Monday, December 15, 2025

ఇకపై మైక్రోచిప్స్ నగరం.. ఉస్మానియాలో పరిశోధనలు

హైదరాబాద్‌ ఇప్పుడు మైక్రోచిప్‌ తయారీకి ప్రపంచంలో ఒక ప్రముఖ కేంద్రంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. భారతదేశం ఏటా లక్షల కోట్ల రూపాయల మైక్రోచిప్‌లను దిగుమతి చేసుకుంటోంది, అయితే ఈ సాంకేతిక లోపాన్ని అధిగమించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రయత్నాలు ప్రారంభించింది. సెల్‌ఫోన్లు, టీవీలు, స్మార్ట్‌ వాచ్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, కార్లు, రాకెట్లు మొదలైన పరికరాలు మైక్రోచిప్‌ల వినియోగంలో కీలకమైన వాటిగా మారాయి. అందుకే, ఈ పరిశోధన ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం ఒక ప్రతిష్టాత్మక మిషన్‌గా మారింది.

మైక్రోచిప్‌ల వినియోగం – ఆధునిక ప్రపంచంలో కీలక పాత్ర

మైక్రోచిప్‌లు ఆధునిక సాంకేతిక ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సెల్‌ఫోన్ల నుంచి ల్యాప్టాప్ల వరకు, కార్ల నుంచి విమానాల వరకు అన్నింటిలోనూ మైక్రోచిప్‌లు ఉపయోగం. ఇవి లేకుండా ఆధునిక పరికరాలు పనిచేయడం అసంభవం. ప్రతి సంవత్సరం మన దేశం మైక్రోచిప్‌ల దిగుమతుల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ దిగుమతులపై మన ఆధారపడటాన్ని తగ్గించడానికి, స్వదేశీ పరిశోధనలు వేగవంతం చేయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ముందడుగు వేసింది.
తైవాన్‌ ఆధిపత్యం – భారత్‌ ముందస్తు చర్యలు

ప్రపంచవ్యాప్తంగా మైక్రోచిప్‌ల తయారీలో తైవాన్‌ ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. చిన్న పరిమాణంలో ఉన్న, అధిక సామర్థ్యంతో పనిచేసే మైక్రోచిప్‌ల తయారీలో తైవాన్‌ దేశం ముందు వరుసలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ దాదాపు రూ. 1,29,703 కోట్ల విలువైన చిప్లను దిగుమతి చేసుకుంది. కానీ కరోనా సమయంలో మైక్రోచిప్‌ల ఎగుమతులు ఆగిపోవడం, తైవాన్‌ లాంటి దేశాల్లో చిప్‌ల సరఫరా కొరత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది.

ఈ విపత్తు భారతదేశం పట్ల ఒక గుణపాఠంగా మారింది. దీనికి స్పందిస్తూ భారత ప్రభుత్వం “చిప్-టు-స్టార్టప్” (C2S) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఉస్మానియా విశ్వవిద్యాలయం, తన ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో మైక్రోచిప్‌ల తయారీపై పరిశోధనలు చేపట్టింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పరిశోధనలు ప్రారంభం

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ విభాగం ప్రధానిగా ఉన్న ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విభాగం పరిశోధక విద్యార్థులు 2 మిల్లీమీటర్ల పరిమాణంలో గిగాహెర్ట్జ్ సామర్థ్యంతో పని చేసే ఫ్రీక్వెన్సీ సింథసైజర్‌ను తయారు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలించి రూ. 5 కోట్ల నిధులను మంజూరు చేసింది.
ప్రాజెక్ట్‌లో భాగస్వాములు

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌లోని మరో ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల, మూడు ప్రముఖ సంస్థలు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో కలిసి పని చేస్తుండటం విశేషం. వీటి ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన సాంకేతిక సామర్థ్యం, నిపుణత్వం సమకూరుతోంది. ఈ ప్రాజెక్టు మైక్రోచిప్ పరిశోధనలకు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ స్థాయి కేంద్రంగా మార్చే అవకాశాలున్నాయి.
సీ-డాక్ శిక్షణ

ఉస్మానియా వర్సిటీ ప్రాజెక్ట్‌ బృందం బెంగళూరులోని సీ-డాక్ (C-DAC) సంస్థలో శిక్షణ పొందింది. ఈ శిక్షణలో మైక్రోచిప్‌లు ఎలా పనిచేయాలి, వాటి ఫ్రీక్వెన్సీ సింథసైజర్‌ వినియోగం ఎలా ఉండాలి అనే అంశాలను ప్రతిపాదించి, పరిశోధనలను ముందుకు తీసుకెళ్లారు.
పరిశోధనల పురోగతి

2023 జనవరిలో ప్రారంభమైన ఈ పరిశోధనలు, 2023 ఆగస్టు నాటికి 90% వరకు పూర్తయ్యాయి. ఈ పరిశోధనల ఫలితంగా మరో రెండు నెలల్లో పూర్తిస్థాయి మైక్రోచిప్ తయారీకి సిద్ధమవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, హైదరాబాద్‌ను దేశంలోని మైక్రోచిప్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఇది కీలక ఘట్టంగా నిలవనుంది.
భవిష్యత్తులో చిప్ టెక్నాలజీ భూమిక

ఈ పరిశోధనలు విజయవంతం అయితే, ఉస్మానియా విశ్వవిద్యాలయం భారతదేశంలోనే కాక, ప్రపంచంలోనూ మైక్రోచిప్ పరిశోధనల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ పరిశ్రమలో ప్రగతిని సాధించిన హైదరాబాద్, మైక్రోచిప్‌ల తయారీలోను తన ముద్రను వేసే అవకాశముంది.

హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రస్తుత మైక్రోచిప్ పరిశోధనల్లో ఒక ముఖ్యమైన భాగస్వామిగా మారింది. ఇది పూర్తి స్థాయి తయారీలోకి వస్తే, భారతదేశంలో విదేశీ మైక్రోచిప్‌లపై ఆధారపడటం తగ్గించడానికి, స్వదేశీ పరిశోధనలను ప్రోత్సహించడానికి ఇది ఒక పెద్ద అడుగుగా మారనుంది.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

భర్తీ చేసే పోస్టులు:

▪️ప్రిన్సిపాల్-10
▪️పీజీటీ-166
▪️సీఆర్టీ-163
▪️పీఈటీ–4
▪️పార్టటైం టీచర్స్ -165
▪️వార్డెన్-53
▪️అకౌంటెంట్-44

మొత్తం పోస్టుల సంఖ్య: 604

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ : 26.09.2024 నుండి 10.10.2024 వరకు.
నోటిఫికేషన్, పూర్తి వివరాలు క్రింది వెబ్ పేజీ నందు కలవు….

http://www.apjobs9.com/2024/09/ap-kgbv-teaching-and-non-teaching.html
KGBVS Teaching & Non Teaching Notification -2024

బ్యాంకు చెక్కు వెనుక సంతకం ఎందుకు చేస్తారో తెలుసా? ఈ రూల్ తెలుసుకోండి

చాలా కాలంగా నగదు లావాదేవీలకు చెక్కులు వినియోగిస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో చెక్కు వెనుక సంతకం పెట్టడం చూస్తారు. వారు ఇలా ఎందుకు చేస్తారు? ఈ నియమం ఎలాంటి విషయాలకు వర్తిస్తుంది? వివరాలు చూద్దాం.

మీకు బేరర్ చెక్ ఉంటే, దాని వెనుక సంతకం చేయండి. బేరర్ చెక్ ఉన్న ఎవరైనా తమ పేరు మీద చెక్కు రాయకపోయినా, బ్యాంకు నుండి డబ్బు తీసుకోవచ్చు. దీనివల్ల చెక్కును మరొకరు దొంగిలించే అవకాశం ఉంది. పొరపాటున ఎక్కడైనా పోగొట్టుకున్నా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి బేరర్ చెక్కును తీసుకొచ్చే వ్యక్తి చెక్కు వెనుక సంతకం చేయమని బ్యాంకులు కోరుతున్నాయి.

ఈ చెక్కు వెనుక రిసీవర్ సంతకం ఉంటే, దాని ద్వారా డబ్బు ఎవరికి అందింది అనే రికార్డు బ్యాంకు వద్ద ఉంటుంది. తప్పు వ్యక్తి చెక్కును ఉపయోగించి నగదు డ్రా చేస్తే, వారు విధానాన్ని అనుసరించినట్లు బ్యాంక్ రుజువు చేయవచ్చు. చెక్కు వెనుక సంతకం చేసిన వ్యక్తిపై బాధ్యత ఉంటుంది.

బేరర్ చెక్కు అంటే బ్యాంకు వద్ద సమర్పించిన ఎవరైనా డబ్బు తీసుకోవచ్చు. చెక్కులో ఒకరి పేరు ఉన్నా.. మరొకరు దానిని ఉపయోగించుకుని డబ్బు పొందవచ్చు. దీని కారణంగా, చెక్కును నగదు చేసే వ్యక్తి సంతకాన్ని పొందడం ద్వారా మోసం జరగకుండా బ్యాంకు అదనపు జాగ్రత్తలు తీసుకుంటుంది. కొన్నిసార్లు, ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు డ్రా అయినట్లయితే, చెక్కు తీసుకొచ్చే వ్యక్తి నుండి బ్యాంక్ అడ్రస్ ప్రూఫ్ కూడా అడగబడవచ్చు. తర్వాత ఏదైనా మోసం జరిగినప్పుడు వ్యక్తిని ట్రాక్ చేయడానికి ఇది బ్యాంక్‌కి సహాయపడుతుంది.

ఆర్డర్ చెక్ అంటే ఏమిటి? Order Cheque

ఆర్డర్ చెక్ విషయంలో, చెక్ వెనుక సంతకం అవసరం లేదు. ఆర్డర్ చెక్కులో, బ్యాంకు సిబ్బంది పేరు వ్రాసిన వ్యక్తికి మాత్రమే చెల్లిస్తారు. ఈ చెక్ అది ఆర్డర్ చెక్ అని మరియు బేరర్ చెక్ కాదని కూడా పేర్కొంది. చెక్కుపై పేర్కొన్న వ్యక్తి డబ్బును విత్‌డ్రా చేయడానికి బ్యాంకు వద్ద ఉండాలి. దీని కారణంగా, బ్యాంకు వెనుక వ్యక్తి సంతకం అవసరం లేదు. ఎందుకంటే డబ్బు అందుకుంటున్న వ్యక్తి ఎవరో వారికి తెలుసు.

కానీ ఆర్డర్ చెక్కుపై డబ్బు ఇచ్చే ముందు, బ్యాంకు ఉద్యోగులు క్షుణ్ణంగా విచారించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే డబ్బు ఇస్తారు. చెక్కుపై ఉన్న పేరు, తెచ్చిన వ్యక్తి పేరు ఒకటేనా? కాదు కదా అని తెలుసుకోవడానికి బ్యాంకు ఇంకా జాగ్రత్తగా తనిఖీ చేస్తుంది.

18 ఏళ్ల కుర్రాడి ఊహకందని విధ్వంసం.. 86 ఫోర్లు, 7 సిక్సర్లతో 498 రన్స్

ప్రపంచ క్రికెట్ లో ఏదో ఒక మూల.. ఏదో ఒక మ్యాచ్ లో రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటారు ప్లేయర్లు. ఇక కొన్నిసార్లు అయితే.. మనం నమ్మశక్యంలేని విధంగా చెలరేగిపోతుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఇన్నింగ్స్ కూడా ఇలాంటి నమ్మశక్యం కానిదే. నిండా 20 ఏళ్లు కూడా లేని ఓ కుర్రాడు వరల్డ్ క్రికెట్ షాక్ అయ్యే ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. డబుల్, ట్రిపుల్ సెంచరీ కాదు.. ఏకంగా 498 రన్స్ చేసి కొద్దిలో 500 మార్క్ ను మిస్ అయ్యాడు. ఇదంతా చేసింది ఏ ఇంటర్నేషనల్ ప్లేయరో కాదు.. 18 ఏళ్ల ఓ స్కూల్ పిల్లాడు. అతడి పేరు ద్రోణ దేశాయ్. ఈ విధ్వంసాన్ని అండర్ 19 టోర్నమెంట్ లో సృష్టించాడు.

ద్రోణ దేశాయ్.. ప్రస్తుతం ఈ పేరు ఇండియన్ క్రికెట్ లో మారుమోగిపోతోంది. దానికి కారణం అతడి మెరుపు ఇన్నింగ్సే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన దివాన్ బల్లు భాయ్ అండర్ 19 స్కూల్ టోర్నమెంట్ లో సెయింట్ జేవియర్ స్కూల్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు దేశాయ్. ఇక ఈ టోర్నీలో జేఎల్ ఇంగ్లీష్ స్కూల్ పై తన పంజా విసిరాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ చిచ్చరపిడుగు.. బౌలర్లను కనికరం లేకుండా ఊచకోతకోశాడు. ద్రోణ దేశాయ్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఫీల్డర్లు ప్రేక్షకపాత్ర వహించడం తప్ప ఏం చేయలేకపోయారు. బౌలర్లను మార్చినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇక చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన ద్రోణ దేశాయ్ 320 బంతులు ఎదుర్కొని ఏకంగా 86 ఫోర్లు, 7 సిక్సర్లతో 498 పరుగులు చేశాడు. కొద్దిలో 500 స్కోర్ ను మిస్ చేసుకున్నాడు.

ద్రోణ దేశాయ్ బ్లాస్టింగ్ బ్యాటింగ్ తో తొలి ఇన్నింగ్స్ జేవియర్ స్కూల్ ఏకంగా 844 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. అయితే రెండు ఇన్నింగ్స్ ల్లో కూడా కలిపి జేఎల్ ఇంగ్లీష్ టీమ్ ద్రోణ దేశాయ్ స్కోర్ ను దాటలేకపోవడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్ లో 40 రన్స్ కే కుప్పకూలిన ఆ టీమ్.. రెండో ఇన్నింగ్స్ లో 92 రన్స్ కే కుప్పకూలింది. దాంతో 712 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో జేవియర్ స్కూల్ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం దేశాయ్ ఆడిన ఈ మారథాన్ ఇన్నింగ్స్ క్రికెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 18 ఏళ్ల కుర్రాడు ఇలాంటి బ్యాటింగ్ తో చెలరేగడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. గతంలో ప్రణవ్ ధన్వాడే, పృథ్వీ షా, ఆర్మాన్ జాఫర్ లాంటి కొంత మంది మాత్రమే తమ స్కూల్ టోర్నీల్లో ఇలాంటి మారథాన్ ఇన్నింగ్స్ లు ఆడారు.

ఈవారం ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. మొత్తం 5 సినిమాలు ఎక్కడ చూడొచ్చంటే..

ప్రస్తుతం అనేక చిత్రాలు థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. లవ్ స్టోరీస్ మాత్రమే కాదు.. డిఫరెంట్ జానర్ లు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతున్నాయి.

కొన్ని రోజులుగా ఓటీటీలో హారర్, మర్డరీ మిస్టరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇప్పుడు అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేవర. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈవారం మరో ఐదు లు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నాయి.

ఈవారం మొత్తం 24 లు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి రానున్నాయి. వాటిలో టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుళ్ మోహన్ కాంబోలో వచ్చిన చిత్రం సరిపోదా శనివారం. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సెప్టెంబర్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ తోపోటాు తాజా ఖబర్ సీజన్ 2 కూడా రాబోతుంది. భవిష్యత్తును అంచనా వేసే ఓ వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో భువన్ బామ్, శ్రియా పిల్గావ్కర్, జెడీ చక్రవర్తి, దేవన్ భోజని, ప్రథమ్ పరాబ్, నిత్యా మాథుర్, శిల్పా శుక్లా కీలకపాత్రలు పోషించారు. ఈ సీజన్ 2 సెప్టెంబర్ 27 నుంచి డిస్నీ ప్లస్ హాస్ట్ లో స్ట్రీమింగ్ కానుంది.

అలాగే శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటించిన లవ్ సితార మూవీ కూడా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ మూవీ జీ5లో అందుబాటులోకి రానున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి వందనా కటారియా దర్శకత్వం వహించారు. ఈ నే కాకుండా బాక్సాఫఈస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న వాళ్లై మూవీ కూడా సెప్టెంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. గతంలో కరణం, మామన్నన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హారర్ థ్రిల్లర్ మూవీ డెమోంటీ కాలనీ 2 సెప్టెంబర్ 27న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

తమలపాకులు తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే మీరు తినడం స్టార్ట్ చేస్తారు

తమలపాకును విందు భోజనాల తరువాత తాంబూలంలో వాడతారు అనుకుంటే పొరబాటే. తమలపాకును మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

తమలపాకులో కార్డియోవాస్కులర్ , యాంటీ-డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ,ఇమ్యునోమోడ్యులేటరీ, యాంటీ- అల్సర్, హెపాటో-ప్రొటెక్టివ్ , యాంటీ ఇన్ఫెక్టివ్ వంటి వివిధ లక్షణాలు ఉన్నాయి.

ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు తమలపాకుల్లో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది. తమలపాకులో తగిన మొత్తంలో అవసరమైన పోషకాలు ఉంటాయి.

తమలపాకులను నేరుగా నమిలి తినవచ్చు. దీంతో మలబద్ధకం సమస్య దూరం చేసుకొచ్చు. తమలపాకులను యాంటీ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌గా చెబుతారు. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి, తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టి… ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీరు తాగితే పేగు ఆరోగ్యానికి మంచిది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తమలపాకులో కార్మినేటివ్, యాంటీ ఫ్లాట్యులెన్స్ వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణశయాంతర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలను గ్రహించడానికి ప్రేగులను ప్రేరేపిస్తాయి.

శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు , ఛాతీలో ఇబ్బంది, ఉబ్బసం లక్షణాలను ఉపశమనానికి , నయం చేయడానికి ఉపయోగిస్తారు . తమలపాకుకు ఆవాల నూనె రాసి ఛాతీపై ఉంచి కొద్దిసేపు అలాగే ఉంచితే చాతీలో ఇబ్బంది తగ్గుతుంది. తమలపాకు పేస్ట్‌ను చూర్ణం రాస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి తక్షణ ఉపశమనం కలిగుతుంది.

ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్

ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధం అవుతోంది. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది.

రెండు, మూడు రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటుంది. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసింది. అయితే తాజాగా వైసీపీ తెచ్చిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కెబినెట్ ఆమోదించింది. ఇవాళ లేదా రేపటిలోగా ఆర్డినెన్సును ఆమోదించనున్నారు గవర్నర్. ఇక ఏపీలో మొత్తం 3736 మద్యం షాపుల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం.. ఇందులో 340 షాపులను కల్లు గీత వృత్తి కులాలకు రిజర్వ్ చేయనుంది. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశం పైనా అబ్కారీ శాఖ కసరత్తు చేస్తుంది. కల్లు గీత వృత్తి కులాల జనాభా ఏయే జిల్లాల్లో.. ఏయే నియోజకవర్గాల్లో ఎంత మేరకు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తుంది. ఆయా వివరాలను బీసీ సంక్షేమ శాఖ నుంచి తీసుకుంటున్న ఎక్సైజ్ శాఖ.. కల్లు గీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను రిజర్వ్ చేయనుంది.

మరోవైపు ఏపీలో అక్టోబర్‌ 1 నుంచి నూతన మద్యం విధానం తీసుకురానున్నారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయిస్తామని తెలిపింది. వారికి 10 శాతం మద్యం షాపులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సరసమైన ధరకే నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని ఇటీవల మంత్రిమండలి నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

వీసా అవసరం లేని దేశాలివి.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీతో వెళ్లి రావొచ్చు.

సమోవా.. ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో హవాయి, న్యూజిలాండ్ మధ్య ఉన్న ఒక చిన్న ద్వీప దేశం. ఇది పాలినేషియాలో భాగం. ఇది అనేక చిన్న ద్వీపాలతో పాటు ఉపోలు, సవాయి అనే రెండు ప్రధాన ద్వీపాలను కలిగి ఉంది.

దీని రాజధాని అపియా, ఉపోలులో ఉంది. సమోవా ప్రాంతం విశిష్ట సంస్కృతి, ఉష్ణమండల ప్రకృతి దృశ్యాలు, సహజమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది.

మాల్దీవులు.. ఇది ఒక ఉష్ణమండల స్వర్గం. ఇది హిందూ మహాసముద్రంలో శ్రీలంక, భారతదేశానికి నైరుతి దిశలో ఉంది. ఇది 26 అటోల్స్ ద్వీపసమూహం, 1,000కు పైగా పగడపు ద్వీపాలతో ఉంటుంది. వాటి అద్భుతమైన తెల్లని ఇసుక బీచ్‌లు, క్రిస్టల్-స్పష్టమైన జలాలు, సముద్ర జీవులకు పేరుగాంచింది. ఈ దేశ రాజధాని మాలే.

భూటాన్.. భారతదేశం, చైనా సరిహద్దులో తూర్పు హిమాలయాలలో ఉన్న ఒక చిన్న, భూపరివేష్టిత రాజ్యం. అద్భుతమైన పర్వత ప్రకృతి దృశ్యాలు, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ పరిరక్షణ పట్ల దృఢ నిబద్ధతకు ప్రసిద్ధి చెందింది. దీని రాజధాని థింఫు.

నేపాల్.. ఎవరెస్ట్ పర్వతం వంటి ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలను కలిగి ఉన్న హిమాలయాలతో సహా అద్భుత ప్రకృతి దృశ్యాలకు నేపాల్ ప్రసిద్ధి చెందింది. దీని రాజధాని ఖాట్మండు. ఇది దేశం సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ కేంద్రంగా పనిచేస్తుంది.

బార్బడోస్.. తూర్పు కరేబియన్‌లో ఉన్న ఒక ద్వీప దేశం ఇది. అద్భుతమైన బీచ్‌లు, గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఉష్ణమండల వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. కరేబియన్‌లోని తూర్పున ఉన్న ద్వీపంగా, ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. దీని రాజధాని బ్రిడ్జ్‌టౌన్. బార్బడోస్ దాని తెల్లని ఇసుక బీచ్‌లు, క్రిస్టల్-స్పష్టమైన జలాలు, పగడపు దిబ్బలకు ప్రసిద్ధి చెందింది. స్కూబా డైవింగ్ వంటి బహిరంగ కార్యకలాపాలను కోరుకునే పర్యాటకులకు ఇది ప్రసిద్ధ గమ్యస్థానంగా మారింది.

రుచికరమైన పైనాపిల్ కేసరిని సింపుల్ టిప్స్ తో తయారు చేయండి ఇలా.. రెసిపీ మీ కోసం..

పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వడ్డించే స్వీట్స్ లో ఎక్కువగా పైనాపిల్ కేసరి కూడా ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వివిధ కార్యక్రమాల్లో దీనికి చోటు ఎక్కువే..

మృదువుగా, నిగనిగలాడుతూ, నోరూరించేలా ఉండే దీనిని ఎక్కువ మంది ఇష్టంగా తింటారు. అయితే అద్భుతమైన పైనాపిల్ కేసరిని రుచి చూసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా దీనిని తినాలంటే రెస్టారెంట్స్ ను ఆశ్రయించాల్సిందే.. అయితే ఇంట్లోనే అనాస పండు, రవ్వ, నెయ్యి ఉపయోగించి క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు. పైనాపిల్ కేసరిని తయారుచేయడం చాలా సులభం. దీని రంగు, రుచి మనసును హత్తుకుంటుంది. చాల మంది అనాస పండుని ఇష్టంగా తింటారు. అదే సమయంలో కొంతమంది పైనాపిల్ ను తినడానికి పెద్దగా ఇష్టపడరు. ఈ నేపధ్యంలో పైనాపిల్ కేసరిని తయారు చేసి ఒక్కసారి తినిపిస్తే.. మేము కూడా పైనాపిల్ కేసరి అంటే గొప్ప అభిమానులమే అని అంటారు. ఈ రోజు పైనాపిల్ కేసరి తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావలసిన పదార్దాలు:

అనాస పండు (పైనాపిల్) ముక్కలు – ½ కప్పు

పైనాపిల్ గుజ్జు – ½ కప్పు

నీరు – 1 కప్పు

నెయ్యి- ¼ కప్పు

బాదం ముక్కలుగా తరిగినవి – 1 టేబుల్ స్పూన్

ఎండుద్రాక్ష – 1 టేబుల్ స్పూన్

జీడిపప్పు – 1 టేబుల్ స్పూన్

సూజి రవ్వ- ½ కప్పు

కుంకుమ పువ్వు – ఎనిమిది రేకలు

చక్కర లేదా పంచదార పొడి – ½ కప్పు

యాలకుల పొడి- కొంచెం

పసుపు రంగు కోసం

పాలు – ఒక స్పూన్

పసుపు – చిటికెడు

పైనాపిల్ కేసరి తయారీ విధానం:

ముందుగా గ్యాస్ వెలిగించి బాణలి పెట్టండి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మీడియం మంట మీద వేడి చేయండి. ఇప్పుడు ఆ నెయ్యిలో రవ్వ వేసి లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించండి. వేగిన రవ్వను బాణలి నుంచి ఒక ప్లేట్‌లోకి తీసుకుని ఒక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే బాణలిలో తరిగిన పైనాపిల్ ముక్కలను వేసి.. కొంచెం మెత్తబడే వరకు 3-4 నిమిషాలు ఉడికించాలి. తరువాత వీటిని బాణలి నుంచి తీసి పక్కకు పెట్టుకోవాలి.

షుగర్ సిరప్ కోసం బాణలిలో ఒక కప్పు నీరు వేసి మరిగించండి. అందులో కుంకుమపువ్వు రేకలు వేసి అందులో చెక్కెర లేదా పటికబెల్లం పొడిని జోడించండి. చెక్కెర లేదా పటికబెల్లం పొడి పూర్తిగా కరిగిపోయే వరకూ తిప్పుతూ ఉండాలి. అనంతరం ఈ షుగర్ సిరప్ లో తీసుకున్న పైనాపిల్ గుజ్జుని వేసి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. గ్యాస్ మంటను తగ్గించి ఈ మిశ్రమంలో వేయించిన రవ్వను కొంచెం కొంచెం ముద్దలు ఏర్పడకుండా కలుపుతూ వేయాలి. ఈ మిశ్రమం మొత్తం ఉడికే వరకూ కదుపుతూ ఉండాలి. నీరు తగ్గి చిక్కబడే వరకు ఉడికించండి. ఇప్పుడు పాలల్లో పసుపు కలిపి మిశ్రమాన్ని బాగా కదపండి.

మరో స్టవ్ మీద చిన్న బాణలి పెట్టి వేడి చేసి నెయ్యి వేసి తరిగిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేవరకు వేయించాలి. వీటిని నెయ్యితో పాటు ఉడికించిన మిశ్రమంలోకి వెయ్యాయి. ఇప్పుడు పైనాపిల్ కేసరిని తక్కువ మంట మీద మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరిగా యలాకుల పొడిని జోడించండి. అంతే టేస్టీ టేస్టీ పైనాపిల్ కేసరి స్వీట్ రెడీ.. పిల్లలకు పెద్దలకు కొంచెం వీడిగా ఉన్నప్పుడు సర్వ్ చేయండి.. విడిచి పెట్టకుండా తినేస్తారు.

బెడ్‌రూమ్‌లో ఈ వస్తువులు ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఖాయం

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మిస్తే ఎలాంటి సమస్యలు రావని విశ్వసిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించినా.. కూడా మనం ఇంట్లో పెట్టుకునే వస్తువుల వలన కూడా వాస్తు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి.

ఇలా బెడ్‌రూమ్‌లో పెట్టుకునే వస్తువుల వలన కూడా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. దీని వలన దంపతుల మధ్య కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి.

దేవుడికి సంబంధించిన ఫొటోలు, విగ్రహాలు లాంటివి బెడ్‌ రూమ్ గదిలో అస్సలు పెట్టకూడదు. ఇలా బెడ్‌ రూమ్‌లో పెట్టడం వల్ల తీవ్రమైన అపచారం చేసినట్లు అవుతుంది. దీని వలన వాస్తు దోషం ఏర్పడుతుంది. దీని వలన కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వస్తాయి.

ఇంట్లో పాడైపోయిన లేదా కాలిపోయిన ఎలక్ట్రిక్ పరికరాలను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. దీని వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీని వలన మన ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది.

జలపాతాలకు, సముద్రాలకు చెందిన ఫొటోలు, పెయింటింగ్స్ కూడా బెడ్ రూమ్‌లో పెట్టకూడదు. దీని వలన కూడా భార్యాభర్తల మధ్య గొడవలు, కలహాలు ఏర్పడతాయి.

అంతే కాకుండా బెడ్ రూమ్‌లో బెడ్‌కు ఎదురుగా కూడా పెట్టకూడదు. అలాగే ఉదయాన్నే లేచి అద్దంలో ముఖం చూడకూడదు. బెడ్‌రూమ్‌ లోపలి గోడలకు రంగు డార్క్ కలర్ ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల దంపతుల మధ్య గొడవలు వస్తాయి.

రిఫ్రిజిరేటర్ జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే ఫ్రిజ్‌ మెరిసిపోతుంది!

ఇల్లు అందంగా ఉండాలంటే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు సంవత్సరాల తరబడి శుభ్రం చేయక పోవడం వల్ల మీ ఇంటి రూపురేఖలు మొత్తం పాడవుతాయి.

అలాంటి పరిస్థితుల్లో మీ ఇంటి వంటగదిలో ఉంచిన రిఫ్రిజిరేటర్ జిడ్డుగా కనిపించడం ప్రారంభించినట్లయితే, ఈ చిట్కాలన్నింటినీ పాటించడం ద్వారా మీ ఫ్రిజ్‌ను మెరిసేలా చేయవచ్చు. ఈ చిట్కాలు ఫ్రిజ్‌ను వేగంగా శుభ్రం చేయడంలో మీకు సహాయపడతాయి.

ఫ్రిజ్‌ని తక్షణమే మెరిసేలా చేయండి : ఫ్రిజ్‌లోని మురికి ఆహారాన్ని పాడు చేస్తుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు సులభంగా మురికి రిఫ్రిజిరేటర్ శుభ్రం చేయవచ్చు. దీని కోసం ముందుగా మీరు ఫ్రిజ్‌ను అన్‌ప్లగ్ చేసి వైర్లను తీసివేయాలి. దీని తర్వాత మీరు మొత్తం ఫ్రిజ్‌ను ఖాళీ చేయండి.

ఫ్రిజ్‌ డ్రాలను శుభ్రం చేయండి: ఫ్రీజర్ ఖాళీ అయిన తర్వాత డ్రాలను తీయండి. డ్రాయర్లను క్లీన్ చేయడానికి ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో కొంచెం బేకింగ్ సోడా మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌ను స్పాంజి సహాయంతో ఉపయోగించండి. రిఫ్రిజిరేటర్ అన్ని అంతర్గత భాగాలు, సైడ్‌ భాగాలను పూర్తిగా శుభ్రం చేయండి.

బేకింగ్ సోడా, వెనిగర్ పేస్ట్: తొలగించలేని మొండి మరకలు ఉంటే, మరకపై కొంచెం వెనిగర్ రాసి స్పాంజితో స్క్రబ్ చేయండి. వెనిగర్ కూడా క్రిములను చంపడానికి సహాయపడుతుంది. మీరు బేకింగ్ సోడా, వెనిగర్ పేస్ట్ తయారు చేయడం ద్వారా రిఫ్రిజిరేటర్ తలుపు, ఇతర భాగాలను శుభ్రం చేయవచ్చు.

ఫ్రిజ్ నుండి దుర్వాసనను తగ్గించండి: మీరు టూత్ బ్రష్ సహాయం కూడా తీసుకోవచ్చు. మీ ఫ్రిజ్ దుర్వాసనగా ఉంటే, మీరు ఒక గిన్నెలో బేకింగ్ సోడాను వేసి కొన్ని గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచడం ద్వారా వాసనను పోగొట్టవచ్చు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి: మీరు ప్రతి నెలా ఒకసారి మొత్తం రిఫ్రిజిరేటర్‌ను లోతుగా శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి. తద్వారా అదనపు మురికి పేరుకుపోదు. అంతే కాకుండా చెడిపోయిన ఆహారాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచవద్దు. ఇది చెడు వాసనను వ్యాపింపజేస్తుంది. ఆహారాన్ని ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్‌లో కప్పి ఉంచండి. ఈ అన్ని చిట్కాల సహాయంతో మీరు మీ ఫ్రిజ్‌ను శుభ్రం చేయవచ్చు. అలాగే మీ ఇంటిని, వంటగదిని అందంగా మార్చుకోవచ్చు.

ఐఫోన్ కంటే తక్కువ ధరకు ఈవీ స్కూటర్లు.. ది బెస్ట్ ఇవే..!

ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.17 లక్షలు. దీన్ని చార్జింగ్ చేయడానికి సుమారు 9 గంటలు పడుతుంది. దీనిలో 5.4 కేడబ్ల్యూ మోటారు, 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.

ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 90 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

అప్రిలియా ఎస్ఆర్ 160 స్కూటర్ వేగం గంటకు 100 కిలోమీటర్లు. 160.03 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. 7600 ఆర్పీఎం వద్ద 10.86 బీహెచ్పీ, 6000 ఆర్ఫీఎం వద్ద 11.6 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి సీవీటీ గేర్ బాక్స్ జత చేశారు. ఈ స్కూటర్ రూ.1.30 లక్షలకు అందుబాటులో ఉంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ లో ఓలాకు ఎంతో డిమాండ్ ఉంది. ఎస్1 ప్రో స్కూటర్ ధర రూ.1.34 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 11 కేడబ్ల్యూ గరిష్ట శక్తితో మోటారు పనిచేస్తుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంగా పరుగులు తీస్తుంది. కేవలం 2.6 సెకన్లలో సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.

రివర్ ఇండీ స్కూటర్ ధర రూ.1.38 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సుమారు ఐదు గంటలలో దాదాపు 80 శాతం వరకూ చార్జింగ్ చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేసుకుంటే 120 కిలోమీటర్లు పరిగెడుతుంది. గరిష్ట వేగం 90 కిలోమీటర్లు. దీనిలో 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.

టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ లో 2.2, 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. ఇవి రెండూ 4 కేడబ్ల్యూ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని చార్జింగ్ చేయడానికి రెండు గంటలు పడుతుంది. 75 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని గరిష్ట వేగం కూడా గంటకు 75 కిలోమీటర్లే. ఇక 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని చార్జింగ్ చేయడానికి నాలుగు గంటలన్నర పడుతుంది. దాదాపు 100 కిలోమీటర్ల రేంజ్ తో గంటకు 78 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.1.17 లక్షలు (ఎక్స్ ఫోరూమ్)

సీట్లు త్యాగం చేసిన వారికి బంపర్ ఆఫర్.. ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర.. లిస్టులో ఉన్నది వీరే..

కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్‌ పదవుల జాతరకు తెరలేచింది. వంద రోజుల పాలన పూర్తిచేసుకున్న వేళ 20 కార్పొరేషన్లతో పాటు మొత్తం 99నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

గత ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వలేనివారికి పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం దక్కింది. అలాగే కూటమి గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన వారికి పదవులు కట్టబెట్టారు. కీలకమైన పోస్టుల భర్తీలో పీటముడి వీడకపోవడంతో ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చారు. పలు దఫాలుగా సమావేశమైన కూటమి నేతలు చర్చించుకొని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ 20 కార్పొరేషన్లలో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1కి ఇచ్చారు.. మొత్తం 99 మందితో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం చోటు కల్పించింది.

20 కార్పొరేషన్లకు చైర్మన్లు, సభ్యుల ప్రకటన

ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌గా మునిరత్నంకి ఛాన్స్ ఇచ్చారు. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మంతెన రామరాజు, 20సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ నేత లంకా దినకర్, శాప్ ఛైర్మన్‌గా రవినాయుడు, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్‌గా అబ్దుల్ అజీజ్, హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్‌గా బత్తుల తాత్య బాబు, ట్రైకార్ ఛైర్మన్‌గా శ్రీనివాసులు, మారిటైమ్ బోర్డ్ ఛైర్మన్‌గా దామచర్ల సత్య పేర్లు ప్రకటించారు. అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా పీలా గోవింద్, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పిల్లి మాణిక్యరావు, స్టేట్ కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్స్ కౌన్సిల్ ఛైర్మన్‌గా పీతల సుజాత, MSMEడెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శివశంకర్ (జనసేన), సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సీతారామ సుధీర్ (జనసేన), ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వజ్జా బాబూరావు, ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా అజయ్ కుమార్ (జనసేన), సీడ్ ఏపీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దీపక్ రెడ్డి, మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా కర్రోతు బంగార్రాజు, సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మన్నె సుబ్బారెడ్డి, పద్మశాలి వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నందం అబదయ్య, టూరిజం డెవల్‌మెండ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నూకసాని బాలాజీను ప్రకటించారు.

సీట్లు త్యాగం చేసిన వారికి ఇప్పుడు పదవుల్లో ప్రాధాన్యత..

నెల్లూరు మాజీ మేయర్‌ అబ్దుల్ అజీజ్ ఇప్పుడు వక్ఫ్‌ బోర్డ్‌ ఛైర్మన్ అయ్యారు.. ఎలక్షన్ ముందు నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ ఆశించారు. కానీ కోటంరెడ్డి కారణంగా ఆ సీటు దక్కలేదు. అయినప్పటికీ పార్టీ కోసం పనిచేసిన అజీజ్‌కు వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్ ఇచ్చారు.

ఇక.. డోన్‌లో ముందుగా TDP టికెట్‌ మన్నె సుబ్బారెడ్డికి అనౌన్స్ చేశారు.. కానీ తర్వాత కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డికి టికెట్ మార్చారు. పార్టీ కోసం త్యాగం చేసి పనిచేసిందుకు ఇప్పుడు సుబ్బారెడ్డికి నామినేటెడ్‌ పదవి దక్కింది. ఆయన సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యారు..

ఉండి నియోజకవర్గంలో మొన్నటి సిట్టింగ్ MLA రామరాజు.. రఘురామకృష్ణంరాజు కోసం తన టికెట్ త్యాగం చేసినందుకు ఆయనకు కూడా నామినేటెడ్‌ పదవి దక్కింది.. రామరాజు ఇప్పుడు APIIC ఛైర్మన్ అయ్యారు..

ఇక.. కర్రోతు బంగార్రాజు నెల్లిమర్ల టీడీపీ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా జనసేన నుంచి లోకం మధవి అక్కడ పోటీచేసింది. జనసేన కోసం సీటు త్యాగం చేసిందుకు కర్రోతు బంగార్రాజుకి కూడా ఇప్పుడు పదవి దక్కింది. ఆయన మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్ అయ్యారు

ఇక.. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ అనకాపల్లి టికెట్‌ వదులుకున్నందుకు ఆయన్నూ పార్టీ గుర్తించిందనే చెప్పాలి.. అనకాపల్లి టికెట్ జనసేన నేత కొణతాల రామకృష్ణకు వెళ్లడంతో పీలా గోవింద్‌కు కీలక పదవి ఇస్తామని అప్పుడే పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు అర్బన్ ఫైనాన్స్ అండ్‌ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌గా పీలా గోవింద్‌కు పదవి దక్కింది.

ఇక మచిలీపట్నం MP టికెట్‌ త్యాగం చేసినందుకు కొనకళ్ల నారాయణకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఆర్టీసీ ఛైర్మన్ అయ్యారు.

పిల్లల కోసం పదవీవిరమణ పథకం ఇది.. ఎలా ప్రారంభించాలంటే..

పిల్లల కోసం ఓ అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల దానిని ప్రారంభించింది. ఆ పథకం పేరు నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్)వాత్సల్య.

ఇది పిల్లలకు ఉద్దేశించిన పథకం. పదవీవిరమణ ప్రయోజనాలను అందించే పథకం. సింపుల్ గా చెప్పాలంటే మైనర్ల కోసం ప్రారంభించిన రిటైర్ మెంట్ స్కీమ్. దీనిని ప్రారంభించేందుకు ఆన్ లైన్ ప్లాట్ ఫారం ను కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రారంభించింది. ఇందు కోసం మైనర్లైన ఖాతాదారులకు పర్మినెంట్ రిటైర్ మెంట్ అకౌంట్ నంబర్(పీఆర్ఏఎన్)ను ఇస్తోంది. ఈ కొత్త పథకం భారతదేశ పదవీ విరమణ వ్యవస్థలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ప్రారంభ దశలోనే పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది.పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) దీనిని నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎన్పీఎస్ వాత్సల్య అంటే..

తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం రిటైర్‌మెంట్ ఖాతాలో పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ఎన్పీఎస్ వాత్సల్య. ఇది చక్రవడ్డీ శక్తితో దీర్ఘకాలంలో మంచి సంపదను అందిసతుంది. ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాదారులకు అనువైన విధంగా పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది తల్లిదండ్రులు పిల్లల తరపున సంవత్సరానికి రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది అన్ని ఆర్థిక వర్గాల కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది.

ఉపసంహరణ, నిష్క్రమణ, మరణం..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, విద్య, కొన్ని వ్యాధులు, వైకల్యం కోసం 3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి తర్వాత కంట్రిబ్యూషన్‌లో 25% వరకు గరిష్టంగా 3 సార్లు ఉపసంహరణ చేసుకోవచ్చు.
ఖాతాదారుడికి 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ఎన్పీఎస్ టైర్ – I సులభంగా మార్చుకోవచ్చు.
18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఖాతాను క్లోజ్ చేయొచ్చు. అయితే మీ కార్పస్ రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. కార్పస్‌లో 80% యాన్యుటీని కొనుగోలు చేయడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. 20% మొత్తాన్ని ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే మీ కార్పస్ రూ. 2.5 లక్షల కంటే తక్కువ లేదా సమానంగా ఉంటే మొత్తం బ్యాలెన్స్‌ను ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఖాతాదారుడి మరణం సంభవించినట్లయితే, మొత్తం కార్పస్ సంరక్షకుడికి ఇస్తారు.

ఖాతాను ఎక్కడ తెరవాలి?

ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాని ప్రధాన బ్యాంకులు, ఇండియన్ పోస్ట్ ఆఫీస్, పెన్షన్ ఫండ్స్ మొదలైన వాటితో కూడిన పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీ) ద్వారా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ఈ-ఎన్పీఎస్ ద్వారా తెరవవచ్చు.
ది.

ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటన ఇలా..

ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్ నకు సంబంధించిన వివరాలను ఐసీఐసీఐ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఖాతా ఎలా ప్రారంభించాలి? దానిలోని ఫీచర్స్ ఏమిటి అనే విషయాన్ని వివరించింది. అవేంటంటే..

అర్హత ప్రమాణాలు: పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కలిగి ఉన్న 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఏ మైనర్ అయినా అర్హులు.
కనీస సహకారం: కనీస పెట్టుబడి సంవత్సరానికి రూ. 1,000, గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు.
పిల్లల పేరు మీద తల్లిదండ్రులు/సంరక్షకులు తమ పిల్లల తరపున పెట్టుబడి పెట్టొచ్చు.
18 సంవత్సరాల వయస్సు పూర్తయిన తర్వాత అవసరమైన కేవైసీ పత్రాలను సమర్పిస్తే.. మైనర్ ఎన్పీఎస్ ఖాతా ప్రామాణిక ఎన్పీఎస్ ఖాతాగా మారుతుంది.

ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు..

సంరక్షకుని గుర్తింపు, చిరునామా రుజువు
మైనర్ పుట్టిన తేదీ రుజువు
సంరక్షకుడు ఎన్ఆర్ఐ అయితే మైనర్ ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ బ్యాంక్ ఖాతా (సింగిల్ లేదా జాయింట్).

లివర్ కడిగినట్లు క్లీన్ అయిపోవాలంటే.. వీటిని తింటే చాలు..

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యల్లో లివర్ సమస్యలు కూడా ఒకటి. శరీరంలో ఉన్న అవయవాల్లో లివర్ కూడా చాలా ముఖ్యం.

తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలో లివర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఆహారంలో ఉండే పోషకాలను శోషించుకుని శరీరానికి అందిస్తుంది లివర్. శరీరంలో 500 రకాలను పైగా జీవక్రియలను లివర్ నిర్వహిస్తుంది. లివర్‌ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇప్పుడు చెప్పే ఆహారాలు ఎంతో చక్కగా సహాయ పడతాయి. ఈ ఫుడ్స్ తింటే లివర్ క్లీన్ అయినట్లు శుభ్ర పడుతుంది.

పాలకూర, మెంతి కూర, కొత్తిమీర వంటి ఆకు కూరలను తీసుకుంటే లివర్ పని తీరు మెరుగు పడుతుంది. బెర్రీ జాతికి చెందిన బ్లూ బెర్రీలు, స్ట్రా బెర్రీలు తినడం వల్ల డ్యాబేజ్ నుంచి లివర్ ఆరోగ్యంగా పని చేస్తుంది. లివర్ వాపు కూడా తగ్గుతుంది.

నేరేడు పండ్లు, ద్రాక్ష పండ్లు, బీట్ రూట్, అలోవెరా వంటి జ్యూసులు తాగడం వల్ల కూడా లివర్ చక్కగా పని చేస్తుంది. కాలేయంలోని వ్యర్థాలు, మలినాలు బయటకు పోతాయి. లివర్ సమస్యలతో బాధ పడేవారు నాన్ వెజ్ తక్కువగా తినడం మంచిది. పసుపు కలిపిన నీరు తాగితే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.

నాన్ వెజ్‌లో చేపలు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే.. లివర్ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపరాఫర్‌.. ఈ ప్లాన్‌ రోజుకు రూ.3 కంటే తక్కువ.. 10 నెలల వ్యాలిడిటీ

రీఛార్జ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన అవసరాలలో చెల్లుబాటు ఒకటి. గతంలో 3 నెలల వరకు తక్కువ రేటుతో అందుబాటులో ఉన్న ప్లాన్ ఇప్పుడు ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు వ్యాలిడిటీని తగ్గించేశాయి.

దీనికి ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్ మరింత చెల్లుబాటు కావాల్సిన వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. రోజుకు రూ. 3 కంటే తక్కువతో వినియోగదారులు 300 రోజుల చెల్లుబాటును పొందుతారు. ఇది మార్కెట్లో అత్యంత సరసమైన ప్లాన్‌లలో ఒకటి.

10 నెలలు:

ఈ రూ.797 ప్లాన్‌లో వినియోగదారులు 300 రోజుల వాలిడిటీని పొందుతారు. ఉచిత కాలింగ్, డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని ప్రయోజనాలు పరిమిత కాలానికి మాత్రమే అని గుర్తుంచుకోండి. మీరు దాదాపు 10 నెలల మొత్తం సిమ్ చెల్లుబాటును పొందుతారు. మరొక విషయం ఏమిటంటే డేటా, మొదటి 60 రోజుల పాటు కాల్ చేసే వినియోగదారులు రోజుకు 2GB డేటా, భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్‌లను పొందుతారు.

ఉచిత రోమింగ్

ఈ ప్లాన్ రోజుకు 100 ఉచిత SMSలతో వస్తుంది. మొదటి 60 రోజుల తర్వాత వరకు కాల్స్‌ చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత అవుట్‌గోయింగ్ కాల్‌లు, డేటా, SMSలకు రీఛార్జ్ అవసరం. అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ మాత్రం వస్తుంటాయి.

మీకు రెండవ సిమ్ ఉంటే..

BSNL నంబర్‌ను రెండవ సిమ్‌గా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. మొదటి రెండు నెలలు, వినియోగదారులు ప్లాన్‌లో చేర్చబడిన కాలింగ్, డేటా సేవలను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. 10 నెలల రీఛార్జ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G, 5G

బీఎస్‌ఎన్‌ఎల్‌ భారతదేశం అంతటా తన 4జీ,5జీ సేవలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఇప్పటికే అనేక టెలికాం సర్కిల్‌లలో 4G సేవలను ప్రారంభించింది. 2025 మధ్య నాటికి దేశవ్యాప్తంగా అన్ని సర్కిల్‌లకు సేవలను అందజేస్తుంది. కనెక్టివిటీని మెరుగుపరచడం, వినియోగదారులకు మెరుగైన వేగాన్ని అందించడం దీని లక్ష్యం. బీఎస్‌ఎన్‌ఎల్‌ 5G నెట్‌వర్క్‌ను ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) పరీక్షించింది.

ముడా స్కామ్‌ కేసులో సిద్దరామయ్యకు హైకోర్టు షాక్.. కాంగ్రెస్ సీఎం ఏమన్నారంటే..

కన్నడ రాజకీయాలలో ముడా స్కామ్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముడా స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టు షాకిచ్చింది.

గవర్నర్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సీఎం సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్ధించింది. దీంతో సీఎం సిద్దరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.

హైకోర్టు నిర్ణయం అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. ముడా స్కాం అంతా బీజేపీ-జేడీఎస్‌ కూటమి కుట్ర అంటూ పేర్కొన్నారు. తన వెనుక కాంగ్రెస్‌ హైకమాండ్‌, కేబినెట్‌ సహచరులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారని అన్నారు. తాను ఎలాంటి విచారణకైనా వెనుకాడబోనని.. ప్రజా తీర్పు కూడా తనవైపే ఉందన్నారు. ఆపరేషన్‌ లోటస్‌తో ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ విధానమన్నారు. కోర్టుపై తనకు విశ్వాసం ఉందని, అంతిమంగా ధర్మమే గెలుస్తుందని సిద్దరామయ్య తెలిపారు.

జులై నుంచి.. పొలిటికల్ హీట్

కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్‌ గత కొన్ని రోజుల నుంచి సంచలనంగా మారింది.. ముడా స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు జులై 26న గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతించారు. దీనికి వారం రోజుల్లోగా సంతృప్తికరమైన వివరణలు, సమాధానాలను ఇవ్వాలంటూ ఆదేశించారు. దీన్ని తప్పు పట్టింది కర్ణాటక ప్రభుత్వం. గవర్నర్‌ ఆదేశాలను సవాల్ చేస్తూ గతనెలలోనే సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తాజాగా దీనిపై విచారించిన హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది.

అయితే.. గవర్నర్‌ నిర్ణయాన్ని సీఎం సిద్దరామయ్య తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వ సలహా తీసుకోకుండానే గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. పేదలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను ఆపేందుకే బీజేపీ-జేడీఎస్‌ కూటమి తనపై కుట్ర చేసిందన్నారు.

కాగా.. కర్నాటక హైకోర్టు తీర్పుపై స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. సిద్దరామయ్య ఎలాంటి తప్పుచేయలేదని , ఆయన రాజీనామా ప్రసక్తే లేదన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత స్పందించిన మంత్రి రామలింగారెడ్డి సీఎం సిద్ధరామయ్య ఎలాంటి తప్పు చేయలేదన్నారు. అసలైన అవినీతిపరులు బీజేపీ వాళ్లే అంటూ మండిపడ్డారు.

కాగా.. హైకోర్టు నిర్ణయంపై స్పందించిన బీజేపీ సీఎం రాజీనామా చేయాలని సూచించింది.. ముడా కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని.. కర్ణాటక సీఎం రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. హైకోర్టు నిర్ణయంతోనైనా సీఎం సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేత బీ.వై. విజయేంద్ర డిమాండ్ చేశారు.

కూరల్లో దీనిని చిటికెడు కలిపి తింటే చాలు.. రుచితో పాటు జీర్ణ సమస్య నుంచి ఉపశమనం.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

కూరలు తయారుచేసే సమయంలో రుచికరంగా ఉండడం కోసం రకరకాల మసాలా దినుసులు కలుపుతారు. ఇలా చేయడం వలన కూర రుచి రెట్టింపు అవుతుంది. అదే విధంగా కొన్ని రకాల కూరల్లో, పులిహోర వంటి వాటిల్లో ఇంగువ కూడా చేరుస్తారు.

ఇంగువ సువాసన, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. మన దేశంలో చాలా మంది ఇంగువను కూరలు వండే సమయంలో రుచి కోసం ఉపయోగిస్తారు. ఇంకొందరు ఇంగువను చట్నీ వంటి వాటికి అదనపు రుచి కోసం పోపు దినుసుల్లో వేసుకుని తినడానికి ఇష్టపడతారు.

కడుపులో గ్యాస్, జీర్ణక్రియ సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఇంగువను ఉపయోగిస్తారు. అనేక రకాల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. ఇంగువ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పప్పులు, ముద్దకూరలు, రోటి పచ్చళ్ళు, పులిహోర వంటి వాటిల్లో కేవలం చిటికెడు ఇంగువను కలుపుతారు. ఇలా చేయడం వలన రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంగువ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

జీర్ణక్రియకు ప్రయోజనకరం

ఆహారంలో చిటికెడు ఇంగువ జోడించడం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో అజీర్ణం, పుల్లటి త్రేనుపు, కడుపునొప్పి, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే చిటికెడు ఇంగువ మాత్రమే వేయాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే దీనిని ఎక్కువగా వినియోగించడం ఆరోగ్యానికి హానికలిగిస్తుంది.

కడుపునొప్పి సమస్యలో ఇంగువ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కడుపు నొప్పి సమస్యను వదిలించుకోవడానికి ఇది సహాయపడుతుంది. నూనె, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల అజీర్తి వల్ల కడుపునొప్పి వస్తే గోరువెచ్చని నీళ్లలో వేయించి ఇంగువను లేదా ఇంగువ పొడిని కలుపుకుని తాగవచ్చు. కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు.

ఆహారం రుచిని మెరుగుపరచడానికి ఇంగువను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. దీని కోసం తడ్కా ఇంగువను ఉపయోగించవచ్చు. అంతేకాదు ఇంగువ పొడిని సిద్ధం చేసి పప్పులు లేదా కూరగాయలలో కలపవచ్చు. తినడానికి రుచిగా ఉంటుంది.

ఇంగువ ఏ పరిమాణంలో ఉపయోగించాలంటే

వాపును తగ్గించడంలో సహాయపడే ఇంగువలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి. ఇది చిటికెడు మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువగా ఉపయోగిస్తే చాలా సమస్యలను కలిగిస్తుంది. దీనితో పాటు అధిక రక్తపోటు, గర్భం లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దానిని తీసుకునే ముందు తప్పనిసరిగా నిపుణుడిని సంప్రదించాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

ఓరి దుర్మార్గుడా.. ఆరేళ్ల చిన్నారిని చంపి స్కూల్లోనే పాతిపెట్టిన ప్రిన్సిపల్!

గుజరాత్లోని దాహోద్లో ఘోర సంఘటర జరిగింది. స్కూల్‌ ప్రిన్సిపల్ ముక్కుపచ్చలారని ఓ చిన్నారిని దారుణంగా చంపి, స్కూల్లోనే పాతిపెట్టాడు.

అనంతరం ఏమీ ఎరగనట్లు స్కూల్లో నాటకాలు ఆడసాగాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. వివరాల్లోకెళ్తే..

గుజరాత్‌లోని దోహాద్ జిల్లాలోని పిపాలియాలోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ గోవింద్ నట్ (55) ఒకతో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని(6)ని స్కూల్కు తీసుకెళ్లేందుకు ఇంటి వద్ద కారులో ఎక్కించుకున్నాడు. అయితే ఆ రోజు సాయంత్రం బాలిక ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొత్తం 10 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఈ నెల 19వ తేదీన చిన్నారి మృత దేహం పాఠశాల కాంపౌండ్‌లో లభ్యమైంది. పోస్టుమార్టం నిర్వహించగా.. ఊపిరాడక చిన్నారి మృతి చెందినట్లు తేలింది. దర్యాప్తులో వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి.

బాలిక కనిపించకుండా పోయిన రోజు (సెప్టెంబరు 19) ప్రిన్సిపల్ అతని కారులో పాఠశాల వద్ద డ్రాప్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ రోజు బాలిక పాఠశాలకు రాలేదని విద్యార్థులు, ఉపాధ్యాయులు పోలీసులకు చెప్పారు. అదే రోజు సాయంత్రం స్థానికులతో కలిసి బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకోగా, వారు గేటు సమీపంలో బాలిక వస్తువులను గుర్తించారు. దీంతో కేసు ప్రిన్సిపల్‌ చుట్టూ తిరగసాగింది. విచారణ నిమిత్తం పోలీసులు గోవింద్‌ నట్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజం చెప్పాడు.

బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా.. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించినప్పుడు, అరవడం ప్రారంభించిందని.. బాలిక అరుపులను ఆపేందుకు గట్టిగా ఆమె నోటిపై చేతులు పెట్టానని, దీంతో ఊపిరాడక బాలిక మృతి చెందినట్లు నేరం అంగీకరించాడు. బాలిక చనిపోవడంతో, కారు వెనుక భాగంలో దాచి.. ఆ తర్వాత గోవింద్ నట్ ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లాడు. అదే రోజు సాయంత్రం పాఠశాల ముగిసిన తరువాత, కారు వద్దకు తిరిగి వచ్చి, బాలిక బ్యాగ్‌, ఇతర వస్తువులను పాఠశాల గేటు దగ్గర పడవేసి, తరగతి గది వెనుక బాలికను పాతిపెట్టినట్లు తెలిపాడు. నిందితుడిని గత ఆదివారం అదుపులోకి తీసుకున్నామని ఈ మేరకు కేసు వివరాలను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్‌దీప్‌సిన్హ్ జాలా మీడియాకు తెలిపారు.

ఈ సినిమా నాకు సరికొత్త ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది.. సుధీర్ బాబు కామెంట్స్

సుధీర్ బాబు అంటేనే వైవిధ్యమైన లకు కేరాఫ్ అడ్రస్.. ఇటీవలే సుధీర్ బాబు నవ దళపతి అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

సుధీర్ బాబు నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’. అనౌన్స్‌మెంట్ నుంచి పాన్ ఇండియా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం 2025 శివరాత్రి విడుదలకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నుంచి విడుదలైన కొత్త పోస్టర్ పై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచుతోంది. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కలయికగా ఈ చిత్రం తెరకెక్కుతోందని విడుదలైన పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే అందులో సుధీర్ బాబు సరికొత్త లుక్‌తో, ఆసక్తికర పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.

ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై జటాధర చిత్రం ఇండియన్ ల్లో ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసేలా రూపొందుతోంది. ఈ తరహా చిత్రాల రూపకల్పనకు ఇది నాంది పలికేలా కనిపిస్తుంది. సూపర్ నేచురల్ శక్తితో అదరగొట్టే లుక్‌లో సుధీర్ బాబు కనిపిస్తున్నారు. అభిమానులు పోస్టర్‌ను చూసి లో తన పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పటికే ఉహాగానాలు చేస్తున్నారు. ఈ విలక్షణమైన ను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా! అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ ”’జటాధర’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యపోయాను. ఇంత గొప్ప స్పందన రావడంతో సంతోషమేసింది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను అని అన్నారు. ఈ లోకి అడుగు పెట్టటం అనేది ఓ సరికొత్త ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది. నాకు ఇది ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. శాస్త్రీయత, పౌరాణిక అంశాల కలయిక స్క్రిప్ట్‌ను రాశారు. ఈ రెండు జోనర్స్‌కు చెందిన ప్రపంచాలను రేపు ఆడియెన్స్ వెండితెరపై చూస్తున్నప్పుడు ఓ సరికొత్త అనుభూతిని పొందుతారు అని తెలిపారు సుధీర్ బాబు. ఓ సక్సెస్‌కైనా కారణం బలమైన స్క్రిప్ట్‌. దీనికి మంచి టీమ్ తోడైతే అది మంచి గా ప్రాణం పోసుకుంటుంది. మా విషయంలో అదే జరుగుతుంది. ప్రేరణ అరోరాగారు బెస్ట్ టీమ్‌తో జటాధర ను ఆవిష్కరిస్తున్నారు. ఆమెతో కలిసి ట్రావెల్ చేయటం గొప్ప అనుభూతి. విజువల్‌గా, ఎమోషనల్‌గా ఓ అద్భుతమైన ను ఆమె తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన సెకండ్ పోస్టర్ పౌరాణిక ప్రపంచాన్ని తెలియజేస్తుంది. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండే అంశాలు ఎన్నో ఈ లో ఉండబోతున్నాయి. వాటి గురించి తెలియజేయటానికి, ప్రేక్షకులు ఈ టిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలని నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని సుధీర్ బాబు అన్నారు.

ప్రస్తుతం జటాధర కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. పాన్ ఇండియా ప్రేక్షకులను ఈ చిత్రం అలరించనుందని సెకండ్ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇక హరోంహరతో సూపర్ హిట్ కొట్టిన సుధీర్ బాబు అక్టోబర్ 11న మా నాన్న సూపర్ హీరో తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

దేవీ నవరాత్రులు ప్రారంభ తేదీ.. ఈ తొమ్మిది రోజులు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి

హిందూ క్యాలెండర్ ప్రకారం నవరాత్రి పూజ ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం ప్రతిపాద తిధి నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ 3, 2024 నుంచి ప్రారంభం కానున్నాయి.

హిందూ మత విశ్వాసం ప్రకారం దేవీ నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో ప్రధానంగా దుర్గాదేవిని ఆరాధిస్తారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు.

ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి భూమిపై నివసిస్తుందని.. తన భక్తులను కాపాడుతుందని నమ్మకం. హిందువుల నమ్మకం ప్రకారం నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే తొమ్మిది రోజులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. అదే సమయంలో నవరాత్రులలో కొన్ని పనులు తప్పక చేయాలి. ఇలా చేయడం వలన నవరాత్రి పూజల వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. దేవీ నవరాత్రులలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

శరన్నవరాత్రులు 2024 ఎప్పుడంటే?

హిందూ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3న అర్ధరాత్రి 12.19 గంటలకు ప్రారంభమై మర్నాడు అక్టోబర్ 4న తెల్లవారుజామున 2.58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ 3వ తేదీ 2024 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తుంది.

దేవీ నవరాత్రుల సమయంలో చేయాల్సిన పనులు ఏమిటంటే

దుర్గ దేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు శ్రేయస్సు, అదృష్టం, శక్తి, ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపు పువ్వులు సమర్పించండి. ఎరుపు రంగు బట్టలు సమర్పించండి.
నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు పుజిస్తారు. దుర్గాదేవికి ప్రత్యేకంగా పువ్వులు, పండ్లు, స్వీట్లు సమర్పించండి.
నవరాత్రులలో ప్రతిరోజూ దుర్గాదేవి మంత్రాలను పఠించండి. ధ్యానం చేయండి. దీంతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరిగి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
నవరాత్రుల పవిత్ర దినాలలో పేదలకు దానం చేయండి లేదా సేవ చేయండి. ఇది చాలా ధర్మబద్ధమైన చర్యగా పరిగణించబడుతుంది. పేదవారికి దానం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

శారదీయ నవరాత్రులలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి

నవరాత్రులలో 9 రోజులు అఖండ జ్యోతిని వెలిగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఎవరైనా అఖండ జ్యోతిని వెలిగిస్తే అఖండ జ్యోతిని ఆరిపోనివ్వవద్దు.
నవరాత్రుల 9 రోజులలో పొరపాటున కూడా తామసిక ఆహారం తినొద్దు. మద్యం సేవించకూడదు.
నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి. మంచి ఆలోచనలను అలవర్చుకోండి. వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండండి.
పూజ సమయంలో క్రమశిక్షణను తప్పకుండా పాటించండి. నవరాత్రులలో సూర్యోదయ సమయంలో నిద్ర లేవడం.. దుర్గాదేవిని భక్తి శ్రద్దలతో పూజించడం అవసరం.

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

ఎట్టకేలకు షూటింగ్ లో పవన్.. అప్పటికి ఇప్పటికి అదే జోరు.! మామూలుగలేదుగా..

నిర్మాతలను ఇన్నాళ్ళకు కరుణించారు పవన్ కళ్యాణ్. ఎట్టకేలకు ఈయన షూటింగ్‌కు వచ్చారు. మరి ఈ జోరు కంటిన్యూ అవుతుందా..? లేదంటే మళ్లీ రాజకీయం అంటూ అటు వైపు వెళ్లిపోతారా..?
అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చారు డిప్యూటీ సిఎం. మరి పవన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి.? లన్నీ పూర్తి చేయాలని ఫిక్సైపోయారా.? పవన్ అభిమానులు ఎప్పట్నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది.

నిర్మాతలను ఇన్నాళ్ళకు కరుణించారు పవన్ కళ్యాణ్. ఎట్టకేలకు ఈయన షూటింగ్‌కు వచ్చారు. మరి ఈ జోరు కంటిన్యూ అవుతుందా..? లేదంటే మళ్లీ రాజకీయం అంటూ అటు వైపు వెళ్లిపోతారా..?

అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చారు డిప్యూటీ సిఎం. మరి పవన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి.? లన్నీ పూర్తి చేయాలని ఫిక్సైపోయారా.?

పవన్ అభిమానులు ఎప్పట్నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. దాదాపు ఏడాది తర్వాత మొహానికి రంగేసుకున్నారు పవర్ స్టార్. అప్పుడెప్పుడో ఎన్నికలకు ముందు లకు దూరమైన పవన్..

ఇన్నాళ్లకు హరిహర వీరమల్లు సెట్‌కు వచ్చారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్ర కొత్త షెడ్యూల్ మొదలైంది. మార్చ్ 28న విడుదల అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్.

ఏ షూటింగ్ అయినా కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే జరగాలని నిర్మాతలకు కండీషన్ పెట్టారు పవన్. దానికి తగ్గట్లుగానే వాళ్లు కూడా ఓకే అన్నారు. ఈ క్రమంలోనే ముందు వీరమల్లుకు డేట్స్ ఇచ్చారు జన సేనాని.

దీని తర్వాత ఓజి లైన్‌లో ఉంది. దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్. మరోవైపు ఓజి మ్యూజిక్ సిట్టింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. ఓజిలో ఈ మధ్యే శింబుతో పాడించారు తమన్. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు కూడా.

మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ వర్క్స్ కూడా ఊపందుకున్నాయి. వీరమల్లు, ఓజి పూర్తైన తర్వాత.. జనవరి నుంచి హరీష్ శంకర్ మొదలయ్యే అవకాశాలున్నాయి. కంటిన్యూ డేట్స్ కాకుండా.. వారంలో రెండు మూడు రోజులు షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్.

శీతాకాలంలో మీకు ఎలాంటి వాటర్‌ హీటర్‌ ఉత్తమం? ఎంత కెపాసిటి ఉంటే మంచిది?

ఇంట్లో వాటర్‌ హీటర్‌ (గ్రీజర్‌) కొనుక్కోవడానికి వచ్చినప్పుడల్లా, ఏది కొనాలో తెలియక తికమక పడుతుంటారు. అంతే కాదు, వాటర్ హీటర్ ఎంత కెపాసిటీ కొనాలి అనే ప్రశ్న కూడా చాలా మందిలో ఉంటుంది.

అయితే మీరు అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీ కుటుంబానికి ఏ సామర్థ్యం గల వాటర్ హీటర్ మంచిదో తెలుసుకుందాం. ఇది కాకుండా, మంచి వైర్ హీటర్‌ను ఎలా గుర్తించగలము?

ఎన్ని గాలన్ల సామర్థ్యం గల వాటర్ హీటర్ పని చేస్తుంది?

ఏదైనా హీటర్‌ను కొనుగోలు చేసే ముందు, మీ వినియోగం ఏమిటి? మీ కుటుంబంలో ఎంత మంది వ్యక్తులు ఉన్నారు. దీని తర్వాత మాత్రమే మీరు మీ కోసం సరైన వాటర్‌ గ్రీజర్‌ను ఎంచుకోగలుగుతారు. మీ కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లయితే, మీరు మీ ఇంట్లో 23 నుండి 36 గ్యాలన్ల ( ఒక గ్యాలన్ సుమారు 4.5 లీటర్లు) సామర్థ్యం గల వాటర్ హీటర్‌ ఉపయోగించవచ్చు.

నలుగురి కుటుంబానికి, 36 నుండి 46 గ్యాలన్ల సామర్థ్యం ఉన్న ట్యాంక్ ఉత్తమ ఎంపికగా ఉంటుంది. ఐదుగురు వ్యక్తులు ఉన్న కుటుంబానికి, 46 నుండి 56 గ్యాలన్ల సామర్థ్యం ఉన్న ట్యాంక్ అనుకూలంగా ఉంటుంది. 6 లేదా అంతకంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో, 60 గ్యాలన్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ట్యాంక్‌ను ఉపయోగించవచ్చు. సాధారణంగా చాలా మంది 20 నుండి 80 గ్యాలన్ల కెపాసిటీ ఉన్న హీటర్‌ని ఎంచుకుంటారు. ఈ వాటర్ హీటర్లు గ్యాస్ లేదా విద్యుత్తుతో నడుస్తాయి.

ఏ గ్రీజర్‌ కొనాలి?

మీరు మీ ఇంటికి V-Guard, Haier, Bajaj, AO స్మిత్, క్రాంప్టన్ వంటి బ్రాండ్‌ల నుండి వాటర్ హీటర్‌ (గ్రీజర్‌)లను కొనుగోలు చేయవచ్చు. ఈ కంపెనీల హీటర్లు అధిక శక్తి రేటింగ్‌తో మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. మంచి విషయం ఏమిటంటే అవి తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటారు. వీటిలో మీరు అధునాతన ఫీచర్స్‌ కూడా పొందుతారు. వీటిని మీరు సులభంగా ఉపయోగించవచ్చు.
ఇవి మీకు చాలా సమయాన్ని ఆదా చేస్తాయి. మీ ప్రాంతంలోని స్థానిక దుకాణాలతో పాటు, మీరు అమెజాన్-ఫ్లిప్‌కార్ట్, క్రోమా-విజయ్ సేల్స్ మొదలైన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కొన్ని నిమిషాల్లో నీటిని వేడి చేయగల వాటర్ హీటర్‌లను కొనుగోలు చేయవచ్చు.
మీరు దీన్ని ఆన్‌లైన్‌లో చాలా తక్కువ ధరకు పొందవచ్చు. తగ్గింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.
ధర గురించి చెప్పాలంటే, వీటి ధర మీకు రూ. 8,000 నుండి చాలా ఉంటాయి. ఇది మీ బడ్జెట్, వినియోగంపై ఆధారపడి ఉంటుంది.

దసరా సెలవులకు అందాల పింక్ సిటీపై ఓ లుక్ వేయండి.. చారిత్రక కోటపై ఓ లుక్ వేయండి..

రాజస్థాన్‌లోని జైపూర్ నగరం చాలా అందమైన ప్రదేశం. దీనిని పింక్ సిటీ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

ఇక్కడ అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ భారతీయ సంస్కృతి, చరిత్ర సంగ్రహావలోకనం పొందవచ్చు. జైపూర్‌లో ఉన్న హవా మహల్, జల్ మహల్ గురించి చాలా సార్లు విని ఉంటారు. అయితే ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పర్యటన కోసం ఒంటరిగా లేదా కుటుంబం లేదా స్నేహితులతో సందర్శించడానికి వెళ్లవచ్చు. ఇక్కడ అనేక చారిత్రక అందమైన ప్రదేశాలు ఉన్నాయి.

జైపూర్ సిటీ ప్యాలెస్

జైపూర్‌లోని సిటీ ప్యాలెస్ రాజస్థాన్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ప్యాలెస్‌ను జైపూర్ వ్యవస్థాపకుడు మహారాజా సవాయి జై సింగ్ నిర్మించారు. ఇది చాలా అందమైన ప్యాలెస్. మొఘల్, రాజ్‌పుత్ నిర్మాణ శైలికి సంబంధించిన అందమైన మిశ్రమం. సిటీ ప్యాలెస్ కాంప్లెక్స్‌లో ముబారక్ మహల్, క్వీన్స్ ప్యాలెస్ కూడా ఉన్నాయి. ముబారక్ మహల్‌లో ఇప్పుడు మహారాజా సవాయి మాన్ సింగ్ II మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ రాజ వేషధారణతో పాటు సున్నితమైన పష్మినా, శాలువాలు, బనారస్ పట్టు చీరలు, మరెన్నో వస్తువులు ఉన్నాయి.

గల్తాజీ ఆలయం

జైపూర్‌లోని గల్తాజీ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. ఆరావళి కొండల మధ్య ఉద్యానవనాలకు ఆవల ఉన్న ఈ ప్రకృతి దృశ్యం ఆలయాలు, పవిత్రమైన చెరువులు, మంటపాలు, చుట్టూ పచ్చదనంతో మనసును ఆకట్టుకుంటుంది. గల్తాజీ దేవాలయం జైపూర్ నుండి 10 కి.మీ దూరంలో ఉంది. ఆలయ సముదాయంలో సహజమైన మంచినీటి బుగ్గ , 7 పవిత్రమైన చెరువులు ఉన్నాయి. గ్రాండ్ టెంపుల్ పింక్ ఇసుకరాయితో నిర్మించబడింది. జైపూర్ వెళుతున్నట్లయితే ఇక్కడ కూడా సందర్శించడం మరచిపోకండి.

అమెర్ కోట

అమెర్ కోట లేదా అంబర్ కోట అని కూడా పిలువబడే అంబర్ ప్యాలెస్ జైపూర్‌లో ఉంది. ఇది జైపూర్‌లో చాలా పెద్ద కోట. చాలా ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. ఈ కోట జైపూర్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోట పసుపు, గులాబీ రంగులతో నిర్మించబడింది. రాజ్‌పుత్ , మొఘల్ వాస్తుశిల్పానికి ఉదాహరణగా ఈ కోట నిలుస్తుంది. ఇందులో దివాన్-ఎ-ఆమ్ లేదా, దివాన్-ఎ-ఖాస్, షీష్ మహల్ లేదా జై మందిర్ , సుఖ్ నివాస్ ఉన్నాయి. ఈ రాజభవనం రాజ్‌పుత్ మహారాజులతో పాటు వారి కుటుంబాలు నివసించేవి.

పన్నా మీనా కుండ్

పన్నా మీనా చెరువును పన్నా మీనా మెట్ల బావి అని కూడా అంటారు. ఇది చారిత్రక పురాతన మెట్ల బావి. పూర్వ కాలంలో ఇది నీటికి ముఖ్యమైన వనరు. చాలా మంది ప్రజలు దీనిని ఉపయోగించారు. అయితే నేడు ఇది పర్యాటక కేంద్రంగా మారింది. ప్రజలు తరచుగా ఇక్కడకు వెళ్లి ఫోటోలు క్లిక్ చేయడానికి ఇష్టపడతారు.

కనక బృందావనం

కనక బృందావనం జైపూర్‌లో ఉన్న ఒక తోట. ఇది ఆరావళి కొండల చుట్టూ ఉన్న లోయలో అమెర్ కోటకు వెళ్లే మార్గంలో నహర్‌ఘర్ కోట క్రింద ఉంది. ఈ ప్రదేశం జైపూర్ నుండి దాదాపు 8 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ కాంప్లెక్స్‌లో అనేక పచ్చటి ప్రదేశాలు ఉన్నాయి. అమెర్ ఫోర్ట్, నహర్‌ఘర్ కోట, జైగర్ కోట కూడా ఉన్నాయి. ఈ ఉద్యానవనం సుమారు 280 సంవత్సరాల క్రితం జైపూర్‌కు చెందిన కచ్‌వాహ రాజ్‌పుత్ మహారాజా సవాయి జై సింగ్ నిర్మించారు. దీనికి మహారాజ్ రాణి కనకడే పేరు పెట్టారు. ఇక్కడ ప్రాంగణంలో ఉన్న గోవిందుడి విగ్రహం బృందావనం నుండి వచ్చింది, దాని కారణంగా ఇది బృందావనం నాస్‌తో అనుసంధానించబడింది.

శుభవార్త.. ఈ ఐదు మోడల్ ఎస్‌యూవీలపై రూ.1.80 లక్షల వరకు తగ్గింపు!

గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో SUVలను కొనుగోలు చేయాలనే డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. 2024 సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారతదేశంలోని మొత్తం కార్ల అమ్మకాలలో SUV సెగ్మెంట్ మాత్రమే 52% వాటాను కలిగి ఉంది.

మీరు కూడా రాబోయే కొద్ది రోజుల్లో కొత్త SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే అనేక ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు సెప్టెంబర్ నెలలో తమ ప్రసిద్ధ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇండియా టుడేలో ప్రచురించిన ఒక వార్త ప్రకారం, ఈ కాలంలో కొత్త ఎస్‌యూవీ కొనుగోలుపై కస్టమర్‌లు గరిష్టంగా రూ. 1.80 లక్షలు ఆదా చేయవచ్చు. సెప్టెంబర్ నెలలో అత్యధిక తగ్గింపులను పొందుతున్న 5 ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం.

టాటా సఫారి:

దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ సెప్టెంబర్ నెలలో తన ప్రముఖ ఎస్‌యూవీ సఫారీపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. వినియోగదారులు ఈ నెలలో టాటా సఫారీని కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ.1.80 లక్షలు ఆదా చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్లో టాటా సఫారీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్‌కు రూ.16.19 లక్షల నుండి రూ. 27.34 లక్షల వరకు ఉంటుంది.

టాటా హారియర్:

టాటా మోటార్స్ తన మరో ప్రసిద్ధ ఎస్‌యూవీ హారియర్‌పై సెప్టెంబర్ నెలలో రూ. 1.60 లక్షల వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ టాటా హారియర్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. భారతీయ మార్కెట్లో టాటా హారియర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 15.49 లక్షల నుండి రూ. 26.44 లక్షల వరకు ఉంది.

మహీంద్రా థార్:

దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా సెప్టెంబర్ నెలలో దాని ప్రసిద్ధ 3-డోర్ థార్‌పై బంపర్ తగ్గింపులను అందిస్తోంది. కస్టమర్లు సెప్టెంబర్ నెలలో మహీంద్రా థార్‌ను కొనుగోలు చేస్తే, ఈ కాలంలో వారు రూ. 1.55 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్లో మహీంద్రా థార్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 11.25 లక్షల నుండి రూ. 17.60 లక్షల వరకు ఉంటుంది.

మారుతి గ్రాండ్ విటారా:

భారతదేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతి సుజుకి సెప్టెంబర్ నెలలో తన ప్రసిద్ధ ఎస్‌యూవీ గ్రాండ్ విటారాపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ కాలంలో మారుతీ సుజుకి గ్రాండ్ విటారా కొనుగోలుపై కస్టమర్‌లు గరిష్టంగా రూ. 1.23 లక్షల బడ్జెట్‌ను కలిగి ఉండవచ్చు. భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 10.99 లక్షల నుండి రూ. 20.09 లక్షల వరకు ఉంది.

టాటా నెక్సాన్:

మరోవైపు, టాటా మోటార్స్ సెప్టెంబర్ నెలలో దాని అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటైన నెక్సాన్‌పై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. సెప్టెంబరు నెలలో టాటా నెక్సాన్‌ను కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్‌లు రూ. 80,000 వరకు ఆదా చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్లో టాటా నెక్సాన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 8 లక్షల నుండి రూ. 15.50 లక్షల వరకు ఉంటుంది.

శ్రీవారి లడ్డూ అంశంపై సినీ హీరోల మధ్య డైలాగ్ వార్

అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. హిందూ ధార్మిక సంఘాల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు.

ఏపీలో రాజకీయంగా అట్టుడుకుతోంది. టీడీపీ, వైసీపీ నేతలు ఈపాపం మీదంటే మీదేనంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఓ అడుగు మందుకేసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేశారు పవన్‌ కల్యాణ్‌. ఈ క్రమంలో వైసీపీ నేతలపైనా, సినీ ప్రముఖులపైనా విమర్శలు గుప్పించారు.

దసరా పండగ ఎప్పుడు వస్తోంది?

చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి (దసరా). అయితే హిందూ మతంలో దసరా పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఫెస్టివల్‌ను దేవీ నవరాత్రులని, శరన్నవరాత్రులని కూడా పిలుస్తారు.

సీతమ్మ తల్లిని అపహరించుకుని వెళ్ళిన రావణుడిని శ్రీరాముడు యుద్ధంలో ఓడించి సంహరించిన రోజునే విజయోత్సవంగా దసరా జరుపుకుంటారు.

దసరా పండుగ తేదీ ఎప్పుడు?

2024 సంవత్సరంలో శుక్ల పక్షం దశమి తిథి ఆకోబర్ 12న ఉదయం 10.58 గంటలకి ప్రారంభమై అక్టోబర్ 13 ఉదయం 9.08 గంటలకు ముగుస్తుంది. అంటే అక్టోబర్ 12వ తేదీన విజయదశమి (దసరా)ను జరుపుకోనున్నారు.

దసరా ఎందుకు జరుపుకుంటారు?

శ్రీరాముడు రావణుడిని నరికి చంపినందుకు గాను దసరా పండగను జరుపుకొంటారు. అలాగే పురాణాల ప్రకారం.. మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి తొమ్మిది రోజుల యుద్ధం తర్వాత విజయ దశమి రోజున సంహరించిందని కూడా చెబుతుంటారు. అందుకే దసరాని శరన్నవరాత్రులు, దేవి నవరాత్రులు అని కూడా పిలుస్తారు. 9 రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక పశ్చిమబెంగాల్‌లో విజయదశమినిపెద్ద వేడుకగా నిర్వహిస్తారు. దసరా రోజున శమీ పూజ నిర్వహించి ఆ చెట్టు ఆకులను బంగారం ఇచ్చుపుచ్చుకుని విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. దుర్గా పూజ పదో రోజున బెంగాలీలు బిజోయ దశమి పాటిస్తారు. ఈ పండగ రోజున దుర్గామాత ప్రతిమలని ఊరేగింపుగా తీసుకెళ్ళి నదిలో నిమజ్జనం చేస్తారు. దసరా రోజున శమీ పూజ, అపరజిత పూజ, పాలపిట్ట చూడటం వంటివి శుభకరమైనవిగా భావిస్తారు.

ముంబయి నటి జెత్వానీ కేసు, వైసీపీ నేత అరెస్టు- నిందితులుగా ముగ్గురు ఐపీఎస్ లు

ముంబయి నటి కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో ముగ్గురు ఐపీఎస్ లతో పాటు మరో ఇద్దరు పోలీసులను నిందితులుగా చేర్చారు. నటి జెత్వానీని అక్రమంగా అరెస్టు చేశారని వీరిపై అభియోగాలు ఉన్నాయి.

ముంబయి నటి కాదంబరి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు అతడిని వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా కుక్కల విద్యాసాగర్‌ ను పోలీసులు చేర్చారు. రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చారు. ఈ కేసులో నిందితులుగా పలువురు ఐపీఎస్‌ అధికారుల పేర్లను పోలీసులు చేర్చారు. ఏ2గా పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఏ3గా కాంతిరాణా, ఏ4గా వెస్ట్‌జోన్‌ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్‌గున్నీ పేర్లను చేర్చారు. ముంబయి నటిని వేధించిన కేసులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ లు, ఏసీపీ, సీఐను సస్పెండ్ చేసింది.

వైసీపీ నేత విద్యాసాగర్‌తో ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ కుమ్మక్కై పథకం ప్రకారం ముంబయి నటి జెత్వానీ వేధించినట్లు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. నటి జెత్వానీని అక్రమంగా చేసి, విజయవాడకు తరలించారని బెయిల్ దొరక్కుండా వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు డెహ్రాడూన్‌ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రైలులో అర్ధరాత్రి విజయవాడకు తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల చేయించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి అక్టోబర్ 4 వరకు రిమాండ్ విధించారు. విద్యాసాగర్ ను విజయవాడ సబ్‌జైలుకు తరలించారు.
నాలుగు సార్లు ఫిర్యాదులు

తప్పుడు కేసు నమోదు చేసి తనను వేధించినట్లు ముంబయి నటి జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో సెప్టెంబర్ 13న కేసు నమోదు చేసిన పోలీసు.. దర్యాప్తు చేపట్టారు. కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, పలువురు పోలీసుల పేర్లు నటి జెత్వానీ ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను తాజాగా అరెస్టు చేశారు.

కాదంబరి జెత్వానీ మొత్తం నాలుగుసార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మూడుసార్లు పోలీసు కమిషనర్‌కు, నాలుగోసారి ఇబ్రహీంపట్నం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అజ్ఞాతంలోకి వెళ్లిన విద్యాసాగర్‌ కోసం పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను నియమించగా..తాజాగా అతడు డెహ్రాడూన్ లో పట్టుబడ్డాడు.

ఏపీ మహిళా కమిషన్‌ను వెంటనే తొలగించండి.. ప్రభుత్వం ఆదేశాలు

ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గజ్జెల లక్ష్మికి ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆమె పదవి కాలం ఆగస్టులోనే ముగియడంతో వెంటనే తొలగించాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం నాడు సంబంధిత శాఖకు ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గజ్జెల లక్ష్మికి (AP Women Commission Gajjela Laxmi) ప్రభుత్వం (AP Govt) ఉద్వాసన పలికింది. ఆమె పదవి కాలం ఆగస్టులోనే ముగియడంతో వెంటనే తొలగించాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం నాడు సంబంధిత శాఖకు ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఈరోజు ఉదయం గజ్జెల లక్ష్మి ప్రకటించారు. ఆమెకు నిన్ననే ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. చైర్మన్‌కు ఉద్వాసన పలకడంతో సభ్యుల పదవి కాలం పూర్తి అయినట్టే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో ఇలా..

కాగా.. ముంబై నటి కాదాంబరి జెత్వాని కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ గతంలో గజ్జెల లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర రాష్ట్రాల మహిళల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, ఆమె ముంబయికి చెందిన మహిళ కాబట్టి మహరాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించాలంటూ వెంకటలక్ష్మి ఇచ్చిన ఉచిత సలహాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల మహిళల విషయంలో తాము సుమోటోగా కేసు తీసుకోలేమంటూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ చెప్పిన మాటలతో దుమారం చెలరేగింది.

ఉన్నత చదువులు చదివిన కాదంబరి ముందుగా ఏపీ మహిళా కమిషన్‌ను ఎందుకు ఆశ్రయించలేదని బాధితురాలిపైనే ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ప్రశ్నలు సంధించడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. “మహిళకు అన్యాయం జరిగితే మాకు సంబంధం లేదని అంటావా. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి నువ్వు మాయని మచ్చ. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్నికలకు ముందు నీకు పదవి వరించింది. వైసీపీ నాయకుల తప్పులు మీకు కనిపించడం లేదా?. ఇతర రాష్ట్ర మహిళలకు మన రాష్ట్రంలో అన్యాయం జరిగితే మహిళా కమిషన్‌కు సంబంధం లేదని అంటారా?. నీ పదవీ కాలం ఇంకో సంవత్సరం ఉంది. ఈ యేడాది పాటు వైసీపీ నాయకులు మహిళలను వేధిస్తే ఇలానే ఏదో ఒక వంక పెట్టుకుని వారిని రక్షిస్తావు. ఇలాంటి క్రిమినల్స్‌ను వెనకేసుకు రావడం వైసీపీలో సంప్రదాయంగా మారింది. మేము ట్యాక్సులు కట్టిన డబ్బుతో నీకు ప్రభుత్వం లక్షలు లక్షలు జీతం ఇవ్వడం లేదా?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అసభ్య పదజాలంతో తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తావు. మా నుంచి రియాక్షన్ వస్తే టీడీపీ సోషల్ మీడియాపై కేసులు పెడతావు. మళ్లీ మీ పార్టీ 2029లో గెలిస్తే ఇలాంటి నేరస్థులనే ఇంకా పెంచి పోషిస్తుంది” అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా..

వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించాడని, దానిపైనా విచారణ జరపాలని మంగళవారం సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అవినాష్, శివశంకర్ రెడ్డి, అతని కుమారుని కేసు…ఈ మూడింటిని ఒకేసారి వినాలని ధర్మాసనానికి విజ్ణప్తి చేశారు.

వైఎస్ వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్‌ (Anticipatory Bail)పై మంగళవారం హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణ నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌తో పాటు మరో నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్‌పై కూడా విచారణ జరపాలంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత పిటీషన్ వేశారు. దీనినిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.

Home » Andhra Pradesh » Kadapa » Avinash Reddy Anticipatory Bail Hearing Adjourned anr

High Court: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా..

ABN , Publish Date – Sep 24 , 2024 | 01:45 PM

వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించాడని, దానిపైనా విచారణ జరపాలని మంగళవారం సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అవినాష్, శివశంకర్ రెడ్డి, అతని కుమారుని కేసు…ఈ మూడింటిని ఒకేసారి వినాలని ధర్మాసనానికి విజ్ణప్తి చేశారు.
High Court: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా..

అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్‌ (Anticipatory Bail)పై మంగళవారం హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణ నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌తో పాటు మరో నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్‌పై కూడా విచారణ జరపాలంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత పిటీషన్ వేశారు. దీనినిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

మరోవైపు వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించాడని, దానిపైనా విచారణ జరపాలని ఈరోజు సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అవినాష్, శివశంకర్ రెడ్డి, అతని కుమారుని కేసు…ఈ మూడింటిని ఒకేసారి వినాలని ధర్మాసనానికి విజ్ణప్తి చేశారు. మూడు కేసులను ఒకేసారి వినడానికి ధర్మాసనం అంగీకరిస్తూ.. తదుపరి విచారణను నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.

కాగా దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి దంపతులు మంగళవారం (ఈనెల17వ తేదీ) సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌తోపాటు తమపై పోలీసులు పెట్టిన అక్రమ కేసు గురించి ఆయన దృష్టికి తెచ్చారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు, రాంసింగ్‌పై కేసు తదితర అంశాలపై సీఐడీ విచారణ జరిపించాలని కోరారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తనకు అన్ని విషయాలూ తెలుసని, తప్పనిసరిగా విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం అందించారు. ఇదే సందర్భంలో అక్టోబరు 3-5 తేదీల్లో అంటువ్యాధుల నివారణ-నియంత్రణపై హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో జరిగే జి-స్పార్క్‌-2024 (గ్లోబల్‌ సౌత్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇన్ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ అండ్‌ యాంటీమైక్రోబియల్‌ స్టివార్డ్‌షిప్‌) సదస్సుకు రావలసిందిగా సునీత ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

అలాగే గత నెల (ఆగస్టు) సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి సునీత తీసుకెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు ఆమె వివరించారు. కేసును పక్కదారి పట్టించేందుకు విశ్వప్రయత్నం చేశారని చెప్పారు. వైసీపీ హయాంలో హంతకులకు స్థానిక పోలీసులు అండగా నిలిచారని ఆమె హోంమంత్రి ఎదుట ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేస్తున్న న్యాయపోరాటానికి సహకరించాలని కోరారు.

గత ప్రభుత్వంలో హంతకులకు అండగా నిలిచిన వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని హోంమంత్రికి చెప్పారు. తన తండ్రిని హత్య చేసిన వారిని, వైసీపీ ప్రభుత్వంలో నిందితులను కాపాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీబీఐ అధికారులపైనే తప్పుడు కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. కేసు విచారిస్తున్న అధికారులతోపాటు సాక్షులను కూడా బెదిరించారని వివరించారు. సీబీఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని వైఎస్ సునీతకు అనిత హామీ ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు. తప్పు చేసిన పోలీసులను సహా ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

Health

సినిమా