Friday, November 15, 2024

ఆ పోస్టాఫీస్ స్కీమ్‌తో అదిరే రాబడి.. మహిళలకు మాత్రమే ప్రత్యేకం

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ భారతదేశంలో అన్ని పోస్ట్ ఆఫీసుల్లో అందబాటులో ఉంది. ఈ మహిళల కోసమే రూపొందించిన ప్రత్యేక పథకం. మహిళలు కొద్దిమాత్రం పెట్టుబడి రెండేళ్ల పాటు పెట్టాల్సి ఉంటుంది.

ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడిపై 7.5 శాతం వరకు వడ్డీ అందిస్తారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ చిన్న పొదుపు పథకమని నిపుణులు చెబుతున్నారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే మహిళలు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇందులో పెట్టుబడి గరిష్ట పరిమితి రూ. 2 లక్షలుగా ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని 2023 సంవత్సరంలో ప్రారంభించారు. అతి తక్కువ సమయంలో ఈ పథకం ప్రజల ఆదరణ పొందిందని నిపుణులు వివరిస్తున్నారు.

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌లో వచ్చిన వడ్డీని లెక్కిస్తే ఈ పథకంలో రెండేళ్ల పాటు రెండు లక్షల పెట్టుబడిపై 7.5 శాతం వడ్డీ ఇస్తారు. ఒక పెట్టుబడిదారు మొదటి సంవత్సరంలో రూ. 15,000, స్థిర వడ్డీ రేటుతో వచ్చే ఏడాది మొత్తంపై వచ్చే వడ్డీతో కలుపుకుంటే రూ. 16,125 అవుతుంది. అంటే రెండేళ్ల వ్యవధిలో కేవలం రూ.2 లక్షల పెట్టుబడిపై మొత్తం రాబడి రూ.31,125గా ఉంటుంది.

బోలెడన్ని పన్ను ప్రయోజనాలు

ప్రభుత్వం అమలు చేస్తున్న ఇటువంటి పోస్టాఫీసు పథకాలు మహిళలను స్వావలంబన చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌లో పెట్టుబడిపై 7.5 శాతం బలమైన వడ్డీ ఇవ్వడమే కాకుండా ఆదాయపు పన్ను సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా ఇందులో పెట్టుబడిగా ఉంది. ఈ పథకంలో మరో ప్రత్యేకత ఏమిటంటే 10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలకు కూడా ఖాతా తెరవవచ్చు.

బరువు తగ్గాలి అనుకునేవారు ఈ పండ్లకు దూరంగా ఉండండి

బరువు తగ్గాలని చాలా మంది తెగ కష్ట పడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఎంత సన్నగా ఉంటే అంత బెటర్ అని ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సన్నగా అయ్యేందుకు ఎన్నో పనులు చేస్తున్నారు.

అయితే కొన్ని రకాల పండ్లను తినడం వల్ల సన్నగా అయ్యేందుకు బదులు లావు అవుతారు.

మామిడి పండు తినడం వల్ల లావు అవుతారు. మీరు విన్నది నిజమే మామిడి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే అయినా.. వీటిల్లో కేలరీలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే బరువు బాగా పెరుగుతారు.

అదే విధంగా అరటి పండ్లు తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఇందులో షుగర్ కంటెంట్, కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్ అయ్యేవారు తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది.

అదే విధంగా ద్రాక్ష ఎక్కువగా తీసుకున్నాకూడా బరువు పెరిగేలా చేస్తాయి. ఇందులో కూడా కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. పనస పండు తినడం వల్ల కూడా షుగర్ కంటెంటె్, కేలరీలు అధిక మొత్తంలో ఉంటాయి.

పైనాపిల్ తినడం వల్ల కూడా లావు పెరుగుతారు. ఈ ఫ్రూట్‌లో కూడా కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. ఇక దానిమ్మ పండు తిన్నా కూడా బరువు పెరుగుతారు. ఇందులో కూడా కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

నిరసనల్లో ఈ నిరసన వేరయా.! నడిసంద్రంలో ప్లకార్డుల ప్రదర్శన.. ఎందుకో తెలుసా

ఆసియా గ్యాస్‌ విస్తరణ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖలో పడవలతో ప్రదర్శన చేశారు. నడి సముద్రంలో పడవలతో వెళ్లి గ్యాస్‌ ప్రాజెక్టులు వద్దు అని సముద్రంలో ప్లాస్టిక్‌ నివారించాలంటూ నినాదాలు చేశారు.

ప్లకార్డులను ప్రదర్శించారు. ఆసియా గ్యాస్‌ విస్తరణ వ్యతిరేక దినోత్సవాన్ని సందర్భంగా విశాఖ జిల్లా మత్స్యకారులు సముద్రంలో పడవలపై ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ సంస్థలైన సమతతో పాటు పలు సంస్థల ఆధ్వర్యంలో పడవల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మత్స్యకారులు, దళిత, గిరిజన సంఘాల నాయకులు పడవలపై ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని సముద్రంలో పడవల ర్యాలీ నిర్వహించారు.

ప్లాస్టిక్ వాడకం వల్ల సముద్రంలో ప్లాస్టిక్‌ గణనీయంగా పెరుగుతోందని ప్రదర్శనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ నియంత్రణ కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్‌తో సముద్రం కలుషితమవ్వడమే కాకుండా సముద్ర జీవరాసులకు జీవనానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటితో పాటు సముద్రాల్లో వెలికితీస్తున్న గ్యాస్‌ విస్తరణ ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. భూతాపం ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని.. ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు, చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

ఈ సీజన్‌లో పెదాలు పగులి చిరాకుగా అనిపిస్తుందా.. ఇలా చేయండి

ఇతర సీజన్ల కంటే చలి కాలంలే ఆడవారికి అస్సలు ఇష్టం ఉండదు. చలి కాలంలో చర్మం, పెదాలు పగులుతూ ఉంటాయి. ఈ సీజన్‌లో స్కిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది.

ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. చలి కారణంగా స్కిన్ పగిలి తెల్ల తెల్లగా కనిపిస్తుంది. చేతులు, కాళ్లపై గీతలు ఏర్పడతాయి. పెదాలు కూడా పగులుతాయి. పొరలు పొరలు ఊడి వస్తాయి. ఈ క్రమంలో స్కిన్ పరంగా ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. బయట వాటిని కొనే వాటి కంటే ఇంట్లో రెమిడీస్ కూడా ఫాలో చేయవచ్చు. ఇవి ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి. బయట కొనడం కంటే ఇంట్లో రెమిడీలు ఫాలో చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పెదాలు మళ్లీ మెత్తగా, మృదువుగా మారతాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుుడు చూద్దాం.

నూనె రాయండి:

చలి కాలం మొదలవగానే ముందు పెదాలపై శ్రద్ధ వహించాలి. రాత్రి పడుకునే ముందు పెదాలపై కొబ్బరి నూనె రాస్తూ ఉండాలి. కొబ్బరి నూనె రాయడం వల్ల పెదాలు మెత్తగా మారతాయి. అలాగే కొబ్బరి నూనెలో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి.. ఆరోగ్యంగా మెరుస్తాయి.

వెన్న:

పెదాలు బాగా పగిలి పొరలు ఊడేవారు వెన్న రాయవచ్చు. వెన్న రాయడం వల్ల పెదాలు మృదువుగా, మెత్తగా మారతాయి. చక్కగా మెరుస్తాయి. వెన్న చాలా మంచిది. రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం పెదాలపై వెన్న రాసి కాసేపు మర్దనా చేసి.. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. నెయ్యి కూడా పెదాలపై రాయడం వల్ల మెత్తబడతాయి.

తేనె:

పెదాలు పగిలి ఒక్కోసారి రక్తం కూడా కారుతుంది. అలాంటి సమయంలో తేనె చక్కగా పని చేస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి తేనె రాస్తే త్వరగా తేమగా మారతాయి. తేనె రాయడం వల్ల పెదాలు కోమలంగా తయారవుతాయి.

పచ్చి పాలు:

పెదాలు మెత్తగా, మృదువుగా మెరుస్తూ ఉండాలంటే.. పచ్చి పాలు రాస్తూ ఉండండి. కాటన్ సహాయంతో పెదాలపై పాలను రాస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తే.. పెదాలు అస్సలు పగలవు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మీ ఫోన్ స్లో అవుతుందా.. అయితే ఈ సెట్టింగ్స్ మార్చుకోండి చాలు

మీరు కొన్నేళ్లుగా ఒక్కటే ఫోన్‌ని ఉపయోగిస్తున్నారా? మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎక్కువ కాలం ఒక్కే ఫోన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, కొన్నిసార్లు ఫోన్ స్లో అవుతూ ఉంటుంది.

బ్యాటరీ డ్రైన్ అవ్వడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలను చిటికెలో పరిష్కరించవచ్చు.

మొబైల్ స్లో కాకుండా ఉండడానికి ఏం చేయాలి?

స్టోరేజ్‌ని క్లియర్ చేయండి: ఫోన్ స్లో అయితే ఫోన్‌ని బూస్ట్ చేయాలనుకుంటే, ముందుగా మీరు ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. స్టోరేజ్ ఫుల్ కావడం వల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వడంతోపాటు స్లో అవుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే పనికిరాని ఫోటోలు, వీడియోలు, యాప్స్ వంటివి డిలీట్ చేయండి.

కాష్ మెమరీని క్లియర్ చేయండి: ఫోన్ కాష్ మెమరీని క్రమం తప్పకుండా క్లియర్ చేయండి, తద్వారా ఫోన్ వేగంగా పని చేస్తుంది. మీరు బ్రౌజర్, యాప్‌ల కాష్ ఫైల్‌లు, కుక్కీలను సకాలంలో క్లియర్ చేయకపోతే, ఫోన్ స్లో అవుతుంది.

వైరస్‌ స్కాన్ చేయండి: మీరు APK ద్వారా తెలియని సైట్ లేదా ఏదైనా యాప్ నుండి ఏదైనా ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే, అప్పుడు యాంటీవైరస్ సహాయంతో, ఫోన్‌లో వైరస్ ఉందో లేదో తనిఖీ చేయండి.. వైరస్ కారణంగా ఫోన్ కూడా స్లో అవుతుంది. అలా అయితే, యాంటీవైరస్ సహాయంతో వైరస్‌ను తొలగించండి.

సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి: ఫోన్ నెమ్మదిగా నడుస్తుంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కూడా ఒక కారణం కావచ్చు. ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి, ఫోన్‌కు ఏదైనా అప్‌డేట్ పెండింగ్‌లో ఉందో లేదో తనిఖీ చేయండి, అప్‌డేట్ చేయకుంటే వెంటనే ఫోన్‌ను అప్‌డేట్ చేయండి.

మూడేళ్లలో మూసీనదిని తెలంగాణ ఐకాన్‌గా మారుస్తా.. సీఎం రేవంత్ ఎమోషనల్ స్పీచ్

సీఎం రేవంత్‌రెడ్డి 55వ పుట్టినరోజు. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఇదే తొలి పుట్టినరోజు. కానీ.. పర్సనల్ సెలబ్రేషన్ల సంగతేమో గాని.. బర్త్‌డే మొత్తం జనం మధ్యనే గడిపారు.

నల్గొండ జిల్లాలో సుడిగాలి పర్యటనతో బిజీగా గడిపారు సీఎం రేవంత్‌రెడ్డి. పుట్టిన రోజు సందర్భంగా యాదగిరి లక్ష్మీ నరసన్నను దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వామివారి దర్శనం తర్వాత వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి, పనుల పురోగతిపై చర్చించారు. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకు వెళతా.. అని హింట్ ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి.

ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మార్చాలని, టీటీడీ తరహాలో ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయాలని, గోశాలలో గోసంరక్షణ కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని, విమాన గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం పనులు వేగవంతం చేయాలని.. నిర్ణయించారు. యాదగిరిగుట్ట సందర్శన తర్వాత.. మూసీ పునరుజ్జీవ పాదయాత్ర చేపట్టారు రేవంత్‌రెడ్డి. సంగెం దగ్గర మూసీ కాలువను పరిశీలించి.. భీమలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. బోటులో ప్రయాణిస్తూ మూసీ ప్రవాహాన్ని పరిశీలించారు. ధర్మారెడ్డికాలువ వెంట నేతలు, కార్యకర్తలు, రైతులతో కలిసి రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కాలువ వెంట పొలాల్లోని రైతులతో ముచ్చటించి, వారి సమస్యలు విన్నారు. అక్కడే రైతులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌.. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మూసీ నది పునరుజ్జీవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్‌రెడ్డి.. ఇటీవలే స్పెషల్ టీమ్‌ని సియోల్ పంపి.. అనేక అధ్యయనాలు చేయించారు. మరో మూడేళ్లలో మూసీ నదిని తెలంగాణ ఐకాన్లలో ఒకటిగా మారుస్తానని మాటిచ్చారు. అందులో భాగంగానే.. పుట్టినరోజున మూసీలో పడవ ప్రయాణం చేసి.. తన కమిట్‌మెంట్‌ను చాటుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

పోలవరం ప్రాజెక్టుపై విస్తృతంగా మేథోమథనం.. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి టార్గెట్ ఫిక్స్

ఆంధ్రుల జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్‌.. నిర్మాణ దశను దాటలేక దశాబ్దాల తరబడి అపసోపాలు పడుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా కొత్తకొత్త సమస్యలతో నిర్మాణంలో అంతులేని జాప్యం తప్పడం లేదు.

కొత్త సమస్యల్లో అతికొత్త సమస్య ఏంటంటే.. ప్రాజెక్టు దగ్గర గోదావరి లోపల నిర్మించిన డయాఫ్రం వాల్ భారీ వరదలకు దెబ్బతినడం..! 2018లో ఉభయగోదావరి జిల్లాల పరిధిలో గోదావరి నదీ గర్భంలో 93.5 మీటర్ల లోతులో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ఇది. రెండు సీజన్లలో 412 రోజుల కాల వ్యవధిలో పూర్తయినప్పటికీ 2020 తర్వాత వచ్చిన వరదల కారణంగా దెబ్బతినింది. దీంతో దీని మీద నిర్మించాల్సిన మెయిన్ డ్యామ్ పనులు ఆగిపోయాయి. ఇటీవలే మళ్లీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు కొత్త డయాఫ్రమ్‌ వాల్‌పై దృష్టి పెట్టారు. విదేశీ నిపుణుల సలహాలు-సూచనలతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.

కేంద్ర జలసంఘం సీఈ విజయ్ శరన్ అధ్యక్షతన ముగ్గురు విదేశీ నిపుణులతో పరిశీలన బృందం ఏర్పాటైంది. ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందం.. పోలవరంపై మేథోమథనం చేసింది. రెండురోజుల పాటు ఎగువ-దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణాలను పరిశీలించింది. దీనికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ చూసి, పోలవరం ఆధారిటీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. గ్యాప్‌-2లో డయాఫ్రం వాల్‌ ప్లాట్‌ఫాం, వాల్‌ నిర్మాణానికి అవసరమైన ఓడోమీటర్లు, కొత్త వాల్‌ నిర్మాణం కోసం ఎర్త్‌ కమ్ రాక్‌ఫిల్‌ డ్యామ్ కుడివైపు జరుగుతున్న మట్టి పనులు, దిగువ కాఫర్‌ డ్యాం వద్ద డీవాటరింగ్‌ పనులు.. అన్నిటినీ నిశితంగా పరిశీలించారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కూడా ఈ సంప్రదింపుల్లో పాల్గొన్నారు. అటు.. ఆఫ్రి సంస్థ సిద్ధం చేసిన కొత్త డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ డిజైన్లపై చర్చించింది. పాత డయాఫ్రం వాల్‌కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాప్రం వాల్ నిర్మించాలని, ఇసుక సాంద్రత పెంచి మరింత గట్టిదనం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

కానీ.. డిజైన్‌పై విదేశీ నిపుణులు అనేక సందేహాలు లేవనెత్తారు. కొన్ని వివరణలూ కోరారు. అన్నిటిపై క్లారిటీ ఇస్తామంటోంది ఆఫ్రి సంస్థ. డ్యామ్ ప్రాంతంలో నీళ్లు లేనప్పుడు, తక్కువ నీళ్లు ఉన్నప్పుడు, గరిష్ట స్థాయిలో నీళ్లు ఉన్నప్పుడు… ఇలా వివిధ కోణాల్లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చర్చించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి దాదాపు 15 నెలల టైమ్ పడుతుందని ఒక అంచనాకొచ్చారు. యంత్రసామగ్రిని పెంచుకుంటే నిర్మాణ గడువు తగ్గే ఛాన్స్ కూడా ఉందట. నిపుణుల భేటీ తర్వాత సీఎం చంద్రబాబు క్షేత్ర స్ధాయిలో పోలవరం పర్యటనకు వస్తారు. పనుల పరిశీలన ముగిశాక అధికారులతో సమావేశమై కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఫైనల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

చెట్టినాడ్ స్టైల్‌ ఫిష్ ఫ్రై.. అదిరిపోయిందంటారు

నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టమో మాంసాహార ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరికి ప్రతి రోజూ ఏదో ఒక స్పెషల్ ఉండాలి. అయితే ఎప్పుడూ తినే ఒకే లాంటి ఐటెమ్స్‌ కాకుండా కొత్తగా కూడా ట్రై చేస్తూ ఉండాలి.

ఫిష్ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఫ్రై చేసేటప్పుడు మాత్రం కాస్త ఓపిక కావాలి. మీడియం మంట మీద జాగ్రత్తగా ఫ్రై చేయాలి. సాధారణంగా ఎప్పుడూ చేసే ఫిష్ ఫ్రై కంటే.. ఈ చెట్టినాడ్ స్టైల్‌లో ఫిష్ ఫ్రై చేయండి. ఖచ్చితంగా అదిరింది అంటారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఈ చెట్టినాడ్ స్టైల్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చెట్టినాడ్ స్టైల్ ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

చేపలు, కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ, జీలకర్ర, ఎండు మిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, మెంతులు, ధనియా పొడి, శనగపిండి, బియ్యం పిండి, ఆయిల్.

చెట్టినాడ్ స్టైల్ ఫిష్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా చేపల ముక్కలను నీచు వాసన రాకుండా శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుని అందులో.. ఉల్లిపాయ, జీలకర్ర, ఎండు మిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, మెంతులు, ధనియా పొడి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత శనగ పిండి, బియ్యం పిండి కూడా వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చేపలకు పట్టించండి. ఆ తర్వాత ఓ అరగంట పాటు మ్యారినేట్ చేయడానికి ఫ్రిజ్‌లో ఉంచండి.

నెక్ట్స్ పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి. చేప ముక్కలను వేసి రెండు వైపులగా ఎర్రగా మీడియం మంట మీద వేయించాలి. పెద్ద మంట పెడితే పైన మాడిపోయి.. లోపల ఉడకవు. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేయాలి. లేదంటే పాన్ తీసుకుని.. కొద్దిగా ఆయిల్ వేసి షాలో ఫ్రై కూడా చేయవచ్చు. చివరంగా నిమ్మరసం పిండి కొత్తి మీర చల్లితే ఎంతో రుచికరమైన చెట్టినాడ్ స్టైల్ ఫిష్ ఫ్రై సిద్ధం.

7 ఫోర్లు, 9 సిక్స్‌లు.. 200లకుపైగా స్ట్రైక్‌రేట్‌తో శాంసన్ తుఫాన్ సెంచరీ.. ధోని రికార్డ్ బ్రేక్

దక్షిణాఫ్రికాపై సంజూ శాంసన్ 47 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతను వరుసగా రెండో టీ20లో సెంచరీ సాధించాడు. దీనికి ముందు హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై శాంసన్ సెంచరీ చేశాడు.

వరుసగా రెండు టీ20ల్లో సెంచరీలు సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.

వరుసగా రెండు టీ20ల్లో సెంచరీలు బాదిన ప్రపంచంలో నాలుగో ఆటగాడిగా శాంసన్ నిలిచాడు. అతనికి ముందు, ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్, దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రూసో, ఫ్రాన్స్‌కు చెందిన గుస్తావ్ మాకాన్ మాత్రమే ఇలా చేశారు.

దీంతో భారత్ ప్రస్తుతం 16.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. జట్టులో హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ క్రీజులో ఉన్నారు. శాంసన్ వరుసగా రెండో T-20లో సెంచరీ సాధించి, 107 పరుగుల వద్ద ఔటయ్యాడు.

తిలక్ వర్మ 33 పరుగులు చేసిన తర్వాత కేశవ్ మహరాజ్‌కు బలయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 21 పరుగుల వద్ద డీప్ మిడ్ వికెట్ వద్ద ప్యాట్రిక్ క్రూగర్ చేతికి చిక్కి ఔటయ్యాడు. 8 బంతుల్లో 7 పరుగులు చేసి అభిషేక్ శర్మ ఔటయ్యాడు. నాలుగో ఓవర్లో గెరాల్డ్ కూట్జీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

నిమిషాల్లోనే చీజ్ ఎగ్ టెస్ట్.. ఇంట్లోనే హెల్దీగా చేసేయవచ్చు..

కోడి గుడ్డుతో ఎలాంటి వంటలు తయారు చేసినా చాలా రుచిగా ఉంటాయి. గుడ్లను చాలా మంది ఇష్టపడి మరీ తింటూ ఉంటారు. గుడ్లతో ఎన్నో రకాల స్నాక్స్ కూడా తయారు చేయవచ్చు.

గుడ్డుతో చేసేవి కొన్ని వందల రెసిపీలు ఉన్నాయి. గుడ్లతో త్వరగా కూడా వంటలు తయారు చేయవచ్చు. ఇప్పటికే గుడ్లకు సంబంధించి ఎన్నో రకాల వంటలు తెలుసుకున్నాం. లేటెస్ట్‌గా ఇంట్లోనే హెల్దీగా పిల్లలకు నచ్చేలా స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే టేస్టీ చీజీ ఎగ్ టోస్ట్. చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలకు, పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది. మరి ఈ చీజీ ఎగ్ రోస్ట్ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చీజ్ ఎగ్ టోస్ట్‌కి కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన గుడ్లు, ఎండు మిర్చి పేస్ట్, చీజ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, కారం పొడి, పసుపు, చాట్ మసాలా, గరం మసాలా, జీలకర్ర, శనగ పిండి, పెరుగు, బటర్, నిమ్మరసం, కొత్తిమీర.

చీజ్ ఎగ్ టోస్ట్ తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు మిర్చి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, గరం మాసాలా, చీజ్, చాట్ మసాలా, జీరా పొడి, శనగ పిండి, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలండి. ఆ తర్వాత కోడి గుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి.. గుడ్లపై చాక్‌తో నిలువుగా గాట్లు పెట్టండి. ఇప్పుడు ఈ గుడ్లను ముందుగా కలిపి పెట్టిన మిశ్రమంలో వేసి పావు గంట సేపు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ గ్రిల్ పాన్ పెట్టి చేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బటర్ వేసి.. గుడ్లను వేయండి.

చిన్న బంట మీద రెండు, మూడు నిమిషాలు ఉడికించండి. చివరగా మళ్లీ బటర్ వేసి అటూ ఇటూ తిప్పండి. ఇలా అన్నీ గుడ్లతో చేయాలి. పైనుంచి కూడా కొద్దిగా చీజ్ తురుము కోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చీజ్ ఎగ్ టోస్ట్ సిద్ధం. ఇది చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. పై నుంచి కొద్దిగా చాట్ మసాలా చల్లితే చాలా రుచిగా ఉంటుంది. అంతే పెద్దగా నూనె అవసరం లేకుండా లైట్‌గా ఈ ఎగ్ రోస్ట్ తయారు చేసుకోవచ్చు. పిల్లలకు బాగా నచ్చుతుంది. ఎప్పుడూ చేసే టోస్టుల కంటే ఇది బ్రెడ్ అవసరం లేకుండా నేరుగా గుడ్లతోనే చేస్తారు.

ఫూల్ మఖానాతో లడ్డూ.. పిల్లలకు బెస్ట్ రెసిపీ..

పిల్లలకు ఏదన్నా ఆరోగ్యంగా చేసి పెట్టాలని తల్లులకు ఉంటుంది. వెరైటీగా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడూ డైలీ పెట్టేవి కాకుండా వేరే స్నాక్స్ కావాలని అంటారు.

ఫూల్ మఖానా తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఫూల్ మఖానాతో కూడా ఎన్నో వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఫూల్ మఖానాతో వంటలే కాకుండా లడ్డూ కూడా చేసుకోవచ్చు. దీంతో తయారు చేసే లడ్డూ ఒక్కటి తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, బెల్లం కలిపి చేస్తారు కాబట్టి.. శరీరానికి కావాల్సిన పోషకాలు మొత్తం లభిస్తాయి. మరి ఈ ఫూల్ మఖానా లడ్డూ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫూల్ మఖానాకు కావాల్సిన పదార్థాలు:

ఫూల్ మఖానా, బెల్లం పొడి లేదా పంచదార, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కొబ్బరి తురుము, నువ్వులు, యాలకుల పొడి.

ఫూల్ మఖానా తయారీ విధానం:

ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఫూల్ మఖానా వేసి.. దోరగా వేయించాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత కొబ్బరి తురుమును కూడా అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి వేయిస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఫూల్ మఖానా, డ్రై ఫ్రూట్స్‌ని మిక్సీలో వేసి పొడిలా చేసి పక్కన పెట్టండి.

ఆ తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్‌లోనే బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు కూడా వేసి పాకం తీయాలి. ఇప్పుడు ఈ పాకంలో ఫూల్ మఖానా పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. నువ్వులు, యాలకుల పొడి కూడా వేసి మిక్స్ చేయాలి. కాస్త చల్లారిన తర్వాత చేతి నెయ్యి రాసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా తయారైన వీటిని గాలి చొరబడని డబ్బాలో వేసి పెడితే నెల రోజుల వరకూ నిల్వ ఉంటాయి.

హెల్మెట్లు పెట్టుకుంటే బహుమతులు

జాతీయ రహదారి ఆనుకొని ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఈ ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు..

వాటిని నివారించడానికి పిఠాపురం సర్కిల్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దానిలో భాగంగా నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధించడమే కాకుండా, హెల్మెట్లు ధరించి నిబంధనలు పాటిస్తున్న వాహనదారులకు బహుమతులు అందజేస్తున్నారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పిస్తున్నారు.. గొల్లప్రోలు జాతీయ రహదారిపై టోల్ ప్లాజా దగ్గిర వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సై రామకృష్ణ, పోలీస్ సిబ్బంది చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు జరిమానా విధించారు. హెల్మెట్లు ధరించి వాహనాలు నడుపుతున్నవారికి ప్రోత్సాహకంగా బహుమతులు అందించారు. దీంతో పలువురు ద్విచక్ర వాహనదారులు పోలీసులను ప్రశంసించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సీఐ శ్రీనివాస్ తెలుపుతున్నారు.

చీకట్లో జిగేల్‌మనే ఫోన్‌.. నథింగ్‌ నుంచి కమ్యూనిటీ ఎడిషన్‌

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ నథింగ్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. నథింగ్‌ ఫోన్‌ (2ఏ) ప్లస్‌ కమ్యూనిటీ ఎడిషన్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

ఈ ఫోన్‌లో పలు ఆసక్తికరమైన ఫీచర్లను జోడించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త ఎడిషన్‌ ఫోన్‌లను కేవలం వెయ్యి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు.

ముఖ్యంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ వెనక భాగం చీకట్లో ఆకుపచ్చగా వెలగటం దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు. రాత్రి సమయాల్లో ఫోన్‌ జిగేల్‌మని వెలుగుతుంది. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాటరీని ఉపయోగించుకోకపోవడం విశేషం.

అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో వాల్‌పేపర్లూ కొత్తగా యాడ్‌ చేశారు. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7350 ప్రొ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 125జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో తీసుకొచ్చారు.

అలాగే ఇందులో.. 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ రెజల్యూషన్, 120హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. అలాగే ప్రొటెక్షన్‌ కోసం కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ను అందింంచారు. ధర విషయానికొస్తే రూ. 29,999గా నిర్ణయించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 50 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 50 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీని ఇచ్చారు.

రూ. 43 వేలకే 55 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. ఏకంగా రూ. 20 వేలకిపైగా డిస్కౌంట్..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ పానసోకిన్‌ స్మార్ట్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. పానాసోనిక్‌ 55 ఇంచెస్ టీవీపై అమెజాన్‌లో 29 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

దీంతో పాటు పలు కార్డులపై అదనంగా డిస్కౌంట్‌ అందిస్తోంది.

పానసోనిక్‌ 55 ఇంచెస్‌ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 62,990కాగా అమెజాన్‌లో 29 శాతం డిస్కౌంట్‌తో రూ. 44,990కి లభిస్తోంది. అయితే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1750 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇలా అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఈ టీవీని సుమారు రూ. 43 వేలకే సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ టీవీలో 55 ఇంచెస్‌తో కూడిన ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఇచ్చారు. 60 హెచ్‌జెడ్ రిఫ్రెస్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. 4కే కలర్‌ ఇంజన్‌, వైడ్‌ వ్యూయింగ్‌, హెగ్జా క్రోమ్‌ వంటి ఫీచర్లు ఈ టీవీ సొంతం.

ఇక ఈ టీవీ డాల్బీ డిజిటల్‌కు సపోర్ట్‌ చేస్తుంది. బిల్ట్‌ ఇన్‌ హోమ్‌ థియేటర్‌ ఫీచర్‌ను ఇచ్చారు. అలాగే ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, ప్రైమ్‌ వీడియో, జీ5 వంటి ఇన్‌బిల్ట్‌ యాప్‌లను అందించారు.

ఈ టీవీపై ఏడాది వారంటీని అందించారు. 16 జీబీ స్టోరేజ్‌, 2 జీబీ ర్యామ్‌ ఈ టీవీ సొంతం. అలాగే ఈ టీవీ క్వాడ్ కోర్‌ ఏ55 ప్రాసెసర్‌ను ఇచ్చారు. బ్లూటూత్‌, వైఫ్‌తో పాటు ఇథర్‌ నెట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. 500ఖాళీల భర్తీకి సర్కారు అమోదం

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అమోదం తెలిపింది. త్వరలో 500ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు పాలకమండళ్లను నియమించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలో నిరుద్యోగ సంభావన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖలో త్వరలో 500 పోస్టుల భర్తీ చేసేందుకు నిర్ణయించినట్టు మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వివరించారు. త్వరలోనే ఏపీలో దేవాలయ ట్రస్టు బోర్డుల నియామకాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.

దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ క్యాడెర్లలోని అధికారులు, అర్చకులకు సంబంధించి 500 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గొల్లపూడిలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం రాష్ట్రంలోని దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న అర్చక విభాగం, పరిపాలనా పరమైన విభాగంలో సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

దేవాలయాలన్నీ పరిశుభ్రత, ఆధ్యాత్మికతలో కళకళలాడేట్లుగా అధికారులందరూ పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉందని దానిని కాపాడే విషయంలో నిర్లిప్తత ఉండకూడదన్నారు. కార్తీక మాసంలో నిర్దేశించిన ప్రాంతాల్లో చతుర్వేద సభలు నిర్వహించాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గడచిన నాలుగు నెలల కాలంలో దేవాదాయ శాఖలో అనేక మార్పులు తీసుకుని వచ్చామని, ఇంతవరకు దేవాదాయ శాఖ అంటే చాలా చిన్నదిగా భావించే అందరి భ్రమలను తొలగిస్తూ ఈ శాఖ ఎంతో గొప్పది అనే విధంగా పేరు సాధించామని, ఈ పేరు చిరకాలం నిలిచిపోయేలా అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు.

50 వేలకు పైబడిన ఆదాయం ఉన్న దేవాలయాల్లోని అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలు ఉండేలా నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తుకు తెస్తూ, దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో అదనంగా ఇద్దరి సభ్యులను నియమించాలన్న నిర్ణయానికి సంబంధించిన ఆర్డినెన్స్ త్వరలో జారీ అవుతుందన్నారు. నిర్దేశిత కాలపరిమితితో, స్పష్టమైన మార్గదర్శకాలతో సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ను వెలువరిస్తామన్నారు.
నిరుద్యోగ సంభావన…

దసరా నవరాత్రుల సందర్భంగా కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన వేద సభలో వేదపారాయణం పండితులనే కాకుండా పామరులను కూడా ఉత్తేజితం చేసిందని, దానిని ఒక ప్రాంతానికే పరమితం చేయకుండా, వేద పఠనం విశిష్టత, వేద స్ఫూర్తి నలుదిశలా కొనసాగుతూ, దాని అర్థాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత అందరిలో వచ్చేలా చూడాలన్న లక్ష్యంతో ఉమ్మడి జిల్లాలన్నిటా వేద సభలను నిర్వహించాలన్నారు.

వేదాధ్యయనం చేసి, ఉపాథి కోసం ఎదురు చూస్తున్న వేద పండితులకు , యువగళం స్ఫూర్తితో సంభావన పేరుతో నెలకు 3 వేల ను అందించేందుకు ఉత్తర్వులు జారీ చేశామని, ఈ పథకం కింద గుర్తించిన సుమారు 600 మందికి త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ లబ్ధిని అందించనున్నామన్నారు.
ప్రసాదాల్లో నాణ్యమైన సామాగ్రి వినియోగం..

దేవాలయాల్లో ప్రసాదం, అన్న ప్రసాదం తయారీలో వినియోగించే సామగ్రిని అంతటినీ, ఏ గ్రేడ్ రకానివే వినియోగించేలా చూడటానికి, కేంద్రీకృత వ్యవస్థను తీసుకురానున్నామని,ఇందుకు సంబందించిన విధివిధానాలను రూపొందిస్తున్నామన్నారు. అంతే కాకుండా, ఆయా దేవాలయాల్లో పారిశుద్ధ్య పనులు, భద్రతా ఏర్పాట్లు, ఇతరత్రా మానవ వనరుల వినియోగంలో కుడా కేంద్రీకృత విధానాలు తీసుకుని వస్తున్నామన్నారు.

రాష్ట్రంలోని ప్రదానమైన దేవాలయాన్నిటిలోనూ ప్రసాదం రుచి గతంలో కంటే మెరుగ్గా ఉందన్న ఫీడ్ బ్యాక్ వస్తుందన్నారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడవద్దన్నారు. అవసరాలకు అనుగుణంగా ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు వీలుగా, దేశీయ గోవులను పెంచేందుకు ఆసక్తి చూపే వారికి దేవాదాయ శాఖ తరపున 5 శాతం సబ్సిడీని ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు.

దేవాలయాలకు దాతలు వివిధ రూపాల్లో విరాళాలు ఇస్తుంటారని, వాటిపై దాతల పేర్లు తప్పకుండా ఉండేలా చూడటంతో పాటు, వారికి ఆలయాల్లో సముచిత గౌరవమిస్తే, మరింత మంది దాతలు ముందుకు వస్తారన్న విషయాన్ని ఆలయ ఎగ్జుక్యూటవ్ ఆఫీసర్లందరూ గుర్తించుకోవాలన్నారు. అలాగే దాతలిచ్చిన విరాళాల వివరాలను ఎలక్ట్రానిక్ రూపంలో తప్పని సరిగా రికార్డు చేయాలన్నారు. పర్యాటక శాఖ తో సమన్వయం చేసుకుంటూ త్వరలోనే టెంపుల్ టూరిజం ను అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కూడా త్వరలోనే నిర్వహించనున్నామన్నారు.
Whats_app_banner

గ్రామ, వార్డు సచివాలయాల భవిష్యత్తు ఏమిటి? కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వార్డు సచివాలయాల భవిష్యత్తుపై విస్తృత చర్చ జరుగుతోంది. సచివాలయాల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సచివాలయాలపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గత మూడు నాలుగు నెలలుగా సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి విధులు లేకపోవడంతో వాటిని ప్రక్షాళన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేవలం పెన్షన్ల పంపిణీ మాత్రమే సచివాలయ సిబ్బంది చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ భవిష్యత్తుపై అందుబాటులో ఉన్న తాజా అప్డేట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌‌లో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్టోబర్ 2 నుంచి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 30వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కో సచివాలయంలో ఎనిమిది నుంచి పది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
వైసీపీ హయంలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో పాటు సంక్షేమ పథకాల అమలులో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాయి.
ప్రతి సచివాలయం పరిధిలో సగటున 1500-2వేల కుటుంబాలు లేదా గరిష్టంగా 4-5 వేల జనాభాను విభజించి కేటాయించారు. ప్రతి సచివాలయం పరిధిలో ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమించారు.
ఏపీపీఎస్సీ నియామకం ద్వారా లక్షా 30వేల మంది శాశ్వత ఉద్యోగులను సచివాలయాల్లో విధుల కోసం నియమించారు. వైసీపీ హయంలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు నేరుగా వాలంటీర్ల ద్వారా సచివాలయాల పర్యవేక్షణలో అందించేవారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలను నిలిపివేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడంతో దాదాపు లక్షమంది స్వచ్ఛంధంగా, రాజకీయ కారణాలతో రాజీనామాలు చేశారు.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు అమలు చేసిన దాదాపు 23 సంక్షేమ పథకాలు నిలిపివేయడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగలకు చేయడానికి పనేమి లేకుండా పోయింది.
2019లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు రూపకల్పన చేసినపుడు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్‌ నిబంధనలు, పదోన్నతులు, విధుల కేటాయింపు వంటి అంశాలపై స్పష్టత లేకుండానే నియామకాలు పూర్తి చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన తర్వాత వారు ఏ శాఖ పరిధిలోకి వస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసినా విధుల నిర్వహణకు, మాతృ విభాగానికి ఎలాంటి సంబంధం లేదు.
ఉద్యోగుల నియామకం, వారి ప్రొబేషన్ పీరియడ్‌ కాలం పూర్తైన పది నెలలకు కానీ సర్వీస్ క్రమబద్దీకరించలేదు. ఉద్యోగ నియామకాలు రెండు విడతల్లో జరిగినా మొదట చేరిన వారు సీనియారిటీ కోల్పోయారు.
గత నాలుగు నెలలుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేయడానికి ఎలాంటి విధులు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు తమకు ఏదైనా బాధ్యతలు అప్పగిస్తారేమోనని ఎదురు చూస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పంచాయితీల్లో కానీ పట్టణాల్లో మునిసిపాలిటీ, లైన్‌ డిపార్ట్‌మెంట్లలో అనుసంధానించాలనే ప్రతిపాదన ఉంది.
సచివాలయాలను ప్రస్తుతం ఉన్న విధానంలోనే కొనసాగించడంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పంచాయితీల అధికారాలను హరించేలా ఉన్న సచివాలయాలను పంచాయితీల్లో విలీనం చేయాలని ఏపీ పంచాయితీరాజ్‌ ఛాంబర్‌ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది.
పట్టణ ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్లు, నాయకుల చేతుల్లో సచివాలయాలు చిక్కుకుని పౌర సేవల్ని అందించడంలో రాజకీయ ప్రమేయం ఎక్కువైందనే విమర్శల్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
సచివాలయాల ద్వారా పాలనలో, పౌర సేవల్లో ప్రత్యేకంగా ఎలాంటి మార్పులు జరిగాయి, ప్రజలకు మేలు జరిగిందా, నష్టం జరిగిందా అనే దానిపై క్షుణ్ణంగా అధ్యయనం జరుగుతోంది. జవాబుదారీతనంతో కూడిన పౌర సేవల్ని అందించడంలో సచివాలయ వ్యవస్థ విఫలమైందనే అభిప్రాయం ప్రజా ప్రతినిధుల్లో ఉంది.
సచివాలయ వ్యవస్థ ద్వారా కేవలం పెన్షన్ల పంపిణీ, సంక్షేమ పథకాలను వాలంటీర్లతో అందించే పని మాత్రమే జరిగేది.
సచివాలయ సిబ్బందికి గౌరవ ప్రదమైన ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపును కోరుతున్నారు. గతంలో వాలంటీర్లు చేసిన పనుల్ని ఉద్యోగులతో చేయించడంపై అసంతృప్తి వ్యక్తం అవుతున్నా సచివాలయ ఉద్యోగుల సేవల్ని వినియోగించుకోవడం, ఖాళీలను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయడంపై కూడా కసరత్తు జరుగుతోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న స్వరూపంలో సచివాలయ వ్యవస్థ కొనసాగకపోవచ్చు. వాటి స్వరూపం, విధుల కేటాయింపు, బాధ్యతలు, జవాబుదారీతనం విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

విజయనగరం MLC ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. హైకోర్టు షాకింగ్‌ తీర్పు! ఇరకాటంలో ఎన్నికలు..?

విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌తో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇరు పార్టీలు ఎన్నికకు సిద్ధమవుతున్న వేళ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

2021లో జరిగిన స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇందుకూరి రాజు. ఆ తరువాత కొన్నాళ్ళు బాగానే ఉన్నా ఆ తరువాత తన సొంత నియోజకవర్గమైన ఎస్ కోటలో అప్పటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. అలా రఘురాజు భార్య ఇందుకూరి సుధారాణి వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. దీంతో ఎమ్మెల్సీ ఇందుకూరి రవిరాజు వైసీపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ మండలి విప్ పాలవలస విక్రాంత్ మండలి చైర్మన్ మోషన్ రాజుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదుతో ఇందుకూరి రఘురాజు పై అనర్హత వేటు వేశారు మండలి చైర్మన్.

అయితే తాను ఏ తప్పు చేయలేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని తనపై వేసిన అనర్హత వేటుపై హైకోర్టును ఆశ్రయించారు రఘురాజు. అలా హైకోర్టులో రఘురాజు పిటిషన్ కొనసాగుతుండగానే అనర్హత వేటుతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇరు రాజకీయ పార్టీలు తమ పార్టీల నుండి ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేయాలనే అంశం పై ముమ్మర చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ అభ్యర్థిగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పల నాయుడును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు పార్టీ అధినేత వైఎస్ జగన్. అధికార కూటమి కూడా మరో ఒకటి, రెండు రోజుల్లో తమ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. అలా ఎన్నికలకు ఎవరికి వారు బిజీ బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో రఘు అనర్హత పిటిషన్ పై హైకోర్టులో కూడా తుది విచారణ జరిగింది. ఈ విచారణలో తుది వాదనలు విన్న హైకోర్టు మండల చైర్మన్ మోషన్ రాజు వేసిన అనర్హత వేటు చెల్లదని, తిరిగి ఎమ్మెల్సీగా రఘురాజు కొనసాగేలా ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఒకసారిగా ఎమ్మెల్సీ ఎన్నిక కొత్త చర్చకు దారి తీసింది.

అయితే ఎమ్మెల్సీ అనర్హత వేటు రద్దు చేసిన హైకోర్టు తీర్పుతో శాసనమండలి ఎన్నిక నోటిఫికేషన్ ఇప్పడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్సీ ఎన్నిక రద్ధవుతుందా? లేక యధావిధిగా కొనసాగుతుందా అనే అంశం పై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పు పై మండలి చైర్మన్ అప్పీల్ కోసం కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణ సాగుతుంది. అదే జరిగితే ఎమ్మెల్సీ ఎన్నిక కొనసాగే అవకాశం ఉంది. అలా కాకుండా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని రఘురాజు కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా కనిపిస్తుంది. అదే జరిగి హైకోర్టు రఘురాజు కు అనుకూలంగా తీర్పు ఇస్తే నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇందుకూరి రఘురాజుకు అనుకూలంగా వచ్చిన తీర్పు పై ఇరు పార్టీల న్యాయనిపుణులు ఈ అంశం పై ఎన్నికల ప్రక్రియ సాధ్యాసాధ్యాల పై అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుత హైకోర్టు తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

సాహస కార్యకలాపాలు అంటే ఇష్టమా.. శీతాకాలంలో ట్రెక్కింగ్, స్నో బైకింగ్ వంటి యాక్టివిటీస్ కోసం ఈప్రదేశాలు బెస్ట్

చాలా మందికి ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. మరి కొందరికి సాహస కార్యకలాపాలు చేయడం అంటే ఇష్టం. అయితే ఇలాంటి ప్రయాణాలు.. ట్రిప్ లుగా మాత్రమే కాదు.. విభిన్నమైన అనుభవం..

చిరస్మరణీయ క్షణాలుగా ఎప్పుడూ గుర్తుండిపోతాయి. సాహస కార్యకలాపాలు ట్రెక్కింగ్, స్కై డైవింగ్, స్కూబా డైవింగ్ వంటివి మరెన్నో ఉన్నాయి. చాలా మంది తమ స్నేహితులతో కలిసి అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. తద్వారా వారు అక్కడ అనేక ప్రదేశాలను చూడడానికి.. అనేక సాహస కార్యకలాపాలన్నీ చేయడానికి అవకాశం పొందుతారు. భారతదేశంలో ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. మీకు కూడా డిఫరెంట్ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలకు వెళ్లవచ్చు.

రిషికేశ్: ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం రిషికేశ్ వెళ్ళవచ్చు. ఇక్కడ బైకింగ్, రివర్ రాఫ్టింగ్, వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ వంటి సాహస కార్యకలాపాలు చేసే అవకాశాన్ని పొందవచ్చు. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య వరకూ మాత్రమే కాదు.. మార్చి నుంచి మే వరకు రిషికేశ్ రివర్ రాఫ్టింగ్‌కు అనువైన సమయం. అంతేకాదు ఇక్కడ సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతిలో ప్రశాంతంగా గడపడానికి ఏ సీజన్‌లోనైనా ఇక్కడకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు.

బీర్ బిల్లింగ్: హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ బిల్లింగ్ సందర్శించడానికి చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ వేసవి కాలంలో బిర్ బిల్లింగ్‌ని సందర్శించి, పారాగ్లైడింగ్, క్యాంపింగ్, ట్రెక్కింగ్, హ్యాంగ్ గ్లైడింగ్, మౌంటెన్ బైకింగ్ వంటి అనేక సాహస కార్యకలాపాలు చేసే అవకాశం లభిస్తుంది. ఈ ప్రదేశం ధర్మశాల నుంచి 50 కిలోమీటర్ల దూరంలో.. మనాలి నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది.

నైనిటాల్: ప్రయాణం చేయడంతో పాటు అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడం అంటే ఇష్టం ఉంటే.. సరస్సుల నగరంగా ప్రసిద్ధి చెందిన నైనిటాల్‌కు కూడా వెళ్లవచ్చు. మీరు ఇక్కడి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాంగోట్‌లో క్యాంపింగ్ ట్రిప్ చేసే అవకాశాన్ని పొందవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్, డబుల్ రోగ్, బర్మా బ్రిడ్జ్, రాపెల్లింగ్, టార్జాన్ స్వింగ్ వంటి అనేక కార్యకలాపాలు చేసే అవకాశం ఉంది. నైనిటాల్‌లోని అనేక ప్రదేశాలలో పారాగ్లైడింగ్, రిడ్జ్ క్యాంపింగ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, పారాసైలింగ్, గుర్రపు స్వారీ, వాచర్ జోర్బింగ్ వంటి అనేక సాహస కార్యకలాపాలు చేసే ఎంజాయ్ చేయవచ్చు.

మనాలి: చాలా మంది సందర్శనల కోసం మనాలికి వెళతారు. అయితే దీనితో పాటు ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసే అవకాశం లభిస్తుంది. ఇక్కడ వాటర్ రాఫ్టింగ్, జిప్‌లైన్, పారాగ్లైడింగ్, స్కీయింగ్, స్నో బోర్డింగ్, ట్రెక్కింగ్ వంటి అనేక కార్యకలాపాలు చేసే అవకాశాన్ని పొందవచ్చు. హిమపాతం, శీతాకాలపు క్రీడలను ఆస్వాదించాలనుకుంటే ఇక్కడ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలలలో సందర్శించడానికి ఉత్తమ సమయం. అంతేకాదు మనాలిలో వేసవి కాలంలో పువ్వులు, పచ్చదనం చూడవచ్చు.

ప్రభాస్ మూవీలో చిరంజీవి గెస్ట్ రోల్

ప్రభాస్‌ లైనప్‌లో మోస్ట్ క్రేజియస్ట్‌ మూవీ అంటే ఎవరైన స్పిరిట్ పేరే చెబుతారు. యానిమల్‌ లాంటి వైల్డ్ మూవీ తరువాత సందీప్‌ రెడ్డి వంగా చేస్తున్న కావటంతో స్పిరిట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పుడు ఆ అంచనాలు మరింత పెంచే అప్‌డేట్స్‌ ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

యానిమల్ సెట్స్ మీద ఉండగానే ప్రభాస్‌ హీరోగా స్పిరిట్ మూవీని ఎనౌన్స్ చేశారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ఈ లో ఫస్ట్ టైమ్‌ ప్రభాస్‌ను యూనిఫామ్‌లో చూపించబోతున్నాం అంటూ ఫస్ట్ అప్‌డేట్‌తోనే మీద అంచనాలు పెంచేశారు. అంతేకాదు డార్లింగ్‌ రూత్‌లెస్ కాప్‌గా కనిపించబోతున్నారని చెప్పారు సందీప్‌.

తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ లో ప్రభాస్‌కు జోడీగా లేడీ సూపర్ స్టార్‌ నయనతార నటించబోతున్నారట. 17 ఏళ్ల క్రితం ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యోగి లో నయనతార హీరోయిన్‌గా నటించారు. మళ్లీ ఈ కాంబో రిపీట్ అవ్వలేదు. ఇన్నేళ్లకు మళ్లీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

స్పిరిట్‌లో కీలకమైన అతిథి పాత్రలో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్నారన్నది ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న మరో క్రేజీ అప్‌డేట్‌. గతంలో ఒకటి రెండు ల్లో చిరు గెస్ట్ రోల్స్‌లో కనిపించిన… అవి తన ఫ్యామిలీ, ఫ్యాన్స్‌ కోసమే చేశారు.

ప్రభాస్ లో చిరు గెస్ట్ రోల్ విషయంలో ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్‌లో డిస్కషన్ జరుగుతోంది. గతంలో చాలా సందర్భాల్లో తాను చిరు అభిమానిని అని చెప్పిన సందీప్‌ రెడ్డి వంగా మెగాస్టార్ కోసం ఎలాంటి గెస్ట్ రోల్‌ డిజైన్ చేశారన్నది ఆసక్తికరంగా మారింది.

స్పిరిట్‌ కాస్టింగ్ విషయంలో సందీప్‌ ప్లాన్‌ మామూలుగా లేదు. ఈ లో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ నెగెటివ్ రోల్‌లో కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. చిరుతో పాటు మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఈ అప్‌డేట్స్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

పర్యాటక రంగంలో మరో అద్భుతం.. విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్​

పర్యాటకానికి సాంకేతిక సొబగులు అద్దుతోంది ఏపీ సర్కార్‌. పర్యాటకులకు మరుపురాని అనుభూతి పంచేందుకు సమాయత్తమవుతోంది. పర్యాటక రంగంలో మరో విప్లవం.. ఎస్‌..

మొన్న డ్రోన్‌షోతో ఆకట్టుకున్న ఏపీ ప్రభుత్వం మరో ప్రయోగానికి రెడీ అయ్యింది. ఈనెల 9న విజయవాడ పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్‌’ ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది. డీ హవిల్లాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు.

శ్రీశైలం జలాశయం SLBC టన్నెల్ పరిసర జలాల్లో సీ ప్లేన్ ల్యాండ్ కానుంది. సీ ప్లేన్ నుంచి సీఎం వచ్చిన తర్వాత రోప్ వే ద్వారా పైకి వచ్చి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న తర్వాత సీఎం సీప్లేన్లో విజయవాడ వెళ్తారు. విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌ నడిపేందుకు అనుకూలతలపై ఈ ప్రయోగం నిర్వహిస్తున్నారు. ఇది సక్సెస్‌ అయితే రాబోయే రోజుల్లో రెగ్యులర్‌ సర్వీసు ప్రారంభిస్తారు. విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి ప్రాంతాల్లోనూ సీ ప్లేన్ల ఏర్పాటుకు రెండోదశలో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పర్యాటకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు రూపొందిస్తోంది.

ఇటీవల జాతీయస్థాయి డ్రోన్‌ సమిట్‌ నిర్వహించగా ఇప్పుడు సీ ప్లేన్‌ ప్రయోగం చేస్తున్నారు. విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. సీ ప్లేన్స్ లాంచ్‌తో పర్యాటకంగా విజయవాడ మరింత అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు స్థానికులు.

పౌర విమానయాన మంత్రిత్వశాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సంయుక్తంగా సీ ప్లేన్‌ ప్రయోగం చేస్తున్నాయి. ప్రయోగం విజయవంతమయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.

అందుబాటులోకి అమెజాన్ సర్వీసెస్.. ఒకే క్లిక్‌లో డాక్టర్ సౌకర్యం.. ఎలాగో తెలుసుకోండి

ఆన్‌లైన్ మెడికల్ కన్సల్టేషన్ సర్వీస్ ‘అమెజాన్ క్లినిక్’ ను అమెజాన్ భారత దేశంలో ప్రవేశ పెట్టింది. ఈ యాప్ ద్వారా 50కి పైగా వైద్య సమస్యలకు సరసమైన ధరలో ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్లను అందిస్తుంది.

వినియోగదారులు అమెజాన్ యాప్ ద్వారా నేరుగా వైద్య నిపుణులతో అపాయింట్‌మెంట్లను బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. రూ.299తో ప్రారంభమయ్యే ఈ సర్వీసు ప్రస్తుతం ఉన్న ప్రాక్టీ వంటి ఫ్లాట్ ఫార్మ్మ్ ల మాదిరి గానే పని చేస్తుంది.

అమెజాన్ భారతదేశంలో కొత్త సేవను ప్రారంభించింది. అమెజాన్ క్లినిక్ సేవ ద్వారా, ప్రజలు 50 కంటే ఎక్కువ వ్యాధులకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా వైద్యులతో సంప్రదింపులు తీసుకోవచ్చు. ప్రస్తుతం, అమెజాన్ క్లినిక్ సేవ Android, iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీన్ని డెస్క్‌టాప్‌లో ఉపయోగించలేరు. సంప్రదింపులను బుక్ చేసుకునే ముందు, మీ పేరు, వయస్సు, జెండర్, ఫోన్ నంబర్‌ను అందించాలి. ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలి. అ తర్వాత డాక్టర్ నుండి ఆన్‌లైన్ సంప్రదింపులు పొందే సదుపాయాన్ని పొందుతారు. అసరమైతే, క్లినిక్‌కి వెళ్లి వైద్యుడిని కలవవచ్చు. అయితే క్లినిక్‌లో వైద్యుడిని కలిసే సౌకర్యం అన్ని చోట్లా లేదు.

అమెజాన్ క్లినిక్‌లో డెర్మటాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ కౌన్సెలింగ్ వంటి విభాగాల్లో నిపుణులైన వైద్యులు ఉన్నారు. క్లినిక్‌లో జాబితాలోని వైద్య నిపుణులందరికీ టెలి-కన్సల్టేషన్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉంటుందని అమెజాన్ తెలిపింది. ఇది కాకుండా, ఈ సంప్రదింపులకు సంబంధించిన అన్ని వైద్య రికార్డులు సురక్షితంగా ఉంచామని వెల్లడించింది. దీనికి రుసుము రూ. 299 నుండి రూ. 799 మధ్య ఉంటుంది. వర్చువల్ కన్సల్టేషన్‌లో ఏడు రోజుల పాటు ఉచిత ఫాలో-అప్ కూడా అందుబాటులో ఉంటుంది. అమెజాన్‌లో ఫార్మసీ స్టోర్ కూడా ఉంది. ఇక్కడ మీరు యాప్‌లోనే మందులను కొనుగోలు చేయవచ్చు.

అగ్ర నిర్మాణ సంస్థతో ప్రభాస్ బిగ్ డీల్.. సంవత్సరానికి ఒక్కో సినిమా

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా విదేశాల్లోనూ డార్లింగ్ ఫాలోయింగ్ మారిపోయింది.

ఓవైపు ఆయనతో లు చేసేందుకు దర్శకనిర్మాతలు పోటీపడుతుండగా.. మరోవైపు డార్లింగ్ ల కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇటీవలే సలార్, కల్కి చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నాడు ప్రభాస్. ఈ రెండు లు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. దీంతో ఇప్పుడు డార్లింగ్ నటించే రాజాసాబ్ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు డార్లింగ్ కొత్త చిత్రాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ అభిమానులకు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అదిరిపోయే వార్తను రివీల్ చేసింది.

తమ నిర్మాణ సంస్థలో ప్రభాస్ మూడు లు చేయనున్నట్లు అధికారికంగా వెల్లిడించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందం సైతం పూర్తైనట్లు తెలిపింది. సలార్ 2 చిత్రంతో ఇది ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా మరో రెండు పెద్ద ల్లో ప్రభాస్ నటించనున్నట్లు తెలియజేసింది. ఈ చిత్రాలు 2026, 2027, 2028ల్లో రానున్నట్లు తెలియజేస్తూ ఓ పోస్టర్ షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ సీక్వెల్ సలార్ 2కు సైతం ఆయనే రూపొందించనున్నారు. మరో రెండు చిత్రాలకు దర్శకులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. కానీ హోంబలే ఫిల్మ్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మాణంలో ప్రభాస్ నుంచి మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ రానున్నాయని తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండగా.. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. డిసెంబర్ చివరి వారంలో స్పిరిట్ మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఇక సిమ్ తో పనిలే.. BSNL నుంచి సూపర్ సర్వీస్.. జియో, ఎయిర్టెల్ కి తిప్పలు తప్పవు

భారతప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్(BSNL) టెలికాం రంగంలో సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకుంటుంటుంది. టెలికాం రంగంలో కొత్త విప్లవాన్ని తెచ్చేందుకు ముండదుగులు వేస్తోంది. ఇప్పటికే లక్షల్లో యూజర్లను సొంతం చేసుకుంది. తాజాగా BSNL మరో సెన్శేషనల్ డెసిషన్ తీసుకుంది. ఇంతకీ BSNL తీసుకున్న తాజా డెసిషన్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

BSNL ఇప్పటికే 4G నెట్ వర్క్‌ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ సర్వీసెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో కేవలం రెండు నెలల గ్యాప్ లోనే ఎన్నో లక్షల మంది యూజర్లను పెంచుకుంది. దీంతో JIO, Airtel వంటి సంస్థలు షాక్ అయ్యాయి. ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చాయి. BSNL దెబ్బకి తమ ప్లాన్ రీఛార్జ్ ధరలను కూడా తగ్గించే ఆలోచనలోకి వచ్చాయి. అయినా కానీ BSNL ని ఆపలేకపోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా BSNL మరో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తొంది. ఆ టెక్నాలజీ గురించి విన్నారంటే కచ్చితంగా వావ్ అంటారు. ఇంతకీ ఆ టెక్నాలజీ ఏంటంటే .. సిమ్ లేకుండానే కాల్స్ మెసేజ్‌లు చేసుకోవచ్చు. అలా చేసేలా సరి కొత్త టెక్నాలజీని BSNL కంపెనీ డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఫోన్ లో సిమ్ లేకపోయినా నెట్ వర్క్ లేకపోయినా ఈజీగా కాల్స్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ వల్ల విపత్తులు, మారుమూల ప్రాంతాల్లో చిక్కుకుపోయిన, అటవీప్రాంతంలో తప్పిపోయినప్పటికి మనం సర్వీసెస్ ని పొందవచ్చని తెలుస్తుంది. ఈ టెక్నాలజీ పేరు డైరెక్ట్ టూ డివైజ్. అమెరికాకు చెందిన VIASAT (వయాశాట్) కంపెనీతో కలిసి BSNL ఈ టెక్నాలజీని టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ టెక్నాలజీ పని ఏంటంటే ఇది శాటిలైట్, లోకల్ మొబైల్ నెట్ వర్క్‌లను లింక్ చేస్తుంది. దాంతో ఇక పై అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లే మనకు సెల్ ఫోన్‌ టవర్లుగా మారతాయి. దీని వలన మనకు ఎలాంటి సర్విస్ ప్రాబ్లం ఉండదు. ఎలాంటి మారుమూల ప్రాంతాల్లో అయినా సిగ్నల్స్ వస్తాయి. ఇంటర్నెట్ స్పీడ్ కూడా అద్భుతంగా ఉంటుంది. కాల్స్ చాలా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. మన మెసేజెస్ చాలా ఫాస్ట్ గా డెలివర్ అవుతాయి. త్వరలో ఈ సర్వీసెస్ మనకు రాబోతున్నాయి. ఈ టెక్నాలజీ దెబ్బతో జియో, ఎయిర్టెల్ కంపెనీలు ఔట్ అయ్యే ఛాన్స్ ఉంది.

తక్కువ ధరలో స్టైలిష్ E-బైక్.. దీని ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే

ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. ఇండియన్ మార్కెట్లో ఎన్నో కొత్త కొత్త ఎలక్ట్రికల్ వెహికల్స్ విడుదల అవుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఒబెన్ ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రోర్ ఇజెడ్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. దీని ఫీచర్లు తక్కువేం కాదు. వీటి గురించి తెలిస్తే కచ్చితంగా వావ్ అనాల్సిందే. పైగా దీని ధర కూడా చాలా తక్కువ. దీనిలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అవి తెలిస్తే పెట్రోల్ బైక్ కంటే బెస్ట్ అంటారు. ఇంతకీ దీని ఫీచర్స్ ఏంటి? స్పెషాలిటీస్ ఏంటి? దీని ధర ఎంత? మనం దీన్ని ఎందుకు కొనవచ్చు? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ ఎలక్ట్రిక్ బైక్ ని మనం ఎందుకు కొనొచ్చు అంటే ఇది సిటీలో తిరగడానికి బాగా పని చేస్తుంది. కష్టమైన ప్రయాణాలను కూడా కమ్ఫర్ట్ గా చేస్తుంది. ఈ సూపర్ స్టైలిష్ బైక్ ని కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. దీన్ని అప్డెటెడ్ డిజైన్ తో అప్డెటెడ్ ఫీచర్లతో తయారు చేశారు. పైగా దీని ధర కూడా పెట్రోల్ బైకులతో పోల్చుకుంటే చాలా తక్కువ అనే చెప్పవచ్చు. ఇక ఈ బైక్ స్టార్టింగ్ ప్రైజ్ విషయానికి వస్తే కేవలం రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) ధర మాత్రమే ఉంటుంది. అయితే ఈ ధర ఫ్యూచర్ లో ఛేంజ్ అయ్యే అవకాశం ఉంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, హై మెంటేనెన్స్ ని దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారు చేశారు. క్లచ్, గేర్ షిఫ్టింగ్, హీటింగ్ మొదలైన రోజువారీ ప్రయాణ సవాళ్లను తట్టుకునే విధంగా దీన్ని తయారు చేశారు. ఈ బైక్ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై కంఫర్ట్ హ్యాండ్లింగ్, సూపర్ పెర్ఫామెన్స్ ని అందిస్తుంది. దీనికి 52 Nm బెస్ట్-ఇన్-క్లాస్ టార్క్ ఉంటుంది.

ఈ బైక్ నడిపేటప్పుడు మనం సిటీ ట్రాఫిక్‌లో ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేయలేము. ఈ బైక్ 175 కిమీ (IDC) వరకు మంచి మైలేజ్ రేంజ్ ని ఇస్తుంది. చాలా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. దీనికి ఛార్జింగ్ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈ బైక్ బ్యాటరీ కేవలం 45 నిమిషాల్లోనే 80% ఛార్జ్‌ అయ్యే ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంది. ఈ బైక్ మొత్తం మూడు బ్యాటరీ వేరియంట్‌లలో లభిస్తుంది. 2.6 kWh, 3.4 kWh, 4.4 kWh లలో అందుబాటులో ఉంటుంది. దీనిలో అప్డెటెడ్ పేటెంట్ కలిగిన LFP బ్యాటరీ టెక్నాలజీ ఉంది. అందువల్ల దీని పెర్ఫామెన్స్ సూపర్ అనే చెప్పాలి. దీని బ్యాటరీని 50% హై టెంపరేచర్ తగ్గించే విధంగా తయారు చేశారు. ఇది 2X అంటే రెండు రెట్లు ఎక్కువ లైఫ్ ఇస్తుంది. భారతదేశంలోని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా దీన్ని తయారు చేశారు. ఇక ఈ బైక్ 95 km/h మాక్సిమం స్పీడ్ ని ఇస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో 0 నుండి 40 km/h స్పీడ్ ని అందుకోగలదు.

వైరల్ అవుతున్న అనుష్క , ప్రభాస్ లుక్స్.. ఇద్దరు ఒకేలా

అనుష్క శెట్టి , ప్రభాస్ ఈ పెయిర్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ ఆన్ స్క్రీన్ కపుల్ ఆఫ్ స్క్రీన్ లో కూడా ఒకటైతే చూడాలని ఎంతో మంది కల. ఆ మధ్య వీరిద్దరి పెళ్లి గురించి గాసిప్స్ కూడా బాగానే వినిపించాయి. కానీ అవి ఎటూ తేలట్లేదు అది వేరే విషయం. సరే పోనీ ఆన్ స్క్రీన్ మీద అయినా వీరిద్దరిని కలిపి చూద్దాం అనుకుంటే.. అది కూడా జరగట్లేదు. బాహుబలి తర్వాత మళ్ళీ ఈ జంటను కలిసి చూసిందే లేదు. దీనితో ఈ ఇద్దరి మ్యూచువల్ ఫ్యాన్స్ ఈ పెయిర్ కలయిక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుష్క , ప్రభాస్ ఇద్దరూ సిమిలర్ లుక్ లో ఉన్న ఫోటో ఒకటి కనిపించింది. ఇంకేముంది దొరికిందే ఛాన్స్.. ఆ రెండు ఫొటోస్ ను పక్క పక్కన పెట్టి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. బాహుబలి తర్వాత ఈ అమ్మడు భాగమతి అంటూ ఓ హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మరో డీసెంట్ హిట్. దాదాపు అనుష్క అన్నీ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ అమ్మడు క్రిష్ దర్శకత్వంలో.. ఘాటి అనే సినిమాతో రాబోతుంది. అనుష్క బర్త్ డే సంధర్బంగా ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో అనుష్క చాలా డిఫరెంట్ గా కనిపించింది. ఇప్పటివరకు అనుష్క ఇలా ఎప్పుడు కనిపించలేదు. సిగార్ పొగ మధ్యలో చాలా ఇంటెన్స్ లుక్ లో అనుష్క ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత అనుష్క మళ్ళీ కనిపించింది కాబట్టి.. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సహజం. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే… ఇప్పుడు ఈ లుక్స్ ను డీకోడ్ చేసి ప్రభాస్ లుక్స్ తో పోల్చుతున్నారు. రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా రాజాసాబ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ కూడా ఓల్డ్ గెటప్ లో.. స్మోకీ లుక్ తో దర్శనం ఇచ్చాడు. దీనితో ఇప్పుడు ఇద్దరూ సిగార్ తాగుతూనే కనిపించారంటూ.. ఇద్దరి ఫొటోస్ పక్క పక్కన పెట్టి వైరల్ చేస్తున్నారు. రాజావారు రాణి వారు అంటూ.. అసలు మీరిద్దరూ ఎందుకు కలిసి సినిమా తీయకూడదు.. అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. డార్లింగ్ ను , స్వీటీ ని ఒకే స్క్రీన్ మీద చూసి చాలా కాలం అయింది కాబట్టి.. వారి కామెంట్స్ వెనుక వాస్తవం లేకపోలేదు. ఇలా కోఇన్సిడెంట్ గా కలిసినా ఉన్న ప్రభాస్ , అనుష్కల ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఫ్యూచర్ లో సినిమాలు వస్తాయో లేదో తెలియదు కానీ.. ఒకవేళ వస్తే మాత్రం అది మరో కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ అవుతుందని ఎవరైనా చెప్పేస్తారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కు రాజాసాబ్ , అనుష్క కు ఘాటీ ఎలాంటి సక్సెస్ ను అందిస్తాయో చూడాలి

UPI యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై రోజుకు రూ. లక్ష

ఇటీవల దేశ వ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ సర్వీసులు ఎంతగా సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. యూపీఐ సేవల కారణంగా దేశంలో ఆన్‌లైన్ పేమెంట్స్ భారీగా పెరిగిపోయాయి. చేతిలో స్మార్ట్, ఇంటర్నెట్ ఉంటే చాలు జేబులో డబ్బులు అవసరం లేదనే పరిస్థితికి వచ్చింది. చిన్న చిన్న టీ దుకాణాల నుంచి మొదలు పెడితే.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు కస్టమర్లు. యూపీఐ సేవలను ఉపయోగిస్తున్న NRI ల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ఎన్ఆర్ఐ లు తమ కుటుంబ సభ్యులకు యూపీఐ ద్వారా రోజూ ఒక లక్ష రూపాయల వరకు పంపించుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. నాన్ రెసిడెంట్ ఎక్స్ టర్నల్ (NRE), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ(NRO) ఖాతాలు ఏన్న ఎన్ఆర్ఐ లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ద్వారా ఇకపై రోజుకు రూ.1 లక్ష రూపాయల వరకు చెల్లించుకోవచ్చు. సదరు యూజర్లు భారత్ లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు, ఇతర చెల్లింపులకు నగదు పంపించుకోవచ్చు.

అంతర్జాతీయ మొబైల్ నెంబర్ ను ఉపయోగించి స్మార్ట్ ఫోన్ ద్వారా ఉచిత లావాదేవీల కోసం యూపీఐ ఉపయోగించుకునే సదుపాయం కల్పించారు. ప్రస్తుతం ఈ సదుపాయం యూఎస్, యూకే, సింగపూర్, యూఏఈ, కెనెడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, మలేషియా, హాంగ్‌కాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్నారలైకు ఈ అద్భుతమైన అవకాశం కల్పించబడింది. ఈ కొత్త సౌకర్యంతో భారత్ ఉన్న తమ కుటుంబ సభ్యులు ఎక్కువ డబ్బు పంపించుకునే సదుపాయం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అంటున్నారు. ప్రస్తుతం ఈ సదుపాయం ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండస్ ఇండ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కెమెరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఈక్విటా స్మాల్ పఐనాన్స్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియా బ్యాంకులు ఈ అవకాశాన్ని కల్పించాయి.

సాధారణంగా ఎక్కడైనా అంతర్జాతీయ సెల్ ఫోన్ నెంబర్లకు ఫోన్ పే, పేటీఎం, బీమ్, గూగుల్ పే, బీమ్ ఏయూ, ఫెడ్ మొబైల్, బీమ్ ఇండస్ పే, ఎస్‌బీఐ మిర్రర్ ప్లస్, ఐమొబైల్ వంటి పేమెంట్స్ యాప్స్ సపోర్ట్ చేస్తుంటాయి. ఇక ఎన్ఆర్ఐ లు తమ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ వో ఖాతాల మధ్య అదే విధంగా దేశంలోని ఖాతాలకు యూపీఐ లావాదేవీలు చేసుకునే సదావకాశం కల్పించబడింది. ఎన్ఆర్ఓ ఖాతా నుంచి ఎన్ఆర్ఈ ఖాతాకు డబ్బులు ట్రాన్స్‌వర్ చేసుకోవచ్చు. కొత్తగా తీసుకు వచ్చిన ఈ సదుపాయం వల్ల ఆర్థిక లావాదేవీల విషయంలో ఎంతో మేలు కలుగుతుందని కస్టమర్లు అంటున్నారు.

మీకు సొంతిల్లు, భూమి, ఇంకా ఇతర ఆస్తులు ఉన్నాయా? అయితే ఈ విషయం తెలుసుకోకుంటే నష్టపోతారు

చాలా మందికి కూడా ఆస్తులు ఉంటాయి కానీ, వాటిని కాపాడుకోవడం తెలీదు. ముఖ్యంగా చదువు లేని వాళ్ళకు ఆస్తులకు సంబంధించి చాలా విషయాలు తెలీవు. అవి తెలీక తమ ఆస్తులను పోగొట్టుకుంటారు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పే విషయం నగారాల్లో నివసించే ప్రజలకు తెలుసు కానీ పల్లె టూర్లలో నివసించే చాలా మందికి కూడా తెలికపోవచ్చు. ఈ విషయం తెలీకపోతే కచ్చితంగా నష్టపోవడం పక్కా. ఇంతకీ ఆ విషయం ఏంటి? దాని గురించి తెలుసుకోకపోతే కలిగే నష్టాలు ఏంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? పూర్తి వివరాలు మనం ఇప్పుడు డీటైల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మన ఆస్తులను కాపాడుకోవాలంటే కచ్చితంగా సేఫ్ డాక్యుమెంటేషన్‌ అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇలాంటి ప్రూఫ్ లేదు. అందువల్ల చాలా మంది ఆస్తులు కోల్పోయే వారు. అందుకే మన ఆస్తులను నిర్ధారించడానికి ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈమధ్య కాలంలో ఆస్తి మోసం మరియు నకిలీ పత్రాలతో కూడిన బ్లాక్‌మెయిల్ సంఘటనలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అందుకే ఆస్తి యజమానులను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.రెవెన్యూ శాఖ, తాలూకా కార్యాలయాల ద్వారా ఆస్తుల రికార్డులను డిజిటైజేషన్ చేసేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ డిజిటైజేషన్ అనేది ప్రాపర్టీ డాక్యుమెంట్ యాక్సెస్‌ను ఈజీ చేస్తుంది. దీని వల్ల మీ ఆస్తికి మీరే యజమాని అని చాలా ఈజీగా ప్రూవ్ చేయవచ్చు. పైగా దీని వల్ల ఎవరు కూడా మీ సంతకాలను ఫోర్జరీ చేయలేరు.

డిజిటైజేషన్ అంటే ఆస్తి యజమానులు తమ ఆస్తి డాక్యుమెంట్లను గవర్నమెంట్ పోర్టల్‌లకు అప్‌లోడ్ చేయాలి. ఈ విధంగా డిజిటల్ రికార్డులను కలిగి ఉండటం వలన ఆస్తి యజమానులు ఆస్తి సంబంధిత డాక్యుమెంటేషన్ కోసం ఎటువంటి కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మోసాలు జరగకుండా కచ్చితంగా ఆస్తి పత్రాలకు ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి. ఈ లింకేజీ ఆస్తికి నిజమైన యాజమనులను వెరిఫై చేయడంలో సహ్యపడుతుంది. ఇది అనధికార అమ్మకాలను కూడా తగ్గిస్తుంది. డిజిటైజేషన్ వల్ల మోసగాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కష్టం అవుతుంది. ఈ డిజిటైజేషన్ ప్రాసెస్ జనవరి నెలలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆస్తి యజమానులు ఆస్తి పత్రాలను సేకరించి, ఆధార్ లింకేజీని వెరిఫై చేసుకొని రెఢీ గా ఉండండి. మీ ఆస్తిని కాపాడుకోండి.

ఇండస్ట్రీలో అఖీరా ఎంట్రీ పై హాట్ టాపిక్

ఇండస్ట్రీలో తరం మారుతుంది. వారసుల ఎంట్రీ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు కొత్త యుద్దానికి రెడీ అవుతున్నారు. ప్రేక్షకులు కూడా వారికి ఓపెన్ హార్ట్ తో గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. వీరిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్ ఎంట్రీ అందరికి హాట్ టాపిక్ గా మారింది. అంతకముందు వరకు అకీరా నందన్ గురించి బజ్ ఏమి లేదు. కానీ ఈ మధ్యన మాత్రం తెగ వైరల్ అవుతున్నాడు. అఖీరా ఓజిలో క్యామియో చేస్తున్నాడంటూ.. రీసెంట్ గా ఓ న్యూస్ కూడా బాగా సౌండ్ చేసింది. కానీ దీనిపై మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్సుమెంట్ రాలేదు. క్యామియో సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ ఎంట్రీ గురించే డిస్కషన్ మొదలైంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు పవన్ వారసుడి వంతు వచ్చింది.

త్వరలో అఖీరా ఎంట్రీ అయితే కన్ఫర్మ్. అది ఓజి నా లేదా మరో సినిమానా అని అయితే క్లారిటీ లేదు. కానీ అందుకు బీజం పడిందన్న వార్తలు మాత్రం క్లియర్ గా వినిపిస్తున్నాయి. గతంలో రేణు దేశాయ్ కూడా చాలా సందర్భాల్లో అఖీరా ఎంట్రీ గురించి చెప్పుకొచ్చారు. ఇక అఖీరాకు కూడా ఒక హీరోలో ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అఖీరా స్కిల్స్ , లుక్స్ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో అఖీరా న్యూయార్క్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడని టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు అతను సత్యానంద్ యాక్టింగ్ స్కూల్‌లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాడని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అక్కడే యాక్టింగ్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. సో ఇప్పుడు తండ్రి బాటలోనే కొడుకు కూడా నడుస్తున్నాడు . అఖీరా ఎంట్రీ గురించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కానీ.. ఒక్కసారి ఎంట్రీ ఇస్తే మాత్రం పవన్ అభిమానులు అఖీరాకు బ్రహ్మరథం పడతారన్న మాట వాస్తవం.

అటు అభిమానులతో పాటు మూవీ లవర్స్ అంతా కూడా అఖీరా ఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఎంట్రీ ఇస్తే ఎలాంటి కథలను ఎంచుకుంటాడు. ఏ దర్శకుడి ద్వారా లాంచ్ అవుతాడు.. తండ్రి స్టార్ డం ను క్యారీ చేయగలుగుతాడా లేదా.. అనే ప్రశ్నలతో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ కుర్రాడు హీరోగా రాణించే రోజు ఎప్పుడు వస్తుందో.. ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు , ఓజి సినిమాల షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా లైన్ లో ఉంది. కానీ దీని గురించి మాత్రం ఎప్పుడు ఏంటి అనే అంతగా టాక్ వినిపించడం లేదు.

వాహనదారులకు షాకింగ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న RTO

ఇప్పుడు చెప్పే వార్త దేశవ్యాప్తంగా కూడా వాహన యజమానులకు చేదు వార్తనే చెప్పాలి. తాజాగా RTO కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వాహనదారులకు కష్టాలు తప్పవు. ఇక RTO తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటి? కొత్త రూల్స్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత కాలంలో రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. దీని వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులకు కూడా కష్టాలు తప్పట్లేదు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా వాహనదారులు చాలా మంది కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. బాధ్యత లేకుండా నడుచుకుంటున్నారు.

ఇక రవాణాశాఖ దీన్ని గుర్తించి కఠిన రూల్స్ అమలు చేస్తోంది. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు ఎంత నిఘా ఉంచినా కానీ, రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాలు నడుపుతున్న వారు ఎక్కువ అయిపోయారు. ఇలాంటివి ఎక్కువ అవడంతో ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు స్ట్రిక్ట్ గా చెకింగ్ లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ రూల్ ని ఇంకా కఠినతరం చేశారు. కొందరు వాహనదారులు కావాలనే ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించి రోడ్డు పక్కనే స్నానాలు చేస్తున్నారు. కాబట్టి ఇక నుంచి ఇలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి కచ్చితంగా రూ.10,000 జరిమానా విధించనున్నారు.అలాగే జరిమానాలతో పాటు వాహనాలను కూడా సీజ్ చేస్తారు.అలాగే పొలుష్యన్ అండర్ కంట్రోల్(PUC) సర్టిఫికేట్ లేని వాహనాలకు భారీ షాక్ తగలనుంది. ఇలాంటి వాహనదారులకు పెట్రోల్ పంపుల వద్ద జరిమానా విధించే కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఇంకా అదే విధంగా ఆ సర్టిఫికెట్ సకాలంలో రెన్యువల్ చేసుకోకపోతే కూడా కచ్చితంగా రూ.10,000 ఫైన్ కట్టాల్సిందే.

ఇంకా అదే విధంగా రవాణా శాఖ వాహనాలకు HIGH SECURITY REGISTRATION PLATES (HSRP) ని తప్పనిసరి చేసింది. జనవరి 1 తర్వాత దీని అమలును కచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షిస్తారు, దీనికి డిసెంబర్ దాకా అనుమతి ఉంటుంది. దీన్ని పెట్రోల్ బంకులో కూడా చెక్ చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి వాహనదారులు తప్పనిసరిగా ఈ నంబర్ ప్లేట్ పొందాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. డ్రైవర్ల సేఫ్టీ కోసం ఈ రూల్ అనేది అమలు చేయబడింది. దీన్ని ఉల్లంఘిస్తే బైకులకు, ట్రాక్టర్లకు రూ.2 వేలు, పెద్ద వాహనాలకు రూ.5 వేలు జరిమానా విధిస్తారు. ఈ రూల్స్ దేశంలోని అన్నీ రాష్ట్రాలకు కూడా వర్తిస్తాయి. కాబట్టి కచ్చితంగా ఈ రూల్స్ గుర్తు పెట్టుకోండి.

విద్యార్థులకు వరం పీఎం విద్యాలక్ష్మి స్కీమ్.. ఏకంగా రూ. 7.5 లక్షలు పొందే ఛాన్స్.

సరస్వతీ కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం లేక చదువుకు దూరమవుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. డబ్బు లేని కారణంగా చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. మరికొంత మంది ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉండి కూడా ఆర్థిక కారణాలతో ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. చదువును ఆపేసి ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నాయి. ఆర్థిక సాయం అందించే పథకాలను తీసుకొస్తూ అండగా నిలుస్తున్నాయి. విద్యార్థులకు స్కాలర్ షిప్స్, విద్యా రుణాలను అందిస్తూ ఉన్నత చదువుల వైపు ప్రోత్సహిస్తున్నాయి.

విదేశాల్లో చదువుకునేందుకు కూడా తక్కువ వడ్డీకే లక్షల్లో లోన్స్ అందిస్తూ సాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. విద్యార్థులకు లోన్స్ అందించేందుకు పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన వారు ‘విద్యాలక్ష్మి పథకం’ ద్వారా లోన్స్ పొందవచ్చు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 3,600 కోట్లను కేటాయించింది. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులు రూ. 7.5 లక్షల లోన్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రూ. 7.5 లక్షల లోన్ పొందొచ్చు. ఈ రుణంలో 75 శాతం వరకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది.

దీంతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ప్రోత్సాహం లభించినట్లు అవుతుంది. పీఎం విద్యాలక్ష్మీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో లోన్స్ లభించనున్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే మెరిట్ విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండనున్నది. లక్షలాది మంది విద్యార్థులకు లాభం చేకూరనున్నది. అయితే ఈ పథకం ద్వారా లోన్ పొందాలంటే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలని తెలిపింది. రూ.10లక్షల వరకు రుణాలపై రూ.3శాతం వడ్డీరాయతీ కల్పించనున్నారు.

ఏదైనా ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ పొందుతున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం విద్యా లక్ష్మీ పథకాన్ని యూజ్ చేసుకుని మీ ఉన్నత విద్యను పూర్తి చేసుకోవచ్చు. మీ కలల జీవితాన్ని సాకారం చేసుకోవచ్చు.

Health

సినిమా