Sunday, December 14, 2025

యూపీఐ చెల్లింపులపై ఈఎంఐ ఆప్షన్‌.. ఆ బ్యాంకు కీలక ప్రకటన

భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన యూపీఐ చెల్లింపులు అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే ఇటీవల ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం రూపే క్రెడిట్‌ కార్డుల ద్వారా వ్యాపార చెల్లింపులకు యూపీఐ ఆప్షన్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు రూపే క్రెడిట్‌ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇటీవల ప్రముఖ బ్యాంకు అయిన బ్యాంకు ఆఫ్‌ బరోడా రూపే క్రెడిట్‌ కార్డుల యూపీఐ చెల్లింపులపై కూడా ఈఎంఐ సేవను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్ చేసి చెల్లింపులు చేసే రూపే బీఓబీ కార్డు హోల్డర్లు ఇకపై తమ చెల్లింపులను ఈఎంఐలను మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఆఫ్‌ బరోడా తీసుకొచ్చిన కొత్త సేవల గురించి వివరాలను తెలుసుకుందాం.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో యూపీఐ యాక్సెప్ట్‌ చేసే బిజినెస్‌ లావాదేవీలకు ఈఎంఐ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. యూపీఐ యాప్‌లో తమ లావాదేవీ హిస్టరీను యాక్సెస్ చేయడం ద్వారా కస్టమర్‌లు తమ రూపే క్రెడిట్ కార్డ్‌తో చేసిన గత కొనుగోళ్లను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. బ్యాంకు ఆఫ్‌ బరోడా తీసుకొచ్చిన ఈ కొత్త సేవల పండుగ సీజన్‌లో సౌకర్యవంతమైన చెల్లింపు ఎంపికలను అందిస్తుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ ఈఎంఐ సేవలను టైర్-2, టైర్-3 నగరాల్లోని ప్రజలు అధికంగా వినియోగించుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రూపే భాగస్వామ్యంతో యూపీఐ చెల్లింపులపై ఈఎంఐ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని రావడంపై బీఓబీ కార్డ్‌ లిమిటెడ్‌ హోల్‌టైమ్ డైరెక్టర్ రవీంద్ర రాయ్ స్పందించారు. కస్టమర్లకు సేవలను అందించేందుకు ఈఎంఐ సర్వీస్‌ మంచి ఎంపిక అని పేర్కొన్నారు.

ఈఎంఐల విషయంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈఎంఐ ఎంపిక ఆర్థికపరమైన చిక్కులను పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా పెద్ద కొనుగోళ్లను సులభతరం చేస్తుంది. అందువల్ల మన రాబడికి అనుగుణంగా కొనుగోళ్లు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
యూపీఐ చెల్లింపులపై ఈఎంఐ కోసం వడ్డీ రేట్లు మారవచ్చు. అత్యంత అనుకూలమైన నిబంధనలను కనుగొనడానికి వివిధ బ్యాంకులు లేదా యూపీఐ యాప్‌ల నుండి ఆఫర్‌లను సరిపోల్చండి.
ఈఎంఐ నెలవారీ చెల్లింపులను తగ్గించగలిగినప్పటికీ వడ్డీ కారణంగా కొనుగోలు మొత్తం ఖర్చు గణనీయంగా ఉంటుంది. అందువల్ల మీ ఆర్థిక సామర్థ్యాలు, రీపేమెంట్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండే టెన్యూర్‌ను ఎంచుకోవాలి.

గురివింద వెనుక ఇంత కహానీ ఉందా.? బంగారాన్ని తూచేందుకు ఎందుకు ఉపయోగించేవారు

గురివింద గింజ పేరు వినగానే మొదటగా గుర్తొచ్చే.. ‘గురివింద గింజ తన నలుపెరగదంట’ అనే ఈ సామెత గుర్తు రావడం సర్వసాధారణం. గురివింద పై భాగం మొత్తం ఎర్రగా ఉండి కింది భాగంలో మాత్రం నల్లగా ఉంటుంది.

కానీ, ఆ నలుపు సంగతి ఎరుగక అది తనని తాను ఓ గొప్ప అందగత్తె నని భ్రమపడుతుంది. మనుషులు కూడా తమలోని తప్పులను తెలుసుకోలే ఇతరులను తప్పు పడతారన్న అర్థం వచ్చేలా ఈ సామెతను ఉపయోగిస్తారు.

అయితే గురివింద గింజల వెనకాల ఎంతో పెద్ద కథ ఉందని మీకు తెలుసా.? సాధారణంగా ఈ గింజలను బంగారాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తుండం చూసే ఉంటాం. మరి ఈ గింజలను బంగారం బరువు కొలిచేందుకు ఎందుకు ఉపయోగిస్తారు.? అసలు ఈ గింజలు ఏ మొక్క నుంచి వస్తాయి.? లాంటి ఆసక్తికర విషయాలను ఓ నెటిజన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలో వివరంగా తెలిపారు..

ఈ గింజలు గూంజ్‌ మొక్క నుంచి వస్తాయి. దీనిని సాధారణంగా రోసరీ బఠానీ అని కూడా పిలుస్తుంటారు. ఏడాది పొడవునా ఈ మొక్కలు విస్తృతంగా పెరుగుతుంటాయి. గురివింద గింజలను మొదట్లో బంగారాన్ని కొలిచేందుకు ఉపయోగించేవారు. దీనికి కారణం ఈ గింజలన్నీ దాదాపు ఒకే బరువలో ఉంటాయి. అందుకే వీటిని ప్రామాణికంగా తీసుకుంటారు. దేశంలో తొలిసారి బంగారం, వెండిని కొలిచేందుకు ఈ గింజలే ఉపయోగించేవారు. త్రాసులో ఒకవైపు గింజలు వేసి మరో వైపు బంగారాన్ని మెజర్ చేసేవారు.

అదిరే మైలేజ్‌తో త్వరలోనే టాటా ఈవీ స్కూటర్‌ లాంచ్‌.. ఇక ఆ కంపెనీలకు చుక్కలే..!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, నిర్వహణ వ్యయం సహా అనేక కారణాల వల్ల ప్రజలు ఇటీవల కాలంలో ఈవీ వాహనాల వాడకానికి మక్కువ చూపుతున్నారు.

అయితే ఈవీ స్కూటర్ల ధరలు బాగా ఎక్కువగా ఉండడంతో సగటు మధ్యతరగతి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి వారికి భారతీయ కంపెనీ అయిన టాటా గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే టాటా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టాటా ఈవీ స్కూటర్‌ గురించి వివరాలను తెలుసుకుందాం.

త్వరలో ఈ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు టాటా తెలిపింది. టాటా ప్రకటన నేపథ్యంలో టాటా ఈవీ స్కూటర్‌ ఫీచర్లు ఇవేనంటూ కొన్ని సోషల్‌ మీడియా పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ శక్తివంతమైన మోటార్‌తో వస్తుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ ఈవీ స్కూటర్‌ పరిధి దాదాపు 270 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా టాటా ఎలక్ట్రిక్ స్కూటర్‌ 3 కేడబ్ల్యూ మోటార్ ద్వారా గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టాటా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, బూట్ అండర్ స్పేస్, సౌకర్యవంతమైన సీటు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే టాటా స్కూటర్‌లోని అంతర్నిర్మిత బ్యాటరీ ప్యాక్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 గంటలు పడుతుందని చెబుతున్నారు.

చాలా మంది ఈవీ ప్రియులు టాటా ఈవీ స్కూటర్‌ విడుదల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ఈవీ స్కూటర్‌ లాంచ్‌ తేదీపై ఎన్నో అంచనాలు వేసుకుంటున్నారు. ఈ స్కూటర్‌ మరికొన్ని నెలల్లోనే భారత మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అనువుగా ఉండేలా ఈ స్కూటర్ ధర రూ. 67 వేలకు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఉచితంగా ఐదు లక్షల ఆరోగ్య బీమా.. ఆ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి తెలుసా..?

ఇటీవల కాలంలో పెరుగుతున్న ఖర్చులు సగటు మధ్యతరగతి ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏదైనా అనుకోని అనారోగ్యం వస్తే చావే శరణ్యమనే స్థితికి పేదల పరిస్థితి చేరిందంటే అతిశయోక్తి కాదు.

అయితే ఇలాంటి సమస్యల నుంచి పేదలను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమలు చేస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం పేరుతో పిలిచే ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంఏజేవై) భారతదేశంలోని బలహీన జనాభాకు ఆరోగ్య సంరక్షణ యాక్సెస్‌ను విస్తరించడం కొనసాగిస్తోంది. ఆయుష్మాన్ కార్డ్ అర్హత ప్రమాణాలకు ఇటీవలి అప్‌డేట్‌లు ఒక పెద్ద సమూహానికి ఆర్థిక రక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు వైద్య చికిత్స ఖర్చులు కవర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ పథకం గురించి వివరాలను తెలుసుకుందాం.

ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆయుష్మాన్ కార్డ్ జారీ చేస్తారు. ఈ కార్డు ద్వారా భారతదేశం అంతటా ఎంప్యానెల్ చేయబడిన ఆసుపత్రులలో అర్హత కలిగిన కుటుంబాలు ఉచిత ఆరోగ్య సేవలను పొందవచ్చు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు కవరేజీ అందిస్తుంది. అందువల్ల పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఈ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆయుష్మాన్ పరిధిలోకి వలస కార్మికులను చేర్చింది. వలస కార్మికుల ఆరోగ్య రక్షణకు ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులు చాలా బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వలస కార్మికులు ప్రస్తుతం ఉన్న నివాసం నుంచి దరఖాస్తు చేసుకుంటే వారికి ఆయుష్మాన్ కార్డు మంజూరు చేస్తారు. అలాగే ఈ కార్డు పొందడానికి ఇంటి పని చేసే వారు, రోజువారీ వేతనదారులు, వీధి వ్యాపారులతో సహా పట్టణ ప్రాంతాల్లోని అనధికారిక రంగ కార్మికులను కూడా అర్హులుగా కేంద్రం గుర్తించింది. అలాగే భూమిలేని కార్మికులు, గ్రామీణ కళాకారులు, ఇతర తక్కువ-ఆదాయ వర్గాలు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వైద్య సేవలను పొందవచ్చు.

ఆయుష్మాన్ భారత్ పథకంలో వితంతువులు లేదా ఒంటరి మహిళలు, అనాథ పిల్లలతో పాటు వృద్ధులు, వికాలంగులు కూడా వైద్య సేవలను పొందవచ్చు. దరఖాస్తుదారులు అధికారిక ఆయుష్మాన్ భారత్ పోర్టల్‌ను సందర్శించి ఆయుష్మాన్ భారత్ కార్డును పొందవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక వివరాలను నమోదు చేసి అర్హతను తనిఖీ చేయాలి. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవడానికి ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి మీకు ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ వంటి అవసరమైన గుర్తింపు ఉంటే ఆయుష్మాన్ భారత్ కార్డు పొందడం సులభం అవుతుంది.

ఇంట్లో తులసి మొక్క ఉంటే.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి.

హిందువులు తులసి మొక్కను సకల దేవతల స్వరూపంగా కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఈ ఇంటికి విశిష్టమైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది.

ఇంటికి ఏ వైపునైనా గాలి, వెలుతురూ ధారాళంగా వచ్చే ప్రదేశంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. అయితే, తులసి చెట్టు వద్ద గణపతి విగ్రహం ఉంచకూడదని శాస్త్రాలు, వేద పండితులు చెబుతున్నారు. దీని వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉందని అంటున్నారు అదేంటంటే..

పురాణాల ప్రకారం..వినాయకుడు ఒకనాడు నది ఒడ్డున తపస్సు చేస్తుండగా తులసీ దేవి నదిలోంచి బయటకు వస్తుంది. ఆమె గణపతి అందానికి ముగ్ధురాలై తనను పెళ్లి చేసుకోవాలని కోరిందట. కానీ, గణేషుడు ఆమెను నిరాకరించగా.. ఆగ్రహించిన తులసి..నీవు రెండు వివాహాలు చేసుకుంటావని గణేషుడిని శపిస్తుందట.! అలా తులసి చెట్టు వద్ద గణేషుడి ప్రతిమ పెట్టకూడదని చెబుతుంటారు.

అలాగే, కొందరు కార్తీకమాసంలో తులసి చెట్టు వద్ద శివలింగాన్ని పెట్టి పూజలు చేస్తారు. అలా ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే.. తులసి మహా విష్ణువుకు ప్రీతికరమైనది. జలంధరుడు అనే రాక్షసుడి భార్య అయిన తులసికి గత జన్మలో బృందా అనే పేరు ఉండేదట. అయితే, జలంధరుడిని పరమ శివుడు సంహరించాడట. ఈ కారణంగా పరమ శివుడిని తులసితో పూజించరని వేద పండితులు చెబుతున్నారు.

ఇకపోతే, పవిత్రమైన తులసి మొక్క వద్ద పొరపాటున కూడా చీపురు, చెత్త వంటివి ఉంచకూడదు. చీపురుని ఇల్లు శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తారు. ఆ చీపురుని తులసి మొక్క దగ్గర పెడితే కష్టాలు తప్పవట. ఇంట్లో అశుభం జరుగుతుందని అంటారు. తులసి మొక్క చుట్టూ చెత్త వేయడం వల్ల ఇంట్లో ఆర్థిక, అనారోగ్య కష్టాలు మొదలవుతాయి. తులసిలో లక్ష్మీదేవి ఉంటుంది. తులసి చుట్టూ చెత్త ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. వెంటనే తీసేయండి.

తులసికి ఎంతో భక్తితో పూజలు నిర్వహిస్తారు. కావున తులిసి చెట్టు వద్ద చెప్పులు ఉన్నట్లయితే ఇంట్లో ఆనందం కరువు అవుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే తులసి చెట్టు ఉన్న ప్రదేశంలో చెప్పులు, బూట్లు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఫలితంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. తులసి దగ్గర ముళ్ల మొక్కలు ఉండకూడదు. తులసి దగ్గర ముళ్ల మొక్కలు ఉంటే ఇంట్లో చాలా త్వరగా నెగెటివిటీ వ్యాపిస్తుంది.

వామ్మో.. ప్రాణాలతో చెలగాటమే..! నెల రోజులు ఉప్పు తినకపోతే ఏమవుతుందో తెలుసా..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఈ తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అయితే.. బరువు తగ్గడానికి, మంచి ఆరోగ్యానికి చక్కెరను నివారించాలని ఆరోగ్య నిపుణులు తరచుగా సిఫార్సు చేస్తారు..

దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చక్కెర లానే.. మీరు ఒక నెల పాటు ఉప్పును పూర్తిగా వదులుకుంటే, అది శరీరానికి ఎలాంటి మేలు లేదా హాని చేస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా..? ఇప్పటివరకు ఇలాంటి సందేహం రాకపోయినా.. తేలియకపోయినా.. ఈ కథనాన్ని పూర్తిగా ..

ఒక నెల పాటు ఉప్పును వదిలేస్తే శరీరంపై నమ్మలేని విధంగా ప్రభావం చూపుతుంది.. మతపరమైన ఉపవాసం అయినా లేదా ఆరోగ్య ప్రణాళికలో భాగమైనా.. కొన్ని సందర్భాల్లో జంక్ ఫుడ్‌ (ఉప్పు పదార్థాలు) ను వదులుకోవడం సర్వసాధారణం. అయితే, ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఒక రోజులో 4 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు.. అయితే ఉప్పును పూర్తిగా నిషేధిస్తే ఏం జరుగుతుంది.. డైటీషియన్లు ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తవానికి ఉప్పు మన శరీరానికి అవసరమైన పోషకం.. లవణాన్ని తగిన పరిమాణంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ.. మానేస్తే మాత్రం చాలా దుష్ప్రభావాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని, ప్రాణాలతో చెలగాటం ఆడినట్లేనని వైద్య నిపుణుల చెబుతున్నారు. దీర్ఘకాలం పాటు ఉప్పు తీసుకోకపోతే.. ఒక్కోసారి కోమాలోకి వెళ్లడంతోపాటు ప్రాణాలు కూడా పోతాయని పేర్కొంటున్నారు.

మీరు 30 రోజులు ఉప్పును తినకపోతే.. జరిగేది ఇదే..

అమాంతం బరువు తగ్గుతుంది..

జంక్ ఫుడ్ మానేయడం వల్ల వచ్చే మొదటి ప్రభావం బరువు తగ్గడం.. మీరు 30 రోజులు తినడం మానేసినప్పుడు మీ శరీరం తక్కువ తినడానికి అలవాటుపడుతుంది. ఇది మీ పొట్ట, నడుము కొవ్వు (బెల్లీ ఫ్యాట్) ను తగ్గిస్తుంది. అయితే, అసాధారణంగా బరువు తగ్గితే మీ ఆరోగ్యం మరింత క్షీణించవచ్చని మీరు గుర్తుంచుకోవాలి.

జీర్ణక్రియలో సమస్య..

ఒక నెలపాటు జంక్ ఫుడ్ మానేయడం కూడా మీ శరీరంలోని వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థలో సమస్యలను కలిగిస్తుంది.. మీ ప్రేగులను ప్రభావితం చేస్తుంది.. కడుపు నొప్పి లేదా ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కలిగిస్తుంది.

మానసిక ఆరోగ్య సమస్య..

మానసిక ఆరోగ్యం పరంగా చూస్తే ఉప్పు తినడం పూర్తిగా మానేస్తే.. అది మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. మీరు ఒత్తిడి, లోబీపీ, ఆందోళనకు గురవుతారు. అంటే పరిమిత పరిమాణంలో ఉప్పు తీసుకోవడం అవసరం…

దీన్ని గుర్తుంచుకోండి

ఒక నెల పాటు ఉప్పును పూర్తిగా నివారించడం హానికరం అని మీరు అర్థం చేసుకోవాలి.. కాబట్టి మీరు అలా చేసే ముందు చాలా ఆలోచించాలి.. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా, మీరు మీ వైద్యుడిని, డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది. ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది మన శరీరానికి అవసరమైన పోషకం. దాని లోపం మంచిది కాదు.. అందుకే.. దానిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

ఆఫర్ల వేళ ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించండి..

ఆఫర్ల వర్షం కురిపించేందుకు ఈ కామర్స్‌ సంస్థలు సిద్ధమవుతున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఈ నెల 27వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సేల్స్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.

అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందించనున్నాయి. దీంతో కస్టమర్లకు తమకు నచ్చిన వస్తువులను కొనుక్కోవడానికి ప్లాన్స్‌ వేసుకుంటున్నారు. అయితే దీనిని అదునుగా చేసుకొని రెచ్చిపోయే సైబర్‌ నేరగాళ్లు కూడా పొంచి ఉన్నారు. ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను క్యాష్‌ చేసుకొని డబ్బులు కాజేస్తుంటారు. ప్రతీ ఏటా ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. మరి ఆఫర్ల పేరిట జరిగే సైబర్‌ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

* ఈ సమయంలో గుర్తు తెలియని నెంబర్ల నుంచి కొన్ని మెసేజ్‌లు వస్తుంటాయి. వీటిలో తక్కువ ధరకే వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చంటూ కొన్ని లింక్స్‌ను పంపిస్తుంటారు. అయితే పొరపాటున ఆ లింక్స్‌ను క్లిక్‌ చేస్తే ఇకే అంతే సంగతులు మీ వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్‌ నేరస్థుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. బ్యాంక్‌ అకౌంట్స్‌ కూడా హ్యాక్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది.

* ఇక నకిలీ వెబ్‌సైట్స్‌తో కూడా కేటుగాళ్లు మోసం చేస్తుంటారు. అందుకే కచ్చితంగా అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత యాప్‌ నుంచే షాపింగ్‌ చేయాలి. అనధికారిక వెబ్‌సైట్స్‌లో బుక్‌ చేసుకోవడం వల్ల వస్తువులు రాకపోగా ఇతర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి.

* ఆన్‌లైన్‌ షాపింగ్ చేసే సమయంలో పబ్లిక్‌గా ఉచితంగా లభించే వైఫ్‌లను ఉపయోగించకపోవడమే మంచిది. వీటివల్ల హ్యాకర్స్‌ మీ వ్యక్తిగత వివరాలను, కార్డు వివరాలను కాజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ డేటా లేదా మీ ఇంట్లో వైఫైని మాత్రమే ఉపయోగించడం ఉత్తమం.

* ఇక యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల ప్లే స్టోర్‌లో కూడా నకిలీ యాప్స్‌ వస్తున్నాయి. కాబట్టి మీరు డౌన్‌లోడ్ చేసుకుంటోంది. అసలు యాపేనా చెక్‌ చేసుకొని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

* ఈ కామర్స్‌లో షాపింగ్ చేసే సమయంలో మీ అకౌంట్‌లోకి లాగిన్‌ అయ్యి షాపింగ్ చేయండి. దీనివల్ల మీరు ఉపయోగిస్తున్న యాప్‌ సరైందో కాదో ఇట్టే తెలుసుకోవచ్చు. మీ పాత ఆర్డర్స్‌, రివార్డ్‌ పాయింట్స్‌ చెక్‌ చేసుకొని వస్తువులను బుక్‌ చేసుకోవాలి.

రోజూ ఉసిరి రసం తీసుకోవటం అలవాటు చేసుకోండి.. మీ బాడీలో జరిగే మార్పులు ఊహించలేరు

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఉసిరి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం శరీరంలో వాపును తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది.

ఇది గ్యాస్ట్రిక్ రసాలను ప్రేరేపిస్తుంది. పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది, జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే ఉసిరి జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నిర్వహణకు తోడ్పడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహ నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఉసిరి ఒక నిర్విషీకరణ ఏజెంట్‌గా పనిచేస్తుంది. మెరుగైన ఆరోగ్యానికి టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. UV నష్టం నుండి రక్షిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరిలోని పోషక గుణాలు వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

గుండె ఆరోగ్యానికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండెను కాపాడుతుంది. అధిక రక్తపోటు రాకుండా అడ్డుకుంటుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఎక్కువ. ఇది గుండె పోటు, స్ట్రోక్ వంటివి రాకుండా ఇది నిరోధిస్తుంది.

ఉసిరి రసం తయారీ కోసం.. ఉసిరి కాయలను గింజలు లేకుండా ముక్కలుగా కట్ చేయాలి. దీనికి నీటిని కలిపి జ్యూస్‌లాగా చేయాలి. తర్వాత అవసరమనుకుంటే వడకట్టండి. లేదంటే అలానే తీసుకోవచ్చు. దీనిలో కొద్దిగా తేనె, అల్లం, మిరియాల పొడి లేదా ఉప్పు వేసి తాగండి. ఇలా రెగ్యులర్‌గా తాగితే రిజల్ట్ ఉంటుంది.

ఉసిరి రోజూ మితంగా తీసుకునే చాలా మందిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవు. కానీ, కొందరిలో జీర్ణ అసౌకర్యం, అతిసారం లేదా అలెర్జీ ప్రతిచర్యలు వంటివి ఇబ్బందిపెట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, రోజువారీ ఆహారంలో ఉసిరిని యాడ్ చేసుకోవాలని భావించేవారు ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించి అలవాటు చేసుకోవడం మంచిది.

ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు ఇంత ఖరీదా..? ధర చూస్తే మతిపోవాల్సిందే

దేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల జోరు కొనసాగుతోంది. ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకున్నవారు ముందుగా వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

వివిధ రకాల ఫీచర్లు, ఆకట్టుకునే లుక్, పట్టణాల ట్రాఫిక్ లో సులభం నడిపే వీలు ఉండడం వీటి డిమాండ్ పెరగడానికి కారణం. అలాగే పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి తప్పించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే అవకాశం ఉండడం కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే వీటిలో మోటారు, బ్యాటరీ చాలా కీలకంగా ఉంటాయి. వాహనం ధరలో దాాదాపు సగం వాటికే వెచ్చించాలి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈవీల బ్యాటరీల ధరల గురించి తెలుసుకుందాం.

బ్యాటరీ ధర అధికం

మార్కెట్ లో అనేక కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఓలా, టీవీఎస్, బజాజ్ కంపెనీల స్కూటర్లకు డిమాండ్ ఉంటోంది. విక్రయాలలో ఈ కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. అలాగే ఈవీ స్కూటర్ ధరలో దాదాపు సగం దానిలోని బ్యాటరీ, మోటారుకే ఖర్చు అవుతుంది. ఎందుకంటే అవి రెండు అత్యంత కీలకంగా ఉంటాయి. అయితే కొనుగోలు దారులు ఒక్కోసారి బ్యాటరీలో లోపంతో మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. లేకపోతే వారంటీ పూర్తయిపోవడంతో కొత్త బ్యాటరీ కొనుగోలు చేయాల్సి రావచ్చు. ఆ సమయంలో వాటికి భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఓలా స్కూటర్ బ్యాటరీ

ఈ స్కూటర్ బ్యాటరీ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిపై గతేడాది సోషల్ మీడియా ఓ వీడియో వైరల్ అయ్యింది. దానిలో ఎస్ 1, ఎస్ 1 ప్రో బ్యాటరీలను చూపించారు. ఎస్ 1లో ఉపయోగించే 2.98 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ధర రూ.66,549, అలాగే ఎస్ 1 లో ఉపయోగించే 3.97 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ధర 87,298 అని బోర్డుపై రాశారు. ఇప్పుడు కూడా వాటి ధరలు దాదాపు అలాగే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రూ.60 వేల నుంచి 70 వేల మధ్యలో ఉన్నాయి.

టీవీఎస్ ఐక్యూబ్

టీవీఎస్ ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్ టీ 3 అనే మూడు రకాల వేరియంట్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. దీని టాప్ మోడల్ వేరియంట్ లో 3.4 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన నానా రిమూవబుల్ బ్యాటర్ ప్యాక్ ఏర్పాటు చేశారు. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 145 కిలోమీటర్లు పరుగెడుతుంది. అయితే ఈ బ్యాటర్ ప్యాక్ కు మార్చాల్సి వస్తే దాదాపు రూ.56 వేల నుంచి రూ.70 వేలు వరకూ ఖర్చవుతుంది.

బజాజ్ చేతక్

బజాజ్ చేతక్ స్కూటర్ లో 3 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఈ కంపెనీ స్కూటర్లకు ప్రజల నుంచి ఎంతో ఆదరణ లభిస్తోంది. ఈ కంపెనీ ఈవీలపై దాదాపు మూడేళ్లు వారంటీ అందిస్తోంది. వారంటీ ముగిసిపోతే కొత్త బ్యాటరీ కోసం దాదాపు రూ.50 వేలు వెచ్చించాలి.

ఈ టిప్స్ పాటిస్తే వీసా సమస్యలకు చెక్.. మీ విదేశీ ప్రయాణం ఇలా సులభతరం..

ఇంటర్నేషనల్ టూరిజం ఇటీవల బాగా పెరుగుతోంది. వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రకృతి అందాలు, సుందర కట్టడాలను ఆస్వాదించాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది.

అలాగే విశ్రాంతి తీసుకోడానికి, వ్యాపారాల నిమిత్తం, ఉన్నత విద్య కోసం కూడా విదేశీ ప్రయాణాలు చేసే వారున్నారు. అయితే వీరందరికీ సాధారణంగా ఎదురయ్యే సమస్య వీసా. కొన్ని దేశాలకు ప్రక్రియ సులభంగానే ఉంటున్నా.. మరికొన్ని దేశాలకు వెళ్లాలంటే వీసా అంత త్వరగా మంజూరు కాదు. అయితే వీసా రిజెక్ట్ కాకుండా.. సులభంగా మంజూరయ్యేందుకు మీకు ఉపయోగ పడే బెస్ట్ టిప్స్ అందిస్తున్నాం. దరఖాస్తు చేసుకునే సమయంలో వీటిని పాటించడం ద్వారా సులభంగా వీసా మంజూరయ్యే అవకాశం ఉంటుంది.

డెస్టినేషన్ ను గుర్తించండి..

విదేశీ ప్రయాణం చేయాలనుకుంటున్న దేశాన్ని మొదటిగా ఎంచుకోవాలి. ఇదే మీ వీసా దరఖాస్తునకు మొదటి అడుగు. మీరు యూరప్ వీధులను అన్వేషించాలని కలలు కంటున్నా, ఆసియాలో వ్యాపార వెంచర్‌ను ప్రారంభించాలనుకుంటున్నా లేదా ఉత్తర అమెరికాలో విద్యాపరమైన అవకాశాలను కొనసాగించాలన్నా.. కారణం ఏదైనా మీరు ఉద్దేశించిన ప్రయాణ గమ్యాన్ని గుర్తించడం అనేది కీలకమైన మొదటి అడుగు. మీరు కోరుకున్న గమ్యస్థానాన్ని అర్థం చేసుకోవడం సముచితమైన వీసా రకాన్ని ఎంచుకోవడానికి ఇది ఉపకరిస్తుంది.

వీసా ప్రాసెసింగ్ టైమ్‌లైన్‌..

మీరు వెళ్లాల్సిన దేశాన్ని గుర్తించిన తర్వాత, ఆ స్థానానికి నిర్దిష్ట వీసా ప్రాసెసింగ్ టైమ్‌లైన్‌లతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం అత్యవసరం. వీసా ప్రాసెసింగ్ కోసం టైమ్‌లైన్‌లు సంబంధిత ఎంబసీ/కాన్సులేట్ అధికారిక వెబ్‌సైట్‌లలో స్పష్టంగా వివరించి ఉంటాయి. మీరు దరఖాస్తు చేస్తున్న దేశం, మీకు అవసరమైన వీసా రకం, సంవత్సరం సమయం వంటి అంశాలపై ఆధారపడి వీసా ప్రాసెసింగ్ టైమ్‌లైన్‌లు గణనీయంగా మారతాయి. ఉదాహరణకు, ప్రముఖ పర్యాటక గమ్యస్థానాలు పీక్ ట్రావెల్ సీజన్‌లలో ఎక్కువ ప్రాసెసింగ్ సమయాన్ని తీసుకుంటాయి. అయితే వర్క్ వీసాల వంటి నిర్దిష్ట వీసా వర్గాలు వేర్వేరు ప్రాసెసింగ్ టైమ్‌లైన్‌లను కలిగి ఉంటాయి. ఈ టైమ్‌లైన్‌లను ముందుగానే పరిశోధించడం, అర్థం చేసుకోవడం ద్వారా, సకాలంలో ప్రాసెసింగ్‌ని నిర్ధారించడానికి, అనవసరమైన జాప్యాలను నివారించడానికి ఉపకరిస్తుంది.

వీసా అపాయింట్‌మెంట్‌..

వీసా దరఖాస్తు ప్రక్రియను సజావుగా నావిగేట్ చేయడంలో, మీ వీసాను సకాలంలో పొందడంలో మీ వీసా దరఖాస్తును చాలా ముందుగానే సమర్పించడానికి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం చాలా అవసరం. అపాయింట్‌మెంట్‌లను ఈ వెబ్ సైట్లో పూర్తిగా ఉచితంగా బుక్ చేసుకోవచ్చు! అయితే, కొన్ని ప్రభుత్వాలు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే సమయంలో సేవా రుసుమును ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ సమయంలో ఈ చెల్లింపు తిరిగి చెల్లిస్తారు. అదనంగా, మరింత సౌలభ్యం కోసం, దరఖాస్తుదారులు ‘వీసా ఎట్ యువర్ డోర్‌స్టెప్’ వంటి ఐచ్ఛిక సేవలను ఎంచుకోవచ్చు. వారు ఎంచుకున్న ప్రదేశం నుంచి దరఖాస్తులను సమర్పించవచ్చు. ప్రీమియం లాంజ్ సౌలభ్యం నుంచి వారి దరఖాస్తు సమర్పణలో ఎండ్-టు-ఎండ్ సహాయాన్ని పొందవచ్చు. ముందుగానే దరఖాస్తు చేయడం ద్వారా, ప్రయాణికులు చివరి నిమిషంలో ఒత్తిడిని నివారించవచ్చు, చాలా దేశాలు వారి ప్రయాణ తేదీకి 90 రోజుల (3 నెలలు) ముందు వీసా దరఖాస్తులను అంగీకరిస్తాయి. స్కెంజెన్ వీసా దరఖాస్తుదారులు వారి ప్రయాణ తేదీకి ముందు 180 రోజుల (6 నెలలు) వరకు వారి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రివ్యూ డాక్యుమెంటేషన్..

మీ వీసా దరఖాస్తు మెటీరియల్‌లను సిద్ధం చేసేటప్పుడు శ్రద్ధ అవసరం. మీరు సందర్శించాలనుకుంటున్న దేశం, రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ వివరించిన డాక్యుమెంటేషన్, ఇతర అవసరాలను జాగ్రత్తగా సమీక్షించండి. సాధారణంగా అవసరమైన పత్రాలు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఆర్థిక మార్గాల రుజువు, ప్రయాణం, పూర్తి చేసిన వీసా దరఖాస్తు ఫారమ్‌లను కలిగి ఉండవచ్చు. మీరు అవసరమైన అన్ని పత్రాలను సేకరించి, ప్రతి అవసరానికి కచ్చితంగా కట్టుబడి ఉన్నారని నిర్ధారించుకోండి. మీ డాక్యుమెంటేషన్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడం ద్వారా, పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించుకోవడం ద్వారా మీ దరఖాస్తు విజయవంతంగా ప్రాసెస్ అవుతుంది.

సమగ్ర వీసా సమాచారం..

వీసా దరఖాస్తు ప్రక్రియ కోసం మీరు క్షుణ్ణంగా సమాచారం పొందారని, తగినంతగా సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి, వీఎఫ్ఎస్ గ్లోబల్ అధికారిక వెబ్‌సైట్ వంటి వనరులను ఉపయోగించుకోండి. వీఎఫ్ఎస్ గ్లోబల్ అధికారిక వెబ్‌సైట్ అనుకూలమైన, వినియోగదారు-స్నేహపూర్వక ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. వీసా దరఖాస్తు విధానాలు, అపాయింట్‌మెంట్ షెడ్యూలింగ్ ఎంపికలు వంటి సమగ్ర సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. వివిధ వీసా రకాలు, అనుబంధ రుసుములు, తరచుగా అడిగే ప్రశ్నలపై వివరణాత్మక మార్గదర్శకాలను కూడా అందుబాటులో ఉంటాయి.

ముందుగానే ప్లాన్ చేసుకోవాలి..

పాస్‌పోర్ట్ చెల్లుబాటును, ఖర్చుల కోసం బడ్జెట్‌ను నిర్ధారిస్తూ ముందస్తుగా ప్లాన్ చేయడం చాలా అవసరం. అవసరమైతే వేగవంతమైన ప్రాసెసింగ్ ఎంపికలను పరిగణించండి. వీసా అవసరాలపై అప్‌డేట్‌గా ఉండండి. దరఖాస్తు ఫారమ్‌పై కచ్చితమైన సమాచారాన్ని అందించండి. అవసరమైన పత్రాలను వెంటనే సమర్పించండి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే వీసా ఎట్ యువర్ డోర్‌స్టెప్ లేదా ప్రీమియం లాంజ్ వంటి ఐచ్ఛిక సేవలు ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయవని గమనించండి.

అల్లం టీ ఎక్కువగా తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయంటే..

టీ అంటే చాలా మందికి ఇష్టం. ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు టీ తాగకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. టీల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో అల్లం టీ కూడా ఒకటి. అల్లంలో టీలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.

ప్రతి రోజూ రెండు సార్లు చిన్న టీ కప్పుతో టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అంతకు మించి అల్లం టీని తాగితే మాత్రం సమస్యలు తప్పవు.

అల్లం టీ ఎక్కువగా తాగడం వల్ల అసిడిటీ సమస్య పెరుగుతుంది. రోజుకు రెండు కప్పులకు మించి తాగితే.. ఇంత కంటే ఎక్కువగా తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ, కండరాల తిమ్మిరి వంటి సమస్యల ఎక్కువగా వస్తాయి. జీర్ణ సమస్యలు కూడా పెరుగుతాయి.

అల్లం టీ ఎక్కువగా తాగితే రక్తాన్ని చాలా పలుచగా చేస్తుంది. దెబ్బలు తగిలినప్పుడు సన్నగా రక్తం కారుతూ ఉంటుంది. ఇలా రక్తాన్ని కలిగి ఉంటే.. అల్లం టీని తాగడం మానేయండి. ఇది రక్తాన్ని మరింత పల్చగా చేస్తుంది. అల్లం టీ ఎక్కువగా తాగితే అలెర్జీ కూడా వస్తుంది.

బీపీ సమస్యతో బాధ పడేవారు అల్లం టీ తాగితే.. రక్త పోటు అనేది మరింత తగ్గే ప్రమాదం ఉంది. ఇలా బీపీ తక్కువగా ఉంటే.. ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా అల్లం టీ అస్సలు తాగకూడదు. ఇది వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

10, 20, 50 రూపాయల నోట్లు ఎక్కడ? ఆర్బీఐ ముద్రణ నిలిపివేసిందా? ఎంపీ ఆరోపణలు నిజమేనా?

మార్కెట్‌లో రూ.10, రూ.20, రూ.50 నోట్ల కొరత ఏర్పడింది. దీనిపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ స్వరం పెంచారు.

మార్కెట్‌లో అకస్మాత్తుగా తక్కువ విలువైన నోట్లు మాయమవడంపై ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నోట్ల ముద్రణను నిలిపివేశారని ఆరోపించారు. దేశంలో డిజిటల్ కరెన్సీ, యూపీఐ చెల్లింపుల వృద్ధి కోసం ఇలాంటివి జరగడం లేదా? అనే సందేహాన్ని లేవనెత్తాడు. ఆయన ఆరోపణ కొత్త వివాదానికి దారి తీసింది.

మార్కెట్లో ఎన్ని నోట్లు ఉన్నాయి?

2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కరెన్సీలో రూ.500 నోట్ల వాటా మార్చి, 2024 నాటికి 86.5 శాతం. మార్చి 31, 2024 నాటికి అత్యధికంగా 5.16 లక్షల రూపాయల 500 నోట్లు చెలామణిలో ఉన్నాయి. 10 రూపాయల నోట్లు 2.49 లక్షలు. గత కొన్ని రోజులుగా తక్కువ విలువ కలిగిన నోట్ల కొరత ఏర్పడింది. దీనిపై దుమారం రేగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణ కోసం ఆర్‌బీఐ రూ.5,101 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ఏడాది క్రితం అంటే 2022-23లో నోట్ల ముద్రణ కోసం ఆర్‌బీఐ రూ.4,682 కోట్లు ఖర్చు చేసింది.

ఈ నోట్లను ముద్రించకపోవడానికి కారణం ఏమిటి?

మాణికం ఠాగూర్ తమిళనాడులోని విరుదునగర్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ రాశారు. 10, 20, 50 రూపాయల నోట్ల కొరత కారణంగా వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఉద్దేశపూర్వకంగానే నోట్ల కొరత ఏర్పడిందని ఆరోపించారు.

యూపీఐ, నగదు రహిత లావాదేవీలను పెంచేందుకే ఇలా చేస్తున్నారని ఠాగూర్ ఆరోపించారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ ఉద్దేశపూర్వకంగా తక్కువ విలువ కలిగిన నోట్లను ముద్రించడం లేదని ఠాగూర్ ఆరోపించారు. అయితే ఈ నిర్ణయం వల్ల పేదలు, మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

వృద్ధులకు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవి.. ప్రభుత్వ భద్రత, పైగా పన్ను రహితం..

జీవితంలో పొదుపు అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరూ పొదుపు పాటించాలి. అదే సమయంలో పొదుపు చేసిన మొత్తాన్ని ఏదైనా మంచి పెట్టుబడి పథకంలో ఇన్వెస్ట్ చేయాలి.

అప్పుడే ఆ పొదుపు సార్థకత వస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఎందుకంటే వారికి పరిమిత ఆదాయ వనరులు ఉంటాయి. కేవలం పింఛన్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. పైగా ఆసమయంలో వారికి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. వారి రోజువారీ అవసరాలతో పాటు ఆస్పత్రి, మందుల ఖర్చులు పెరుగుతాయి. ఈ క్రమంలో మంచి రాబడినిచ్చే పథకాలలో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయం. అయితే పెడుతున్న పెట్టుబడికి అధిక రాబడి రావడంతో పాటు దానిపై పన్ను ప్రయోజనాలు కూడా ముఖ్యం. అందుకే మీకు పన్ను ప్రయోజనాలను అందించే బెస్ట్ పథకాలను పరిచయం చేస్తున్నాం. ప్రభుత్వ మద్దతుతో నడిచే పథకాలు కాబట్టి మీ పెట్టుబడికి భద్రత, భరోసా కూడా ఉంటుంది.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)..

ఇది ప్రభుత్వ-మద్దతుగల పెట్టుబడి పథకం. సీనియర్ సిటిజన్‌లు తమ పొదుపులను పెంచుకోవడానికి సురక్షితమైన, నమ్మదగిన మార్గం ఇది. వడ్డీ రేటును ఆర్బీఐ ద్రవ్య ప్రణాళిక కమిటీ ప్రతి త్రైమాసికానికి సమీక్షిస్తుంది.ఈ పథకంలో ప్రస్తుతం ఏడాదికి 8.2శాతం వడ్డీ వస్తుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)

ఈ పథకం15 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో దీర్ఘకాలిక, ప్రభుత్వ మద్దతు గల పథకం. పన్ను ప్రయోజనాలు, మూలధన రక్షణను అందిస్తుంది. సంపాదించిన వడ్డీ పన్ను రహితం. పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక వృద్ధితో తక్కువ-రిస్క్ కోరుకునే పెట్టుబడిదారులకు పీపీఎఫ్ అనుకూలంగా ఉంటుంది. పదవీ విరమణ కార్పస్‌ను నిర్మించడానికి లేదా భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ఇది మంచి ఎంపిక. ప్రస్తుతం ఏడాదికి 7.1శాతం వడ్డీ అందిస్తోంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు..

వివిధ పదవీకాల ఎంపికలతో బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ ఎఫ్డీలను నిర్వహిస్తాయి. ఇవి హామీతో కూడిన రాబడి, లిక్విడిటీని అందిస్తాయి. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కానీ బ్యాంకులు తరచుగా సీనియర్ సిటిజన్లకు అధిక రేట్లను అందిస్తాయి. అయితే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో వస్తుంది. సీనియర్ సిటిజన్లు కూడా నిర్దిష్ట పన్ను ప్రయోజనాలను పొందుతారు. దీనిపై వడ్డీ రేటు బ్యాంకును బట్టి 8 నుంచి 8.5శాతం వరకూ ఉంటుంది. సీనియర్ సిటిజెన్స్ కు మరో 50బీపీఎస్ ఎక్కువగా ఉంటుంది.

ప్రభుత్వ బాండ్లు..

ప్రభుత్వం జారీ చేసే దీర్ఘకాలిక బాండ్లు భద్రతను, స్థిరమైన రాబడిని అందిస్తాయి. నిర్దిష్ట బాండ్ స్కీమ్‌పై ఆధారపడి పన్ను రహిత వడ్డీ లేదా ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. దీనిపై వడ్డీ రేటు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సాధారణంగా సంవత్సరానికి 7 నుంచి 8శాతం వరకూ ఉంటుంది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)

పన్ను ప్రయోజనాలతో దీర్ఘకాల పదవీ విరమణ పొదుపు కోసం రూపొందించిన పథకం ఇది. పదవీ విరమణ తర్వాత పెన్షన్ అందిస్తుంది. పెట్టుబడి ప్రధానంగా ఈక్విటీ, కార్పొరేట్ బాండ్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీల మిశ్రమంలో ఉంటుంది. యాన్యుటీని కొనుగోలు చేయడానికి కార్పస్‌లో కొంత భాగాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇది పన్ను విధించబడుతుంది. దీనిపై వడ్డీ రేటు 8 నుంచి 12శాతం వరకూ మార్కెట్ పరిస్థితులకు లోబడి ఉంటుంది.

అంగన్‌వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం

ఒడిశాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అంగన్‌వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టారు గ్రామస్తులు. బాలాసోర్‌లోని మహాపద గ్రామంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రతిరోజూ ఆహారం అందించడం లేదన్న ఆరోపణపై గ్రామస్తులు, ఊర్మిళా సమల్ అనే అంగన్‌వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టారు.

ఈ ఘటన అలస్యంగా వెలుగు చూసింది. విషయం అక్కడితో ఆగలేదు, మరో మహిళా కార్మికురాలిని కూడా దారుణంగా కొట్టారు. ఈ సంఘటన సెప్టెంబర్ 19వ తేదీన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఒడిశా ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిదా బాధితురాలు ఊర్మిళా సమల్‌ను కలుసుకుని ఆమెకు పూర్తి వైద్య సహాయం మరియు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. పరిదా చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (CDMO), పోలీసు సూపరింటెండెంట్‌తో పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయంపై సత్వర చర్యలు, సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు.

పోలీసుల సమాచారం మేరకు గ్రామస్తులు అంగన్‌వాడీ కేంద్రంలోకి ప్రవేశించి ఊర్మిళను దుర్భాషలాడారు. అంతేకాదు ఆమెను బయటకు ఈడ్చుకొచ్చి చెట్టుకు కట్టివేసి, దారుణంగా కొట్టారు. అక్కడ నిలబడిన కొంతమంది స్థానికులు ప్రేక్షకులుగా మాత్రమే ఉండిపోయారు. ఆ మహిళకు సహాయం చేయడానికి ఎవరూ రాలేదు. మహిళపై కొందరు గుడ్లు కూడా విసిరినట్లు సమాచారం. తమ పిల్లలకు సక్రమంగా ఆహారం అందడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊర్మిళ తమ పిల్లలకు భోజనం పెట్టడం లేదని, దీనిపై గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేశామని స్థానిక మహిళలు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సిడిపిఓ) పార్బతి ముర్ము సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎలాగోలా మహిళను విడిపించి బస్తా ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను బాలాసోర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో విషయం పోలీసులకు చేరడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే కొట్టడానికి స్పష్టమైన కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఈ దాడి సుభద్ర యోజనకు సంబంధించినది కావచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనతో కార్మికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన ఇతర కార్మికుల్లో భయాందోళనకు గురి చేసింది.

గుడ్‌న్యూస్‌.. ఇక పూర్తిగా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ ఎప్పుడొస్తుందో చెప్పిన మంత్రి

బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G రోల్ అవుట్ కోసం ఎదురుచూస్తున్న మిలియన్ల మంది వినియోగదారులకు శుభవార్త ఉంది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 4G సర్వీస్‌, ప్రభుత్వ టెలికాం సంస్థ భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పారు.

దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసిందన్నారు. కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. త్వరలో, వినియోగదారులు ప్రైవేట్ కంపెనీల వలె మెరుగైన సేవల నాణ్యతను పొందవచ్చు. నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ఇటీవల 6000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. అలాగే లక్ష మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు.

4జీ రోల్ అవుట్ కోసం సన్నాహాలు:

కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తన అధికారిక హ్యాండిల్ నుండి ఒక వీడియో పోస్ట్‌ను పంచుకున్నారు. దీనిలో అతను సర్వీస్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి టెలికాం కంపెనీ సన్నాహాలు గురించి చెప్పారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్‌లో జరిగిన చర్చలో కేంద్ర మంత్రి బీఎస్‌ఎన్‌ఎల్‌ భవిష్యత్తు ప్రణాళిక తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్, విఐ, బీఎస్‌ఎన్‌ఎల్ 4 ప్రధాన టెలికాం కంపెనీలు ఉన్నాయని ఆయన అన్నారు.

వినియోగదారులకు శుభవార్త

బీఎస్‌ఎన్‌ఎల్‌ రోల్ అవుట్‌కు సంబంధించి వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా 1 లక్ష 4జీ టవర్‌లను ఇన్‌స్టాల్ చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, తద్వారా టెలికాం కంపెనీ 8 శాతం మార్కెట్ వాటాను పెంచుకోవచ్చని కేంద్ర మంత్రి చెప్పారు. 2జీ, 3జీ వినియోగదారుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికీ 4జీ అవసరమని, అయితే 4జీకి మారవలసిన అవసరం పెరుగుతోందని, భారతదేశంలోని దాదాపు 98 శాతం జిల్లాలకు 4G కవరేజీ విస్తరించిందని ఆయన అన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి వినియోగదారులకు దేశవ్యాప్తంగా పూర్తి 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ పనులు జరుగుతున్నాయన్నారు.

ఆదివారమూ ఆగని ‘హైడ్రా’.. కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాలపై నాన్‌స్టాప్‌గా దూసుకెళ్తోంది హైదరాబాద్‌ డిసాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ అలియాస్‌ హైడ్రా.

హైదరాబాద్‌లో ఆడా,ఈడా అనే తేడా లేకుండా… ఎక్కడ కబ్జా కనిపించినా హై స్పీడుతో కదంతొక్కుతున్న హైడ్రా.. తాజాగా మరోసారి జూలు విదిల్చింది. హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పలు ఏరియాల్లో కూల్చివేతలు చేపట్టారు.

కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌ ఏరియాల్లో కూల్చివేతలు

కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌ ఏరియాల్లో కబ్జానిర్మాణాలపై ఫోకస్‌ పెట్టింది హైడ్రా. కూకట్‌పల్లి నల్లచెరువులోని 66, 67, 68, 69 సర్వే నెంబర్లలో అనుమతులు లేకుండా నిర్మించిన 16 షెడ్లను కూల్చేసింది. ఇప్పటికే ఆయా నిర్మాణాల యజమానులకు నోటీసులు ఇచ్చిన హైడ్రా… ఉదయాన్నే బుల్డోజర్స్‌, ప్రొక్లెయినర్స్‌తో సహా స్పాట్‌కు చేరుకుంది. చెరువును కబ్జా చేసి కట్టిన… మొత్తం 16 కమర్షియల్ షెడ్లు, ప్రహారి గోడలను కూల్చివేసింది. కూకట్‌పల్లి నల్లచెరువు పరిధిలో 4 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది హైడ్రా.

కిష్టారెడ్డిపేటలో మూడు భవనాలు కూల్చిన హైడ్రా

సంగారెడ్డి జిల్లాకు, హైదరాబాద్‌కు వారధిలా ఉండే అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలోనూ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. అమీన్‌పూర్‌ మండలం కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 164లో మూడు భవనాలు కూల్చివేసింది. అవి మూడూ భారీ బహుళ అంతస్తు భవనాలే కావడం విశేషం. వాణిజ్య పరంగా వాడుతున్న ఐదు అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది. అక్కడ కబ్జాచేసిన ఎకరం ప్రభుత్వం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌. అయితే నివాస గృహాలను కూల్చలేదనీ… కేవలం కమర్షియల్‌ భవనాలనే కూల్చేశామనీ చెప్పారు.

12/2, 12/3 సర్వేనెంబర్‌లోని 25 నిర్మాణాల కూల్చివేత

పటేల్ గూడలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలన్నీ తొలిగించారు. సర్వే నెం.12/2, 12/3లోని 25 నిర్మాణాల కూల్చివేశారు. పటేల్ గూడలో 3ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. మొత్తం మూడు ప్రాంతాల్లో దాదాపు 8 ఎకరాలు ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా కమిషనర్‌ తెలిపారు. రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్ తో కలిసి కూల్చివేతలు చేపట్టామన్నారు. నీటి వనరుల సంరక్షణ కోసం సంయుక్తంగా కృషి చేస్తున్నామనీ చెప్పారు రంగనాథ్‌. దూకుడుగా ముందుకెళ్తున్న హైడ్రా… తదుపరి టార్గెట్‌ ఏ ఏరియా అన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

అదిరేలా మటన్ దొన్నె బిర్యానీ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి..

బిర్యానీలు అంటే చాలా మందికి ఇష్టం. ఆదివారం వచ్చిందంటే బిర్యానీ తినాలని అనుకుంటూ ఉంటారు. బిర్యానీల్లో ఎన్ని వెరైటీలు ఉన్నా ఇంకా ఇంకా స్పెషల్‌గా తినాలని అనుకుంటూ ఉంటారు.

అందులోనూ ముస్లింలు చేసే బిర్యానీలు మరింత రుచిగా ఉంటాయి. ఎప్పుడూ హైదరాబాద్ బిర్యానీలే కాకుండా.. ఇలా వెరైటీగా మటన్ దొన్నె బిర్యానీ కూడా ట్రై చేయండి. చాలా మందికి దొన్నె బిర్యానీల గురించి తెలిసే ఉంటుంది. ఇంత రుచిగా ఉండే ఈ మటన్ దొన్నె బిర్యానీలను ఇంట్లో కూడా మనం తయారు చేసుకుని తినవచ్చు. మరి మటన్ దొన్నె బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మటన్ దొన్నె బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:

మటన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బియ్యం, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, పసుపు, కారం, ఉప్పు, నెయ్యి, ఆయిల్.

మటన్ దొన్నె బిర్యానీ తయారీ విధానం:

ముందుగా మటన్‌ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టకోవాలి. ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా పెరుగు, ఆయిల్, పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇందులో కొద్దిగా నెయ్యి, ఆయిల్ వేసి అందులో ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు వేసి సువాసన వచ్చేంత వరకే ఫ్రై చేయాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు వీటిని చల్లార్చి.. వాటిని మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్రెజర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులోనే ఆయిల్ వేసి.. మ్యారినేట్ చేసుకున్న మటన్ వేయాలి. ఓ రెండు గ్లాసుల నీటిని వేసి.. 8 నుంచి 10 నిమిషాలు ప్రెజర్‌పై ఉడికించాలి. ఇలా ఉడికిన మటన్ పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఇదే కుక్కర్‌లో మళ్లీ కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో మసాలా పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత కడిగిన బియ్యం, మటన ముక్కలు, కొద్దిగా నీళ్లు వేసి బియ్యానికి సరిపడా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకే ఉడికించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే టేస్టీ మటన్ దొన్నె బిర్యానీ సిద్దం.

బట్టలపై పడ్డ టీ మరకలను ఇలా ఈజీగా తొలగించవచ్చు

ఒక్కోసారి అనుకోకుండా బట్టలపై టీ మరకలు అనేవి పడుతూ ఉంటాయి. ఇలా బట్టలపై పడ్డ మరకలు అంత ఈజీగా పోవు. మరకలు అలానే ఉంటాయి. దీంతో ఆ బట్టలు వేసుకోకుండా పక్కన పెట్టేస్తారు.

కానీ ఎలాంటి మొండి టీ మరకలు అయినా సరే ఎంతో సింపుల్‌గా, కొన్ని టీ మరకలతో పోగొట్టవచ్చు. మరి చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బ్లీచింగ్ పౌడర్ సహాయంతో డ్రెస్సులపై పడ్డ టీ మరకలను తొలగించుకోవచ్చు. ముందుగా కాఫీ, టీ పడిన మరకలపై బ్లీచింగ్ పౌడర్ రుద్దాలి. బ్లీచింగ్ పౌడర్ ఎక్కువగా వాడితే బట్టలు అనేవి పాడైపోతాయి. కాబట్టి కేవలం మరకలు పడిన చోట మాత్రమే కొద్దిగా వేసి రుద్దండి. ఆ తర్వాత వెంటనే నీటితో క్లీన్ చేయాలి.

వెనిగర్ సహాయంతో కూడా టీ, కాఫీ మరకలను వదిలించుకోవచ్చు. మరకలు పడిన చోట వెనిగర్ వేసి రుద్దండి. ఆ తర్వాత కాసేపు సర్ఫ్ వేసి గోరు వెచ్చటి నీటిలో నానబెట్టాలి. ఇలా ఓ గంట తర్వాత మళ్లీ సబ్బు రుద్ది బ్రష్ కొడితే మరకలు పోతాయి.

టీ, కాఫీ లాంటి మొండి మరకలను బేకింగ్ సోడాతో కూడా వదిలించుకోవచ్చు. మరకలు పడ్డ చోట బేకింగ్ సోడా వేసి రుద్దాలి. ఆ తర్వాత నీటిలో కాసేపు నానబెట్టాలి. ఓ గంట తర్వాత సబ్బుతో మరకలను రుద్ది.. నీటితో శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి.

మనం ఉపయోగించే పౌడర్ సహాయంతో కూడా మరకలను పోగొట్టవచ్చు. టీ పడిన వెంటనే టిష్యూ పేపర్‌తో టీ మరకలను తుడిచేసి. సబ్బుతో రుద్ది.. బ్రష్ కొడితే మరకలు పోతాయి. ఆ తర్వత ఇక్కడ తడిగా ఉండే ప్రదేశంలో పౌడర్ చల్లండి. ఇలా చేయడం వల్ల మరకలు కనిపించవు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

బీఎస్‌ఎన్ఎల్‌లో సూపర్‌ ప్లాన్‌.. రూ.94తో 30 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్ ఇవే!

టెలికాం ఆపరేటర్లు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా, రిలయన్స్ జియో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. తక్కువ ధరలలో వివిధ ప్లాన్‌లు, ప్రయోజనాలు కూడా వినియోగదారులను ఆకర్షిస్తాయి.

అయితే కంపెనీలు ప్లాన్ ధరలను పెంచినప్పటి నుండి, వినియోగదారులు టెలికాం కంపెనీలపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ దీనిని సద్వినియోగం చేసుకుంది. తక్కువ ధరల్లో రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తోంది. అలాగే అప్పుడు కేవలం 94 రూపాయల ప్లాన్‌ను అందిస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్లాన్ ఇతర టెలికాం కంపెనీల కంటే చౌకైనది. దీని ధర 30 రోజుల చెల్లుబాటుతో కేవలం రూ. 94 మాత్రమే. చూసినట్లయితే, ఈ ప్లాన్ వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇతర టెలికాం కంపెనీలకు కూడా ముప్పుగా మారవచ్చు. అందుకే ఈ ప్లాన్ గురించి తెలుసుకుందాం.

ఈ ప్లాన్ ధర రూ.94. దీనితో పాటు వినియోగదారులకు 30 రోజుల వాలిడిటీ ఇస్తోంది. అంతే కాకుండా వినియోగదారులకు కాలింగ్ సదుపాయం, 3జీబీ డేటాను అందిస్తున్నారు. ఈ డేటా ఎటువంటి పరిమితులతో రాదు. మీరు మీ సౌలభ్యం ప్రకారం ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. తక్కువ డేటా వినియోగించే వారి కోసం ఈ ప్లాన్.

జియో 91 రూపాయలకు ఇదే విధమైన చౌక ప్లాన్‌ను అందిస్తోంది. ఇది 3జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో మీరు రోజుకు 100 MB కంటే ఎక్కువ ఉపయోగించలేరు.

వోడాఫోన్‌ ఐడియా ఈ ప్లాన్‌ను రూ. 107కు అందిస్తోంది. దీనిలో మీరు 200 నిమిషాల ఉచిత కాల్ సౌకర్యంతో పాటు 3 జీబీ డేటాను కూడా పొందుతారు. ఈ ప్లాన్ 35 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంటుంది.

ఎయిర్‌టెల్ 121లో 30 రోజుల సదుపాయంతో ప్లాన్‌ను అందిస్తోంది. దీనిలో మీరు ప్రీమియం వింక్ మ్యూజిక్‌తో పాటు 6 జీబీ డేటాను పొందుతారు.

మీ మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా..? ఒరిజినలా? తెలుసుకోవడం ఎలా? వెరీ సింపుల్‌!

ఛార్జర్ కారణంగా మీ స్మార్ట్‌ఫోన్ పేలిపోవచ్చు. ఫోన్‌లకు ఒరిజినల్‌ ఛార్జర్‌ ఉంటేనే ఉపయోగం. నకిలీ ఛార్జర్ల వల్ల ఫోన్‌లకే ప్రమాదం. గతంలో కూడా ఇలాంటి నకిలీ ఛార్జర్‌ని ఉపయోగించడం వల్ల ఫోన్‌ బ్యాటరీలు పేలిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.

చాలా సార్లు ఫోన్ ఛార్జర్ చెడిపోయినప్పుడు ప్రజలు ఇతర బ్రాండ్‌ల ఛార్జర్‌లను ఉపయోగిస్తారు. లేదా మార్కెట్‌లో లభించే చౌకైన ఛార్జర్లను వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. చాలా సార్లు మీకు నిజమైన వాటిలా కనిపించే నకిలీ ఛార్జర్‌లను మార్కెట్‌లో విక్రయిస్తారు. దీని వల్ల ఫోన్‌ చెడిపోయే అవకాశం ఉంది.

మీరు ఉపయోగిస్తున్న ఛార్జర్ లేదా ఎలక్ట్రానిక్ పరికరం అసలైనదా లేదా నకిలీదా అని కూడా తెలుసుకోవాలనుకుంటే, మీరు దానిని భారత ప్రభుత్వ అధికారిక యాప్ ద్వారా సులభంగా తనిఖీ చేయవచ్చు. ఈ ప్రభుత్వ యాప్ Google Play Store, Apple App Store నుండి BIS కేర్ పేరుతో అందుబాటులో ఉంది.

ఈ విధంగా మీ ఛార్జర్‌ని తనిఖీ చేయండి: ముందుగా Google Play Store/Apple App Store నుండి BIS కేర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్‌పై ఇచ్చిన R నంబర్‌ను ధృవీకరించండి.

ఇక్కడ మీరు క్రమ సంఖ్యను నమోదు చేయడానికి లేదా QR కోడ్‌ను స్కాన్ చేయడానికి ఎంపికను పొందుతారు.

మీరు ఛార్జర్ లేదా దాని బాక్స్‌లో సీరియల్ నంబర్‌ను కనుగొంటారు. మీరు మీ ఛార్జర్‌కు కెమెరా అనుమతిని ఇవ్వడం ద్వారా క్యూఆర్ కోడ్‌ను కూడా స్కాన్ చేయవచ్చు. దీని వల్ల అది ఒరిజినలా? నకిలీదా? తెలిసిపోతుంది.

ఓ వెబ్‌సిరీస్‌కి సరిపడా డ్రామా.. అనేక ట్విస్ట్‌లు.. ఊహించని మలుపులు

ముంబై నటి కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్‌ అయింది. కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్​ అరెస్ట్‌తో ఈ కేసు ఉత్కంఠ రేపుతోంది. విద్యాసాగర్‌ను డెహ్రాడూన్​లో అదుపులోకి తీసుకున్న పోలీసులు… సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.

కుక్కల విద్యాసాగర్ అరెస్ట్‌తో సంచలనల విషయాలు బయటకు వస్తాయా..? ఐపీఎస్‌ల మెడకు ఉచ్చు బిగుసుకుంటుందా..? తెర వెనక రహస్యాలు బట్టయలవుతాయా..? ముంబై హీరోయిన్‌ కేసులో ఇంకెన్నీ టిస్ట్‌లు చోటుచేసుకోనున్నాయి..? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్‌ బర్నింగ్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు… ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నామన్నారు. మరోవైపు కేసు కీలక దశకు చేరిన నేపథ్యంలో జత్వానీకి భద్రత కల్పించారు.

మరోవైపు ముంబయి నటి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి కాంతిరాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై సోమవారం న్యాయస్థానం విచారణ జరపనుంది. ముంబయి నటి కేసులో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని కాంతిరాణా ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. కుక్కల విద్యాసాగర్‌ విచారణతో జత్వానీ కేసు ఏ వైపు మలుపు తిరుగుతుందో, ఎందరి పేర్లు బయటికి వస్తాయోనని ఆసక్తి నెలకొంది.

అమెజాన్‌ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్‌ ఆఫర్‌.. భారీ తగ్గింపు!

ప్రముఖ ఈ-కామర్స్ సర్వీస్ అయిన అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ఈ నెల 27 నుంచి ప్రారంభించనుంది. సేల్‌లో వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి.

ఇప్పుడు కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై లభించే డిస్కౌంట్లు బయటకు వచ్చాయి. ఐఫోన్ 13 అత్యంత ఆకర్షణీయమైన తగ్గింపును వస్తుంది. ఈ నెలలో ఐఫోన్ 16 సిరీస్ విడుదలతో ఐఫోన్ 13 తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ 13 బేసిక్ మోడల్ రూ.37,999కి అందుబాటులో ఉంటుంది. తమ ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్న వారికి ఇది గొప్ప అవకాశం.

Samsung ప్రీమియం ఫోన్ S23

ఇక శాంసంగ్‌ ప్రీమియం ఫోన్ S23 అల్ట్రాపై కూడా ఈ సేల్‌లో భారీ తగ్గింపు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అద్భుతమైన కెమెరాతో ఉంది. అయితే ఈ ఫోన్‌ ప్రస్తుతం ధర రూ.85,000 వరకు ఉండగా, ఆఫర్‌లో భాగంగా రూ. 69,999.

ఈ శాంసంగ్‌ ఎస్‌ సిరీస్‌లో కొత్త మోడల్ రాకతో పాత మోడల్ ధర తగ్గింది. S24 సిరీస్ ఈ సంవత్సరం విడుదలైంది. శాంసంగ్‌ S24 సిరీస్ iPhone 16 సిరీస్‌కు పోటీగా మార్కెట్లో విడుదలైంది. అందువల్ల ఇది మునుపటి మోడల్ కంటే చౌకగా ఉంటుంది. Xiaomi 14, One Plus 12R, IQ Z9, Samsung S24, Honor 200 5G, Motorola Razr 50 Ultra వంటి వివిధ స్మార్ట్‌ ఫోన్‌లు ఆకట్టుకునే ఆఫర్లు ఉన్నాయి. వివిధ బ్యాంకు కార్డులపై భారీ తగ్గింపుతో వస్తున్నాయి.

రంకెలేస్తున్న ఒంగోలు గిత్తలు.. బాలినేని, దామచర్ల మధ్య మాటల యుద్ధం

ఒంగోలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి-సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ మధ్య గత కొన్నేళ్లుగా పొలిటికల్ వార్ నడుస్తోంది.

ఇటీవల బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించడంతో ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణిగినట్టేనని అంతా భావించారు. కానీ నేతలు మాత్రం తగ్గేదేలేదంటున్నారు. సయోధ్యకు చాన్సే లేదని సందేశమిస్తున్నారు.

బాలినేని జనసేనలోకి రావడాన్ని స్వాగతిస్తూ ఆయన అభిమానులు శనివారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. బాలినేని అభిమానులు పవన్ కల్యాన్‌, చిరంజీవి, టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై దామచర్ల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని తొలగించేందుకు ప్రయత్నించారు.

బాలినేని జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించడంపై దామచర్ల సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్నప్పుడు తనపై పెట్టిన అక్రమ కేసులను మర్చిపోలేదన్నారు. బాలినేని, ఆయన కుమారుడు చేసిన అవినీతిపై కేసులు పెట్టక తప్పదన్నారు. ఆ కేసుల నుంచి ఎవరు రక్షిస్తారో చూస్తామన్నారు దామచర్ల.

దామచర్ల వ్యాఖ్యలపై బాలినేని ఫైర్ అయ్యారు. తాను అవినీతికి పాల్పడ్డానన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ చంద్రబాబుకు లేఖ రాశానన్నారు. తనను కేసుల నుంచి పవన్ కల్యాణ్‌ కూడా కాపాడలేరంటూ దామచర్ల మాట్లాడటం తగదన్నారు.బాలినేని కూటమిలో చేరకముందే పరిస్థితి ఇలా ఉంటే.. ఫ్యూచర్ పాలిటిక్స్‌ ఎలా ఉంటాయో చూడాలి మరి.

చిన్నవయసులోనే గుండె ఎందుకు బలహీనమవుతుంది? పెరిగిన బైపాస్ సర్జరీలు

ఒకప్పుడు గుండె జబ్బులు వృద్ధులకు మాత్రమే వచ్చేవి. కానీ ఇటీవలి కాలంలో మన జీవన పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఒత్తిడి, కూర్చునే పని తీరు, తగ్గిన శారీరక శ్రమ కారణంగా యువతలో గుండె జబ్బులు రావడం మొదలయ్యాయి.

గత దశాబ్దంలో యువకులు గుండెపోటుతో మరణించారు. కేవలం ముప్పై ఏళ్లలోనే గుండె శస్త్రచికిత్స చేయించుకునే పరిస్థితి వస్తోంది. 30 నుంచి 35 ఏళ్లలోపు వారిలో బైపాస్ సర్జరీ చేయించుకునే వారి సంఖ్య పెరగగా, ఈ నిష్పత్తి 30 శాతానికి పెరిగింది. అయితే చిన్న వయసులోనే గుండె ఎందుకు బలహీనపడుతోంది? బైపాస్ సర్జరీ టైం ఎందుకు వస్తోంది. గతంలో 50, 60 ఏళ్లకే బైపాస్ సర్జరీ చేయించుకునేవారు. ఇప్పుడు ముప్ఫై ఏళ్లకే ఈ పరిస్థితి వస్తోంది. ఒక వేళ ఇన్సూరెన్స్ లేకుంటే కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది.

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడిన తర్వాత బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత లేదా గుండెపోటు ముప్పును నివారించడానికి వైద్యులు బైపాస్ సర్జరీని సిఫార్సు చేస్తారు. కొలెస్ట్రాల్ కూడా గుండెలోని సిరల్లో అడ్డంకిని కలిగిస్తుంది. రక్తం గడ్డకట్టడం వల్ల గుండెకు రక్త సరఫరా కూడా నిలిచిపోతుంది. అందువల్ల బైపాస్ సర్జరీల సంఖ్య గణనీయంగా పెరిగింది.

పెరిగిన గుండె వైఫల్యం రేటు:

చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా గుండె సంబంధిత వ్యాధుల రేటు కూడా పెరిగిపోయిందని రాజీవ్ గాంధీ ఆసుపత్రి కార్డియోగ్ విభాగానికి చెందిన డాక్టర్ అజిత్ కుమార్ తెలిపారు. గత మూడేళ్లలో ముప్పైలలో గుండెపోటు, గుండె వైఫల్యం రేటు గణనీయంగా పెరిగింది. అందువల్ల, చిన్న వయస్సులోనే బైపాస్ సర్జరీ చేయవలసి ఉంటుందని అజిత్ కుమార్ తెలిపారు.

మారుతున్న జీవనశైలి వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యపానానికి అలవాటుపడటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం బాగా పెరిగింది. అందుకే, ఇటీవల ముప్పై ఏళ్లలో గుండెపోటు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్ ప్రోగ్రామ్ హెడ్ కార్డియాక్ సైన్సెస్ డా. హేమంత్ మదన్ అన్నారు.

నిర్లక్ష్యం చేయకూడదు:

మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర కూడా గుండెపై పెద్ద ప్రభావం చూపుతుంది. దీని కారణంగా, గుండె జబ్బుల రేటు పెరిగింది. గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన లేదు. ఛాతీ నొప్పి తర్వాత అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడాన్ని ప్రజలు విస్మరిస్తారు. ప్రజలు గ్యాస్ లేదా అసిడిటీతో బాధపడుతున్నారు. అయితే దీన్ని విస్మరించరాదని ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రి కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ తరుణ్‌ కుమార్‌ తెలిపారు.

చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి రక్తపోటు కూడా కారణం. JAMA జర్నల్ 2021 అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు రక్తపోటు వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో 30 శాతం మంది తక్కువ వయస్సు గలవారు ఉన్నట్లు తేలింది.

గుండె జబ్బులను ఎలా నివారించాలి?

చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలి.
చెడు ఆహారపు అలవాట్లను మానుకోండి.
ఒత్తిడికి దూరంగా ఉండండి.
రోజూ వ్యాయామం చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

ఏపీకి మరో వానగండం.. దూసుకువస్తున్న అల్పపీడనం..

ఐఎండి సూచనల ప్రకారం రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో సోమవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు.

23 సెప్టెంబర్, సోమవారం

• పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం,కాకినాడ, తూర్పుగోదావరి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి మరియు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

24 సెప్టెంబర్, మంగళవారం

• పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

25 సెప్టెంబర్,బుధవారం

* కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం,
శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

పందెం కోడి కూర ఇలా చేశారంటే.. గిన్నెలు కూడా నాకేస్తారు..

పందెం కోడి అంటేనే సంక్రాంతి పండుగ గుర్తొస్తుంది. సంక్రాంతి పండగకు ప్రత్యేకంగా కోడళ్లను తయారు చేస్తూ ఉంటారు. వీటికి ఖరీదైన ఆహారం పెడుతూ పెంచతారు.

ఈ కోళ్లు కూడా చాలా రేటు పలుకుతాయి. పందెం కోడి రుచి ఇతర కోళ్ల రుచులకు రాదు. పందెం కోళ్లకు రుచి కూడా ఎక్కువే. ఈ కూరకు మసాలా పెట్టి వండితే.. ఆహా అంటారు. సాధారణ చికెన్ వండినట్టు ఈ కోళ్లను వండకూడదు. పందెం కోడి మాంసాన్ని ప్రత్యేకంగా వండాలి. దీనికి ఉండే రుచే వేరు. మరి పందెం కోడిని ఎలా వండుతారు? ఈ మాంసం వండటానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పందెం కోడి తయారీకి కావాల్సిన పదార్థాలు:

పందెం కోడి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, షాజీరా, జీలకర్ర, జీడిపప్పు, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఆయిల్.

పందెం కోడి తయారీ విధానం:

ఈ కూర వండటానికి ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. ఓ మిక్సీ జార్ తీసుకుని అందులో షాజీరా, జీలకర్ర, జీడిపప్పు, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొత్తిమీర నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకులు వేసి వేగాక.. షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పందెం కోడిని శుభ్రంగా క్లీన్ చేసుకుని.. ఉల్లిపాయల మిశ్రమంలో వేసుకోవాలి.

మాంసాన్ని బాగా మగ్గించాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓ పది నిమిషాలు ఉడికించాలి. ఇది బాగా వేగాక.. ముందుగా మిక్సీ చేసి పెట్టిన మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. ఇవి కూడా ఓ పది నిమిషాలు వేగాక.. అంతా కలిపి వాటర్ వేయాలి. ఇప్పుడు కుక్కర్ మూతకు విజిల్స్ పెట్టి.. 10 లేదా 11 విజిల్స్ అయినా తెప్పించాలి. అనంతరం ఆవిరి పోయాక.. మూత తీసి.. మళ్లీ ఒకసారి రుచి చూసుకుని ఏమన్నా తక్కువ అయితే వేసుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి మూత పెట్టాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పందెం కోడి సిద్ధం.

కర్ణాటక స్టైల్ వెజిటేబుల్ పులావ్.. లంచ్ బాక్స్‌కి బెస్ట్

పులావ్స్‌లో ఎన్నో రకాలు ఉంటాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లో చేసే స్టైల్ వంటలే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో చేసే వంటలు కూడా చాలా ఫేమస్. వాటిల్లో కర్ణాటక స్టైల్ వెజిటేబుల్ పులావ్.

ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే తక్కువ సమయంలో పూర్తి అవుతుంది. ఇందులో ఆరోగ్యాన్ని పెంచే ఎన్నో కూరగాయలు ఉపయోగిస్తారు. లంచ్ బాక్స్‌కి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా త్వరగా ఈ వంట చేసుకోవచ్చు. మరి ఈ కర్ణాటక స్టైల్ వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్ణాటక స్టైల్ వెజిటేబుల్ పులావ్‌కి కావాల్సిన పదార్థాలు:

బియ్యం, ఉప్పు, నెయ్యి, పులావ్ దినుసులు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీలకర్ర, బంగాళ దుంప, బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ. ఇలా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఉపయోగించవచ్చు.

కర్ణాటక స్టైల్ వెజిటేబుల్ పులావ్‌ తయారీ విధానం:

ముందుగా మిక్సీ జార్‌లోకి కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చి కొబ్బరి లేక పోతే ఎండు కొబ్బరిని నీటిలో నానబెట్టి వేసుకోవచ్చు. అనంతరం పులావ్ తయారు చేసేందుకు సరిపడా ఉండే పాత్ర తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. ఇందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆ తర్వాత పులావ్ దినుసుకు వేసి వేయించాలి. సువాసన వస్తుండగా పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసి ఫ్రై చేసి ఉల్లిపాయ, పచ్చి మిర్చి కూడా వేయాలి. ఇవి కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ ఫ్రై చేయాలి.

ఇది కూడా వేగాక.. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఓ ఐదు నిమిషాల తర్వాత నానబెట్టిన బియ్యం, సరిపడా నీటిని వేయాలి. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మధ్యలో చూసుకుంటూ ఉండాలి. పులావ్ అయిపోయాక కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 86% వరకు తగ్గింపు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలను అమెజాన్ ప్రకటించింది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్, ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. చూడండి, హెచ్పీ, శాంసంగ్, మరెన్నో టాప్ బ్రాండ్ల నుండి 86% వరకు తగ్గింపు పొందవచ్చు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు, కెమెరాలు, హెడ్ ఫోన్లు, సౌండ్ బార్లు వంటి వివిధ కేటగిరీల ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. ఈ సేల్ విస్తృత శ్రేణి ఉత్పత్తులపై 86% వరకు గణనీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది.

ప్రతీ ఒక్కరికీ ఏదో ఒకటి..

ఇప్పుడు ప్రతీ ఇంట్లో స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, హెడ్ ఫోన్స్, టాబ్లెట్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు నిత్యావసరమయ్యాయి. అవేమైనా మీ విష్ లిస్ట్ లో ఉంటే, వాటిని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 లో అద్భుతమైన డీల్స్ లో వాటిని పొందవచ్చు. అన్ని టాప్ బ్రాండ్స్ కు చెందిన లేటెస్ట్ అప్లయన్సెస్ ఈ సేల్ లో అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024: ల్యాప్ టాప్ లపై

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 లో హెచ్పీ, ఆసుస్, డెల్, లెనోవో వంటి టాప్ బ్రాండ్ల ల్యాప్ టాప్ లు, గేమింగ్ ల్యాప్ టాప్ లపై అద్భుతమైన డీల్స్ ఉన్నాయి. విద్యార్థి, ప్రొఫెషనల్, గేమర్.. అందరి అవసరాలకు తగిన ఆప్షన్స్ ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో, అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్స్ తో ఇవి లభిస్తాయి. అదనంగా, ఇప్పుడు అమెజాన్ సేల్ లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

బెస్ట్ సెల్లింగ్ టాబ్లెట్లపై 55% వరకు తగ్గింపు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 లో బెస్ట్ సెల్లింగ్ టాబ్లెట్లపై 55% వరకు తగ్గింపుతో అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. శామ్సంగ్, లెనోవో, ఆపిల్ వంటి టాప్ బ్రాండ్లు మంచి డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉన్నాయి. ఈ టాబ్లెట్లు శక్తివంతమైన ఫీచర్లు, అధునాతన సాంకేతికతను కలిగి ఉంటాయి. పాపులర్ మోడళ్లపై గణనీయమైన పొదుపుతో, ప్రముఖ బ్రాండ్ నుండి తక్కువ ధరకు టాబ్లెట్ పొందడానికి ఇది గొప్ప అవకాశం.
హెడ్ ఫోన్లు, ఇయర్ బడ్స్ పై 86 శాతం వరకు తగ్గింపు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 లో అమెజాన్ హెడ్ ఫోన్లు, ఇయర్ బడ్స్ సహా ఎలక్ట్రానిక్స్ పై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. సోనీ, బీఓఏటీ, జేబీఎల్ వంటి టాప్ బ్రాండ్లు ఆకట్టుకునే డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మీరు ప్రీమియం సౌండ్ క్వాలిటీ లేదా రోజువారీ ఉపయోగం కోసం చూస్తుంటే, ఇష్టమైన జతను తక్కువ ధరలో పొందడానికి ఇది మంచి సమయం.
యాక్షన్, ఇన్ స్టంట్ కెమెరాలపై 53% వరకు తగ్గింపు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 లో కెమెరాలపై గొప్ప డీల్స్ ను అమెజాన్ వెల్లడించింది. సోనీ, గోప్రో, ఫుజిఫిల్మ్ వంటి ప్రముఖ బ్రాండ్ల యాక్షన్, ఇన్స్టంట్ కెమెరాలపై 53 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. క్రీడలు లేదా అవుట్ డోర్ సాహసాల సమయంలో వేగంగా కదిలే క్షణాలను బంధించడానికి యాక్షన్ కెమెరాలు అనువైనవి, అయితే తక్షణ కెమెరాలు ఫోటోలను తక్షణమే ముద్రించడానికి వీలు కల్పిస్తాయి. డిస్కౌంట్ ధరలలో అధిక-నాణ్యత కెమెరాలను పొందడానికి ఈ ప్రారంభ డీల్స్ గొప్ప అవకాశాన్ని అందిస్తాయి. ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో ఈ ఆఫర్లను మిస్ అవ్వకండి.

స్పీకర్లపై 73% వరకు తగ్గింపు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (amazon great indian festival) 2024 కు ముందు స్పీకర్లపై అద్భుతమైన ప్రీ-డీల్స్ ను అమెజాన్ ప్రకటించింది. సోనీ, జేబీఎల్, బీఓఏటీ వంటి టాప్ బ్రాండ్ల స్పీకర్లపై 73 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మీరు పోర్టబుల్ స్పీకర్లు,హోమ్ ఆడియో సిస్టమ్స్ లేదా పార్టీ స్పీకర్ల కోసం చూస్తున్నా, వాటిని గొప్ప ధరలకు పొందడానికి ఇది సరైన సమయం. విశ్వసనీయ బ్రాండ్లు నమ్మశక్యం కాని డిస్కౌంట్లలో లభిస్తున్నాయి.
స్మార్ట్ వాచ్ లపై 83 శాతం వరకు తగ్గింపు

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024కు ముందు అమెజాన్ (amazon) స్మార్ట్ వాచ్ లపై అద్భుతమైన డీల్స్ ను ప్రకటించింది. యాపిల్ (apple), శాంసంగ్ (samsung), నాయిస్, బీఓఏటీ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన వివిధ రకాల స్మార్ట్ వాచ్ లపై 83 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు ఫిట్నెస్ ట్రాకింగ్, హెల్త్ మానిటరింగ్ లేదా స్టైలిష్ డిజైన్ల కోసం చూస్తున్నా, ఈ ప్రారంభ డీల్స్ గణనీయమైన తగ్గింపులతో టాప్-టైర్ స్మార్ట్ వాచ్ లను పొందడానికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తాయి
కీబోర్డ్, మౌస్ కాంబోలపై 82 శాతం వరకు భారీ తగ్గింపు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024కు ముందు కీబోర్డ్, మౌస్ కాంబోలపై భారీ డీల్స్ ప్రకటించింది. డెల్, హెచ్పీ, లాజిటెక్ వంటి టాప్ బ్రాండ్ల కాంబోలపై 82 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు విశ్వసనీయమైన ఆఫీస్ పరికరాలు లేదా అధిక-పనితీరు గేమింగ్ గేర్ కోసం చూస్తున్నా, డిస్కౌంట్ ధరలలో ప్రీమియం ఉత్పత్తులను పొందడానికి ఇది సరైన అవకాశం.

లెక్సస్ నుంచి మరో లగ్జరీ ఎంపీవీ లాంచ్; ఈ ఎల్ఎం 350హెచ్ ధర రూ.2 కోట్లు..

న్యూ జనరేషన్ లెక్సస్ ఎల్ఎమ్ 350 హెచ్ ను భారత్ లో లాంచ్ చేశారు. ఈ లగ్జరీ ఎంపీవీ బుకింగ్స్ భారతదేశంలో గత సంవత్సరమే ప్రారంభమయ్యాయి. ఇది విమానం ఫస్ట్ క్లాస్ సీటు తరహాలో చాలా సౌకర్యవంతమైన క్యాబిన్ తో వస్తుంది.

లెక్సస్ ఇండియా సరికొత్త ఎల్ఎం 350హెచ్ లగ్జరీ ఎంపీవీ ని భారతదేశంలో విడుదల చేసింది. కొత్త లెక్సస్ ఎల్ఎమ్ 350 హెచ్ ఏడు సీట్లు, నాలుగు సీట్ల ఎంపికలలో వస్తుంది, దీని ధర వరుసగా రూ .2 కోట్లు, 2.5 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). కొత్త తరం ఎల్ఎమ్ 350 హెచ్ కోసం బుకింగ్స్ గత సంవత్సరం భారతదేశంలో ప్రారంభమయ్యాయి. ఈ లెక్సస్ ఇండియా ఎల్ఎం 350హెచ్ లగ్జరీ ఎంపీవీ విలాసవంతమైన, చాలా సౌకర్యవంతమైన క్యాబిన్ తో వస్తుంది.

ఫ్యూచరిస్టిక్ స్టైలింగ్ తో..

లెక్సస్ ఎల్ఎమ్ 350 హెచ్ తన మూలాలను టయోటా వెల్ ఫైర్ తో పంచుకుంటుంది. టయోటా వెల్ ఫైర్ రూ .1.2 కోట్లు (ఎక్స్-షోరూమ్) ధరతో రిటైల్ అవుతుంది. ఈ రెండు మోడళ్లు కూడా జిఎ-కె మాడ్యులర్ ప్లాట్ ఫామ్ పై ఆధారపడి ఉన్నాయి, అయితే లెక్సస్ దాని ఫ్యూచరిస్టిక్ స్టైలింగ్ తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. లెక్సస్ ఎల్ఎమ్ 350 హెచ్ భారీ స్పిండిల్ గ్రిల్ చుట్టూ పదునైన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, నిలువుగా అమర్చిన ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. వెనుక భాగంలో క్యాబిన్ స్పేస్ ను గరిష్టంగా పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బాక్సీ డిజైన్ కు ఎల్ఈడీ టెయిల్ లైట్ ను డిజైన్ చేశారు.
ఎల్ఎమ్ అంటే ‘లగ్జరీ మూవర్’ అని అర్థం

ఎల్ఎమ్ పేరు ‘లగ్జరీ మూవర్’ అని అర్థం. నాలుగు సీట్ల కాన్ఫిగరేషన్ లో ముందు, వెనుక ప్రయాణీకుల మధ్య విభజన ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ స్టైల్ రెక్లైనర్ సీట్లు, 23 స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, పిల్లో స్టైల్ లో హెడ్ రెస్ట్ లు, రిఫ్రిజిరేటర్, 48 అంగుళాల టెలివిజన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోల్డ్ అవుట్ టేబుల్స్, హీటెడ్ ఆర్మ్ రెస్ట్స్, యూఎస్బీ పోర్ట్స్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్లు, రీడింగ్ లైట్లు, వ్యానిటీ మిర్రర్లు, గొడుగు హోల్డర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సచివాలయ ఉద్యోగుల బదిలీలకు మళ్లీ బ్రేక్, సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు రిలీవ్ చేయొద్దని ఆదేశాలు

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు మళ్లీ బ్రేక్ పడింది. ఈ నెల 26 వరకు బదిలీలు నిలిపి వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పూర్తయ్యే వరకు బదిలీలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు స‌చివాల‌య ఉద్యోగుల‌ను రిలీవ్ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మ‌ళ్లీ స‌చివాల‌య ఉద్యోగుల బ‌దిలీలు నిలిచి పోయాయి. ఇప్పటికే ఒక్కసారి వాయిదా ప‌డిన స‌చివాల‌య ఉద్యోగుల బ‌దిలీ, తాజాగా మ‌రోసారి బ‌దిలీల ప్రక్రియ ఆగిపోయింది.

గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగ‌ుల్లో బ‌దిలీలైన వారిని సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు రిలీవ్ చేయొద్దని గ్రామ, వార్డు స‌చివాల‌య శాఖ డైరెక్టర్ శివ‌ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. “ఇది మంచి ప్రభుత్వం” పేరుతో ఈనెల 20 నుంచి 26 వ‌ర‌కు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేప‌థ్యంలో స‌చివాల‌య ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం వంద రోజుల్లో చేప‌ట్టిన అభివృద్ధి కార్యక్రమాల‌కు సంబంధించిన స్టిక్కర్లు, క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేయాల‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల‌ను రిలీవ్ చేస్తే ప్రభుత్వ కార్యక్రమానికి ఇబ్బంది క‌లుగుతోంద‌ని అన్నారు. అందువ‌ల్ల ఈనెల‌ 26 వ‌ర‌కు ఆయా ఉద్యోగుల‌ను రిలీవ్ చేయొద్దని జిల్లా క‌లెక్టర్లు, జిల్లా జీఎస్‌డ‌బ్ల్యూఎస్ డిపార్టుమెంట్ అధికారుల‌కు ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో 15,004 గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి బ‌దిలీల‌కు కార్యాచ‌ర‌ణ‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆగ‌స్టులో ప్రారంభించింది. ఈ మేర‌కు వెబ్‌సైట్‌లో ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ (జీవీడ‌బ్ల్యూవీ) & గ్రామ స‌చివాల‌యం, వార్డు స‌చివాల‌యం (వీఎస్‌డ‌బ్ల్యూఎస్‌) డిపార్ట్‌మెంట్‌తో సహా కొన్ని విభాగాల ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం ఆగస్టు19 నుంచి ఆగస్టు 31 వరకు నిషేధాన్ని సడలించింది. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లపై మార్గదర్శకాలు, సూచనలను జారీ చేసింది.

ఆన్‌లైన్ అప్లికేష‌న్ దాఖ‌లకు చివ‌రి తేదీని ఆగ‌స్టు 27గా నిర్ణయించింది. స‌చివాల‌య ఉద్యోగులు చేసుకున్న ద‌ర‌ఖాస్తుల‌ను ఆగ‌స్టు 28న అధికారులు డౌన్‌లోడ్ చేసి, ప్రాధాన్యత కింద సీనియారిటీ ప్రకారం చేయాల‌ని సూచించింది. అలాగే కౌన్సిలింగ్ ఆగస్టు 29, 30 తేదీల్లో ఆయా జిల్లా క‌లెక్టర్ కార్యాల‌యాల్లో జ‌రిగాయి. ఆగ‌స్టు 30 లోగా ఉద్యోగి ఫిర్యాదులు ఏవైనా ఉంటే పూర్వ జిల్లా కలెక్టర్ ముందు దాఖలు చేయవచ్చని మార్గద‌ర్శకాల్లో పేర్కొంది. దానిక‌నుగుణంగా ప్రక్రియ మొత్తం పూర్తి అయింది. అయితే కౌన్సింగ్ పూర్తి అయిన ఉద్యోగుల‌ను ఆయా ప్రాంతాల‌కు బ‌దిలీ చేయాల్సి ఉంది. అందులో భాగంగానే ముందుగా వారు ప్రస్తుతం ప‌ని చేసే ప్రాంతంలో రిలీవ్ చేయాలి. కానీ చివ‌రి ప్రక్రియ మాత్రం ఆగిపోయింది.
బదిలీలకు మళ్లీ బ్రేక్

సెప్టెంబ‌ర్ 1 నుంచి బ‌దిలీ అయిన స‌చివాల ఉద్యోగులు వారి పోస్టింగ్ ప్రాంతంలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలు అప్పుడు తాత్కాలికంగా వాయిదా వేశారు. సెప్టెంబరులో పింఛన్ల పంపిణీ దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారిని రిలీవ్ చేయొద్దని కలెక్టర్లకు సచివాలయాల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఆగ‌స్టు 31న, సెప్టెంబర్ 2న పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం అప్పుడు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చాకే వీరి బదిలీల పక్రియను చేపట్టాలని కలెక్టర్లకు‌ సూచించింది. దీంతో సచివాలయ ఉద్యోగుల బదిలీ తాత్కాలికంగా బ్రేక్ అయింది.

మ‌ళ్లీ ఇప్పుడు కూట‌మి ప్రభుత్వం వంద రోజుల పాల‌న‌పై కార్యక్రమం సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు రిలీవ్ చేయొద్దని ఆదేశించింది. దీంతో రెండు సార్లు స‌చివాల‌య ఉద్యోగుల బ‌దిలీలు వాయిదా ప‌డ్డాయి. అయితే సెప్టెంబ‌ర్ 26 త‌రువాత మ‌ళ్లీ అక్టోబ‌ర్ నెల పెన్షన్లు పంపిణీ వ‌స్తుంది. దీంతో అప్పుడు కూడా వాయిదా పడే అవ‌కాశాలు ఉన్నాయి. అక్టోబ‌ర్ నెల పెన్షన్లు పంపిణీ పూర్తి అయిన త‌రువాతే బ‌దిలీ అయిన ఉద్యోగుల‌ను రిలీవ్ చేసే అవ‌కాశం ఉంది.

Health

సినిమా