Thursday, November 14, 2024

తిమ్మమ్మ మర్రిమాను -గిన్నిస్ బుక్ తిమ్మమ్మ మర్రి మాను విశేషాలు విశేషాలు

ప్రపంచ భూభాగంలో నమ్మశక్యం కాని ఎన్నో చమత్కారాలు చోటు చేసుకున్నాయి. వాటి వెనుకున్న కథనాలు, రహస్యాలు అందరినీ అబ్బురపరుస్తుంటాయి. అలాంటి విచిత్రమైన వ్యవహారాల్లో ‘తిమ్మమ్మ మర్రిమాను’ కూడా ఒకటి! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి 35 కి.మీ దూరంలో గూటిబయలు గ్రామంలో ఈ మర్రిమాను వుంది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వృక్షంగా పేరుగాంచిన ఈ చెట్టు.. దాదాపు 5 చదరపు ఎరకాలకంటే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి వుంది. 1989లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందింది. ఈ చెట్టుకు ‘తిమ్మమ్మ’ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు. అలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఓ కథనం కూడా వుంది.

నేపథ్యం :

బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతులకు తిమ్మమాంబ అనే కుమార్తె వుండేది. గూటిబైలుకు చెందిన బాలవీరయ్యతో తిమ్మమాంబకు వివాహం జరిగింది. కొన్నాళ్లపాటు వీరి సంసారజీవితం బాగానే కొనసాగింది. అయితే.. కొంతకాలం అనంతరం వీరయ్య మరణించాడు. ఆరోజుల్లో సతీసహగమనం ఆచారం కొనసాగుతుండేది కాబట్టి… భర్తమరణంతో తిమ్మమాంబ సతీసహగమనానికి సిద్ధమైంది. అప్పుడు చితిలోకి దూకేందుకు ఎత్తుకోసం నాలుగు ఎండిన మర్రి గుంజలను (కట్టెలు) నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ… చిగురించి అది మహావటవృక్షంగా ఎదిగింది. అందుకే.. ఈ చెట్టుకు ‘తిమ్మమ్మ’ అనే పేరు పెట్టారు. ఈ చెట్టును ప్రపంచపుటల్లో స్థానం కల్పించేందుకు 1989లో సత్యనారాయణ అరియర్స్ అనే వ్యక్తి ఎంతో కృషిచేశారు. ఆయన తీసుకున్న కృషితోనే ఈ చెట్టు గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. 1355 వూడలతో వుండే ఈ మర్రిమానుకు దాదాపు 660 సంవత్సరాలు నిండాయి.

మరికొన్ని విశేషాలు :

అనంతపురం జిల్లాలో నీటి కొరత ఎక్కువగా వున్నప్పటికీ.. తిమ్మమ్మ మర్రిమాను ఆకాశం కనిపించనంత గుబురుగా పెరిగి, పచ్చని ఆకులతో చూపరులను ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. మర్రిమానును 1992లో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రూ.34 లక్షలతో అతిథి భవనం, అటవీశాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ.12 లక్షలతో శివఘాట్ నిర్మించారు.

ఈ చెట్టు క్రింద ‘తిమ్మమ్మ’ గుర్తుగా చిన్న గుడి వుంది. అక్కడ వున్న శిలా ఫలకం మీద ‘తిమ్మమ్మ 1394లో శెట్టి బలిజ శెన్నాక్క వేంకటప్ప, మంగమ్మ లకు జన్మించింది. 1434లో సతీ సహగమనం చేసింది’ అని చెక్కబడింది. పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజ చెయ్యడం వల్ల పిల్లలు కలుగుతారని భక్తులు భావిస్తారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఈ వృక్షము పై ఏ పక్షీ మల విసర్జన చెయ్యదని చెపుతారు. అంతేకాదు.. సాయంత్రం ఆరు గంటలకల్లా పక్షులేవీ ఈ చెట్టు పై ఉండవట!

Thimmamma Marrimanu, Anantapur 

Thimmamma Marrimanu is a huge banyan tree which is located at about 70 Km from Horsely Hills. This historical tree is situated in the district of Ananthpur. The name of this tree is preserved by the local people since ancient times.

Thimmamma Marrimanu, a huge banyan tree is located at about 70 Km from Horsely Hills. The word ‘marri’ means banyan and ‘manu’ means tree in Telugu language. This historical tree is situated in the district of Ananthpur. The name of this tree is preserved by the local people since ancient times. Many people visit the place to worship and to let their souls relax in the peaceful ambience. The route is quite exciting while getting here as it goes through fields and little villages and it makes the visitors journey enjoyable.

Geography of the place
The Thimmamma Marrimanu tree , located in Anantapur district of Andhra Pradesh , is located about 25 km from Kadiri town . The tree’s branches spread over a land of 5 acres and it has a cover of 19,107 sq mtrs . There is a small temple built under the tree which is dedicated to Thimmamma . An account of her life is made in Telugu language and it is kept at the shrine.
In 1989, It is recorded as the biggest tree in the Guinness Book of World Records .

History of the tree
The history of the tree has emerged from a lady Thimmamma, who used to take care and look after her husband who was ill . Later on , on her husband’s funeral pile , she sacrificed her life . (br)It is believed by the locals that the pole of north-east side pyre grew and got inside this tree. It is believed that this banyan tree has sprouted at the same place where she ascended the funeral pyre . That made the villagers believe that spirit of the lady is still there in that tree and will always remain there. The tree was named as Thimmamma in the memory of that lady. (br) The Indian mythology represents this tree as ‘Trimurthyâ€�which is a confluence of Lord Vishnu as the bark, Lord Brahma as the roots and Lord Shiva as the branches . It is said that the three gods are risiding in that tree .

Legend related to the place
The local people of the area believe that if a couple praying for a child visit the place and worship ‘Thimmamma’ with dedication , they will have a child soon.
Moreover at this place , a big jatara is held on Shivaratri festival. Many people flock here in great numbers to worship ‘Thimmamma’ on this occasion.

తిమ్మ‌మ్మ మ‌ర్రిమాను || గిన్నిస్ బుక్ రికార్డుల్లో మ‌ర్రి చెట్టు

click on the video to view…

*????The Hidden Island- Sentinel Island – Story on Sentinelese* ????Special story…. సెంటినెలిస్- దాదాపు 60,000 సంవత్సరాల నుంచీ ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్న ఆదిమ వాసులు.. ????సెంటినలీస్‌ను కలవటం నేరం , ఫొటోలు తీయటం నిషిద్ధం… *????అండమాన్ ఆదిమానవుల గురించి భయంకర నిజాలు..* *????స్పెసల్ వీడియోస్..*

సెంటినెలిస్- దాదాపు 60,000 సంవత్సరాల నుంచీ ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్న  ఆదిమ వాసులు – సెంటినలీస్‌ను కలవటం నేరం , వారిని ఫొటోలు, వీడియోలు తీయటం నిషిద్ధం –  ఇప్పటికి లోహాల గురించి పెద్దగా తెలియదు- ఇప్పటివరకు సెంటినెలీస్ తెగ వారిని ఎవరూ కలవలేదా? బాహ్య ప్రపంచంతో సంబంధాలు నెరపడానికి ఎందుకు ఆస్తకి కనబర్చరు? అదో పెద్ద కథ.తెలుసుకుందాం…..

చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన నరజాతి మనుషులు కొందరు ఇంకా అలాగే ఉండిపోయారు. కొంత మానవాభివృద్ధి తరవాత పరిణామ క్రమం ఆగిపోయి ఉండటంతో అడవిజాతిగానే మిగిలిపోయారు. రాతియుగం నాటి మనుషులు ఎలా ఉంటారు. జంతువులను వేటాడి పచ్చి మాంసం తింటారు. అడవుల్లో ఉంటారు. పశు  ప్రవర్తన. ఒంటి మీద బట్టలు వేసుకోవడం తెలీదు. ఆకలేస్తే వేటాడి  తినడం, నిద్రవస్తే నిద్రించటం, దేహం కోరుకుంటే మైధునం అంతకు మించిన ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, బావోద్వేగాలు అసలే వారికి తెలయవు లేదా ఉండవు.
పూర్తి అడవి కౄరమృగాల తరహా జీవనం. ఇలాంటి మనుషులు ఇప్పటికీ ఉన్నారంటే నమ్మగలరా?  ఏవరైనా? నమ్మకాలకు అపనమ్మకాలకు సంభంధం లేకుండా వారి ప్రవర్తన అలాగే ఉంటుంది.  మన అండమాన్ నికోబార్ దీవుల్లోని  ఉత్తర సెంటినల్ ఐలాండ్  ప్రాంతంలో ఉండే “సెంటినల్ తెగ ప్రపంచం లోనే అత్యంత కౄరమైన ప్రమాదకరమైన మానవరూప ఆదిమజాతి.
అండమాన్‌లోని రక్షిత ఆదిమ వాసులు అయిన ‘సెంటినెలీస్’ తెగ ప్రజలను కలుసుకోవడానికి వెళ్లిన 27 ఏళ్ల అమెరికన్‌ జాన్‌ అలెన్‌ చౌ వారి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ దీవుల్లోకి వెళ్లాలని ప్రయత్నించిన జాన్ ను అక్కడి ప్రజలు 2018 నవంబర్ 16న బాణాలు వేసి హతమార్చారు.

తీర ప్రాంతం లో గస్తీ తిరుగుతున్న సెంటినెలిస్

2004లో ఇండొనేసియా, శ్రీలంక, భారత తూర్పు తీరాల్లో మహావిలయం సృష్టించిన హిందూ మహా సముద్ర సునామీని.. నార్త్ సెంటినల్ దీవిలో నివసించే ఈ సెంటినలీస్ తెగవారు తట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నారని ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పుడ, నార్త్ సెంటినల్ దీవి మీదుగా నేవీ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ పరిశీలించారు. మరింత దగ్గరగా చూడటానికి హెలికాప్టర్ కాస్త కిందకు దిగినపుడు.. దానిపై అక్కడి తెగ వారు బాణాలు విసిరిరారు. ”అలా వారు క్షేమంగా ఉన్నారని మాకు తెలిసింది” అని ఆ హెలికాప్టర్ పైలట్ మీడియాకు చెప్పారు.

హెలికాప్టర్ పైకి బాణాలు వేస్తున్న సెంటినెలీస్

దీంతో 2004లో సునామీ సంభవించండంతో  మొదటిసారి వెలుగులోకి వచ్చిన ఈ తెగ గురించి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. మరి ఈ తెగవారు ఇతరులను ఎందుకు తమ ప్రాంతంలోకి అనుమతించరు? బాహ్య ప్రపంచంతో సంబంధాలు నెరపడానికి ఎందుకు ఆస్తకి కనబర్చరు? అదో పెద్ద కథ.తెలుసుకుందాం…

ఎవరీ సెంటినెలీస్?

బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల్లో ఒకటైన ఉత్తర సెంటినెల్ ఐలాండ్‌లో నివసించే ఒక ప్రత్యేకమైన తెగ సెంటినెలీస్. ఇండియా లో ఉన్న మనల్ని ఇండియన్స్ అన్నట్లే అక్కడి వారిని సెంటినెలీస్ అంటారు .

వీరు.. ఆఫ్రికాలో ఆవిర్భవించిన మొట్టమొదటి మానవ జనాభా ప్రత్యక్ష వారసులు కావచ్చునని.. దాదాపు 60,000 సంవత్సరాల నుంచీ ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్నారని పరిగణిస్తున్నారు.
అండమాన్ దీవుల్లోని ఇతర దీవుల్లో ఉన్న వేరే ఆదిమజాతుల వారి భాషకూ.. ఈ సెంటినలీస్ భాషకూ ఏమాత్రం పోలిక లేకపోవటాన్ని బట్టి.. వీరికి తమ చుట్టుపక్కల దీవుల్లోని జాతుల వారితోనే వేల ఏళ్లుగా సంబంధాలు లేవని అర్థమవుతోంది.
ఇతర గిరిజన తెగలకు భిన్నంగా ఉండే సెంటినెలీస్ భాష మాట్లాడే వీరు బయటివారిని బద్ధ శత్రువులుగా చూస్తారు. వీరి జనాభా 15 నుంచి 500 మధ్య ఉంటుందని అంచనా. క్రమంగా తగ్గుతూ అది కాస్త 100 లోపు పడిపోయిందని అంటున్నారు. అయితే 2001 జనాభా లెక్కల ప్రకారం 21 మంది పురుషులు, 18 మంది స్ర్తీలున్నారు. 2011 లెక్కల ప్రకారం 12 మంది పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నారు.

సెంటినలీస్‌ను కలవటం నేరం , వారిని ఫొటోలు, వీడియోలు తీయటం నిషిద్ధం

ప్రపంచానికి దూరంగా ఏకాంతంలో జీవిస్తున్న అండమాన్ తెగలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఆ తెగ వారిని కలవటం నేరం. బయటి వ్యాధులు ఆ తెగవారికి సోకే ప్రమాదాన్ని నివారించటానికి.. వారిని ఎవరూ కలవరాదన్న నిషేధం విధించారు.
అండమాన్ ఆదివాసీ తెగల వారిని ఫొటోలు, వీడియోలు తీయటం కూడా.. మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించగల నేరమని భారత ప్రభుత్వం 2017లో ప్రకటించింది.

జీవనాధారం ఏంటి?

సెంటినెలీస్ తెగల ప్రధాన ఆహారం చేపలు, పీతలు మరియు కొబ్బరి ఉత్పత్తులు. వీటితో పాటు అడవి జంతువులను వేటాడుతారు. వీరి ఆహార సేకరణ, ఉత్పత్తి అంతా అండమాన్‌లోని ఓంగే (Onge) తెగ ప్రజలకు దగ్గరగా ఉంటుంది. వీరు అంతరించిపోయే దశలో ఉన్నందున వీరి జనాభా కూడా చాలా తక్కువగానే వృద్ధి చెందుతుంది. రాతి యుగం కాలం దాటి తాము అభివృద్ధి చెందలేదని వీరు బలంగా విశ్వసిస్తారు. లోహాల గురించి పెద్దగా తెలియదు. వ్యవసాయం రాదు. కానీ 1974లో National Geographic Society వారు జారవిడిచిన అల్యూమినియం తో చేసిన కొన్ని వస్తువులను మొదటిసారి వీరు తీసుకొని ఆయుధాలు చేసుకున్నారని అంటారు

ఆచారాలు, భాష ఏంటి?

నలుపు రంగులో ఉండి ఎప్పుడూ నడుముకి మాత్రమే గుడ్డ కట్టుకొని తిరుగుతారు. మహిళలు నడుము, మెడ, తలకు నార దారాలు కట్టుకొని తిరుగుతుంటారు. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకపోవడం వల్ల ఈ తెగలో అక్షరాస్యత శూన్యం. ఈ తెగవారు మాట్లాడే భాష సెంటినెలీస్. 1980లో ఒకసారి వీరిని కలిసిన పరిశోధకులు వారి భాష ఓంగె లాంగ్వేజ్‌కు దగ్గరగా లేదని ఇది ప్రపంచంలో ఎవరికీ తెలిసే అవకాశ లేదని వెల్లడించారు. 2006లో వీరు మత్స్యకారులను చంపి మృతదేహాలను పాతిపెట్టిన విధానంతో వీరు నరమాంస భక్షకులు కాదని పరిశోధకులు తేల్చారు.

అండమాన్‌లో ఉండే ఇతర తెగలేంటి?

ప్రపంచంలో ఏ మూలన చూసినా చాలా ప్రత్యేకతలు కలిగిన ఆదిమ, గిరిజన తెగలుంటాయి. ఇవి భౌగోళికంగా ఏకాంతావాసాల్లో లేదా నాగరిక సమాజానికి దూరంగా అడవులు, దీవుల్లో విశిష్టత కలిగిన సంస్కృతితో బయటి వ్యక్తులను కలవడానికి ఇష్టపడకుండా నివసిస్తూ ఉంటాయి. సాధారణంగా జంతువుల వేట, అటవీ ఉత్పత్తుల వీరి జీవనాధారం. బంగాళాఖాతంలో విసిరేసినట్లుగా ఉండే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో కూడా మొత్తం 5 తెగలు అంతరించిపోయే దశలో ఉన్నాయని ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు తేల్చారు. అవి గ్రేట్ అండమానీస్, జరవాస్, ఓంగేస్, సెంటినెలీస్, షార్నపెన్స్ అనే తెగలు.

ఇప్పటివరకు సెంటినెలీస్ తెగ వారిని ఎవరూ కలవలేదా?

సెంటినెలిస్ తెగవారు తమ ద్వీపంలోకి అడుగుపెడితే, బాణాలతో కొట్టి చంపేస్తారు. గతంలో ఇలా జరిగిన సంఘటనలున్నాయి కూడా.
1896లో ఒకసారి అండమాన్ జైలు నుంచి తప్పించుకున్న ఒక ఖైదీని వెతుక్కుంటూ పోలీసులు పడవల్లో ఈ దీవి చేరారు. ఈ తెగ ప్రజల గురించి అప్పటిదాకా బాహ్య ప్రపంచానికి తెలియకపోవటంతో సాధారణంగా దీవిలో అడుగు పెట్టడంతో పోలీసులపైకి ఒక్కసారిగా బాణాలు రయ్, రయ్ మంటూ దూసుకొచ్చాయి. వారికి ఏం జరుగు తుందో తెలిసే లోగానే వారి శరీరాలను శరపరంపర జల్లెడ చేసేశాయి. ఆ భయానక తెగ ఉనికి గురించి తెలిసింది ఆనాడే.  అప్పటి నుండి ఆ దీవి సమీపానికి మాత్రమే గాదు ఆ దిశగా వెళ్లడానికి ఎవరూ సాహసం చేయలేదు.
ఈ సెంటినల్ తెగ ఉనికి 1974 లో మరోసారి బయటపడింది. ఒక సినిమా బృందం షూటింగ్ నిమిత్తం సెంటినల్ దీవి సమీపంలోకి వెళ్లింది. వారిపై ఒక్కసారిగా బాణాలతో దాడి చేశారు. దీంతో వాళ్లంతా భయంతో పడవలెక్కి వెనక్కి వచ్చేశారు. సినిమా బృందానికి జరిగిన అనుభవం తర్వాత, వారిపై మానవ పరిణామ శాస్త్రవేత్తలు ఇతరులు పరిశోధనలు చేయడానికి ప్రభుత్వం ఒక బృందాన్ని అనుమతించింది. వారిని కూడా తెగ ప్రజలు భయపెట్టడంతో, ఆపై దీవిలోకి ఎవరూ వెళ్లొద్దని ప్రభుత్వం నిషేధం విధించింది.
మన ఇండియన్ ఆంథ్రోపాలజిస్టు త్రిలోక్‌నాథ్ పండిట్ 1967 జనవరిలో ద్వీపంలోకి వెళ్లి, బయటికి రాగలిగాడు అని చెప్పుకుంటారు.

ఆ అనుభవం అయన మాటల్లోనే.. ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ప్రాంతీయ కేంద్రం కు నేను అప్పుడు ఇన్‌చార్జ్‌గా ఉన్నాను. దాదాపు 20 మంది నేవీ, పోలీసులు, అధికారులతో కలిసి ఆ దీవిలోకి వెళ్లాం. అయితే ఎవరూ కన్పించలేదు. పాదాల గుర్తులను పట్టుకొని ఒక కి.మీ. దూరం వెళ్లాక 18 గుడిసెలు, చేపల ఆహారం, అటవీ పండ్లు వంటివి కనిపించాయి. గుడిసెల్లో ఎవరూ లేరు. కానీ అక్కడ 80 – 100 మంది వరకు ఉంటుందని మా అంచనా. వాళ్లు పొదల్లో దాగి ఉండొచ్చు అనుకున్నాం. మమ్మల్ని ఎవరూ చుట్టుముట్టలేదు. అయినా వాళ్లను కలవకుండానే వెనుదిరిగాం. 1970, 80 ల్లో కూడా రెండు మూడు సార్లు ఆ దీవికి వెళ్లాం. అప్పుడు వారు చాలా మంది వచ్చి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించారు. దగ్గరకు రావద్దంటూ వార్నింగ్ ఇచ్చినట్లే ఇస్తూ ఏవో సైగలతో హేళన చేశారని 83 ఏళ్ల పండిట్ ఎకనామిక్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన అనుభవాలను పంచుకున్నారు.

‘క్రైస్తవ మత ప్రచారకుడు జాన్ ని  చంపిన అండమాన్ సెంటనలీస్ ఆదిమజాతి ప్రజలు’

అసలీ … జాన్ ఎవరు?

అండమాన్‌ నికోబార్‌ దీవులను సందర్శించాలి. అక్కడ చూడవల్సింది, చేయవల్సింది ఎంతో ఉంది. – 2015లో ఓ ఇంటర్వ్యూలో జాన్‌ అలెన్ చౌ

జాన్‌ అలెన్ చౌ

అమెరికాకు చెందిన క్రైస్తవ మిషనరీ, మత బోధకుడు జాన్ అలెన్ చౌ.. ఆ ద్వీపంలోని వాళ్లను కలిసి, వారిని తన మతంలోకి మార్చాలని అనుకున్నాడు. హైస్కూల్ రోజుల నుంచే అతనికి ఈ కోరిక ఉండేదని ‘కోవెనెంట్‌ జర్నీ’ సంస్థ ఛైర్మన్‌ మ్యాట్‌ స్టేవర్‌ తెలిపారు. ఈ దీవిపై ‘నిషిద్ధ ప్రాంత అనుమతి’ (ఆర్‌ఏపీ)ని ఈ ఏడాది ఉపసంహరించినప్పటికీ అధికారుల నుంచి విదేశీయులు అనుమతి తీసుకోవాల్సి ఉండగా జాన్ అనుమతి తీసుకోకుండానే అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డాడు. సెంటినెలిస్ తెగ బాణాలకు బలైన అమెరికా పర్యాటకుడు జాన్‌ అలెన్‌ గురించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

మత్స్యకారుల కథనం..

దీవిలోకి వెళ్లడానికి జాన్ నవంబర్ 14న విఫలయత్నం చేశాడు. 15వ తేదీ మత్స్యకారులకు 25 వేల రూపాయలు చెల్లించి మళ్లీ పయనమయ్యాడు. వారు జాన్‌ను చిదియాతాపు ప్రాంతం నుంచి వారి పడవలో సెంటినెల్‌ దీవి సమీపం వరకు తీసుకెళ్లారు. మత్స్యకారులకు ఆ ద్వీపంలోకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి వారు పడవ దిగకుండా వెనుదిరిగారు. అక్కడి నుంచి మడతపెట్టే వీలున్న ఒక చిన్న పడవలో తెల్లవారు జామున 4.30 సమయంలో జాన్‌ ఆ దీవి తీరానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో దూరం నుంచే ఈ విషయాన్ని గమనించిన మత్య్సకారుల కథనం ఇలా ఉంది. ‘జాన్ దీవిలో దిగి దిగగానే ఆదిమ వాసులకు ఫుట్‌బాల్‌, ప్లేయింగ్‌ రింగ్‌, చేపలు, కత్తెర, వైద్య కిట్‌ వంటివి ఇవ్వబోయారు. ఈ లోగా ఓ వ్యక్తి ఆయనపై బాణంతో దాడి చేశాడు. వెంటనే అతనిపై బాణాలు వర్షం కురిసింది. అయినప్పటికీ ఆయన అలానే కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలారు. 17న ఉదయం 6.30 సమయంలో కొందరు ఆటవికులు జాన్‌ మృతదేహాన్ని ఈడ్చుకొచ్చి, తీరం వద్ద సగం మేర ఇసుకలో పూడ్చిపెట్టడాన్ని తాము చూశామని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే జాన్‌ను రెండు రోజులు బందీగా ఉంచుకొన్నట్లు తెలుస్తోంది. మరుసటి రోజు చూసినప్పుడు కూడా జాన్‌ మృతదేహం అక్కడే ఉందన్నారు. పోర్ట్‌బ్లెయిర్‌కు తిరిగొచ్చిన మత్య్సకారులు ఈ ఘటనను జాన్‌ మిత్రుడైన స్థానిక మతబోధకుడు అలెక్స్ కు తెలపగా ఆయన అమెరికాలోని జాన్‌ కుటుంబానికి ఈ విషయాన్ని తెలియజేశారు.

మరో కథనం ఇది

ఇంకో కథనం ప్రకారం జాన్‌ నవంబర్ 14న ఉత్తర సెంటినెల్‌ దీవికి వెళ్లారు. ‘‘నా పేరు జాన్‌. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. ఏసు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇవిగో మీకు చేపలు తెచ్చా’’ అని అరిచారు. వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ఆ తెగవారు ఆగ్రహం చెంది, దాడికి ప్రయత్నించడంతో ఎలాగోలా తప్పించుకొచ్చినట్లు ఆ రోజు రాత్రి జాన్ తన సాహసాల గురించి కాగితాలపై రాశారు. 16న జాన్‌ మరోసారి దీవి వద్దకు వచ్చి ఆదిమవాసుల చేతిలో ప్రాణాలు కోల్పోయినట్లు ఈ కథనం వినిపిస్తుంది.

జాన్ చివరి సందేశం

జాన్ అండమాన్‌, నికోబార్‌ దీవులకు వెళ్లడానికి ముందు నవంబర్ 16న తన కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో చివరి సందేశాన్ని పెట్టాడు. ‘మీ అందరికీ నేను పిచ్చివాడినని అనిపించొచ్చు. కానీ అండమాన్‌లోని సెంటినెలీస్‌ తెగకు చెందినవారికి జీసస్‌ గురించి బోధించడానికి ఇదే సరైన సమయం. దేవుడా.. నాకు చనిపోవాలని లేదు. ‘‘ఒకవేళ వారు నన్ను చంపేస్తే వారి మీద కోపగించుకోవద్దు’’. అని పోస్ట్ లో పేర్కొన్నాడు.
మరోవైపు జాన్ కుటుంబం కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ పెట్టింది. జాన్‌ క్రైస్తవ బోధకుడు, మారుమూల ప్రాంతాల్లో వైద్యసాయం అందించే సహాయకుడు, అంతర్జాతీయ సాకర్‌ కోచ్‌, పర్వతారోహకుడు కూడా. సెంటినెలీస్‌ తెగవారిపై ప్రేమ తప్పించి వేరే భావమేదీ అతడికి లేదు. జాన్‌ను చంపినవారిని క్షమిస్తున్నాం. జాన్‌కు సాయపడ్డ మత్స్యకారులను విడిచిపెట్టాలని కోరింది.

కేసు నిలుస్తుందా..

అంతకుముందే ఐదు సార్లు అండమాన్‌, నికోబార్‌ దీవులను సందర్శించిన జాన్ నవంబర్ 14న విఫలయత్నం చేశాడని అండమాన్‌ డీజీపీ దీపేంద్ర పాఠక్‌ చెప్పారు. పోర్ట్‌బ్లెయిర్ లోని హంఫ్రీగంజ్‌ పోలీసు స్టేషన్‌లో ఈ ఘటనలో గుర్తు తెలియని సెంటినెల్‌ దీవి వాసులు నిందితులుగా హత్య కేసు నమోదైంది. చెన్నైలోని అమెరికా కాన్సులేట్ ఆఫీసు కూడా దీనిపై ఓ కేసు పెట్టింది. అయితే వీరి ప్రాసిక్యూషన్‌కు అవకాశం లేదన్న వాదన ఉంది. మరోవైపు జాన్‌ను దీవి వరకూ తీసుకెళ్లిన ఏడుగురు మత్స్యకారులను పోలీసులు అరెస్టు చేశారు. జాన్‌ మిత్రుడు అలెక్స్‌ ను ప్రశ్నించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు తీరరక్షక దళం, గిరిజన సంక్షేమ, అటవీ శాఖల సిబ్బందితో కూడిన బృందం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ దొరకలేదు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ, అండమాన్‌, నికోబార్‌ పాలనా యంత్రాంగం నుంచి జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ (ఎస్టీ కమిషన్‌) నివేదికలను కోరింది.

2006 లోనే అనుభవమైందిగా..

2006లో ఇద్దరు మత్య్సకారులు ఉత్తర సెంటినెలీస్ దీవికి సమీపంలో పడవకు లంగరు వేసి నిద్రపోయారు. లంగరు ఊడిపోవడంతో ఆ పడవ దీవి తీరానికి కొట్టుకుపోయింది. అక్కడే వారు మత్య్సకారులను చంపేశారు. ఇసుకలో పాతి పెట్టారు. వీరి వద్ద విల్లంబులుంటాయి. దగ్గరికి రావడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తారు.

2006లో ఇద్దరు మత్య్సకారుల మృతదేహాలను వెలికి తీయడానికి వెళ్లిన కోస్ట్‌గార్డ్ కమాండెంట్ ప్రవీణ్ గౌర్ అప్పటి తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ‘‘వారు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉన్నారు. బాణాలతో మా హెలికాప్టర్ పై దాడి చేశారు. వారి నుంచి తృటిలో తప్పించుకున్నాం. ఏమైనా జరగని అని హెలికాప్టర్ ను దించి మృతదేహాలను వెతకాలని చూశాం. మేము కిందకు దిగేకొద్దీ వారు బాణాలతో విరుచుకుపడ్డారు. బాణాలు దాదాపు 100 మీటర్ల పై వరకు వస్తున్నాయి. వారి దృష్టి మరల్చితే కానీ సాధ్యం కాదు అని అర్థమైంది. హెలికాప్టర్ ను 1.5 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాం. వారూ మమ్మల్ని వెంబడించారు. మేము తిరిగి వేగంగా బోటు వద్దకు చేరుకున్నాం. అప్పటికీ వారు రాలేకపోయారు కాబట్టి దిగి ఒక మృతదేహాన్ని తీసుకురాగలిగాం. అంతలోపే వారు రావడంతో వెనుదిరగాల్సి వచ్చింది. వారు ఒకసారి చేసిన తప్పును మళ్లీ చేయరు. ఈ సారి ఒక గ్రూప్ బోటు దగ్గర ఉంది. మరో గ్రూప్ మమ్మల్ని వెంటాడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెనుదిరిగాం అని ప్రవీణ్ గౌర్ తెలిపారు. ఈ సంఘటనతో పాటు సముంద్రంలో మరో ఇద్దరు మత్స్యకారులను కాపాడినందుకు గాను ప్రవీణ్ కు 2006లో తాత్రక్షక్ అవార్డు వచ్చింది.

అండమాన్ ఆదిమానవుల గురించి భయంకర నిజాలు

Rs 500 Note: శ్రీరాముడు, అయోధ్య ఆలయం చిత్రాలతో కొత్త రూ.500 నోట్లు!?

New 500 Rupees Note Goes Viral: ఈ నెల 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం & శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట సందర్భంగా, బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త 500 రూపాయల నోట్లను విడుదల చేయబోతోందా?.
సోషల్ మీడియాలో ఈ విషయం ఇప్పుడు విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

రూ. 500 నోట్ల కొత్త సిరీస్ను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేస్తుందని సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక పోస్ట్లో ఉంది. కొత్త రూ.500 నోటు చిత్రాన్ని కూడా పోస్ట్ చేశారు. నోటు ముందువైపు.. ధగధగలాడే కిరీటం, ఆభరణాలు ధరించి, చేతిలో విల్లు పట్టుకుని, భుజాన అంబుల పొదితో ఉన్న శ్రీరాముడి బస్ట్ సైజ్ ఫొటో ఉంది. నోటు వెనుకవైపు… అయోధ్య రామాలయం ఫొటో ఉంది. నోటుపై తెల్లగా ఉండే ప్రాంతంలో ఎక్కుపెట్టిన విల్లు ఫొటో ఉంది. ఈ నోటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ. 500 నోటు ముందు భాగంలో జాతి పిత మహాత్మాగాంధీ బొమ్మ, వెనుక వైపు ఎర్రకోట చిత్రాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూ. 500 నోటుపై… మహాత్ముడి బొమ్మ స్థానంలో శ్రీ రాముడి చిత్రం, ఎర్రకోట స్థానంలో అయోధ్య రామ మందిరం వచ్చి చేరాయి.
RBI కొత్త సిరీస్ నోట్లను జారీ చేస్తోందా?
కొత్త రూ.500 నోటు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై ఇంకా స్పందించలేదు. శ్రీరాముడి చిత్రం ఉన్న కొత్త సిరీస్ రూ.500 నోట్లను విడుదల చేయడంపై ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే, రిజర్వ్ బ్యాంక్ వర్గాలు అనధికారికంగా చెప్పిన సమాచారం ప్రకారం, శ్రీరాముుడు, అయోధ్య రామాలయంతో వైరల్ అవుతున్న రూ. 500 నోటు నకిలీది.

బ్యాంకింగ్ రంగ నిపుణుడు, వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్వని రాణా చెప్పిన ప్రకారం, శ్రీరాముడి బొమ్మతో కూడిన కొత్త సిరీస్ రూ.500 నోట్లను రిజర్వ్ బ్యాంక్ తీసుకురావడం లేదు. రిజర్వ్ బ్యాంక్ దీనిపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. కాబట్టి, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కొత్త 500 రూపాయల నోట్లు విడుదల చేస్తారన్నది అబద్ధపు ప్రచారం. అలాంటి నోట్లను రిజర్వ్ బ్యాంక్ ముద్రించలేదు.
గతంలోనూ ఇలాంటి ఫేక్ న్యూస్
జాతి పిత మహాత్మాగాంధీ స్థానంలో వేరే చిత్రాలతో కొత్త రూ. 500 నోట్లను ఆర్బీఐ తీసుకొస్తుందని ప్రచారం జరగడం ఇదే మొదటిసారి కాదు. ప్రస్తుత కరెన్సీ లేదా బ్యాంకు నోట్లలో మహాత్మాగాంధీ ఫొటో స్థానంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మిస్సైల్ మ్యాన్ & మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రించి, కొత్త సిరీస్ నోట్లను చెలామణీలోకి తీసుకురావాలన్న అంశాన్ని RBI పరిశీలిస్తున్నట్లు 2022 జూన్లోనూ సోషల్ మీడియా పోస్ట్లు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత, అవన్నీ పుకార్లేనని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ సిరీస్ను మార్చే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ఆర్బీఐ తెలిపింది.

Republic day sale: కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 15వేలలోనే బెస్ట్‌ ఫోన్స్‌

రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్ డే సేల్‌ పేరుతో ఆఫర్లను అందిస్తోంది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ సేల్‌ 18వ తేదీ వరకు కొనసాగనుంది.
సేల్‌లో భాగంగా కొన్ని ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 15,000 లోపు లభిస్తున్న కొన్ని బెస్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి.

ఐకూ జెడ్‌6 లైట్‌ 5జీ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 19,999కాగా సేల్‌ భాగంగా రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.58 ఇంచెస్‌తో కూడిన 120Hz IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ 4 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరా, 8 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఐకూ జెడ్‌7ఎస్‌ 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 23,999కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 14,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.38 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే 64 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇక ఈ సేల్‌లో భాగంగా రూ. 15 వేల లోపు లభిస్తున్న మరో బెస్ట్ స్మార్ట్‌ ఫోన్‌ రియల్‌మీ నార్జో 60 ఎక్స్‌ 5జీ ఫోన్‌. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 17,999కాగా సేల్‌లో భాగంగా రూ. 12,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ కెమెరాను అందించారు. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇక సేల్‌లో భాగంగా రూ. 15 వేలలో లభిస్తున్న మరో స్మార్ట్ ఫోన్‌ రియల్‌ మీ12 5జీ ఫోన్‌. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 17,999కాగా సేల్‌లో భాగంగా రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఎమెరా విషయానికొస్తే 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరా, సెల్ఫీల కోసం 8 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

Benefits of Garlic: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే జిమ్ చేసినట్లే..! మరింత యంగ్‌గా ఉంటారు

అల్లం, వెల్లుల్లి అందరికీ తెలిసిందే.. ఎందుకంటే.. ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే మసాలా ఇది.. ఏ వంటకైనా సరే..అల్లంవెల్లుల్లి మిశ్రమం వేశాకే దాని రుచి రెట్టింపు అవుతుంది..
అయితే, కొందరు మాత్రం వెల్లుల్లిని ఇష్టంతో తింటారు.. మరికొందరికి దాని వాసన కూడా నచ్చదు.. కానీ మన ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మీరు అనేక ప్రమాదకరమైన వ్యాధుల నుండి బయటపడవచ్చునని చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాం.

ప్రస్తుతం మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చి వెల్లుల్లిని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి పనిచేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మధుమేహాన్ని నయం చేస్తుంది. అంతేకాదు.. వెల్లుల్లి మీ బరువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం ఉంటుంది. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.

అలాగే, మీరు ఒత్తిడితో బాధపడుతుంటే వెల్లుల్లి తినడం ప్రారంభించండి. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల మనస్సు సమతుల్యం అవుతుంది. డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది. పచ్చి వెల్లుల్లి తినటం వల్ల గుండెకు మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో బ్లడ్‌ క్లాట్స్‌ వంటివి ఏర్పడకుండా ఉంటుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది.

శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Schools Holidays : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగింపు

ఏపీలో సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు సెలవులు మరో మూడు పొడిగించినట్లు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా ఆదేశాలతో ఈ నెల 22న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

????2 రోజులు compensate Working చేయాలని ఉత్తర్వులు..

NIDHI App- AP State Govt App – Nidhi Pay slip App for AP Employees

NIDHI App State Govt App- NIDHI App NIDHI App Pay Slip Andhra Pradesh state government employees can get his/her information.

NIDHI App State Govt App
User-friendly app designed for all Andhra Pradesh state government employees. This app has a provision that, an employee can get his/her information through the services designed as per employee data.At present services provided like, Payslip, APGLI, Employee services.Employee can view payslip and they can download the payslip.Employee can check APGLI Fresh/enhanced policy status, loan status and refund status.Employee can view the profile.

NIDHI Pay Slip App Download Latest Version Features:

▪️ Personal Information
▪️ Pay Slips
▪️ Bank Details
▪️ Spouse Name
▪️ School Address
▪️ APGLI
▪️ PF
▪️ PRAN/ CPS వివరాలు పొందవచ్చు
▪️ Paermanent /Communication Address
▪️ 01.01.2022 నుండి Pay Slips పొందవచ్చు
▪️ Bank Account No మార్చుకునే సదుపాయం కలదు
▪️ELs

How To login Nidhi App

యూజర్ ఐడి గా మీ CFMS ID ని ఎంటర్ చేసి డిఫాల్ట్ పాస్వర్డ్ అయిన cfss@123 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓటిపి వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి యాప్ ని మనం వినియోగించుకోవచ్చు.

Download NIDHI Latest version App

January Month Learn A word – list of words

January Month Learn A word – list of words

 

Lesson Plans for 1st class to 10th class for AP school teachers

AP school Lesson plans 1st class 2nd class ,3rd class 4th class ,5th class, 6th class, 7th class, 8th class, 9th class, 10th class All subjects lesson plans download here…

1st class

Telugu Lesson plans Download

English Lesson plans Download

Maths Lesson plans Download

2nd Class 

Telugu Lesson plans Download

English Lesson plans Download

Maths Lesson plans Download

3rd Class

Telugu Lesson plans Download

English Lesson plans Download

Maths Lesson plans Download

 

4th Class 

 

1st to 10th class LESSON PLANS DOWNLOAD …

AP Primary and High School Telugu, English, Hindi ,Maths, Science and Social Lesson Plans Download pdf AP Telugu, English, Hindi ,Maths, Science and Social Subject 1st Class, 2nd Class, 3rd Class, 4th Class, 5th Class,  6th Class, 7th class, 8th Class, 9th Class, 10th Class Lesson Plans 2023-24 for AP Syllabus download pdf class-6-Telugu, English, Hindi ,Maths, Science and Social-lesson-plans-class-7-Telugu, English, Hindi ,Maths, Science and Social-lesson-plans-class-8-Telugu, English, Hindi ,Maths, Science and Social-lesson-plans-class-9-Telugu, English, Hindi ,Maths, Science and Social-lesson-plans-class-10-Telugu, English, Hindi ,Maths, Science and Social-lesson-plans-download

Download… 1st to 10th class lesson plans 

APSCERT Official Digital Lesson Plans -SCERT AP Teacher Resource Books PDF Download

APSCERT Official Digital Lesson Plans -SCERT AP Teacher Resource Books PDF Download
APSCERT Official Lesson Plans -APSCERT Teacher Resource Books PDF Download. AP SCERT has officially released the Lesson Plans and Teacher Resource Material for making the Teaching Learning Process easier.

The “APSCERT Official Lessons” / “Teacher Resource Book’ contains all the pedagogical techniques and suggested plans to bring ease and innovation to the professional life of the teachers in Andhra Pradesh who strive hard to make the vision and reforms of the Department into reality, impacting the lives of lakhs of children across the state.

It is based on evidence-based practices organized in an easy to read format, that will surely benefit the teachers and bring contemporary pedagogical practices and ease some of the burden of teachers across the state. We welcome the teachers’ feedback and hope everyone enjoys implementing the activities in this resource book, as much as we enjoyed creating and designing them.

 

GUIDELINES ON HOW TO USE TEACHER RESOURCE BOOK

PEDAGOGICAL PRACTICES: At the start of the Academic year, Teachers can use the TCM (Teachers Competency Matrix) and self-evaluate themselves across different domains. They can prioritise a few teacher competencies they would like to focus on and work on them. For every 1 month, teachers can come back to the TCM, see where they have progressed on the prioritised teacher competency, and practice on new competencies.

SELF-EVALUATION QUESTIONNAIRE is a self-reflective questionnaire based on the TCM helping teachers to question themselves on their existing practices and thereby motivating them for their professional growth.

GUIDELINES ON HOW TO CREATE LESSON PLANS provide guidance to teachers on the different aspects of the lesson plan template. There is also a detailed mention of different strategies and how they can be modeledin the classroom.

MODEL LESSON PLANS are provided for a chapter. Synopsis provides an overview of the topics and key aspects of the chapter. Teachers can go through the synopsis before going through the textbook content in the chapter. Period plans are provided keeping a broader Teaching Learning Process. Teachers can go through the suggested activities and teacher references mentioned in the plans and make a detailed one as per the needs of their classroom. Components in the plan are also mapped with TCM to show the practical application of TCM behaviours.

ANNUAL TRACKER is meant for teachers to get a bird’s eye perspective on different subjects they are teaching. At the start of the Academic year, teachers can plan for the whole year by allotting chapter names across all the months. They can come back to this tracker every month, and tick the chapters which were finished. This planner will help teachers to organise chapters based on priority.

MONTHLY TRACKER will help teachers to plan for the entire month. Teachers can write the Sub-topics and Objectives to be covered in a given month for the chapters that will be covered in the month.

PEDAGOGICAL PRACTICES TEACHER COMPETENCY MATRIX

1. Understanding of learners and creation of conducive classroom culture
2. Policy, curriculum, and content knowledge
3. Quality Teaching Learning Process
A.Classroom Teaching: Planning and Facilitation
B.Managing multigrade and multilevel (Differentiated) learning
C.Integrating 21st Century Skills
D.Assessing and evaluating learning
4. English Proficiency
5. Social, Emotional and Ethical Learning (SEEL)
6. Collaboration with Students, Colleagues and Parent Community
7. Professional Developmet

APSCERT  3rd Class Digital Lesson Plans Teacher Resource Books

APSCERT  5th Class Digital Lesson Plans Teacher Resource Books

APSCERT  8th Class Digital Lesson Plans Teacher Resource Books

Guidelines on Teacher Resource Book

Manabadi Nadu Nedu STMS Latest App Nadu Nedu Latest App

MANA BADI NADU NEDU STMS Android APP Latest Version Download Mana Badi – Nadu Nedu is to strengthen the infrastructure and transform the existing infrastructure of the schools in the mission mode in a phased manner over a period of three years, starting from 2019-20. Under Mana Badi – Nadu Nedu program, following 9 infrastructure components have been taken up. (I) Toilets with running water (ii) ) Drinking water supply (iii) Major and minor repairs (iv) Electrification with fans and tube lights (v) Furniture for students and staff (vi) Green chalk boards (vii) Painting to schools (viii) English labs and (ix) Compound walls.

MANA BADI NADU NEDU STMS Android APP Latest Version Download APK. Download MANA BADI NADU NEDU Latest Version Mobile APK APP. This STMS NADU NEDU APP is very useful for All the Head Masters of Nadu Nedu for Uploading the Bills. Use Always the Latest Updated Version of NADU-NEDU APP.

Download…. Mana Badi Nadu Nedu Latest App 

School Attendance App latest Updated version Download | Teachers Students Attendance latest updated App

SIMS-AP School Attendance APP latest Updated version Download | Teachers Students N Attendance latest updated APP

AP School Education Department has developed an Attendance APP based on Artificial Intelligence. This AI Based School Attendance app is named as SIMS AP. School Integrated Management System APP for All Schools in Andhra Pradesh. This SIMS AP New Students Attendance APP not only captures Teachers Attendance, But also capable of capturing Students attendance, Manage Leaves of Teachers, Teachers can Apply for Leaves using this SIMS School Attendance APP. Details of this APP and How to use this APP, Features of this Android School Attendance APP, How to Download / Install the Latest Official Version of SIMS AP AI Based Attendance APP is explained below.

Download….AP School Attendance APP 

IBPS calendar : క్లర్క్​, పీఓ పరీక్షల తేదీలను ప్రకటించిన ఐబీపీఎస్​- ఎగ్జామ్​ క్యాలెండర్​ ఇదే

IBPS calendar 2024 : 2024 ఏడాదిలో నిర్వహించే వివిధ పరీక్షలకు సంబంధించిన టెంటెటివ్​ (తాత్కాలిక) క్యాలెండర్​ని విడుదల చేసింది ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్​ పర్సనల్​ సెలక్షన్​ (ఐబీపీఎస్​).

అభ్యర్థులు ibps.in వెబ్​సైట్​లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఐబీపీఎస్ ఆర్ఆర్​బీ క్లర్క్, ఆర్ఆర్​బీ పీవో) ఆఫీస్ అసిస్టెంట్స్, ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమినరీ పరీక్షను 2024 ఆగస్టు 3, 5, 10, 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఆఫీసర్స్ స్కేల్ 2, 3లకు ఒకే పరీక్షతో పాటు, ఆఫీసర్స్ స్కేల్ 1 మెయిన్ పరీక్షను సెప్టెంబర్ 29న నిర్వహించనున్నారు. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అక్టోబర్ 6న మెయిన్ పరీక్ష జరగనుంది.

IBPS Clerk exam date :

ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్ 19, 20 తేదీల్లో, మెయిన్ పరీక్షను నవంబర్ 30న నిర్వహించే అవకాశం ఉంది. ఐబీపీఎస్ ఎస్​వో ప్రిలిమ్స్ పరీక్ష.. సెప్టెంబర్ 9న, మెయిన్ పరీక్ష డిసెంబర్ 14న జరగనుంది.

ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షను ఆగస్టు 24, 25, 31 తేదీల్లో, మెయిన్ పరీక్షను అక్టోబర్ 13న నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్​ని రానున్న రోజుల్లో ibps.in వెబ్​సైట్​లో విడుదల చేయనున్నారు.

IBPS PO exam date latest news :

ఆన్​లైన్​ విధానంలో మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలకు ఒకే రిజిస్ట్రేషన్ ఉంటుందని ఐబీపీఎస్​ తెలిపింది.

పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఇవి:

దరఖాస్తుదారుని ఫోటో ( .jpeg ఫైల్) – దరఖాస్తుదారుడి సంతకం (10 కేబీనుంచి 20 కేబీ)
దరఖాస్తుదారుని వేలిముద్ర ( .jpeg ఫైల్ లో- 20 కేబీ నుంచి 50 కేబీ మధ్యలో ఉండాలి)
చేతిరాత డిక్లరేషన్ స్కాన్ కాపీ (- .jpeg ఫైల్ లో 50 కేబీ నుంచి 100 కేబీ మధ్యలో ఉండాలి).
అయితే.. ఇది టెంటెటివ్​ క్యాలెండర్​ మాత్రమే. భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తితే, వీటిని మార్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి.

సెంట్రల్ బ్యాంక్​లో జాబ్స్..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 484 సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్ మరియు/లేదా సబ్-స్టాఫ్ పోస్టుల కోసం అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 9. అర్హత 8వ తరగతి పాస్ మాత్రమే. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ centralbankofindia.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఉసిరితో ఇలా చేస్తే.. కళ్ళజోడు అవసరం లేదు..!!

ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కళ్ళజోడుచాలా కామన్ అయిపోయింది.దీనికి కారణం వారు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం,జంక్ ఫుడ్ అలవాటు పడడం,టీవీ మొబైల్ వంటి బ్లూ స్క్రీన్ కలిగిన ఎక్కువగా చూడటం వల్ల వారి ఇంటి చూపు తగ్గిపోతూ ఉంది.కానీ ఇది ఇలాగే కొనసాగితే మాత్రం పూర్తిగా కంటి చూపుని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.ఇలా కంటి చూపు మందగించిన వారికి సైతం తిరిగి కంటిచూపులు పొందేలా కొన్ని రకాల ఆయుర్వేద సుగుణాలు కలిగిన పదార్థాలు చాలా బాగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మరి అవి ఏంటో మనము తెలుసుకుందాం పదండి..
చలికాలం వచ్చిందంటే చాలు ఉసిరికాయలు చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి కదా.ఈ ఉసిరికాయలే కంటికి ఔషధమని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.ఈ చిట్కా కోసం అర కేజీ ఉసిరికాయలను తీసుకొని బాగా ఎండబెట్టుకోవాలి.ఇలా ఎండబెట్టిన ఉసిరికాయలను పొడి చేసి,అర స్పూన్ మోతాదులో రోజు తేనెను కానీ,ఆవు నెయ్యిని కానీ జోడించి పరగడుపుని తీసుకోవాలి.ఇలా 45 నుంచి 60 రోజులు వరకు తీసుకోవడంతో కంటి చూపు క్రమంగా మెరుగుపడుతుంది.అంతే కాక ఉసిరికాయలో ఉన్న విటమిన్ సి మరియు విటమిన్ ఏ రోగ నిరోధక శక్తిని పెంచడంతో,దగ్గు,జలుబు,జ్వరం వంటి సీజనల్ రోగాలను దరి చేరకుండా కాపాడుతుంది.

ఉసిరికాయను పోషకాలకు తల్లి వంటిది అని చెబుతూ ఉంటారు కదా.అలాంటి ఉసిరికాయను తరచూ తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలను శుద్ధపరచి ధమనులు,సిరలలోని రక్తం పంపింగ్ చాలా బాగా జరుగుతుంది.దీనితో గుండె ఆరోగ్యం మెరుగుపడి గుండె సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.మరియు రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ హెచ్చుతగ్గులు కాకుండా క్రమబద్దీకరించి, మధుమేహం బారిన పడకుండా కూడా కాపాడుతుంది.మరియు జుట్టు ఆరోగ్యానికి మంచి ఔషదమని చెప్పవచ్చు.కావున ప్రతి ఒక్కరూ ఉసిరికాయను ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా ఉత్తమం.మరి ముఖ్యంగా కళ్ళ సమస్యలు ఉన్నవారు అద్భుతమైన చూపు కోసం,కచ్చితంగా ఈ చిట్కా పాటించి చూడండి.

Betavolt: వావ్.. కొత్త బ్యాటరీ..50 ఏళ్లకు సరిపడా చార్జింగ్! ఇక చార్జర్ల అవసరం లేనట్టేనా?

పునర్వినియోగ బ్యాటరీలకు చార్జింగ్ తప్పదు. కానీ 50 ఏళ్లకు సరిపడా విద్యుత్ అందించే బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఇక చార్జర్ల అవసరమే ఉండదు.

చైనాకు (China) చెందిన స్టార్టప్ కంపెనీ ‘బీటావోల్ట్’ (Betavolt) సరిగ్గా ఇలాంటి ఆవిష్కరణతోనే ముందుకొచ్చింది. అణుధార్మికత ఆధారంగా నడిచే అతి చిన్న న్యూక్లియర్ బ్యాటరీని (Nuclear battery with 50 year life) రూపొందించింది. కేవలం 63 ఐసోటోపులను ఓ చిన్న మాడ్యూల్‌గా కూర్చి దీన్ని రూపొందించింది. ప్రపంచంలో అణుశక్తితో నడిచే అతి చిన్న బ్యాటరీ ఇదేనని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఈ బ్యాటరీపై ప్రయోగాలు జరుగుతున్నాయని, త్వరలో వాణిజ్య అవసరాలకు సరిపడా భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని బీటా వోల్ట్ చెప్పుకొచ్చింది.

అతి చిన్న బ్యాటరీ..

ఈ బ్యాటరీలో సైజు కేవలం 15 x 15 x 15 మిల్లీమీటర్లు. ఇందులో న్యూక్లియర్ ఐసోటోపులను సన్నని పొరలుగా అమర్చారు. ఐ ఈ బ్యాటరీ 3 వోల్టుల వద్ద 100 మైక్రోవాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, బ్యాటరీ సామర్థ్యాన్ని 2025 కల్లా 1 వాట్ తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ పేర్కొంది.

ఈ బ్యాటరీని ఎయిరోస్పేస్, ఏఐ ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్, మైక్రోప్రాసెసర్లు, అడ్వాన్స్డ్ సెన్సర్లు, చిన్న డ్రోన్లు, మైక్రో రోబోట్స్‌లో శక్తి వనరుగా వినియోగించుకోవచ్చు. ఈ బ్యాటరీ విడుదల చేసే రేడియోధార్మికతతో ఎటువంటి అనారోగ్యం కలగదని, ఫలితంగా పేస్‌మేకర్లలో కూడా దీన్ని వాడుకోవచ్చని సంస్థ చెబుతోంది.

బ్యాటరీ పనిచేసేది ఇలా..

బ్యాటరీలోని ఐసోటోపులు రేడియోధార్మిక క్షీణతకు గురై శక్తిని విడుదల చేస్తాయి. ఈ శక్తి చివరగా విద్యుత్‌గా మారుతుంది. బ్యాటరీలోని ఐసోటోపులను వివిధ పొరలుగా అమర్చడంతో అగ్నిప్రమాదం కూడా ఉండవని బీటావోల్ట్ చెబుతోంది. మైనస్ 60 డిగ్రీల నుంచి 120 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా తాము రూపొందించిన బ్యాటరీ పనిచేస్తుందని వెల్లడించింది.

Chanakya Niti Telugu : మహిళల్లో ఉండే ఈ చెడు లక్షణాలతో జీవితంలో ఇబ్బందులు

స్త్రీ ని శక్తితో పోలుస్తారు. కుటుంబాన్ని నిర్మించే శక్తి మహిళలకు ఉంది. అలాగే స్త్రీ మనసు పెడితే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి కూడా ఉంటుంది.
సమాజంలో మహిళలకు గౌరవ స్థానం ఉంది. చాణక్యుడి ప్రకారం స్త్రీలలో కొన్ని లక్షణాలు ఉంటే జీవితం బంగారుమయం అవుతుంది. అదేవిధంగా ఆమెలోని కొన్ని లక్షణాలు జీవితాన్ని నాశనం చేస్తాయని చాణక్యుడు తెలిపాడు. చాణక్యుడి ప్రకారం స్త్రీలకు ఉండకూడని లక్షణాలు ఏంటో చూద్దాం..

చాణక్య నీతి ప్రకారం స్త్రీలు పురుషుల కంటే అత్యాశ ఎక్కువ ఉంటుందని చాణక్యుడు తెలిపాడు. అది డబ్బు, నగలు, బట్టలు మొదలైనవి విషయాల్లో అయి ఉంటుంది. మనిషికి కోరిక ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. అది ఎప్పటికైనా డేంజర్. అతిగా అత్యాశతో ఉంటే మోక్షానికి అవకాశం లేదని చాణక్యుడు చెప్పాడు. దీనితో అనేక సమస్యలు వస్తాయి. జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
చాణక్యుడు ప్రకారం మహిళలు ఏదైనా పని చేసేటప్పుడు ఎక్కువగా ఆలోచించరు. ప్రతి పని చేసేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయాలి. కొంచెం తడబడినా ప్రమాదంలో పడతారు. ఆలోచన లేకుండా చేసే పనులు విజయాన్ని ఇవ్వలేవు. ఆలోచిస్తేనే సరైనా అడుగులు పడతాయి. ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఆలోచన లేకుండా ముందుకు వెళ్తే సమస్యలు కచ్చితంగా వస్తాయి. వాటిని ఎదుర్కొనేందుకైనా సరిగా ముందుగు సాగాలి.

స్త్రీలలో కొందరు చాలా స్వార్థపరులు. మహిళలు తమ పనిని పూర్తి చేయడం కోసం దేనికైనా సిద్ధపడతారు. ఈ గుణం కొందరికి ఉంటుంది. స్త్రీలు ఈ లక్షణాలను విడిచిపెట్టాలని చాణక్యుడు చెప్పాడు. జీవితంలో కొన్ని విషయాలు జరిగితే జరుగుతాయి.. లేదంటే లేదు. దానికోసం కొన్ని కోల్పోవలసిన అవసరం లేదు. అలా చేస్తే మిమ్మల్ని చూసి ఇతరులు చెడుగా మాట్లాడే అవకాశం ఉంది.
చాణక్య నీతి ప్రకారం స్త్రీలకు ధైర్యం మంచిదే కానీ మితిమీరిన ధైర్యం మంచిది కాదు. మీ ఈ మితిమీరిన ధైర్యసాహసాలు మీకు ఏదో ఒక రోజు కష్టాల్లో పడేస్తాయి అని చాణక్యుడు చెప్పాడు. ఏం కాదులే అని కొన్నిసార్లు ముందుకు వెళ్లితే సమస్యలు తప్పవు. ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి. మితిమీరిన ధైర్యం పురుషులకు కూడా మంచిది కాదు. ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటే చాలు.
కొందరు స్త్రీలకు అబద్ధం చెప్పే అలవాటు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్పే అబద్ధాలే వాళ్ళని కష్టాల్లో పడేస్తాయి. స్త్రీలు అలాంటి గుణాలను వదిలేయాలని చాణక్యుడు తెలిపాడు. ఈ గుణాలు స్త్రీలకు అందాన్ని తీసుకురావని వివరించాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పరిపూర్ణంగా ఉండలేడు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. స్త్రీలు కూడా ఈ లక్షణాలలో కొన్నింటిని మార్చుకోవాలి అని చాణక్యుడు వెల్లడించాడు.

Late Breakfast : ఆ టైంలోపు టిఫిన్ చేయకపోతే డేంజరే.? అధ్యయనంలో సంచలన విషయాలు.!

చాలా మందికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసే అలవాటు ఉంటుంది. ఉదయం టిఫిన్‌ చేశాకా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. అయితే కొందరు టిఫిన్ చేసే సమయ వేళలు పాటించరు.
ఉదయం ఏ సమయానికి టిఫిన్‌ చేయాలి? సమయం దాటితో ఎలాంటి సమస్యలు వస్తాయన్న విషయం పెద్దగా పట్టించుకోరు. ఉదయం టిఫిన్‌ చేయడానికి ఓ టైమ్‌ అంటూ ఉంటుంది. ఆ సమయంలో లోపు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది ఈ బ్రేక్‌ ఫాస్ట్‌ను ఆలస్యంగా చేస్తుంటారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలలోపు9 ఆల్పాహారం చేయాలంటున్నారు నిపుణులు. ఉదయం అల్పాహారంపై ఐఎస్‌ గ్లోబస్‌ అధ్యయనం చేపట్టింది. ఇందులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉదయం 8 గంటల్లోపు తినేవారితో పోలిస్తే 9 గంటల తర్వాత టిఫిన్‌ చేసేవారిలో డయాబెటిస్‌ ముప్పు 59 శాతం ఉన్నట్లు తేలింది. తినే సమయ వేళలు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. వేళపాల లేకుండా టిఫిన్‌ చేస్తే రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ మోతాదు వంటి వాటిపై ప్రభావం ఉంటుందట. అలాగే రాత్రి 10 గంటల తర్వాత భోజనం చేసేవారిలో మధుమేహం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అధ్యయనం ద్వారా గుర్తించారు.

మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. భారతదేశంలో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు దీని బారిన పడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమలు తగ్గడం వల్ల అధిక రక్తంలో చక్కెర స్థాయికి సంబంధించిన ఈ వ్యాధి పెరుగుతుంది. ఇది అటువంటి వ్యాధి, బాధితురాలిగా మారిన తర్వాత జీవితాంతం మందులపై ఆధారపడతారు. అందువల్ల, మధుమేహాన్ని నివారించడానికి, అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం. ఇది కాకుండా, మధుమేహాన్ని సరైన సమయంలో గుర్తించినట్లయితే, అప్పుడు ఈ వ్యాధి సమస్యలు సంభవించే ముందు నివారించవచ్చు. అందుకే ఆహారం తీసుకోవడంలో సమయ వేళలు పాటించడం చాలా ముఖ్యం.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలోని పోషక విలువలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ నిండుగా, పోషకాలతో ఉండాలని నిపుణులు అంటున్నారు. అయితే సమయానికి ఆహారం తీసుకోకపోతే అది మనకు చాలా హానికరమని పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఉదయం ఆలస్యంగా అల్పాహారం తీసుకునే వ్యక్తులు టైప్-2 డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. గతంలో కూడా అమెరికాలో జరిపిన అధ్యయనం ఆధారంగా నిపుణులు ఈ నివేదికలో వెల్లడించారు.

Viral Video: వామ్మో.. పెద్ద పులితో ఆటలా? పులి తరుముతుంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

చాలా మంది కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి వాటిని పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. వాటితో సరదాగా ఆడుకుంటుంటారు. అయితే దుబాయ్‌ (Dubai)లో ఇందుకు భిన్నం.
వారు వన్య మృగాలను పెంచుకోవడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. ఆ సంపన్న దేశంలో ధనవంతులు చిరుతలను, పులులను, సింహాలను ఇళ్లలో పెంచుకుంటారు. అంతేకాదు వాటిని తీసుకుని అప్పుడప్పుడు రోడ్ల పైకి కూడా వస్తుంటారు. వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు (Tiger Videos).

తాజాగా అలాంటి వీడియో ఒకటి billionaire_life.styles అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ విలాసవంతమైన ఇంట్లో ఓ వ్యక్తి తన పెంపుడు పులితో (Pet Tiger) ఆడుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఇల్లంతా పరిగెడుతుండగా ఓ పెద్ద పులి అతడిని పట్టుకునేందుకు అతడి వెంట పరుగులు తీస్తోంది. పరుగెత్తే క్రమంలో అతడు అదుపుతప్పి కింద పడిపోయాడు. అయినా సరే ఆ పులి అతడిని వదలలేదు. వెంబడించి అతడిని పట్టుకుంది. అయితే పెంపుడు పులి కావడంతో అతడిని ఏమీ చేయలేదు (Tiger Chasing Man).

ఈ వీడియో చాలా మంది నెటిజన్లను భయాందోళనలకు గురి చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. “మిడిల్ ఈస్ట్‌లో మాత్రమే ఇలాంటివి సాధ్యం,ఆ జంతువు బొమ్మ కాదు దానికి స్వేచ్చ కావాలి,వీడియో చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది,వన్య ప్రాణులను అలా బంధించడం ప్రకృతికి ఎదురెళ్లడమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

సిమ్ కార్డ్ లేకుండానే వీడియోలు చూసేయొచ్చు : డీ2ఎం బ్రాడ్‌కాస్టింగ్ దిశగా కేంద్రం , ఎలా పనిచేస్తుందంటే..?

మొబైల్ వినియోగదారులు త్వరలో సిమ్ కార్డ్ లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వీడియోలను వీక్షించవచ్చు. ఎందుకంటే సమీప భవిష్యత్తులో డైరెక్ట్ టు మొబైల్ ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి.
బ్రాడ్ కాస్టింగ్ సమ్మిట్‌ను ఉద్దేశించి కేంద్ర సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. దేశీయంగా అభివృద్ధి చేసిన డైరెక్ట్ టు మొబైల్ (డీ2ఎం) సాంకేతికతకు సంబంధించిన ట్రయల్స్ త్వరలో దేశంలోని 19 నగరాల్లో జరుగుతాయని చెప్పారు. ఇందుకోసం 470-582 MHz స్పెక్ట్రమ్ రిజర్వ్ చేయడానికి బలమైన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు అపూర్వ తెలిపారు.

డీ2ఎంకి వీడియో ట్రాఫిక్‌ను 25 నుంచి 30 శాతం మార్చడం వల్ల 5జీ నెట్‌వర్క్‌లు అన్‌లాగ్ అవుతాయని అపూర్వ చంద్ర అన్నారు. తద్వారా దేశ డిజిటల్ పరిణామాన్ని వేగవంతం చేసి కంటెంట్ డెలివరీని మరింత అందుబాటులోకి తెస్తుందన్నారు. గతేడాది డీ2ఎం సాంకేతికతను పరీక్షించడానికి పైలట్ ప్రాజెక్ట్‌లు బెంగళూరు, కర్తవ్య పథ్, నోయిడాలో జరిగాయి. డీ2ఎం టెక్నాలజీ దేశవ్యాప్తంగా దాదాపు 8 నుంచి 9 కోట్ల టీవీ డార్క్ ఇళ్లను చేరుకోవడానికి సహాయపడతాయని చంద్ర తెలిపారు. దేశంలోని 280 మిలియన్ల కుటుంబాలలో కేవలం 190 మిలియన్లకు మాత్రమే టెలివిజన్ సెట్లు వున్నాయి.

దేశంలో 80 కోట్ల స్మార్ట్‌ఫోన్లు వున్నాయని, 69 శాతం కంటెంట్ వీడియో ఫార్మాట్‌లోనే వుందని అపూర్వ చెప్పారు. వీడియోను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మొబైల్ నెట్‌వర్క్‌లు అడ్డుపడతాయని , దీని ఫలితంగా కంటెంట్ బఫర్ అవుతుందని చంద్ర తెలిపారు. సాంఖ్య ల్యాబ్స్ , ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన డీ2ఎం ప్రసార సాంకేతికత భూ సంబంధమైన టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్‌లను నేరుగా అనుకూల మొబైల్ లేదా స్మార్ట్ పరికరాల నుంచి స్ట్రీమ్ చేసుకోవచ్చు.
ఒక బిలియన్ మొబైల్ డివైస్‌లను చేరుకోగల సామర్ధ్యంతో డీ2ఎం సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం వలన డేటా ట్రాన్స్‌మిషన్ , యాక్సెస్‌లో ఖర్చు తగ్గింపులు, నెట్‌వర్క్ సామర్ధ్యం, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు వంటి వాటి ఏర్పాటుకు దారి తీయడం వంటి ప్రయోజనాలను పొందవచ్చు.

Vijayamma support for whom : ఏపీలో జగన్, షర్మిల రాజకీయాలు – విజయమ్మ మద్దతు ఎవరికి ?

Andhra YS Family Polotics : ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల కొత్త అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఏపీలో ఆయన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ ద్వారా ముఖ్యమంత్రిగా ఉన్నారు.
పార్టీ కోసం షర్మిల పాదయాత్ర సహా చాలా కష్టపడ్డారు. అయితే కారణాలేంటో తెలియదు కానీ చెల్లి షర్మిలను జగన్ దూరం పెట్టడంతో ఆమె తన రాజకీయ లక్ష్యాలను అందుకోవడానికి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. కానీ అక్కడి రాజకీయ పరిస్థితుల్ని చూసిన తర్వాత మనసు మార్చుకుని ఏపీకి వచ్చేశారు. తండ్రి వైఎస్ జీవితాంతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులయ్యారు. అంటే అన్నతో చెల్లి పోటీ పడబోతున్నారు. మరి వీరిద్దరిలో తల్లి విజయలక్ష్మి మద్దతు ఎవరికి ఉండబోతోంది ?

పిల్లలిద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారన్న విజయమ్మ

షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ పూర్తి మద్దతుగా నిలిచారు. పిల్లలిద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయం చేయాలని దేవుడు రాసి పెట్టారని చెప్పుకున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పోటీ చేయడం లేదు కాబట్టి అన్నా చెల్లెళ్ల మధ్య సవాల్ జరిగే అవకాశం కనిపించ లేదు.అందుకే విజయమ్మకు కూడా ఇద్దరి మధ్య ఎవరో తేల్చుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. షర్మిల తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేశారు.

రాజకీయంగా వైసీపీని టార్గెట్ చేస్తేనే కాంగ్రెస్కు ఓటు బ్యాంక్

షర్మిల నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే తెలంగాణలో పార్టీ పెట్టారని గతంలో ప్రచారం జరిగిదంి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో తాను స్థాపించిన పార్టీని విలీనం చేసేసి ఏపీలో తన అన్నను గట్టిగా ఢీకొనాలనే ధృఢ సంకల్పంతో షర్మిల రెడీ అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చాక బలమున్న చోటే వెదుక్కోవాలి. లేకపోతే కష్టం. ఈ సూత్రం తెలియకుండా షర్మిలరాజకీయం చేయరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఆమె ప్రభావం దాదాపుగా లేదని ఇక ఏటూ తేల్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి మొహమాటాలు వదిలేయాలని అనుకున్నారని చెబుతున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల వంద శాతం పార్టీ కోసం పని చేసే అవకాశం ఉంది. ల

విజయమ్మ మద్దతు ఎవరికి ఉంటే వారికి నైతిక బలం !

ఇలాంటి సమయంలో పిల్లల్లో విజయమ్మ సపోర్ట్ ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు విజయమ్మ కూతురు వైపే మొగ్గు చూపారు. కూతురుకు అండగా నిలవడమే ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా రాజీనామా చేసినప్పుడు అదే చెప్పారు. ఇద్దరు బిడ్డలు రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు ఒకరిపైకి ఒకరు రాజకీయం చేసే పరిస్థితులు వచ్చాయి. షర్మిల ఏపీకి వచ్చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత షర్మిలను కట్టడి చేయాలని విజయమ్మపై జగన్ ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం జరిగింది. తన ఇద్దరు పిల్లలు తనకు రెండు కళ్లని విజయమ్మ చెబుతూ వస్తున్నారు. అప్పుడు ఆమె రెండు కళ్లల్లో ఏదోక కంటికే ప్రాధాన్యం ఇవ్వక తప్పదన్న వాదన వినిపిస్తోంది.షర్మిళ వైపే విజయమ్మ నిలబడితే జగనుకు నైతికంగా భారీ దెబ్బ తగిలినట్టే భావిస్తారు. ఇప్పటికే తల్లి.. చెల్లెలను పట్టించుకోవడం లేదనే విమర్శలను జగన్ ఎదుర్కొంటున్నారు. ఇక షర్మిళ నేరుగా ఏపీ రాజకీయ రంగంలోకి దూకారు కాబట్టి నేరుగా జగన్ను విమర్శించే పరిస్థితి వస్తుంది.
విజయమ్మ తటస్థంగా ఉంటారా ?

ఎవరికీ మద్దతు ఇవ్వకుండా విజయమ్మ తటస్థంగా ఉంటారని వైసీపీ వర్గాలు నమ్ముతున్నాయి. కానీ ప్రస్తుతం విజయమ్మ షర్మిల వద్దే ఉంటున్నారు. రెండు, మూడు సార్లు షర్మిలతో కనిపిస్తే.. కుమార్తెకే ఆమె మద్దతు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది సీఎం జగన్కు ఇబ్బందే.

M Aadhaar: మీ మొబైల్‌లోనే క్షణాల్లో ఆధార్‌.. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ చాలా సింపుల్‌..

ఆధార్‌ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే విశిష్ట గుర్తింపు సంఖ్య. ప్రభుత్వం ప్రతి చిన్న అవసరానికి ఆధార్‌ను తప్పనిసరి చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల వర్తింపునకు ఆధార్‌ అవసరం అవుతుంది.
అంతేకాకుండా బ్యాంకు ఖాతాల నిర్వహణతో పాటు ఆర్థిక సంబంధిత కార్యకలాపాలకు కూడా ఆధార్‌ అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆధార్‌ను ప్రతి అవసరానికి గుర్తింపు కార్డుగా ఉపయోగించాల్సి వస్తుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆధార్‌ను సింపుల్‌గా ఫోన్‌ ద్వారా యాక్సెస్‌ చేయవచ్చు. అలాగే ఆధార్‌ ఒరిజినల్‌లా ధ్రువీకరించుకోవచ్చు. ఆధార్‌ను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఎం-ఆధార్‌ను తీసుకొచ్చింది. ఇది ఆధార్ కార్డునకు మొబైల్ యాప్ వెర్షన్‌ను సూచిస్తుంది. ఇది తప్పనిసరిగా మీ స్మార్ట్‌ఫోన్‌లో మీ ఆధార్ సమాచారాన్ని డిజిటల్‌గా తీసుకెళ్లడానికి, వివిధ ఆధార్ సంబంధిత సేవలను సౌకర్యవంతంగా ఉపయోగించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఎం ఆధార్‌ గురించి వివరాలను తెలుసుకుందాం.

ఎం-ఆధార్ ఫీచర్లు

ఎం ఆధార్‌ ద్వారా మీ వ్యకతిగత సమాచారం, ఫోటోగ్రాఫ్, ఆధార్ నంబర్‌ను ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేయండి.
బ్యాంకులు, టెలికాం ఆపరేటర్లు మొదలైన వాటి వద్ద ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ కోసం మీ ఫోన్‌ని ఉపయోగించవచ్చు.
ఎం ఆధార్‌ యాప్‌ దవ​ఆరా మీ ఆధార్ కార్డునకు సంబంధించిన సురక్షితమైన, డిజిటల్ సంతకం చేసిన కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అలాగే ఈ యాప్‌లో మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఐదుగురి ఆధార్ నంబర్‌లను లింక్ చేయవచ్చు.
మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే ఆఫ్‌లైన్ ఆధార్ ప్రమాణీకరణ కోసం తాత్కాలిక పిన్‌ను సృష్టించవచ్చు.
ఎం ఆధార్‌ యాప్‌ ద్వారా నిర్వహించే మీ అన్ని ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ లావాదేవీలను ట్రాక్ చేయండి.
ఎం ఆధార్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేయడం ఇలా

ఎం ఆధార్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ లేదా ఐఓఎస్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అనంతరం యాప్‌ని తెరిచి “రిజిస్టర్ ఆధార్” ఎంపికను ఎంచుకోవాలి. మీ చెల్లుబాటు అయ్యే 12-అంకెల ఆధార్ నంబర్, అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
ఎం ఆధార్‌ ప్రొఫైల్‌కు సురక్షితమైన యాక్సెస్ కోసం 4 అంకెల పిన్‌ లేదా పాస్‌వర్డ్‌ను సెట్ చేయాలి.
అనంతరం మీ ఆధార్‌తో లింక్ చేసిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓటీపీను నమోదు చేయాలి.
ఒకసారి ఆధార్‌ నమోదు చేసుకున్న తర్వాత మీరు సృష్టించిన పిన్ లేదా పాస్‌వర్డ్‌ని ఉపయోగించి మీ ఎం-ఆధార్ ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయవచ్చు.

Aadhaar: ఆధార్‌ కార్డ్‌లో మీ ఫొటో బాగోలేదా?, అందంగా మార్చడం చాలా సింపుల్‌

Latest Photo Updation In Aadhaar Card Online: భారతదేశ పౌరుల గుర్తింపు పత్రాల్లో ఆధార్ కార్డు ఒకటి. ఇది అతి ముఖ్యమైన ఐడీ కార్డ్. స్కూలు & కాలేజీలో అడ్మిషన్ కోసం, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడానికి, జాబ్లో జాయిన్ కావడానికి, బ్యాంక్ ఖాతా తెరవడానికి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి, ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయడానికి, ఆస్తుల క్రయవిక్రయాల కోసం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు, ఇలా…
చాలా రకాల పనుల కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరిగా అవసరం. ఆధార్ కార్డ్ లేకపోతే ఈ పనులేవీ జరగవు.

ఆధార్ కార్డ్లో 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఇందులో.. వేలిముద్రలు (బయోమెట్రిక్) & కనుపాపల (Iris) గుర్తులు, వ్యక్తి పేరు, ఫోటో, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి.

ఆధార్ కార్డ్లో ఉన్న వివరాల్లో కొన్నిసార్లు తప్పులు దొర్లుతాయి. ఫోన్ నంబర్ లేదా చిరునామా మారినప్పుడు వాటిని అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమాచారాన్ని మార్చుకోవడానికి లేదా తప్పులు సరి చేసుకోవడానికి ఆధార్ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్లోనే వివరాలు మార్చుకోవచ్చు. అయితే, మొత్తం సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయడం కుదరదు. ఫోటో, బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడానికి తప్పనిసరిగా ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం, నేరుగా ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లవచ్చు, లేదా ఆధార్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీకు దగ్గరలోని ఆధార్ సేవ కేంద్రంలో మీకు వీలైన సమయం కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డ్లో ఉన్న మీ ఫోటో లేదా మీ కుటుంబ సభ్యుల ఫోటోలు బాగోలేకపోతే, లేదా ఆ ఫోటోలు పాతబడితే.. ఆధార్ సెంటర్కు వెళ్లి వాటిని మార్చుకోవాలి.

ఆధార్ కార్డ్లో ఫోటో మార్చే విధానం (How to Change Photo in Aadhaar Card):

ముందుగా, mAadhaar యాప్ లేదా ఉడాయ్ వెబ్సైట్ నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
ఇదే ఫారాన్ని ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లి కూడా తీసుకోవచ్చు.
ఆ ఫారంలో అడిగిన వివరాలను తప్పులు లేకుండా జాగ్రత్తగా పూరించండి. అక్షర దోషాలు లేకుండా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోండి.

ఫారం నింపిన తర్వాత, ఆధార్ సేవ కేంద్రంలో ఆ ఫారాన్ని సబ్మిట్ చేయాలి.
ఇప్పుడు, ఫొటో అప్డేషన్ పని ప్రారంభమవుతుంది.
మొదట, ఆధార్ సేవ కేంద్రంలోని సిబ్బంది మీ నుంచి వేలిముద్రలతో మీ గుర్తింపును ధృవీకరిస్తారు.
అక్కడే ఉన్న కెమెరా ద్వారా మీ ఫోటో తీసుకుంటారు. ఇదే ఫొటోను ఆధార్ కార్డ్లో అప్డేట్ చేస్తారు.
ఆధార్ కార్డ్ ఫొటోలో మీరు ఎలా కనిపించాలని కోరుకుంటారో, దానికి తగ్గట్లుగా ముందే సిద్ధమై వెళ్లండి.
తర్వాత, ఆధార్లో ఫోటోను అప్డేట్ చేయడానికి కొంత డబ్బు చెల్లించాలి.

ఈ తతంగం ముగిసిన తర్వాత ఆధార్ కేంద్రం సిబ్బంది మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. దాని మీద URN ఉంటుంది. దాని సాయంతో, మీ ఫోటో అప్డేట్ ప్రాసెస్ను మీరు ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. కొన్ని రోజుల తర్వాత, UIDAI నుంచి ఫోటో అప్డేట్ SMS వస్తుంది. మీ ఆధార్ కార్డుకు అనుసంధానమైన మొబైల్ నంబర్కు ఆ SMS వస్తుంది. ఆ తర్వాత, ఆధార్ వెబ్సైట్లోకి వెళ్లి, ఆధార్ కార్డ్లో కొత్తగా యాడ్ చేసిన ఫోటోను చూసుకోవచ్చు. ఆ ఆధార్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకుని అవసరమైన చోట వినియోగించుకోవచ్చు.

ఆధార్ కార్డ్లో ఫోటో మార్చుకోవడానికి ఎంత ఫీజు చెల్లించాలి?

UIDAI అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఆధార్ కార్డ్లో ఫోటోను నవీకరించడానికి రూ.100+GST చెల్లించాలి. ఆధార్ కార్డ్లో ఫోటోను అప్డేట్ చేయడానికి ఇతర ఏ గుర్తింపు కార్డ్ను చూపించాల్సిన అవసరం లేదు.

ఆధార్ కార్డ్లో ఫోటోను ఆఫ్లైన్లో మాత్రమే అప్డేట్ చేస్తారు. ఆన్లైన్ ద్వారా మనమే అప్డేట్ చేసుకోవడం కుదరదు.

Dialy News Papers Telugu, English News Papers,Epapers

Telugu News Papers, Telugu Epapers, English news papers – Epapers Eenadu / Eenadu Epaper/Andhra Jyothi Epaper/Sakshi Epaper/Andhra Bhoomi/Andhra Prabha/Praja sakthi/Visalaandhra/Vaartha/Suryaa/Namasthe Telangana/V6 – Velugu/ ManaTelangana / NavaTelangana /AadabHyderabad/Janam sakshi/manam

S.NO Telugu News website Epaper
1 Eenadu Epaper
2 Andhra Jyothi Epaper
3 Sakshi Epaper
4 Andhra Bhoomi Epaper
5 Andhra Prabha Epaper
6 Praja sakthi Epaper
7 Visalaandhra Epaper
8 Vaartha Epaper
9 Suryaa Epaper
10 Namasthe Telangana Epaper
11 V6 – Velugu Epaper
12 ManaTelangana Epaper
13 NavaTelangana Epaper
14 AadabHyderabad Epaper
15 Janam sakshi Epaper
16 manam Epaper

డయాబెటిస్ వారికీ గుడ్ న్యూస్.. శాశ్వతంగా చెక్ పెట్టే మందు రాబోతుంది..!

ప్రస్తుతం ప్రతీ మందిలో 7 గురు డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటిస్ కి శాశ్వతంగా తగ్గించే మందుల మీద పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇది విజయవంతం అయితే ఇక డయాబెటిస్ కి వారు భయ పడాల్సిన అవసరం లేదు. డయాబెటిస్ వచ్చిందంటే చాలు జీవితం మొత్తం అయిపోయిందని బాధ పడతారు. ఎందుకంటే ఇంత వరకు ఎవరు దీనికి మందు కనిపెట్టలేకపోయారు. ఎన్ని మందులు వాడినా ఎంత డైట్ తీసుకున్న షుగర్ వ్యాధి పెరుగుతూనే ఉంది.జీవితం సగం అయిపోయిందనే భావనలోనికి వెళ్లిపోతున్నారు. ఇక నుంచి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టైప్ టు డయాబెటిస్ కి శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

సాధారణంగా టైప్ వన్ డయాబెటిస్ 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికీ వస్తుంది. ఈ సమస్య రావడానికి వేరే కారణం కూడా ఉందట. చిన్న వయసులో డయాబెటిస్ ఎదుర్కోవడానికి కారణం ఒత్తిడి కూడా కారణమని నిపుణులు వెల్లడించారు. మరికొందరికి డయాబెటిస్ చిన్న వయసులో రావడానికి కారణం వారి కుటుంబంలో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వారికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. చాలా పరిశోధనల తర్వాత ఈ టైప్ టు డయాబెటిస్ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు వైద్యులు. అంతేకాదు.. ఈ పరిశోధన ఈ వ్యాధికి శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇన్సూలేన్స్ వంటి ప్రోటీన్లను ప్రభావితం చేస్తుంది. త్వరలోనే డయోబెటిస్ వారికీ మంచి రోజులు రాబోతున్నాయి. శాశ్వత పరిష్కారం కూడా కనుగొనబోతున్నారు.

Fastag KYC: మీ ఫాస్టాగ్‌ కేవైసీ అయ్యిందా..? లేదా.? ఇలా తెలుసుకోండి..

ఫాస్టాగ్‌లకు కేవైసీని తప్పనిసరి చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ రహదారులపై వాహనాలు టోల్‌ చెల్లించే విధానాన్ని సులభతరం చేస్తూ కేంద్రం దేశంలోని అన్ని టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఫాస్టాగ్‌లకు కేవైసీ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లను డీయాక్టివేట్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు గాను చివరి తేదీగా జనవరి 31వ తేదీని నిర్ణయించారు. ఒకే వాహనానికి ఒకే ఫాస్టాగ్‌ ఉండాలన్న ఉద్దేశంతోనే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఒకే ఫాస్టాగ్‌ను వేరు వేరు వాహనాలకు ఉపయోగించకుండా ఉండడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 31వ తేదీలోపు కేవైసీ చేసుకోకపోతే ఫాస్టాగ్‌ డీయాక్టివేట్‌ అవుతుందని ప్రకటించారు.

దీంతో వాహనదారులు తమ ఫాస్టాగ్‌కు కేవైసీని అప్‌డేట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే ఇంతకీ మీరు ఉపయోగిస్తున్న ఫాస్టాగ్‌కు కేవైసీ అయ్యిందో లేదో ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఆన్‌లైన్‌లో కేవేసీ స్టేటస్‌ను ఎలా చెక్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఫాస్టాగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం మీ మొబైల్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి.

లేదంటే ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా కూడా లాగిన్‌ కావొచ్చు. అనతంరం డ్యాష్‌బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్‌’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ మీ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్‌ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ మీ ఫాస్టాగ్‌ కేవైసీ కాకపోయి ఉంటే.. అక్కడ అడిగిన వివరాలు సమర్పించాలి. దీంతో కేవైసీ ప్రాసెస్‌ను పూర్తి చేసుకోవచ్చు.

మజ్లిస్ కు రేవంత్ మార్క్ చెక్ ? ఇండియా కూటమిలోకి ఎంబీటీ-హైదరాబాద్ ఎంపీ సీటూ !

తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ సీట్లు గెల్చుకుని అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి రాజధాని హైదరాబాద్ పరిధిలో ఒక్కసీటు కూడా గెలవలేకపోవడం పెద్ద మైనస్ గా మారింది.
దీంతో వచ్చిన కసో, మరో కారణమో తెలియదు కానీ హైదరాబాద్ విషయంలో దీర్ఘకాలిక వ్యూహాలకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపుతున్నారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు సహకరించి కాంగ్రెస్ ఓట్లు చీల్చి ఆ పార్టీ అభ్యర్ధుల ఓటమికి కారణమైన స్ధానిక పార్టీ ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు సీరియస్ కసరత్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగా పాతబస్తీలో ఎంఐఎం ప్రత్యర్ధి ఎంబీటీని ఓ రేంజ్ లో ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇప్పటికే గత ఎన్నికల్లో ఎంఐఎం గెలిచిన ఏడు సీట్లలో రెండు సీట్లు యాకుత్ పురా, నాంపల్లిలో గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ను భవిష్యత్తులో ఎంబీటీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లేలా రేవంత్ ప్లాన్ చేసారు. ఇందులో భాగంగా ఎంబీటీ నేత అంజాదుల్లా ఖాన్ ను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఎంఐఎంకు బలమున్న ప్రతీ చోటా ఇకపై ఎంబీటీని ప్రోత్సహించబోతున్నారు.

ఎంబీటీతో నేరుగా కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడమే కాకుండా ఆ పార్టీ నేతృత్వంలో సాగుతున్న ఇండియా కూటమిలోకీ చేర్చుకునేలా రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున అధిష్టానం దూతలు ఎంబీటీ నేతలతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్ధాయిలో ఎంఐఎంకు పోటీగా ఎంబీటీని అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఎంబీటీకి మరో కీలక ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు.

ఇన్నాళ్లూ ఎంఐఎం వరుసగా గెలుస్తూ, తన సొత్తుగా భావిస్తున్న హైదరాబాద్ ఎంపీ సీటులో ఎంబీటీ అభ్యర్ధిని పోటీకి పెట్టి అన్ని విధాలా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తద్వారా అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఇప్పుడు మొదలైతే భవిష్యత్తులో ఎంఐఎం కంచుకోటల్ని బద్దలు కొట్టి తన మిత్రపక్షం ఎంబీటీతో పాగా వేయించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ పరిధిలో ఎంబీటీ సాయంతో కాంగ్రెస్ బలపడాలన్నది ఈ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.

Income Tax Benefits: సొంతిల్లు కొంటే.. ఆదాయ పన్ను మినహాయింపు! అదెలా? ఇది చదవండి..

సొంతంగా ఇంటిని నిర్మించుకోవడం లేదా ఓ ఇల్లు కొనుగోలు చేయడం ద్వారా మీరు కట్టే పన్ను ఆదా చేసుకోవచ్చని మీకు తెలుసా? ఆదాయ పన్నుల చట్టం 1961 ప్రకారం అనేక మినహాయింపులు ఉంటాయి.

వాటి గురించి అవగాహన ఏర్పరచుకుంటే మీరు ఏటా పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. అదెలా అంటారా? ఏమి లేదండి.. మీరు సొంత ఇల్లు నిర్మించుకునే సమయంలో ఏదైనా బ్యాంకులో హోమ్ లోన్ తీసుకోండి. ఆ హోమ్ లోన్ వడ్డీ, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా పన్ను మినహాయింపునకు అర్హత సాధిస్తాయి. తద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు పెద్ద మొత్తంలో ట్యాక్స్ ఆదా చేసుకునే వీలుంటుంది. అందుకు పాటించవలసిన కొన్ని సూచనలు, సలహాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రిన్సిపల్ చెల్లింపుపై పన్ను మినహాయింపులు..

మీరు మీ హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లించినప్పుడు, మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ప్రయోజనం ప్రధాన రీపేమెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కలిగి ఉంటుంది. ఇది సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పొందవచ్చు. అయితే, ఈ మినహాయింపును పొందడానికి, మీరు తప్పనిసరిగా కనీసం ఐదేళ్లపాటు ఆస్తి యాజమాన్యాన్ని కలిగి ఉండాలి.

హోమ్ లోన్ వడ్డీ చెల్లింపు తగ్గింపులు..

అసలు రీపేమెంట్‌తో పాటు, మీ హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీపై కూడా పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద గృహ రుణం కోసం చెల్లించే వడ్డీపై స్వీయ-ఆక్రమిత ఆస్తికి రూ. 2 లక్షల వరకు మినహాయింపులను అనుమతిస్తుంది. లెట్ అవుట్ ప్రాపర్టీకి, చెల్లించిన వడ్డీకి తగ్గింపుపై గరిష్ట పరిమితి లేదు.

సుదీర్ఘ పదవీకాలాలు..

చాలా వరకు హోమ్ లోన్‌లు సాధారణంగా సుదీర్ఘ కాల వ్యవధితో వస్తాయి కాబట్టి, రుణం తిరిగి చెల్లించే మొత్తం వ్యవధికి మీ హోమ్ లోన్ వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి ఇది మిమ్మల్ని అనుమతించే కోణంలో పన్ను ప్రయోజనాన్ని అందిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, గృహయజమానులు స్వీయ-ఆక్రమిత ఆస్తి కోసం గృహ రుణ ఈఎంఐ భాగంపై సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు.

జాయింట్ గా రుణం తీసుకుంటే..

మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి రుణం తీసుకుంటే, మీరిద్దరూ ప్రిన్సిపల్ చెల్లింపు నుంచి సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు, వడ్డీ చెల్లింపుల కోసం ఒక్కొక్కరూ రూ. 2 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చు. ఇది ఆదాయపు పన్ను మినహాయింపు మొత్తాన్ని రెట్టింపు చేయవచ్చు.

అదనపు వడ్డీ తగ్గింపులు..

నిర్దిష్ట సందర్భాలలో, ఇంటి యజమానులు అదనపు వడ్డీ తగ్గింపులను కూడా పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈఈ ప్రకారం, కొన్ని షరతులకు లోబడి రూ. 50,000 వరకు అదనపు మినహాయింపు లభిస్తుంది. అదేవిధంగా, సెక్షన్ 80ఈఈఏ నిర్దిష్ట షరతులలో మళ్లీ రూ. 1.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తుంది.

Brahma muhurtham: బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటి?

What is Brahma Muhurta? What is special about this moment?

Brahma muhurtham: బ్రహ్మ ముహూర్తం అనే మాట చాలా మంది నోటి నుంచి వినే ఉంటారు. ఆ సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా అది నిర్విగ్నంగా విజయవంతం అవుతుందని నమ్ముతారు.
పురాతన కాలం నుంచి బ్రహ్మ ముహూర్తం గురించి చెప్తూనే ఉంటారు.

బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి?

సూర్యోదయానికి ముందు తెల్లవారు జాము ముందు సమయాన్ని సూచిస్తుంది. సూర్యోదయానికి సుమారు గంట 36 నిమిషాల ముందు ప్రారంభం అవుతుంది. దాదాపు వేకుమజామున 3.30 గంటల నుంచి 5 గంటల బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఏదైనా కొత్త పనులు చేపట్టేందుకు, శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు బ్రహ్మ ముహూర్తం ఉత్తమ సమయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

బ్రహ్మ ముహూర్తం గురించి సద్గురు ఏమన్నారంటే..

బ్రహ్మ ముహూర్త సమయంలో మెలటోనిన్ స్టేబుల్ గా ఉంటుంది. ఈ సమయంలో కార్టిసాల్ ఎక్కువగా విడుదల అవడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో విద్యాభ్యాసం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో చాలా మంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియి చేపట్టాలని అనుకుంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఈ సమయంలో మీరు చేపట్టే పని ఏదైన విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇది అపారమైన శక్తికి మూలంగా పరిగణిస్తారు.

బ్రహ్మ ముహూర్తం ఎందుకు ముఖ్యమైనది?

బ్రహ్మ ముహూర్తానికి జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక స్వచ్చత, ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం ఈ సమయంలో ఉంటుంది. యోగా, ధ్యానం, చదువుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం. మనసు ఏకాగ్రత ఉంటుంది. జ్ఞానాన్ని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. జ్ఞాపకశక్తి మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది.
బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని చదవడం వల్ల ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది. చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల మీ ధ్యాస మొత్తం చదువు, చేపట్టిన పని మీదే ఉంటుంది. మనసు చేస్తున్న పని మీద లగ్నం చేస్తారు. పరధ్యానం లేకుండా ఉంటుంది. ఈ సమయంలో పర్యావరణం శాంతియుతంగా ఉంటుంది. మిమ్మల్ని డిస్ట్రబ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఎటువంటి శబ్దాలు లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక భావనలు, లోతైన ఏకాగ్రత మీకు తోడుగా ఉంటుంది.

బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఆరోగ్య ప్రయోజనాలు

ఈ సమయంలో విశ్వ శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెబుతారు. ధ్యానం, జపం, ప్రార్థన చేసుకునేందుకు, అధ్యాత్మికంగా బలపడేందుకు, అంతర్గత పరివర్తన కోసం ఈ సమయం ఉత్తమం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం మంచిదని పురాణాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్తూనే ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. సూర్యుని నుంచి వచ్చే లేలేత కిరణాలు శరీరం మీద పడటం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రని త్యాగం చేయడం మంచిదని రుషులు కూడా చెప్తూ ఉంటారు.
పొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మానసిక, శారీరక ఒత్తిళ్లు కూడా దూరం అవుతాయి.

Kanuma: కనుమ రోజు ఎందుకు ప్రయాణాలు చేయకూడదు?

తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతిని పెద్ద పండగగా పిలుచుకుంటారు. మూడు రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండగ సమయంలో తెలుగు లోగిళ్లు కొత్త అల్లుళ్లు, బంధు మిత్రులతో కళకళలాడుతుంటాయి.
పచ్చని తోరణాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే ఈ పర్వదినంలో తొలి రోజు భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి, రెండో రోజు పితృదేవతలను పూజించే సంక్రాంతి కాగా.. మూడో రోజు కనుమ. (Kanuma festival) పాడి పశువుల పండగ కనుమ. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతో సహాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత తెలుపుకొనే రోజు. రైతులు తమకు పండిన పంటను తామే కాకుండా పశుపక్ష్యాదులతో పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులను ఇంటి గుమ్మాలకు కడతారు. అయితే, ‘కనుమ రోజున కాకులు కూడా కదలవు’ అనే సామెతను గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని మన పూర్వీకులు చెబుతుంటారు. తరతరాలుగా అనుసరిస్తున్న ఈ సంప్రదాయ నియమాల వ్యాప్తి వెనుక ఉద్దేశాలను పరిశీలిస్తే..

పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటేనే కదా రైతుకు ఉత్సాహం.. ఉత్తేజం. పంటలు పండటంలో వీటి పాత్ర ఎంతో గొప్పది. అందుకే వాటిని పూజించి ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. కనుమను పల్లెల్లో వైభవంగా జరుపుకొంటారు. రైతు కుటుంబాలకు సుఖ సంతోషాలను అందించేందుకు అహర్నిశలు కష్టపడుతూ ఈ మూగ జీవాలు పోషిస్తున్న పాత్రను రైతులు మర్చిపోరు. తమ జీవనాధారానికి మూలమైన పశువుల పట్ల కృతజ్ఞతగా కనుమ రోజున వాటికి విశ్రాంతి ఇచ్చి పూజించుకుంటారు. ఆ రోజు నదీ తీరాలు, చెరువుల వద్దకు వాటిని తీసుకెళ్లి స్నానం చేయించిన తర్వాత నుదట పసుపు, కుంకుమ దిద్దుతారు. (Kanuma festival) ఆ తర్వాత వాటిని మువ్వల పట్టీలతో చక్కగా అలంకరించి హారతులిచ్చి పూజించుకొనే గొప్ప సంస్కృతి కనుమ రోజున కనబడుతుంది. ఏడాది మొత్తం రైతుతో సమానంగా కష్టపడే పశువులను కనుమ రోజున ఎలాంటి పనులూ చేయించకుండా పూర్తి విశ్రాంతి కల్పిస్తారు. ఆ రోజు సాయంత్రం పొంగలి చేసి నైవేద్యంగా పెడతూ వాటిపట్ల ప్రేమానురాగాలను చాటుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల పశు వృద్ధి, ధనధాన్యాల వృద్ధి కలుగుతుందని పెద్దల విశ్వాసం.

 

అయితే, కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటూ పూర్వ కాలంలో పెద్దలు పెట్టిన ఈ ఆచారం వెనుక ఓ గొప్ప ఔన్నత్యమే దాగి ఉంది. వాస్తవానికి పూర్వం ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లే ఉపయోగించేవారు. కనుమ రోజున ఎద్దులను పూజించడంతో ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో బళ్లు కట్టకుండా చూసేందుకు ఆ రోజు ప్రయాణమే వద్దని చెప్పేవారు. ఏడాదిలో ఒక్కరోజైనా ఎద్దులకు విశ్రాంతి ఇవ్వాలనే గొప్ప ఉద్దేశం ఈ మాట వెనుక ఉంది. (Kanuma festival) శ్రమైక జీవనంలో తనతో పాటు వ్యవసాయ క్షేత్రంలో కష్టపడుతున్న ఈ నోరులేని జీవాలకు రైతు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమను భావిస్తారు. అందువల్ల పశు పక్ష్యాదులకు మనిషి జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందో వివరించే పండుగగా ఆ రోజును పరిగణిస్తారు.

 

సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. దేవతలకు ఇది చాలా ఇష్టమైన సమయమని పూర్వీకులు చెబుతుంటారు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా పిలుస్తారు. చనిపోయిన పెద్దలు కూడా ఇదే రోజున బయటకు వస్తారనీ.. వారిని తలచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఆచారం. కనుమ రోజు పెద్దలకు ప్రసాదం పెట్టడంతో పాటు ఇంట్లో వాళ్లు కూడా తినేందుకు మాంసాహారం వండుతారు. కనుమ రోజున మినుములు తింటే మంచిదన్న ఉద్దేశంతో ఆ రోజు గారెలు చేసి మాంసాహారం వడ్డిస్తారు. మినుములు చలికాలంలో వేడిని పెంచేందుకూ ఉపయోగపడతాయి. కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు.. అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది. (Kanuma festival) అందుకే అక్కా చెల్లెల్లు- అల్లుళ్లతో కలిసి కుటుంబమంతా ఈ కనుమ వేడుకను ఉత్సాహంగా జరుపుకొంటారు. కనుమ రోజున ఇంట్లో ఎంతో హడావుడి ఉంటుంది గనక ఆ రోజు ఆగి.. పెద్దలను తలచుకోవాలనీ.. బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించాలని కొందరు చెబుతుంటారు.

Mustard Oil Benefits: చలికాలంలో ఆవనూనె వాడితే ఎన్ని బెనిఫిట్సో తెలుసా!

ఆవాల నూనె గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు అందరి ఇంట్లో కూడా ఆవాలు ఉంటాయి. ప్రతి వంటకంలోనూ ఆవాలను వాడుతూ ఉంటారు.
ఆవాలతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆవాలనే కాకుండా ఆవాల నూనె కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో కూడా ఆవాల నూనెను పలు రకాలా వ్యాధులను నయం చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు.

ఆవాల నూనెలో కూడా ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పూర్వం అయితే ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించే వారు. అదే విధంగా శీతా కాలంలో ఆరోగ్య పరంగా ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి. అలా అయితేనే రోగాలు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా శీతా కాలంలో ఆవాల నూనెను ఉపయోగిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది:

ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించి తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి అదుపులో ఉంటాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

రక్త పోటు తగ్గించుకోవచ్చు:

అధిక రక్త పోటు సమస్య ఉన్నవారు ఆవాల నూనె వాడటం చాలా మంచిది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రక్త పోటును అదుపు చేయవచ్చు.

రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది:

ఆవాల నూనె తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది మెరుగు పడుతుంది. దీంతో వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉండొచ్చు.

జీర్ణ శక్తి మెరుగు పడుతుంది:

ఆవాల నూనె తీసుకోవడం వల్ల శరీరంలో జీర్ణ శక్తి అనేది మెరుగు పడుతుంది. తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి:

ఆవాల ఆయిల్ ఉపయోగించడం వల్ల మూత్ర పిండాల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అదే విధంగా శరీరంలో ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధ పడేవారు కూడా ఆవాల ఆయిల్ వాడటం మంచిది. అదే విధంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటే అవకాశాలు ఉంటాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Health

సినిమా