Sunday, December 14, 2025

అనర్హులు స్వచ్ఛంధంగా పెన్షన్లు వదులుకోండి, పెన్షన్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ప్రక్షాళన తప్పదని ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లపై ముఖ‌్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పెద్ద ఎత్తున అనర్హులకు సామాజిక పెన్షన్లు అందిస్తున్న నేపథ్యంలో అనర్హులు స్వచ్ఛంధంగా తమ పెన్షన్లను వదులుకోవాలని బాబు సూచించారు.

ఏపీ ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్ల ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 64 లక్షలమందికి పైగా పెన్షన్లకు ప్రభుత్వం ప్రతి నెల దాదాపు రూ.2800కోట్ల రుపాయల్ని పెన్షన్ల రూపంలో చెల్లిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనర్హులకు పెన్షన్లు అందుతున్నట్టు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గుర్తించింది. అక్రమంగా పెన్షన్లు అందుకుంటున్న వారంతా స్వచ్ఛంధంగా పెన్షన్లు వదులుకోవాలని సిఎం చంద్రబాబు సూచించారు.

గత కొన్నేళ్లుగా ఏపీ అందించే సామాజిక పెన్షన్ మొత్తం పెరగడంతో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ హయంలో పెన్షన్‌ అర్హత వయసు నిర్దారణ కోసం ఆధార్ కార్డుల్లో వయసు మార్చుకుని కూడా అక్రమాలకు పాల్పడ్డారు. దీనిని అరికట్టాలని ప్రయత్నించినా రాజకీయ కారణాలతో వాటిని చేయలేకపోయారు. 64లక్షల మంది పెన్షనర్లలో అసలైన అర్హులు ఎందరో క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలనకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

మరోవైపు విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దివ్యాంగులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముందన్న కారణంతో అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ రూ. 3వేల నుంచి ఒకేసారి రూ.6 వేలకు పెంచామని, దీర్ఘకాలిక ఆనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.15 వేలు ప్రతినెలా పింఛను రూపంలో ఇస్తున్నామని తెలిపారు.

అర్హులైన ఏ ఒక్కరికీ పింఛన్ అందకుండా ఉండటానికి వీళ్లేదని, ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో ప్రతి ఒక్క అర్హుడికి పింఛన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తప్పుడు సర్టిఫికేట్లతో దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందిన ఘటనలు ఉన్నాయని….ఈ విషయంలో పెద్దఎత్తున ఫిర్యాదులు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ అంశం తన దృష్టికి కూడా వచ్చిందన్న సిఎం…. అర్హులకు, బాధితులకు పింఛన్ ఇవ్వాలన్నది తమ విధానమని….దాన్ని దుర్వినియోగం చేసి పింఛన్లు పొందడం సరికాదని అన్నారు.

వైద్యుల నుంచి తప్పుడు సర్టిఫికెట్లతో కొంత మంది దివ్యాంగుల పేరుతో పింఛన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని ఆదేశించారు. అనర్హులు ఎవరైనా తప్పుడు పద్దతిలో పింఛన్ లు పొందుతుంటే స్వచ్ఛందంగా వదులుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పింఛన్ల అంశంలో ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పింఛన్లు ఇవ్వడంతో పాటు…అనర్హులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

అనర్హులు దివ్యాంగుల పేరుతో పింఛను పొందడం అంటే అర్హులకు అన్యాయం చేయడమే అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు సాయం చేసే విషయంలో రాజీపడబోదని…ఇదే సమయంలో బోగస్ పింఛన్లు కూడా కొనసాగించేది లేదని సీఎం అన్నారు.
సీనియర్స్ సిటిజన్స్ కు డిజిటల్ లిట్రసీ

గ్రామాల్లో ఉండే వృద్ధులకు పింఛన్ ఇవ్వడంతో పాటు….వారికి ఇతరత్రా ఏం చెయ్యవచ్చనేది కూడా స్టడీ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. గ్రామాల్లో వృద్ధులకు డిజిటల్ లిట్రసీ ద్వారా వారు సులభంగా సేవలు పొందే అవకాశాన్ని కల్పించాలన్నారు. దీని కోసం వృద్ధులు, ఆయా ఏజెన్సీలతో మాట్లాడి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 39 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ కు పింఛన్లు ఇస్తున్నామని…వారికి గ్రామాల్లో అవకాశాలు సృష్టించే కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. పింఛన్లతో సోషల్ సెక్యూరిటీతో పాటు గౌరవం ఇచ్చామన్నారు. వృద్ధులకు పింఛన్ ఇచ్చి వదిలేయడం కాకుండా వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచవచ్చనే విషయంలో ఆలోచనలు చేసి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుకు విశాఖలో 30 ఎకరాలు కేటాయించాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.200 కోట్లతో ఈ సెంటర్ మంజూరు చేసిందని…అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు జరగలేదని, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని సీఎం అన్నారు.

సింగిల్ గా ఉండే ట్రాన్స్ జెండర్స్ కు రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. పిల్లల్లో చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు కనిపెట్టేందుకు పరీక్షలు చేయాలని….ఇలాంటి కార్యక్రమం సమర్థవంతంగా చేపడితే వారు భవిష్యత్ లో దివ్యాంగులు అవ్వకుండా అరికట్టవచ్చని సూచించారు. దీని కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. దివ్యాంగులకు ఇచ్చే వీల్ చైర్స్, ట్రై సైకిల్స్ సోలార్ సిస్టంతో నడిచే విధంగా రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర… 20 మంది ఛైర్మన్లతో తొలి జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల జాతర ప్రారంభమైంది. 20మందితో తొలి జాబితా విడుదలైంది. ఎన్డీఏ కూటమి పార్టీలలో పదవులు దక్కిన వారిలో లో 16మంది టీడీపీ నాయకులు, ముగ్గురు జనసేన, ఒక బీజేపీ నాయకుడు ఉన్నారు.

ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రారంభమైంది. నాలుగు నెలలుగా ఊరిస్తున్న పదవుల భర్తీ ఎట్టకేలకు చేపట్టారు. 20మంది ఛైర్మన్లతో తొలిజాబితా విడుదల చేశారు. సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ పదవుల్ని భర్తీ చేశారు.

మొత్తం 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల జాబితాను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ లకు పెద్ద పీట వేశారు. 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు దక్కాయి. ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి దక్కింది. 6 గురు యూనిట్ ఇంఛార్జ్ లకు పదవులు దక్కాయి.

20 కార్పొరేషన్లకు ఛైర్మెన్లను నియమించారు, ఒక కార్పొరేషన్ కు వైస్ ఛైర్మెన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించారు. ప్రకటించిన 99 పదవుల్లో యువత కు ప్రాధాన్యం ఇచ్చారు.

పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పదవులు కట్టబెట్టిన కట్టబెట్టారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి హై ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం పదవుల్లో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీ1 పదవి కేటాయించారు.
ఛైర్మన్లను నియమించిన కార్పొరేషన్లు ఇవే..

1 వక్ఫ్ బోర్డు – అబ్దుల్ అజీజ్

2 స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) – అనిమిని రవినాయుడు

3 AP హౌసింగ్ బోర్డ్ – బత్తుల తాత్యబాబు

4 AP షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR) – బొరగం శ్రీనివాసులు
5 AP మారిటైమ్ బోర్డ్ – దామచర్ల సత్య

6 SEEDAP (APలో ఉపాధి కల్పన & ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ కోసం సొసైటీ) – దీపక్ రెడ్డి

7.20 పాయింట్ ఫార్ములా – లంకా దినకర్ (బీజేపీ)

8. AP మార్క్‌ఫెడ్ – కర్రోతు బంగార్రాజు

9 AP స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – మన్నె సుబ్బారెడ్డి

10 ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC – మంతెన రామరాజు

11 AP పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ – నందం అబద్దయ్య

12 AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – నూకసాని బాలాజీ

13 APSRTC-చైర్మన్, APSRTC వైస్ చైర్మన్ – కొనకళ్ల నారాయణ, పిఎస్‌ మునిరత్నం

14 AP అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పీలా గోవింద సత్యనారాయణ

15 లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పిల్లి మాణిక్యాల రావు

16 AP రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి – పీతల సుజాత

17 A.P. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSME DC) – తమ్మిరెడ్డి శివశంకర్(జనసేన)

18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ – తోట మెహర్‌ సుధీర్‌( జనసేన)

19 ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC) వజ్జా బాబురావు

20 AP టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ APTIDCO – వేములపాటి అజయ్‌కుమార్‌ (జనసేన)

కల్తీ నెయ్యికి ప్రధాన కారకుడు జగనే

వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చిందని నారాయణ తెలిపారు. నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ల కోసం వెతికారని.. అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి సలహాతో తిరుమల నెయ్యిపై దృష్టి పెట్టి తక్కువ ధరకే టెండర్ ఇచ్చి కమిషన్ తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్‌కు వెళ్లిందన్నారు.

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Former CM YS Jagan) కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ల కోసం వెతికారని.. అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి సలహాతో తిరుమల నెయ్యిపై దృష్టి పెట్టి తక్కువ ధరకే టెండర్ ఇచ్చి కమిషన్ తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్‌కు వెళ్లిందన్నారు. తిరుమల పవిత్రతను మంట కలిపింది జగన్‌మోహన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్మారెడ్డి వల్లే…

ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా పెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు. ధర్మారెడ్డి వల్లే తిరుమలలో అరాచకాలు జరిగాయన్నారు. కర్ణాటక నెయ్యి టెండర్‌ను ఎందుకు ధర్మారెడ్డి రద్దు చేశారని ప్రశ్నించారు. లడ్డూ గురించి ఇష్టానుసారం మాట్లాడడం ఇకనైనా మానుకోవాలన్నారు. సుప్రీంకోర్టు సమోటోగా లడ్డూ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. కమ్యూనిస్టులు దేవుడికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

అమిత్ షా క్రిమినల్….

కేంద్రమంత్రి అమిత్ షా వామపక్ష శత్రువులను లేకుండా చేస్తున్నారని.. అమిత్ షా క్రిమినల్ అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సైద్థాంతిక వ్యవస్థను నాశనం చేయడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కత్తితో రాజకీయం చేస్తే కత్తితోనే పోతారని హెచ్చరించారు. లోపాల్ని ఎత్తి చూపేవారిని చంపేయడం సరైంది కాదన్నారు. మోడీకి వ్యక్తిగతమైన పలుకుబడి తగ్గిందన్నారు. నైతికంగా మోడీ ఓడిపోయారన్నారు. మోదీని కొనసాగించకూడదని ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. బీజేపీ హయాంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. మోదీ విదేశాలకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నిస్తూ.. భారతదేశానికి మోడీ ఛీప్ గెస్ట్ ప్రధానిగా మారారని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్న తమిళనాడు గవర్నర్‌‌ను రీకాల్ చేయాలన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు ముందుగా పరిష్కరించాలని నారాయణ డిమాండ్ చేశారు.

తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ అధిపతి ఎవరంటే..

తిరుమలలో కొలువు తీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో ఈ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తిరుమలలో కొలువు తీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో ఈ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం లోపు అందుకు సంబంధించిన జీవోను జారీ చేయాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.

మరోవైపు ఇదే అంశంపై సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా సమావేశమై చర్చించారు. మంగళవారం ఉదయం మరోసారి సీఎం చంద్రబాబుతో వీరిద్దరు భేటీ కానున్నారు. ఈ భేటీలో సిట్‌ చీఫ్‌గా ఎవరిని నియమించాలనే అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తుంది. సిట్ చీఫ్‌గా సీనియర్ ఐజీ అధికారిని నియమించనున్నారు. ఈ సిట్ ‌బృందంలో ఇద్దరు డీఐజీలు, ఇద్దరు ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతోపాటు పలువురు కానిస్టేబుళ్లు ఉండనున్నారు.

ఇప్పటికే ఇద్దరు సీనియర్ ఐజీ అధికారుల పేర్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆ క్రమంలో ఒకరిని ఎంపిక చేసే అవకాశముందని తెలుస్తుంది. దీంతో సిట్‌కు నేతృత్వం వహించేది ఎవరనే విషయం కొన్ని గంటల్లో తెలిపోనుంది.

గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన నిజనిజాలు వెలుగులోకి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అందులోభాగంగా చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ ఘోర అపచారం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం.. సోమవారం శాంతి హోమం నిర్వహించింది. అనంతరం శ్రీవారు కొలువు తీరిన ఆనంద నిలయంతోపాటు తిరుమాడ వీధుల్లో ఆయన పూజాలు సంప్రోక్షణ నిర్వహించారు.

ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా.

బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులో వివిధ రకాల FD స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఓ పోస్టాఫీస్ స్కీంలో మీరు కొంత పెట్టుబడి చేస్తే ఆ మొత్తం కంటే, మీకు వచ్చే వడ్డీ మూడు రెట్లు రావడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. దీంతోపాటు మీరు ఆదాయపు పన్ను చట్టం కింద ప్రయోజనం కూడా పొందుతారు.

రిస్క్ లేని రిటర్న్స్ కావాలంటే బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, ప్రభుత్వ రంగ స్కీంలలో పెట్టుబడులు బెస్ట్ అని చెప్పవచ్చు. వీటిలో మీ డబ్బుపై భద్రతతోపాటు మంచి ఆదాయం కూడా సమకూరుతుంది. అలాంటి పథకాలలో పోస్ట్ ఆఫీస్‌ టైమ్ డిపాజిట్ స్కీం(post office time deposit scheme) ఒకటి. దీనిని సాధారణ భాషలో పోస్ట్ ఆఫీస్ FD అని పిలుస్తారు. దీనిలో మీరు పెట్టిన సేవింగ్స్ కంటే మీకు వచ్చే వడ్డీ మూడు రెట్లు రావడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ముందుగా

పోస్టాఫీసులో మీ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకోవడానికి మీరు ముందుగా 5 సంవత్సరాల FDని ఎంచుకోవాలి. మీరు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత మెచ్యూరిటీకి ముందు మరో ఐదేళ్ల పొడిగించుకోవాలి. మీరు ఈ పొడిగింపును వరుసగా రెండుసార్లు చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ FDని 15 సంవత్సరాల పాటు అమలు చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ FDలో రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే మీకు 7.5 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాలలో ఆ మొత్తంపై మీకు రూ. 4,49,948 వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా ఆ మొత్తం రూ.14,49,948 అవుతుంది.

పెట్టిన మొత్తంపై

ఆ తర్వాత మీరు ఈ పథకాన్ని 5 సంవత్సరాలు పొడిగిస్తే, 10 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే మొత్తం మొత్తం రూ. 21,02,349 అవుతుంది. ఇది మెచ్యూర్ అయ్యే ముందు మీరు దాన్ని మరోసారి పొడిగించవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో 15వ సంవత్సరంలో మీకు రూ.10 లక్షల పెట్టుబడిపై కేవలం వడ్డీ డబ్బులే రూ.20,48,297 వస్తాయి. ఆ క్రమంలో మీకు వచ్చే మొత్తం మెచ్యూరిటీపై రూ. 30,48,297 పొందుతారు. అంటే మీరు పెట్టిన మొత్తం 10 లక్షలు, కానీ మీకు వచ్చేది మాత్రం 30 లక్షలకుపైగా లభిస్తుంది. మీ మొత్తాన్ని మూడు రెట్లు పొందుతారు. అంతేకాదు మీరు ఆదాయపు పన్ను చట్టం 80C కింద పన్ను ప్రయోజనం కూడా పొందుతారు.

పొడిగింపు

పోస్ట్ ఆఫీస్ ఒక సంవత్సరం FD మెచ్యూరిటీ తేదీ నుంచి 6 నెలలలోపు, 2 సంవత్సరాల FD మెచ్యూరిటీ వ్యవధిలో 12 నెలలలోపు, 3, 5 సంవత్సరాల FD మెచ్యూరిటీ వ్యవధిలో 18 నెలలలోపు పొడిగించబడుతుంది. ఇది కాకుండా ఖాతాను తెరిచేటప్పుడు మీరు మెచ్యూరిటీ తర్వాత ఖాతా పొడిగింపు కోసం కూడా అభ్యర్థించవచ్చు. మెచ్యూరిటీ తేదీలో సంబంధిత ఖాతాకు వర్తించే వడ్డీ రేటు పొడిగించిన వ్యవధిలో వర్తిస్తుంది.

ఇజ్జత్ పాయె.. రోజాకు దిమ్మతిరిగే పంచ్

వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాకు జబర్దస్ పంచ్ పడింది. తన యూట్యూబ్ ఛానెల్‌లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆమె పోల్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్కే రోజాకు నెటి‌జన్లు గట్టి ఝలక్ ఇచ్చారు. తిరుపలి లడ్డూలో కల్తీ చేసింది ఎవంటూ రోజా తన యూట్యూబ్ చానెల్‌లో పొల్ చేపట్టారు.

వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాకు జబర్దస్ పంచ్ పడింది. తన యూట్యూబ్ ఛానెల్‌లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆమె పోల్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్కే రోజాకు నెటి‌జన్లు గట్టి ఝలక్ ఇచ్చారు. తిరుపలి లడ్డూలో కల్తీ చేసింది ఎవంటూ రోజా తన యూట్యూబ్ చానెల్‌లో పొల్ చేపట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌దే తప్పంటూ 74 శాతం మందికిపైగా నెటిజన్లు ఓటు వేశారు. అలాగే ఎవరి పాలనలో తిరుమల బాగుందంటూ ఆమె పోల్ పెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోనే తిరుపతి బాగుందంటూ 77 శాతం మందికి పైగా ఓటు వేశారు.

తిరుమలలో కొలువు తీరిన శ్రీవెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు బాబుతోపాటు కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సైతం స్పందించారు. ఆ క్రమంలో చంద్రబాబుతోపాటు ఆయన ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక వై ఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి సైతం సోమవారం తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుని హడావుడి సృష్టించిన విషయం విధితమే.

అలాంటి వేళ.. ఆర్కే రోజా తన యూట్యూబ్ చానెల్ ద్వారా తిరుపతి లడ్డూ వ్యవహారంపై పోల్ నిర్వహించారు. అలాగే చంద్రబాబు పాలనపై సైతం ఆమె ఈ సందర్భంగా పోల్ నిర్వహించారు. ఈ సందర్బంగా తిరుపతి లడ్డూ ప్రసాదంలో గత జగన్ ప్రభుత్వం తప్పు ఉందంటూ ఈ పోల్‌లో నెటిజన్లు ఓటు వేశారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరి 100 రోజులు పూర్తి చేసుకుంది.

దీంతో ఇది మంచి ప్రభుత్వం అంటూ కూటమి ప్రభుత్వం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని కూటమి నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లారు. అలాంటి వేళ.. గత జగన్ ప్రభుత్వ పాలన బాగుందా? చంద్రబాబు పాలనా బాగుందా? అంటూ పోల్ నిర్వహించింది. అందులో సైతం చంద్రబాబు పాలనకే నెటిజన్లు మద్దతు ప్రకటించారు. దీంతో ఆర్కే రోజాకు నెటిజన్లు జబర్దస్త్ ఝలక్ ఇచ్చిరానే ఓ చర్చ సైతం వాడి వేడిగా పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తుంది.

ఐఫోన్ మేనియా ఆ రేంజ్‌లో ఉంది మరి.. ఈ ఐఫోన్ వాటర్ ప్రూఫ్ మాత్రమే కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కూడా..

ఆపిల్ సంస్థ ప్రతి ఏటా విడుదల చేసే కొత్త వెర్షన్ ఐఫోన్లకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. అత్యంత ఖరీదైన ఆ ఫోన్లను దక్కించుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఐఫోన్‌ను వాడడం స్టేటస్ సింబల్‌గా భావించే వాళ్లు చాలా మంది ఉన్నారు. తాజాగా ఐఫోన్ 16 విడుదల అయింది.

ఆపిల్ (Apple) సంస్థ ప్రతి ఏటా విడుదల చేసే కొత్త వెర్షన్ ఐఫోన్లకు (iPhone) ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. అత్యంత ఖరీదైన ఆ ఫోన్లను దక్కించుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఐఫోన్‌ను వాడడం స్టేటస్ సింబల్‌గా భావించే వాళ్లు చాలా మంది ఉన్నారు. తాజాగా ఐఫోన్ 16 విడుదల అయింది. ఆ ఫోన్ విడుదలైన రోజున చాలా మంది వినియోగదారులు ఆపిల్ స్టోర్ల ముందు పడిగాపులు కాశారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి స్వయంగా ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ను (iPhone 16 pro max) పోలి ఉండే ఇనుప నమూనాను తయారు చేశాడు.

uday_fabrication అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో , ఒక వ్యక్తి ఇనుమును కత్తిరించడం, వెల్డింగ్ చేయడంతో సహా నకిలీ ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ను ఎలా తయారు చేస్తున్నాడో చూపించారు. కచ్చితమైన పరిమాణం, లోగో నుంచి ట్రిపుల్ కెమెరా సెట్టింగ్ వరకు ప్రతి చిన్న డిటైల్ కూడా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను పోలి ఉంది. దూరం నుంచి చూస్తే అది కచ్చితంగా లక్షలు విలువ చేసే ఐఫోన్ అని నమ్మక తప్పదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 6 కోట్ల మందికి పైగా వీక్షించారు. 26 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. “ఇంత ట్యాలెంట్ ఏంటి భయ్యా“, “ఈ ఐఫోన్ వాటర్ ప్రూఫ్ మాత్రమే కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కూడా..“, “ఇది సామాన్యుడి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్“, “ఇప్పుడు నేల విరిగిపోతుంది కానీ ఫోన్ విరిగిపోదు“ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు

కార్పొరేట్ కంపెనీల్లో ఏఐ ఇంటర్న్‌షిప్ స్కీం.. అప్లికేషన్లు ఎప్పటి నుంచంటే

మీరు కూడా ఏఐ ఇంటర్న్‌షిప్ స్కీం కోసం వేచి చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నిర్వహిస్తున్న ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ మధ్య నుంచి మొదలు కానున్నట్లు తెలిసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

ఏఐ(AI) ఇంటర్న్‌షిప్ కోసం చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నిర్వహిస్తున్న ఇంటర్న్‌షిప్ స్కీమ్(Internship Scheme) కోసం దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ మధ్య నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మొదటి దశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ పథకానికి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కంపెనీలకు ఇంటర్న్‌షిప్ చేయడానికి వచ్చిన జాబితా నుంచి దరఖాస్తుదారులను పంపించనున్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత మూడేళ్లలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)పై చేసిన ఖర్చుల ఆధారంగా టాప్ 500 కంపెనీల జాబితాను ఖరారు చేయడంలో బిజీగా ఉంది.

ఈ ఏడాది ప్రారంభం

కంపెనీలు వారి కోరిక మేరకు ఈ పథకంలో చేరవచ్చు. జులై 23న సాధారణ బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రకటించారు. ఉపాధిని ప్రోత్సహించడమే దీని లక్ష్యం. కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ చివరి నాటికి ఈ పథకం కోసం పోర్టల్‌ను ప్రారంభించవచ్చు. ఈ విషయానికి సంబంధించి కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అయితే కంపెనీలు ఎంత మందికి ఇంటర్న్‌షిప్‌ను అందించవచ్చు, ఎంత మంది అప్లై చేసుకునే ఛాన్స్ ఉందనే విషయం పోర్టల్‌ మొదలైన తర్వాత తెలుస్తుంది.

వీరు అప్లై చేసుకోలేరు

దరఖాస్తులను క్రమబద్ధీకరించేటప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్లు, సర్టిఫైడ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్లు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) లేదా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) నుంచి డిగ్రీలు పొందిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేని అభ్యర్థులుగా మినహాయించబడతారు. దరఖాస్తుదారుడి కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే, వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. కంపెనీలు అభ్యర్థులను నేరుగా సంప్రదించలేవని ఆయా వర్గాలు తెలిపాయి.

షార్ట్‌లిస్ట్ చేసి

అభ్యర్థులు ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసినప్పుడు కమిటీ దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి కంపెనీలకు పంపుతుంది. ఇంటర్న్ ప్రతి ఖాళీకి ఇద్దరు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దీని తర్వాత కంపెనీలు తమ అవసరాన్ని బట్టి దరఖాస్తుదారులను ఎంపిక చేసుకోవచ్చు లేదా తిరస్కరించవచ్చని ఆయా వర్గాలు తెలిపాయి. ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా 5 సంవత్సరాలలో దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో 1 కోటి మంది యువత నైపుణ్యం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఎంపికైన యువత 12 నెలల పని అనుభవం పొందుతారు. ఆ క్రమంలో వివిధ వృత్తులను అర్థం చేసుకుంటారు. దీంతో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాంటి అభ్యర్థులకు కేంద్రం ప్రతి నెలా రూ.5,000 స్టైఫండ్ అందజేస్తుంది. దీంతోపాటు వన్‌టైమ్‌ రూ.6,000 ఆర్థిక సాయం కూడా అందజేస్తారు.

రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం..

అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (RaghuramaKrishnam Raju)పై థర్డ్ డిగ్రీ (Third Degree) ప్రయోగించిన కేసు (Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయ పాల్‌ (Vijay Paul)కు హైకోర్టు (High Court)లో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ (Anticipatory Bail) ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును.. సీఐడీ కస్టడీలో విజయ్‌పాల్‌ చిత్రహింసలు పెట్టారు.

తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలని గుంటూరులో రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు.. విజయపాల్‌తో పాటు అప్పటి సీఎం జగన్, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి.. సూపరింటెండెంట్‌ డాక్టర్ ప్రభావతిని నిందితులుగా పోలీసులు చేర్చారు. కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్‌ కోర్టులో పిటిషన్ వేశారు. విజయ్‌పాల్ తరఫున సుప్రీంకోర్టు కౌన్సిల్‌ సిద్ధార్థ లూథ్రా, పీపీ లక్ష్మీనారాయణ,.. రఘురామ కృష్ణంరాజు తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. న్యాయస్థానం విజయపాల్‌కు బెయిల్ నిరాకరించడంతో మిగతా అధికారుల్లో వణుకు మొదలైంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. విజయ్‌పాల్‌ తన ఆరోగ్యం బాగోలేదని ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారని.. ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించడం శుభపరిణామమని అన్నారు. తనను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టడానికి అనువైన వాతావరణాన్ని విజయ్‌పాల్‌ సృష్టించారని అన్నారు. ఇలాంటి పనికిమాలిన పనులన్నీ విజయ్‌పాల్‌ చేశారని మండిపడ్డారు. త్వరలో రిటైర్డ్‌ ఎస్పీ మహిపాల్‌ అరెస్ట్‌ అవుతారని, అలాగే సునీల్‌కుమార్‌ కూడా అరెస్ట్‌ అవుతారని.. విచారణ వేగవంతమవుతుందనే ఆశాభావంలో ఉన్నానని రఘురామకృష్ణంరాజు ఏబీఎన్‌తో పేర్కొన్నారు.

కాగా నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కేసులో ఎట్టకేలకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆయనపై హత్యాయత్నం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసు అధికారులు, సిబ్బందిని త్వరలోనే అరెస్టు చేయనున్నారు. అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డిపై రఘురామరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2021లో ఆయనపై దేశద్రోహం కింద కేసు నమోదుచేసిన సీఐడీ అధికారులు.. ఆ ఏడాది మే 14న జన్మదినం రోజున ఆయన్ను హైదరాబాద్‌ నుంచి బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడినట్లు రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసు సేషన్లో కేసు నమోదైంది.

నాటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌(ఏ-1), అప్పటి నిఘా విభాగం అధిపతి పీఎస్ఆర్‌ ఆంజనేయులు (ఏ-2), మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి (ఏ-3), సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌(ఏ-4), అప్పటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి (ఏ-5)తదితరులపై ఐపీసీ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 506(34) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే రోజులు గడుస్తున్నా కేసులో ఎటువంటి పురోగతీ లేదంటూ రఘురామరాజు పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌కుమార్‌ను కలిసి దర్యాప్తు వేగవంతం చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

రూ. 76 వేల మార్క్ దాటేసిన తులం బంగారం ధర.. మీ ప్రాంతంతో గోల్డ్ రేట్ తెలుసుకోండి

బంగారం ధరల్లో మళ్లీ అనూహ్యమైన పెరుగుదల కనిపిస్తోంది. ఒకానొక సమయంలో తుం బంగారం ధర రూ. 80 వేలకు చేరువై అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే ఆ తర్వాత క్రమంగా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. మళ్లీ రూ. 70 వేల మార్కుకు చేరువైంది. అయతే తాజాగా మళ్లీ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఆకాశమే హద్దుగా గోల్డ్ రేట్స్‌ దూసుకుపోతున్నాయి. దీంతో తులం బంగారం ధర మళ్లీ రూ. 76వేల మార్క్‌ను దాటేసి పరుగులు పెడుతోంది. మరి మంగళవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,690గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.76,310 వద్ద కొనసాగుతోంది. ఇక ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 69,810కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 76,160 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 69,810, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 76,160వద్ద కొసాగుతోంది.

అదే విధంలో మరో ప్రధాన నగరమైన బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,810కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 76,160 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,810గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 76,160 వద్ద కొనసాగుతోంది. విజయవాడతో పాటు, విశాఖలోనూనే 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 69,810కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 76,160 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర పెరిగితే వెండి ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. మంగళవారం కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో ఢిల్లీతోపాటు ముంబయి, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 92,900 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే చెన్నై, హైదరాబాద్‌, కేరళ, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 97,900 వద్ద కొనసాగుతోంది.

రాత్రి పూట పెరుగు తింటే ఇలా అవుతుందా..? నిపుణుల సూచన..! తప్పక తెలుసుకోండి..

పెరుగులో అనేక ఆరోగ్యప్రయోజనాలు నిండివున్నాయి. కాబట్టి పాలు అంటే ఇష్టపడని వాళ్లు కనీసం పెరుగైనా డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే.. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి మంచిది. అయితే, అన్ని సమయాల్లో పెరుగు తినొచ్చా..? రాత్రి, పగలు మూడు పూటల పెరుగు తినటం వల్ల ఏమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందా..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

పెరుగులో కండరాల పెరుగుదలకు అవసరమయ్యే ప్రొటీన్, ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన కాల్షియం, శక్తి ఉత్పత్తి, జీర్ణక్రియకు సహాయపడే విటమిన్​ బి2, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్​ బి12, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే పొటాషియం, లాక్టిక్​ ఆమ్లం, ప్రోబయోటిక్స్ వంటివి చాలానే ఉన్నాయి. కానీ, రాత్రి పూట పెరుగు తినటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు..

చాలామంది భోజనం చివరన పెరుగు లేకుండా ముగించరు. మధ్యాహ్నంతో పాటు రాత్రి కూడా పెరుగు తినే వారుంటారు. అయితే రాత్రిపూట పెరుగు తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ఉండే టైరమైన్.. మెదడును ఉత్తేజ పరుస్తుంది. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రలేమి వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.

రాత్రిపూట పెరుగు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో కొవ్వు పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు. అందుకే అధిక బరువుతో బాధపడుతున్నవారు రాత్రి భోజనంలో పెరుగు తినకుండా ఉండాలని సూచిస్తున్నారు. వీలైతే, మజ్జిగ తాగొచ్చని అంటున్నారు.

రాత్రుళ్లు పెరుగు తినటం వల్ల ఊబకాయం, దగ్గు, జలుబు సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడేవారు కూడా పెరుగుకు దూరంగా ఉండటమే మంచిదని అంటున్నారు. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా రోజూ పెరుగు తినడం మంచిది కాదు.

జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదు. అలాగే తరచుగా అసిడిటీ, అజీర్ణం లేదా యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడుతుంటే, మీ జీర్ణక్రియ నెమ్మదిగా ఉన్నప్పుడు పెరుగు తినడం మానేయాలి. ముఖ్యంగా రాత్రిపూట పెరుగు అసలు తినొద్దని సూచిస్తున్నారు.

జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు, అలర్జీ ఉన్న వాళ్లు మాత్రం రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. పెరుగుతో ఒంట్లో కఫం పెరుగుతుంది. అందువల్ల రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు.

తెలంగాణలో కొత్త ఇంధన విధానం.. 35 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం..!

తెలంగాణ రాష్ట్రంలో హరిత ఇంధన ఉత్పత్తికి అపార అవకాశాలు ఉన్నాయని ఇటీవల చేపట్టిన అధ్యయనం ద్వారా వెల్లడైంది. రాష్ట్రాలవారీగా సౌర, పవన విద్యుత్తుతో పాటు, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుల (పీఎస్పీ) ద్వారానూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిశీలించి ఎంఎన్‌ఆర్‌ఈ కీలక వివరాలు సేకరించింది.

ఈ అధ్యయనం ప్రకారం, తెలంగాణలో రోజువారీ 35,100 మెగావాట్ల హరిత ఇంధనం ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతం స్థాపిత విద్యుత్ ప్లాంట్ల ద్వారా కేవలం 6,200 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని వెల్లడైంది. .

సామర్థ్యం పెంపు అవసరం

తెలంగాణలో ప్రస్తుతం సాధారణంగా రోజువారీ విద్యుత్ డిమాండ్ 15,747 మెగావాట్లుగా ఉంది. హరిత ఇంధనాన్ని పూర్తిగా వినియోగించినట్లయితే, ఈ డిమాండ్ కంటే రెట్టింపు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, హరిత ఇంధన ఉత్పత్తిని పెంచే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలకు అందిస్తోంది. ఇందు కోసం కేంద్రం రూ. 18,853 కోట్లు కేటాయించినట్టు కేంద్ర పునరుత్తేజక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఎ) పేర్కొంది.

దేశవ్యాప్తంగా లక్ష్యాలు

2030 నాటికి దేశంలో హరిత ఇంధన సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు చేరువ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి పెంపు కోసం పలు కేంద్ర పథకాలు అందుబాటులో ఉన్నాయి. ‘ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన’ కింద సబ్సిడీతో సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వబడుతున్నప్పటికీ, తెలంగాణలో కేవలం 4,300 ఇళ్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి.

పీఎం కుసుమ్ పథకంపై స్పందన లేకపోవడం

వ్యవసాయ బోర్ల వద్ద సౌర విద్యుత్ ఏర్పాటుకు కేంద్రం అమలు చేస్తున్న ‘పీఎం కుసుమ్’ పథకం కింద కూడా రాష్ట్రంలో ఆశించిన స్పందన లభించలేదు. పంటలు లేని సమయంలో సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, అది రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌కి సరఫరా చేస్తే, రైతులకు యూనిట్‌కి రూ. 3 చెల్లించనున్నట్లు డిస్కంల నిబంధన ఉంది. దీనివల్ల రైతులకు అదనంగా ఆదాయం వస్తుంది, అయినప్పటికీ స్పందన కొరవడిందని ఎంఎన్‌ఆర్‌ఈ స్పష్టం చేసింది.

తెలంగాణలో కొత్త ఇంధన విధానం

తెలంగాణలో త్వరలోనే కొత్త నూతన ఇంధన విధానం అమలులోకి రానుందని, రాష్ట్రం పీఎస్పీ ప్రాజెక్టుల ఏర్పాటుకు జాతీయ జల విద్యుత్ సంస్థ సహకరించడానికి ముందుకొచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇది కదా అసలైన వ్యాపారం అంటే.. పక్కాగా లక్షల్లో ఆదాయం

బిజినెస్‌ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఐఐటీ వంటి దిగ్గజ సంస్థల్లో చదివిన వారు కూడా సొంతంగా వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో వినూత్నంగా ఆలోచిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.

తాము సంపాదన ఆర్జిస్తూనే మరోవైపు మరో నలుగురికి సైతం ఉపాధి కల్పిస్తున్నారు. అయితే కొందరు పెట్టుబడికి భయపడి, లాభాలు వస్తాయో రావో అన్న అనుమానంతో వెనుకడుగు వేస్తుంటారు. అయితే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తే నష్టమనే మాటే ఉండదు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం మార్కెట్లో అల్యూమినియం ఫాయిల్‌ కంటైనర్స్‌కి మంచి డిమాండ్ ఉంది. పానిపూరి బండి నుంచి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ వరకు ప్రతీ చోట వీటి ఉపయోగం భారీగా పెరిగింది. ప్లాస్టిక్‌పై ప్రభుత్వాలు నిషేధం విధిస్తున్న తరుణంలో వీటికి మంచి డిమాండ్ పెరిగింది. ఇలాంటి అల్యూమినియం ఫాయిల్‌ కంటైనర్స్‌ తయారీని ప్రారంభిస్తే లక్షల్లో ఆదాయం పొందొచ్చు. ఇంతకీ వీటిని ఎలా తయారు చేస్తారు.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అల్యూమినియం ఫాయిల్‌తో తయారు చేసిన కంటైనర్స్‌లో ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉండడమే వీటి డిమాండ్‌కు కారణంగా చెప్పొచ్చు. ఈ కంటైనర్ తయారీకి రెండు రకాల మిషిన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఒకటి సెమీ ఆటోమెటిక్‌ మరొకటి ఫుల్లీ ఆటోమెటిక్‌ మిషిన్స్‌. ఇక ముడి సరుకుగా అల్యూమినియం ఫాయిల్‌ రోల్స్‌ కావాల్సి ఉంది.
ఇవి కేజీ రూ. 150 నుంచి రూ. 200 మధ్య లభిస్తుంది. ఇక కంటైనర్‌ షేప్‌ డిజైన్‌ కోసం మార్కెట్లో విభిన్న రకాల డైస్‌ అందుబాటులో ఉంటాయి. అల్యూమినియం ఫాయిల్ రోల్‌ను మిషిన్‌లో పెట్టడం వల్ల చాలా వేగంగా కంటైనర్స్‌ తయారీ అవుతుంటాయి.

ఇక సింగిల్‌ కావిటీ, డబుల్‌, ట్రిపుల్‌ ఇలా మిషిన్స్‌లో రకాలు ఉంటాయి. సింగిల్‌ కావిటీలో ఒక్కొక్క కంటైనర్ రడీ అయితే డబుల్‌లో ఒకేసారి రెండు కంటైనర్స్‌ రడీ అవుతాయి. సాధారణంగా సింగిల్‌ కావిటీ మిషిన్‌ ద్వారా ఒక నిమిషానికి 40 నుంచి 50 కంటైనర్స్‌ తయారు చేయొచ్చు. అంటే గంటకు ఏకంగా 3000 వరకు కంటైనర్స్‌ రడీ అవుతాయి. రోజులో తక్కువలో తక్కు 6 గంటలు పనిచేసినా.. 14 నుంచి 18 వేల కంటైనర్స్‌ను తయారు చేయొచ్చు. ఈ మిషిన్స్‌ రన్‌ కావడానికి 3 ఫేస్‌ కరెంట్ కావాల్సి ఉంటుంది.

ఇక లాభాల విషయానికొస్తే.. 1 అల్యూమినియం ఫాయిల్‌ కంటైనర్‌ తయారు చేయడానికి రూ. 2 ఖర్చవుతుంది. మార్కెట్లో దీనిని రూ. 2.5కు విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క కంటైనర్‌పై 50 పైసలు లభిస్తుంది. ఉదాహరణకు రోజుకు 16 వేల కంటైనర్స్‌ తయారు చేశారనుకుంటే సుమారు రోజుకు రూ. 8 వేల ఆదాయం పొందొచ్చు. ఈ లెక్కన నెలకు ఎంత కాదన్నా రూ. 2 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించవచ్చు.

ప్రశాంతమైన వాతావరణంలో చిరంజీవి ఫామ్ హౌస్.. సింపుల్ అయిన ధరెంతో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి తెలిసిందే. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆత్మవిశ్వాసం, స్వయంకృషితో ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిగా తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు.

దశాబ్దాలుగా సినీపరిశ్రమలో అద్భుతమైన రికార్డ్స్ సృష్టించి కోట్లాది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు, సహజమైన నటన, డ్యాన్స్ తో అప్పట్లో ఊర్రూతలూగించిన చిరు.. కొన్నాళ్లపాటు లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక కొన్ని సంవత్సరాల క్రితం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరు ఇప్పుడు చేతినిండా లతో బిజీగా ఉన్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కుర్రహీరోలకు సైతం గట్టి పోటీనిస్తున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో లెజెండరీ హీరోగా ఎదిగిన చిరు దాదాపు 30 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో విజయవంతంగా కొనసాగుతున్నారు. 150కి పైగా చిత్రాల్లో నటించాడు. తన కెరీర్‌లో 24,000 డ్యాన్స్ స్టెప్పులు వేసి గిన్నిస్ రికార్డు సాధించాడు. అయితే ఈ క్రమంలోనే తాజాగా బెంగుళూరులో చిరుకు ఉన్న ఫామ్ హౌస్ గురించి ఇప్పుడు నెట్టింట ఓ క్రేజీ న్యూస్ వైరలవుతుంది.

బెంగళూరుకు 35 కి.మీ దూరంలో చిరంజీవికి ఓ ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్ ధర రూ.30 కోట్లు ఉంటుందని సమాచారం. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ ఫామ్ హౌస్ ఉంది. కొన్నేళ్ల క్రితమే చిరు ఈ హౌస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పండగలు, ఫ్యామిలీ ఈవెంట్స్ కోసం అప్పుడప్పుడు తన కుటుంబంతో కలిసి చిరు ఇక్కడకు వస్తాడు. ఈ ఏడాది సంక్రాంతి పండగను ఇదే ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే చిరుకు హైదరాబాద్ లోనూ విలాసవంతమైన బంగ్లా ఉంది. దాదాపు రూ.30 కోట్లతో ఆ ఇంటిని నిర్మించారు. మార్కెట్ ధర ప్రకారం ఆ ఇల్లు ధర రూ.300 కోట్లు.

చిరు వద్ద ఉన్న కార్స్ కలెక్షన్స్ ఇదే. రోల్స్ రాయిస్ పంథమ్ (రూ. 10 కోట్లు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ 3వ తరం (రూ. 90 లక్షలు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ 4వ జెన్ (రూ. 1.50 కోట్లు), రేంజ్ రోవర్ వోగ్ (రూ. 1 కోటి), రే రోవర్ ఆటో ఫైవ్ (రూ. 275 కోట్లు) iota Wall Fire (రూ. 1 కోటి) కార్లు ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ వస్తే.. వెంటనే ఓ షాకింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. తాజాగా ఇదే జరిగింది. నిన్నగాక మొన్న మొదలైన హను రాఘవపూడి అప్‌డేట్స్ కూడా వస్తున్నాయి కానీ రాజా సాబ్ మాత్రం రావట్లేదు.

పైగా ఈ పై తాజాగా మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. మరి అదేంటి..? దాని వల్ల ఫ్యాన్స్‌కు వచ్చిన నష్టమేంటి..? ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..

బాహుబలి తర్వాత ప్రభాస్‌తో రెగ్యులర్ లు చేయడమే మరిచిపోయారు దర్శకులు. ఆయన డేట్స్ ఇస్తే చాలు.. భారీ యాక్షన్ లు లేదంటే లార్జర్ దెన్ లైఫ్ కారెక్టర్లు చేయిస్తూ ఒకప్పటి డార్లింగ్‌ను మర్చిపోయేలా చేసారు దర్శకులు. మధ్యలో రాధే శ్యామ్‌లో లవర్ బాయ్‌లా కనిపించినా.. అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ జొప్పించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి.. ఇలా ఏ తీసుకున్నా బడ్జెట్ వందల కోట్లు పక్కా. ఇలాంటి సమయంలో కాస్త రిలీఫ్ కోసం చిన్న చేయాలని అనుకున్నారు ప్రభాస్. అలా చేస్తున్నదే మారుతితో రాజా సాబ్. మిగిలిన వాటితో పోల్చినపుడు ఇది చిన్న అనిపిస్తుందేమో గానీ.. దీనికోసం కూడా 250 కోట్లు ఖర్చు చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

ప్రతిరోజు పండగే తర్వాత మారుతి తెరకెక్కించిన మంచి రోజులొచ్చాయి, పక్కా కమర్షియల్ ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఆయనపై నమ్మకంతో రాజా సాబ్ ఇచ్చారు ప్రభాస్. తనకు ఇచ్చిన ఆఫర్ వాడుకుంటూ.. ప్రభాస్‌ని నెవర్ బిఫోర్ అవతార్‌లో చూపించబోతున్నారు మారుతి. ఈ మధ్యే గ్లింప్స్ విడుదలైంది. ఇందులో వింటేజ్ డార్లింగ్ కనిపించారు.

తాజాగా రాజా సాబ్‌పై బాంబు పేల్చారు మేకర్స్. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ వస్తుందనే పూర్తిగా రూమర్స్ అని కొట్టి పారేసారు. సమ్మర్ 2025కు రానుంది రాజా సాబ్. ప్రమోషన్స్ కూడా దానికి తగ్గట్లే ఉంటాయని చెప్పుకొచ్చారు వాళ్లు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే.. అక్టోబర్ 22న మిస్టర్ పర్ఫెక్ట్ ను రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

గుండె జబ్బు వచ్చే ముందు ఈ 5 లక్షణాలు కనిపిస్తాయి.. అస్సలు లైట్‌ తీసుకోకండి

మనిషి ప్రాణాన్ని తీసే గుండెపోటు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారిగా కుప్పకూలి పోతుంటాడు.

ఇటీవల ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. యువకులు కూడా గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె సంబంధిత సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గడం వల్ల హార్ట్ ఫెయిల్‌ అవుతుంది.

అయితే గుండెపోటు వచ్చే ముందు శరీరం మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని త్వరగా గుర్తించగలిగితే ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యను వెంటనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రాణాలను నిలబెట్టుకోవచ్చు. ఇంతకీ గుండె సంబంధిత సమస్యలు వచ్చే ముందు శరీరంలో కనిపించే ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఏ రకమైన శ్వాస సంబంధిత సమస్య అయినా గుండె వైఫల్యానికి సంకేతం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లు అనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీర్ఘకాలంగా ఈ సమస్య కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

* గుండెపోటు వచ్చే ముందు కనిపించే మరో ప్రధాన లక్షణాల్లో మోకాళ్లు లేదా చీలమండలలో వాపు ఒకటని నిపుణులు చెబుతున్నారు. గుండె బలహీనంగా మారిన సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. గుండె సరిగ్గా పని చేయని సమయంలో చీలమండలు, మోకాళ్లలో వాపు మొదలవుతుంది.

* ఏ పని చేయకపోయినా తరచూ అలసిపోవడం. నాలుగు అడుగులు వేయగానే ఆయాసం రావడం, అలసటగా ఉండడం వంటి లక్షణాలు కూడా గుండె పోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు.

* నిరంతరమైన దగ్గు, విపరీతమైన గురక కూడా కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలకు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండె పనితీరు దెబ్బతిన్న సమయంలో, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వంటి కారణాల వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. కాబట్టి పైన తెలిపిన ఏ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మొన్న యాక్షన్.. ఇప్పుడు ఎమోషన్.. దేవర నుంచి మరో ట్రైలర్

దేవర నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది.. ఈ సారి మరింత ఎర్ర సముద్రాన్ని చూపించారు కొరటాల శివ. విడుదలకు సమయం దగ్గర పడుతుంటే.. ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెంచే పనిలో నిమగ్నమైపోయారు మేకర్స్.

మరి న్యూ ట్రైలర్ ఎలా ఉంది..? దేవర రిలీజ్ ట్రైలర్‌లో ఉన్న విశేషాలేంటి..? ఈ సారి ట్రైలర్‌లో ఏమేం చెప్పారు..? దేవర ప్రమోషన్స్ విషయంలో ముందు నుంచి ఒకే మాట మీదున్నారు దర్శక నిర్మాతలు.

మరి న్యూ ట్రైలర్ ఎలా ఉంది..? దేవర రిలీజ్ ట్రైలర్‌లో ఉన్న విశేషాలేంటి..? ఈ సారి ట్రైలర్‌లో ఏమేం చెప్పారు..? దేవర ప్రమోషన్స్ విషయంలో ముందు నుంచి ఒకే మాట మీదున్నారు దర్శక నిర్మాతలు.

ఫస్ట్ ట్రైలర్‌లో ఎక్కువగా టెక్నికల్ విషయాలపై ఫోకస్ చేసారు దర్శకుడు. ఆర్ట్ వర్క్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా హైలైట్ చేసారు. కానీ రెండో ట్రైలర్ మాత్రం పూర్తిగా యాక్షన్ ప్లస్ ఎమోషనల్‌గా వెళ్లిపోయింది. ఈసారి అనిరుధ్ కూడా గట్టిగా డ్యూటీ ఎక్కాడంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

రిలీజ్ ట్రైలర్‌లో రీ రికార్డింగ్ అదిరిపోయింది. రిలీజ్ ట్రైలర్‌లో అన్ని పాత్రలను పరిచయం చేసారు దర్శకుడు కొరటాల శివ. ముఖ్యంగా తారక్‌తో పాటు కీలకంగా ఉండే శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్.. మిగిలిన కారెక్టర్స్‌ను కూడా చూపించారు. సెప్టెంబర్ 27న ఈ రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ చూసాక.. అభిమానులకు పూనకాలు ఖాయం అని అర్థమవుతుంది. మరి చూడాలిక.. తారక్ మాస్ జాతర ఎలా ఉండబోతుందో..?

పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే రస్ మలైని ఇంట్లోనే చేసుకోండి ఇలా.. రెసిపీ

భారతీయులు ఆహార ప్రియులు. ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క రకపు ఆహారపు అలవాట్లు ఉంటాయి. అందుకనే చిన్న తనం నుంచి అమ్మాయిలకు వంట చేయడం నేర్పుతారు. అత్తారింట్లో కొత్త కోడలు చేసే వంటలే ఆమెకు ఒక ప్రత్యెక స్థానాన్ని తీసుకుని వస్తాయి.

ఇక పండగలు, పంక్షన్ల సమయంలో కూడా వివిధ రకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. ముఖ్యంగా స్వీట్లకు మంచి ప్లేస్ ఉంది. అయితే ఎక్కువ మంది రవ్వ కేసరి, సేమ్యా హల్వా, బియ్యం పాయసం వంటి వాటినే తయారు చేస్తారు. నచ్చిన స్వీట్ ను మార్కెట్ నుంచి తెప్పిస్తారు. ఈ నేపధ్యంలో మీ ఇంట్లో భిన్నంగా స్వీట్ తయారు చేయడం ట్రై చేయాలనుకుంటే పిల్లలు పెద్దలు అత్యంత ఇష్టంగా తినే రస్ మలై బెస్ట్ ఎంపిక. బెంగాల్ లో పుట్టిన ఈ వంటకం ప్రపంచం వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ప్రపంచంలో టాప్ 10 బెస్ట్ చీజ్ డెజెర్ట్స్‌లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

బెంగాలీ వంటకం రస్ మలై మృదువుగా, జ్యుసిగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే డెజర్ట్. చాలా మంది ఈ రస్ మలై ని ఇంట్లో తయారు చేయలేమని అనుకుంటారు, అయితే కొన్ని సాధారణ చిట్కాలను పాటిస్తూ స్వీట్ షాప్స్ లో దొరికే విధంగా రుచికరమైన రసమలైని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు భారతీయుల ఫేవరేట్ స్వీట్ రస్ మలై రెసిపీ ని తెలుసుకుందాం..

రస్ మలై చేయడానికి కావాల్సిన పదార్థాలు

చిక్కటి పాలు- రెండున్నర లేదా మూడు లీటర్లు

వైట్ వెనిగర్ లేదా నిమ్మ రసం – కొంచెం

చక్కెర లేదా పటికి బెల్లం పొడి రుచికి సరిపడా

నీరు – ఒక కప్పు

ఐస్ క్యూబ్స్ – రెండు

యాలకుల పొడి

కుంకుమపువ్వు

పిస్తా

బాదం

జీడిపప్పు

ఫుడ్ కలర్ లేదా కస్టర్డ్ పౌడర్‌

తయారీ విధానం: ముందుగా రబ్రీ తయారు చేయండి. ఒక పెద్ద గిన్నెని తీసుకుని 3 కప్పుల పాలు పోయండి. మీడియం మంట మీద మరిగించడ్ని. ఇప్పుడు కుంకుమపువ్వు/కేసర్ వేసి కస్టర్డ్ పౌడర్ వేసి
స్విమ్ లో పెట్టి ప్రతి కొన్ని నిమిషాలు వేడి చేసి తర్వాత షుగర్ లేదా పటికి బెల్లం పొడిని వేసి వేడి చేయండి. తక్కువ మంట మీద ప్రతి 2 నుండి 3 నిమిషాలకు కదిలిస్తూ ఉండండి. ఇలా చేస్తున్న సమయంలో పాల పైన వచ్చే మలై/క్రీమ్‌ను పక్కన పెట్టండి.. ఈ పాలు సగానికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫే చేసి సంగం క్రీంని ఫ్రిజ్‌లో పెట్టండి. మిగిలిన వాటిని అదే గిన్నెలో ఉంచండి.

ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద మందపాటి అడుగు ఉన్న గిన్నెను పెట్టాలి. ఇప్పుడు అందులో తీసుకున్న పాలను పోసి.. మీడియం మంటమీద మరిగించాలి. ఇలా పాలు మరుగుతున్న సమయంలో గిన్నెలో అడుగు అంటకుండా అప్పుడప్పుడు గరిటెతో కదిలిస్తూ ఉండాలి. ఇలా పాలు మరిగిన తర్వాత పన్నీర్ కోసం.. మరుగుతున్న పాలల్లో ఒక స్పూన్ వెనిగర్ లేదా నిమ్మరసం వేయండి. ఇప్పుడు పాలు విరిగి.. పన్నీర్ అవ్వడం మొదలవుతుంది. పన్నీర్ బాగా అయ్యింది అని అనిపించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పాల గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేయండి. ఇలా చేయడం వలన పన్నీర్ మృదువుగా వస్తుంది. కొంచెం సేపు అలా విరిగిన పాలను వదిలేయండి. తరువాత పన్నీరును శుభ్రమైన మస్లిన్ లేదా కాటన్ క్లాత్ లో వేసి నీటిని ఫిల్టర్ చేసి పన్నీర్ ను వేరు చేయండి.

ఇంతలో పిస్తా, బాదం, జీడిపప్పులను వేడి నీటిలో నానబెట్టి కాసేపటి తర్వాత ముక్కలుగా కట్ చేయండి.. నీటిని నుంచి వేరు చేసిన పన్నీర్ ను ఒక గిన్నెలో వేసుకుని మెత్తగా అయ్యేలా చేయండి. ఇలా స్మూత్ గా అయిన పన్నీరుని తీసుకుని కావలసిన సైజులో గుండ్రంగా ఉండలు సిద్ధం చేసుకోండి.. ( పగుళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి).. ఈ గుండ్రం బంతులను కొంచెం నొక్కి.. చదును చేయండి. ఈ బాల్స్ మరింత రుచిగా ఉండాలనుకుంటే ఉండల మధ్యలో సన్నగా తరిగిన జీడిపప్పును పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం లోతున్న బాణలి లేదా పాన్‌ని తీసుకుని స్టవ్ మీద పెట్టి 3 1/2 కప్పుల నీటిలో 1 కప్పు చక్కెర వేసి మరిగించండి. సిరప్ కొంచెం మరగడం ప్రారంభించిన తర్వాత అందులో సిద్ధం చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ వేసి 5 నుండి 7 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ఆ పన్నీర్ బాల్స్ పంచదార పాకంలో ఉడికి పెద్దగా అవుతాయి. అంతేకాదు స్వీట్ ని అవి పీల్చుకుంటాయి.

చివరిగా
20 నిమిషాలు పన్నీర్ బాల్స్ పక్కకు పెట్టి చల్లార నివ్వండి. ఇప్పుడు ఒకొక్కటిగా వాటిని షుగర్ సిరప్ నుంచి తీసి అరచేతుల మధ్య మెత్తగా పిండండి. ఇలా షుగర్ సిరప్ ను తీసిన పన్నీర్ బాల్స్ ను
మిగిలిన రబ్రీ మిశ్రంమంలో వేసింది. సర్వ్ చేయాలనుకున్నప్పుడు వీటిని ప్రిజ్ద్ లో పెట్టిన రబ్రీ మిశ్రమం వేసి.. తరిగిన బాదం, పిస్తా, జీడిపప్పుతో గార్నిష్ చేసి అందించండి.

రెడ్ మీ స్మార్ట్‌ఫోన్లపై దివాలి ఆఫర్స్.. రూ. 5వేల వరకూ తగ్గింపు..

దసరా, దీపావళి పండుగల సీజన్ ప్రారంభమైంది. మార్కెట్లో అన్ని కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించేస్తున్నాయి. అటు ఆన్ లైన్ వేదికలతో పాటు ఆఫ్ లైన్ స్టోర్లు కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

అందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ షావోమీ అద్భుత డీల్స్ ప్రకటించింది. రెడ్ మీ స్మార్ట్ ఫోన్లపై దివాలి 2024 పేరిట భారీ తగ్గింపులను అందిస్తోంది. దీంతో రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్, రెడ్ నోట్ 13 ప్రో ధరలు భారీగా తగ్గాయి. ఈ ఆఫర్లు సెప్టెబర్ 21 నుంచి అదికారిక ఎంఐ వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ పారంలు, షావోమీ రీటైల్ పార్ట్ నర్స్ వద్ద అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ధరల తగ్గింపులతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లను కూడా రెడ్ మీ నోట్ 13 ప్రో, రెడ్ మీ నోట్ 1 ప్రో ప్లస్ ఫోన్లపై పొందొచ్చు. ఇప్పుడు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

రెడ్ మీ నోట్ 13 ప్రో 5జీ ధర, ఆఫర్లు..

రెడ్ మీ నోట్ 13 ప్రో 5జీ లాంచ్ చేసినప్పుడు దర రూ. 24,999గా ఉంది. ఇప్పుడు షావోమీ ప్రకటించిన ఈ దివాలి సేల్ 2024లో దీనిని కేవలం రూ. 20,000లకే కొనుగోలు చేయొచ్చు. రెడ్ మీ నోట్ 13 ప్రో బేస్ వేరియంట్ ధర రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్లో 200ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 6.67 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 5,100ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ ధర, ఆఫర్లు..

రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ మన దేశంలో లాంచ్ అయినప్పుడు దాని ధర రూ. 30,999గా ఉంది. షావోమీ ప్రకటించిన దివాలి సేల్ 2024లో భాగంగా ఈ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 24,999కే కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యూనిక్ వేగన్ లెదర్ డిజైన్ తో వస్తుంది. కర్డ్వ్ అమోల్డ్ ప్యానల్ ఉంటుంది. దీనిలో కూడా 200ఎంపీ ప్రైమరీ షూటర్ ఉంటుంది. ఐపీ68 సర్టిఫికేషన్, 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్ సెట్ తో వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

ధరల వివరాలు ఇవి..

రెడ్ మీ నోట్ 13 ప్రో 5జీ..

8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 24,999కాగా, షావోమీ దివాలి సేల్ సందర్భంగా డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి 19,999కి లభిస్తోంది.
8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 26,999కాగా, షావోమీ దివాలి సేల్ సందర్భంగా డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి 21,999కి లభిస్తోంది.
12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 28,999కాగా, షావోమీ దివాలి సేల్ సందర్భంగా డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి 22,999కి లభిస్తోంది.

రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ..

8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 30,999కాగా, షావోమీ దివాలి సేల్ సందర్భంగా డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి 24,999కి లభిస్తోంది.
12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 32,999కాగా, షావోమీ దివాలి సేల్ సందర్భంగా డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి 26,999కి లభిస్తోంది.
12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 34,999కాగా, షావోమీ దివాలి సేల్ సందర్భంగా డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి 28,999కి లభిస్తోంది.

రూ. 50వేల ఖర్చుతో విదేశీ పర్యటన.. ఈ దేశాలైతే బెస్ట్

మలేసియా.. ఈ దేశంలోని కౌలాలంపూర్, లాంగ్ కావి వంటి నగరాలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలుగా పేరుగడించాయి. ఇక్కడ ప్రకృతి అందాలతో పాటు అర్బన్ అట్రాక్షన్స్ చాలానే ఉంటాయి.

ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి.

శ్రీలంక.. మన దేశం నుంచి అతి తక్కువ ఖర్చుతో వెళ్లి రాగలిగే మరో సుందర ప్రాంతం శ్రీలంక. ఇక్కడి అందమైన సముద్ర తీరాలు, బీచ్ లు ఆకర్షిస్తాయి. అక్కడి కల్చర్, హెరిటేజ్ కట్టడాలు, వైల్డ్ లైఫ్ అనుభవాలు మీకు విశేషానుభూతిని అందిస్తాయి.

బాలి, ఇండోనేషియా.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు బాలి. ఇక్కడి పచ్చందాలు, బీచ్ వ్యూలు ఆకర్షిస్తాయి. అలాగే దేవాలయాలు ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఆహారం, వసతి చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇది తప్పని సరిగా మీకు మంచి అనుభూతిని అందివ్వడంతో పాటు మీ వకేషన్ ను ఆనందమయంగా చేస్తుందనడంతో ఎలాంటి సందేహం లేదు.

థాయ్‌ల్యాండ్ .. ఇది మన దేశీయ ట్రావెలర్స్ కు బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇక్కడి నైట్ లైఫ్ చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. అలాగే బీచ్ అందాలు, కల్చరల్ ఫీస్ట్ లు ఆకట్టుకుంటాయి. థాయ్ ల్యాండ్ లోని బ్యాంకాక్, ఫుకెట్, పట్టాయా నగరాలను అతి తక్కువ ధరలోనే చుట్టేసి రావొచ్చు.

నేపాల్.. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామం. నేపాల్ ట్రెక్కింగ్ కు ప్రసిద్ది గాంచింది. ఇక్కడ దేవాలయాలు, మౌంటేన్ వ్యూస్ అబ్బురపరుస్తాయి. ముఖ్యంగా హిమాలయాల అందాలు ఆకర్షిస్తాయి.

వాతావరణం మారుతోంది! మీ పిల్లల్ని జలుబు, దగ్గు నుంచి రక్షించుకోవడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి

వాతావరణంలో మార్పులతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతారు. అందువల్ల వారికి మెరుగైన సంరక్షణ అవసరం.

ఓ వైపు వర్షాలు కురుస్తున్నా మరోవైపు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళ తేలికపాటి చలి ప్రారంభమైంది. శీతాకాలం సీజన్ రాకముందే ఈ రకమైన గాలివాతావరణానికి దగ్గు , జలుబు బారిన పడతారు. మన శరీర ఉష్ణోగ్రత పర్యావరణం వల్ల ప్రభావితమైనప్పుడు వైరల్ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్లడం వల్ల వారు వ్యాధుల బారిన పడుతున్నారు. అయినప్పటికీ ఈ సీజన్ లో వచ్చే దగ్గు లేదా జలుబును నివారించడానికి ఇంట్లో అనేక చిట్కాలను ట్రై చేయవచ్చు.

చలికాలం రాకముందే మారుతున్న వాతావరణంలో పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కోవిడ్ తర్వాత చాలా మందికి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంది. దీంతో చాలా ఈజీగా వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. ఈ సీజన్‌లో వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగే కొన్ని పద్ధతుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఉప్పు కలిపిన నీరు పుక్కిలించడం

ఉప్పునీటిని పుక్కిలించే వారికి వైరస్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. కనుక రోజూ ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిని పుక్కిలించాలి. ఈ పద్ధతి మన నోరు, గొంతులో ఉండే చెడు బ్యాక్టీరియాను తొలగించడానికి పని చేస్తుంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇలా చేయవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ సమయంలో గొంతు వాపు ఉంటుంది. ఈ ఉప్పు కలిపిన నీరు పుక్కిలించడం వలన వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.

నడక వంటి వ్యాయామం

వారంలో కేవలం 45 నిమిషాల పాటు వ్యాయామం చేసినా చాలు మన రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని చాలా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 7 రోజుల్లో 45 నిమిషాల పాటు నడిస్తే రోగనిరోధక శక్తికి కూడా మేలు చేస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వ్యాయామం కూడా మనలో సానుకూలత, విశ్వాసాన్ని తెస్తుంది. అందువల్ల మీ పిల్లలు ప్రతిరోజూ ఏదో ఒక విధంగా శారీరకంగా చురుకుగా ఉండేలా చేయండి.

తగినంత నిద్ర

పిల్లలకు తక్కువ నిద్రపోయే అలవాటు ఉంటే.. వారి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. తక్కువ నిద్రపోయే అలవాటు ఉన్నవారు జలుబు లేదా దగ్గు ఇన్ఫెక్షన్ బారిన చాలా సులభంగా పడతారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 8 నుంచి 9 గంటల పాటు పూర్తి నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. పగటి సమయంలో నిద్రపోవడం కంటే.. రాత్రి సమయంలో తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. ఈ పద్ధతి పిల్లల మానసిక ఆరోగ్యాన్ని అలాగే శారీరక ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. పెద్దలతో పాటు ముఖ్యంగా పిల్లలు రోజులో తగిన సమయంలో నిద్రపోయే అలవాటును చేయాలి.

హైడ్రేటెడ్ గా ఉండండి

శరీరంలో నీరు లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల మొత్తం శరీరానికి ప్రయోజనం చేకూరుతుంది, ఇందులో శ్వాసకోశ వ్యవస్థ కూడా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజంతా కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. దీని వల్ల చర్మం కూడా ప్రయోజనం పొందుతుంది. అంతేకాదు మలబద్ధకం వంటి ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఆవిరి పడుతుంది

కోవిడ్ సమయంలో పసుపు,యు ఇతర వస్తువులతో చేసిన పానేయాలను తాగడమే కాదు ఆవిరి కూడా పట్టారు. ఇలా ఆవిరి పట్టే ప్రక్రియ ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. తక్కువ వేడి నీటితో పిల్లలు ఆవిరి పట్టేలా చేయండి. ఎందుకంటే పిల్లల రోగనిరోధక శక్తి పెద్దల కంటే కొంచెం బలహీనంగా ఉంటుంది. అయితే పిల్లలు ఆవిరి పట్టే నీటిలో వేప లేదా తులసి ఆకులను కూడా వేయవచ్చని జైపూర్‌కు చెందిన ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా తెలిపారు. ఎందుకంటే వాటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. బాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి ఆవిరి పట్టడం ఒక గొప్ప మార్గం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

పాదాలకు ఆవనూనె రాస్తే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా కొన్ని ఇంట్లో చోటు అడ్జెస్ట్ అవక పోవడం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల పూజ చేసుకునే గది కిచెన్, బెడ్ రూమ్, హాల్‌లో వస్తాయి. మరి వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఎక్కడ ఉండటం వల్ల మంచి జరుగుతుంది?

ఎక్కడ ఉంటే లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు గదులు చాలా ఇరుగ్గా ఉండక పోవడంతో కిచెన్‌లోనే ఎక్కువగా దేవుడికి సపరేటుగా షెల్ఫ్ పెడుతున్నారు. సాధారణంగా దేవడి గది ఇతర గదులకు దూరంగా ఉండాలి. శబ్దాలు ఎక్కువగా వినిపించని ప్రదేశంలో ఉండాలి.

పూజ చేయడం వల్ల మనకు ఎంతో ప్రశాంతతత లభిస్తుంది. అలా ఉండాలంటే మీ పూజ గది కూడా అందంగా ఉండాలి. ఇంట్లో ప్రతి రోజూ పూజ చేస్తూ ఉండటం వల్ల.. ఇంట్లో పాజిటివ్ శక్తి నెలకొంటుంది.

సాధారణంగా పూజ గది ఇంటికి ఈశాన్య మూల, తూర్పు లేదా ఉత్తర మూల్లలో ఉండాలి. ఈ దిక్కులు పూజ చేసుకోవడానికి చాలా అనుకూలమైన ప్రదేశాలు. ఈ దిశలో ఉండే పూజ గదిలో పూజలు నిర్వహించడం వల్ల చాలా మంది.

వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పాలంటే పూజ గది.. వంట గదిలో ఉండకూడదు. ఎందుకంటే వంట గది అగ్ని మూలకంతో ముడి పడి ఉంటుంది. ఇంట్లో సానుకూల శక్తి దెబ్బతింటుంది. కిచెన్‌లో వివిధ రకాల ఆహారాలు వండుతారు. కాబట్టి కిచెన్‌లో వంట గది లేకపోవడమే మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

బిగ్ బాస్‌లోకి నమ్రతా సిస్టర్.. హౌస్‌లో సందడి చేసేందుకు సిద్ధమైన ఒకప్పటి స్టార్ హీరోయిన్

బిగ్‌బాస్‌ రియాలిటీ షోస్‌ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు అమితమైన వినోదాన్ని అందించడంలో ఈ రియాలిటీ షోస్ ముందుంటాయి.

ఇక ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు పేరుకు పేరు, డబ్బు, పాపులారిటీ కూడా పెరుగుతుంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో బిగ్‌బాస్‌ షోస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఎనిమిదో సీజన్ నడుస్తుండగా త్వరలో హిందీ బిగ్ బాస్ సీజన్ 18 ప్రారంభం కానుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖానే ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. బిగ్ బాస్ హిందీ కొత్త సీజన్ కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని టాక్. అలాగే ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా ఓ కొలిక్కివచ్చిందని సమాచారం. కాగా బిగ్ బాస్ హిందీ సీజన్ 18 లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాలో ప్రముఖ నటి శిల్ప శిరోద్కర్‌ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె మరెవరో కాదు మన టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ కు సోదరి. నమ్రతా లాగే పలు బాలీవుడ్ ల్లో నటించింది శిల్ప. భ్రష్టాచార్‌(1989) తో కెరీర్‌ మొదలుపెట్టిన శిల్ప.. కిషన్‌ కన్హయ్య, త్రినేత్ర, హమ్‌, ఖుదా గవా, ఆంఖెన్‌, గోపి కిషన్‌, మృత్యునాద్‌, బేవఫ సనం ఇలా ఎన్నో హిట్‌ ల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో మోహన్ బాబు సరసన బ్రహ్మ అనే లో కథానాయికగా నటించింది.

కాగా పెళ్లి తర్వాత లకు దూరమైంది శిల్పా శిరోద్కర్. సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ 2013లో బుల్లితెరపై అడుగు పెట్టింది. అయితే గత కొద్దికాలంగా సీరియల్స్ కు కూడా దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.

శిల్పా శిరోద్కర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

ఇప్పుడు శిల్పా శిరోద్కర్ బిగ్ బాస్ హిందీ సీజన్‌లో సందడి చేసేందుకు సిద్ధమైందని టాక్. బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను సంప్రదించగా శిల్పా కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. ఆమెతో పాటు నువ్వునేను మూవీ హీరోయిన్ అనితా కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ లో సందడి చేయనున్నట్లు సమాచారం.

మహేశ్, నమ్రతా లతో శిల్పా శిరోద్కర్..

చైనాలో పొలంలో రైతులా పంటలు పండిస్తున్న రోబో.. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు..

ప్రస్తుతం నడుస్తోంది కృత్రిమ మేధస్సు యుగం. ఇప్పుడు అన్నీ సాధ్యమే. ఈ రోజుల్లో అన్ని రంగాల్లో మనుషులను మించిపోయేలా రోబోలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి కూడా రోబోలు ప్రవేశించాయి, పొలంలో రైతులా పని చేస్తున్న రోబో వీడియో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చైనాకు సంబంధించినదిగా తెలుస్తోంది.

ది ఫ్యూచర్ ఆఫ్ అగ్రికల్చర్ అనే టైటిల్ తో షేర్ చేసిన ఈ వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. వైరల్‌గా మారిన వీడియోలో రోబోట్ పొలంలో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో రోబోట్ పొలంలో చకచకా నాట్లు వేస్తుంది. పంటలకు నీరు పెట్టడం, పంటలు కోయడం వంటి ఒక రైతు చేసే ప్రతి పనిని చకచకా చేసేస్తోంది.

@InterestingSTEM అనే ట్విట్టర్ ఖాతాలో వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియో షేర్ చేసిన గంటల్లోనే లక్షకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే పలువురు నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా పని కల్పించాలి.. వంద మంది చేసే పనిని ఒక్క రోబోతో చేయించడం వలన సమస్య పెరుగుతుందని అని కామెంట్ చేస్తే.. మరికొందరు ఎక్కువ మందితో చేయించాల్సిన పొలం పని ఒక్క రోబో చేయడం వలన వ్యవసాయం చేయడానికి అయ్యే ఖర్చులు తగ్గుతాయని అంటున్నారు. మరికొందరు పొలంలో దుక్కి దున్నడం, వరి నాట్లు వేసే సమయం, కోత సమయం ఒక అద్భుతమైన వీక్షణం. పాటలు పాడుతూ పంట కోసే వంటి అనేక హృదయాన్ని హత్తుకునే ప్రకృతి అందాలు పోయి.. రోబో తో పని చేయించడం వలన మనుషులు కూడా కృతిమంగా మారిపోతారేమో అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

పడుకునే ముందు ఇలా చేస్తే.. గుట్ట కూడా ఇట్టే కరగాల్సిందే.! ట్రై చేయండి

పని ఒత్తిడి, టైంకి భోజనం సరిగ్గా చేయకపోవడంతో చాలామంది ఈ మధ్య ఊబకాయంతో సతమతమవుతున్నారు. ఇక ఆ గుట్టలాంటి పొట్టను తగ్గించేందుకు డైటింగ్ స్టార్ట్ చేయడం లేదా..

రైస్ మానేయడం లాంటివి చేస్తుంటారు కొందరు. అయితే ఇలా సడన్‌గా జీవనశైలిలో మార్పులు చేయడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఈజీగా బరువు తగ్గేందుకు మీరు చేయాల్సిన 5 చిన్న విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఈరోజుల్లో ఊబకాయం అనేది అందరికీ ఓ ప్రధాన సమస్యగా మారిపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మితిమీరిన ఫాస్ట్ ఫుడ్, లెక్కాపత్రం లేని డైట్ ప్లాన్, వ్యాయామం సరిగ్గా చేయకపోవడం లాంటి అంశాలు ఊబకాయానికి దారి తీస్తున్నాయి. దీని వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం పెరగవచ్చు. ఇక బరువును కంట్రోల్ చేసేందుకు కొందరు జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టిస్తారు. అయితే దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆహారం, జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చునని వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి మీకు సహాయపడే 5 చిట్కాలు ఇలా ఉన్నాయి.

రాత్రి 7 గంటలకు ముందు డిన్నర్: మీరు బరువు తగ్గాలనుకుంటే రాత్రి 7 గంటలలోపు డిన్నర్ తినడం అలవాటు చేసుకోండి. రాత్రి భోజనానికి, పడుకునే సమయానికి మధ్య దాదాపు 3 గంటల గ్యాప్ ఉండాలి. అర్ధరాత్రి వేళ భోజనం చేయడం వల్ల జీర్ణం సరిగ్గా అవ్వదు. ఇది జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే, సాయంత్రం త్వరగా తినడం అలవాటు చేసుకోండి.

తేలికపాటి ఆహారాన్ని తినండి: రాత్రిపూట ఎల్లప్పుడూ తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. బరువు తగ్గడానికి డిన్నర్‌లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని డైట్ ప్లాన్‌లో ఉంచుకోండి. రాత్రిపూట మీరు పచ్చి కూరగాయలు, సూప్, సలాడ్ లాంటివి తినవచ్చు. మీకు అర్థరాత్రి ఆకలిగా అనిపిస్తే, దోసకాయ లేదా ఆపిల్ తినవచ్చు.

త్వరగా నిద్రపోవడం: మనం త్వరగా నిద్రపోతున్నప్పుడు, మెలటోనిన్ అనే హార్మోన్ మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్‌ని సృష్టించి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. రాత్రి బాగా నిద్రపోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

పసుపు పాలు తాగడం: పసుపు పాలు బరువు తగ్గడానికి, మంచి నిద్రకు సహాయపడుతాయి. పసుపులో కొవ్వును కరిగించడానికి సహాయపడే థర్మోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. దీనితో పాటు, ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగండి.

కనీసం 7 గంటల నిద్ర: ఊబకాయంతో నిద్రకు సంబంధం ఉంది. బరువు తగ్గడానికి కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం. మీకు తగినంత నిద్ర లేకపోతే, అది మీ జీవక్రియను తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గడం కష్టతరం అవుతుంది.

దుబాయ్ నుంచి వచ్చిన మరో కేరళ వాసికి మంకీపాక్స్ నిర్ధారణ.. క్లాడ్ 1బి వైరస్‌గా గుర్తింపు

భారతదేశంలో మంకీపాక్స్ కేసు మరొకటి నమోదైంది. మూడో మంకీపాక్స్ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. రోగి ఇటీవలే దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చిన కేరళ వాసి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.

విచారణ నివేదికలో బాధితుడికి మంకీపాక్స్‌కు చెందిన క్లాడ్ 1బి వైరస్ సోకినట్లు వెల్లడింది. ఇటీవల కేరళలోని మలప్పురంలో రెండవ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి కూడా యుఎఇ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాడు. ప్రాథమిక లక్షణాలు కనిపించిన తర్వాత రోగిని పరీక్షించగా.. మంకీపాక్స్ వ్యాధి సోకినట్లు నివేదికలో వెల్లడైంది. విదేశీ ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరైనా సరే ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని కేరళ ఆరోగ్య మంత్రి చెప్పారు.

ఢిల్లీలో మంకీపాక్స్ మొదటి కేసు

అంతకుముందు విదేశాలకు వెళ్లి భారతదేశానికి తిరిగి వచ్చిన డిల్లీకి చెందిన వ్యక్తికీ మంకీపాక్స్ వైరస్ సోకినట్లు వెల్లడింది. ఇలా మొదటి కేసు దేశ రాజధాని ఢిల్లీలో నమోదైంది. ప్రాథమిక లక్షణాలు కనిపించిన తర్వాత రోగిని ఢిల్లీలోని ఆసుపత్రిలో ఐసోలేట్ చేశారు. ఐసోలేషన్ సమయంలో రోగి పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యులు రోగిని ఐసోలేట్ చేసి నిశితంగా పరిశీలిస్తున్నారు.

WHO హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది

ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు నిరంతరం పెరుగుతున్న దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని వారాల క్రితం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రెండేళ్ల క్రితం కూడా మంకీపాక్స్ వైరస్ ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యాపించిందని WHO తెలిపింది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఈ వ్యాధిపై అప్రమత్తమైన ప్రభుత్వం

ఈ వ్యాధికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. మంకీపాక్స్ వైరస్ విషయంలో పెద్దగా భయాందోళన చెందవద్దని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ప్రజలకు తగిన సూచనలు చేసింది. అంతేకాదు మంకీపాక్స్ రోగులను గుర్తించడానికి ప్రభుత్వం విమానాశ్రయాలలో పరీక్షల సంఖ్య కూడా పెంచింది. దీనితో పాటు ఎవరికైనా ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

మొదటి రోగి గురించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏమి చెప్పింది?

ఈ రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 MPox వైరస్ గా గుర్తించారు. దీంతో WHO నివేదించిన వైరస్‌కి భారతదేశంలో వెలుగులోకి వచ్చిన మొదటి రోగికి సంబంధం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన మూడవ రోగికి గ్రేడ్ వన్ బి వైరస్ సోకిందని వెల్లడించింది.

దాహం మాత్రమే కాదు ఈ లక్షణాలు కనిపిస్తే నీరు తాగాలని హెచ్చరిక..

ప్రజలు దాహం వేసినప్పుడు అంటే గొంతు ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు తాగుతారు. అయితే ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు త్రాగాలని సలహా ఇస్తున్నప్పటికీ..

ఎక్కువ మంది ప్రజలు నీరు తాగే విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. చాలా తక్కువ నీరుని తాగుతారు. నిజానికి నీరు శరీరంలో తేమను నిర్వహించడానికి మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాల మూలకంగా కూడా పనిచేస్తుంది. చాలా సార్లు మనం శరీరంలో కనిపించే చిన్న చిన్న సమస్యలను విస్మరిస్తాము. దీని కారణంగా ఆరోగ్య సమస్యలు కొన్నిసార్లు పెరుగుతాయి. దాహం వేయడమే కాదు మన శరీరం నీరు త్రాగమంటూ మరికొన్ని సంకేతాలను కూడా ఇస్తుంది. వాటిని గుర్తించడం ముఖ్యం.

శరీరంలో నీటి కొరత వేసవిలోనే కాదు ఏ సీజన్‌లోనైనా రావచ్చు. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు తరచుగా తాగే నీరు విషయంలో అలక్షం చూపిస్తారు. నీరు తాగడం తగ్గిస్తారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కనుక దాహం వేసినప్పుడు మాత్రమే కాదు ఈ లక్షణాలు కనిపించినా నీరు త్రాగాలి. ఆ లక్షణాలు ఏమిటో ఎలా వాటిని గుర్తించాలో ఈ రోజు తెలుసుకుందాం..

అలసటగా, నిద్రగా అనిపిస్తుంటే

పని చేసినా చేయకపోయినా అలసిపోయినట్లు లేదా నిద్రవస్తున్నట్లు అనిపించడం ప్రారంభిస్తే.. ఎక్కువ మంది రిఫ్రెష్‌ అవ్వడానికి ఒక కప్పు కాఫీ లేదా టీ తాగడానికి పరుగెత్తుతారు. అయితే ఈ అలవాటు మీ శరీరం మరింత నిర్జలీకరణ అవ్వడానికి కారణమవుతుంది. అస్తవమను అలసటగా అనిపించడం, నిద్రపోవాలి అనే ఫీలింగ్ రావడానికి కారణం శరీరంలో నీటి కొరత కారణం కావచ్చు, కనుక ఇలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు కాఫీ , టీల కంటే నీరు త్రాగాలి.

పసుపు మూత్రం రంగు

మూత్రం రంగు చాలా పసుపు రంగులో కనిపిస్తే శరీరానికి నీరు అవసరం అనే హెచ్చరిక కావొచ్చు. అంతేకాదు మూత్రం తక్కువగా వస్తున్నట్లయితే లేదా టాయిలెట్కు కు వెళ్ళడానికి చాలా సమయం తీసుకుంటే శరీరానికి నీరు అవసరం అని కూడా అర్థం.

తలనొప్పి కలిగి

శరీరంలో నీరు అవసరమైనప్పుడు తలనొప్పి సమస్య బారిన కూడా పడొచ్చు. అందువల్ల తలనొప్పి వచ్చిన ప్రతిసారీ ఔషధం తీసుకోవలసిన అవసరం లేదు. అందుకు బదులుగా కొంచెం నీరు త్రాగాలి . దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇలా చేసిన తరువాత కూడా ఉపశమనం కలగకపోతే అప్పుడు మాత్రమే ఔషధం సహాయం తీసుకోవాలి.

పొడి పెదవులు, నోటి దుర్వాసన

శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు గొంతు పొడిబారడమే కాకుండా పెదాలు కూడా పొడిబారడం మొదలవుతుంది. అంతేకాదు నోటి దుర్వాసన సమస్య కూడా ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో కూడా వెంటనే నీరు త్రాగాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

సూపర్ స్టార్‌కు విలన్‌గా మరో స్టార్ హీరో.. జైలర్ 2కోసం రంగంలో ఆయన

సూపర్ స్టార్ రజినీకాంత్ బ్యాక్ టు బ్యాక్ లతో దూసుకుపోతున్నారు. జైలర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ వరుస లను లైనప్ చేశారు. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న వెట్టయన్.

జై భీమ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, తుషార విజయన్, రితికా సింగ్ తదితరులు ఈ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. చిత్రాన్ని అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది..

యాంటీ ఫేక్ ఎన్‌కౌంటర్ కథాంశంతో ఈ ఉంటుందని అంటున్నారు. అలాగే, విద్యా విధానానికి అనుకూలంగా అనేక అభిప్రాయాలను ఈ చిత్రంలో ప్రదర్శించినట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఈ లో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు, లో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇదిలా రజినీకాంత్ జైలర్ 2 ను కూడా లైనప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కు హుకుం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉంటే జైలర్ లో విలన్ గా వినాయకన్ నటించిన విషయం తెలిసిందే. అయితే వినాయకన్ ఇప్పుడు వివాదంలో చుక్కుకున్నాడు. అతన్ని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లిన వినాయకన్ అక్కడ భద్రతా విధుల్లో ఉన్న సీఐఎస్ ఎఫ్ జవాన్లతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఇక ఇప్పుడు జైలర్ 2 లో మలయాళ స్టార్ హీరో.. మమ్ముట్టి విలన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవలే మమ్ముట్టితో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఇక జైలర్ లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ లో నటించిన విషయం తెలిసిందే.

దేవర టీమ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. బెనిఫిట్ షోలకు అనుమతి.. అలాగే

ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న.. రిలీజ్ అవుతున్న దేవర మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

తాజాగా దేవర కు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణాలో టికెట్స్ రేట్స్ ను పెంచుకునేందుకు.. దేవర టీంకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27న రాత్రి 1.00 గంటలకు 29 థియేటర్లలో అదనపు ప్రదర్శన మరియు టికెట్ రేట్లను రూ.100 పెంపు కు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 27ఉదయం 4.00 గంటల నుండి తెలంగాణాలోని అన్ని థియేటర్లలో టికెట్ రేట్లను రూ.100 పెంచుతూ 6 ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది.

28 నుండి 06-10-2024 వరకు (9 రోజులు), 5 ప్రదర్శనలకు రూ.25 పెంపు – సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అలాగే మల్టీప్లెక్స్‌ల కోసం రూ.50 పెంపుకు అనుమతిచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక దేవర పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక దేవర లో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. దేవర లో విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అలాగే హీరో శ్రీకాంత్ ఈ లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఈ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందు తీసుకురానున్నారు. దేవర లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు.

తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్‌.. ఏఆర్‌ డెయిరీకి నోటీసులు

వరల్డ్‌ ఫేమస్‌ శ్రీవారి లడ్డూ.. ఇప్పుడు మోస్ట్‌ బర్నింగ్‌ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ పెద్దఎత్తున నిరసనలు మిన్నంటాయి.

ఈ లడ్డూ వివాదం సుప్రీంకోర్టును కూడా తాకింది. గత పాలకుల వైఫల్యమేనంటూ ఏపీ ప్రభుత్వం కన్నెర్ర చేస్తూనే ఉంది. సీఎం చంద్రబాబు సైతం ఆగ్రహావేశాలు వెల్లగక్కారు. పామాయిల్‌ కూడా రాని రేటుకు నెయ్యి ఎలా వచ్చిందంటూ మండిపడ్డారు.

లడ్డూ తయారీపై ఏపీ ప్రభుత్వ విమర్శలు, దేశవ్యాప్త ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీలపై సీరియస్‌ అయ్యింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన FSSAI… టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్‌ డెయిరీకి నోటీసులిచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

ఇటు ఏఆర్‌ డెయిరీ మాత్రం.. ఎలాంటి కల్తీకి పాల్పడలేదంటోంది. మంచి నెయ్యినే పంపించామని.. క్వాలిటీ చెక్‌ చేశాకే కంపెనీ నుంచి నెయ్యి వెళ్లిందంటోంది. ఎలాంటి న్యాయ విచారణకైనా సిద్ధమంటూ ఇప్పటికే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏఆర్‌ డెయిరీకి FSSAI నోటీసులివ్వడం చర్చనీయాంశమైంది. మరి చూడాలి నెయ్యి కల్తీపై ఎలాంటి రిపోర్ట్‌ వస్తుందో.!

Health

సినిమా