Tuesday, December 16, 2025

వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో మరో కీలక నేత.. ఆ నియోజకవర్గంలో దిక్కెవరు?

వైసీపీ నుంచి వేరే పార్టీలోకి వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను వైసీపీకి రాంరాం చెప్పగా.. తాజాగా మరో నేత పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ నియోజవర్గంలో పార్టీకి దిక్కెవరు అనే చర్చ జరుగుతోంది.

గ్రంధి శ్రీనివాస్.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేత. అందుకు కారణం 2019 ఎన్నికల్లో ఆయన పవన్ కళ్యాణ్‌పై గెలవడమే. అలాంటి నేత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. బయట ఎక్కడా కనిపించడం లేదు. అటు పార్టీలోనూ యాక్టివ్‌గా లేరనే టాక్ ఉంది. దీంతో గ్రంధి శ్రీనివాస్ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తే.. భీమవరం నియోజకవర్గంలో పార్టీకి దిక్కెవరు అనే చర్చ నడుస్తోంది.

గ్రంధి అసంతృప్తి..

గ్రంధి శ్రీనివాస్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పుడే కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా శ్రీనివాస్ అసంతృప్తితో రగిలిపోయారని చెబుతున్నారు. అందుకు కారణం మంత్రి పదవేనట. పవన్ కళ్యాణ్‌పై గెలిచిన తనకు మంత్రి పదవి ఇస్తారని గ్రంధి శ్రీనివాస్ ఆశించారు. కానీ.. రాలేదు. రెండో దఫా అయినా వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అప్పుడు కూడా రాలేదు. దీంతో ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వెళ్లగక్కినట్టు తెలిసింది.

‘ఇంత డబ్బు, సమయం ఖర్చు చేసి పవన్ కళ్యాణ్‌పై గెలిచాను. నాకే మంత్రి పదవి ఇవ్వలేదు. కనీసం పార్టీలో గౌరవం లేకుండా పోయింది. నా మాట కొందరు అధికారులు వినడం లేదని చెప్పాను. వారిని కూడా మార్చలేదు. భీమవరం వైసీపీలో వేరే ప్రాంతాల వారి పెత్తనం పెరిగిపోయింది. ఎవ్వరి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీలో ఉండటం అవసరమా’ అని గ్రంధి శ్రీనివాస్ 2024 అసెంబ్లీ ఎన్నికల ముందే తన సన్నిహితులతో అన్నట్టు తెలిసింది.

పార్టీలోని కీలక నేతలు గ్రంధికి సర్ధిచెప్పి 2024 ఎన్నికల్లో నిలబెట్టారు. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి గ్రంధి ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఇటీవల జగన్ పశ్చిమగోదావరి జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశానికి కూడా గ్రంధి శ్రీనివాస్ రాలేదు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారానికి బలం చేకూరింది. అటు క్యాడర్‌కు అందుబాటులో ఉండటం లేదనే టాక్ నడుస్తోంది.
టీడీపీలో చేరే అవకాశం..

ఒకవేళ గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేస్తే.. ఏ పార్టీలో చేరతారనే చర్చ కూడా జరుగుతోంది. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు గ్రంధీ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశం లేదని తెలుస్తోంది. ఆయన వెళ్దామని ట్రై చేసినా.. జనసైనికులు సపోర్ట్ చేసే అవకాశం లేదు. దీంతో గ్రంధి సైకిల్ ఎక్కుదామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ కూడా వీలుకాకపోతే.. బీజేపీలో చేరే అవకాశం అందని ఆయన ఫాలోవర్స్ కొందరు చెబుతున్నారు.

ప్రకాశం బ్యారేజీలో ఆపరేషన్‌ H సక్సెస్‌.. మూడో బోటును బయటకు తీసిన ఇంజనీర్లు

ప్రకాశం బ్యారేజీలో ఆపరేషన్‌ H సక్సెస్‌ అయ్యింది. విజయవంతంగా మూడో బోటును బయటకు తీశారు ఇంజనీర్లు. రెండు వారాలుగా బోటు వెలికితీత ప్రక్రియ కొనసాగింది. ఇక బ్యారేజీ మెయింటెన్స్‌ను ఇంజనీర్లు పరిశీలించనున్నారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకుపోయి.. మునిగిపోయిన మూడవ పడవను విజయవంతంగా తొలగించారు. 40 టన్నుల బరువున్న బోటు 69వ గేట్‌ను ఢీకొట్టింది. దానిని వెలికితీసేందుకు అధికారులు సమన్వయంతో ప్రయత్నించారు. రికవరీ ఆపరేషన్‌లో భాగంగా.. చిక్కుకుపోయిన పడవను ఇనుప గడ్డర్‌లతో మరో రెండు బోట్‌లకు కనెక్ట్ చేశారు. చైన్ పుల్లర్‌లను ఉపయోగించి దాన్ని పైకి లాగారు.

బోటును తొలుత బ్యారేజీ పైకి తరలించారు. అక్కడి నుంచి పున్నమి ఘాట్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న మొత్తం మూడు భారీ బోట్లను బీకేమ్ ఇన్‌ఫ్రాకు చెందిన ఇంజనీర్లు, అధికారులు విజయవంతంగా వెలికితీశారు. ఆపరేషన్‌ H పేరుతో చేపట్టిన ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందని అధికారులు వెల్లడించారు.

ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు ఈనెల 9న అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని నివేదికలో అనుమానాలు వ్యక్తం చేశారు. ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు.. కార్యకర్తలవని నిర్ధారించారు. ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు నివేదికలో వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్ ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునే వారని చెప్పారు. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించామని అధికారులు వెల్లడించారు.

ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను ఉషాద్రి, కర్రి నరసింహా స్వామి, గూడూరు నాగమల్లేశ్వరీలకు చెందినవిగా అధికారులు గుర్తించారు. ఉషాద్రికి చెందిన మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందని చెప్పారు. సహజంగా మూడింటిని కలిపి కట్టరని నివేదికలో వివరించారు. తమ బోట్లతో పాటు సమీపంలోని మరో రెండింటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2న తెల్లవారుజామున 3 గంటల సమయంలో 5 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టినట్టు నివేదికలో వివరించారు. అవి గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్‌లకు కాకుండా బ్యారేజీ పిల్లర్లను బలంగా ఢీకొడితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదన్నారు.

ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న ఘటనపై శుక్రవారం మాజీ సీఎం జగన్ కూడా స్పందించారు. విజయవాడను వరదలు ముంచెత్తడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. వరదల సమయంలో ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. వారి దృష్టిని మరల్చడానికి బోట్ల డ్రామా తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే బోట్ల అంశాన్ని వాడుకున్నారని జగన్ వ్యాఖ్యానించారు.

ఏడుకొండలవాడా క్షమించు, తిరుమల లడ్డూ వ్యవహారంపై పవన్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల వికృత చర్యల ఫలితంగా తిరుమల లడ్డూ ప్రసాదం అపవత్రమైందని పవన్ అన్నారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. ఏడుకొండలవాడా క్షమించు అని ఎక్స్ లో ట్వీట్ పెట్టారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని పవన్ కల్యాణ్ ఆవేదన చెందారు. జంతు అవశేషాలతో మలినమైందన్నారు. ఈ పాపాన్ని ముందుగా పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం అన్నారు.

లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని పవన్ అన్నారు. అపరాధ భావానికి గురైందన్నారు. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న తనకు ఇటువంటి చర్య తన దృష్టికి రాకపోవడం బాధించిందన్నారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అన్నారు. అందులో భాగంగా తాను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

“సెప్టెంబర్ 22, 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. దేవదేవా… నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటాను”- పవన్ కల్యాణ్
తీవ్ర క్షోభకు గురయ్యా

భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తన బాధేమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం అని ఆవేదన చెందారు. నాటి పాలకులకు భయపడి నోరు విప్పకుండా ఉండిపోయారా? అనిపిస్తోందన్నారు.

వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధమైన చర్యలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసిందన్నారు. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే సమయం ఆసన్నమైందన్నారు. ధర్మో రక్షతి రక్షితః అంటూ ట్వీట్ చేశారు.
తిరుమలలో మూడు రోజుల పాటు సంప్రోక్షణ యాగం

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కల్తీ నెయ్యి శ్రీవారి ప్రసాదంలో వినియోగించారని కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అపచారం కారణంగా సంప్రోక్షణకు శ్రీకారం చుట్టింది.

తిరుమలలో మూడు రోజుల పాటు మహా శాంతియాగం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి ఆనంద నిలయంలో మహా శాంతియాగం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహించనున్నారు. ఆ యాగంలో వేద పండితులతోపాటు రుత్వికులు పాల్గొనున్నారు.

జాబ్ సెర్చ్‌లో ఉన్నారా? కెనరా బ్యాంక్‌లో 3000 జాబ్స్ రెడీ.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.

బ్యాంక్ జాబ్స్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. మంచి జీతం, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు, అన్నిటికి మించి సెలవులు ఎక్కువగా ఉండడంతో బ్యాంక్ జాబ్స్ కు డిమాండ్ ఎక్కువ. బ్యాంక్ కొలువు సాధించడమే లక్ష్యంగా ఏళ్లకేళ్లు ప్రిపేర్ అవుతుంటారు. గంటలు గంటలు సన్నద్ధమవుతూ పుస్తకాలతో కుస్తీపడుతుంటారు. ఇటీవల ప్రముఖ బ్యాంకుల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ బ్యాంక్ కెనరా బ్యాంక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఏకంగా 3000 జాబ్స్ ను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ పోస్టులకు అర్హులు ఎవరంటే?

కెనరా బ్యాంక్ అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. మెరిట్ లిస్ట్, డాక్యూమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 15 వేలు అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 4 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

మొత్తం అప్రెంటిస్‌షిప్‌ ఖాళీలు: 3,000
అర్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:

01.09.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

మెరిట్ లిస్ట్, డాక్యూమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

స్టైఫండ్:

ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 15 వేలు అందుకోవచ్చు.

శిక్షణ కాలం:

ఒక సంవత్సరం.

దరఖాస్తు ఫీజు:

రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం తేదీ:

21-09-2024

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:

04-10-2024

హానర్ నుంచి బడ్జెట్ ధరలో సూపర్ స్మార్ట్ ఫోన్! సేల్ ఎప్పుడంటే?

హానర్ కంపెనీ తాజాగా తన లేటెస్ట్ 200 Lite 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసింది. హానర్ 200 సిరీస్ నుంచి బడ్జెట్ ధరలో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను లాంచ్ ఆఫర్లతో అందించింది కంపెనీ. అంతేగాక ఈ ఫోన్ లో ఆకట్టుకునే ఫీచర్స్ ని కూడా అందించింది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. హానర్ ఈ ఫోన్ ను 6.78mm మందంతో చాలా స్లీక్ డిజైన్ తో తయారు చేసింది. ఈ ఫోన్ కేవలం 166 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ 200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.7 అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది FHD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ హానర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ SGS 5 స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ 108MP మెయిన్ + 5MP వైడ్ & డెప్త్ + 2MP మ్యాక్రో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే 50MP సెల్ఫీ కెమెరా కూడా దీనికి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ HDR ఫోటోలు ఇంకా 1080p వీడియోలకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ తో మనం AI వైడ్ సెల్ఫీ లను కూడా దిగవచ్చని హానర్ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ డైమెన్సిటీ 6080 5జి చిప్ సెట్ తో వస్తుంది. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఏకంగా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే.. ఇది 4500 mAh బ్యాటరీ, 35W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

హానర్ కంపెనీ తన లేటెస్ట్ 200 Lite 5G స్మార్ట్ ధర విషయానికి వస్తే.. హానర్ ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరకు అందిస్తుంది. అయితే, ఈ ఫోన్ ను SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు ఏకంగా రూ. 2,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 15,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. లేదా explorehonor.com నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలింపు

గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న అంశం ఏదైనా ఉందంటే అది జానీ మాస్టర్ కేసుకు సంబంధించినదే. టాప్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పర్చుకున్న జానీ లైంగిక ఆరోపణలతో చిక్కుల్లో పడ్డారు. జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసిన ఓ మహిళ జానీపై తనను లైంగికంగా వేధించాడని, పలుమార్లు అత్యాచారం చేశాడని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌గా జీరో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి నార్సింగికి బ‌దిలి చేశారు. అత‌డిపై అత్యాచారం, పోక్సో యాక్ట్ కింద కేసు న‌మోదు చేశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం రేగింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీ కోసం సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. పలు ప్రాంతాల్లో వెతికిన పోలీసులు అతడిని గోవాలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించిన పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ జరిపినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత జానీ మాస్టర్ ను ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. విచారణ చేపట్టిన కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 03 వరకు జానీకి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు జానీని చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా జానీకి రిమాండ్ విధించడంపై అతని భార్య సుమలత స్పందించింది. కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

అంతేకాదు జానీపై వచ్చిన ఆరోపణలపై స్ట్రాంగ్ గా స్పందించింది జానీ భార్య సుమలత. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై మండిపడింది. 16 ఏళ్లప్పుడు రేప్ జరిగిందనడానికి ప్రూఫ్స్ ఏంటి? మైనర్ గా ఉన్నప్పుడు అత్యాచారం జరిగితే ఇంతకాలం మౌనంగా ఎందుకున్నట్టు అని ప్రశ్నించింది. అంతకు ముందు చాలా షోలు చేసింది కదా వాళ్లతో ఎఫైర్స్ లేవని గ్యారంటీ ఏంటి? ఆ అమ్మాయికి మిగతా కొరియోగ్రాఫర్స్ కు ఎఫైర్స్ ఉన్నాయని సుమలత స్పష్టం చేసింది.

లైంగికంగా వేధించాడని చెబుతున్నది.. మరి జానీ మాస్టర్ దగ్గర పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్న అని ఆ అమ్మాయి స్మైలీ ఫేస్ తో ఎలా చెప్పింది అని సుమలత ప్రశ్నించింది. సెక్సువల్ హరాష్ మెంట్ చేశాడని నిరూపిస్తే జానీని వదిలేసి వెళ్తా అంటూ సవాల్ విసిరింది. నేషనల్ అవార్డు వచ్చిన తరువాత జానీ మాస్టర్ ను కావాలని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. జానీని ఎదగకుండా చేసేందుకే ఇలా కుట్రలు పన్నుతున్నారని చెప్పుకొచ్చారు.

సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి 1.90 లక్షల బోనస్

దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయంటే చాలు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు బోనస్ ల కోసం చూస్తుంటారు. ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా తమ ఉద్యోగులకు బోనస్ లు అందిస్తుంటాయి. కంపెనీల ఉన్నతిలో భాగమైన ఉద్యోగస్తులకు లాభాలను పంచిపెడుతుంటాయి. కొన్ని కంపెనీలు కొంత మొత్తాన్ని బోనస్ గా ఇస్తుంటాయి. మరికొన్ని కంపెనీలు కార్లు, బైక్ లు ఇతర విలువైన వస్తువులను బోనస్ గా ఇస్తుంటాయి. ఇక మరికొన్ని రోజుల్లో దసరా పండుగ రానున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు తీపికబురును అందించింది. కార్మికులకు దసరా కానుకను ప్రకటించింది. ఏకంగా ఒక్కొక్కరికి రూ. లక్షా 90 వేల బోనస్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది.

సింగరేణి కార్మికులకు ముందుగానే దసరా పండగ వచ్చేసింది. రేవంత్ సర్కార్ కార్మికులకు భారీగా బోనస్ ను ప్రకటించింది. ఏకంగా రూ. 796 కోట్లను బోనస్ గా అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఒక్కో సింగరేణి కార్మికుడికి సగటున రూ.1.90 లక్షల బోనస్​ అందనుంది. గతేడాది కంటే రూ.20 వేలు అదనంగా సింగరేణి కార్మికులకు బోనస్​గా అందనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కార్మికుల కుటుంబాల్లో సంతోషం వెల్లువిరిసింది. కార్మికుల ఇళ్లలో ముందుగానే దసరా సంబురాలు మొదలయ్యాయి.

సింగరేణి కార్మికులతో పాటు ఒప్పంద ఉద్యోగులకు కూడా బోనస్​ను ప్రభుత్వం ప్రకటించింది. సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకూ బోనస్‌ అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఒప్పంద కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.5 వేలు బోనస్​ అందించనున్నది. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం రూ.4,701 కోట్లు కాగా, ఆ లాభాల్లో 33 శాతాన్ని ప్రభుత్వం బోనస్​గా ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది కార్మికులకు లాభం చేకూరనున్నది.

సెన్సేషనల్ రికార్డ్ సృష్టించిన Honda Activa! జనాలు ఎందుకు దీన్ని ఎగబడి కొంటున్నారు?

హోండా యాక్టివా స్కూటర్ దేశంలో మంచి ప్రజాదరణ పొందింది. ఈ స్కూటర్ ఏకంగా రెండు దశాబ్దాల నుంచి ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో సర్రున దూసుకుపోతుంది. సేల్స్ లో రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక ఇప్పటికీ సేల్స్‌లో ఈ స్కూటర్ నెంబర్ వన్‌గా కొనసాగుతుందంటే దీని క్రేజ్ ఏంటో రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇదింతలా ఫేమస్ అవ్వడానికి కారణం దీని ఫీచర్లు. ఇంకా దీని రైడింగ్ కంఫర్ట్, అందరిని ఆకట్టుకునేల డిజైన్ చెయ్యడంతో జనాలు హోండా యాక్టివాకి బ్రహ్మ రథం పడుతున్నారు. పైగా మన నిత్యవసరాల నుంచి భారీ పేలోడ్ పవర్ ఉన్న పనుల వరకు హోండా యాక్టివా అదిరిపోయే పర్ఫామెన్స్ అందిస్తుంది. దీంతో జనాలు ఈ స్కూటర్ ని ఎగబడుడి కొంటున్నారు.

తాజాగా ఈ స్కూటర్ ఓ రికార్డుని సృష్టించింది. సౌత్ ఇండియా స్టేట్స్ అయిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, పుదుచ్చేరి ఇంకా అండమాన్ & నికోబర్లో ఈ స్కూటర్ మొత్తం 10 మిలియన్ (1 కోటి) యూనిట్ల అమ్మకాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.హోండా కంపెనీ అందించే సర్వీస్‌ వల్ల కూడా ఈ స్కూటర్ యమా పాపులర్ అయ్యింది. ప్రతి నెల ఈ స్కూటర్ తన అద్భుతమైన సేల్స్ తో హోండా కంపెనీకి లాభాల వర్షాన్ని కురిపిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ స్కూటర్ కచ్చితంగా మరెన్నో రికార్డులు క్రియేట్ చేస్తుందనే నమ్మకంతో కంపెనీ ఉంది. ఇక దీని ప్రారంభ ధర విషయానికి వస్తే.. రూ. 78,285(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇక ఖరీదైన వేరియంట్ ధర రూ.84,285(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

ఈ స్కూటర్లో స్మార్ట్ కీ, స్మార్ట్ సేఫ్ (యాంటీ థెఫ్ట్ ఫంక్షన్) ఫీచర్లు ఉన్నాయి. ఇంకా స్కూటర్‌ను ఈజీగా గుర్తించే ఫీచర్, బయట ఫ్యూయల్ క్యాప్, అల్లాయ్ వీల్స్ వంటివి కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ 109.51 సీసీ ఫోర్-స్ట్రోక్ ఇంజిన్ కలిగి ఉంటుంది. దీని పవర్ విషయానికి వస్తే.. పవర్ యూనిట్ 7బీహెచ్‌పీ శక్తిని, 8.90ఎన్‌ఎం మాక్సిమం టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక భాగంలో 3 స్టేజస్ అడ్జస్ట్మెంట్ సస్పెన్షన్‌ ఉంటుంది.

వెస్ట్రన్ రైల్వేలో 5 వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. మీరూ ట్రై చేయండి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. రాత పరీక్ష లేకుండానే జాబ్ కొట్టొచ్చు. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు. ఇటీవల రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. వేల సంఖ్యలో జాబ్స్ భర్తీ చేస్తున్నారు. తాజాగా వెస్ట్రన్ రైల్వే నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఏకంగా 5 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి వేతనం అందుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరంటే?

రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి వెస్ట్రన్ రైల్వే పరిధిలోని డివిజన్/ వర్క్ షాప్ లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 5,066 ఖాళీలను భర్తీ చేయనున్నది. ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్ఏఏ, ఎలక్ట్రీషియన్, వైర్ మ్యాన్, తదితర ట్రేడులలో ఈ జాబ్స్ ను భర్తీ చేయనున్నారు. ఒక సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ పాసై ఉండాలి. 15-24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 22 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 5066
అర్హత:

అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ పాసై ఉండాలి.

వయోపరిమితి:

15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక ప్రక్రియ:

టెన్త్, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

23-09-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

22-10-2024

చరిత్ర సృష్టించిన జైస్వాల్.. 51 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ఓపెనర్

టీమిండియాలో రికార్డులు అనగానే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీనో లేదా కెప్టెన్ రోహిత్ శర్మనే అందరికీ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఇప్పటి టీమ్​లో బ్యాటింగ్​లో మోస్ట్ రికార్డ్స్ వీళ్ల పేరు మీదే ఉన్నాయి. వరల్డ్ క్రికెట్​లో ఎన్నో అన్​బ్రేకబుల్ రికార్డ్స్​ను ఈ ఇద్దరూ బ్రేక్ చేశారు. అయితే వీళ్ల దారిలోనే వెళ్తున్నాడో యంగ్​స్టర్. టీమిండియాలో ఛాన్స్ దొరికిన ప్రతిసారి అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్నాడు. ఎన్నో పాత రికార్డులకు పాతర పెడుతున్నాడు. తాజాగా మరో పాత రికార్డు బూజు దులిపాడు. అతడే యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్ట్​లో అతడు చరిత్ర సృష్టించాడు. 51 ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును అతడు బద్దలుకొట్టాడు. ఏంటా రికార్డు? అనేది ఇప్పుడు మనం చూద్దాం..

డెబ్యూ మ్యాచ్​లోనే సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్.. 10 టెస్టుల్లోనే వెయ్యికి పైగా రన్స్ చేశాడు. తద్వారా బ్యాటింగ్ గ్రేట్ సునీల్ గవాస్కర్ పేరు మీద ఉన్న ఆల్​టైమ్ రికార్డ్​ను అతడు బ్రేక్ చేశాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్​లో జైస్వాల్ ఫెయిల్ అయ్యాడు. 17 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. అయితే విఫలమైనా గానీ ఈ ఇన్నింగ్స్​తో ఓ అరుదైన ఘతన సాధించాడు. కెరీర్​లో మొదటి పది టెస్టు మ్యాచుల్లో అత్యధిక రన్స్ చేసిన టీమిండియా క్రికెటర్​గా రికార్డు క్రియేట్ చేశాడు. సునీల్ గవాస్కర్ (978 పరుగులు) పేరిట ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు. 51 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును అతడు బద్దలుకొట్టాడు. అలాగే ఓవరాల్​ టెస్ట్ క్రికెట్​లో తొలి పది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్ల క్లబ్​లో చోటు సంపాదించాడు. ఈ లిస్ట్​లో ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డాన్ బ్రాడ్​మన్ (1446 పరుగులు) టాప్​లో ఉన్నాడు.

బ్రాడ్​మన్ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎవర్టన్ వీక్స్ (1125 పరుగులు), జార్జ్ హెడ్లీ (1102 పరుగులు) ఉన్నారు. వాళ్ల తర్వాత 1094 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు జైస్వాల్. ఇక, బంగ్లాదేశ్​తో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్​లో హాఫ్ సెంచరీతో మెరిసిన జైస్వాల్.. సెకండ్ ఇన్నింగ్స్​లో 10 పరుగులు చేసి నహీద్ రాణా బౌలింగ్​లో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (5) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్​కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ (17) కూడా రాణించలేదు. శుబ్​మన్ గిల్ (33 నాటౌట్), రిషబ్ పంత్ (12 నాటౌట్) మరో వికెట్ పడకుండా రెండో రోజును ముగించారు. భారత్ ప్రస్తుతం 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో 100 నుంచి 150 పరుగులు జోడిస్తే టీమిండియాను గెలవకుండా ఆపడం ఎవరి వల్లా కాదు. భారత్ జోరు చూస్తుంటే మూడు నుంచి మూడున్నర రోజుల్లోనే బంగ్లా కథ ముగించేలా ఉంది.

దుమ్ము దులపడానికి రెడీ అవుతున్న సరికొత్త Honda Unicorn

దేశంలో ఎక్కువమంది వాహనదారులు ఇష్టపడి కొనుగోలు చేసే బైక్ బ్రాండ్లలో ‘హోండా’ కంపెనీ ముందు వరసలో ఉంటుంది. మార్కెట్లో వేరే గట్టి పోటీ ఇస్తూనే కొత్త బైకులను లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా హోండా నుంచి వచ్చిన హోండా యూనికార్న్ కి మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ ఆకట్టుకునే బైక్ లలో ఇది కూడా ఒకటి. ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో ఎన్నో సంవత్సరాల నుంచి అద్భుతమైన ప్రజాదరణ పొందింది ఈ బైక్. ఇక ఈ నేపథ్యంలో హోండా కంపెనీ తన పాపులర్ బైక్ యూనికార్న్ ను అప్డేట్ చేసి లాంచ్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ హోండా యూనికార్న్ బైక్ ప్రస్తుతం కేవలం ఒకే వేరియంట్లో మాత్రమే సేల్ అవుతుంది.

హోండా కంపెనీ OBD-compliant వెర్షన్ లో దీన్ని లాంచ్ చేయనుంది. దీని ధర మార్కెట్లో రూ. 1,09,800 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుంది. ఇదిలా ఉంటే యూనికార్న్ బైకు మీద కంపెనీ ఏకంగా 10 సంవత్సరాల వారంటీ కూడా ఇస్తోంది. ఇందులో మూడేళ్లు స్టాండర్డ్ వారంటీతో పాటు మరో ఏడేళ్లు ఎక్స్‌టెండెడ్‌ వారంటీ కూడా కంపెనీ ఇస్తుంది. ఈ కొత్త హోండా యూనికార్న్ బైక్ 160 సీసీ ఇంజిన్ ద్వారా 13.27 Bhp పవర్, 14.28 ఎన్ఎమ్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. దీని ఇంజిన్ వచ్చేసి 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగి ఉంటుంది. అలాగే ఈ బైక్ కిక్ స్టార్టర్, సెల్ఫ్ స్టార్టర్ ఆప్షన్ లతో వస్తుంది. ఈ బైక్ 240 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 130 మిమీ రియర్ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది.

ఈ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ పోర్క్, వెనుక వైపు హైడ్రాలిక్ మోనోషాక్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది. ప్రారంభ దశలో హోండా యునికార్న్ బైక్ ఓన్లీ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ ఆప్షన్ లలో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఆ తరువాత ఇది పెర్ల్ సైరన్ బ్లూ కలర్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక రాబోయే కొత్త యునికార్న్ లో ఇంకా మార్పులు జరగనున్నాయి. ఇక ఈ బైక్ ఎలాంటి అప్డేటెడ్ ఫీచర్లతో వస్తుందో చూడాలి.

HYDలో భారీగా తగ్గిన ఇళ్లు ధరలు.. ఆ ఎఫెక్టే కారణం

సాధారణంగా ఇల్లు, స్థలం కొనాలని ప్రతిఒక్కరూ ఆశ పడుతుంటారు. అది కూడా హైదరాబాద్ వంటి మహానగరంలో కొనాలనేది చాలామంది డ్రీమ్.కానీ, నగరంలో ఇళ్లు కొనాలంటే చిన్న మాట కాదు. ఇక్కడ స్థలాలైనా, ఇళ్లులైనా లక్షల్లో కాదు, కోట్లలో ఉంటాయి. కనుక ఇళ్లు కొనుక్కోవాలనే డ్రీమ్ ను నేరవేర్చుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇలా కష్టపడిన మొత్తాన్ని దాచుకొనే, లేక లోన్ తీసుకొనే చాలామంది ఇళ్లు లేదా స్థలం కొంటుంటారు. అందుకే నగరంలో ఇళ్లు,స్థలాలకే కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా మంచి డిమాండ్, ఆదాయం ఉంటుంది. కానీ, తాజాగా నగరంలో ఎప్పుడు లేని విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బ తిన్నది. ముఖ్యంగా అమ్మకాలు,కొనుగోళ్లు ప్రక్రియ మాత్రమే కాకుండా.. ధరలు కూడా భారీగా తగ్గాయి. ఇంతకీ నగరంలో ఇళ్ల స్థలాలు తగ్గిపోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ తినడానికి కారణమేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నగరంలో గతకొన్ని రోజులుగా అక్రమదారులకు హైడ్రా ఏ స్థాయిలో హడలెత్తిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. నగరంలోని చెరువులు, కుంటు, ఎఫ్‌టీఎల్‌లు, బఫర్‌జోన్లు, నాలాలు, ప్రభుత్వ పార్కులు అని తేడా లేకుండా.. ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో సామన్యులు, ధనికులు అనే తేడా లేకుండా.. రూల్స్ భిన్నంగా ఉన్న అక్రమ నిర్మాణాలపై నిర్ధాక్ష్యిణ్యంగా కూల్చేస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు ఏ ప్రాంతంపై హైడ్రా కూల్చివేయడానికి వస్తుందనని అక్రమదారులకు గుండెల్లో గుబులు పుడుతంది. దీంతో నగరంలో ఏ స్థాలం కొనాలన్నా, ఏ ఇళ్లు కొనాలన్నా ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు.

ఎదుకంటే.. ఏ ఇళ్లు లేదా స్థలం ఎఫ్‌టీఎల్‌లు, బఫర్‌జోన్లలో ఉన్నాయో తెలియడం లేదనీ, ఒకవేళ ఆ స్థలాల్లో కొంటే.. హైడ్రా అక్రమంగా కొల్చేస్తుందని భయంతో నగరంలో ఇల్లు కొనాలంటే ఆసక్తి చూపించడం లేదు. దీంతో నగరంలో హైడ్రా ఎఫెక్ట్ తో.. ఇళ్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక నగరంలో ఈ కొనుగోలు, అమ్మకాలు ప్రకియ తగ్గిపోవడంతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పూర్తిగా దెబ్బ తిన్నది. అంతేకాకుండా.. నగరంలో పలు ప్రాంతాల్లోని ఇళ్లు, స్థలాల ధరలు కూడా తగ్గాయి. కనుక ఎవరైనా ఇళ్లు లేదా స్థలాలు కొనాలని ఆలోచనలో ఉంటే.. ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. ఒకవేళ నిజంగా కొనాలనుకునే వారు అన్నీ పర్మిషన్స్ ను సరిగ్గా చూసుకొని కొనుగోలు చేస్తే హైడ్రా నుంచి ఎటువంటి టెన్షన్, భయం అనేది ఉండదని చెప్పవచ్చు.

జానీ భార్యపై బిగుస్తున్న ఉచ్చు..! జైలుకి వెళ్లడం తప్పదా?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో రోజుకోక ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో జానీని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఈ ఇష్యూలో జానీ మాస్టర్ భార్యపై కూడా బాధితురాలు మొదట పోలిసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆ ఫిర్యాదులో.. బాధితురాలుకు ఆయేషా మతం మారి తన భర్తను పెళ్లిచేసుకోవాలని వేధించేదని, పలుమార్లు దాడి కూడా చేసి, బెదిరించేదని సదరు యువతి నార్సింగ్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక నిజమైతే భర్తలాగే ఆయేషా కూడా జైలుకి వెళ్లక తప్పదా..? ఆ వివరాలేంటో చూద్దాం.

జానీ మాస్టర్ భార్య ఆయేషా పై తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. అయోషా తాజాగా బాధితురాలి ఇంటికి వెళ్లి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని సమాచారం. ఈ కారణంతోనే.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైయ్యారని, ఆమెతో పాటు జానీ మాస్టర్ ఇద్దరు అసిస్టెంట్స్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఇందులో ఏదీ నిజం, ఏదీ అబ్ధం అనే విషయాలపై క్లారిటీ రాలేదు. కానీ, నిన్నటి వరకు ఒక వెర్షన్ మాట్లాడిన ఆయేషా, నేడు తను కూడా బాధితురాలికి దాడి చేయడానికి ప్రయత్నించిదనే కథనాలు వినిపిస్తుడంతో.. ఆమె కూడా నిందితురాలిగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ నిజంగా ఆయేషా బాధితురాలిని దాడి చేసేందుకు ప్రయత్నించినట్లయితే, ఆమె కూడా తన భర్త జానీలా కచ్చితంగా జైలుకు వెళ్లాల్సి ఉంటుదని సమాచారం వినిపిస్తోంది.

కానీ, ఈ విషయంలో జానీ మాస్టర్ భార్య ఇటీవలే ఓ మీడియా ఛానేళ్లతో మాట్లాడిన వివరాలు చూస్తే.. అయేషా ఆ అమ్మాయిని ఒక్కసారే కొట్టానని, నిజాలు ఒప్పుకోవాలని, అది కూడా నా భర్తను లాక్కోవాలని చూసే క్రమంలో నేను ఆమెను బెదిరించానని తెలిపింది. అంతేకాకుండా.. తన భర్త జానీ మాస్టర్ ను కావాలనే ఆ యువతి ట్రాప్ చేసిందని, ఇదొక హని ట్రాప్ అంటూ ఆమె ప్రేర్కొంది. అంతేకాకుండా.. జానీ అంటే ఆమెకు ముందు నుంచి ఇష్టమని, కావలనే ఆయనను ట్రాప్ చేసి, ఆయన దగ్గర లగ్జరీ లైఫ్ ను పొందాలనుకుంది. అందుకే ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేదని, కానీ,ఇప్పుడు కావాలనే ఆ అమ్మాయి, వాళ్ల అమ్మతో కలసి నా భర్తతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతుందని ఆమె తెలిపింది.

మరోవైపు నేడు (శనివారం) ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ని కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ వేయనున్నారు. పది రోజులపాటు కస్టడీకి కోరే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో ఆయన్ను విచారించేందుకు పోలీసులు కోర్టుకు వెళ్లనున్నారు. రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన 40పేజీల ఫిర్యాదుపైనా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కస్టడీ కోరనున్నారు. అలాగే మరోవైపు జానీ మాస్టర్‌పై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో ఆయన తరఫు న్యాయవాది బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించనున్నారు.

నాని సరిపోదా శనివారం మూవీ .. OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఈ వారం ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ గా అనిపించే సినిమాలు అంతగా లేకపోయినా పర్లేదు. ఎందుకంటే వచ్చే వారం అదిరిపోయే సినిమాలు వచ్చేస్తున్నాయి. వాటిలో ఒకటి రీసెంట్ గా థియేటర్స్ లో సూపర్ హిట్ కొట్టేసిన సరిపోదా శనివారం మూవీ. నాని కథల ఎంపిక ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటుంది. ఇక ఈ సినిమా కుడా అందులో భాగమే. ఆగష్టు 29న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. నాలుగు రోజుల్లోనే రూ.68 కోట్లు గ్రాస్ వసూలు సాధించింది. అప్పటివరకు వచ్చిన మీడియం బడ్జెట్ సినిమాల స్టాండర్డ్ ను.. సరిపోదా శనివారం మూవీ సెట్ చేసి.. హిట్ మూవీ అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని.. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎదో చూసేద్దాం.

నాని- వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో అంటే సుందరానికి మూవీ వచ్చింది. ఈ మూవీ కంటెంట్ బావున్నా కూడా ఎందుకో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీనితో ఈసారి ఎలా అయినా ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే.. సరిపోదా శనివారం తీశాడా అనే రేంజ్ లో ఈ మూవీ ఉంది. ఇక నానితో పాటు యస్.జె సూర్య నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ సీన్స్ , ఫైట్స్ ప్రతి ఒక్కటి ప్రేక్షకులను మెప్పించాయి. మొత్తానికి నాని మాస్ యాక్షన్ తో హిట్ కొట్టేసాడు. ఇక ఇప్పుడు ఈ మూవీ నెల లోపే ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 26 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు.. ఓటీటీ లో అసలు మిస్ కాకుండా చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో సూర్య(నాని) కి చిన్నప్పటినుంచి కోపం ఎక్కువ. తనకి తప్పు అనిపించి, వారిపై కోపం వస్తే ఎవరినైనా కొడుతూనే ఉంటాడు. ఈ క్రమంలో సూర్య తల్లి చనిపోతూ.. కోపానికి ఓ రోజు ఉండాలని.. సూర్య నుంచి ఒట్టు తీసుకుంటుంది. దీనితో సూర్య శనివారం మాత్రమే తన కోపాన్ని చూపిస్తూ.. మిగిలిన రోజులు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇక సిఐ దయ (యస్.జె సూర్య) సోకులపాలెం ప్రజలను ఎలాంటి కారణం లేకుండా టార్చర్ చేస్తూ ఉంటాడు. తన కోపాన్ని అక్కడ ప్రజల మీద చూపిస్తూ ఉంటాడు. ఎక్కడ అన్యాయం జరిగిన సహించని సూర్య కి ఈ విషయం తెలుస్తుంది. సూర్య సోకులపాలెం ప్రజలను ఏ విధంగా కాపాడాడు ? సూర్యకు ప్రియాంక మోహన్ కు ఎలాంటి పరిచయం ఏర్పడింది ? చివరకు ఏం జరిగింది ? ఇవన్నీతెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

డైరెక్ట్ గా OTTలోకి అభిషేక్ బచ్చన్ మూవీ ‘బి హ్యాపీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లోకి రావడం ఒకెత్తయితే.. డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చే సినిమాలు ఒకెత్తు. ఈ మధ్య కాలంలో నేరుగా ఓటీటీ లోకి వచ్చే సినిమాల సంఖ్య పెరిగిపోతుంది. వెండితెరపై అలరించిన నటీ నటులు ఓటీటీ ల వైపు అడుగులు వేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎంతో మంది నటి నటులు.. ఇలా ఓటీటీ లో వచ్చే సినిమాలతో , సిరీస్ లతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరో అమితాబ్ కూడా ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. రీసెంట్ గా ఆ మూవీకి సంబంధించిన పోస్టర్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. దానికి సంబంధించిన అప్ డేట్స్ ను చూసేద్దాం.

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సారి డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో అభిషేక్ బచ్చన్ సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఇక ఈ మధ్య కాలంలో దాదాపు కేవలం కంటెంట్ కు ప్రాధాన్యత ఉండే సినిమాలనే ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీ లో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా పేరు ‘బి హ్యాపీ’. తండ్రీ కూతుళ్ళ మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఉండబోతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమా డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఆయన కూతురు పాత్రలో ఇనాయత్ వర్మ నటించింది. వీరిద్దరూ ఆల్రెడీ ఓ సినిమాలో నటించారు. వీరితో పాటు.. నోరా ఫతేహీ, నాజర్, జానీ లీవర్, సంచిత్ చనాన, హర్లీన్ సేథీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు అక్టోబర్ లోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. దేశంలోనే అతి పెద్ద డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొనాలని ఇనాయత్ వర్మ కలలు కంటుంది. దీనితో ఆమె తండ్రి తనకు తోడుగా ఉండాలని భావిస్తాడు. దాని కోసం తండ్రి కూతుళ్లు ఇద్దరూ కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో వారికి ఎదురైన కష్టాలు ఏంటి ? వాటిని ఎలా అధిగమించి ముందుకు వెళ్లారు ? చివరికి అనుకున్నది సాధించారా లేదా ? అనేదే ఈ సినిమా కథ. స్టోరీ లైన్ చూస్తే.. ఈ మూవీలో డ్యాన్స్ ప్రధాన అంశంగా ఉండనుంది. మరి మూవీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం తెలుగు కంటెంట్ కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. కాబట్టి ఈ సినిమాను ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు.

రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్.. ఏకంగా రూ. 2 లక్షలు.. అర్హులు ఎవరంటే?

డబ్బు లేని కారణంగా చదువుకు దూరమవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. సరస్వతీ కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం లేక చదువుకోవాలనే ఆలోచనను ఆదిలోనే తుంచేసుకుంటున్నారు. ఏవో చిన్ని చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్ షిప్స్ అందిస్తున్నాయి. పలు ప్రైవేట్ సంస్థలు కూడా పేద విద్యార్థులు చదువుకునేందుకు ఉపకారవేతనాలను ఇస్తున్నాయి. పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుకునేందుకు.. వారి కలలను సాకారం చేసుకునేందుకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి మీరు కూడా డబ్బు లేని కారణంగా చదువులను కొనసాగించలేకపోతున్నారా? ఉన్నత చదువులు చదువుకోవాలన్న కోరిక బలంగా ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. మీలాంటి వారికి సాయం అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ రెడీ అయ్యింది.

రిలయన్స్ ఫౌండేషన్ విద్యార్థులకు తీపికబురును అందించింది. రిలయన్స్ ఫౌండేషన్ యూజీ స్కాలర్ షిప్ 2024-25 ద్వారా ఏకంగా రూ. 2 లక్షలు అందించేందుకు సిద్ధం అయ్యింది. మొత్తం 5వేల మంది విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను స్కాలర్ షిప్ పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. యువతను ఉన్నత విద్యవైపు ప్రోత్సహించడానికి, ఆర్థిక భారం లేకుండా చదువులను కొనసాగించడానికి ఈ స్కాలర్ షిప్స్ అందిస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ పేర్కొంది.

దరఖాస్తు చేసుకోదలిచిన విద్యార్థులు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ మీడియట్ పాసై ఉండాలి. 2024-25 అకాడమిక్ ఇయర్ లో ఫుల్ టైమ్ డిగ్రీ కోర్సు ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ. 15 లక్షలకు మించకూడదు. ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్, గతంలో విద్యార్థులు చూపిన అకాడమిక్ ప్రతిభ, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు మొత్తం రూ. 2 లక్షల స్కాలర్ షిప్ ను అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 6 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ అధికారిక వెబ్ సైట్ www.scholarships.reliancefoundation.org ను పరిశీలించండి. అప్లై చేసుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ మెయిన్ పేజీలో యూజీ అప్లికేషన్ పోర్టల్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ను వదులుకోకండి. రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తున్న స్కాలర్ షిప్ ను పొంది ఉన్నత చదువులు చదివి మీ కలలను సాకారం చేసుకోండి.

బడ్జెట్లో బెస్ట్ లగ్జరీ SUV కార్ కావాలా? అయితే వీటిపై ఓ లుక్కేయండి.

ప్రస్తుతం మార్కెట్లో లగ్జరీ ఎస్‌యూవీలకు మామూలు డిమాండ్ లేదనే చెప్పాలి. ఎందుకంటే వీటిని మనం తక్కువ బడ్జెట్‌లోనే కొనుగోలు చేసే అవకాశం ఉంది. పైగా ఇవి గ్రాండ్ లుక్‌ కలిగి ఉంటాయి. లగేజీ పెట్టుకోవడానికి సరిపడా మంచి స్పేస్ ఉంటుంది. ఇంకా అప్డేటెడ్ ఫీచర్లు ఉంటాయి. వీటన్నిటిని మించి వీటిలో పవర్ ఫుల్ ఇంజన్ ఉంటుంది. మీకు ఈ సెగ్మెంట్‌లో టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్లు ఉన్నాయి. ఈ కార్లు మంచి ఫీచర్లతో మాత్రమే కాకుండా అందుబాటు ధరలోనే వస్తాయి. మంచి మైలేజీని కూడా అందిస్తాయి. ఇక ఈ కాంపాక్ట్ SUV కార్ల ధర, మైలేజ్, ఫీచర్లు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నిస్సాన్ మాగ్నెట్.. మాగ్నైట్ అందమైన లగ్జరీ SUV. దీని డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ కారులో మంచి స్పేస్ ఉంటుంది. ఈ కార్ రెండు పెట్రోల్ ఇంజన్‌లతో వస్తుంది. దీని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే 70 bhp పవర్, 96 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే 97 bhp పవర్, 160 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.ఈ రెండు ఇంజన్లు కూడా 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఫిక్స్ చేసి ఉంటాయి. ఇక టర్బో పెట్రోల్ ఇంజన్‌లో అయితే మనకు సివిటి గేర్‌బాక్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ కారులో లగేజీ పెట్టుకోడానికి 336 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. సేఫ్టీ విషయంలో ఈ 4 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ కార్ లో EBD తో ABS, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర విషయానికి వస్తే.. ఇది రూ.6 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 20 కిలోమీటర్ల దాకా మైలేజ్ ఇస్తుంది.

టాటా పంచ్.. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడైన లగ్జరీ SUV ఇది. ఈ కార్ కి 90 డిగ్రీల ఓపెన్ డోర్స్ ఉన్నాయి. దీనిలో చాలా మంచి స్పేస్ ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 86 PS పవర్, 113 Nm టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ కలిగి ఉంటుంది. ఈ కార్ ఏకంగా 20.1 కిలోమీటర్లు దాకా మైలేజీని అందిస్తుంది. ఇందులో సేఫ్టీ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు EBD, ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉంటాయి. ఇందులో లగేజీని పెట్టుకోడానికి 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీని ఎక్స్-షో రూమ్ ధర వచ్చేసి రూ. 6.13 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్.. ఇది భారతదేశంలో బాగా పాపులారిటీ పొందింది. ఇందులో కూడా స్పేస్ బాగుంది. ఈ కార్ 1.2L కప్పా పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 83 PS పవర్‌, 113.8 Nm టార్క్‌ ని జనరేట్ చేస్తుంది.ఈ కార్ 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఈ కార్ 19.4 కిలోమీటర్లు దాకా మైలేజీని అందిస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఇది 391 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ఈ ఎక్స్-షో రూమ్ ధర రూ. 6 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది.

ఏడాదికి రూ. 10వేల ఇన్​వెస్ట్​మెంట్​తో మీ పిల్లల్ని కోటీశ్వరులు చేయండి

ఎన్​పీఎస్​ వాత్సల్య స్కీమ్​ని ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. కాగా ఇందులో ఏడాదికి రూ. 10వేలు ఇన్​వెస్ట్​ చేస్తే, మీ పిల్లలు కోటీశ్వరులు అవ్వొచ్చు! ఎలా అంటే..

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన ఎన్​పీఎస్​ వాత్సల్యతో మీ పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. జులై 2024 బడ్జెట్​లో ప్రకటించిన ఈ ఎన్​పీఎస్​ వాత్సల్య యోజనను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18న ప్రారంభించారు. దీన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నిర్వహిస్తుంది.

“ఈ కొత్త స్కీమ్​ ద్వారా తల్లిదండ్రులు/ సంరక్షకులు తమ పిల్లలకు వారి బాల్యం నుంచి 18 సంవత్సరాల వయస్సు వరకు రిటైర్మెంట్ కార్పస్​ని నిర్మించవచ్చు. మైనర్ పేరు మీద ఖాతా తెరిచి ఈ ఫండ్​ని గార్డియన్ నిర్వహించవచ్చు. మైనర్ మాత్రమే దాని యొక్క ఏకైక లబ్ధిదారు” అని టాటా పెన్షన్ మేనేజ్మెంట్ సీఈఓ కురియన్ జోస్ చెప్పారు.
ఎన్​పీఎస్​ వాత్సల్య ఎలిజిబిలిటీ..

మైనర్లందరూ (18 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు) ఎన్​పీఎస్​ వాత్సల్య పథకంలో పాల్గొనడానికి అర్హులు.
ఎన్​పీఎస్​ వాత్సల్య కంట్రిబ్యూషన్..

ఈ ఎన్​పీఎస్​ వాత్సల్య ఖాతా తెరవడానికి, మీరు కనీసం రూ .1,000 ప్రారంభ కంట్రిబ్యూషన్ చేయాలి. తరువాత వార్షిక కంట్రిబ్యూషన్ రూ .1,000గా ఉంది.
ఎన్​పీఎస్​ వాత్సల్య ఖాతాను ఎలా తెరవాలి?

తల్లిదండ్రులు బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్స్ వంటి రిజిస్టర్డ్ పాయింట్లలో ఆన్​లైన్​ లేదా వ్యక్తిగతంగా ఖాతాను తెరవవచ్చు. ఎన్​పీఎస్​ ట్రస్ట్ ఈ-ఎన్​పీఎస్​ ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సహా పలు బ్యాంకులు ఎన్​పీఎస్​ వాత్సల్య కార్యక్రమాన్ని సులభతరం చేయడానికి పీఎఫ్ఆర్డీఏతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.

పీఎఫ్​ ఆర్డీఏ ప్రకారం.. పిల్లలకి 18 ఏళ్లు నిండిన తర్వాత, ఖాతా ఆటోమెటిక్​గా సాధారణ ఎన్​పీఎస్ టైర్ 1 ఖాతాగా మారుతుంది. ఈ పరివర్తన ఎన్​పీఎస్​ టైర్ 1 (ఆల్ సిటిజన్) ప్లాన్​కి అంతరాయం లేని మార్పును అనుమతిస్తుంది. ఆటో ఛాయిస్, యాక్టివ్ ఛాయిస్​తో సహా అన్ని పెట్టుబడి ఫీచర్లను అనుమతిస్తుంది. ముందస్తు పెట్టుబడి, నిర్మాణాత్మక పొదుపును ప్రోత్సహించడం ద్వారా, ఎన్​పీఎస్​ వాత్సల్య యువ వ్యక్తులకు బలమైన ఆర్థిక పునాదిని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

టాటా పెన్షన్ మేనేజ్​మెంట్ సీఈఓ కురియన్ జోస్ మాట్లాడుతూ.. “ఈ విధానం క్రమశిక్షణతో కూడిన పొదుపు, కాంపౌండింగ్ ప్రయోజనాలను పెంపొందిస్తుంది. చిన్న వయస్సు నుంచి ఆర్థిక బాధ్యతను పెంపొందిస్తుంది,” అని చెప్పారు.

ఎన్​పీఎస్​ ఈక్విటీలో 14 శాతం, కార్పొరేట్ డెట్​లో 9.1 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీల్లో 8.8 శాతం రాబడులను అందించాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఎన్​పీఎస్​ వాత్సల్య కాలిక్యులేటర్..

తల్లిదండ్రులు 18 ఏళ్ల పాటు వార్షికంగా రూ.10,000 కంట్రిబ్యూషన్ ఇస్తే.. ఈ వ్యవధి ముగిసేనాటికి 10 శాతం రాబడి (ఆర్వోఆర్) అంచనా ప్రకారం పెట్టుబడి సుమారు రూ.5 లక్షల కార్పస్​గా పెరుగుతుందని అంచనా. పెట్టుబడిదారుడు 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పెట్టుబడిని కొనసాగిస్తే, వివిధ రాబడి రేట్ల ఆధారంగా ఆశించిన కార్పస్ గణనీయంగా మారవచ్చు. 10 శాతం ఆర్వోఆర్​తో కార్పస్ రూ.2.75 కోట్లకు చేరుకోవచ్చు.

టాటా పెన్షన్ మేనేజ్​మెంట్ సీఈఓ కురియన్ జోస్ మాట్లాడుతూ.. “ఈ విధానం క్రమశిక్షణతో కూడిన పొదుపు, కాంపౌండింగ్ ప్రయోజనాలను పెంపొందిస్తుంది. చిన్న వయస్సు నుంచి ఆర్థిక బాధ్యతను పెంపొందిస్తుంది,” అని చెప్పారు.

ఎన్​పీఎస్​ ఈక్విటీలో 14 శాతం, కార్పొరేట్ డెట్​లో 9.1 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీల్లో 8.8 శాతం రాబడులను అందించాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఎన్​పీఎస్​ వాత్సల్య కాలిక్యులేటర్..

తల్లిదండ్రులు 18 ఏళ్ల పాటు వార్షికంగా రూ.10,000 కంట్రిబ్యూషన్ ఇస్తే.. ఈ వ్యవధి ముగిసేనాటికి 10 శాతం రాబడి (ఆర్వోఆర్) అంచనా ప్రకారం పెట్టుబడి సుమారు రూ.5 లక్షల కార్పస్​గా పెరుగుతుందని అంచనా. పెట్టుబడిదారుడు 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పెట్టుబడిని కొనసాగిస్తే, వివిధ రాబడి రేట్ల ఆధారంగా ఆశించిన కార్పస్ గణనీయంగా మారవచ్చు. 10 శాతం ఆర్వోఆర్​తో కార్పస్ రూ.2.75 కోట్లకు చేరుకోవచ్చు.

చారిత్రక డేటా ఆధారంగా ఈ గణాంకాలు వివరణాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే ఉన్నాయని, వాస్తవ రాబడులు మారవచ్చు అని గమనించడం ముఖ్యం.

(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా ఇన్​వెస్ట్​మెంట్​ మొదలుపెట్టే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించండి.)

2024 టాటా పంచ్​ వేరియంట్లు- వాటి ఫీచర్లు..

కొత్త టాటా పంచ్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ ఎస్​యూవీ వేరియంట్లు, వాటి ఫీచరలు, వాటి ధరలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా పంచ్ ఇటీవల అప్​డేట్ అయ్యింది. ఈ అప్​డేట్​లో రిఫ్రెష్డ్ వేరియంట్ లైనప్, అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు రూ .6.13 లక్షల ధరతో ప్రారంభమైన 2024 టాటా పంచ్ క్రియేటివ్, అకంప్లీష్​డ్​, అకంప్లీష్​డ్​ ఎస్ఆర్, ప్యూర్ రిథమ్ వంటి కొన్ని వేరియంట్లను తొలగించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వేరియంట్లు, వాటి ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

2024 టాటా పంచ్​..

టాటా మోటార్స్ అడ్వెంచర్ ఎస్, అడ్వెంచర్ + ఎస్, ప్యూర్ (ఓ) తో సహా మూడు కొత్త వేరియంట్లను పంచ్​కు జోడించింది. దీనితో, టాటా పంచ్ ఇప్పుడు ప్యూర్, ప్యూర్ (ఓ), అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అడ్వెంచర్ సన్ రూఫ్, అడ్వెంచర్ + సన్ రూఫ్, అకంప్లీష్​డ్​ + సన్ రూఫ్, అకంప్లీష్​డ్​+ సన్ రూఫ్ అనే 10 వేరియంట్లలో లభిస్తుంది.

టాటా పంచ్ మునుపటి మాదిరిగానే 1.2-లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​ లేదా 84 బీహెచ్​పీ పవర్​, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఏఎంటీతో కనెక్ట్​ చేసి ఉంటుంది. మునుపటి మాదిరిగానే, 2024 టాటా పంచ్ కూడా అదే ఇంజిన్ కాన్ఫిగరేషన్​తో సీఎన్జీ ఆప్షన్​లో కూడా అందుబాటులో ఉంది. అయితే, సీఎన్జీతో 72 బీహెచ్​పీ పవర్​, 103 ఎన్ఎమ్ టార్క్ జనరేట్​ అవుతుంది.
2024 టాటా పంచ్: ప్యూర్

టాటా పంచ్ ప్యూర్, ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ.6.13 లక్షలు. అనేక భద్రత, సౌలభ్య ఫీచర్లను కలిగి ఉంది. డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎసపీ), రేర్ పార్కింగ్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. అదనపు సౌలభ్యం కోసం, పంచ్ ప్యూర్ ఇంటెలిజెంట్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ, సులభంగా ప్రవేశించడానికి 90-డిగ్రీల డోర్ ఓపెనింగ్, టిల్ట్-అడ్జస్టెబుల్ స్టీరింగ్ వీల్​ని టాటా మోటార్స్​ అందిస్తుంది.

2024 టాటా పంచ్: ప్యూర్ (ఓ)

టాటా పంచ్ ప్యూర్ (ఓ) ధర రూ .6.70 లక్షలు. స్టాండర్డ్ ప్యూర్ వేరియంట్ కంటే అదనపు ఫీచర్లను ఇది అందిస్తుంది. ఇందులో వీల్ కవర్లు, ఎలక్ట్రికలీ అడ్జస్టెబుల్ ఓఆర్వీఎంలు, ఫ్లిప్ కీతో సెంట్రల్ రిమోట్ లాకింగ్, పవర్ విండోస్ ఉన్నాయి.
2024 టాటా పంచ్ అడ్వెంచర్

రూ.7 లక్షల ధర కలిగిన టాటా పంచ్ ఎస్​యూవీ అడ్వెంచర్ ప్యూర్ (ఓ) వేరియంట్ కంటే ఫీచర్ల జాబితాను మరింత మెరుగుపరుస్తుంది. స్టోరేజ్ కోసం పార్శిల్ ట్రే, నాలుగు స్పీకర్ల ఆడియో సిస్టమ్, 3.5 ఇంచ్​ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, బాడీ కలర్ ఓఆర్వీఎం, యాంటీ గ్లేర్ ఐఆర్వీఎం ఉన్నాయి. అంతేకాకుండా, ఈ వేరియంట్ ఫాలో-మీ-హోమ్ హెడ్ ల్యాంప్స్, యూఎస్​బీ ఛార్జింగ్ పోర్ట్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ వంటి అదనపు ఫీచర్లను కూడా పొందుతుంది.
2024 టాటా పంచ్: అడ్వెంచర్ రిథమ్

రూ.7.35 లక్షల ధర కలిగిన టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్, మెరుగైన సౌండ్ క్లారిటీ కోసం రెడు ట్వీటర్లను జోడించడంతో ప్రీమియం ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా, వైర్డ్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 7 ఇంచ్​ భారీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

2024 టాటా పంచ్: అడ్వెంచర్ ఎస్

టాటా పంచ్ ఎస్​యూవీలోని అడ్వెంచర్ ఎస్ వేరియంట్​ ధర రూ.7.60 లక్షలు. ఈ వేరియంట్ రిథమ్ వేరియంట్ కంటే అనేక సౌకర్యాలు, సౌలభ్య లక్షణాలను అందిస్తుంది. ఇందులో హైట్ అడ్జస్టెబుల్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, మెరుగైన సిగ్నల్ రిసెప్షన్ కోసం షార్క్ ఫిన్ యాంటెనా, రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. సన్ రూఫ్​తో కూడిన టాటా పంచ్ అడ్వెంచర్​లో వెనుక యూఎస్​బీ ఛార్జర్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రూఫ్ రైల్స్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ ఉన్నాయి.
2024 టాటా పంచ్: అడ్వెంచర్ + ఎస్

టాటా పంచ్ అడ్వెంచర్ + ఎస్, ధర రూ .8.10 లక్షలు. అడ్వెంచర్ విత్ సన్ రూఫ్ వేరియంట్ కంటే అధునాతన ఫీచర్ల శ్రేణిని అందిస్తుంది. ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా, టైప్-సి ఫాస్ట్ ఛార్జర్, రెండు ట్వీటర్లు, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, 7-ఇంచ్​ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, రేర్​ వైపర్, వాషర్ ఉన్నాయి.
2024 టాటా పంచ్: అకంప్లీష్​డ్​ +

టాటా పంచ్ ఎస్​యూవీ అకంప్లీష్​డ్​ + ధర రూ .8.30 లక్షలు. అడ్వెంచర్ వేరియంట్ కంటే అధునాతన ఫీచర్ల శ్రేణిని అందిస్తుంది. వీటిలో క్రూయిజ్ కంట్రోల్, షార్క్ ఫిన్ యాంటెనా, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. వైర్లెస్ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25 ఇంచ్​ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 15 ఇంచ్​ స్టీల్ వీల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, రేర్​ యూఎస్​బీ ఛార్జర్ ఉన్నాయి. ఈ వేరియంట్లో రేర్​ డీఫాగర్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ లైట్​తో పాటు వన్ టచ్ డౌన్ డ్రైవర్ విండోను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

2024 టాటా పంచ్: అకంప్లీష్​డ్​ + ఎస్

టాటా పంచ్ అకంప్లీష్​డ్​ + ఎస్ ధర రూ .8.80 లక్షలు. అకంప్లీష్​డ్​+ వేరియంట్ కంటే అనేక అదనపు ఫీచర్లను అందిస్తుంది. ఇందులో రూఫ్ రైల్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉన్నాయి.
2024 టాటా పంచ్: క్రియేటివ్ +

ది టాటా పంచ్ క్రియేటివ్ +, దీని ధర రూ .9 లక్షలు. అకంప్లీష్​డ్​ + వేరియంట్ కంటే ప్రీమియం ఫీచర్ల శ్రేణిని అందిస్తుంది. రేర్​ ఆర్మ్​ రెస్ట్​, లెదర్ గేర్ నాబ్, 16 ఇంచ్​ డైమండ్ కట్ అల్లాయ్, డివైజ్ ఛార్జింగ్ కోసం వైర్లెస్ ఛార్జర్ ఉన్నాయి. రెయిన్ సెన్సింగ్ వైపర్లు, యాంటీ పించ్​తో కూడిన వన్ టచ్ డ్రైవర్ విండో, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), లెదర్ స్టీరింగ్ వీల్, ఆటో ఫోల్డింగ్ ఓఆర్వీఎంలు, పుడ్ల్ ల్యాంప్స్ ఉన్నాయి.
2024 టాటా పంచ్: క్రియేటివ్ + ఎస్

టాటా పంచ్ టాప్​ ఎండ్​ వేరియంట్​ క్రియేటివ్ + ఎస్ ధర రూ .9.50 లక్షలు. క్రియేటివ్ ప్లస్ వేరియంట్ కంటే అదనంగా రూ.50,000కే ఈ కొత్త వేరియంట్​లో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వస్తుంది.

బ్రౌన్ రైస్ తింటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బ్రౌన్‌ రైస్‌.. ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వరి పై భాగం.. పొట్టును తీసివేస్తే దాన్ని బ్రౌన్ రైస్ అంటారు. ఇది గోధుమ రంగులో ఉంటుంది. దీనిని శుభ్రం చేసి బ్రౌన్‌ కలర్‌ పోయే వరకు పాలిష్‌ చేస్తే.. మనకి తెల్లటి రైస్ లభిస్తుంది. అయితే, ఈ బ్రౌన్ రైస్ తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి..? షుగర్‌ వ్యాధిగ్రస్తులు బ్రౌన్‌ రైస్‌ తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

బ్రౌన్ రైస్ తినాలంటే చాలా మందికి అంతగా ఇష్టం ఉండదు. ఇవి కాస్తా లావుగా ఉంటాయని ఆసక్తి చూపరు. కానీ, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి శరీరానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయి.

బ్రౌన్ రైస్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ స్థాయిలు పేగు కదలికలను నియంత్రించడంలో, ప్రేగు కదలికలను సక్రమంగా ఉంచడంలో సహాయపడతాయి. మలబద్ధకం నయం చేయటంలో అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది.

బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది రిఫైన్డ్ చేయబడదు. అలాగే వైట్ రైస్ లో ఫైబర్, పోషకాలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల శరీరానికి కావాల్సిన పౌష్టికాలు లభించవు. బ్రౌన్ రైస్ లో పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కావున బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

బ్రౌన్‌ రైస్‌ను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కాబట్టి, షుగర్ ఉన్నవారు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినొచ్చు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

అంతేకాదు..బ్రౌన్ రైస్ లో ఉండే పౌష్టిక తత్వాలు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ గుండెకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రౌన్ రైస్‌తో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.

లెమన్ టీ కాదు, లెమన్ కాఫీతో శరీరంలో జరిగేది ఇదే..! నిపుణుల సూచనలు

చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో లెమన్ వాటర్‌ తాగటం అలవాటుగా చేసుకున్నారు. ఇలా తీసుకుంటే..ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుందని దీంతో పాటు బరువును కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..అయితే, లెమన్‌ వాటర్‌ కాకుండా లెమన్‌ కాఫీతో కూడా ఆరోగ్యంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. దీంతో లాబాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చాలా మంది లెమన్ వాటర్‌ను కేవలం బరువు తగ్గడానికి మాత్రమే తీసుకుంటారు. లెమన్ వాటర్ కేలరీలను కరిగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఉన్న విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

లెమన్ కాఫీని రోజూ తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరంలో గుట్టలుగా పేరుకుపోయిన కొవ్వులను కరిగించి మీ బరువును తగ్గిస్తుంది. కాఫీ శరీరంలో శక్తిని పెంచి.. మెటబాలిజంను ప్రేరేపించి బరువు తగ్గేలా చేస్తుంది.

నిమ్మకాయలోని విటమిన్ సి పోషకాలను బాగా గ్రహించడంలో తోడ్పడుతుంది. దీనిని కాఫీలో కలిపి తీసుకోవటం వల్ల కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రయోజనకరమైన సమ్మేళనాలను బాగా గ్రహించడంలో హెల్ప్ చేస్తాయి. వీటి వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.

కాఫీ, నిమ్మకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. నిమ్మకాయలోని విటమిన్ సి శరీరంలోని ఫ్రీరాడికల్స్​తో పోరాడుతుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్కిన్​కి మంచి గ్లోని అందిస్తుంది. చర్మానికి హైడ్రేషన్​ను అందించి చర్మం ముడతలు రాకుండా చేస్తుంది.

కాఫీలోని కెఫిన్ జీవక్రియ, ఆక్సీకరణను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయ కూడా జీవక్రియను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ రెండు తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. కానీ.. ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఎసిడిటీ సమస్యలకు దారి తీస్తుంది.

ప్రతి రోజూ ఉదయాన్నే ఈ నీళ్లను తాగితే టైప్ 2 డయాబెటిస్ నుంచి ఉపశమనం..! మరెన్నో ప్రయోజనాలు..

జీలకర్ర.. ప్రతి వంటింట్లో ఉండే ఒక ముఖ్యమైన మసాల దినుసు.. దాదాపు అన్ని వంటల్లో దీనిని ఉపయోగిస్తారు. దీనివల్ల రుచి మాత్రమే కాదు, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్రలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని కలోంజి సీడ్స్‌ అని కూడా పిలుస్తారు..అయితే జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్రలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం…

నల్లజీలకర్రతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే నల్ల జీలకర్ర నీటిని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

నల్ల జీలకర్ర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పొట్టలో రసాయనాలు విడుదలయ్యేందుకు సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ పెరగనివ్వకుండా నివారిస్తుంది. అధిక బరువు, కడుపు ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేస్తుంది.

నల్ల జీలకర్ర నీరు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. షుగర్‌ లెవల్స్‌ని కంట్రోల్‌ చేస్తూ టైప్‌-2 డయాబెటిస్‌ని అదుపు చేస్తుంది. నల్ల జీలకర్ర నూనెని బ్లాక్‌ టీతో కలిపి కాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంతో పాటు గుండెకి సంబంధించిన సమస్యలను ఇది తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. మెటబాలింజను మెరుగుపర్చడంలో నల్లజీలకర్ర తోడ్పడుతుంది. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది.

నల్ల జీలకర్ర, తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ఆడవాళ్లకు నెలసరి ఇబ్బందులను దూరం చేస్తుంది. పీరియడ్స్‌ టైంలో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తుంది.

గోదావరిలో క్రూడ్ ఆయిల్ లీక్.. దుర్వాసనతో యానం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన

యానాం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ లీక్ వల్ల జరగరాని అనర్థం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. తరచు ఇలాంటి పైప్ లైన్‌ లీకేజ్ వల్ల మత్స్య సంపద కనుమరుగు అవుతుందంటున్నారు మత్యకారులు. పుదిచ్చేరి యానాం కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు.

తూర్పు గోదావరి జిల్లా యానాం దరియాలతిప్ప వశిష్ట గోదావరిలో ONGC పైప్ లైన్ నుంచి క్రూడ్‌ ఆయిల్‌ లీక్ అవుతోంది. గోదావరిలో క్రూడ్ ఆయిల్ లీక్ అయి ఆ ప్రాంతమంతా దుర్వాసన రావడంతో యానాం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ లీక్ వల్ల జరగరాని అనర్థం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. తరచు ఇలాంటి పైప్ లైన్‌ లీకేజ్ వల్ల మత్స్య సంపద కనుమరుగు అవుతుందంటున్నారు మత్యకారులు. పుదిచ్చేరి యానాం కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. ఇంత జరుగుతున్నా పైప్ లైన్ లీక్ పై ONGC అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా పుదిచ్చేరి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ స్పందించడం లేదని.. ప్రజా ప్రతినిధులుగా ఏమి చేస్తున్నారని యానాం కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఓటీటీలోకి నివేదా థామస్ మూవీ.. ’35 చిన్న కథ కాదు’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో నివేదా థామస్ ఒకరు. గ్యాంగ్ లీడర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నివేదా.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అలరించింది.

కొన్నాళ్లుగా లకు దూరంగా ఉంటున్న నివేదా.. ఇప్పుడు కాస్త బరువు పెరిగింది. చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ’35 చిన్న కథ కాదు’ . ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హీరో దగ్గుబాటి ప్రజెంటర్ గా వ్యవహరించాడు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ దాదాపు ఐదున్నర కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు నుంచే పాజిటవ్ రివ్యూస్ వచ్చాయి. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ విడుదలకు ముందే ఈ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ను సెప్టెంబర్ 27 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. 35 చిన్న కథ కాదు లో నవ్విస్తూనే అంతర్లీనంగా విద్యావ్యవస్థకు సంబంధించిన ఓ సందేశాన్ని టచ్ చేశారు డైరెక్టర్ నందకిషోర్. ఈ లో కొడుకు చదువు కోసం ఆరాటపడే తల్లిగా నివేదా థామస్ నటనకు ప్రశంసలు అందుకుంది. పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటూ ఈ సూపర్ హిట్ గా నిలిచి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.

35 చిన్న కథ కాదు..

ప్రసాద్ (విశ్వదేవ్), సరస్వతి (నివేదా థామస్) దంపతుల కొడుకు అరుణ్ మ్యాథ్స్ సబ్జెక్టులో వెనకబడిపోతాడు. స్కూల్లో లెక్కలకు సంబంధించి తిక్క ప్రశ్నలతో టీచర్లను విసిగిస్తుంటాడు. దీంతో అతడు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అతడిని ఆరో తరగతిలోనే ఫెయిల్ చేస్తాడు టీచర్ చాణక్య (ప్రియదర్శి). అరుణ్ స్కూల్లో ఉండాలంటే మ్యాథ్స్ లో 35 మార్కులు రావాలని టీచర్స్ కండీషన్ పెట్టడంతో కొడుకుకు మ్యాథ్స్ నేర్పించడానికి సరస్వతి ఏం చేసింది.. ? చివరకు అరుణ్ 35 మార్కులు తెచ్చుకున్నాడ ? అనేది . ఈ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు.

ఎంత మంచిదో.. అంత చెడు చేస్తుంది.. ఈ 5 రోగాలుంటే వంకాయ అస్సలు తినకండి

వంకాయ చాలా మందికి ఇష్టమైన కూరగాయ. వంకాయ రుచిని చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ మెచ్చుకుంటారు.. ఇష్టంగా తింటారు.. వంకాయను కూర, ఫ్రై, చట్నీ ఇలా ..

ఎన్నో రకాలుగా చేసుకుని ఆరగిస్తారు. వీటిల్లో ఎన్ని రకాలున్నా.. సరే వాటన్నింటిని పలు రకాలుగా తయారు చేసుకుని ఇష్టంగా తింటారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అయితే, వంకాయ తినడం కొందరికి విషంలా హానికరం కావొచ్చు.. ఎందుకంటే.. కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు వంకాయను తినకపోవడమే మంచిది. ఈ రోజు మనం వంకాయ తినడం వల్ల ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చగల ఐదు సమస్యల గురించి మీకు చెప్పబోతున్నాం. ఈ ఐదు సమస్యలు ఉన్నవారు వంకాయను ఎప్పుడూ తినకూడదు.. ఎందుకంటే వంకాయ తినడం వారికి తీవ్రంగా హాని కలిగిస్తుంది.

చెడు జీర్ణక్రియ: గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు వంకాయ తినకుండా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో వంకాయ తింటే జీర్ణ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి పేలవమైన జీర్ణక్రియ లేదా గ్యాస్ లేదా అసిడిటీ ఉన్నవారు వంకాయ తినకుండా ఉండటం మంచిది.

రక్తహీనత: రక్తహీనతతో బాధపడేవారు కూడా వంకాయ తినకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం. వంకాయలో శరీరంలో ఐరన్ శోషణను తగ్గించే అంశాలు ఉన్నాయి. దీని కారణంగా, రక్తం లేకపోవడం సమస్య తీవ్రమవుతుంది. రక్తహీనత ఉన్నవారు వంకాయను తినకూడదు.

కిడ్నీల్లో రాళ్లు: మూత్రపిండాల వ్యాధి లేదా రాళ్లు ఉన్నవారు వంకాయ తినకుండా ఉండాలి. వంకాయలో ఆక్సలేట్ ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారు వంకాయను ఆహారంలో చేర్చుకోకుండా ఉండటం మంచిది.

కీళ్ల నొప్పులు : కీళ్ల నొప్పులు ఉన్నవారు వంకాయను తినకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వంకాయలో సోలనిల్ ఉంటుంది. దీని కారణంగా, శరీరం వాపు, కీళ్ల నొప్పులు పెరుగుతాయి.

అలర్జీలు : చాలా సందర్భాలలో వంకాయ తినడం వల్ల అలర్జీ వస్తుంది. వంకాయ తిన్న తర్వాత మీకు ఇలా అనిపిస్తే, మీ వైద్యుడిని సంప్రదించండి.. వంకాయ తినడం మానేయండి. ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వంకాయ తినకుండా ఉండటం చాలా మంచిది.

మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వానలే వానలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఎండ, ఉక్కబోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించే స్వీట్ న్యూస్‌ను చెప్పింది.

రానున్న మూడు రోజుల్లో తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో అల్పపీనడం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

తెలంగాణలో వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. శనివారం నుంచి ఎల్లుండి వరకు భారీ వానలు పడుతాయని అంచనా వేసింది. హైదరాబాద్ ​సిటీలో 2 రోజులపాటు వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని, మోస్తరు వర్షం పడొచ్చని వాతావరణం కేంద్రం చెప్పింది..హైదరాబాద్‌కి ఎల్లో అలర్ట్‌ కొనసాగుతోంది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

రాగాల మూడు గంటలలో ఆదిలాబాద్, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న మూడురోజులు బలమైన గాలులు వీస్తాయి. శనివారం అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మోస్తారు వానలు పడతాయి. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. అర్థరాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.

మజానే కాదు.. మాంచి శక్తిని ఇస్తుంది.. మధ్యాహ్నం ఒక్క గ్లాసు తాగితే తిరుగులేని ప్రయోజనాలు..

వేడి, తేమతో కూడిన వాతావరణంలో మీరు తరచుగా రోడ్డు పక్కన చెరకు రసం తాగుతూ ఉంటారు. ఇది చాలా ఉపశమనాన్ని అందిస్తుంది. చెరుకు రసం అప్పుడే కాదు.. ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

100 గ్రాముల చెరకు రసంలో 269 కేలరీలు ఉన్నప్పటికీ, ఇది ఆరోగ్యకరమైన పానీయం.. ఎందుకంటే ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది. చాలా సార్లు చెరుకు రసం తాగడం వల్ల మీ అలసట, నీరసం కూడా దూరమవుతుంది. చెరకు రసం తాగడం వల్ల ఎలాంటి ఇతర ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

చెరకు రసంలో ఎన్నో పోషకాలు..

చెరకు రసంలో చాలా పోషకాలు, ఖనిజాలు దాగున్నాయి. చెరకు రసం ఒక రుచికరమైన పానీయం.. ఇది క్యాన్సర్‌తో పోరాడడంలో చెరకు రసం సహాయపడుతుందని అనేక పరిశోధనలలో తేలింది. ఇది కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్ గొప్ప మూలం. ఈ పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కణాలను తగ్గిస్తాయి. ఎవరైనా ప్రోస్టేట్ లేదా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

చెరకు రసం తాగడం వల్ల 5 అద్భుతమైన ప్రయోజనాలు

చెరకు రసంలో ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో పెరుగుతున్న బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది.
చెరకు రసం సహాయంతో, దంతాల ఎనామిల్, దంతాలు దృఢంగా మారతాయి. ఇది దంత క్షయం అవకాశాలను కూడా తగ్గిస్తుంది.
మండే వేడిలో లేదా ఎప్పుడైనా ఒక చల్లని గ్లాసు చెరుకు రసం తాగితే శక్తిని ఇస్తుంది. చెరకు మీ శరీరానికి శక్తిని అందించడమే కాకుండా డీహైడ్రేషన్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు చెరకు రసాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది జీర్ణ రసాల స్రావాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
మహిళలు నిత్యం చెరుకు రసాన్ని తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఈ వ్యాధుల నుంచి రక్షణ..

చెరకు రసం పోషకాలను తీసుకునే అత్యంత ఆరోగ్యకరమైన, సహజమైన మార్గం. ఇది కామెర్లు, కాలేయ సంబంధిత వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా పరిగణిస్తారు. శరీరంలో శక్తిని నిలబెట్టుకోవాలంటే చెరుకు రసం తాగాలి.

చెరకు రసం తాగడానికి సరైన సమయం

మధ్యాహ్నానికి ముందు చెరుకు రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మీరు కనీసం వారంలో ప్రతిరోజూ ఒక గ్లాసు రసం తీసుకోవడం మేలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

(ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. ఫాలో అయ్యేముందు డాక్టర్లను సంప్రదించండి)

సామ్‌సంగ్‌ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 40 వేల వరకు

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ తన లేటెస్ట్ మోడల్‌ గ్యాలక్సీ ఎస్‌24పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అన్ని రకాల ఆఫర్లు కలుపుకొని ఈ ఫోన్‌పై ఏకంగా రూ.

40 వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుండడం విశేషం.

ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రమోషనల్ ప్రైస్ కింద ధర తగ్గిస్తున్నట్లు సామ్‌సంగ్ శుక్రవారం తెలిపింది. సామ్‌సంగ్ వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో రూ.60 వేల లోపు ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లు సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ డిస్కౌంట్ అందిస్తోంది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ వేరియంట్‌ ధర లాంచింగ్ సమయంలో రూ. 74,999గా ఉండేది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌లోపై ఇన్‌స్టాంట్ క్యాష్‌ బ్యాక్‌ కింద రూ. 12,000 డిస్కౌంట్‌ అందిస్తోంది. దీంతో పాటు అదనంగా రూ. 3000 అప్‌గ్రేడ్‌ బోనస్‌ అందిస్తున్నారు.

వీటితో పాటు ఈ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా రూ. 40 వేల వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. మీ పాత ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా ఈ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.2 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ స్క్రీన్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం ఇందులో 12 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌లో 25వాట్ల చార్జింగ్, ఫాస్ట్ వైర్ లెస్ చార్జింగ్ 2.0, వైర్ లెస్ పవర్ షేర్ మద్దతుతో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.

జానీ మాస్టర్ భార్యపై మరో కేసు.. అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు! కారణమిదే

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, అలానే అత్యాచారం చేసినట్లు ఒక లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్ కు తీసుకొచ్చి, కోర్టులో హాజర పరిచారు. ఈ క్రమంలోనే కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో జానీని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా ఇదే విషయంలో జానీ మాస్టర్ భార్య అయేషాపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. మతం మారి తన భర్తను పెళ్లిచేసుకోవాలని, అయేషా వేధించేదని, పలు మార్లు దాడి కూడా చేసిందని సదరు యువతి అయేషాపై కేసు పెట్టింది. తాజాగా మరో విషయంలో జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అయేషా తాజాగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని సమాచారం. ఈ కారణంతోనే అయేషాపై మరో కేసు నమోదయ్యిందని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయేషాతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

కాగా లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేయనున్నారని టాక్. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణల నేపథ్యంలో అయేషా చేస్తోన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ’16 ఏళ్ల వయసులో రేప్ చేశాడని ఆ అమ్మాయి అంటుంది. దీనికి తగిన ఆధారాలు చూపాలని అయేషా డిమాండ్ చేస్తోంది. కావాలనే తన భర్తను ఇరికిస్తున్నారంటోంది. ఇది తప్పుడు కేసు అని, జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవల్ లో ఫేమస్ అయ్యాడని, అందుకే కొందరు ఓర్వలేకనే ఆయనను తొక్కేస్తున్నారంటూ అయేషా ఆరోపిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇదిగో కొన్ని బెస్ట్ డీల్స్‌

పండగ సీజన్‌లో భాగంగా ప్రతీ ఏడాది నిర్వహించే బిగ్‌ బిలియన్‌ డేస్‌ను ఈసారి నిర్వహించేందుకు ఫ్లిప్‌ కార్ట్ సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది.

ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహోపకరణల వరకు అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ మెంబర్లకు ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్‌ 26 నుంచి) సేల్ ప్రారంభం కానుంది.

సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ డీల్స్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయిప్పటికీ.. కొన్ని లీక్స్‌ వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం సేల్‌లో భాగంగా ఏయే ఫోన్‌లపై ఎంత డిస్కౌంట్‌ లభించనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లిప్‌ కార్ట్‌ సేల్‌లో భాగంగా గూగుల్‌ పిక్సెల్‌8, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్స్‌ లభించనున్నట్లు తెలుస్తోంది. గూగుల్‌ పిక్సెల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌ మంచి డిస్కౌంట్‌ అందించనుంది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 30 వేల వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 75,999కాగా సేల్‌లో భాగంగా రూ. 40వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇక గ్యాలక్సీ ఎస్‌23పై కూడా భారీగా డిస్కౌంట్‌ లభిస్తోంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 40 వేలలోపు అందుబాటులోకి రానుంది.

ఇక పోకో ఎక్స్‌6 ప్రో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను రూ. 20వేలలోపే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు సీఎంఎఫ్‌ ఫోన్‌1, నథింగ్‌ ఫోన్‌2ఏ, పోకో ఎం6 ప్లస్‌, వివో టీ3ఎక్స్‌, ఇన్ఫినిక్స్‌ నోట్‌40 ప్రో వంటి మొబైల్స్‌పై కూడా కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ అందించనున్నారు. ఇక ఈ సేల్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా డిస్కౌంట్‌ను అందించనున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుదారులకు ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను అందించనున్నారు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యూపీఐ చెల్లింపులతో రూ. 50 డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా రూ. లక్ష వరకు రుణం పొందో అవకాశం కల్పించారు. అలాగే ఫ్లిప్‌కార్ట్- యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుపైనా నో- కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను అందించారు.

Health

సినిమా