Thursday, November 14, 2024

ఏపీలో మహిళలు ఒక్కొక్కరికి నెలకు రూ.1500.. ‘ఆడబిడ్డ నిధి’పై కీలకమైన ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. మరో నాలుగు నెలలకు సంబంధించి ఈ బడ్జెట్‌ను తీసుకొచ్చింది. సూపర్ సిక్స్ సహా కీలక పథకాలకు ఈ బడ్జెట్‌‌లో కేటాయింపులు జరిగాయి. మహిళలకు సూపర్‌సిక్స్‌ పథకాల అమల్లో భాగంగా.. మరో కీలక హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. ఈ పథకానికి అప్పట్లో ఆడబిడ్డ నిధి/మహిళాశక్తిగా పేరు పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో ‘మహిళలకు ఆర్థిక సహకారం’ పేరుతో ఆయా వర్గాలకు చెందిన వారికి రూ.3,341.82 కోట్లు కేటాయించింది. బీసీ మహిళలకు రూ.1099.78 కోట్లు, ఎస్సీ మహిళలకు రూ.1198.42 కోట్లు, గిరిజన మహిళలకు రూ.330.10 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.629.37 కోట్లు, మైనారిటీలకు రూ.83.79 కోట్లు ప్రతిపాదించింది. జెండర్‌ బడ్జెట్‌లో ఈ నిధుల్ని ప్రత్యేకంగా చూపించింది ప్రభుత్వం.

మరోవైపు ఎన్డీయే ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక ప్రకటన చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి రూ.6,487 కోట్లు, అన్నదాత సుఖీభవకు రూ.వెయ్యి కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ బడ్జెట్‌లో ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా ఎన్నికల హామీల అమలుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లున్నాయని.. ఇలాంటి సమయంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టామన్నారు.

ఏపీ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు మహిళలకు ప్రతి నెల డబ్బుల్ని అకౌంట్‌లో జమ చేస్తామని సూపర్ సిక్స్‌లో భాగంగా హాామీ ఇచ్చింది. 18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఈ పథకం ద్వారా అందిస్తామని చెప్పింది. ఈ పథకానికి మహాశక్షి, ఆడబిడ్డ నిధి పేర్లు ఖరారు చేసింది. త్వరలోనే ఈ పథకానికి విధివిధానాలు ప్రకటించి.. దరఖాస్తుల్ని ఆహ్వానించాలని భావిస్తోంది. అంతేకాదు మహిళలకు ఇచ్చిన మరో హామీ ఉచిత బస్సు ప్రయాణంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్న పలు రాష్ట్రాల్లో అధికారులు పర్యటించి.. అమలు తీరుపై ఆరా తీశారు. త్వరలోనే విధివిధానలు ఖరారు చేయనున్నారు.

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఆ పదవి పోయింది.. కొత్తగా ఆయనకు ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఫలితాల తర్వాత పార్టీకి ముఖ్య నేతలు గుడ్ బై చెబుతున్నారు.. ఈ క్రమంలో అధినేత వైఎస్ జగన్ పార్టీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా కొత్తగా అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల్లో పదవులు కేటాయిస్తున్నారు. అలాగే అవసరమైన చోట్ల నియోజవర్గాలకు కొత్త సమన్వయకర్తల్ని నియమిస్తున్నారు. తాజాగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వైఎస్సార్‌సీపీ షాకిచ్చింది.

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పలువురు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు నియామకాలకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌ను నియమించారు. ఆయన ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం జోనల్‌ ఇంఛార్జ్‌గా ఉన్నారు.. అలాగే పార్టీ పరిశీలకుడిగా కూడా పనిచేశారు. తాజాగా నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.

అలాగే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులును నియమించారు. అయితే ఆముదాలవస నియోజకవర్గ బాధ్యతలు కొత్తవారికి అప్పగించడం ఆసక్తికరంగా మారింది.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మొన్నటి వరకు ఆయనే నియోజకవర్గ బాధ్యతల్ని చూస్తున్నారు. అయితే తమ్మనేనికి వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు అప్పగించింది.

మరోవైపు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశం అ్యారు. శాస‌న మండలిలో ఎమ్మెల్సీలు కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాల‌ని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తామన్న భయంతోనే వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. అయినా సరే మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని.. మండలిలో ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాలపై నిలదీయాలని సూచించారు. మీడియా వేదికగా ఎమ్మెల్యేలు తమ గళాన్ని ప్రజలకు వినిపిస్తారని.. ప్రతిరోజు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు మీడియా ద్వారా మాట్లాడతారన్నారు. ప్రజాసమస్యలపైనా, ప్రభుత్వ వైఫల్యాలపైనా ప్రశ్నిస్తారని తెలిపారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని..కానీ కౌంటర్‌కు స్పీకర్‌ సమాధానం ఇవ్వలేదన్నారు జగన్. కోర్టు నుంచి వచ్చిన సమన్లు కూడా స్పీకర్‌ తీసుకోలేదని.. అసెంబ్లీలో ఉండే ఏకైక ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ మాత్రమే అన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడంలేదని.. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. అలా గుర్తించినప్పుడే ప్రతిపక్ష నేతకు మాట్లాడటానికి అవకాశాలు వస్తాయన్నారు. ప్రతిపక్ష నేతగా సమయం ఇవ్వాల్సి వస్తుందనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు. 40 శాతం ఓట్‌ షేర్‌ సాధించిన పార్టీని ప్రతిపక్షపార్టీగా గుర్తించకపోవడం దారఉమన్నారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు. అసెంబ్లీలో ప్రశ్నలు వేసినట్లుగానే.. మండలిలో కూడా అధికార పక్షాన్ని ప్రశ్నించాలన్నారు. పూర్తి వివరాలు, ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. ఈ వివరాలన్నింటినీ కూడా ఎమ్మెల్సీలకు పంపిస్తామన్నారు.

తిరుమల వెళ్లే భక్తులకు గమనిక .. ఈ రూట్‌లో ప్రత్యేక రైలు, ఈ స్టేషన్‌లలో ఆగుతుంది

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 13న తిరుపతి సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు 13వ తేదీ రాత్రి 8:15 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లె, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా సికింద్రాబాద్‌ చేరుకుంటుందని చెప్పారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

మరోవైపు ప్రయాణికుల రద్దీతో మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 12 నుంచి 24 వరకు రాయలసీమ జిల్లాల మీదుగా ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ ప్ర‌త్యేక రైళ్లు ధ‌ర్మవ‌రం, అనంత‌పురం, డోన్‌, క‌ర్నూలులో ఆగుతాయి. నవంబ‌ర్ 12, 19 తేదీల్లో బెంగ‌ళూరు (ఎస్ఎంవీటీ)-బ‌రౌని స్పెష‌ల్‌ (06563) రైలు రాత్రి 9.15 గంట‌ల‌కు బెంగ‌ళూరులో బయల్దేరి మరుసటి రోజు రాత్రి 8 గంటలకు బరౌనికి వెళుతుంది. ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలులో ఆగుతుంది. ఆ తర్వాత మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, కాచిగూడ‌, కాజీపేట మీదుగా బరౌని చేరుకుంటుంది. ఈ రైలు (బ‌రౌని-ఎస్ఎంవీటీ బెంగ‌ళూరు 06564) తిరుగు ప్రయాణంలో న‌వంబ‌ర్ 15, 22 తేదీల్లో సాయంత్రం 5.30 గంట‌ల‌కు బ‌రౌనీలో బయల్దేరి.. మ‌రుస‌టి రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు ఎస్ఎంవీటీ బెంగ‌ళూరు చేరుకుంటుంది.

న‌వంబ‌ర్ 13న య‌శ్వంత‌పూర్-ముజ‌ఫ‌ర్‌పూర్ స్పెష‌ల్ (06229) స్పెషల్ రైలు ఉద‌యం 7.30 గంట‌ల‌కు య‌శ్వంత‌పూర్‌లో బ‌య‌ల్దేరి.. రెండో రోజు ఉద‌యం 9.45 గంట‌ల‌కు ముజ‌ఫ‌ర్‌పూర్‌ చేరుకుంటుంది. ఈ రైలు ధ‌ర్మ‌వ‌రం, అనంత‌పురం, డోన్‌, క‌ర్నూలు సిటీ, మ‌హబూబ్‌న‌గ‌ర్‌, కాచిగూడ‌, కాజీపేట మీదుగా వెళుతుంది. ఈ రైలు (ముజ‌ఫ‌ర్‌పూర్‌-య‌శ్వంత‌పూర్‌ 06230) తిరుగు ప్రయాణంలో 16న ఉద‌యం 10.45 గంట‌ల‌కు ముజ‌ఫ‌ర్‌పూర్‌లో బ‌య‌ల్దేరి.. రెండో రోజు ఉద‌యం 10.30 గంట‌ల‌కు య‌శ్వంత‌పూర్‌ చేరుకుంటుంది.

న‌వంబ‌ర్ 14, 21 తేదీల్ య‌శ్వంత‌పూర్-దానాపూర్ (06271) ప్రత్యేక రైలు ఉద‌యం 7.30 గంట‌ల‌కు య‌శ్వంత‌పూర్‌లో బ‌య‌ల్దేరి.. రెండో రోజు ఉద‌యం 6 గంట‌ల‌కు దానాపూర్‌కు చేరుకుంటుంది. ఈ రైలు ధ‌ర్మ‌వ‌రం, డోన్‌, క‌ర్నూలు సిటీ, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, కాచిగూడ‌, కాజీపేట మీదుగా వెళుతుంది. ఈ రైలు (దానాపూర్‌-య‌శ్వంత‌పూర్ స్పెష‌ల్ 06272) తిరుగు ప్రయాణంలో.. 17, 24 తేదీల్లో ఉద‌యం 8 గంట‌ల‌కు దానాపూర్‌లో బ‌య‌లుదేరి.. రెండో రోజు ఉద‌యం 10.30 గంట‌ల‌కు య‌శ్వంత‌పూర్ చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

వైఎస్ జగన్ ఆస్తుల కేసు.. సుప్రీం కోర్టు కీలక పరిణామం, ఆదేశాలు జారీ

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం జరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని, ఈ కేసుల విచారణను హైదరాబాద్ నుంచి మరో కోర్టుకు మార్చాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపి పిటిషన్లపై విచారణ బెంచ్‌ను మార్చింది. డిసెంబర్‌ 2న జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు పంపాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.

వాస్తవానికి రఘురామ దాఖలు చేసిన పిటిషన్ సీజేఐ ధర్మాసనం ముందుకు విచారణకు వెళ్లింది. అయితే ధర్మాసనంలో జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ సభ్యుడు కాగా.. విచారణ ప్రారంభం కాగానే.. ఈ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి అని జగన్ తరఫు లాయర్ తెలిపారు. తమకు కౌంటర్‌ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫున లాయర్ కోరారు. అయితే జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అన్నారు.. దీంతో ఈ పిటిషన్‌లపై విచారణను మరో ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు. గతంలో కూడా జస్టిస్ సంజయ్ కుమార్ తన ముందు ప్రస్తావించవద్దని చెప్పారు.. కానీ పొరపాటున ఇవాళ లిస్ట్ చేసినట్లు సీజే తెలిపారు.

ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు ఆగస్టులో విచారణ జరిపింది.. సీబీఐ మే నెలలో దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలను పరిశీలించింది. ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్ల అంశాన్ని కోర్టుకు వివరించింది సీబీఐ. ఈ కారణంగా విచారణ ముందుకు సాగడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వీటిపై తీర్పులు ఇవ్వడానికి ముందే జడ్జిలు కూడా మారిపోతున్నారని.. సీబీఐ కోర్టులో తాజా న్యాయమూర్తి రెండేళ్లు కాకుండానే బదిలీ అయ్యారని కోర్టుకు చెప్పారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్ల అంశాన్ని రఘురామ తరఫు లాయర్ కూడా ప్రస్తావించారు.. ఆ తర్వాత జరిగిన విచారణ సంగతి తెలిసిందే.

ఇలాంటి కేసుల విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ట్రయల్‌ చేపట్టాలని న్యాయమూర్తి సూచించారు. ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నాయని.. వాటిని అనుసరించాల్సిందేనని.. అవే సీబీఐకి కూడా వర్తిస్తాయని చెప్పారు. అయితే తాజాగా జరిగిన విచారణలో.. సుప్రీం కోర్టు జగన్ ఆస్తుల కేసులో రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు ధర్మాసనాన్ని మార్చింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో కొత్త ప్లాన్‌.. ఇంటికి దూరంగా ఉన్నా.. దేశంలో ఎక్కడైనా.. Wi-Fi సేవలు వినియోగించుకోవచ్చు

దేశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు టారిఫ్‌ ధరలను పెంచడంతో లక్షలాది మంది వినియోగదారులు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL వైపు మొగ్గుచూపుతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ (Bharat Sanchar Nigam Limited) సైతం కొత్త సేవలను అందిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలో 4G నెట్‌వర్క్‌ విస్తరణ, 5G ప్రారంభానికి ముందు కొత్త లోగో ఆవిష్కరణ వంటి వంటి చర్యలు చేపట్టింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త సేవలను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీ తన జాతీయ Wi-Fi రోమింగ్ సేవను కూడా ప్రారంభించింది.

ఇది BSNL FTTH (ఫైబర్-టు-ది-హోమ్) వినియోగదారులను భారతదేశం అంతటా BSNL నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం.. BSNL FTTH కస్టమర్‌లు నిర్ణీత ప్రదేశంలో మాత్రమే హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని పొందుతున్నారు. అయితే.. BSNL కొత్త జాతీయ Wi-Fi రోమింగ్ సేవలను పరిచయం చేయడంతో.. ఈ కస్టమర్లు త్వరలో భారతదేశంలో ఎక్కడి నుండైనా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయగల సామర్థ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది.

ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలంటే?
వినియోగదారులు BSNL FTTH జాతీయ Wi-Fi రోమింగ్ సేవలను ఉపయోగించుకోవడానికి.. తప్పనిసరిగా BSNL వెబ్‌సైట్‌లో https://portal.bsnl.in/ftth/wifiroaming లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో.. వినియోగదారులు ధృవీకరణను పూర్తి చేయడానికి వారి FTTH కనెక్షన్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఈ కొత్త సేవల ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇమేజ్‌ని మెరుగుపరచుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ పరిధిని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సేవలతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా BSNL Wi-Fi కనెక్షన్ అందుబాటులో ఉన్నంత వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు. దీని అర్థం వినియోగదారులు తమ ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఇంట్లోనే ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు.

ఇవే కాకుండా.. తాజాగా BSNL నెట్‌వర్క్‌ నుంచి కొత్త 7 రకాల సేవలు ప్రారంభం అయ్యాయి. స్పామ్‌ డిటెక్షన్‌, ఆటోమేటెడ్‌ సిమ్‌ కియోస్క్‌లు, డైరెక్ట్‌ టూ డివైస్‌ సేవలు, వైఫై రోమింగ్‌, ఐఫ్‌టీవీ, రియల్‌టైం డిజాస్టర్‌ రెస్పాన్స్‌ సహా సెఫ్టీ ఫీచర్‌లతో సురక్షితమైన నెట్‌వర్క్, ఈ ఆక్షన్‌ వంటి సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. కాల్‌ ఛార్జీలను పెంచే ఆలోచన తమకు లేదని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ రాబర్ట్‌ రవి ఇటీవల స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే 4G కమర్షియల్‌ సర్వీస్‌లు ప్రారంభిస్తామని కూడా అన్నారు.

ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ ఛార్జీలపై రీఫండ్ అస్సలు రాదు తెలుసా? ఫుల్ లిస్ట్ ఇదిగో

భారత్‌లో నిత్యం రైళ్లలో కోట్లాది మంది ప్రయాణం చేస్తుంటారు. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా.. ఆధ్యాత్మిక ప్రదేశాలు, తీర్థయాత్రలకు వెళ్లాలన్నా రైలు ప్రయాణం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బస్సుల్లో ఎక్కువ సేపు ప్రయాణం చేసేందుకు ఇష్టపడని వారు కూడా ట్రైన్ జర్నీ పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇందులో కూడా రద్దీ తీవ్రంగా ఉంటుంది. అందుకే చాలా మంది ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. దీనిని రిజర్వేషన్ అని చెప్పొచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక వెబ్‌సైట్ యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. ఇలా ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారు సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలుంటుంది. లేకుంటే గంటలకు గంటలు నిల్చొని ఉండాల్సి వస్తుంది.

కొన్ని సార్లు మన ప్రయాణాలు వాయిదా పడొచ్చు. దీనికి కారణం ఏదైనా కావొచ్చు. ముందుగా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. క్యాన్సిల్ చేసిన టికెట్లపై ఐఆర్‌సీటీసీ రీఫండ్ ఇస్తుంది. అయితే ఇది పూర్తి మొత్తం రాదన్న విషయం తెలిసిందే. మీరు రిజర్వేషన్ చేసుకున్నప్పుడు చెల్లించిన దాని కంటే తక్కువే అందుతుంది. అయితే.. ఎలాంటి వాటిపై రైల్వే శాఖ ఛార్జీల్ని రీఫండ్ చేయదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మేరకు ఈ ఛార్జీల గురించి స్పష్టత ఇచ్చారు రైల్వే బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ దిలీప్ కుమార్. ఇందులో ట్రైన్ ఫేర్‌కు అదనంగా రిజర్వేషన్ ఛార్జీ, సూపర్‌ఫాస్ట్ ఛార్జీ, జీఎస్టీ వంటివి కలిపే ఉంటాయని అన్నారు. ఇక టికెట్ క్యాన్సిల్ చేస్తే కేవలం ట్రైన్ ఫేర్ మాత్రం రీఫండ్ రూపంలో వస్తుందని తెలిపారు. ఇక రిజర్వేషన్ ఛార్జీలు, జీఎస్టీ నాన్ రీఫండబుల్ అని వివరించారు.

భారతీయ రైల్వే వ్యవస్థలో రెండు రకాల ట్రైన్స్ ఉన్నాయి. ఒకటి సూపర్‌ఫాస్ట్, రెండోది ప్యాసింజర్ అండ్ లోకల్ ట్రైన్స్. దూరప్రాంతాలకు రిజర్వేషన్స్ కోసం అయితే సూపర్‌ఫాస్ట్, తక్కువ దూరం ఉండి ప్రతి స్టేషన్లో ఆగుతుంటే వాటిని ప్యాసింజర్ ట్రైన్స్ అంటారు. వీటిల్లో రిజర్వేషన్లపై సూప‌ర్‌ఫాస్ట్ ఛార్జీలు ఉండవు.

మీరు ప్రయాణించే తరగతిని బట్టి రిజర్వేషన్ ఛార్జీలు మారుతుంటాయి. వీటిపై రీఫండ్ రాదు. సెకండ్ క్లాస్ టికెట్లపై రిజర్వేషన్ ఛార్జీ రూ. 15 గా ఉంటుంది. స్లీపర్ కోచ్‌లో రూ. 20, ఏసీ ఛెయిర్ కార్, ఏసీ ఎకానమీ, థర్డ్ ఏసీకి అయితే రూ. 40 పడుతుంది. ఏసీ సెకండ్ క్లాస్ కోసం రూ. 50, ఏసీ ఫస్ట్ కోసం రూ. 60 రిజర్వేషన్ ఫీజుగా చెల్లించాలి. ఇవి సహా వీటిపై జీఎస్టీపైనా రీఫండ్ తిరిగి పొందలేరు.

గూగుల్‌లో ఈ 6 పదాలను అసలు సర్చ్ చేయవద్దు.. హ్యాకర్ల బారిన పడుతారు

సైబర్ సెక్యూరిటీ సంస్థ SOPHOS షాకింగ్ సమాచారాన్ని ఇచ్చింది. ఇంటర్నెట్ వినియోగదారులు పొరపాటున కూడా గూగుల్‌లో ఈ 6 పదాలను సెర్చు చేయవద్దని హెచ్చరించింది

ఈ మధ్య కాలంలో హ్యాకర్లు పెట్రేగిపోతున్నారు. హ్యాకర్ల బెడద బాగా ఎక్కువైపోయింది. ఇంటర్నెట్ యూజ్ చేసే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరినీ హడలెత్తిస్తున్నారు. వారి పర్సనల్ డేటాతో పాటు డబ్బును కూడా దొంగలించేస్తున్నారు. ప్రజలను మోసం చేసేందుకు హ్యాకర్లు కొత్త కొత్త ట్రిక్స్‌ను కనిపెట్టారు. మీరు గూగుల్ సెర్చ్‌లో ఏదైనా ఎంటర్ చేసి సర్చ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గూగుల్‌లో ఏదైనా టైప్ చేయడం, ఏది పడితే ఆ లింక్ లను క్లిక్ చేయడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
SEO పాయిజనింగ్ అంటే ఏమిటి?

SEO పాయిజనింగ్ అనేది హ్యాకర్లు సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ తారుమారు చేసే టెక్నిక్, తద్వారా గూగుల్ శోధన ఫలితాల ఎగువన అటువంటి ప్రమాదకరమైన లింక్‌లు కనిపిస్తాయి. మీరు ఈ లింక్ లపై క్లిక్ చేసి, సైట్ ను సందర్శించిన వెంటనే, మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, లాగిన్ ఐడి, పాస్ వర్డ్ వంటి ముఖ్యమైన సమాచారం దొంగిలించడబతాయి.

ఈ లింక్ లపై క్లిక్ చేయడం ద్వారా, గూట్‌లోడర్ అనే ప్రోగ్రామ్ సిస్టమ్ లోకి డౌన్‌ అయ్యే ప్రమాదం పెరుగుతుందని నివేదికలో చెప్పబడింది. మీ సిస్టమ్ పై నియంత్రణను హ్యాకర్ల చేతుల్లోకి ఇవ్వగలదు. దీని కారణంగా హ్యాకర్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చు. అంతేకాకుండా మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయవచ్చు. సోఫోస్ ప్రకారం, ఈ లింక్‌లు ఆస్ట్రేలియాలో నివసించే వినియోగదారులకు చాలా ప్రమాదకరమైనవి.

హ్యాకర్లను నివారించాలంటే..

బలమైన పాస్‌వర్డ్‌లు: అన్ని ఖాతాల కోసం విభిన్నమైన, బలమైన పాస్వర్డ్ లను ఉపయోగించండి. పాస్‌వర్డ్ లలో అక్షరాలు పెద్ద అక్షరం, చిన్న అక్షరాలు రెండూ) సంఖ్యలు, ప్రత్యేక చిహ్నాలు ఉండాలి. ఇది కాకుండా, పాస్‌వర్డ్ ‌ను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండండి.

రెండు కారకాల ప్రమాణీకరణను ఉపయోగించండి: మీరు ఏ యాప్‌లో ఈ ఫీచర్‌ని పొందారో, ఆ యాప్ లో ఈ ఫీచర్‌ని ఉపయోగించాలని నిర్థారించుకోండి.

తెలియని లింక్‌లు, పబ్లిక్ వైఫై: అనుమానాస్పద ఇమెయిల్ లు, లింక్‌లు లేదా సందేశాలపై క్లిక్ చేయవద్దు. ఇది కాకుండా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్ లలో బ్యాంకింగ్ సమాచారం లేదా పాస్‌వర్డ్ లను షేర్ చేయవద్దు.

యాంటీవైరస్ : మీ సిస్టమ్‌ను రక్షించడానికి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ను ఇన్‌స్టాల్ చేయండి. అంతేకాకుండా దానిని క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయండి.

SOPHOS ఏం చెబుతుందంటే..

తాజాగా, సైబర్ సెక్యూరిటీ సంస్థ SOPHOS షాకింగ్ సమాచారాన్ని ఇచ్చింది. ఇంటర్నెట్ వినియోగదారులు పొరపాటున కూడా గూగుల్‌లో ఈ 6 పదాలను సెర్చు చేయవద్దని హెచ్చరించింది. అలా చేస్తే హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉందని సూచించింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ ఇంటర్నెట్ వినియోగదారులను అలర్ట్ చేసింది. పొరపాటున కూడా, ఆస్ట్రేలియాలో బెంగాల్ పిల్లులు చట్టబద్ధంగా ఉన్నాయా?’Are Bengal Cats legal In Australia?’ అని అసలు సెర్చ్ చేయవద్దని హెచ్చరించింది. హ్యాకర్లు అలాంటి కొన్ని మోసపూరిత లింక్‌లను సృష్టించారని.. మీరు వాటిని క్లిక్ చేస్తే, మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని తెలిపారు. హ్యాకర్లు ఈ పని కోసం SEO పాయిజనింగ్ టెక్నిక్‌ని ఉపయోగిస్తున్నారని తెలిపారు. గూగుల్ లో కనిపించే ఈ ప్రమాదకరమైన లింక్ లపై మీరు క్లిక్ చేసిన వెంటనే, మీ భద్రత, గోప్యత రెండూ ప్రమాదంలో పడతాయని అలర్ట్ చేసింది.

ఇలా చేస్తే మీ పర్సనల్​ లోన్​ అప్లికేషన్​ తొందరగా అప్రూవ్​ అవుతుంది

అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం చాలా మంది పర్సనల్​ లోన్​ తీసుకుంటారు. అయితే, మీ పర్సనల్​ లోన్​ త్వరగా అప్రూవ్​ అవ్వాలంటే మీరు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటంటే.

డబ్బు అనేది ఎప్పుడు, ఏ విధంగా అవసరం పడుతుందో తెలియదు! అత్యవసర సమయాల్లో చాలా మంది పర్సనల్​ లోన్​వైపు చూస్తుంటారు. కానీ కొందరుకు లోన్​ రావడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఎప్పుడు పర్సనల్​ లోన్​కి అప్లై చేసినా, తొందరగా అప్రూవ్​ అవ్వాలంటే కొన్ని వ్యూహాలను పాటించాలి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

మీ పర్సనల్ లోన్ అప్లికేషన్​ను మెరుగుపరచడానికి టిప్స్​..
1. క్రెడిట్ స్కోర్

వ్యక్తిగత రుణాలతో సహా ఏదైనా రుణాన్ని పొందడానికి బలమైన క్రెడిట్ స్కోరు కీలకం. రుణదాతలు అధిక క్రెడిట్ స్కోరును క్రెడిట్ అర్హతకు సూచికగా చూస్తారు. ఇది మీరు డిఫాల్ట్ అయ్యే అవకాశం తక్కువగా ఉందని సూచిస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే దరఖాస్తు చేసే ముందు దాన్ని మెరుగుపరుచుకునేలా చర్యలు తీసుకోండి. ఇప్పటికే ఉన్న రుణాలను చెల్లించడం, సకాలంలో చెల్లింపులు చేయడం, తప్పుల కోసం మీ క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేయడం ఇందులో ఉండవచ్చు.

2. ఆదాయపు పన్ను రిటర్నులు..

మీ ఆదాయపు పన్ను రిటర్నులను క్రమం తప్పకుండా దాఖలు చేయడం కూడా మీ వ్యక్తిగత రుణ దరఖాస్తుకు మద్దతు ఇస్తుంది. గత రెండేళ్లలో మీరు చెల్లించిన పన్నులను ధృవీకరించడానికి రుణదాతలు తరచుగా ఫారం 26 ఏఎస్ వంటి డాక్యుమెంటేషన్​ని అభ్యర్థిస్తారు. ఈ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం వల్ల మీ అప్లికేషన్ బలపడుతుంది.
3. మీ స్థోమతను తెలుసుకోండి..

పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయండి. మీ ఆర్థిక స్థోమతకు మించిన మొత్తాన్ని అభ్యర్థించడం తిరస్కరణకు దారితీయవచ్చు. మీరు నెలవారీ చెల్లింపులను సౌకర్యవంతంగా నిర్వహించగలరో లేదో తెలుసుకోవడానికి రుణదాతలు మీ ఆదాయాన్ని చూస్తారు. సంభావ్య రుణ చెల్లింపులను అంచనా వేయడానికి ఆన్​లైన్ కాలిక్యులేటర్లను ఉపయోగించండి. మీ బడ్జెట్​కి సరిపోయే మొత్తాన్ని ఎంచుకోండి.
4. తగినంత ఆదాయం..

చాలా మంది రుణదాతలకు వ్యక్తిగత రుణాల కోసం కనీస నెలవారీ జీతం, తరచుగా రూ. 25,000 అవసరం. మీ ఆదాయం ఈ పరిమితి కంటే తక్కువగా ఉంటే, దరఖాస్తు చేయడానికి ముందు మీరు ఈ స్థాయికి చేరుకునే వరకు వేచి ఉండటం మంచిది.

5. ఉద్యోగ స్థిరత్వం..

మీ ఉద్యోగ స్థితి మీ రుణ దరఖాస్తును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. మీరు కనీసం ఒక సంవత్సరం పాటు ఉద్యోగంలో ఉన్నారో లేదో అని లెండర్లు చూస్తారు. ఇది మీ ఉద్యోగ స్థిరత్వాన్ని సూచిస్తుంది. మీరు ఇటీవల కొత్త పొజిషన్​ని ప్రారంభించినట్లయితే, పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు కొంతకాలం వేచి చూడటాన్ని పరిగణించండి.
6. ఎంప్లాయిమెంట్ టైప్..

మీరు ఏ కంపెనీలో పని చేస్తున్నారు? అన్నది కూడా కీలకంగా మరుతుంది. ఒక ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్​యూ) లేదా పెద్ద సంస్థలో పనిచేయడం సాధారణంగా చిన్న వ్యాపారంలో ఉద్యోగం చేయడం లేదా ఫ్రీలాన్సర్​గా పనిచేయడం కంటే వ్యక్తిగత రుణాన్ని పొందడం సులభం చేస్తుంది.

విదేశాలకే వెళ్లాలనే ఆలోచనొద్దు.. ఇంటి నుంచి కూడా డాలర్లు సంపాదించొచ్చు

భారత్‌లో చాలామందికి ఇతర దేశాలకు వెళ్లాలనే ఆలోచన ఉంటుంది. అక్కడి సిటిజన్‌షిప్ వస్తే ఇక హాయిగా లైఫ్ సెట్ అనుకుంటారు. కానీ మీరు ఇంటి నుంచి కూడా డాలర్లు సంపాదించొచ్చు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి.

విదేశాలకు వెళ్లాలని కొందరికి డ్రీమ్. ఇందుకోసం చాలా కష్టపడుతారు. అక్కడకు వెళ్లి ఉద్యోగం చేస్తే డాలర్లు సంపాదించొచ్చని లెక్కలు వేసుకుంటారు. చదువు పేరుతో అక్కడకు వెళ్లి.. విదేశాల్లోనే సెటిల్ అవ్వాలని కలలు కంటారు. అమెరికా, జర్మన్, కెనడా, ఆస్ట్రేలియాలాంటి దేశాల పౌరసత్వం కోసం నానా తిప్పలు పడుతారు. ఇక ఎలాంటి ఇబ్బందులు రావని అనుకుంటారు. డబ్బులు బాగా సంపాదించొచ్చు అని ఆలోచన చేస్తారు. కానీ మీరు ఇంటి నుంచి కూడా డాలర్ల రూపంలో డబ్బులు సంపాదించొచ్చు.

కంపెనీలు కొరుకునే స్కిల్ మీకు ఉంటే.. వివిధ దేశాలకు చెందిన సంస్థల్లో పని చేయవచ్చు. మీకు డబ్బులు కూడా డాలర్ల రూపంలో చెల్లిస్తారు. హాయిగా ఇంటి నుంచి జాబ్ చేయవచ్చు. ఏ రిస్క్ ఉండదు. కాకపోతే వారి టైమింగ్స్ ప్రకారం మీరు పని చేయాల్సి ఉంటుంది. విదేశాల్లోని వివిధ కంపెనీల్లో పని చేసేందుకు మీరు పెద్దగా ఇబ్బందిపడాల్సిన పని లేదు. ఇందుకోసం కొన్ని రకాల వెబ్‌సైట్స్ ఉన్నాయి. అందులో మీరు రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఇంటర్వ్యూలాంటివి ఫేస్ చేయాల్సి ఉంటుంది.

ప్రియాంక్ అహూజా అనే కెరీర్ కోచ్, మెంటర్, కన్సల్టెంట్.. అలాంటి వెబ్‌సైట్‌ల గురించి తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో షేర్ చేశారు. అందులో మీకు ఏది సూట్ అవుతుందో చూసి రిజిస్టర్ అవ్వొచ్చు. ఇందులో కొన్ని రిమోట్, హైబ్రిడ్ పద్ధతిలో ఉన్నాయి. ఆ సమాచారం మీకోసం..

JustRemote

ఈ వెబ్‌సైట్‌లో మీరు రిమోట్, హైబ్రిడ్ ఉద్యోగాలను చూడవచ్చు.

https://justremote.co

Wellfound by Anglelist

ప్రత్యేకమైన స్టార్టప్, టెక్ ఉద్యోగాలు ఇందులో ఉంటాయి. మీ ప్రొఫైల్‌ని ఉపయోగించి ఇందులో ఉద్యోగం సంపాదించొచ్చు.

https://wellfound.com

Working Nomads

డిజిటల్‌గా పని చేసేందుకు ఇందులో జాబ్స్ ఉంటాయి. ఎక్కడి నుండైనా పని చేయవచ్చు.

https://lnkd.in/g8jbCcgv

Remote

ప్రపంచవ్యాప్తంగా సులభంగా వర్క ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను పొందేందుకు ఈ సైట్ ఉపయోగపడుతుంది.

https://remote.com

oDesk Work

మీ నైపుణ్యల ఆధారంగా ఇందులో జాబ్ వెతుక్కోవచ్చు.

Home

Job Board Search

200 కంటే ఎక్కువ కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలను ఇందులో చూడవచ్చు.

https://jobboardsearch.com

JS Remotely

జావాస్క్రిప్ట్ ఉద్యోగాల కోసం ఈ సైట్ చాలా బెస్ట్.. ప్రతిరోజూ 200కి పైగా కొత్త జాబితాలు ఇందులో ఎంటర్ అవుతాయి.

https://jsremotely.com

Remote.co

స్థానిక ఉద్యోగాలను సులభంగా ఇందులో తెలుసుకోవచ్చు.

https://remote.co

Remote OK

ఇందులో ఉద్యోగాలను తెలుసుకోవడం చాలా సులభం అవుతుంది.

https://remoteok.com

Himalayas

100 ప్లస్ కేటగిరీలకు సంబంధించిన మీరు ఇష్టపడే రిమోట్ ఉద్యోగాన్ని కనుగొనవచ్చు.

https://himalayas.app

We Work Remotely

మంచి మంచి రిమోట్ ఉద్యోగాలను కనుగొనేందుకు ఇది బెటర్ సైట్.

https://weworkremotely.com

Flex Jobs

ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ రిమోట్, సౌకర్యవంతమైన ఉద్యోగ అవకాశాలను ఇందులో కనుగొనండి.

https://flexjobs.com

Fiverr

Fiverr అనేది ఫ్రీలాన్సర్ల కోసం ఒక ఉచిత వేదిక. సైన్ అప్ చేయండి. మీకు వచ్చిన స్కీల్ ఆధారంగా సంపాదించడం ప్రారంభించొచ్చు.

https://fiverr.com

Upwork

మీ ప్రతిభ ఆధారంగా ఇందులో ఉద్యోగాలు తెలుసుకోవచ్చు.

https://upwork.com

Freelance Writing

మీరు రచయిత అయితే ఈ వెబ్‌సైట్ మీకు పక్కాగా ఉపయోగపడుతుంది. రచయితలకు సులభంగా ఉద్యోగావకాశాలను కనుగొనే వెబ్‌సైట్ ఇది.

https://lnkd.in/gaaweqHF

Freelancer

ఫ్రీలాన్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసేవారికి వెబ్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, రైటింగ్‌లో వర్క్ కోసం ఇది సహాయపడుతుంది.

https://freelancer.in

Indeed

ఇందులో కూడా మంచి ఉద్యోగాలను సెర్చ్ చేయవచ్చు. ఆటో-అప్లై సిస్టమ్‌తో సులభంగా దరఖాస్తు చేసుకోండి.
https://in.indeed.com

Outsourcely

వెబ్ డెవలప్‌మెంట్, డిజైన్, కంటెంట్ రైటింగ్, మరిన్నింటిలో పార్ట్-టైమ్ లేదా ఫుల్-టైమ్ ఉద్యోగాలను ఇందులో కనుగొనండి.

https://outsourcely.com

Problogger

గోస్ట్‌రైటర్‌లు, బ్లాగర్‌లు, కంటెంట్ రైటర్‌ల కోసం ఇది ఉపయోగపడుతుంది. రిమోట్ వర్క్ కోసం సైన్ అప్ చేయండి. దరఖాస్తు చేసుకోండి.

https://problogger.com

linkedin

టాప్ కంపెనీలలో మీ నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాలను కనుగొనండి. ఇందుకోసం లింక్డ్ఇన్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

https://linkedin.com

గమనిక : ఇది కేవలం నిపుణులు చెప్పిన సమాచారం ఆధారంగా ఇచ్చిన కథనం మాత్రమే. కేవలం సమాచారం ఇవ్వడం మాత్రమే మా ఉద్దేశం. రిజిస్టర్ అవ్వడానికి డబ్బులు ఎవరైనా అడిగితే ఇవ్వకండి. నిపుణుల సలహా తీసుకోండి.

ఈ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారా

రైలు ప్రయాణాలు ప్రయాణికులకు చాలా అనుకూలమైనవి. ఎక్కువ దూరం వెళ్లాలనుకునే ప్రజలకు అందుబాటు ధరలో మంచి ప్రయాణాన్ని అందించే మార్గం రైల్వే ప్రయాణం. అందుకే పేద, మధ్య తరగతి ప్రజలు తమ ప్రయాణాలకు రైల్వే మార్గాన్నే ఇష్టపడతారు. అంతేగాక రైల్వే ప్రయాణంలో చక్కగా కిటికీ పక్కన కూర్చొని ఇయర్ ఫోన్స్ లో సాంగ్స్ వింటూ ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు. అలాగే కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారితో మన అనుభవాలు పంచుకోవచ్చు. చక్కగా మాట్లాడుకోవచ్చు. ఎలాంటి భయం లేని సురక్షితమైన ప్రయాణం. ఇవన్నీ కూడా సినిమాల్లో చాలా బాగా చూపిస్తారు.అఫ్ కోర్స్.. నిజ జీవితంలో కూడా రైల్వే ప్రయాణం బాగుంటుందిలే కానీ.. కొన్ని రైళ్లలో వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెప్పే వార్త వింటే కొన్ని రైళ్లు కాదు బాబోయ్, అన్ని రైళ్లలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఎందుకంటే ఈ వార్త విన్నారంటే కచ్చితంగా భయంతో వణికిపోవాల్సిందే.

కొన్ని రైళ్లలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. రైలు మార్గంలో రక రకాల మనుషులు పరిచయం అవుతారు.కొన్ని రైలు మార్గాలలో అయితే దొంగలు రెచ్చిపోతున్నారు. అసలు రాత్రి, పగలు అనే తేడా లేకుండా రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రయాణికులను బెదిరించి నగలు, డబ్బులు కూడా దోచుకుపోతున్నారు. ఇలా పలుమార్లు రైళ్లలో చాలా దోపిడీలు జరిగాయి. ప్రయాణికులు ఫిర్యాదుల కూడా చేశారు. కానీ రికవరీలో మాత్రం రైల్వే అధికారులు కూడా ముందడుగు వేయలేకపోతున్నారు. రైళ్లలో జరిగే దొంగతనాలను అసలు నియంత్రించలేకపోతున్నారు. దొంగలు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారని అనుకోవడం చాలా పొరపాటు. దొంగల్లో కూడా మంచి దొంగలు ఉంటారు. మంచి దొంగలంటే మంచోళ్ళు కాదండోయ్. మంచిగా మాటలు చెప్పి మాయలో ముంచేసే వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. తాజాగా ఇలాంటి వాళ్ళే వెలుగులోకి వచ్చారు. ఇంతకీ ఎలా దొంగతనం చేశారో తెలుసా? తెలిస్తే రైలు ప్రయాణాలు ఇక చేయరేమో.. చెన్నై నుంచి చీరాలకి పినాకిని ఎక్స్ ప్రెస్ వెళుతుంది. సరిగ్గా నెల్లూరు దాటాకా చోరీ జరిగింది. ఓ నడి వయసు మహిళ చెన్నై నుంచి పర్చూర్ కి తన బంధువుల ఇంటికి ఒంటరిగా వెళుతుంది. ట్రైన్ నెల్లూరు వచ్చాక ముగ్గురు యువకులు ట్రైన్ ఎక్కారు. ఆ మహిళ దగ్గరే కూర్చున్నారు. ఆ మహిళతో మాటలు కలిపారు. చాలా స్నేహంగా ఉన్నారు. కానీ ఆ మహిళకు మత్తు మందు ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. ముందుగా ఆమెకు మత్తు మందు కలిపిన జూస్ ఇచ్చారు. ఈ జూస్ తాగిన కొద్దిసేపటికే ఆ మహిళ మత్తులో జారుకుంది. దీంతో ఆమె వద్ద ఉన్న రూ. 10 లక్షల విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లారు.

కొద్ది సేపటకి ఆమెకు కొంచెం స్పృహ వచ్చింది. లేచి చూసే సరికి ఆమె ఒంటిపై బంగారు నగలు, బ్యాగ్ కనిపించలేదు. ఆ ముగ్గురు యువకులు కూడా కనిపించలేదు. దాంతో మహిళకు అసలు విషయం అర్ధమైంది. కానీ మత్తుమందు కారణంగా ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో తోటి ప్రయాణీకులు అతి కష్టంతో ఆమెను చీరాల స్టేషన్ లోని రైల్వే అధికారులకు అప్పగించారు. వారు ఆమెను హాస్పిటల్ లో చేర్పించారు. బాధితురాలి బంధువు వచ్చి చీరాల రైల్వే స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అతను తెలిపిన వివరాల ప్రకారం ఆ దొంగలు ఆమెకు బిస్కెట్స్, జ్యూస్ ఇస్తుంటే మొదట ఆమె తీసుకోలేదట. దాంతో ఆమె ముఖంపై వారు మత్తు మందు స్ప్రే చేశారని, ఆమె స్పృహ కొల్పవడంతో ఆమె మెడలోని బంగారు గొలుసు, బ్యాగ్ లో డబ్బు, నగలు దోచుకున్నారని ఆమె బంధువు చెప్పాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ రైలులో తరచూ దొంగతనాలు జరుగుతూ ఉంటాయని సమాచారం. అసలు విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే మార్గమే చాలా డేంజర్ అని దొంగలు ఎక్కువగా ఉంటారని తెలిసింది. మార్గం ఏదైనా, ట్రైన్ ఏదైనా ఇలాంటి దొంగలు కచ్చితంగా ఉంటారు. కాబట్టి మనం ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీ దగ్గర 10 Rupees కాయిన్స్ ఉన్నాయా

చాలా కిరాణా షాపుల్లో కూడా 10 రూపాయల కాయిన్‌ను తీసుకోవడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో దీన్ని తీసుకోవడం లేదు..ఒక్క హైదరాబాద్ అనే కాదు.. చాలా చోట్ల చాలా కిరాణా షాపుల్లో కూడా దీన్ని తీసుకోవడం లేదు. ఇక పల్లెటూర్ లలో అయితే అసలు దీని సంగతే మరిచిపోయారు. ఎక్కడ చూసినా కూడా 10 రూపాయల కాయిన్ చెల్లు బాటు కావడం లేదు. క్రమక్రమంగా ఈ రూ.10 నాణేలను తీసుకోవడం పూర్తిగా ఆపేశారు. షాపుకు వెళ్లి రూ.10 కాయిన్ ఇస్తే ఇప్పుడు తీసుకునే పరిస్థితులు ఒక్కటి కూడా కనిపించడం లేదు. అసలు ఎందుకు ఈ నాణేలను తీసుకోవట్లేదు? ఇవి నిజంగా చెల్లు బాటు కావా? ఈ నాణేల గురించి బ్యాంక్స్ ఏం చెబుతున్నాయి? RBI ఏమి చెబుతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

షాపుల్లో రూ.10 కాయిన్లు తీసుకోకపోవడం వల్ల చాలా మంది దగ్గర అలానే ఉండిపోయాయి. ఎవ్వరూ వీటిని తీసుకోకపోవడం వల్ల అవి ఉన్నా కూడా లేనట్లే అని చాలా మంది వాటిని పూర్తిగా వదిలేశారు. చాలా మంది ఇళ్ళల్లో అవి అలాగే ఉండి పోతున్నాయి. అయితే రూ.10 కాయిన్లు కలిగిన వారికి ఇప్పుడు చెప్పే న్యూస్ మాత్రం నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బ్యాంక్ లన్నీటికి హెడ్ అయిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ రూ.10 కాయిన్లపై ఫుల్ ఫోకస్ పెట్టింది. RBI బ్యాంకులన్నిటికీ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో బ్యాంకులు వ్యాపారుల్లో, సామాన్యుల్లో రూ.10 కాయిన్లపై అవగాహన కల్పిస్తున్నాయి.

పది రూపాయల నాణేలు చెల్లుబాటులో లేవు అనేది కేవలం ఒక అపోహ మాత్రమే. ఈ నాణేలు పుష్కలంగా చెల్లుతాయని అనేక బ్యాంకులు చెబుతున్నాయి. అందువల్ల మీ దగ్గర ఈ కాయిన్స్ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చని ప్రజలకు సూచిస్తున్నాయి. కానీ ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినా కానీ .. చాలా మంది మారట్లేదు. ఈ నేపధ్యంలో స్ట్రిక్ట్ రూల్స్ కూడా జారీ చేసింది RBI. ఒకవేళ ఎవరైనా కానీ ఈ 10 రూపాయల కాయిన్లను తీసుకోవడానికి నిరాకరిస్తే చట్టప్రకారం చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎవరైనా కానీ ఈ కాయిన్స్ తీసుకోపోతే ఈ విషయాన్ని చెప్పండి. ఇదీ సంగతి. మీ దగ్గర 10 రూపాయల కాయిన్స్ ఉంటే కచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకోండి.

వాహనాదారులకు బిగ్ షాక్.. ఇలా చేస్తే ఇక జైలుకే

ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటారు. ఇటీవల కుర్రకారు రేస్‌బైక్‌లతో హారన్ల మోత మోగిస్తున్నారు. తమ వాహన సైలెన్సర్లను మార్చి పెద్ద సౌండ్ వచ్చే వాటిని ఉపయోగిస్తు రోడ్లపై రైయ్.. రైయ్ చక్కర్లు కొడుతున్నారు. ఆ శబ్ధం వల్ల ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు శబ్ధకాలుష్యం భారీగా పెరిగిపోతుంది. ఈ తరహా అల్లరి మూకలను కట్టడి చేసేందుకు విశాఖ పట్నం పోలీస్ కమీషనర్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఎక్కువ శబ్ధం చేసే వాహనాలను గుర్తించి, వాటి సైలెన్సర్లను తొలగించారు. వాటిని విశాఖ బీచ్ రోడ్ లో వరుసగా పేర్చి రోడ్ రోలర్ తో తొక్కించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

విశాఖ నగరంలో అధిక శబ్ధం చేచే సైలెన్సర్లు ఉపయోగిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుందని యువతను హెచ్చరించారు. పెద్ద శబ్ధాలు వచ్చే సైలెన్సర్లను వాడటం భారత మోటర్ వాహన చట్టం 1988 ప్రకారం సెక్షన్ 190 (II) కింద నేరంగా పరిగణించబడుతుంది. ఈ నేరానికి మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.10 వేల జరిమానా విధించబడుతుంది. అంతేకాదు, డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తారు. అదే నేరం రెండోసారి చేసినట్లయితే ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించడమే కాకుండా వాహనాన్ని కూడా సీజ్ చేస్తారు. మరోసారి డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల పాటు రద్దు చేస్తారు. కొంతమంది ఆకతాయిలు అధిక శబ్ధాలు చేస్తూ బైకులు నడుపుతూ ఇరిటేట్ చేస్తున్నట్లు నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ శబ్ధాలకు గుండె జబ్బు ఉన్నవారు, చిన్న పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలోనే నగర పోలీస్ కమిషనర్ కి వరుస ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆకతాయి బుద్ది చేప్పే పనిలో పడ్డారు పోలీసులు. మొదట సైలెన్సర్లు అమర్చే మెకానిక్ షాపు యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. తర్వాత మోడిఫై చేసిన సెలెన్సర్లను గుర్తించి వాటిని నాశనం చేశారు. భవిష్యత్ లో ఇలాంటి శబ్ధాన్ని సృష్టించే సైలెన్సర్లు వాహనాలకు అమర్చితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.

ఈ కార్యక్రమం విశాఖపట్నం నగర పోలీసు కమీషనర్, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు శాంతి భద్రతలు మరియు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 181 సైలెన్సర్లను ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో సైతం ఇలాంటి ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సైలెన్సర్లు మార్చుకొని బైక్ రేస్ పెట్టుకుంటూ హల్ చల్ చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను కోరుతున్నారు నగరవాసులు. ద్విచక్ర వాహనాలకు ఉండే సైలెన్సర్లను బిగించుకొని ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ వాహనాలు నడుపుకుంటూ రావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద అడ్డా వేస్తూ.. ఒక్కసారిగా బైకులను స్టార్ట్ చేసి రైయ్ రైయ్ అంటూ వేగం పెంచుకుంటూ జనాలను హడలగొడుతున్నారు.కొన్నిసార్లు బైక్ సౌండ్స్ తో హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కొంత మంది యువకులు కొత్త బైక్ మోజులో తిరుగుతుంటే.. మరికొందరు జులాయిగా తిరుగుతూ కావాలని ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి వారిపై ఫిర్యాదులు రావడం, వారిని పట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూనే ఉంది. కానీ ఆకతాయిల్లో మాత్రం మార్పు రావడం లేదు. అందుకే విశాఖ పోలీసులు ఇలాంటి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

రాత పరీక్ష లేకుండా రైల్వేలో 1791 Jobs రెడీ.. ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్

రైల్వేలో లోకో పైలట్, క్లర్క్, స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్, జూనియర్ టైమ్ కీపర్, జూనియర్ ఇంజినీర్ ఇలా రకరకాల జాబ్స్ ఉంటాయి. వీటిల్లో ఏ జాబ్ సాధించినా లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకుని ఉన్నత స్థానంలో స్థిరపడిపోవచ్చు. మంచి జీతం, అలవెన్సులు అందుకోవచ్చు. అందుకే రైల్వే జాబ్స్ కు కాంపిటీషన్ వేరే లెవల్ లో ఉంటుంది. రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి ఏ చిన్న నోటిఫికేషనన్ రిలీజ్ అయినా సరే దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పోటీపడుతుంటారు. మరి మీరు కూడా రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? రైల్వే జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. రాత పరీక్ష రాయకుండానే రైల్వే జాబ్ దక్కించుకునే అవకాశం వచ్చింది.

ఈజీగా జాబ్ కొట్టొచ్చు. కేవలం టెన్త్, ఐటీఐ మార్కుల ఆధారంగా రైల్వే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు. అప్లై చేస్తే చాలు జాబ్ పక్కాగా పొందే అవకాశం. వంద, రెండు వందలు కాదు ఏకంగా 1791 జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లోని రైల్వే రిక్రూట్ మెంట్ సెల్, నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్ డబ్య్లూఆర్ పరిధిలోని వర్క్ షాప్ లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1791 పోస్టులను భర్తీ చేయనున్నారు. కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్ వెషిన్ టూల్ మెయింటెనెన్స్ తదితర ట్రేడుల్లో భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు పోటీపడే వారు టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. దరఖాస్తు ఫీజుగా రూ. 100 చెల్లించాలి. ఎస్టీ/ఎస్సీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 10 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ rrcjaipur.in ను సందర్శించాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకునే వారు ఈ జాబ్స్ ను మిస్ చేసుకోకండి. మీరు కలలు కన్న రైల్వే జాబ్ కోసం అప్లై చేసి జాబ్ కొట్టండి.

వర్రాకు బిగుస్తోన్న ఉచ్చు.. అడ్డమైన రాతలకు మూల్యం తప్పదన్న కర్నూల్ రేంజ్ డీఐజీ

పిచ్చి కామెంట్లు.. రోత రాతలు.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడితూ ఇన్నాళ్లు పైశాచికానందం పొందిన వాళ్ల తాటతీస్తున్నారు ఏపీ పోలీసులు. వర్రా రవీందర్ అండ్ కో అరెస్ట్‌తో.. విస్తుపోయే నిజాలు బయటికొస్తున్నాయి. ఇంతకీ ఆ గ్యాంగ్‌ వెనుక కథ స్క్రీన్‌ ప్లే ఎవరిదన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్న ఏపీ పోలీసులు.. అరెస్ట్‌లతో హీటెక్కిస్తున్నారు. అసభ్యకర పోస్టుల కేసులో వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్‌ రెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్‌లను మార్కాపురం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో కీలక విషయాలు బయటికొచ్చాయన్నారు కర్నూల్ రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్‌. వర్రా రవీంద్ర 2019 నుంచి వైసీపీ సోషల్ మీడియా కార్తకర్తగా పనిచేస్తున్నాడు. 2020లో ఏపీ డీజిటల్ కార్పొరేషన్‌, సోషల్ మీడియా కార్పొరేషన్‌లో పనిచేశాడు. మొత్తం 130మందితో యాక్టివిటీ నడిపేవాడు రవీంద్ర. కొంతమంది నేతల పీఏలు ఇచ్చే కంటెంట్‌తో పోస్టులు పెట్టేవాడు. తమ అధినేతను విమర్శించిన వాళ్లపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి పైశాచికానందం పొందేవాడు నర్రా రవీందర్‌. సీఎం చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్‌, మంత్రులు లోకేష్‌, అనితతో పాటు ఏపీసీసీ చీఫ్ షర్మిలపైనా అసభ్యకర పోస్టులు పెట్టాడు. న్యాయమూర్తుల విషయంలోనూ తమ పైత్యాన్ని చాటారు. నాయకుల ఫోటోలు మార్ఫింగ్ చేసి అడ్డమైన రాతలు రాశారు. సోషల్ మీడియాలో 40హ్యాండిల్స్‌లో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, వీడియోలు పోస్టులు చేసినట్టు నిందితులు విచారణలో అంగీకరించారన్నారు డీఐజీ కోయా ప్రవీణ్‌. కొన్నిసార్లు ఒవేరేవాళ్ల ఐడీలతోనూ కంటెంట్‌ పెట్టినట్టు గుర్తించామన్నారు.

ముగ్గురు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేపడతామన్నారు పోలీసులు. వీళ్లు పెట్టిన పోస్టులు చదవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నాయని.. ఇదే పని అరబ్ దేశాల్లో చేస్తే బహిరంగ శిక్షలు ఉండేవని గుర్తుచేస్తున్నారు. వర్రాపై రాష్ట్రవ్యాప్తంగా 30 కేసులు నమోదయ్యాయి. ఎన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్టులు పెట్టారు..? ఏయే నేతల ఫోటోలు మార్ఫింగ్ చేశారు..? ఈ మొత్తం వ్యవహారం ఎవరి కనుసన్నల్లో జరిగిందన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. విచారణలో వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా మరిన్ని అరెస్ట్‌లు జరుగుతాయన్న ప్రచారం నడుస్తోంది.

హౌస్‌ సర్జన్‌ అయి ఉండి ఇదేం పని.. జూనియర్స్‌ను రాత్రి కారిడార్‌లోకి తీసుకొచ్చి

కాలేజీలు, యూనివర్సిటీల్లో ర్యాగింగ్‌ను ఆపాలని.. ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ర్యాగింగ్ భూతాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు కూడా తీసుకువచ్చాయి. అయినా ఇప్పటికీ కొన్ని సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

ఉన్నత విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ భూతం మళ్లీ పెచ్చుమీరుతోంది. విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు, రాత్రి నిఘా పెట్టాల్సిన స్క్వాడ్లు నిస్తేజంగా మారాయి. దీంతో విద్యార్థులు వికృత చేష్టలకు అడ్రస్ అవుతున్నారు. జూనియర్‌ విద్యార్థులపై సీనియర్లు దాడులకు తెగబడుతున్నారు.

తాజాగా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. పీకలదాకా మద్యం తాగిన హౌస్‌ సర్జన్‌ జగదీశ్… జూనియర్లను ర్యాగింగ్ చేశాడు. కారిడార్‌లోకి తీసుకొచ్చి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నరకం చూపించాడు. ఎదురుతిరిగిన ముగ్గురిని కొట్టాడు. దీంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేశారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ ద్వారా విచారణ చేపట్టిన కళాశాల యాజమాన్యం.. జగదీశ్‌ని ఏడాదిపాటు సస్పెండ్‌ చేసింది.

కాలేజీల్లో యాజమాన్యాలు యాంటీ ర్యాగింగ్ గ్రూపులు, స్క్వాడ్‌ను ఏర్పాటు చేసినా.. ఈ ర్యాగింగ్ మాత్రం ఆగడం లేదు. ఇదే ఇప్పుడు కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులను ఆందోళన కలిగిస్తోంది.

ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా..? అయితే, ఇలా ట్రై చేయండి..! ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు

ఘీ కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే నెయ్యి కాఫీ తాగితే శరీరానికి పోషకాలు అందుతాయి. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.

నెయ్యిలో ఒమెగా 3, 6, 9 లాంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందుకే కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే శరీరంలో హెల్దీ ఫ్యాట్ పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది.

ఉదయాన్నే ఈ ఘీ కాఫీ తాగడం వల్ల కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అసిడిటీ సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. మూడ్ స్విగ్స్‌ లేకుండా మెరుగ్గా ఉంటుంది. నెయ్యిలో విటమిన్ ఏ,ఈ,కే లాంటి విటమిన్లు ఉంటాయి. నెయ్యి కాఫీ తాగడం వల్ల ఇవన్నీ మన శరీరానికి అందుతాయి.

ముఖ్యంగా చలికాలంలో నెయ్యి కాఫీ తాగటం వల్ల శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తుంది. నెయ్యి కాఫీ వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. బరువు తగ్గించేందుకు తోడ్పడుతుంది. పొట్టలోని యాసిడ్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వును పెంచుతుంది. తరచూ ఆకలి వేయకుండా కంట్రోల్‌ చేస్తుంది.

నెయ్యి కాఫీ తీసుకోవడం వల్ల వాపును తగ్గించడంలో, పేగు లైనింగ్‌కు సహాయకారిగా ఉపకరిస్తుంది. హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితిని, ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది. నెయ్యిలో విటమిన్ ఎ, ఇ, కె పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వులను కరిగిస్తుంది.

ఘీ కాఫీ తయారీ కోసం ముందుగా కాఫీ పొడిని నీటిలో వేసి బాగా మరిగించాలి. అది మరుగుతున్నప్పుడు అందులో నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మరికాసేపు కాగనివ్వాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పాలల్లో కలుపుకుంటే ఘుమఘుమలాడే ఘీ కాఫీ తయారీ పూర్తయినట్లే.

మగువలకు బంగారంలాంటి వార్త.. భారీగా తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే

మగువలకు బంగారంలాంటి వార్త.. గోల్డ్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి గోల్డ్ ధరలు భారీగా దిగి వస్తున్నాయి.

నిన్నటితో పోలిస్తే ధరల్లో భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో.. బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ బులియన్ మార్కెట్‌తో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

22 క్యారెట్ల బంగారం ధర..

ఢిల్లీ – రూ. 72,340

ముంబై – రూ. 72,190

కోల్‌కతా – రూ. 72,190

బెంగళూరు – రూ. 72,190

చెన్నై – రూ. 72,190

హైదరాబాద్ – రూ. 72,190

విశాఖపట్నం – రూ. 72,190

విజయవాడ – రూ. 72,190

24 క్యారెట్ల బంగారం ధర..

హైదరాబాద్ – రూ. 78,750

విశాఖపట్నం – రూ. 78,750

విజయవాడ – రూ. 78,750

ఢిల్లీ – రూ. 72,340

ముంబై – రూ. 72,190

కోల్‌కతా – రూ. 72,190

బెంగళూరు – రూ. 72,190

చెన్నై – రూ. 72,190

వెండి ధరలు..

వెండి ధరలు కూడా బంగారం బాటలో నడుస్తున్నాయి. గత రెండు రోజుల్లో సుమారు రూ. 1100 మేరకు తగ్గింది. కిలో వెండి ప్రస్తుతం రూ. 93,000గా ఉంది. ఇక హైదరబాద్‌లో కిలో వెండి రూ. 1,01,900గా ఉంటే.. బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై నగరాల్లో కేజీ వెండి రూ. 92,900గా కొనసాగుతోంది. అటు చెన్నైలోనూ కిలో వెండి లక్ష దాటింది. ప్రస్తుతం రూ. 1,01,900గా ఉంది.

కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా

కార్తిక మాసంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలిసిందే. కార్తిక మాసం వచ్చిందంటే చాలు చాలా మంది శైవ క్షేత్రాల్లో ఉసిరితో దీపాలను వెలిగిస్తుంటారు.

ఇక కార్తిక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఉసిరి వేసుకొని స్నానం చేస్తారననే విషయం తెలిసిందే. అయితే ఉసిరికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఉంటుందనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతకీ కార్తిక మాసానికి, ఉసిరి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పురాణాల ప్రకారం ఉసిరి చెట్టును ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తారు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కష్టాలన్నీ దూరమై మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణంలో ఈ విషయాలను వెల్లడించారు. ఇక ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి కూడా ప్రతిరూపమని భావిస్తుంటారు. అందుకే కార్తిక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవీ అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.

ఇక కార్తిక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగించడం ఎంతో మంచిదని చెబుతుంటారు. ఈ రోజు ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే కార్తిక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. కార్తిక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.

శివాలయం లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టాలి. ముగ్గును పసుపు కుంకుమలతో, పూలతో అలంకరించాలి. తరువాత ఉసిరికాయను తీసుకుని, పై భాగంలో రౌండ్‌గా కట్ చేయాలి. ఆ తర్వాత అందులో నెయ్యిని నింపాలి. ఆ తర్వాత తామర కాడలతో తయారైన వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని పసుపు కుంకుమలతో, అక్షింతలతో అలంకరించాలి. ఇక ఉసిరి దీపాన్ని వెలిగించే సమయంలో ‘ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమః’ అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని విశ్వసిస్తారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు తెలిపిన వివరాల ప్రకారం అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

వైసీపీ విమర్శలకు ఎలా చెక్‌ పెట్టాలి.? వ్యూహం రడీ చేస్తున్న కూటమి నేతలు

అమరావతిలో నేడు (మంగళవారం) కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. NDA, LP సమావేవంలో అసెంబ్లీ చర్చల్లో భాగస్వామ్యంపై ప్రధానంగా ఫోకస్‌ చేయనున్నారు.

శాసనసభ సమావేశాలరు హాజరు రాకుండా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. దానికి ఎలాంటి కౌంటర్‌ ఇవ్వాలనేదానికీ కౌంటర్‌ వ్యూహం రెడీ చేసుకుంటున్నారు కూటమి నేతలు. అలాగే.. ఈ సెషన్‌లో ప్రవేశపెట్టబోతున్న కీలక బిల్లులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆమోదంపైనా శాసనసభాపక్ష భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. బడ్జెట్, శాసనసభా వ్యవహారాలపై ట్రెయినింగ్‌ ఇవ్వనున్నారు. తొలిసారి 84 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, రెండోసారి ఎన్నికైన 39 మంది ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నారు. అయ్యన్న నేతృత్వంలో అవగాహన తరగతులను నిర్వహించనున్నారు. అసెంబ్లీ సెషన్స్‌, బడ్జెట్‌పై సమగ్ర శిక్షణ అందించనున్నారు.

ఇక అసెంబ్లీ, కౌన్సిల్‌ చీఫ్‌ విప్‌, విప్‌ల నియామకంపై కసరత్తు మొదలు పెట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. అసెంబ్లీ చీఫ్‌ విప్‌లుగా దూళిపాళ్ల, జీవీ ఆంజనేయులు, కూన రవి, బెందాళం అశోక్‌ పేర్లను పరిశీలిస్తోంది. విప్‌లుగా జనసేన నుంచి బొమ్మిడి నాయగర్‌, ఆరవ శ్రీధర్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌ పేర్లను పరిశీలిస్తున్నారు. మండలి చీఫ్‌ విప్‌ రేసులో పంచిమర్తి అనురాధ, రాంగోపాల్‌రెడ్డి ఉండనున్నట్లు సమాచారం. ఇక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోసం కాల్వ శ్రీనివాసులు పేరును పరిశీలిస్తున్నారు. మంగళవారం ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు బిజీబిజీగా గడపనున్నారు.

అతిగా తింటున్నారా.? అసలు కారణం ఏంటో తెలుసా

మనిషి జీవించడానికి ఆహారం ఎంతో ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఏం తింటున్నామో అదే ఫలితం శరీరంపై పడుతుంది.

అయితే ఆహారం తీసుకునే విధానం వారి వారి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అయితే మితిమీరిన ఆరోగ్యం ఆహారంపై దుష్ప్రభావం పడేలా చేస్తుందని తెలిసిందే.

ఇంతకీ మనిషి మితిమీరిన ఆహారం ఎందుకు తీసుకుంటారో తెలుసా.? అదేం ప్రశ్న.. రుచిగా ఉంటేనో, ఆకలిగా ఉంటేనో తింటారు అంటారు కదూ! అయితే దీనికి ఒక శాస్త్రీయ కారణాన్ని వెతికారు పరిశోధకులు. మనుషులు మితిమీరిన ఫుడ్‌ ఎందుకు తీసుకుంటారన్న దానికి సంబంధించి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. సాధారణంగా శరీరంలోని గడియారానికి అనుగుణంగా ఆహారం తీసుకుంటున్నామా లేదా అన్నదానిపై కాలేయం నుంచి మెదడుకు కొన్ని సంకేతాలు వెళుతుంటాయి.

అయితే ఈ సంకేతాల్లో అవరోధం ఏర్పడితే మనిషి మితిమీరిన తిండి తీసుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా నైట్‌ ఫిష్ట్స్‌లో పని చేసే వారు, వేళ కానీ వేళలో నిద్ర పోతున్న వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనివల్ల ఊబకాయం, మధుమేహం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. శరీర గడియారంలో తలెత్తే అవరోధల వల్ల ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు.

రాత్రుళ్లు వేళ కానీ వేళలో పనిచేయడం వల్ల కాలేయ అంతర్గత గడియారం, దాని సంకేతాల్లో అవరోధం ఏర్పడుతున్నట్లు పెన్సిల్వేనియా వర్సిటీకి చెందిన పరిశోధకులు గుర్తించారు. దీనిని అధిగమించడానికి మెదడు చేసే ప్రయత్నాలు అతిగా తినడానకి దారి తీస్తాయని చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వారు జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడానికి ఇదే కారణమని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

కుండల్లో జీడిమొక్కలను పెంచేద్దామా..? హైబ్రీడ్ సీడ్ వచ్చేసిందిగా

సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం కేవలం ఆహారం తింటే సరిపోదు. అదనపు పోషకాలను కూడా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా జీవిస్తాం. అనారోగ్యాలు దరి చేరకుండా ఉంటాయి.

మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో డ్రైఫ్రూట్స్ చాలా కీలకం. వాటిలో జీడిపప్పు మనకు అందరికీ తెలిసిందే. దీనిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. విటమిన్ ఇ, బి, కె, కాపర్, జింక్, మెగ్నీషియం తదితర అనేక పోషకాలు లభిస్తాయి. నీటి వసతి తక్కువగా ఉండి, ఎండలు ఎక్కువగా కాసే ప్రాంతాల్లో జీడిమామిడి తోటలు కనిపిస్తాయి. ఏడాదికి ఒకసారి వీటిని దిగుబడి వస్తుంది. జీడిమామిడి పండ్లకు వచ్చే గింజలను సేకరించి, ప్రాసెసింగ్ చేసి జీడిపప్పును తయారు చేస్తారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్ లో ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది.

ప్రస్తుతం హైబ్రీడ్ జీడి మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఇంటిలో కుండలలో పెంచుకోవచ్చు. రెండు అడుగుల లోతు గల కుండీలను తెచ్చుకోవాలి. వాటిలో మొక్కలను నాటి సంరక్షించాలి. వీటికి ఖర్చు చాలా తక్కువ, సులభంగానే సాగు చేసుకోవచ్చు. హైబ్రీడ్ జీడి మొక్కల ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లో పెంచుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం కుండలో వీటిని నాటి, జాగ్రత్తగా చూసుకోవాలి. నాటిన మూడేళ్ల తర్వాత పెరగడం ప్రారంభిస్తాయి. సుమారు ఆరు నుంచి ఏడు సంవత్సరాల తర్వాత ఉత్పత్తి మొదలవుతుంది.

ఒక మొక్క నుంచి దాదాపు ఏడు కిలోల జీడిగింజలు వస్తాయి. ఒక కుండీలో ఐదు మొక్కలు నాటితే సుమారు 40 కిలోల దిగుబడి వస్తుంది. వీటిని ప్రాసెస్ చేసి జీడిపప్పను తీయవచ్చు. తద్వారా ఏడాదికి వేల రూపాయలను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే స్వచ్ఛమైన, నాణ్యమైన జీడిపప్పును తీనే వీలు కలుగుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో జీడిపప్పు దాదాపు రూ.1200 వరకూ పలుకుతోంది. జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచింది. చలికాలంలో తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె సంబంధ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. హైబ్రీడ్ జీడి మొక్కలను ఏ కాలంనైనా పెంచుకోవచ్చు. అయితే జూన్ నుంచి డిసెంబర్ అనుకూలంగా ఉంటుందని రైతులు చెబుతారు.

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్లు.. కీప్యాడ్ ఫోన్‌తో కూడా

యూపీఐ చెల్లింపులకు ఇంటర్నెట్ చాలా అవసరం. మన ఫోన్ లో నెట్ అయిపోయినా, సిగ్నల్స్ లేకపోయినా జరగవనే విషయం అందరికీ తెలిసిందే. కానీ .. ఫోన్ లో ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.

అలాగే సాధారణ కీప్యాడ్ ఫోన్ ద్వారా కూడా చేయవచ్చు. అత్యవసర సమయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) తీసుకువచ్చిన *99# అనే సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్లు చేేసే అవకాశం ఉంది. ఈ విధానంలో మీ బ్యాంకు ఖాతాకు డబ్బు పంపించుకోవచ్చు. అలాగే వేరొకరి నుంచి చెల్లింపులను స్వీకరించవచ్చు. బ్యాంకు ఖాతాలోని బ్యాలెన్స్ కూడా తనిఖీ చేసుకునే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు యూపీఐ పిన్ సెట్ చేసుకోవడం, మార్చు కోవడం చేయవచ్చు. దాని కోసం ఈ కింద తెలిపిన పద్దతులు పాటించాలి.

కీ ప్యాడ్ ఫోన్‌లో పేమెంట్లు ఇలా

మీ బ్యాంకు ఖాతాకు లింక్ చేసిన రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి *99# కు డయల్ చేయాలి.
బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన అన్ని వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. డబ్బు పంపండి, డబ్బును అభ్యర్థించండి, బ్యాలెన్స్ తనిఖీ, ప్రొఫైల్, పెండింగ్ అభ్యర్థన, లావాదేవీలు, యూపీఐ పిన్ అనే ఆప్షన్లు దానిలో ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి.
వేరొకరికి డబ్బులు పంపాలంటే 1 అని టైప్ చేసి, సెండ్ బటన్ ను ప్రెస్ చేయాలి.
డబ్బును పంపే పద్ధతిని ఎంపిక చేసుకోవాలి. అంటే మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, బ్యాంకు ఖాతాను ఎంచుకోవాలి. అనంతరం సెండ్ బటన్ నొక్కాలి.
మొబైల్ నంబర్ ద్వారా లావాదేవీలు చేయాలంటే డబ్బు గ్రహీత యూపీఐకి లింక్ చేసిన మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
అనంతరం నగదు మొత్తాన్ని సెండ్ చేయాలి.
చెల్లింపుతో పాటు మెసేజ్, వ్యాఖ్యను కూడా టైప్ చేయవచ్చు.
లావాదేవీని పూర్తి చేయడానికి మీ యూపీఐ పిన్ ను నమోదు చేయండి
దీంతో ఇంటర్నెట్ లేకుండానే మీ చెల్లింపులు పూర్తవుతాయి.
ఈ సేవను ఆపివేయాలనుకుంటే మళ్లీ *99# కు డయల్ చేసి, ఇచ్చిన సూచనలు పాటిస్తే సరిపోతుంది.

ఏపీకి గుడ్ న్యూస్.. రూ.40 వేల కోట్లతో టాటా పవర్ ప్రాజెక్టులు.

పెట్టుబడుల కోసం పెద్ద పెద్ద సంస్థలకు రెడ్‌ కార్పెట్ పరుస్తోంది ఏపీ ప్రభుత్వం. సంస్థలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అమరావతిలో టాటా గ్రూప్‌ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌.

రాష్ట్రవ్యాప్తంగా మరో 20హోటళ్ల ఏర్పాటుకి టాటా గ్రూప్ సంసిద్దత వ్యక్తం చేసింది. 40 వేల కోట్ల పెట్టుబడితో టాటా పవర్ సోలార్‌, విండ్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుపై చర్చించారు. విశాఖలో కొత్త ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖలో టీసీఎస్‌ ద్వారా 10వేల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు.

టీసీఎస్‌ క్యాంపస్ కోసం ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులు భవనాలను పరిశీలిస్తున్నారు. మిలీనియం టవర్స్ ఖాళీగానే ఉన్నందున ఆ టవర్స్‌ లీజుకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సొంత కార్యాలయాలను నిర్మించుకునే పనిలో ఉంది టీసీఎస్. ఈ క్రమంలో ఆ సంస్థ ఆసక్తి చూపిస్తే భూములు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో ఆరు నెలల్లో టీసీఎస్ కేంద్రం విశాఖలో ప్రారంభం అవుతుందని ఇప్పటికే లోకేష్‌ ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్‌-విజన్ 2047 రూపకల్పన అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్‌తో చర్చించామన్నారు సీఎం చంద్రబాబు. 2047 నాటికి ఏపీని నంబర్ వన్ ప్లేస్‌లో నిలవడమే లక్ష్యమన్నారు. మేధావులు, పరిశ్రమలు, ప్రముఖులు సభ్యులుగా స్వర్ణాంధ్రప్రదేశ్‌@2047 ఆర్థికాభివృద్ధి కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేర్వేరు రంగాల్లో ఇతర కంపెనీల భాగస్వామ్యం కల్పించే అంశాలపై ఇకపై విస్తృత చర్చలు ఉంటాయన్నారు చంద్రబాబు.

గూగుల్‌ మ్యాప్‌లో సరికొత్త ఫీచర్స్‌.. AI సహాయంతో మరిన్ని అప్‌డేట్స్‌

మ్యాప్‌లలో గూగుల్ భారీ మార్పులు చేసింది. గూగుల్‌ AI సాధనం ద్వారా మ్యాప్‌లను ఉపయోగించడం ఇప్పుడు మరింత సులభమైంది. ఉదాహరణకు.. మీకు స్థలం గురించి సమాచారం కావాలంటే, మీరు మ్యాప్‌లలో సులభంగా అడగవచ్చు.

ఉపయోగకరమైన సందేశాన్ని చదివిన తర్వాత మీకు ఆ స్థలం గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఉదాహరణకు.. నిర్దిష్ట ప్రదేశంలో ఏ కార్యకలాపాలు ఎక్కువ జనాదరణ పొందాయని మీరు అడగవచ్చు. ఇది కాకుండా మీరు ఫోటోల ద్వారా ఏదైనా స్థలం గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది మీకు పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. దీనిలో ప్రతి స్థలం సారాంశం కూడా AI ద్వారా అందిస్తుంది. దీనితో మీరు ప్రతి అంశాన్ని చదవవలసిన అవసరం లేదు. ఇది మీ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.

గూగుల్ మ్యాప్ అప్‌డేట్‌తో డ్రైవింగ్ సులభం:

ఇది కాకుండా, ఈ అప్‌డేట్‌తో డ్రైవింగ్ ఇప్పుడు మరింత సులభం అవుతుంది. దీని కోసం దిశలపై క్లిక్ చేసి, ‘యాడ్ స్టాప్స్’పై క్లిక్ చేయండి. ఈ విధంగా మార్గంలో టాప్ ల్యాండ్‌మార్క్‌లు, స్పాట్‌లు, రెస్టారెంట్ ఎంపికలు కూడా అందుబాటులో ఉంటాయి. నావిగేషన్ కూడా సులభం అవుతుంది. వీధులు, రహదారి చిహ్నాలు, విభజనలు మ్యాప్‌లో కనిపిస్తాయి. అంతే కాదు, గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత సమీపంలోని పార్కింగ్ స్థలాల గురించి కూడా మీకు తెలియజేస్తుంది. కారు పార్క్ చేసిన తర్వాత, కారు నుండి ప్రవేశ ద్వారం చేరుకోవడానికి నడకకు సంబంధించిన దిశలను కూడా అందిస్తుంది.

మునుపటి కంటే మెరుగ్గా..

AI సహాయంతో స్థలాలు మెరుగ్గా కనిపిస్తాయి. AI, ఇమేజరీ, కంప్యూటర్ విజన్ సహాయంతో మీరు స్టేడియం లేదా పార్క్ ఎలా ఉంటుందో చూడవచ్చు. మీరు ఆ ప్రాంతానికి వెళ్లే రోజు వాతావరణం ఎలా ఉంటుందో కూడా ఇందులో తెలుసుకోవచ్చు. క్రమంగా ప్రపంచంలోని 150 నగరాలు లీనమయ్యే దృశ్యాన్ని చూడవచ్చు. దానికి కొత్త కేటగిరీలు కూడా జోడిస్తున్నారు. తర్వాత కాలేజీ క్యాంపస్ టూర్ కూడా దానికి జోడిస్తారు.

AP Self Assessment-2/ Formative Assessment-2 Answer Key Papers 2024-25

AP Self Assessment-2/ Formative Assessment-2 Answer Key Papers 2024-25

1st Class 

2nd Class

 

3rd Class

4th Class

5th Class

6th Class

7th Class

8th Class

9th Class

Download FA 2 Class 9 Telugu Key Paper

Download FA 2 Class 9 English Key Paper

Download FA 2 Class 9 Hindi Key Paper

Download FA 2 Class 9Maths Key Paper

Download FA 2 Class 9 BS Key Paper

Download FA 2 Class 9 PS Key Paper

Download FA 2 Class 9 Social Key Paper

10th Class

Download FA 2 Class 10 Telugu Key Paper

Download FA 2 Class 10 English Key Paper

Download FA 2 Class 10 Hindi Key Paper

Download FA 2 Class 10 Maths Key Paper

Download FA 2 Class 10 PS Key Paper

Download FA 2 Class 10 BS Key Paper

Download FA 2 Class 10 Social Key Paper

హై బీపీతో బాధపడేవారు ఉదయం ఏ టైంకి బ్రేక్‌ ఫాస్ట్ చేయాలో తెలుసా.

అధిక రక్తపోటు సమస్య నేటి కాలంలో చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ సమస్య ఇప్పుడు వృద్ధులతో పాటు యువతలో కూడా బాగా పెరుగుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, తక్కువ శారీరక శ్రమ, ఊబకాయం ఇందుకు ప్రధాన కారకాలు.

అందుకే దీనిని జీవనశైలి వ్యాధిగా చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. కానీ జీవనశైలిని మెరుగుపరచుకోవడం ద్వారా దీన్ని చాలా వరకు నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే, ఇది గుండెపోటుకు దారి తీస్తుంది.

అధిక రక్తపోటును నియంత్రించడానికి, మీ జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా తగ్గించవచ్చు. అందులో ముఖ్యమైనది రోజులో మొదటి భోజనం అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్. ఇది మీ రక్తపోటుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. బ్రేక్ ఫాస్ట్ రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. తాజా అధ్యయనం ప్రకారం, బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వ్యక్తులకు అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉందని తేలింది. కాబట్టి ఉదయం అల్పాహారం ఎప్పుడూ మిస్ చేయకూడదు.

బ్రేక్ ఫాస్ట్ ఎలా తీసుకోవాలి

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే, పోషకాలు అధికంగా ఉండే అల్పాహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల మీ గుండె పని తీరు మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది మీ రక్తపోటును కూడా మెరుగుపరుస్తుంది. అందువల్ల, బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నప్పుడల్లా, శరీరంలోని రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే పోషకాలు తప్పక తీసుకోవాలి.

బ్రేక్ ఫాస్ట్ ఏ సమయంలో తీసుకోవాలి

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యకరమైన రక్తపోటు కోసం నిద్రలేచిన ఒక గంటలోపు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మీ గుండెపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. నిద్రలేచిన 30 నుండి 60 నిమిషాలలోపు తినడం వల్ల ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇది అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది.

బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల కలిగే నష్టాలు

అదే మీరు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. మీ శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఖాళీ కడుపుతో ఉండడం వల్ల యాసిడ్ ఏర్పడుతుంది. ఇది గ్యాస్ సమస్యకు దారితీస్తుంది. BP పెరగడం ప్రారంభమవుతుంది. గ్లూకోజ్ స్థాయి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా బ్రేక్ ఫాస్ట్ దాటవేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 21% పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌ని మిస్ చేసే అలవాటును మార్చుకుని ఖచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయడం మంచిది. మీరు నిద్రలేచిన గంటలోపు బ్రేక్ ఫాస్ట్ చేయలేకపోయినా, వీలైనంత త్వరగా తినడానికి ప్రయత్నించాలి. అలాగే, హడావిడిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి బదులుగా, తినడానికి కొంత సమయం తీసుకోవాలి. ఎందుకంటే రక్తపోటు మీ ఆహారపు అలవాట్లకు సంబంధించినది. కాబట్టి నెమ్మదిగా తినడం మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.

ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్‌ చూసే అలవాటు మీకూ ఉందా? వెంటనే మానుకోండి

నేటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఒక ముఖ్యమైన భాగం. నిద్రకు ముందు, ఆ తర్వాత, భోజనం చేసేటప్పుడు, పని చేస్తున్నప్పుడు ఫోన్‌ను ఉపయోగించడం జాబితాలో చేరిపోయింది.

వాట్సప్‌ మెసేజ్‌ తనిఖీ చేయడానికి తరచుగా ఫోన్‌ను చూస్తూ ఉంటాం. ఇంకొందరు ఉదయం లేచిన వెంటనే ఇతర పనులు చేసుకునే ముందు ఫోన్ చెక్‌ చేసుకోవడం అలవాటు. కానీ ఈ అలవాటు వారి కళ్లకు హానికరం. దీని వల్ల అనేక రకాల కంటి సంబంధిత సమస్యలు పెరుగుతాయని పరిశోధనలో తేలింది.

IDC రీసెర్చ్ నివేదిక ప్రకారం 80 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు నిద్రలేచిన 15 నిమిషాల్లోనే తమ మొబైల్ ఫోన్‌లను చెక్ చేస్తుంటారు. ఇది కళ్ళను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఉదయం నిద్రలేచి ఫోన్ వాడే అలవాటు వెంటనే మానుకోవాలి. జర్నల్ ఆఫ్ న్యూరల్ ట్రాన్స్‌మిషన్‌లోని 2007 నివేదిక ప్రకారం, ఉదయం నిద్రలేచిన వెంటనే మొబైల్ ఫోన్‌లను చూస్తే దాని కాంతి వల్ల శరీరంలో మెలటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మీ నిద్ర చక్రాన్ని నియంత్రించే హార్మోన్. శరీరంలో ఈ హార్మోన్ స్థాయి పెరిగేకొద్దీ, వ్యక్తి ఎక్కువగా నిద్రపోవడం ప్రారంభిస్తాడు. దీంతో శరీరం నీరసంగా అనిపించడం ప్రారంభిస్తుంది.

పరిశోధన ప్రకారం, మీరు పడుకునే ముందు లేదా ఉదయం లేచిన తర్వాత ఎలక్ట్రిక్‌ గాడ్జెట్‌ని ఉపయోగిస్తే, అది మీ జీవ గడియారాన్ని క్లిష్టతరం చేస్తుంది. వీటి నుంచి వచ్చే నీలి కాంతి రెటీనాలోని ఫోటోరిసెప్టివ్ కణాల ద్వారా గ్రహించబడుతుంది. ఈ కారణంగా వ్యక్తి పూర్తిగా నిద్రపోలేడు. దీంతో నిద్ర సరిగ్గా పట్టదు.

మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ ఫోన్‌ని తనిఖీ చేయడం ప్రారంభిస్తే, అది మీకు ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది. ఒకే సమయంలో బహుళ సందేశాలు, ఇ-మెయిల్‌లు, వివిధ రకాల నోటిఫికేషన్‌లు చూడటం వల్ల ఆందోళన కలిగిస్తాయి. మానసిక ఒత్తిడితో రోజును ప్రారంభిస్తే రోజంతా ఒత్తిడికి గురవుతారు. ఒకవైపు మొబైల్ విడుదల చేసే బ్లూ లైట్ మీ రెటీనాను దెబ్బతీస్తుంది. మరోవైపు ఆందోళన మీ సమస్యలను పెంచుతుంది.

మొబైల్ ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ రోజు ప్రారంభించడం వల్ల కళ్లు పొడిబారడం పెరుగుతుంది. అంతేకాకుండా, ఇది కంటి చూపును కూడా ప్రభావితం చేస్తుంది. ఇది కళ్లలో మాక్యులర్ డీజెనరేషన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి వయసు పెరిగే కొద్దీ కంటి పరీక్షలు పెరుగుతాయి.

మీ ఫోన్‌ లాక్‌ పడిందా..? పాస్‌ కోడ్‌ మర్చిపోయారా? ఇలా చేస్తే నిమిషాల్లో అన్‌లాక్‌

తరచుగా మనం స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు భయపడి పాస్‌కోడ్‌ను మారుస్తూనే ఉంటాము. దాని కారణంగా పాస్‌కోడ్‌ను మర్చిపోవడం సాధారణం అవుతుంది. ప్రతిసారీ కొత్త పాస్‌కోడ్‌ను గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది.

అటువంటి పరిస్థితిలో ఫోన్‌ను ఎలా అన్‌లాక్ చేయాలి? మీరు మీ లాక్ చేసిన ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. దీని కోసం మీరు పెద్దగా చేయవలసిన అవసరం లేదు. కింద ఇచ్చిన ట్రిక్స్ ఫాలో అవ్వండి.

దీని కోసం మీరు మీ ల్యాప్‌టాప్‌లో Dr.Fone అప్లికేషన్‌ను తెరవాలి. అప్లికేషన్‌ను తెరిచిన తర్వాత మీరు మీ ఐఫోన్‌ను ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేయాలి. దీని తర్వాత యాప్‌కి వెళ్లి స్క్రీన్ అన్‌లాక్ ఎంపికపై క్లిక్ చేయండి. దీని తరువాత స్క్రీన్‌పై 3 మార్గాలు ఉంటాయి. వాటిని అనుసరించండి. దీని తర్వాత మీ ఐఫోన్ అన్‌లాక్ చేయబడుతుంది. అయితే ఇది థర్డ్ పార్టీ యాప్ అని ఒక్క విషయం గుర్తుంచుకోండి. దీన్ని ఉపయోగించే ముందు దాని నిబంధనలు, షరతులు, Google -రేటింగ్‌ని జాగ్రత్తగా తనిఖీ చేయండి.

కంప్యూటర్ ఉపయోగించి పాస్‌కోడ్:

మీరు Mac లేదా Windows కంప్యూటర్‌ని ఉపయోగించి మీ iPhoneని రీసెట్ చేయవచ్చు. దీని కోసం, iTunesకి వెళ్లండి, ఇక్కడ మీ iPhoneని రికవరీ మోడ్‌లో ఉంచండి. దీని తర్వాత iTunesలో పునరుద్ధరణ ఎంపికను ఎంచుకోండి. ఇది ఐఫోన్‌ను రీసెట్ చేస్తుంది. మీరు కొత్త పాస్‌కోడ్‌ను కూడా సెట్ చేయగలుగుతారు. ఈ ప్రక్రియ అంతా చేసే ముందు, మీరు ఎల్లప్పుడూ మీ బ్యాకప్ తీసుకుంటారని గుర్తుంచుకోండి. లేదంటే మీరు డేటాను కూడా కోల్పోవచ్చు.

ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త లు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ వీక్ లో 20కు పైగానే లు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి.

. వాటిలో ఎక్కువగా హిందీ, ఇంగ్లిష్ చిత్రాలే ఉన్నాయి. తెలుగు ఓటీటీ లకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో అప్ డేట్స్ ఏమైనా రావొచ్చు. అయితే హిందీ, ఇంగ్లిష్ ల్లోనూ కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. ఇవి దాదాపు తెలుగులోకి కూడా అందుబాటులోకి రానున్నాయి. మరి నవంబర్ రెండో వారంలో వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రాబోతున్నలు, సిరీస్ లేంటో ఒక లుక్కేద్దాం రండి.

ఆహా ఓటీటీ

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 (అల్లు అర్జున్ ఎపిసోడ్)- నవంబర్ 15

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఆడ్రెయెన్నే లపాలుక్కీ: ది డార్క్ క్వీన్ (ఇంగ్లిష్ )- నవంబర్ 12
రిటర్న్ ఆఫ్ ది కింగ్ (ఇంగ్లిష్ చిత్రం)- నవంబర్ 13
హాట్ ఫ్రాస్టీ (ఇంగ్లిష్ చిత్రం)- నవంబర్ 13
ది మదర్స్ ఆఫ్ పెంగ్విన్స్ ( ష్ వెబ్ సిరీస్)- నవంబర్ 13
ఎమిలియా పెరెజ్ (ఇంగ్లిష్ మూవీ)- నవంబర్ 13
ది ఫెయిరీ ఆడ్ పేరెంట్స్: ఏ న్యూ విష్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 14
కోబ్రా కై సీజన్ 6 పార్ట్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 15
మైక్ టైసన్ వర్సెస్ పాల్ జాక్ (ఇంగ్లిష్ )- నవంబర్ 15

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇన్‌ కోల్డ్ వాటర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 12
క్రాస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 14

జియో లో..

సెయింట్ డెనిస్ మెడికల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 13
ది మ్యూజిక్ ఆఫ్ శ్రీ (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 14
ది డే ఆఫ్ ది జకల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 15

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ )- నవంబర్ 12
యాన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ (ఇంగ్లిష్ చిత్రం)- నవంబర్ 15

ఆపిల్ టీవీ ప్లస్

బ్యాడ్ సిస్టర్స్ సీజన్ 2 ( ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 13
సిలో సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 15

సోనీ లివ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 15

జీ5 ఓటీటీ

పైథనీ (హిందీ వెబ్ సిరీస్)– నవంబర్ 15

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

ఆపరేషన్ బ్లడ్ హంట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లిష్ )- నవంబర్ 15

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త లు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మెదడే కాదు శరీరంలో ఈ పార్ట్‌కి కూడా జ్ఞాపక శక్తి ఉంటుందట.. పరిశోధనలో వెల్లడి

జ్ఞాపకాలు సాధారణంగా మెదడులో శాశ్వతంగా నిక్షిప్లమై ఉంటాయనే విషయం అందరికీ తెలిసు. కానీ ఈ విధంగా శరీరంలోని ఏ ఇతర భాగాలు జ్ఞాపకాలను నిల్వ చేసుకోలేవు.

అయితే తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అదేంటంటే.. ఒక్క మెదడు మాత్రమేకాకుండా ఇతర శరీర భాగాలు కూడా సంగతులను గుర్తుంచుకునే సామర్ధ్యం కలిగి ఉంటాయట. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. స్వయంగా పరిశోధకులే ఈ విషయాన్ని చెబుతున్నారు. వీరి అధ్యయనం ప్రకారం మెదడు మాత్రమే కాదు, మీ శరీరంలోని ఇతర భాగాలు కూడా జ్ఞాపకాలను నిల్వ చేస్తాయని తేలింది.

ఇతర శరీర భాగాలు జ్ఞాపకాలను ఎలా నిల్వ చేస్తాయి?

మెదడు కణాలు మెమరీ జన్యువులను సక్రియం చేస్తాయి. వాటి నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరిస్తాయి. ఇదే ప్రక్రియ శరీరంలోని ఇతర కణాలలో కూడా జరుగుతున్నట్లు పరిశోధకులు గమనించారు. వివిధ రసాయన సంకేతాలకు ప్రతిస్పందించడం, జ్ఞాపకశక్తి, అభ్యాస ప్రక్రియలు కూడా ఈ కణాలలో కనిపించినట్లు పరిశోధకులు వెల్లడించారు. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఆ పరిశోధన అధ్యయనం.. మెదడు రుగ్మతలకు చికిత్స చేయడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నట్లు పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన రచయిత నికోలాయ్ శరీరంలోని ఇతర కణాలు కూడా జ్ఞాపకాలను నిల్వ చేస్తాయని తెలిపారు.

మెదడు కణాల మాదిరిగానే నాన్-బ్రెయిన్‌ కణాలు కూడా ఆన్ అవుతాయని పరిశోధకులు కనుగొన్నారు. నాన్-బ్రెయిన్‌ కణాలలో జ్ఞాపకశక్తికి సంబంధించిన జన్యువులు చురుకుగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రోటీన్‌ను ఉపయోగించారు. రసాయన సంకేతాలు పునరావృతం కావడంతో, మెదడు పని చేసే విధంగానే ఈ కణాలలోని మెమరీ జన్యువులు కూడా సక్రియం కావడం ప్రారంభించాయని కనుగొన్నారు. 2018 పరిశోధనలో కిడ్నీలను మానవ శరీరంలో రెండవ మెదడుగా పరిశోధకులు గుర్తించారు. ఇది వెన్నుపాము కంటే ఎక్కువ న్యూరాన్‌లను కలిగి ఉంటుందట. శరీరం కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి పూర్తిగా భిన్నంగా పనిచేస్తుంది.

కిడ్నీల సంక్లిష్ట పని మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మన జీర్ణవ్యవస్థ ఆహారం జీర్ణం చేయడం మాత్రమే కాకుండా ఇది అనేక ఇతన పనులను కూడా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానసిక అనారోగ్యం, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల చికిత్సకు దీనిని ఉపయోగించవచ్చా లేదా అన్నదానిపై మరికొంత అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Health

సినిమా