబర్‌ కావాలా..? రూపాయి ఖర్చు లేకుండా, ఇంట్లోనే కూర్చొని పొందండిలా..!

ప్రస్తుత సమాజంలో చాలా మంది సామాన్యులు కూడా వీఐపీలా లేదా ప్రత్యేకమైన వ్యక్తిలా గుర్తింపు పొందేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఖరీదైన దుస్తులు, వాచీలు వంటి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు.
మరికొందరు తమ ప్రవర్తనతో ఆ హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. ఇంకొందరు అయితే ఫ్యాన్సీ మొబైల్ నంబర్ల ద్వారా వీఐపీగా గుర్తింపు పొందుతారు. అయితే ఇలాంటి వారి కోసమే వోడాఫోన్ ఐడియా ఒక శుభవార్త చెప్పింది. ఎటువంటి ఖర్చులేకుండా కూడా ఫ్యాన్సీ ఫోన్ నంబర్ సులువుగా దొరుకుతుంది. గతంలో అయితే ఈ ఫ్యాన్సీ లేదా వీఐపీ నంబర్ల కోసం వేలంపాటలు జరిగేవి కానీ ఇప్పుడు అలా ఏమిలేదు. ఈ క్రమంలోనే వోడాఫోన్ ఐడియా (VI) తన వినియోగదారుల కోసం VIP నంబర్లని అందిస్తుంది.

అయితే ఇందుకోసం మీరు కొన్ని ప్రాథమిక ప్రక్రియలను తెలుసుకోవాలి. ఇది తెలిసిన వారికి ఫ్యాన్సీ సిమ్ నంబర్ ఉచితంగా లభిస్తుంది. కోరుకున్న ఫోన్ నంబర్‌ను పొందడానికి వేల రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ముందుగా వోడాఫోన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. కొత్త కనెక్షన్, ఆపై ఫ్యాన్సీ మొబైల్ నంబర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు మీ పిన్ కోడ్, మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత ఉచిత ప్రీమియం మొబైల్ నంబర్‌ల జాబితా నుంచి ఒక నంబర్‌ను ఎంచుకోవాలి. ఈ ప్రక్రియ తర్వాత మొబైల్‌ నెంబర్‌కి OTP వస్తుంది. అంతే కొత్త కనెక్షన్‌తో VIP నంబర్‌ వస్తుంది. ప్రస్తుతం వోడాఫోన్-ఐడియా ఈ అవకాశాన్ని అందిస్తోంది. ఈ విధంగా వోడాఫోన్ ఐడియా సంస్థ తన కస్టమర్లకు ఉచితంగా వీఐపీ నంబర్లను అందజేస్తోంది. దీని కోసం మీ నుంచి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయదు. మీరు ఇలా ఇంటి నుంచే ఫ్యాన్సీ మొబైల్ నంబర్‌ను కూడా పొందవచ్చు.

Vastu tips : ఇంట్లో ఈ పూల మొక్క ఉంటే ఆర్థిక సంక్షోభం ఉండదు..అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది

Vastu tips for happiness : మందార మొక్కను(Hibiscus plant) ఇంట్లో నాటడం ద్వారా, జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుందని మరియు వ్యక్తి యొక్క అదృష్టం మారుతుందని నమ్ముతారు.

ఇంట్లో సరైన దిశలో ఉంచినట్లయితే, ఇంట్లో సానుకూలత వస్తుంది. ఈ మొక్కలను నాటడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుంది. దీని కారణంగా వ్యక్తి ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎరుపు, గులాబీ రంగుల్లో ఉండే ఈ పువ్వు చాలా రకాలుగా ప్రత్యేకం. మందార పువ్వును ఇంట్లో నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను ఢిల్లీ నివాసి జ్యోతిష్యుడు ఆచార్య పండిట్ అలోక్ పాండ్యా చెబుతున్నారు.

1. ఒక వ్యక్తి జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే, అతను తప్పనిసరిగా తన ఇంట్లో మందార మొక్కను నాటాలి. ఇంట్లో మందార మొక్కను నాటేటప్పుడు దిశను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇంటికి తూర్పు వైపున ఉంచడం వల్ల సూర్యుని స్థానం బలపడుతుంది.

2. మందార మొక్కను ఇంట్లో నాటడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది మరియు ఇంట్లో ఆర్థిక సమస్యలు రావు. ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం మెరుగై గౌరవం పెరుగుతుంది.

3. ఇంట్లో మందార మొక్కను నాటడం ద్వారా మంగళ దోషం ముగుస్తుంది. మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నట్లయితే లేదా వివాహంలో జాప్యం ఉన్నట్లయితే ఇంట్లో మందార మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

4. వాస్తు శాస్త్రం ప్రకారం, మందార మొక్క మరియు మందార పువ్వు తల్లి లక్ష్మికి చాలా ప్రీతికరమైనవి. మందార పువ్వును లక్ష్మి తల్లికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఇంటి ఆర్థిక సమస్యలు తీరి, సంపదలు మిగులుతాయి.

5. మందార మొక్క నాటిన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎప్పుడూ ఉండదని వాస్తు శాస్త్రం చెబుతోంది. పాజిటివ్ ఎనర్జీ యొక్క కమ్యూనికేషన్ ఎల్లప్పుడూ ఉంటుంది.

6. మీరు మీ వ్యాపారంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే లేదా అకస్మాత్తుగా మీ పని చెడిపోయినట్లయితే సూర్యభగవానునికి నీరు సమర్పించే సమయంలో మందార పువ్వును నీటిలో వేసి ఆయనకు సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ వ్యాపారంలో వచ్చే సమస్యలు తీరుతాయి.

Swapna Shastra: కలలో ఈ 5 విషయాలను చూడటం చాలా శుభప్రదం.. ఆ కలలు, వాటి అర్థం ఏమిటంటే?

ప్రతి ఒక్కరూ కలలు కంటారు. రాత్రి నిద్రలో ఒక వ్యక్తి వివిధ రకాల కలలను చూస్తాడు. వాటిలో కొన్ని శుభ, అశుభకరమైన కలలుగా పరిగణించబడతాయి. ఈ కలలు మనిషి జీవితంలో తీవ్ర ప్రభావం చూపుతాయి.
స్వప్న శాస్త్రంలో కలల గురించి వివరంగా వివరించబడ్డాయి. కలలో కనిపించే విషయాలు నిజ జీవితంలో వేరే అర్థాన్ని కలిగి ఉంటాయి. కలలు ఒక వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనల గురించి వివిధ సూచనలను ఇస్తాయి.

కలలలో.. కొన్ని కలలు చాలా భయానకంగా ఉంటాయి. కొన్ని కలలు వ్యక్తికి నచ్చుతాయి. ఈ రోజు స్వప్న శాస్త్రంలో పేర్కొన్న శుభ కల గురించి తెలుసుకుందాం. కొన్ని కలలో కొన్ని రూపాలు జీవితంలో కొన్ని శుభ సంఘటనలు జరగబోతున్నాయని సూచన అని అంటున్నారు.

మరణించినట్లు కల
భయంకరమైన కలల్లో మరణం కల ఒకటి. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో ఎవరి మరణాన్ని చూసినా శుభప్రదంగా భావిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో మరణాన్ని చూసేవారికి.. త్వరలో ఆకస్మిక డబ్బు వస్తుంది. రానున్న రోజుల్లో వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కలలో పండ్లు, పువ్వులు ఉన్న చెట్లను చూడటం
చాలా సార్లు చాలా పండ్లు, పువ్వులతో నిండిన చెట్లు కలలలో కనిపిస్తాయి. అలాంటి కల ఒక శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. అటువంటి కల కనిపించడం రాబోయే రోజుల్లో కొన్ని శుభవార్తలను సూచిస్తుంది. అలాంటి కలలను చూడటం అంటే ఒక వ్యక్తి ప్రతి కోరిక త్వరలో నెరవేరుతుందని అర్థం. ఒక వ్యక్తి చాలా డబ్బును ఆర్జిస్తాడని స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు.

పర్వతారోహణ కల
చాలా మంది వ్యక్తులు తమ కలలో పర్వతాలను అధిరోహించడం లేదా పర్వతాలు అధిరోహించినట్లు కలలు కంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఇటువంటి కలలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఇలాంటి కలకు అర్థం ఒక వ్యక్తి జీవితంలో పురోగతికి కొత్త మార్గాలు తెరవబోతున్నాయని అర్ధం. ఉద్యోగంలో ఉన్న వారికి పురోభివృద్ధి.. మంచి జీతం వచ్చే సూచనలు, వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయని అర్ధం.

కలలో గుడ్లగూబను చూడటం
గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో.. మీరు మీ కలలో గుడ్లగూబ చూసినట్లయితే.. త్వరలో మీరు లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారని అర్థం చేసుకోండి. మీరు జీవితంలో సంపద, ఆనందం, శ్రేయస్సు పొందబోతున్నారని అర్ధం.

వర్షం గురించి కలలు
కలలో వర్షాన్ని చూడటం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. మీ జీవితంలో అన్ని రకాల సంతోషాలు వస్తాయి అని అర్థం. మీరు సంపదకు లోటుగా భావించరు. మీ ప్రణాళికలు ఏవైనా మీకు గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

CC Camera మీ ఇంటికి సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా..? ఇప్పుడు మీ భద్రత కోసమే బల్బ్‌ కెమెరాలు వచ్చాయ్….

ఇళ్ళు, ఇంట్లో మీ ప్రియమైన వారి భద్రత గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? అయితే, మీ ఆందోళనలకు పరిష్కారం దొరికింది. ఇది మిమ్మల్నీ టెన్షన్‌ ఫ్రీగా మార్చేస్తుంది.
సీసీ కెమెరాల స్థానంలో బల్బ్ కెమెరాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి మీ కుటుంబానికి కాంతితో పాటుగా భద్రతను కూడా అందిస్తాయి. సాధ్యం కానిది ఏదీ లేదని భావించే ఈ టెక్నాలజీ యుగంలో బల్బ్ కెమెరాలు అత్యధిక సంభావ్యతను అందిస్తాయి. పగలు, రాత్రి ఏ టైమ్‌లో అయిన సరే.. అధిక-నాణ్యతతో కూడిన ఫోటోలను క్యాప్చర్ చేయగలవు. ఈ కెమెరాలు సాధారణంగా 360-డిగ్రీల వీక్షణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. తద్వారా మీరు మొత్తం విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. ఇళ్లు, ఆఫీసు, అంతర్గత ప్రదేశాలలో ఉపయోగించటానికి ఈ బల్బ్ కెమెరాలు చాలా సహాయకారిగా ఉంటాయి. మీరు మీ ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో గమనించడానికి ఈ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది మీ ప్రియమైన వ్యక్తులు, పెంపుడు జంతువుల శ్రేయస్సును పర్యవేక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు మీ స్మార్ట్‌ఫోన్ లేదా ఏదైనా ఇతర అనుకూల పరికరం ద్వారా ఈ బల్బ్‌ కెమెరాను కంట్రోల్‌ చేస్తూ పూర్తి విజులవ్స్‌ చూడొచ్చు.amazonలో అందుబాటులో ఉన్న బల్బ్ కెమెరాల జాబితాను ఇక్కడ చూద్దాం. మీరు మీకు ఇష్టమైనదాన్ని ఎంచుకోవచ్చు!

1. సోనాటా గోల్డ్ 360 డిగ్రీ వైర్‌లెస్ పనోరమిక్ బల్బ్ లైట్ 360° IP కెమెరా విత్ నైట్ విజన్

ఈ స్పై బల్బ్ కెమెరా కనెక్ట్ చేయబడిన పరికరం ద్వారా నేరుగా 1080p అధిక-నాణ్యత వీడియోలు, చిత్రాలను అందిస్తుంది. తక్కువ కాంతికి సంబంధించిన లక్షణాలలో, ఇన్‌ఫ్రారెడ్ LED పదునైన ఇమేజ్‌ని అందిస్తుంది. దీని 130-డిగ్రీల వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్ అదనపు ప్రాంతాన్ని సంగ్రహిస్తుంది. ఇది రెండు-మార్గం కమ్యూనికేషన్ కోసం స్పీకర్‌తో అంతర్నిర్మిత మైక్రోఫోన్‌ను కలిగి ఉంది. కెమెరా 64GB నిల్వతో మైక్రో SD మెమరీ కార్డ్‌కు మద్దతు ఇస్తుంది. 7 రోజుల వరకు నిరంతరంగా వీడియోలను రికార్డ్ చేయగలదు. మీరు కేవలం స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కడి నుండైనా కెమెరా సెట్టింగ్‌లను నియంత్రించవచ్చు.
స్పెసిఫికేషన్లు

బ్రాండ్: సోనాటా గోల్డ్

మోడల్ పేరు: SONATA GOLD 360 డిగ్రీ

కనెక్టివిటీ టెక్నాలజీ: వైర్‌లెస్

ఉత్పత్తి కొలతలు: ‎10 x 5 x 10 సెం.మీ

ప్రోస్

ప్రతికూలతలు

ఈ బల్బ్ కెమెరా వాటర్ ప్రూఫ్.

ఇది అంతర్నిర్మిత మైక్రోఫోన్ మరియు స్పీకర్‌ను కలిగి ఉంది.

2. TECHNOVIEW లైట్ బల్బ్ సెక్యూరిటీ కెమెరా
ఈ స్పై కెమెరా బల్బ్‌ను ఇన్‌స్టాల్ చేయడం చాలా సులభం. ఇది మీ కుటుంబాన్ని సురక్షితంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. మీరు మొబైల్ అప్లికేషన్ ద్వారా కెమెరాను ఎప్పుడైనా, ఎక్కడైనా 360 డిగ్రీలు తిప్పవచ్చు. విజువల్ బ్లైండ్ స్పాట్‌లు ఏ మాత్రం ఉండవు. దీంతో మీరు రిలాక్స్‌గా ఉండొచ్చు. కెమెరాకు అవతలి వైపు ఉన్న వ్యక్తితో మీరు ఎల్లప్పుడూ స్పష్టమైన సంభాషణను కలిగి ఉండవచ్చు. రాత్రిపూట కూడా, దాని పరారుణ, తెలుపు కాంతి కారణంగా మీరు పగటిపూట స్పష్టంగా చూడగలరు. ఈ E27 కెమెరాను ఇన్‌స్టాల్ చేయడం, సెటప్ చేయడం చాలా సులభం.

స్పెసిఫికేషన్లు

బ్రాండ్: TECHNOVIEW

మోడల్ పేరు: TV-e27-BH

కనెక్టర్ రకం: వైర్‌లెస్

ఉత్పత్తి కొలతలు: 12 x 6 x 8 సెం.మీ

ప్రోస్

ప్రతికూలతలు

ఇది సులభమైన నియంత్రణలను కలిగి ఉంది.

ఇది ఇన్స్టాల్ సులభం.

3. SONATA GOLDWi-Fi ఫుల్ అల్ట్రా HD CCTV వైర్‌లెస్ బల్బ్ షేప్ కెమెరా 1080p

ఈ స్పై బల్బ్ కెమెరా అధునాతన 90-డిగ్రీల వైడ్ యాంగిల్ గ్లాస్ లెన్స్‌తో 1080p HD నాణ్యతను అందిస్తుంది. దాని 360-డిగ్రీ వీక్షణకు ధన్యవాదాలు, ఇది విస్తృత శ్రేణి ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఇది చలన గుర్తింపు లక్షణాన్ని కలిగి ఉంది, దీనిలో వారు ఏదైనా కదలికలకు సంబంధించిన స్పష్టం చూపుతుంది.వెంటనే మిమల్ని అలర్ట్‌ చేస్తుంది కూడా. ఇది ఏదైనా అవసరమైన, ముఖ్యమైన వీడియోలను సేవ్‌ చేసేందుకు వీలుగా కావాల్సినంత మెమరీ కూడా ఉంది. ఇది ఒకేసారి బహుళ పరికరాలకు కనెక్ట్ చేసుకునే వీలు కూడా ఉంది.

స్పెసిఫికేషన్లు

బ్రాండ్: సోనాటా గోల్డ్

మోడల్ పేరు: SONATA GOLDWi Fi

కనెక్టివిటీ టెక్నాలజీ: వైర్‌లెస్

ఉత్పత్తి కొలతలు: 10 x 5 x 10 సెం.మీ

ప్రోస్

ప్రతికూలతలు
ఈ కెమెరా ఆండ్రాయిడ్‌తో పాటు ioSని కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇది చలన గుర్తింపును అందిస్తుంది.

4. CuTech Wi-Fi ఫుల్ అల్ట్రా HD CCTV వైర్‌లెస్ బల్బ్ షేప్ కెమెరా 1080p

ఈ స్పై బల్బ్ కెమెరా 360-డిగ్రీ వీక్షణ కోణంతో 1080p HD నాణ్యతను అందిస్తుంది. ఇది రాత్రి టైమ్‌లో కూడా కదలికలను గుర్తిస్తుంది. ఇది కదలికను గ్రహించిన తర్వాత, ఈ కెమెరా మీ స్మార్ట్‌ఫోన్‌కు అసలు విజువల్స్‌తో హెచ్చరిక సిగ్నల్‌ను పంపుతుంది. మీకు కావలసినప్పుడు ఈ నిఘా బల్బ్ కెమెరా వీక్షణతో మీరు కనెక్ట్ చేయవచ్చు.. ఇది ఏదైనా iOS, Android లేదా ఇతర పరికరాలకు కనెక్ట్ చేయబడుతుంది. ఇందులో కూడా మెమరీ స్పెస్‌ కావాల్సినంత ఉంది. 128GB మైక్రో TF కార్డ్‌ను వేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది బహుళ రికార్డింగ్ పరికరాలను, ఎక్కువ మంది ఒకేటైమ్‌లో ఈ బల్బ్‌ని వినియోగించుకునేలా ప్రదర్శిండానికి అనుమతిస్తుంది.

స్పెసిఫికేషన్లు

బ్రాండ్: CuTech

మోడల్ పేరు: CuTech Wi-Fi

కనెక్టివిటీ టెక్నాలజీ: వైర్‌లెస్

ఉత్పత్తి కొలతలు: 10 x 10 x 10 సెం.మీ

ప్రోస్

ప్రతికూలతలు

ఇది 128GB మైక్రో TF కార్డ్ వినియోగానికి మద్దతు ఇస్తుంది.
ఇది స్థానిక రికార్డింగ్ కోసం ఉపయోగించబడుతుంది.

5. SONATA GOLD 1080P HD WiFi బల్బ్ లైట్ వైర్‌లెస్ IP WiFi కెమెరా

ఈ స్పై కెమెరా బల్బ్ యొక్క E27 బల్బ్ సాకెట్ అనుకూలత ఇన్‌స్టాలేషన్‌ను చాలా సులభం చేస్తుంది. ఇది ఆటో-ట్రాకింగ్ ఫీచర్‌ని కలిగి ఉంది. ఇది అక్కడి వారి ముఖాన్ని కూడా గుర్తించగలదు. నిర్దిష్ట వ్యక్తిని ట్రాక్ చేయడానికి అటోమెటిక్‌గా పనిచేస్తుంది. కావాల్సిన యాంగిల్‌లో జూమ్‌ చేసుకుంటుంది. వాయిస్ అలర్ట్ సిస్టమ్ ఏవైనా బెదిరింపులు గుర్తించబడితే వెంటనే మీకు తెలియజేస్తుంది. ఇది అంతర్నిర్మిత మైక్రోఫోన్, స్పీకర్‌ను అందిస్తుంది. తద్వారా మీరు అవతలి వైపు ఉన్న వ్యక్తితో పరస్పర చర్య చేయవచ్చు. మీరు సౌండ్ అలారం సృష్టించడం ద్వారా దొంగలు, మీ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులను కూడా హెచ్చరించవచ్చు.

స్పెసిఫికేషన్లు
బ్రాండ్: సోనాటా గోల్డ్

మోడల్ పేరు: SONATA GOLD 1080P

కనెక్టివిటీ టెక్నాలజీ: వైర్‌లెస్

ఉత్పత్తి కొలతలు: 10 x 5 x 10 సెం.మీ

ప్రోస్

ప్రతికూలతలు

ఇది హై-డెఫినిషన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది.

అప్లికేషన్ అనేక ప్రకటనలను చూపుతుంది.

ఈ బల్బ్ కెమెరాను సెటప్ చేయడం సులభం.

6. IFITech బల్బ్ ఆకారం ఇండోర్ HD 3MP CCTV వైఫై కెమెరా
ఈ స్పై బల్బ్ కెమెరాలో అంతర్నిర్మిత బ్యాటరీ లేనందున ఎల్లప్పుడూ విద్యుత్ సరఫరా అవసరం. ఇది 100-బ్రైట్‌నెస్ అంతర్నిర్మిత LED ఫోకస్ లైట్‌ని కలిగి ఉంది. ఇది మీ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మెమరీ సామర్థ్యం కూడా ఎక్కువగానే ఉంది. 256 GB వరకు SD కార్డ్‌ వేసుకునే వీలుంది. ఇది మోషన్ డిటెక్షన్ అలర్ట్‌లు, టూ-వే కమ్యూనికేషన్, కలర్ నైట్ విజన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది 110° వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది, ఇది మీకు 360-డిగ్రీల వీక్షణ కవరేజీని అందిస్తుంది.

స్పెసిఫికేషన్లు

బ్రాండ్: IFITech

మోడల్ పేరు: IFITech బల్బ్

కనెక్టివిటీ టెక్నాలజీ: వైర్‌లెస్

ఉత్పత్తి కొలతలు: 14 x 6.5 x 6.5 సెం.మీ
ప్రోస్

ప్రతికూలతలు

ఇది మీకు 1-సంవత్సరం వారంటీని అందిస్తుంది.

కనెక్టివిటీ అంత బాగా లేదు.

దీనికి అనేక పరికరాలను కనెక్ట్ చేయవచ్చు.

Numerology : సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ నంబర్ ఎంత? ఇలా తెలుసుకోండి…

Numerology : పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది.
ఆ సంఖ్య ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. కొన్ని అంకెలు ఇతర అంకెలతో కలిసినప్పుడు అనుకూల ఫలితాలు ఇస్తాయి. మరికొన్ని నంబర్ల కలయిక సరిగా కుదరదు. ఇలాంటి అనుకూల, ప్రతికూలతలను పట్టించుకోకపోతే చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి మీ నంబర్ ఎంతో ఇలా తెలుసుకోండి.

సంఖ్యాశాస్త్రాన్ని నమ్మేవారైనా, నమ్మనివారైనా… అసలు తమ సంఖ్య (అంకె) ఎంత అనేది తెలుసుకోవాలి అనుకుంటారు. అందుకు న్యూమరాలజీ నిపుణులు చిన్న ఫార్ములాను అమలుచేస్తారు. అది మనం కూడా వేసుకోవచ్చు. ఎవరికైనా వారి సంఖ్య తెలుసుకోవాలంటే కచ్చితంగా వారి పుట్టిన తేదీ తెలిసితీరాలి. అంటే రోజు, నెల, సంవత్సరం తెలిసి ఉండాలి. వాటి ఆధారంగా సంఖ్యను తెలుసుకుంటారు.

ఉదాహరణకు ఓ వ్యక్తి జులై 8, 1991లో పుట్టారని అనుకుంటే.. వారి పుట్టిన తేదీ 7-8-1991గా ఉంటుంది. ఈ తేదీని కలపడం ద్వారా సంఖ్య వస్తుంది. అంటే.. 7 + 8 + 1 + 9 + 9 + 1…. వీటిని కలిపితే.. 35 వస్తుంది.

ఇక్కడ 35 అనేది వారి అంకే కాదు… దాన్ని సింగిల్ డిజిట్‌కి తేవాల్సి ఉంటుంది. అంటే… 35ని కూడా 3 + 5 గా కలపాల్సి ఉంటుంది. ఆ ప్రకారం వారి సంఖ్య 8 అవుతుంది. ఇలా ప్రతి ఒక్కరికీ 1 నుంచి 9 లో ఏదో ఒక అంకె కచ్చితంగా ఉంటుంది. ఆ అంకె ఆధారంగా న్యూమరాలజిస్టులు వారి జాతకాన్ని చెబుతారు.

కొంతమంది న్యూమరాలజిస్టులు ఈ మధ్య మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. ఇందుకోసం వారు వ్యక్తుల పేర్లను కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. ఆ పేర్లలోని ఇంగ్లీష్ లెటర్స్‌కి నంబర్లు కేటాయించి… వాటిని కలుపుతూ.. సింగిల్ డిజిట్ వచ్చేలా చేస్తున్నారు. కానీ ఇందులో ఇంటి పేరు కలపాలా వద్దా అనేది సమస్య అవుతోంది. అందువల్ల పేర్లను కలిపి తెలిపే న్యూమరాలజీకి అంతగా గుర్తింపు లేదు. పుట్టిన తేదీయే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. అందువల్ల న్యూమరాలజీపై ఆసక్తి ఉన్న వారు.. తమ అంకెను… పుట్టిన తేదీ ద్వారా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని నిర్ధారించట్లేదని గమనించగలరు.

స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ పెంచే ట్రిక్స్ ఇవే..

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్( Smart Phone ) ఉపయోగించని వారు చాలా అరుదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే దాదాపుగా అన్ని పనులు అయిపోతాయి. ఇక స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ కాస్త స్లో అయ్యిందంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది.
అయితే కొందరేమో నెట్వర్క్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని అనుకుంటారు. నిజానికి ఇంటర్నెట్ స్పీడ్( Internet Speed ) తగ్గడానికి స్మార్ట్ ఫోన్ కూడా కొన్నిసార్లు కారణం అవుతుంది. మరి స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే ఏ ట్రిక్స్ ఫాలో అవాలో చూద్దాం.

స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గితే వెంటనే ఫోన్ ను ఒకసారి రీస్టార్ట్ చేస్తే ఇంటర్నెట్ వేగం పెరిగే అవకాశం ఉంది. ఫోన్ ను రీస్టార్ట్ చేస్తే ఫోన్లో ఉండే అన్ని ప్రోగ్రామ్ లు రిఫ్రెష్ అవుతాయి.

స్మార్ట్ ఫోన్ ను కొన్ని సెకండ్ల పాటు ఎయిర్ ప్లేన్ మోడ్ లో( Airplane Mode ) ఉంచితే నెట్వర్క్ కనెక్షన్ రీసెట్ అవుతుంది. దీంతో ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది.స్మార్ట్ ఫోన్ లో సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయకపోవడం వల్ల కూడా ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబడిందో లేదో చెక్ చేయాలి. లేదంటే నెట్వర్క్ సెట్టింగ్ లను ఒకసారి రీసెట్ చేయాలి.

ఇలా చేస్తే ఇంటర్నెట్ వేగం పెరిగే అవకాశం ఉంది.ఫోన్లో ఉండే యాప్ అప్డేట్ల కారణంగా ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంది. యాప్ లు బ్యాక్ గ్రౌండ్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూ ఉంటాయి. అలా అప్డేట్ అవడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గే అవకాశం ఉంది. పైన తెలిపిన ట్రిక్స్ ద్వారా ఇంటర్నెట్ వేగాన్ని సులభంగా పెంచుకోవచ్చు.

YCP MP అభ్యర్థిగా సినీ నటుడు సుమన్ !

టాలీవుడ్‌ సినీ నటుడు సుమన్ కు బంపర్‌ ఆఫర్‌ తగిలింది. రాజమండ్రి YCP MP అభ్యర్థిగా సినీ నటుడు సుమన్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే YCP అగ్రనేతలు ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక్కడ MPగా పోటీచేసిన మార్గాని భరత్ రానున్న ఎన్నికల్లో MLAగా పోటీచేస్తున్నారు.
గౌడ సామాజికవర్గానికి చెందిన సుమన్ MPగా పోటీ చేస్తే BC ఓట్లు గంపగుత్తగా పడే ఛాన్స్ ఉంటుందని YCP భావన. పైగా 25 ఏళ్లుగా ‘స్వర్ణాంధ్ర’ పేరిట సుమన్ ఇక్కడ సామాజిక సేవ చేస్తున్నారు. ఇక అటు ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆమె పేరును రేపు లేదా ఎల్లుండి ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి జిల్లా నేతలకు సమాచారం ఇచ్చినట్లు టాక్. ఇంతకుముందు ఒంగోలు ఎంపీ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును పార్టీ ప్రతిపాదించింది. కానీ మాజీ మంత్రి బాలినేని సహా జిల్లాలోని నాయకులంతా చెవిరెడ్డిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

రేషన్ కార్డు దారులకు షాక్.. ఇలా చేయకుంటే.. 4 రోజుల్లో రేషన్ కట్!

రేషన్‌ కార్డు దారులకు బిగ్‌ అలర్ట్‌. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు గడువు సమీపిస్తోంది. ఈ నెల 31 వరకు కేవైసీ చేసుకునేందుకు అవకాశం ఉంది.
రేషన్ కార్డులో పేరు ఉన్నవారు దగ్గర్లోని ఏదైనా రేషన్ దుకాణానికి వెళ్లి ఆధార్ నంబర్ చెప్పి, వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది.
జనవరి 31 లోగా కేవైసీ పూర్తి చేసుకొని వారికి రేషన్ కట్ అవుతుందని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఇక అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందుతుంది. గ్రామపంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీన సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

గోవింద కోటి రాస్తే బ్రేక్‌ దర్శనం

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవారి దర్శనంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్లలోపు యువత ‘గోవింద కోటి’ అని పది లక్షల 116 సార్లు రాస్తే శ్రీవారి బ్రేక్‌దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
యువతలో తిరుమల శ్రీవారిపై భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన వెల్లడించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో, సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,664 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Health

సినిమా