Friday, November 15, 2024

Credit Card: రూపాయి లేకుండా క్రెడిట్ కార్డు బిల్‌ పే కట్టొచ్చు.. ఎలాగో తెలుసుకోండి?

ఈ రోజుల్లో ప్రజలు క్రెడిట్ కార్డుల(Credit Cards)ను విపరీతంగా వాడేస్తున్నారు. బిల్‌ పేమెంట్స్, షాపింగ్, రీఛార్జ్, సబ్‌స్క్రిప్షన్‌ల వంటి వివిధ చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్‌లపైనే ఆధారపడుతున్నారు.
క్రెడిట్ కార్డులు నిర్దిష్ట కాలానికి వడ్డీ లేకుండా లిమిటెడ్ అమౌంట్‌ను అందిస్తాయి. ఇంటరెస్ట్-ఫ్రీ (Interest-free) ఫెసిలిటీతో పాటు క్యాష్ బ్యాక్ రివార్డ్‌లు, డబ్బు ఆదా చేయడంలో సహాయపడే డిస్కౌంట్ ఆఫర్లను సైతం క్రెడిట్ కార్డ్స్ అందిస్తాయి. వీటికి చాలా మంది ఆకర్షితులవుతూ ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను తీసుకుంటారు.

సరిగ్గా ఉపయోగించినప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డులు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ ఎక్కువ క్రెడిట్ కార్డులను తీసుకొని బిల్లులను సకాలంలో చెల్లించకపోతే, పరిస్థితి దారుణంగా మారుతుంది. భారీగా వడ్డీలను చెల్లించాల్సి వస్తుంది. సాధారణంగా క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు తీసుకోవడం, వాటిని ఇతర బిల్లులకు చెల్లించడం చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నెలా సంపాదనలో చాలా వరకు ఈ బిల్లు కట్టడానికే ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు, గడువు తేదీకి ముందు చెల్లింపు చేయడానికి తగినంత క్యాష్ పొందడం కష్టంగా మారవచ్చు. అయితే సొంత డబ్బును ఉపయోగించకుండా, చేతి నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టకుండానే క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించడానికి ప్రత్యామ్నాయ పరిష్కారం ఉంది.

ఒక క్రెడిట్ కార్డు నుంచి మరో దానికి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్

సంపాదించిన డబ్బును ఉపయోగించకుండా క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించడానికి ఒక మార్గం ఉంది. అదే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్. ఒక క్రెడిట్ కార్డు నుంచి మరో దానికి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండాలి. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనేది డబ్బులు ఉన్న ఒక క్రెడిట్ కార్డ్ నుంచి బకాయి ఉన్న మరొకదానికి బ్యాలెన్స్‌ని బదిలీ చేయడం. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, ఒక క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి మరొక క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించడం. ఈ పద్ధతిలో వడ్డీ భారం పడకుండా, అలాగే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టకుండా జాగ్రత్త పడవచ్చు.

ఈ పద్ధతిలో రిస్క్‌లు ఏంటి
క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించడానికి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలని నిర్ణయించినప్పుడు, కొన్ని అంశాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మొదటిగా, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ అనేది సాధారణ లావాదేవీలతో పోలిస్తే తరచుగా అధిక వడ్డీ రేటును కలిగి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజుల వంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు కూడా ఉండవచ్చు. అందువల్ల, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ ఎంచుకునే ముందు అన్ని సంబంధిత ఖర్చులను అర్థం చేసుకోవడం చాలా కీలకం. అయితే, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ప్రస్తుత క్రెడిట్ కార్డ్‌పై బిల్లును గడువు తేదీలోపు ఎలాంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు లేదా వడ్డీ రేట్లు లేకుండా బయటపడవచ్చు.

మీ అరచేతిలో ఇలాంటి గుర్తు ఉందా..? ఒక్కసారి పరిశీలించుకోండి ఉంటే తీరుగుండదు..!!

ప్రపంచాన్ని చాలామంది జయించిన వారిలో కనబడ్డ కొన్ని లక్షణాలలో కామన్ గా ఒకదాన్ని జ్యోతిష్య శాస్త్రం గుర్తించటం జరిగింది. మామూలుగానే భారతదేశంలో జ్యోతిష్య శాస్త్రానికి చాలామంది సెలబ్రిటీలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.
సెలబ్రిటీలు మాత్రమే కాదు సామాన్యులు కూడా జ్యోతిష్యానికి ఎక్కువ పెద్దపీట వేస్తారు. అందులోనూ హస్త సాముద్రికముకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అరచేతిలో ఉండే రేఖల ఆధారంగా తమ భవిష్యత్తును రాబోయే గండాలను ప్రమాదాలను కూడా అంచనా వేస్తారు.

ఈ హస్త సాముద్రికను విశ్వసించే వారిలో చాలామంది ఉంటారు. అయితే వారిలో ఎక్కువగా సామాన్యులు కూడా ఉంటారు. ఈ క్రమంలో ప్రపంచాన్ని జయించిన చాలామంది ప్రముఖులలో వారి అరచేతులలో ఈ హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక గుర్తు కనిపించడం జరిగిందట. అదేంటో కాదు అరచేతి రేకల మధ్య “ఎక్స్” ఆకారంలో ఉండే గుర్తు. ఇటువంటి “ఎక్స్” ఆకారంలో గుర్తు ఉంటే జీవితంలో తిరుగు ఉండదట. ఇలాంటి గుర్తు ప్రపంచంలో మొత్తంగా ఐదు శాతం మందికి మాత్రమే ఉందట. అరచేతిలో “ఎక్స్” ఆకారంలో గుర్తు కలిగిన వారు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారట.
ఆ వ్యక్తి విజయ పదములో నడవటం మాత్రమే కాక ఇతరులను కూడా నడిపిస్తారట. ప్రపంచాన్ని జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్ అరచేతుల కూడా ఈ గుర్తు ఉందట.
అదేవిధంగా అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చేతిలో ఈ గుర్తు ఉన్నట్లు సైంటిస్టులు తెలియజేశారు. పరిశోధనల ప్రకారం రెండు అరచేతుల్లో “ఎక్స్” గుర్తు ఉంటే వారు జీనియస్ అని బలవంతులుగా ఉండటంతో పాటు ఇతర వ్యక్తులను కూడా తేలికగా అంచనా వేయగలరట. అంతే కాదు “ఎక్స్” గుర్తు కలిగిన వారు శారీరకంగా మరియు మానసికంగా శక్తివంతులుగా ఉంటారట.

Vastu Tips: ఇంటికి ఈశాన్య దిశలో పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టకండి.. లేకుంటే ధననష్టం తప్పదట..

సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల.ఈ ఇంటిని కొనుగోలు చేయడానికి , అలంకరించడానికి ప్రతి ఒక్కరూ తమ స్వంత మార్గంలో కష్టపడి పని చేస్తారు. అంతే కాదు, ఈ సమయంలో అతను తన సొంత ఆలోచనలతో కూడా పోరాడుతాడు. మనమందరం నివసించే ఇంటిని వాస్తుపరంగా దోషరహితంగా మార్చడానికి ప్రయత్నిస్తాము. పూణేకు చెందిన వాస్తు కన్సల్టెంట్ కుల్దీప్ జోషి మాట్లాడుతూ, ఏ ఇంట్లోనైనా ఈశాన్య దిశ చాలా ముఖ్యం..

కుల్దీప్ జోషి ప్రకారం వాస్తులో ఉత్తర,తూర్పు మధ్య దిశను ఈశాన్య కోణం అంటారు. ఈ దిశ ప్రాంతం ఏదైనా వాస్తులో అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఈ దిక్కున దేవుడు కొలువై ఉంటాడని నమ్ముతారు. అలాగే ఇంటి ఈశాన్య మూలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. అందువల్ల, ఇంట్లో ఆనందం, శాంతి , లక్ష్మి నివసిస్తుంది. ఈశాన్యం అంటే శివుని పేరు కూడా ఈశాన్య దిశలో ఉందని డాక్టర్ జోషి తెలిపారు. అందుకే ఇంట్లో కూడా ఈ దిక్కును గుడికి లేదా పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. వాస్తు ప్రకారం ఈ ప్రదేశంలో కొన్ని ప్రత్యేక విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి.

పూణేకు చెందిన వాస్తు కన్సల్టెంట్ కుల్దీప్ జోషి ఈశాన్య మూలలో బరువుగా ఏమీ ఉంచవద్దు. మీరు ఈ ప్రదేశంలో భారీగా ఏదైనా ఉంచినట్లయితే, సానుకూల శక్తి ప్రవాహం ఆగిపోతుంది. ఇది మీ డబ్బును తగ్గిస్తుంది, కాబట్టి ఈ స్థలంలో భారీ అల్మారాలు, స్టోర్ రూమ్‌లు మొదలైన వాటిని తయారు చేయడం మానుకోండి. ఇంట్లోని ఈ ప్రాంతంలో ఎప్పుడూ పాదరక్షలు లేదా చెత్తను సేకరించవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపించి ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి. ఇది శారీరక, మానసిక సమస్యలకు దారి తీస్తుంది చికిత్స కోసం మీ సేకరించిన మూలధనాన్ని ఖర్చు చేయడం ప్రారంభించవచ్చు.

కొత్తగా పెళ్లయిన జంట పడకగదిని ప్రధానంగా ఇంటి ఈశాన్య మూలలో పెట్టకూడదు. ఇది వ్యక్తుల మధ్య సంబంధాలలో విభేదాలను కలిగిస్తుంది మరియు అనవసరమైన సమస్యలను సృష్టిస్తుంది.

ఇంట్లో శ్రేయస్సు కలగాలంటే ఇంట్లో ఈశాన్య మూలలో పూజా స్థలాన్ని తయారు చేసుకోండి అని కులదీప్ జోషి అన్నారు. ఈ ప్రదేశంలో చేసే పూజ దేవునికి ఎల్లప్పుడూ ఆమోదయోగ్యమైనది ఇది ఇంటికి ఆనందం, శ్రేయస్సును కూడా తెస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని మెయింటెయిన్ చేయాలంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. బావి, బోరింగ్, తాగునీరు వంటి ఏదైనా నీటి వనరు కోసం ఈ ప్రదేశం ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉంటుంది.

మీరు కొత్త ఇల్లు నిర్మిస్తున్నట్లయితే, ఇంట్లో ఈ మూలలో బోరింగ్ చేయండి లేదా భూమికింద వాటర్ ట్యాంక్ చేయండి. వాస్తు నియమాల ప్రకారం, ఈశాన్య దిశలో బావిని నిర్మించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో బావిని నిర్మించడం వల్ల అన్ని రకాల ఐశ్వర్యం వస్తుంది.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. మన్నం వెబ్ దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.)

లైఫ్ లో వీళ్ళ నుండి మాత్రం అస్సలు సహాయం తీసుకోవద్దు.. మీకే నష్టం..!

ఆచార్య చాణక్య చాణక్య నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలని చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే కచ్చితంగా లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు. చాణక్య నీతి శాస్త్రం ద్వారా చాలా విషయాలని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి అనేది వివరంగా చెప్పారు.
చాణక్య చెప్పినట్లు చేస్తే లైఫ్ లో ఓటమి ఉండదు. అన్ని సమస్యలు కూడా పోతాయి చాణక్య నీతి ప్రకారం చూసినట్లయితే పాములు తేళ్ల కంటే కూడా కొంత మంది మనుషులు ప్రమాదకరం. నిజానికి అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉంటేనే మంచిది.

జీవితంలో ఎప్పుడూ అలాంటి వ్యక్తుల నుండి సహాయాన్ని మాత్రం తీసుకోకండి స్వార్ధపరుడు తో అసలు స్నేహం చేయకూడదు స్వార్థపరుడు నుండి సహాయం కూడా సహాయాన్ని తీసుకోకండి స్వార్థపరులు ఎప్పటికీ కూడా ఇతరులకి మేలు చేయాలని చూడరు. వారికే ఉపయోగంగా ఉందా లేదా అనేది చూసుకుంటారు స్వార్ధపరులని నమ్మితే మీరే నష్టపోవాల్సి ఉంటుంది.

కోపం ఎక్కువగా ఉన్నవాళ్లకి దూరంగా ఉండాలి కోపం మనిషికి చాలా పెద్ద శత్రువు కోపం వచ్చిన సమయంలో ఆలోచన శక్తి తగ్గిపోతుంది. అర్థం చేసుకోలేరు. కోపంతో ఉన్న వ్యక్తి ఎప్పుడు తనకి చుట్టూ ఉన్నవాళ్ళకి హాని చేస్తాడు దాని వలన మీరే నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి ఇటువంటి వ్యక్తులు నుండి కూడా సహాయాన్ని తీసుకోకండి.

అత్యాశ అసూయ ఉండే వ్యక్తులకు దూరంగా ఉండాలి కష్ట సమయంలో ఇలాంటి వాళ్ళ నుండి అసలు సహాయం తీసుకోవద్దు ఇలాంటి వారి నుండి సహాయాన్ని తీసుకుంటే మీరే నష్టపోవాలి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల నుండి అస్సలు సహాయాన్ని మాత్రం తీసుకోవద్దు మీరే ఇబ్బందుల్లో చిక్కుకు పోతారు.

Gold Scheme | గోల్డ్ స్కీమ్స్‌ ద్వారా బంగారం కొనడం లాభమేనా? వాయిదాల వెనుక మర్మం ఏదైనా ఉంటుందా?

Gold Scheme | పసిడి కాంతులను ఇష్టపడని కాంతలు ఎవరూ ఉండరు! అందుకే, పుత్తడిపై అతివల వలపును తమ గెలుపు సూత్రంగా ఎంచుకుంటున్నారు ఆభరణాల తయారీదారులు.
గోల్డ్‌ స్కీమ్స్‌ పేరిట వాయిదాల పద్ధతిలో సొమ్ము తీసుకొని.. వాళ్లకు నచ్చిన సొమ్ములు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

Gold Scheme | పసిడి కాంతులను ఇష్టపడని కాంతలు ఎవరూ ఉండరు! అందుకే, పుత్తడిపై అతివల వలపును తమ గెలుపు సూత్రంగా ఎంచుకుంటున్నారు ఆభరణాల తయారీదారులు. గోల్డ్‌ స్కీమ్స్‌ పేరిట వాయిదాల పద్ధతిలో సొమ్ము తీసుకొని.. వాళ్లకు నచ్చిన సొమ్ములు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. తరుగు లేదు, మజూరీ లేదన్న ప్రచారం ఈ స్కీమ్స్‌ ఆదరణకు కారణమవుతున్నది. ఇంతకీ వాయిదాల పథకం మంచిదేనా? దీనిని ఎంచుకోవడం వల్ల అదనంగా కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా? తెలుసుకుందాం..

మీశ్రీవారి పుట్టిన రోజుకు బహుమతిగా బ్రేస్‌లెట్‌ ఇచ్చి షాక్‌ ఇవ్వాలనుకుంటున్నారా? పెండ్లిరోజు సందర్భంగా మీ శ్రీమతి రవ్వల గాజుల ముచ్చట తీర్చాలని భావిస్తున్నారా? ‘అనుకున్నామని జరగవు కొన్ని..’ అని నిర్లిప్తత వద్దు. గోల్డ్‌ స్కీమ్‌లో చేరితే ‘అనుకోకున్నా ఆగవు కొన్ని’! సాధారణ బంగారం దుకాణాలు మొదలుకొని పేరుమోసిన జువెలరీ షోరూమ్‌ల వరకు ఈ పథకాన్ని నిర్వహిస్తున్నాయి. మరి వీటిని నమ్మొచ్చా? అని సందేహం రావచ్చు. సెక్షన్‌ 73 ఆఫ్‌ కంపెనీస్‌ యాక్ట్‌ 2013 ప్రకారం.. ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ వినియోగదారుల నుంచి ఇన్‌స్టాల్‌మెంట్‌ పద్ధతిలో డబ్బులు వసూలు చేసి.. దానికి తగ్గ వస్తువులు గానీ, సేవలు గానీ అందించే వెసులుబాటు ఉంది. వీటిని 11 నెలలు పూర్తయ్యేలోపు ఇవ్వాలి. ఏడాది కావొద్దన్నమాట! అందుకే గోల్డ్‌ స్కీమ్స్‌ అన్నీ 11 నెలల కాలపరిమితితో ఉంటాయి. చట్టబద్ధత ఉన్నంత మాత్రాన భద్రత ఉందనుకుంటే పొరపాటు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న వ్యక్తి ప్రమాదం చేయడన్న గ్యారెంటీ లేదు కదా! ఇది కూడా అంతే!!

20 శాతం అదనపు లబ్ధి

గోల్డ్‌ స్కీమ్‌లో నెలవారీ చెల్లింపులతో ఇటు వినియోగదారుడికి, అటు దుకాణాదారుకు ఇద్దరికీ ప్రయోజనమే! ఒకేసారి రెండు తులాల నగ చేయించుకోవాలంటే రమారమి రూ.1.20 లక్షలు అవుతుంది. ఈ మొత్తాన్ని నెలకు రూ.11వేల చొప్పున 11 నెలలు వాయిదాలు చెల్లిస్తే తరుగు, మజూరీ ఉండదు కాబట్టి రూ.1.21 లక్షలతో రెండు తులాల కన్నా ఎక్కువ బరువుండే ఆభరణం సొంతం చేసుకోవచ్చు. తరుగు, మజూరీ మినహాయింపు వల్ల కనీసం 11 శాతం వరకు రిటర్న్‌ పొందినట్టు అవుతుంది. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ లబ్ధి దాదాపు 20 శాతం వరకు ఉంటుంది. స్కీమ్‌లో వాయిదా చెల్లించిన రోజు ఉన్న ధరను బట్టి ఎంత బంగారం వస్తుందో లెక్కకడతారు. ఇక, వాయిదాలు మొదలుపెట్టిన మూడు నెలలకు బంగారం ధర తగ్గిందే అనుకోండి, తర్వాతి పద్దు చెల్లించేటప్పుడు అంతే మొత్తానికి ఎక్కువ బంగారం వస్తుంది కాబట్టి కంగారు పడాల్సిన పనిలేదు. ధర పెరిగిందే అనుకోండి, ముందు నెలల్లో పొందిన బంగారం విలువ కూడా పెరుగుతుంది కాబట్టి.. సమస్య లేదు.

రొటేషన్‌తో లాభం

తరుగు, మజూరీ భారం తగ్గించడమే కాదు ఈ స్కీమ్‌ను ఎంచుకున్నవారికి మరిన్ని ప్రయోజనాలు ఇస్తుంటాయి పలు జువెలరీ సంస్థలు. వినియోగదారులకు ఇంత లాభం చేకూరితే, తయారీదారులకు నష్టం వాటిల్లదా? అన్న అనుమానం సహజం. వినియోగదారులు చెల్లించిన వాయిదాలను దుకాణాదారులు తమ వ్యాపారంలో పెట్టుబడిగా వాడుకుంటారు. పదకొండు నెలల కాలపరిమితిలో ప్రతినెలా సమకూరే మొత్తంతో బంగారం కొనుగోలు చేసి, ఆభరణాల రూపంలో విక్రయిస్తుంటారు. ఆ క్రమంలో లాభాలు గడిస్తారు. ఆ లాభాలను మళ్లీ పెట్టుబడిగా మలుస్తారు. ఇలా కస్టమర్లు చెల్లించే వాయిదాలు రొటేషన్‌ అవుతూనే ఉంటాయి. అలా వచ్చే లాభాల్లోంచి ఎంతోకొంత వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటారు.

రిస్క్‌ తగ్గించుకోండి

‘చక్కని స్కీమ్‌ ఉంది కదా!’ అని వచ్చిన జీతంలో సింహభాగం దానికే కట్టేసి రిస్క్‌ కొనితెచ్చుకోవద్దు. కీడెంచి మేలెంచమని పెద్దల మాట. స్కీమ్‌లో చెల్లించే మొత్తం నెల జీతంలో పది శాతం మించకూడదు. నాలుగు నెలల తర్వాత దుకాణాదారు బోర్డు తిప్పేసినా భారీగా నష్టపోయే పరిస్థితి రాదు. బంగారంపై ఇన్వెస్ట్‌ చేయడం మంచిపని. అయితే, మీరు ఎంచుకునే ఆభరణం విషయంలో క్లారిటీ ఉండాలి. మీ ఇష్టాల కన్నా.. అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగల ఎంపిక ఉండాలి. ఆడపిల్లలు ఉన్నట్టయితే వారు పెండ్లీడుకు వచ్చేసరికి పది తులాల నగలైనా సమకూర్చుకోవాలి.

ఎంపిక మీదే
గోల్డ్‌ స్కీమ్స్‌ ఎంచుకునే క్రమంలో ఆఫర్ల కన్నా డిజైన్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ దుకాణంలో వెరైటీ డిజైన్లు ఉంటాయో అక్కడే స్కీమ్‌లో జాయిన్‌ అవ్వాలి. అంతేకానీ, రూ.10 వేల వరకు కలిసొస్తుందని మామూలు ఆభరణాలు అమ్మేచోట ఎంత మంచి స్కీమ్‌లో చేరినా ప్రయోజనం ఉండదు. మీరు కొనుగోలు చేసే ఆభరణం మనసుకు నచ్చేదై ఉండాలి. అందుకనే ముందుగానే, నాలుగైదు జువెలరీ దుకాణాలకు వెళ్లి, మార్కెట్‌లో వాటి స్థితిగతులు పరిశీలించాలి. మీరు ఏ నగ కొనాలో అంచనాకు వచ్చి అందుకు తగ్గట్టుగా ఇన్‌స్టాల్‌మెంట్‌ నిర్ణయించుకోవాలి. ఎందుకంటే? డబ్బు ఎవరికీ ఊరికే రాదు! బంగారంపై మోజు ఎప్పటికీ తీరదు!!

– ఎం. రాం ప్రసాద్‌, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌
ram@rpwealth.in, www.rpwealth.in

ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలో తెలుసుకోండి.. లేకపోతే రోగాలు వస్తాయి

ప్యాకెట్ పాలను మరగబెట్టి వాడుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం ఇబ్బందుల్లో పడ్డట్టే. ఫ్రెష్ గా ఉంటాయని మరిగించి తాగితే… శరీరానికి పోషకాలు రాకపోగా రాకపోగా…

అనేక ఇబ్బందులు తప్పవని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరం పిల్లలకు బూస్ట్, హార్లిక్స్.. బోర్నవిటా లాంటి వాటిని కూడా పాలల్లో కలిపి వేడి చేసి ఇస్తున్నారు. అంటే మీ పిల్లలకు మీరే పోషకాలు అందిచడంలో నిర్లక్ష్యం వహిస్తారన్నమాట. అదేంటి.. డాక్టర్లు పాలు తాగితే బలం అని అంటున్నారు కదా అంటారా… అయితే ఈ స్టోరీ మీ కోసమే.
అవును… ప్యాకెట్ పాలను ఎప్పుడూ మరిగించి వాడకూడదు. ఇలా చేయడం వల్ల ఆ పాలలో ఉండే అన్ని పోషక మూలకాలు నాశనం అవుతాయి. వాస్తవానికి, ఆవు లేదా గేదె నుండి తీసిన తర్వాత పాలలో కొంత బ్యాక్టీరియా ఉంటుంది. వాటిని చంపడానికి పాలు మరగిస్తారు. ప్యాకెట్ పాలతో కూడా ఇదే అలవాటును అలవర్చుకున్నాము. అయితే ఇది అస్సలు చేయకూడదు. ప్యాకెట్ పాలు కొని తీసుకొచ్చాక బాగా మరగబెట్టాకే వాటిని తాగుతున్నాం. నిజానికి ఆ పాలను మరగబెట్టాల్సిన అవసరం లేదు. మరగబెట్టి, చల్లార్చాకే వాటిని ప్యాకెట్లలో వేసి అమ్ముతారు. కాబట్టి అధిక ఉష్ణోగ్రతల వద్ద మళ్లీ మరిగించాల్సిన అవసరం లేదు. కేవలం తాగడానికి వీలుగా గోరువెచ్చగా చేసుకుంటే చాలు. ఎక్కువ కాచడం వల్ల ప్యాకెట్ పాలల్లోని పోషకాలు ఇంకా తగ్గిపోతాయి. దీంతో వ్యాధినిరోధక శక్తి తగ్గి .. రోగాలకు మనమే స్వాగతం చెబుతున్నామన్నమాట. పోషకాలు ఎందుకు తగ్గిపోతాయో తెలుసుకోవాలంటే ముందు ప్యాకెట్ పాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

పాశ్చరైజ్డ్ పాలు

ప్యాకెట్ పాలు పచ్చిపాలు కాదు. వాటిలో ఉండే హానికారక సూక్షజీవులైన కొలై, సాల్మొనెల్లా, లిస్టిరియా మొదలైన వాటిని చంపేందుకు అధిక ఉష్ణోగ్రత వద్ద మరిగిస్తారు. ఆ తరువాత చల్లార్చి ప్యాక్ చేస్తారు. కొంతమంది వీటికి విటమిన్ ఎ, డిలను జోడిస్తారు. కచ్చితంగా వీటిని చేర్చాలన్న నియమం లేదు కానీ, ఎలాంటి రసాయనాలు కలపకూడదనే కఠిన నియమం అమలులో ఉంది. ఇలా ప్యాక్ చేసిన పాలనే పాశ్చరైజ్డ్ పాలు అంటారు. వీటిని ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకుంటే రెండు రోజుల పాటు ఎలాంటి మార్పులు లేకుండా తాజాగా ఉంటాయి. ఫ్రిజ్ నుంచి బయటికి తీశాక వాటిని తిరిగి అధికంగా మరగబెట్టాల్సిన అవసరం లేకుండా గోరువెచ్చగా చేసుకుని తాగేసినా సమస్య ఉండదు. కానీ వాటిని ప్యాక్ చేసి మూడు రోజుల దాటిన తరువాత తాగాల్సి వస్తే మాత్రం కాసేపు మరిగించడం ఉత్తమం. ఇలాంటి పాలలో పేగుల ఆరోగ్యానికి అవసరమయ్యే ప్రోబయాటిక్ బ్యాక్టిరియా కూడా ఉంటుంది. ఇది అత్యవసరం. ఇక ప్యాకెట్ పాలలో పాశ్చరైజేషన్ వల్ల హానికర బ్యాక్టిరియాతో పాటూ కొన్ని మేలుచేసే బ్యాక్టిరియాలు, ఎంజైమ్ లు కూడా ఉంటాయి. మళ్లీ మరిగేంత వేడిచేస్తే అవి నాశనం అవుతాయి.

పాల ప్యాకెట్ పై హెచ్చరికలు..

ప్యాకెట్ పాలు తెచ్చేటప్పుడు..దానిపై వ్రాసిన పదాలను చదవండి. అప్పటికే పాలు పాశ్చరైజ్ అయ్యాయని ప్యాకెట్‌పై స్పష్టంగా రాసి ఉంది. అంటే అందులో ఉండే బాక్టీరియాలన్నీ ఇప్పటికే నశించిపోయాయి. అటువంటి పరిస్థితిలో, మీరు ప్యాకెట్ పాలను కాచినప్పుడు, అందులో ఉన్న మంచి పోషకాలు నాశనం అవుతాయి. అప్పుడు ఆ పాలు తాగినా ఉపయోగం ఉండదు. ఈ కారణంగా, మీరు తదుపరి సారి నుండి ప్యాకెట్ పాలను ఉపయోగించినప్పుడు, దానిని ఉడకబెట్టవద్దు. ఈ పాలు ప్యాకెట్ నుండి నేరుగా తాగడానికి సరైనది. పాశ్చరైజేషన్ వల్ల కొన్ని మేలుచేసే బ్యాక్టిరియాలు, ఎంజైమ్ లు కూడా నాశనం అవుతాయి. ముఖ్యంగా ప్రోబయాటిక్ లు దాదాపు కనుమరుగవుతాయి. వాటిని మళ్లీ మళ్లీ మరగబెట్టడం మిగిలిన పోషకాలు కూడా నశించే అవకాశం ఉంది.

శుభ్రం చేసిన తరువాతే ప్యాకింగ్
పాలకేంద్రాల వాళ్ళు అర్బన్ ఏరియాల్లో కంటే రూరల్ ఏరియాల్లో ఎక్కువగా పాలు సప్లై చేస్తారు. అంటే.. దీని అర్థం పాలు చెడ్డవనో.. అందులో పోషకాలు లేవనో కాదు.. పశువుల కొట్టం దగ్గర్నుంచి పాల సేకరణ వరకూ శుభ్రంగా ఉండాలి.. అప్పుడే ఆ పాలు అమృతంతో సమానంగా ఉంటాయి. అలా కాకుండా ఏ మాత్రం తేడా జరిగినా అవే విషంగా మారతాయి . పాల వ్యాపారులు పాలల్లో నీళ్లు కలిపి విక్రయించడం వల్ల జనాలు ప్యాకెట్ పాలకు అలవాటు పడ్డారు. ప్యాకెట్ పాలను పాశ్చరైజ్డ్ చేసి ( శుభ్రం) ప్యాక్ చేస్తారు.

నేరుగా గేదె పాలు తీసుకొంటే మరగబెట్టాలి…

పశువుల కొట్టాం దగ్గరి నుంచి తీసుకొచ్చిన పాలల్లో కొన్ని రకాల హానికర బ్యాక్టీరియాలు ఉంటాయి. కీటకాలు ఉండి ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయి. ఇవి కంటకి కనపడకుండా పాలల్లో మిక్స్ అయి ఉంటాయి. వీటిని నేరుగా తాగితే ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల వీటిని మరగబెట్టిన తరువాతే ఉపయోగించుకోవాలి. ఇలాంటి పాలను పాల కేంద్రాలకు తీసుకెళ్లి అక్కడ పాశ్చరైజ్ చేసి ప్యాకింగ్ చేస్తారు. ప్యాకెట్ పాలు ఒకసారి మరగబెట్టి ఉంటాయి. మరల మరగబెడితే ఆరోగ్యానికి ఉపయోగపడే ఎంజైమ్ లు నశిస్తాయి.

Ant Mill: చీమల పద్మవ్యూహం.. అలా గుండ్రంగా ఎందుకు తిరుగుతాయో తెలుసా? ఆశ్చర్యపోయే నిజాలు!

మహాభారతంలో పద్మవ్యూహం గురించి తరచూ వింటుంటాం. ఇందులోకి ఒక్కసారి వెళ్లడమే తప్ప బయటకు తిరిగి రాలేం. గుండ్రటి వలయంలా ఉంటుందీ పద్మవ్యూహం. అలాంటిదే చీమల్లోనూ అప్పుడప్పుడూ కనిపిస్తుంటుంది.

చీమలన్నీ కలిసి ఒక సర్కిల్‌లా ఏర్పడి ఒకదాని వెంబడి మరొకటి తిరుగుతూ ఉంటాయి. అయితే, అవి అలా ఎందుకు తిరుగుతాయనేది గత కొన్నేళ్లుగా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. దీంతో కీటకాల నిపుణులు ఈ గుట్టును విప్పేందుకు ప్రయత్నించారు. ఇందులో ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడయ్యాయి. చీమలు గుంపులు గుంపులుగా ఒకదాని వెంట మరొకటి అనుసరిస్తూ ఒక చట్రంలో తిరగడాన్ని ‘యాంట్ మిల్'(Ant Mill) అని పిలుస్తారట. ‘యాంట్ స్పైరల్ ఆఫ్ డెత్'(Ant Spiral of Death)గా ఈ ప్రక్రియ ప్రసిద్ధి చెందింది. అయితే, సాధారణ చీమల్లో ఈ ‘మాయా వలయం’ ఎక్కువగా కనిపించదని కీటకాల నిపుణులు చెబుతున్నారు. గండు చీమలు(Army Ants) ఈ ప్రక్రియను ప్రధానంగా పాటిస్తాయట. అయితే, కాలక్రమంలో లూప్‌లో తిరిగి తిరిగి ఇందులోని చాలా చీమలు మరణిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

* కారణం ఇదే
గండు చీమలు గుడ్డివి. వీటికి కళ్లు కనిపించవు. కాబట్టి ఇవి ఒంటరిగా బతకలేవు. కానీ జట్టుగా కలిస్తే మాత్రం అద్భుతాలు చేయగలవు. అందుకే ఆహారం కోసం గుంపులుగా వెతుకుతూ కలిసి వెళ్తాయి. ఒక చీమను మరొక చీమ అనుసరించేలా ఒక రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇలా ఇతర చీమలు దారి తప్పకుండా ఒకే వరుసలో వెళ్లడానికి తోడ్పడతాయి. రెండు చీమల మధ్య చాలా తక్కువ దూరం ఉండేలా చూసుకుంటాయి. ఈ విధంగా గండు చీమలు ‘యాంట్ మిల్’ పద్ధతిని సృష్టించుకున్నాయి. క్రమంగా ఇదొక పెద్ద గుండ్రటి వలయంలా ఏర్పడుతుంది. ఆహారాన్ని వెతుక్కున్న అనంతరం తిరిగి గూళ్లకు చేరుకుంటాయి. వేలకు వేలు చీమలు పోగవ్వడంతో దారి తప్పే ప్రసక్తి చాలా తక్కువ.

* దారిలోనే మరణం
సాధారణంగా అడవులు, దట్టమైన ప్రాంతాల్లో ఈ ‘స్పైరల్ ఆఫ్ డెత్’ ఏర్పడుతుంది. ఆహారం అన్వేషణ కోసం ఇలా చేసినప్పటికీ ఇదొక మాయా వలయంగా మారుతుంది. ఇందులో పడిన చీమలు అలసిపోయి చనిపోతాయి కూడా. చాలా చీమలు సత్తువ కోల్పోతాయి. డీహైడ్రేషన్ బారిన పడతాయి. ఆకలితో అలమటించి ఎన్నో చీమలు చనిపోతాయి. ఈ లూప్‌లో చీమలు కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి వీటిలో కొన్ని వేల చీమలు చనిపోతే పెద్దగా ప్రభావం ఉండదు. అందుకే మరణాలను లెక్క చేయకుండా మిగతా చీమలు ఈ వలయంలోనే కొనసాగుతుంటాయి.

* బయటకు రాలేవు
ఒక్కసారి ఈ లూప్‌లోకి వెళ్లిన తర్వాత స్వతహాగా చీమలు బయటకు రాలేవు. బాహ్య పరిణామాలతో తప్పితే ఈ స్పైరల్ నుంచి అవి తప్పించుకోలేవు. వర్షం పడటం, బలంగా గాలులు వీయడంతో ఈ వలయం చెల్లాచెదురు అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే అవి తప్పించుకోగలవు. సొంతంగా చీమలు బయట పడటమనేది అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.

Car Mileage Tips: ఈ టెక్నిక్‌తో మీ కారు మైలేజ్ విపరీతంగా పెరుగుతుంది.. ఏం చేయాలంటే..

మైలేజీ భయంతో జాగ్రత్తగా వెళ్తున్నారా.. ఈ చిట్కాలు అనుసరిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు 5 లక్షలు లేదా 50 లక్షల విలువైన కారును నడిపినా..
ప్రతి ఒక్కరూ తమ కారు అద్భుతమైన మైలేజీని ఇవ్వాలని కోరుకుంటారు. కారు మైలేజ్ వాహనం ఇంజిన్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు కొన్ని మార్గాల్లో దాని మైలేజీలో కూడా పెద్ద వ్యత్యాసాన్ని చేయవచ్చు. మేము ఇక్కడ ఇచ్చిన కొన్ని చిట్కాలను మీరు అనుసరించండి చాలు. కారు మునుపటి కంటే మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇక్కడ మేము మీ కోసం 5 సులభమైన చిట్కాలను అందిస్తున్నాం..

కారును సమయానికి సర్వీస్ చేయడం ఇంజిన్‌కే కాకుండా బ్రేక్‌లు, సస్పెన్షన్, ఇతర సిస్టమ్‌లకు కూడా చాలా ముఖ్యం. సేవ సమయంలో, ఈ వ్యవస్థలు తనిఖీ చేయబడతాయి. లోపాలు ఏవైనా ఉంటే సరిచేయబడతాయి. దీని కారణంగా కారు సమయానికి ఉంటుంది. దాని పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది.

ఓవర్‌లోడింగ్:
కారును ఓవర్‌లోడ్ చేయడం వల్ల దాని ఇంజిన్, సిస్టమ్‌పై చెడు ప్రభావం ఉంటుంది. ఇంజిన్‌పై ఎక్కువ లోడ్ పెట్టడం వల్ల కారు మైలేజీపై ప్రభావం చూపుతుంది. ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది. కాబట్టి, నిర్ణీత సీట్లపై మాత్రమే కారులో కూర్చోండి. బూట్‌లో లగేజీని తీసుకెళ్లకుండా ఉండండి.

టైర్ ప్రెజర్:
టైర్ ప్రెజర్‌ని చెక్ చేయడం, దానిని సరైన స్థాయిలో ఉంచడం మీ కారుకు చాలా ముఖ్యం. అధిక పీడనంతో ఉన్న టైర్ టైర్ సైడ్ వాల్, ట్రెడ్ మధ్య ఘర్షణను తగ్గిస్తుంది, ఇది టైర్ జీవితాన్ని తగ్గిస్తుంది. మరోవైపు, తక్కువ పీడన టైర్లు మైలేజీలో తగ్గుదలకి దారితీస్తాయి. చాలా త్వరగా టైర్ పగిలిపోయేలా చేస్తాయి. కాబట్టి, టైర్ ప్రెజర్‌ను క్రమమైన వ్యవధిలో తనిఖీ చేయండి. దానిని సరైన స్థాయిలో ఉంచండి.

S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి తెలుసా…

పేరును బట్టి కూడా కొన్నిసార్లు జాతక ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కొన్ని పేర్లు( Names ) తెలియకుండానే ఆయా వ్యక్తులకు అదృష్టాన్ని తీసుకువస్తే, కొన్ని పేర్లు నష్టాన్ని కలిగిస్తాయి.
కొన్ని అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని( Personality ) కూడా చెబుతాయి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో చాలామంది పేర్లు మొదలవుతాయి. ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్న వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది.. జ్యోతిష్య శాస్త్రం వారి గురించి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.S అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు వారి మనసులోని భావాలను ప్రదర్శించడానికి ఇష్టపడరు.

వారు చాలా సహజంగాను, వాస్తవికంగానూ ఉంటారు. ఎస్ అనే అక్షరంతో( Letter S ) పేరు మొదలైన వ్యక్తులు స్వచ్ఛమైన హృదయం కలిగిన వారై ఉంటారు.

వారు లోపల ఒకటి, బయట ఒకటి అన్నట్లుగా ఉండరు. కృతిమంగా ఉండడం, నటించడం వారికి అస్సలు రాదు. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మంచి జీవిత బాగస్వాములుగా ఉంటారు. వారు తమ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు.

వారు మంచి ప్రేమికులుగా తమను తాము నిరూపించుకుంటూ ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే సాయం చేసే స్వభావం( Helping Nature ) వారికి ఉంటుంది. వీరికి ఎవరిని మోసం చేయడం అస్సలు రాదు. వీరికి డబ్బు విలువ బాగా తెలుసు. అలాగని డబ్బే వీరి ప్రపంచం కాదు.వీరు స్నేహానికి బాగా విలువ ఇస్తారు.వీరు పుట్టుకతోనే న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.

జీవితంలోనీ ప్రతి రంగంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు.వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు.సహజంగా వీరికి కోపం రాదు. కోపం వస్తే మాత్రం వీరిని ఆపడం ఎంతో కష్టం. కోపం వచ్చినప్పుడు నిగ్రహాన్ని కోల్పోతారు. ఇది ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకు ఉన్న అతిపెద్ద బలహీనత అని చెప్పవచ్చు.

Molatadu : మొలతాడు కట్టుకోవడం వెనుక ఉన్న సైన్స్‌ ఏంటో తెలుసా..?

మగపిల్లలకు మొలతాడు కట్టడం మన దేశంలో అనాదిగా వస్తున్న ఆనవాయితి. ఈ మధ్య కాలుకు నల్లతాడు కట్టుకునే ట్రెండ్‌ బాగా పెరిగింది. నల్లతాడును చాలా మంది స్టైల్‌ కోసమే కట్టుకుంటున్నారు.
అయితే ఇది దిష్టి తగలకుండా కడతారు. మరి మొలతాడు కట్టుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి..? ఇది కూడా దిష్టి తగలకుండానే కడతారా..? అసలు చాలా మంది అబ్బాయిలకు మొలతాడు ఎందుకు కడతారో కూడా తెలియదు. మగాళ్లు అన్నాక మొలతాడు కట్టుకోవాల్సిందే అంటారు.

మొలతాడు ధరించడం వల్ల ఆధ్యాత్మికంగా సైన్స్ దాగి ఉందంటే అవుననే అంటున్నారు. ఆగమన శాస్త్ర పండితులు. పూర్వ కాలంలో డాక్టర్లు లేరు కాబట్టి ఎవరికైనా పాము, తేలు వంటివి కుట్టిన సమయంలో ఈ మొలతాడు తెంపి కుట్టిన ప్రదేశంలో గట్టిగా కట్టి విషంతో కూడిన రక్తాన్ని తీసేవారు. అలాగే గాయాలు అయిన సమయంలో మొలతాడుతో కట్టే వారు. అలాగే ఆధ్యాత్మికంగా మొలతాడు కట్టుకోవడం వల్ల ఎలాంటి దిష్టి కూడా మనకు తగలదట. అందుకే పూర్వం నుండి మొలతాడు నడుము కడుతున్నారు.

ప్రస్తుతం దిష్టి విషయంలో కాలుకు, చేతికి కూడా నల్లటి దారం కడుతున్నారు. మొలతాడు నడుముకు ధరించడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుందని.. బరువు కూడా అదుపులో ఉంటుందని పలు సైన్స్ అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే హెర్నియా అనే వ్యాధి రాకుండా ఉండటానికి కూడా మొలతాడును కట్టుకోవాలని పలువురు సూచిస్తారు.కొన్ని ప్రాంతాలలో మొలతాడు కట్టుకోవడం వల్ల జననావయవాలు ఆరోగ్యంగా ఉంటాయని నమ్ముతారు. ఆ ప్రాంతాలలో పరుషులతో పాటు మహిళలు కూడా మొలతాడును కట్టుకుంటారు. అలాగే గతంలో బెల్ట్ వాడకం లేకపోవడంతో ధరించిన వస్త్రాలు జారిపోకుండా కూడా మొలతాడు ఉపయోగపడేదట.

జాతకం దృష్ట్యా దోషాలు ఉన్న సమయంలో తాయత్తులు కడుతారు. ఆ తాయత్తులు కనిపించకూడదు. కాబట్టి నడముకు మొలతాడు కట్టి దానికి తాయత్తు కట్టేవారట. అలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. అందుకే ఇప్పటికీ కూడా అబ్బాయిలు మొలతాడు కట్టుకుంటారు. మగవారికి మొలతాడు లేకపోతే వారు చనిపోయిన శవంతో సమానమని పెద్దవారు అంటారు.

PMSY – Pradhan Mantri Suryodaya Yojana- కేంద్రం కొత్త స్కీమ్.. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?

Prime Minister Narendra Modi on Monday (January 22) announced the ‘Pradhan Mantri Suryodaya Yojana’, a government scheme under which one crore households will get rooftop solar power systems. This isn’t the first scheme for promoting the installation of rooftop solar power systems, though.

ప్రధానమంత్రి సూర్యోదయ యోజన స్కీమ్‌ అనౌన్స్‌ చేశారు. కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పుడు భారత్‌లో గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌పై, ముఖ్యంగా సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్‌లపై ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే.. సోలార్‌ విద్యుత్తు వినియోగం, ప్రాజెక్టుల పురోగతి తక్కువగానే ఉంది. దేశంలో ప్రస్తుతం 700,000- 800,000 గృహాలు మాత్రమే సోలార్‌ విద్యుత్తును వినియోగిస్తున్నాయి.

భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ (RTS) కెపాసిటీ 2016 నుంచి 2.7 GWకి పెరిగింది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ ఫేజ్-II కింద 40 GW రూఫ్‌టాప్ సోలార్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన (PMSY), ఈ లక్ష్యాలకు తోడ్పాటు అందిస్తుందని భావిస్తున్నారు.
అయితే అవగాహన పెరగడం, ఈజీ RTS ఫైనాన్స్ కారణంగా పెరుగుదల కనిపిస్తోంది. క్రెడిట్ ఫెయిర్ వంటి కంపెనీలు, RTS కోసం 8-10% వడ్డీకి వ్యక్తిగత రుణాలను అందజేయడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలకు దోహదపడాలని భావిస్తున్నాయి. ఈ పథకం అమలు, రుణ సాయాలు, ఖర్చులకు సంబంధించి ఫిన్‌టెక్‌ కంపెనీ క్రెడిట్ ఫెయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వికాస్ అగర్వాల్ ‘బిజినెస్ టుడే’కు తెలిపిన వివరాలు చూద్దాం.

* లక్ష్యం ఎంత దూరంలో ఉంది?

ప్రస్తుతానికి సుమారు 7-8 లక్షల కుటుంబాలు సోలార్‌ వినియోగిస్తున్నాయి. క్రెడిట్ ఫెయిర్, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వచ్చే ఐదేళ్లలో 1 మిలియన్ రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు సహకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫోటోవోల్టాయిక్ ప్యానెల్స్, లేదా రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను మెయిన్‌ పవర్‌ సప్లైకి కనెక్ట్ చేయడం ద్వారా, గ్రిడ్-కనెక్టెడ్‌ విద్యుత్‌పై ఆధారపడటం తగ్గుతుంది. దీంతో విద్యుత్తు ఖర్చులు తగ్గుతాయి. వచ్చే ఐదేళ్లలో 40 గిగావాట్ల యాన్యువల్ పవర్‌ జనరేషన్‌ను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, 2.2 గిగావాట్లను మాత్రమే ఇళ్లలో అమర్చారు. లక్ష్యంలో 70% నెరవేరలేదు.

* ఎంత ఖర్చు అవుతుంది?

3KW- 5KW సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టలేషన్‌కు రూ.2.20 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ వ్యయాన్ని నెలకు దాదాపు రూ.4000- రూ.5000 EMI చెల్లిస్తూ తీర్చుకోవచ్చు. విద్యుత్ బిల్లులకు సమానమైన మొత్తాన్ని చెల్లిస్తూ, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. క్రెడిట్ ఫెయిర్ అందించే సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లు వినియోగదారులకు ప్రక్రియను మరింత అందుబాటులోకి తెచ్చాయి.
ప్రభుత్వ రాయితీలు ఖర్చును మరింత తగ్గిస్తాయి. గ్రిడ్ విద్యుత్ టారిఫ్ రేట్లు, ఆర్థిక ప్రోత్సాహకాలు, నెట్‌ మీటరింగ్ వంటి అంశాలు రీపేమెంట్‌కి దోహదం చేస్తాయి. నెట్ మీటరింగ్ ఉత్పత్తి చేసిన మిగులు విద్యుత్తుని తిరిగి గ్రిడ్‌లోకి మళ్లించడానికి అవకాశం ఉంటుంది. దీని కారణంగా మొత్తం విద్యుత్ బిల్లు తగ్గుతుంది.

* ప్రభుత్వ రాయితీలు

రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తుంది. 10kW కెపాసిటీ వరకు ఉన్న సిస్టమ్‌లకు రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ ఫేజ్-II కింద కిలోవాట్‌కు రూ.9,000 నుంచి రూ.18,000 వరకు ఇస్తుంది. 10kW సామర్థ్యం కంటే ఎక్కువ ఉన్న సిస్టమ్‌లకు సబ్సిడీ మొత్తం ఫిక్స్‌డ్‌గా రూ.1,17,000 ఉంటుంది. డిజిటల్ లెండర్స్‌ స్థానిక ఇన్‌స్టాలర్‌లతో భాగస్వామ్యం చేయడం ద్వారా ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ను సులభతరం చేయడంలో పాత్ర పోషిస్తున్నారు. క్విక్‌, ఈజీ లోన్‌లు అందిస్తున్నారు. ఉదాహరణకు, క్రెడిట్ ఫెయిర్ కంపెనీ 2300 రూఫ్‌టాప్‌లకు ఆర్థిక సహాయం చేసింది, దాదాపు రూ.12 కోట్ల వార్షిక విద్యుత్ ఖర్చులు, 13,000 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించడంతో సమానం.

ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్… గవర్నర్ కోటాలో పదవి

తెలంగాణ ప్రభుత్వం మరో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించింది. ప్రొఫెసర్ కోదండరామ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. కోదండరామ్‌తో పాటు అమరుల్లా ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసింది.
వీరిద్దర్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర తెలపడంతో ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక పదవి దక్కింది. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అనేక వర్గాలను, సంఘాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన కృషి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామ్‌కు కీలక పదవి వస్తుందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖరారైంది.

ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. కమిషన్ సభ్యులుగా మాజీ ఐపీఎస్ అధికారిణి అనితా రాజేంద్రం, పాల్వాయి రజనీ కుమార్, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావులను నియమించారు.

Tea and Coffee : రాత్రిపూట కాఫీ, టీ లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్తగా మీరు డేంజర్ లో పడ్డట్టే?

ఉదయం లేవగానే మనలో చాలామందికి టీ,కాఫీలు తాగే అలవాటు. కొందరు బ్రష్ చేసుకున్న తర్వాత తాగితే మరికొందరు బెడ్ కాఫీ, టీలు తాగుతూ ఉంటారు. అలా టీ, కాఫీలకు ఈ రోజుల్లో మనుషులు బాగా ఎడిక్ట్ అయిపోయారు.
అయితే టీ, కాఫీలు తాగడం మంచిదే కానీ ఎప్పుడు పడితే అప్పుడు తాగడం అస్సలు మంచిది కాదు. కొందరికి రాత్రిపూట కూడా టీ కాఫీ తాగే అలవాటు. మరి రాత్రి సమయంలో కాఫీలు టీలు తాగవచ్చా ఒకవేళ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..రాత్రిపూట టీ కాఫీలను అస్సలు తాగకూడదట. రాత్రిపూట టీ కాఫీలను తాగితే ఏమౌతుందో తెలిస్తే మీరు కూడా వెంటనే తాగడం మానేస్తారు. మాములుగా ఒక కప్పు కాఫీలో 150 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది.

ఒక కప్పు చాయ్ లో 150 మిల్లీ గ్రాముల టీఎన్ అనే మందు ఉంటుంది. నిజానికి కాఫీ కానీ టీ కానీ ఆహారం కాదు. అవి ఔషధాలు. కాఫీ, టీ లో ఉండే ఈ స్టిములెంట్స్ నరాల వ్యవస్థను ఉద్రేక పరుస్తాయి. అందుకే కాఫీ కానీ టీ కానీ తాగగానే రీఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది. ఉత్సాహం వస్తుంది. అయితే ఈ స్టిములేషన ఒక గంట మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వెంటనే నరాల వ్యవస్థ బలహీనం అవుతుంది. అలా.. నరాల వ్యవస్థను అతిగా ఉద్రేక పరచడం ఆ తర్వాత ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల డిప్రెషన్ వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే టీ కాఫీలను ఎక్కువగా తాగకూడదు. అయితే రాత్రిపూట ముఖ్యంగా అస్సలు తాగకూడదు, రాత్రి పూట మన శరీరం మెలటోనిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది.

ఇది కేవలం రాత్రి పూట మాత్రమే విడుదల అవుతుంది. ఈ హార్మోన్ రాత్రి పూట విడుదల అయితేనే నిద్ర వస్తుంది. బాడీ మొత్తం రిలాక్స్ స్టేజ్ లోకి వెళ్తుంది. ఒకవేళ రాత్రి పూట టీ కాఫీలు తాగితే నిద్ర రావడానికి ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల కాదు. దీని వల్ల మనకు నిద్ర పట్టదు. దాని వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. శరీరం రిలాక్స్ కాదు. దాని వల్ల భవిష్యత్తులో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి పూట అస్సలు టీ కాఫీలు తాగకూడదు. ఇంకా కావాలి అనుకుంటే రాత్రి సమయంలో పడుకునేటప్పుడు పాలు తాగి పడుకోవడం ఇంకా మంచిది.

Byjus News: దారుణంగా బైజూస్ రవీంద్రన్ పరిస్థితి.. 40 శాతం వాటా దక్కించుకున్న రంజన్..

Ranjan Pai: ఒకప్పుడు ప్రపంచం మెచ్చుకున్న భారతీయ స్టార్టప్ బైజూస్ ప్రస్తుతం ఇడియట్‌గా కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పాటు చట్టపరమైన చర్యలు కంపెనీ విలువను అమాంతం పాతాళానికి తీసుకొచ్చాయి.
కరోనా కాలంలో స్కూళ్లు మూతపడటం పెద్ద వ్యాపార అవకాశాన్ని కల్పించటంతో కంపెనీ విపరీతంగా కొత్త కొనుగోళ్లకు దిగింది. విదేశాలకు సైతం విస్తరించిన వేళ కంపెనీ లాభదాయకతను అందుకోవటంలో మాత్రం వెనకపడింది. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగులను సైతం తొలగించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు వ్యవస్థాపకుడు ఏకంగా తన సొంత ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టాల్సిన పరిస్థితికి కంపెనీ దిగజారిపోయింది.

 

కంపెనీ వ్యాపారాన్ని నడిపించేందుకు అవసరమైన ఫండ్స్ లభించకపోవటంతో బైజూస్ అల్లాడిపోతోంది. ఈవారం కంపెనీ తన 2022 ఆర్థిక ఫలితాలను అత్యంత జాప్యం తర్వాత ప్రకటించింది. వేగంగా విస్తరించాలని, మార్కెట్ విలువను పెంచుకోవాలని చేసిన అడ్వర్టైజింగ్, ప్రమోషన్ ఖర్చులు కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలను వేగంగా కరిగించేశాయి. ఇలాంటి క్రమంలోనే మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ చైర్మన్ రంజన్ భాయ్ రంగంలోకి దిగారు. వివాదంలో ఉన్న యూఎస్ ఆధారిత డేవిడ్‌సన్ కెంప్‌నర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఆకాష్ ఎడ్యుకేషన్‌లో కలిగి ఉన్న నాన్-పెర్ఫార్మింగ్ బాండ్‌లను కొనుగోలు చేయడానికి బైజూస్ 2023లో దాదాపు రూ.1,400 కోట్లు పెట్టుబడిగా పెట్టారు.

ఈ పెట్టుబడి ద్వారా ఆకాష్ షేర్లలో రంజన్ భాయ్ 40 శాతం వాటాను పొందారు. ప్రస్తుతం బైజూస్ క్యాష్ కౌ అయిన్ ఆకాష్ కంపెనీలో కీలక వాటాదారుగా మారటం మణిపాల్ సంస్థకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి 2021లో ఆకాష్ ఇన్‌స్టిట్యూట్‌ని బైజూస్‌కు చెందిన బైజు రవీంద్రన్ 950 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు రంజన్ భాయ్‌తో 750 మిలియన్ డాలర్ల విలువ అంచనా విలువతో షేర్ల మార్పిడి జరిపారు.

ప్రస్తుతం రంజన్ భాయ్ ఆకాష్ ఇన్‌స్టిట్యూట్‌లో 40 శాతం వాటాతో అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉన్నారు. బైజు రవీంద్రన్ వ్యక్తిగతంగా 16 శాతం, బైజు పేరెంట్ థింక్ & లెర్న్ 26 శాతం కలిగి ఉన్నారు. చివరగా చౌదరీస్ అండ్ బ్లాక్‌స్టోన్ 18 శాతం వాటాను కలిగి ఉన్నారు. దీంతో బైజూ రవీంద్రన్ ఆధిపత్యం తగ్గుముఖం పట్టడంతోపాటు బైజస్ షేర్లు ఇప్పటికే భారీగా తనఖా పెట్టి ఇతర ఇన్వెస్టర్ల వద్ద ఉన్నందున బైజు రవీంద్రన్ ఆధిపత్యం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

వైసీపీలో భారీ మార్పులు, చేర్పులు.. జగన్‌ చతుర్ముఖ వ్యూహం ఎలాంటి ఫలితం ఇవ్వనుంది?

Jagan Strategy : మార్పులు-చేర్పులు, మళ్లీ మార్పుల్లో మార్పులు చేస్తున్న సీఎం జగన్‌ వ్యూహం ఏంటి? ఇప్పటికే 58 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చిన సీఎం..
10 లోక్‌సభ స్థానాల్లోనూ కొత్త అభ్యర్థులను తెరపైకి తెస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనట్లు ఇన్ని మార్పులు చేస్తున్న సీఎం జగన్‌ రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నారా? జగన్‌ వ్యూహాలు పాలిటిక్స్‌లో రోల్‌ మోడల్‌గా నిలుస్తాయా? లేక లెర్నింగ్‌ మోడల్‌గా మారతాయా? నాలుగు ఆప్షన్లతో ముందకు కదులుతున్న జగన్‌ పన్నుతున్న చతుర్ముఖ వ్యూహమా ఇది?

జగన్ వ్యూహం.. ఎలాంటి ఫలితాలను ఇస్తుందో..
బలమైన ప్రత్యర్థిని తెలివితో, తెలివైన ప్రత్యర్థిని బలంతో.. కొట్టాలనేది యుద్ధనీతి! ఈ యుద్ధనీతిని ఆసాంతం ఒంటపట్టించుకున్న వైసీపీ అధినేత జగన్‌ గడిచిన ఐదేళ్లలో ఇటు బలంతో, అటు తెలివితో తెలుగుదేశం పార్టీని.. ఇతర ప్రధాన ప్రత్యర్థులనూ మట్టి కరిపించేందుకు విశ్వప్రయత్నం చేశారు. చాలావరకు లేదా, కనీసం కొంతవరకు తన ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జగన్‌మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల కోసం వినూత్న రీతిలో చేస్తున్న ప్రయోగం.. కొత్త చర్చకు తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై జగన్‌ అనుసరిస్తున్న ఈ వినూత్న వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనని ఆ పార్టీలోనూ భిన్నాభిప్రాయాలను లేవనెత్తుతోంది.
అభ్యర్థుల ఎంపికలో జగన్‌ అనుసరిస్తున్న చతుర్ముఖ వ్యూహంలో ప్రధాన అంశాలు ఇవి…
1. నియోజకవర్గంలో జనం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను నిర్మొహమాటంగా మార్చేయడం.
2. ఇలా సిట్టింగ్‌ స్థానాల నుంచి మారక తప్పని పరిస్థితులను ఎదుర్కొంటున్న వారు.. ఎంతోకొంత శక్తిసామర్థ్యాలను కలిగి, పార్టీకి ఉపయోగపడతారని భావించినప్పుడు.. వారిని మరో కొత్త అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించడం.
3. కొందరు సిట్టింగ్‌ ఎంపీలను ఎమ్మెల్యేలుగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దించడం.
4. పెద్దగా ఉపయోగం లేదని భావించిన వారిని పూర్తిగా ఎన్నికల బరి నుంచి తప్పించివేయడం.
బహుశా జగన్‌ చేస్తున్న ఈ ప్రయోగం.. ఇంతవరకు ఏ ఇతర రాజకీయ పార్టీ చేయలేదేమో!

26మందిని పూర్తిగా పక్కన పెట్టేసిన జగన్..
ఈ ప్రయోగం ఫలితంగా.. ఇప్పటివరకు 58 ఎమ్మెల్యే స్థానాల్లో, 10 ఎంపీ స్థానాల్లో మార్పులు, చేర్పులు చేశారు. 28 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో.. ఇద్దరికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చి, మిగతా 26 మందిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇదంతా ఇప్పటివరకు ప్రకటించిన నాలుగు జాబితాల్లోనే.. రానున్న రోజుల్లో కొత్తగా మరిన్ని మార్పులు జరుగుతాయేమో చూడాలి. ఒక అంచనా ప్రకారం మరో 15 స్థానాల వరకు మార్పులు ఉండవచ్చని అంటున్నారు.

అభ్యర్థిపై జనంలో వ్యతిరేకత లేకపోతే చాలనే భావన..
జగన్‌ చేస్తున్న ఈ ప్రయోగం వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రయోజనం పొందిన బలహీన వర్గాల నుంచి, తనకు బలమైన ఓటు బ్యాంకు ఏర్పడిందని జగన్‌ బలంగా నమ్ముతున్నారు. బలహీన వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ తాను అనుసరిస్తున్న సామాజిక న్యాయవ్యూహానికి.. ఆ వర్గాల వారి నుంచి బాగా మద్దతు లభిస్తుందని కూడా జగన్‌ ఆశిస్తున్నారు.

వీటివల్ల మొత్తం ఓట్లలో 45శాతం వరకు తనకు ఓటు బ్యాంకుగా మారిపోయిందని జగన్‌ విశ్వసిస్తున్నారు. ఇంత బలమైన ఓటు బ్యాంకు తనతో ఉన్నందున.. తన పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడే అభ్యర్థికి జనంలో వ్యతిరేకత లేకపోతే చాలు, వైసీపీ గెలుపు ఖాయమనేది జగన్‌ వేస్తున్న లెక్కల్లోని కీలకాంశం! ఒక రకంగా చూస్తే.. ఇది కరెక్టే అనిపిస్తోంది. అయితే నాణేనికి మరోవైపున కూడా చూడాలి.

కొత్త అభ్యర్థి విజయం కోసం పని చేయడం కష్టమే..
ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న ఎవరికైనా.. ఒక్కసారి రంగం నుంచి నిష్క్రమించాల్సివస్తే చాలా కష్టంగా ఉంటుంది. రాజకీయ అధికార వ్యసనమే అలాంటిది. ఈ పరిస్థితుల్లో.. తనను కాదని, వేరేవారికి టికెట్‌ కేటాయిస్తే… ఆ కొత్త అభ్యర్థి విజయం కోసం పని చేయాలన్న వినయ విధేయతలు, పార్టీ పట్ల నిబద్ధత ఉన్న రాజకీయ నేతలు ఎందరు ఉన్నారు ఈ కాలంలో!?

అలాంటి విశాల దృక్పథం ఉన్న నాయకులు ఎందరు?
ఇక, ఇప్పటివరకు నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తి వచ్చి అక్కడ అభ్యర్థిగా నిలబడితే, తనను కాదని వచ్చిన వారి విజయం కోసం పనిచేయాలన్న విశాల దృక్పథం ఉన్న నాయకులు ఎందరు ఉన్నారు ఈ కాలంలో!? తనదే అనుకున్న సీటు, తనదే అనుకున్న అధికారాన్ని.. తన కళ్ల ముందే వేరొకరికి దక్కే అవకాశం ఉంటే.. వారికి ఆ అవకాశం ఇచ్చే పరిస్థితి నిజంగా నేటి రాజకీయ నాయకుల్లో ఉందా?

వ్యతిరేకత పాపం తమది కాదంటున్న సీటు దక్కని ఎమ్మెల్యేలు..
ఈ కారణాల వల్లే… టికెట్‌ తమకు రాదని భావిస్తున్న నాయకుల్లో… కొందరు పక్క పార్టీల వైపు చూస్తుంటే, మరికొందరు పరిస్థితిని గమనిస్తూ.. భవిష్యత్‌ కార్యాచరణ వ్యూహంలో సిద్ధమవుతున్నారు. ఇందువల్లే.. మార్పులు జరిగిన పలుచోట్ల రచ్చ జరుగుతోంది. కొందరు సిట్టింగులైతే అధినేత మీద విమర్శలు మొదలుపెట్టారు. తమపట్ల నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందన్న విమర్శను ఎదుర్కొంటున్న వారంతా చెబుతున్న ఒక ముఖ్య అంశం కూడా విస్మరించలేనిదిగా కనిపిస్తోంది.

తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ, తమ చేతిలో పెద్దగా అధికారం లేదని.. దాంతో నియోజకవర్గంలోని జనానికీ, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకూ తాము పెద్దగా ఉపయోగ పడలేకపోయామని, అందువల్లే తమ పట్ల వ్యతిరేక భావం ఉన్నట్లు కనిపిస్తోందని.. ఈ పాపం తమది కాదని టికెట్‌ దొరకని పలువురు నాయకులు అంటున్నారు.
అధికారంలో ఉన్నా ప్రయోజనం పొందలేదనే నిరాశ..
సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు నేరుగా జగన్‌ ఓటు బ్యాంకుగా మారారని అనుకుంటే.. అధికారంలో ఉన్న పార్టీ వల్ల ప్రయోజనం పొందలేని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. వారు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే తమకు మేలు జరుగుతుందని 2019 ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ద్వితీయశ్రేణి నాయకుల్లో పలువురు ప్రస్తుతం నిరాశతో ఉన్నారని అంటున్నారు.

అంతుచిక్కని జగన్ వ్యూహం..
వాస్తవానికి చెప్పాలంటే.. ద్వితీయ శ్రేణి నాయకులే కాదు.. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ప్రధానమైన నేతలు కూడా ఇదేరకమైన విమర్శలు చేస్తున్నారు. కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మార్పుల ఎఫెక్ట్‌తో పార్టీకి రాజీనామా చేశారు. ఈ ముగ్గురిలో బాలశౌరికి సీఎం జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పేవారు. ఇక లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అధిష్టానంతో సత్సంబంధాలే నెరిపే వారు. ఇలాంటి వారు ఆకస్మికంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, అంతకుముందే వారికి ప్రత్యామ్నాయంగా కొత్త నేతలను సీఎం జగన్‌ సిద్ధం చేయడం చూస్తుంటే.. ఆయన వ్యూహం ఏ ఒక్కరికీ అంతుచిక్కడం లేదు.

అభివృద్ధిపై మధ్యతరగతి జనాల్లో అసంతృప్తి..
మార్పులతో ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు కనిపిస్తున్నా.. ఎక్కడా చలించడం లేదు సీఎం జగన్‌. ఇంకా మరిన్ని మార్పులు ఉన్నాయంటూ సంకేతాలివ్వడంతో పాటు, మార్చిన వారికి టికెట్‌ గ్యారెంటీ లేదని చెబుతుండటంతో పార్టీపై పూర్తిస్థాయిలో పట్టునిలుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.

మరోవైపు సీఎం చేపట్టిన మార్పులను జీర్ణించుకోలేని సిట్టింగ్‌లు కొందరు కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. వ్యతిరేకత తమపై కాదని.. రోడ్ల నిర్వహణ, విద్యుత్‌ చార్జీల పెంపు, ఇసుక, లిక్కర్‌ పాలసీ వల్ల సాధారణ జనంలో వ్యతిరేక భావం వచ్చిందని వారంతా చెబుతున్నారు. సంక్షేమం విషయంలో బాగానే ఉన్నా.. అభివృద్ధిలో రాష్ట్రం వెనకబడిందనే అభిప్రాయం మధ్యతరగతి ప్రజల్లో ఏర్పడిందని.. సీట్లు రాని పలువురు సిట్టింగు ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

అయితే వైసీసీ పార్టీ వ్యూహకర్తలు మాత్రం దీన్ని కొట్టిపడేస్తున్నారు. ‘వోకల్‌ సెక్షన్స్‌’ తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా.. నిజమైన ‘ఓటు బ్యాంకు’ తమవైపు ఉందని, ఇదే తమకు విజయం చేకూర్చుతుందని వారు అంటున్నారు. జగన్‌ పట్ల పేద ప్రజల్లో ఉన్న అభిమానమే ఆయన్ను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తుందని, ఈ లక్ష్యంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థుల పట్ల జనంలో వ్యతిరేకత లేకుండా చూడాల్సిన పరిస్థితి వల్లే.. తప్పనిసరి పరిస్థితుల్లోనే.. జగన్‌ పలుచోట్ల అభ్యర్థులను మార్చక తప్పడం లేదని, ఆ పార్టీ వ్యూహకర్తలు అంటున్నారు.

ఏది ఏమైనా భారీ సంఖ్యలో అభ్యర్థుల మార్పులు-చేర్పులు ద్వారా జగన్‌ చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే మాత్రం ఆయన పలు పార్టీలకు ‘రోల్‌ మోడల్‌’ అవుతారు. లేకపోతే మాత్రం ‘లెర్నింగ్‌ మోడల్‌’ అవుతారు. ఈ రెండింటిలో ఏది జరుగుతుందో తేలాలంటే మరో 3 నెలలు వేచి చూడాల్సిందే.

YSR కుటుంబం చీలడానికి కారణం జగనే..దీనికి సాక్ష్యం విజయమ్మే – వైఎస్‌ షర్మిల

సీఎం జగన్ పై కాంగ్రెస్‌ పార్టీ ఏపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలడానికి కారణం జగన్ అని… చేజేతులరా ఆయనే చేసుకున్నారని ఫైర్ అయ్యారు.
దానికి సాక్ష్యం దేవుడు, విజయమ్మ, నా కుటుంబం అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు వైఎస్‌ షర్మిల. జగన్… నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని…ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి సదస్సులో మాట్లాడారని నిప్పులు చెరిగారు.

సీఎం అయిన తర్వాత జగన్ మారిపోయాడని…జగన్ కోసం 3200 కిలో మీటర్ల పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. సమైక్యాంద్ర కోసం యాత్ర చేశానని…స్వలాభం చూసుకోకుండా, ఏది అడిగితే అది జగన్ కోసం చేశానని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేస్తాడని నాకు వ్యక్తిగతంగా నష్టం చేసినా భరించానని ఎమోషనల్‌ అయ్యారు కాంగ్రెస్‌ పార్టీ ఏపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని బీజేపీకి బానిసలుగా మార్చారని నిప్పులు చెరిగారు.

BREAKING : ఏపీలో పానీపూరీ తిని ఇద్దరు బాలురు మృతి..!

BREAKING : ఏపీలో పానీపూరీ తిని ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు లోని జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది.
నిన్న రాత్రి పానీపూరీ తిన్న అన్నదమ్ములకు అస్వస్థత చోటు చేసుకుంది.

దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులు రామకృష్ణ (10) విజయ్ (6)గా గుర్తించారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పానీ పూరి తినడం వల్లే మరణించి ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఆకును తలకు రాశారంటే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా మాయం అవ్వాల్సిందే

చుండ్రు… పిల్లలు నుంచి పెద్దల వరకు ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి. అందులోనూ ప్రస్తుత ఈ చలికాలంలో చుండ్రు సమస్య( Dandruff ) చాలా అధికంగా ఉంటుంది.
ఉష్ణోగ్రతలలో తగ్గుదల వల్ల నెత్తి మీద చర్మం పొడిగా మారి చుండ్రుకు దారి తీస్తుంది. తీవ్రమైన దురదను కలిగిస్తుంది. చుండ్రు అధికమైతే హెయిర్ ఫాల్( Hair fall ) కంట్రోల్ తప్పుతుంది. జుట్టు కూడా పలచబడుతుంది. కాబట్టి చుండ్రు సమస్యను వీలైనంత తొందరగా వదిలించుకోవాలని అందరూ భావిస్తుంటారు. మీరు జాబితాలో ఉన్నారా.. అయితే మీకు మునగాకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ ఆకును తలకు రాశారంటే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే మాయం అవ్వాల్సిందే. మరి ఇంతకీ మునగాకును తలకు ఎలా ఉపయోగించాలి అన్నది ఆలస్యం చేయకుండా చకచకా తెలుసుకుందాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మునగాకు పొడిని ( Munagaku powder )వేసుకోవాలి. అలాగే వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ మెంతిపొడి వేసుకోవాలి.

ఆ తర్వాత అందులో రెండు స్పూన్లు ఆముదం( castor oil ) మరియు సరిపడా బియ్యం కడిగిన వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి. గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు కేవలం రెండు వాషుల్లోనే పూర్తిగా క్లియర్ అవుతుంది. స్కాల్ప్ హైడ్రేటెడ్ గా మరియు హెల్తీ గా మారుతుంది. చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ హోమ్ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. పైగా ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి. జుట్టు రాలడం సైతం తగ్గు ముఖం పడుతుంది.

Passport: ప్రపంచంలో ఈ ముగ్గురు మాత్రమే పాస్‌పోర్ట్ లేకుండా ప్రయాణించగలరు!! వాళ్లెవరో తెలుసా..?

విదేశాలకు వెళ్లే వ్యక్తికి పాస్‌పోర్ట్ గుర్తింపు కార్డుగా ఉపయోగించబడుతుంది. విదేశీ పర్యటనలకు పాస్‌పోర్ట్ తప్పనిసరి. పాస్‌పోర్ట్‌లో ప్రయాణీకుడి పేరు, చిరునామా, పౌరసత్వం, వయస్సు, సంతకం, ఇతర సమాచారం ఉంటుంది.

ప్రపంచంలో పాస్‌పోర్ట్ విధానం అమల్లోకి వచ్చి 102 ఏళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వరకు ప్రభుత్వ అధికారులు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పాస్‌పోర్టును తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ, ఒక ముగ్గురు వ్యక్తులకు మాత్రం ప్రపంచంలో ఎక్కడికి వెళ్లడానికైనా సరే.. పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఆ ముగ్గురు ఎవరో తెలుసా ?? వారిలో బ్రిటన్ రాజు, జపాన్ రాజు మరియు రాణి పాస్‌పోర్ట్ లేకుండా ప్రయాణించవచ్చునని మీకు తెలుసా..? వివరాల్లోకి వెళితే..

చార్లెస్ బ్రిటన్ రాజు కావడానికి ముందు దివంగత క్వీన్ ఎలిజబెత్‌కు ఈ సౌకర్యాలు ఉన్నాయి. బ్రిటన్ రాజుగా చార్లెస్ అధికారం చేపట్టిన తర్వాత, అతని కార్యదర్శులు తమ దేశ విదేశాంగ కార్యాలయం ద్వారా అన్ని దేశాలకు విదేశీ ప్రయాణాలకు అవసరమైన పత్రాలను పంపారు. కింగ్ చార్లెస్ ఇప్పుడు బ్రిటీష్ రాజకుటుంబానికి అధిపతి. వారి ప్రయాణానికి అనుమతి ఇవ్వాలి. రాజుల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని ఆదేశం ఇచ్చారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, బ్రిటిష్ రాజులకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. వారి భార్యలకు ఈ అధికారం లేదు. రాజు భార్య ప్రయాణిస్తున్నప్పుడు కాన్సులర్ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉంటుంది. కాన్సులర్ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు ప్రత్యేక మర్యాదలు, గౌరవం కలిపిస్తారు.

ప్రపంచంలోని ప్రధానమంత్రులు, అధ్యక్షులందరూ ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించేటప్పుడు కాన్సులర్ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండటం సర్వసాధారణం. కాన్సులర్ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న నాయకులకు భద్రతా తనిఖీలు, ఇతర తనిఖీల నుండి మినహాయింపు ఉంటుంది. భారతదేశంలో ఈ హోదాను ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కలిగి ఉంటారు.
ఇప్పుడు జపాన్ రాజు, రాణి కూడా ఈ అధికారాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుత జపాన్ రాజు నరుహిటో, అతని భార్య మసాకో ఓవాటా పాస్‌పోర్ట్ లేకుండా ప్రయాణించవచ్చు. రాజు కూర్చున్న సీటు నుండి దిగే దేశానికి ప్రయాణిస్తున్నప్పుడు కాన్సులర్ పాస్‌పోర్ట్ తీసుకువెళతారు.

సోదరుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత.ఎందుకు?

ఓ వివాహిత వరసకు సోదరుడయ్యే వ్యక్తితో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెంది సోమేష్, సూర్యాపేట జిల్లాకు చెందిన చామంతిని(28) 13 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. దంపతులు బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2018లో తన సోదరుడు నర్సింహులుతో కలిసి సోమేష్ హైదరగూడలోని గుమ్మకొండకాలనీలో ఇల్లు కొన్నారు. ఫస్ట్ ఫ్లోర్‌లో నర్సింహులు ఉండగా గ్రౌండ్ ఫ్లోర్‌లో సోమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. నర్సింహులు బావమరిది శేఖర్(25) అరు నెలల క్రితం బావ వద్దకే వచ్చి ఉంటున్నాడు.

ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటున్నాడు శేఖర్. నర్సింహ్మా దంపతులు, సోమేష్ సూర్యాపేటలో దశదినకర్మ ఉండడంతో అక్కడికి వెళ్లారు. చామంతి తన పిల్లలను స్కూల్‌కు పంపించారు. ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం 3.30కి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మెయిర్ డోర్ లోపల నుంచి గడియపెట్టి ఉండడంతో కిటికీలో నుంచి తొంగిచూశారు. తల్లి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో ఇరుగుపొరుగువారికి సమాచారం ఇచ్చారు. హాల్లో చామంతి, పడక గదిలో శేఖర్ ఉరేసుకొని కనిపించడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇద్దరు మధ్య వివాహేతర సంబంధం ఉందా? అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వివాహితపై శేఖర్ అత్యాచారం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటే అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Hero Xtreme 125R Launch : కొత్త బైక్ కొంటున్నారా? హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్‌ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

Hero Xtreme 125R Launch : ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ జనవరి 23న (మంగళవారం) హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్‌ కొత్త బైకును భారత మార్కెట్లో లాంచ్ చేసింది.
ఈ కొత్త హీరో బైక్ రూ. 95వేల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. కొత్త ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ కంపెనీ 125సీసీ పోర్ట్‌ఫోలియోను బలపరుస్తుందని భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ జాబితాలో గ్లామర్, సూపర్ స్ప్లెండర్, సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టీఈసీ కూడా ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్‌ మోడల్ కూడా వచ్చి చేరింది. ఈ బైకు సంబంధించిన స్పెషిఫికేషన్లు, ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

గంటకు 60కి.మీ వేగం.. 66కి.మీ మైలేజీ :
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైకులో ఈబీటీ (ఇంజిన్ బ్యాలెన్సర్ టెక్నాలజీ)తో కూడిన కొత్త 125సీసీ స్ప్రింట్ మోటార్ (స్మూత్ పవర్ రెస్పాన్స్, ఇన్‌స్టంట్ టార్క్) ఉంది. ఇంజిన్ 11.4బీహెచ్‌పీని అందిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ యాక్సిలరేషన్ టైమ్ 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60కిలోమీటర్ల వేగాన్ని అందుకోలగలదు. అంతేకాదు.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ లీటరుకు 66 కిలోమీటర్లు మైలేజ్ అందిస్తుంది.

Hero Xtreme 125R price

కొత్త హీరో బైకు స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైక్ తేలికైన, భారీ-డ్యూటీ డైమండ్-టైప్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుకవైపు ఏడు-దశల సర్దుబాటు మోనోషాక్‌ను కలిగి ఉంది. ఈ కొత్త బైకులో శాలమైన 120/80 సెక్షన్ బ్యాక్ టైర్‌తో అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. 276ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్‌తో సెగ్మెంట్-ఫస్ట్ సింగిల్-ఛానల్ ఏబీఎస్ కలిగి ఉంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ముఖ్యమైన ఫీచర్లలో సెగ్మెంట్-ఫస్ట్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ వింకర్‌లు, టైలాంప్, కాంపాక్ట్ మఫ్లర్, సెగ్మెంట్-ఫస్ట్ వీల్ కవర్ ఉన్నాయి.

ధరల వివరాలు ఇవే :
మోటార్‌సైకిల్‌కి గేర్ పొజిషన్ ఇండికేటర్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌ల కోసం బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన నెగటివ్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా లభిస్తుంది. హాజర్డ్ ల్యాంప్ కూడా ఉంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్‌లో ఫైర్‌స్టార్మ్ రెడ్, కోబాల్ట్ బ్లూ, స్టాలియన్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. వేరియంట్ వారీగా హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ధర (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఐబీఎస్ – రూ. 95,000
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఏబీఎస్ – రూ. 99,500

BRAGCET 2024: ఏపీ అంబేద్కర్ గురుకులాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్- పూర్తి వివరాలివే..

ఏపీలో బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల్ విద్యాలయ సొసైటీ(APSWREIS) నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం అంటే 2024-25 కోసం గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో పరీక్షల వివరాలు, దరఖాస్తుల స్వీకరణ, ఇతర వివరాలు ఉన్నాయి.
ఏపీలోని బీఆర్ అంబేద్కర్ గురుకులవిద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. దీని ప్రకారం ఈ రెండు తరగతుల్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం జనవరి 25 నుంచిఫిబ్రవరి 23 వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం మార్చి 10న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారిని మెరిట్ లిస్ట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
అంబేద్కర్ గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం ఆయా జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లలో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా ఐదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఎస్సీ, ఎస్టీలు 10-11 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఓసీ, బీసీ, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లు(బీసీ-సీ) పదేళ్ల వయసు కలిగి ఉండాలి. అలాగే అభ్యర్ధి వరుసగా రెండేళ్ల పాటు అదే జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాఠశాలలో చదివి ఉండాలి. తల్లితండ్రుల ఆదాయం ఏడాదికి లక్ష రూపాయలు మించకూడదు.
మార్చి 10న ఒకే రోజు రెండు సెషన్లలో ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తారు.
మార్చి 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య 5వ తరగతి ప్రవేశానికి పరీక్ష ఉంటుంది. అలాగే
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం వీటి ఫలితాలను విడుదల చేసి మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. ఇందులో ఎంపికైన వారిని రాష్ట్రంలోని 185 అంబేద్కర్ గురుకులాల్లో ఆయా తరగతుల్లో చేరేందుకు వీలు ఉంటుంది. ఎస్సీలకు 75 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-సీలకు 12 శాతం, బీసీలకు 5 శాతం, ఇతరులకు 2 శాతం సీట్లు కేటాయిస్తారు.

Kitchen Jugaad Video: కుటుంబం మొత్తం బట్టలను కేవలం 2 బ్యాంగిల్స్‌పై ఆరబెట్టండి.. వర్షాకాలం అద్భుతమైన ట్రిక్..

Kitchen Jugaad Video: కుటుంబం మొత్తం బట్టలను కేవలం 2 బ్యాంగిల్స్‌పై ఆరబెట్టండి.. వర్షాకాలం అద్భుతమైన ట్రిక్..

Kitchen Jugaad Video:రుతుపవనాలు (Monsoon) ప్రారంభం కాగానే అతి పెద్ద సమస్య బట్టలు ఆరబెట్టడమే. వానలో బట్టలు (Clothes) తడిసిపోతాయి, తడిసి ఉతికిన బట్టలు బయట ఆరబెట్టలేం.

బట్టలు ఇంట్లో వేసుకున్నా త్వరగా ఆరవు. చాలా రోజులు తడిగా ఉంటుంది. కానీ ఇప్పుడు వర్షాకాలంలో కూడా బట్టలు ఆరబెట్టే టెన్షన్ లేదు. వర్షంలో బట్టలు ఆరబెట్టడానికి చాలా మంచి ట్రిక్ ను ఈ కిచెన్ జుగాద్ ద్వారా మీకు అందిస్తున్నాము.

వర్షంలో కూడా బట్టలు ఆరబెట్టడం సులువుగా మారింది. దీని కోసం మీకు రెండు బ్యాంగిల్స్ మాత్రమే అవసరం. మీరు రెండు చేతితో పట్టుకునే బట్టల లైన్లలో మొత్తం ఇంట్లో ఉన్నవారి అందరి బట్టలు ఆరబెట్టవచ్చు. బ్యాంగిల్స్ వర్షంలో బట్టలు ఆరబెట్టడం యొక్క ఆందోళనను తొలగిస్తుంది.

ఇది ఎలా సాధ్యమని ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఏమి చేయాలో వీడియోలో చూద్దాం.

వీడియోలో చూపిన విధంగా మహిళ పాత గుడ్డను తీసుకుంది. దాన్ని చించి తాడులా ముక్కలు చేశారు. ఈ గుడ్డ ముక్కలను రెండు చెక్క ముక్కల మధ్య తాడులా కట్టారు. తీగలు అవసరమైన చోట గుడ్డను కత్తిరించి, రెండు వైపులా పెద్దగా ఉన్న కర్రలను తీసుకోండి. ఇప్పుడు కర్రలకు రెండు వైపులా తాడు కట్టి దానిపై ఒక గాజులు కట్టి అందులో కొక్కెం వేయాలి. ఈ విధంగా మీ ఇంటి బట్టలు ఆరబెట్టే స్టాండ్ సిద్ధంగా ఉంది.

ఇప్పుడు మీరు ఈ స్టాండ్‌లో వర్షంలో ఇంటి లోపల బట్టలు ఆరబెట్టవచ్చు. ఇది బట్టలు సరిగ్గా గాలి మరియు బాగా పొడిగా ఉండటానికి అనుమతిస్తుంది.

ఈ వీడియో SEEMA FAMILY VLOG YouTube ఛానెల్‌లో పోస్ట్ చేయబడింది. ఈ పరిష్కారాన్ని ప్రయత్నించండి మరియు మా సోషల్ మీడియా వ్యాఖ్య పెట్టెలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

AC: ఇంట్లో వాడే ఏసీని కొని అయిదేళ్లకు పైనే అయిందా..? అయితే వెంటనే చేయాల్సిన పనేంటంటే..!

ధనవంతుల ఇళ్ళలోనే కాదు, మధ్యతరగతి కుటుంబాలలో కూడా ఇప్పట్లో ఏసీలు ఉంటున్నాయి. ఏసీ లేకపోతే చాలామందికి నిద్రపట్టదు. అలవాటైపోయిన తరువాత చలికాలం, వర్షాకాలం, వేసవికాలం అంటూ కాలంతో సంబంధం లేకుండా ఏసీని వినియోగిస్తుంటారు.
అయితే చాలా మందికి ఏసీ గురించి తెలిసిన విషయాల కంటే, తెలియని విషయాలే ఎక్కువ ఉండటం గమనార్హం. ఏసీ కొని 5ఏళ్ళు దాటితే మాత్రం దానిగురించి మరింత జాగ్రత్త అవసరం. ఏసీ కొన్నప్పటికంటే పాతబడే కొద్ది చల్లదనం ఇవ్వడం తగ్గిస్తుంది. అలా జరగకుండా ఉండాలన్నా, ఏసీ కొన్నప్పుడు ఎంత బాగా చల్లదనం ఇచ్చిందో అలా తిరిగి పనిచేయాలన్నా ఈ 3పనులు వెంటనే చేయాలి(old AC cooling methods). అవేంటో తెలుసుకుంటే..

శుభ్రపరచడం..(Cleaning)

ఏసీ కొన్న చాలామందికి దాన్ని ఆపరేట్ చేయడం మాత్రమే వస్తుంది. కానీ ఏసీని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే ఏసీ పాతబడినా దాని పనితీరు మెరుగ్గా ఉంటుంది. గాలిని ఫిల్టర్ చేయడం కారణంగా ఏసీలో మురికి చేరిపోతుంది. ఈ మురికిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటే ఏసీ 5ఏళ్లు దాటినా కొత్తదానిలా చల్లదనం ఇస్తుంది. ఏసీని సొంతంగానూ శుభ్రం చేయించుకోవచ్చు, లేదంటే సర్వీస్ చేసేవారితోనూ శుభ్రం చేయించవచ్చు.

గ్యాస్ చెకింగ్..(gas checking)

వాడేకొద్ది ఏసీ పాతబడుతుంది. దీంతో పాటు క్రమంగా గ్యాస్ కూడా తగ్గిపోతుంది. ఈ కారణం వల్ల కూడా ఏసీ ఇచ్చే గాలి అంత చల్లగా అనిపించదు. అందుకే 5ఏళ్ళు దాటిన ఏసీని వాడుతున్నప్పుడు గ్యాస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ ను ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండాలి.

కంప్రెసర్..(compressor)

ఏసీ విషయంలో తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్త ఏదైనా ఉందంటే అది కంప్రెసర్ విషయంలోనే. ఏసీ చల్లగాలి అందించకపోవడానికి కంప్రెసర్ ప్రత్యక్షప్రభావం చూపిస్తుంది. ఏసీని ఎక్కువగా ఆన్, ఆఫ్ చేసుంటే అది కంప్రెసర్ పై ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగా కంప్రెసర్ పనితీరు దెబ్బతింటుంది. ఎప్పుడైనా ఏసీ పనిచేయడంలో పదేపదే ఇబ్బందులు తలెత్తుతుంటే అది కంప్రెసర్ లో కలిగిన ఇబ్బందిగా గుర్తించాలి. ఏసీని ఆన్ చేసిన తరువాత ఎప్పుడూ దాన్ని ట్యాంపర్ చేయకూడదు. 5ఏళ్ళు దాటిన ఏసీ కంప్రెసర్ లకు ఎక్కువ పని కలిగేలా చేయకూడదు.

Phone Tips: ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేస్తున్నారా.. బ్యాటరీ పని ఖతమే.. ఎక్కువ కాలం బ్యాటరీ పనిచేయాలంటే ఈ టిప్స్ పాటిస్తే బెటర్..!

Smartphone Battery: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ జీవితంలో కీలకంగా మారింది. ఫొటోను క్లిక్ చేయాలన్నా లేదా ఆన్‌లైన్ సమావేశానికి హాజరు కావాలన్నా లేదా తెలిసిన వ్యక్తికి డబ్బు పంపాలన్నా..
ఇలా జీవితంలో ఫొన్ లేకుండా జరగడం లేదు. ఇటువంటి పరిస్థితిలో దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది. బ్యాటరీ కూడా ఫోన్‌లో ముఖ్యమైన భాగం. దీన్ని ఛార్జ్ చేయడానికి సరైన మార్గం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇటువంటి పరిస్థితిలో అసులు ఫోన్ బ్యాటరినీ ఎంత ఛార్జ్ చేయాలనే విషయం తెలుసుకుందాం..

ఫోన్ అనేది పోర్టబుల్ పరికరం. ఇందులో బ్యాటరీ ఉంటుంది. ఫోన్‌ను ప్రారంభించడానికి అత్యంత ముఖ్యమైన భాగం బ్యాటరీ. ఫోన్‌లోని మిగిలిన భాగాలు మంచి స్థితిలో ఉండాలంటే బ్యాటరీ ఎంతో ముఖ్యమైనది. కానీ, బ్యాటరీ సపోర్ట్ చేయకపోతే, ఫోన్ షట్ డౌన్ అవుతుంది.
అత్యవసర సమయంలో ఫోన్‌లోని బ్యాటరీ సపోర్ట్ చేయకుంటే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇటువంటి పరిస్థితిలో బ్యాటరీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. గమనించదగ్గ విషయం ఏమిటంటే, సరిగ్గా ఛార్జింగ్ చేయడం ద్వారా కూడా, ఫోన్ బ్యాటరీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. ఫోన్ 100 శాతం వరకు ఛార్జింగ్ అయ్యే వరకు ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచుతుంటారు. కానీ, ఇది మంచిది కాదు.

ఇంతకుముందు ఉపయోగించిన బ్యాటరీల్లో యాసిడ్ వాడేవారు. ప్రస్తుతం బ్యాటరీలు లిథియం వాడుతున్నారు. కాబట్టి, పూర్తిగా ఛార్జ్ అయ్యే వరకు లిథియం అయాన్ బ్యాటరీలను ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం వల్ల ఆధునిక లిథియం అయాన్ బ్యాటరీ దెబ్బతింటుంది. బ్యాటరీ పూర్తిగా అయిపోయినప్పుడు లేదా పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు చాలా ఒత్తిడికి గురవుతుంటాయి. కాబట్టి, ఈ పరిస్థితులను నివారించాలి. తద్వారా లిథియం-అయాన్ బ్యాటరీల జీవితాన్ని పెంచవచ్చంట.

ఇటువంటి పరిస్థితిలో ఫోన్ ఛార్జింగ్‌ను 80 నుంచి 90 శాతం వరకు మాత్రమే ఛార్జ్ చేయాలి. అలాగే, బ్యాటరీ శాతం 20 లేదా 30కి పడిపోయిన తర్వాత దాన్ని మళ్లీ ఛార్జింగ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను ఎక్కువ కాలం ఉంచుకోవచ్చు.

LIC Kanyadan Policy: ఎల్​ఐసీ కన్యాదాన్​ పాలసీ.. బాలికల విద్య, వివాహం కోసం అద్భుతమైన స్కీమ్​!

LIC Kanyadan Policy: ‘ఎల్​ఐసీ కన్యాదాన్​ పాలసీ’.. ఆడపిల్లలకు సంబంధించి ప్రముఖ బీమా సంస్థ ఎల్​ఐసీ ప్రవేశపెట్టిన అద్భుతమైన పాలసీల్లో ఇదీ ఒకటి.
పేరులో ఉన్నట్లుగానే ఆడపిల్ల వివాహాన్ని భారంగా భావించే తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ సూపర్​ పాలసీని ప్రవేశపెట్టారు. మరి ఈ పాలసీని ఎప్పుడు తీసుకోవచ్చు, ఎవరు అర్హులు, ప్రీమియం ఎంత, ఎలా చెల్లించాలి మొదలైన పూర్తి వివరాలు మీకోసం..

LIC Kanyadan Policy: ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లలకు పెళ్లిచేయడం అనేదాన్ని భారంగా భావిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. అలాంటి వారికోసమే అధ్బుతమైన పాలసీని తీసుకొచ్చింది ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ). అదే ‘ఎల్​ఐసీ కన్యాదాన్​ పాలసీ’. ఇది కేవలం ఆడపిల్లల పెళ్లికి మాత్రమే కాకుండా వారి బంగారు భవిష్యత్తు కోసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం కుమార్తె వివాహంతో పాటు ఆమె పైచదువుల ఆర్థిక అవసరాలను కూడా తీర్చడం. ముఖ్యంగా ఈ పాలసీలో ఇద్దరే భాగస్వామ్యులుగా ఉంటారు. ఒకరు కుమార్తె, మరొకరు తండ్రి.

తండ్రి మరణిస్తే..?
LIC Policy For Girl Child : ఈ పాలసీ ప్లాన్​ పూర్తిగా కూతురి పేరు మీదే ఉన్నప్పటికీ పూర్తి అధికారాలు మాత్రం తండ్రికే ఉంటాయి. అయితే పాలసీ మెచ్యురిటీ కాకముందే, తండ్రి మరణిస్తే.. అతడి కుటుంబానికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. అదెలాగంటే.. ఈ పాలసీ తీసుకున్న కొంత కాలానికే తండ్రి చనిపోతే అతడి కుటుంబం మిగతా కాలానికి పాలసీ ప్రీమియాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంటే ప్రీమియం మొత్తం మాఫీ అవ్వడమే కాకుండా పాలసీ ఉచితంగా అమలు అవుతుంది. అలాగే పాలసీ మిగిలిన సంవత్సరాలలో ప్రతి సంవత్సరం సమ్ అష్యూర్డ్‌లో నుంచి 10% డబ్బును కుమార్తె పొందవచ్చు. కాగా, పాలసీ వ్యవధి (మెచ్యురిటీ) ముగిశాక పాలసీ మొత్తం అమౌంట్​ను నామినీకి అంటే కుమార్తెకు అందజేస్తారు. అయితే లబ్ధిదారుడు(తండ్రి) ప్రమాదవశాత్తు మరణిస్తే గనుక రూ.10 లక్షలు, అదే సహజ మరణమైతే రూ.5 లక్షలు కుటుంబానికి చెల్లిస్తారు.

పాలసీ వ్యవధి..
LIC Kanyadan Policy Age Limit : ఈ పాలసీ వ్యవధి 13 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే తన కుమార్తె కోసం తండ్రి ఈ పాలసీను తీసుకోవాలంటే, తండ్రి వయసు 18 నుంచి 50 ఏళ్లలోపు ఉండాలి. గరిష్ఠ మెచ్యురిటీ వయసును 65 సంవత్సరాలుగా ఫిక్స్​ చేశారు. ఇక ఈ పాలసీని కుమార్తె పేరు మీద తీసుకోవడానికి ఆమె వయసు 1-10 సంవత్సరాల మధ్య ఉండాలి. కుమార్తె భవిష్యత్​ గురించి ఆలోచించే ప్రతి తల్లిదండ్రులకు ఈ పాలసీ ఎంతగానో దోహదపడుతుంది.

25 ఏళ్ల పాలసీకి.. 22 ఏళ్ల ప్రీమియం..
LIC Kanyadan Policy Duration : ఈ పాలసీకి రోజు వారీ ప్రీమియం రూ.75 నుంచి మొదలవుతుంది. దీంతో పాటు నెలవారీగా, క్వార్టర్లీ, హాఫ్​ ఇయర్లీ, యాన్యువల్​గా ప్రీమియం చెల్లించే ఆప్షన్​ను ఎంచుకోవచ్చు. మొత్తంగా 25 ఏళ్ల వ్యవధి కలిగిన ఈ పాలసీకి కేవలం 22 ఏళ్ల ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అలా 13 ఏళ్ల నుంచి ప్రారంభమయ్యే ఈ ప్లాన్​కు ఎల్​ఐసీ నిబంధనల ఆధారంగా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అలా మెచ్యురిటీ తర్వాత కుమార్తె పెళ్లి సమయానికి భారీ మొత్తంలో నగదును లబ్ధి పొందొచ్చు.

18 ఏళ్లు దాటాక 50 శాతం..
LIC Kanyadan Policy Benefits : కుమార్తె పేరుపై తీసుకునే ఈ పాలసీలో మరో ప్రత్యేకత ఏంటంటే.. అమ్మాయి ఉన్నత చదవులు కోసం ప్లాన్​ అమౌంట్​లో నుంచి గరిష్ఠంగా 50 శాతం మేర నగదును ఉపసంహరించుకోవచ్చు. అయితే అప్పటికి అమ్మాయికి 18 ఏళ్లు నిండి ఉండాలి. అయితే ఒకే కుమార్తె పేరుపై రెండు ఖాతాలను తెరవకూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

లోన్​ పొందొచ్చు.. పన్ను రహితం..
LIC Kanyadan Policy Tax Benefit : ఈ పాలసీ వల్ల కలిగే లాభాల్లో లోన్​ సౌకర్యం కూడా ఒకటి. పాలసీ కొనుగోలు చేసిన మూడేళ్ల నుంచి దీనిపై మనం అనేక రకాల రుణాలను కూడా పొందొచ్చు. అంతేకాకుండా ఈ ప్రీమియం డిపాజిట్‌పై 80C కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. అలాగే సెక్షన్ 10D కింద మెచ్యురిటీ అమౌంట్​ మొత్తం పన్ను రహితం. మొత్తంగా మీరు రోజూ రూ.75లు ఆదా చేస్తే.. పాలసీ వ్యవధి ముగిసే సమయానికి సుమారు రూ.14.5 లక్షలు.. అదే రోజూ రూ.151లు పొదుపు​ చేస్తే మెచ్యురిటీ సమయానికి రూ.31 లక్షలు వరకు నగదును అందుకోవచ్చు.

Financial Tips: నెల జీతం సరిపోవడం లేదని బాధపడుతున్నారా.. ఇలా చేస్తే మీ చేతిలో డబ్బే డబ్బు..

జీవిత అవసరాల కోసం డబ్బు సంపాదించడమే మనందరి జీవిత ఆర్థిక లక్ష్యం. అవసరాలు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. డబ్బు సంపాదన లక్ష్యం కూడా మారుతుంది.
కొందరు అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు చేయవచ్చు, పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు. కొందరి ఆదాయం చాలా పరిమితంగా ఉండవచ్చు. కానీ ఆర్థిక గణన , ఫార్ములా అందరికీ ఒకటే. ప్రస్తుత పరిమితుల్లోనే పరిమిత మార్గంలో ఆర్థిక భద్రతను పొందడం సాధ్యమవుతుంది. ఆర్ధిక సలహాదారులకు అందించే అత్యంత ముఖ్యవిషయం. అందులోనూ ఇది ప్రాథమిక ఆర్ధిక విషయం అని కూడా వారు అందిస్తుంటారు.. అందులో ఏమున్నాయో ఓ సారి చూద్దాం..

ఎవరికైనా రుణం చిన్న మొత్తంతో ప్రారంభమవుతుంది. చిన్న రుణం అని విస్మరించవద్దు. వీలైనంత వరకు అప్పులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీకు అప్పు ఉంటే, మీ సంపాదన నీటిలో ఈత కొట్టినట్లే. మీ ఖర్చులను రుణ రహిత పద్ధతిలో నిర్వహించండి. మీ కోరికలను నియంత్రించుకోండి.
అత్యవసర నిధి చాలా ముఖ్యం..

అనారోగ్యం లేదా మరేదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడవచ్చు..అలాంటి సమయంలో ఆకస్మిక ఖర్చులు తలెత్తవచ్చు. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో మీరు రుణం తీసుకోవలసి రావచ్చు. ఇలాంటి పరిస్థితి రాకుండా కొంత డబ్బును అత్యవసర నిధిలా దాచుకోవడం చాలా అవసరం. మీ పొదుపులో కొంత భాగాన్ని అత్యవసరంగా ఉంచండి. కనీసం లక్ష రూపాయలైనా విడిగా ఉంచుకుంటే మంచిది. దాని కోసం, ఆర్డడీ మొదలైన సాధారణ పెట్టుబడి పథకాలను ఉపయోగించవచ్చు. ఎందుకంటే అవసరమైనప్పుడు వెంటనే తీసుకునేలా ఉండాలి. ఇందులో కొంత కొంత జమ చేసుకోవచ్చు. చిట్ లేదా చిట్ ఫండ్స్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే నెల నెల కొద్దిగా తీసి ఇలా పొదుపు చేసుకోవచ్చు.

బీమా చాలా ముఖ్యం
జీవిత బీమా, ఆరోగ్య బీమా రెండూ చాలా ముఖ్యమైనవి. ఆరోగ్య బీమా మీకు ఆరోగ్య ఖర్చులకు వ్యతిరేకంగా భద్రతను అందిస్తుంది . జీవిత బీమా మీ పదవీ విరమణ జీవితానికి మద్దతు ఇస్తుంది.

ఖర్చులను ట్రాక్ చేయండి

డబ్బును పొదుపు చేయడం.. డబ్బు సంపాదనతో సమానమని తెలివైనవారు అంటారు. మీ ఆదాయంలో మీరు అనుకున్నంత డబ్బు ఆదా చేయలేకపోతున్నారని మీరు ప్రతీ సారి అనుకుంటూ ఉంటారు. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టాలంటే ఒక మంచి మార్గం.. మీ రోజువారీ ఖర్చులను రికార్డ్ చేయడం. ఇది ఒక నెలలో మీ డబ్బు ఎక్కడ ఖర్చు చేయబడుతుందో మీకు స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది. ఇది కొన్ని అనవసరమైన ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుంది.

అధిక ఆదాయం కోసం ప్రయత్నించండి..
మీ ప్రస్తుత ఆదాయ వనరుతో మీ ఆర్థిక లక్ష్యం సాధ్యం కాకపోతే, అదనపు ఆదాయ వనరులను ప్రయత్నించండి. ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చాలా అందుబాటులో ఉన్నాయి. ఓలా , ఉబెర్, రాపిడ్ వంటి వాటిలో పని చేయవచ్చు. ఇవి పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని అందిస్తాయి. డెలివరీ బాయ్ వర్క్ కూడా అలాంటిదే. కానీ , ఈ అదనపు ఉద్యోగాలు మీ వ్యక్తిగత జీవితానికి ఆటంకంగా మారకుండా చూసుకోండి.

Home Loan: ఉద్యోగులు ఇల్లు కొనేందుకు ఎలా ప్లాన్ చేసుకోవాలి..? నిపుణుల సలహాలు, సూచనలు..

కోవిడ్ సంక్షోభం తర్వాత చాలామంది సొంత ఇంటి నిర్మాణం లేదా ఇంటి కొనుగోలుపై దృష్టి పెట్టారు. ఆ సమయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ ధరకే హోమ్‌లోన్లు ఆఫర్ చేశాయి.
దీంతో రియల్ ఎస్టేట్ బూమ్ నెలకొంది. అయితే మార్కెట్ డిమాండ్, వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా ఇళ్ల ధరలు క్రమంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితుల్లో నెలవారీ జీతం పొందే ఒక ఉద్యోగి సొంతింటి కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలో వివరించారు రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీ ఒమాక్స్ (Omaxe) ప్రెసిడెంట్ అవ్నీత్ సోనీ. ఆయన సూచనలు మీకోసం..

వడ్డీ రేట్లు

సాధారణంగా ఇల్లు కొనాలనుకునే ఉద్యోగులు హోమ్ లోన్ తీసుకుంటారు. ఇప్పుడు అనేక బ్యాంకులు వీటిపై తక్కువ వడ్డీ విధిస్తున్నాయి. అయితే అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లను పోల్చి చూసి.. మీ ఆర్థిక పరిస్థితులకు బాగా సరిపోయేదాన్ని ఎంచుకోవాలి. ఇందుకు మీ ఆదాయం, కుటుంబ ఖర్చులు, ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ప్రభుత్వ పథకాలు

ప్రస్తుతం వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వడ్డీ లేని లోన్లు, పన్ను ప్రయోజనాలతో ఇవి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. మీరు ఇలాంటి స్కీమ్స్‌కు అర్హులు అయితే, వాటిని ఎంచుకోవడం మంచిది. కొన్నిచోట్ల ప్రైవేట్ డెవలపర్లు, ప్రభుత్వం లాంచ్ చేసిన చౌకైన హౌసింగ్ స్కీమ్స్ సక్సెస్ అయ్యాయి. మొదటిసారి ఇల్లు కొనే వారికి PMAY కింద ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుంది. వీటి గురించి కూడా ఆరా తీయాలి.

CIBIL స్కోర్‌

ఉద్యోగులు ఆదాయ పన్ను సక్రమంగా చెల్లించి, మంచి CIBIL స్కోర్‌ మెయింటెన్ చేస్తే.. బ్యాంకులు వారికి సులభంగా హోమ్ లోన్లు ఇస్తాయి. అయితే లోన్ అమౌంట్ అర్హత ఎంతో తెలుసుకొని, తదనుగుణంగా ఆస్తిని ఎంచుకోలి. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చులో 85 శాతం వరకు బ్యాంకులు ఆర్థికసాయం ఇస్తాయి. మిగిలిన 15 శాతాన్ని ఉద్యోగి ఖర్చు చేయాల్సి ఉంటుంది. మంచి సిబిల్ స్కోర్ ఉంటే, 85 శాతం వరకు లోన్ సులభంగా పొందవచ్చు.

ఆస్తి సెలక్షన్

ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయించిన తర్వాత, కొనుగోలుదారులు తప్పనిసరిగా డెవలపర్‌ చేయించే పనులపై శ్రద్ధ వహించాలి. అది కొత్తగా డెవలప్ చేసే ప్రాపర్టీ అయినా లేదా నిర్మాణంలో ఉన్నా.. మీ అవసరాలు, అంచనాలకు అనుగుణంగా నిర్మాణం చేయించుకోవడం మంచిది. అయితే ముందే నిర్ణీత ప్లాన్‌లను మీరు డెవలపర్‌కు ఇవ్వాలి.

ప్రాపర్టీ అగ్రిమెంట్
2016లో రెరా చట్టం అమల్లోకి వచ్చాక దేశంలో రియల్ ఎస్టేట్ మోసాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే ఇప్పటికీ ప్రాజెక్టుల ఆలస్యం అనేది కొనుగోలుదారులకు పెద్ద సమస్యగా మారింది. అందుకే ప్రాపర్టీ కొనుగోలుకు ముందు డెవలపర్ అనుభవం, మార్కెట్ రెప్యుటేషన్, కంపెనీ ట్రాక్ రికార్డ్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ప్రభుత్వ వెబ్‌సైట్లలో సంబంధిత కంపెనీ RERA నంబర్, డేట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒప్పందంలో డెవలపర్ పేర్కొన్న తేదీ లోపు ప్రాపర్టీ చేతికి అందకపోతే పరిహారం లేదా రీఫండ్ డిమాండ్ చేసేలా ముందే ఒప్పందం చేసుకోవాలి.

Phone Charging: ఫోన్‌కు ఎప్పుడు పడితే అప్పుడు ఛార్జింగ్ పెడుతున్నారా? రోజు ఎన్నిసార్లు ఛార్జ్ చేయాలి.. !

ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోవడం ప్రారంభిస్తే చాలా చికాకుగా ఉంటుంది. డెడ్ బ్యాటరీ ఉంటే మంచి ఫోన్ జంక్ అవుతుంది. మనం కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పట్ల చాలా ఇష్టంగా శ్రద్ధ వహించడం మనందరం గమనించి ఉండాలి.

కానీ ఎక్కడైతే ఫోన్ కాస్త పాతబడడం మొదలవుతుందో అక్కడ మనం దాని పట్ల చాలా అజాగ్రత్త చూపుతాం.

ఛార్జింగ్ విషయానికి వస్తే, కొంతమంది తమ ఫోన్ కొద్దిగా డిశ్చార్జ్ అయినప్పుడు, వారు వెంటనే ఛార్జింగ్‌లో ఉంచడం మన చుట్టూ చూస్తాము. అలాగే, ఛార్జింగ్‌లో ఉంచిన వెంటనే ఫోన్‌ను బయటకు తీసేవారు చాలా మంది ఉన్నారు మరియు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

అయితే ఈ అలవాట్ల వల్ల ఫోన్ పాడైపోతుందని మీకు తెలుసా. ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచడానికి సరైన మార్గం ఉంది. ఫోన్‌ను తరచూ ఛార్జింగ్ పెడుతూ ఉంటే, కాలక్రమేణా ఫోన్ బ్యాటరీ చెడిపోతుంది. అందుకే ఈ రోజు మనం ఒక ఫోన్‌ని రోజుకు ఎన్నిసార్లు ఛార్జ్ చేయాలో తెలియజేస్తున్నాము.

బ్యాటరీ 20% లేదా అంతకంటే ఎక్కువ పడిపోవడాన్ని అనుమతించవద్దు మరియు బ్యాటరీని పూర్తిగా డిశ్చార్జ్ చేయడాన్ని నివారించండి. బ్యాటరీ స్థాయి 80% (లేదా అంతకంటే తక్కువ) మరియు 100% మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఛార్జర్ నుండి ఫోన్‌ను అన్‌ప్లగ్ చేయండి. మీ ఫోన్‌ను 100% స్థాయిలో ఎక్కువ కాలం ఉంచవద్దు, అంటే పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత దాన్ని ఛార్జర్ నుండి తీసివేయండి.

చాలా మంది వ్యక్తులు 20-80 నియమాన్ని పాటించాలని సిఫార్సు చేస్తారు, మీరు ఖచ్చితంగా అనుసరించవచ్చు. 20-80 రూల్ అంటే ఏమిటో మీకు తెలియకపోతే, 20 అంటే బ్యాటరీ 20% కి డ్రెయిన్ అయినప్పుడు, దానిని ఛార్జింగ్‌లో పెట్టాలి, మరియు 80 అంటే 80% వద్ద ఉన్నప్పుడు.. అప్పుడు అది దాన్ని తొలగించడం సముచితం. అంటే, మీ ఫోన్ రోజుకు రెండుసార్లు 20%కి చేరుకుంటే, మీరు దానిని రెండుసార్లు ఛార్జింగ్‌లో ఉంచాలి, ఎక్కువ కాదు.

మీ ఫోన్ బ్యాటరీ 20% ఉన్నప్పుడు, ఫోన్‌లో ‘లో బ్యాటరీ’ అలర్ట్ కనిపించడం మీరు తప్పక చూసి ఉంటారు. అంతకు ముందు ఫోన్‌ని హాయిగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు 45-75 నియమాన్ని కూడా అనుసరించవచ్చు.

Sim Cards: మన ఆధార్ కార్డు నెంబర్ పై ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఈ వెబ్ సైట్ లోకి వెళ్లండి..

Sim Cards: ప్రపంచం సాంకేతికంగా ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కొత్త కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు ఎంతో కష్టంతో చేసిన పనిని టెక్నాలజీతో ఈజీగా చేయగలుగుతున్నాం.
కానీ ఇదే సమయంలో హ్యాకింగ్ బెడద తప్పడం లేదు. ప్రతి మంచి వెనుక చెడు ఉన్నట్లు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. అంతకంతకు హ్యాకర్లు పెరిగిపోతున్నారు. అయితే ఈ సమయంలో మన సమాచారం ఇతరులు దొంగిలించకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

మనదేశంలో ఒక వ్యక్తి ఐడెటంటిటీ కోసం ఆధార్ కార్డును యూస్ చేస్తున్నాం. ఆధార్ నెంబర్ ఇస్తే మన వివరాలన్నీ తెలిసిపోతాయి. దీంతో ఈ ఐడీ కార్డు సహాయంతో ఇతర అవసరాలు తీర్చుకుంటున్నాం. ముఖ్యంగా మొబైల్ లో సిమ్ కావాలంటే ఆధార్ తప్పనిసరి. అయితే కొందరు మనకు తెలియకుండా ఆధార్ నెంబర్ తస్కరిసంచి సిమ్ కార్డులు తీసుకుంటారు. వీటితో చెడు పనులు చేస్తున్నారు. మరి ఈ హ్యాకింగ్ నుంచి ఎలా కాపాడుకోవాలి? ఏం చేయాలి?
హ్యాకర్ల బెడత నుంచి తప్పించుకోవడానికి అనేక మార్గాలు వచ్చాయి. కానీ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఈ తరుణంలో ప్రభుత్వం అధికారికంగా ఓ వెబ్ సైట్ ను తయారు చేయించింది. దీని ద్వారా మనకు తెలియకుండా ఎవరైనా మొబైల్, ఆధార్ నెంబర్ తో మిస్ యూజ్ చేస్తున్నారా? అనే విషయాన్ని కనిపెట్టవచ్చు. మన ఆధార్ నెంబర్ ద్వారా ఎన్ని సిమ్ కార్డులు, ఎవరెవరు తీసుకున్నారు? అని కనిపెట్టవచ్చు.

అందుకోసం గూగుల్ ఓపెన్ చేసి Tafcop.sanhcarsaathi.gov.in అని టైప్ చేయండి. ఇందులో మీ మొబైల్ నెంబర్ ఇస్తే చాలు.. ఆతరువాత కింద ఉన్న క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయాలి. వెంటనే మీ రెగ్యులర్ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తరువాత మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నారో కనిపిస్తుంది. దీంతో ఇవి సరైనవే అయితే ఓకే.. లేకపోతే మాత్రం అక్కడున్న ఆప్షన్ తో కాంప్లైంట్ ఇవ్వొచ్చు. దీంతో మీకు తెలియని నెంబర్ ను డిసేబుల్ చేసుకోవచ్చు. ఇలా మీ ఆధార్ నెంబర్ చెడు పనులకు వాడకుండా జాగ్రత్తపడండి..

Health

సినిమా