బోర్న్‌విటా కి షాక్… అది హెల్త్ డ్రింక్ కాదు.. షుగర్ లెవల్స్ ఎక్కువ.. కేంద్రం సంచలన ఆదేశాలు

Bournvita: బోర్న్‌విటాని హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తీసేయాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు అన్ని ఈ-కామర్స్ సంస్థలకు తమ ప్లాట్‌ఫారమ్స్ నుంచి తొలగించాలని సూచించింది.
వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బోర్న్‌విటాతో పాటు అన్ని రకాల పానీయాలను ఈ కేటగిరి నుంచి తొలగించాలని ఆర్డర్స్ ఇష్యూ చేసింది. నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (CPCR) యాక్ట్, 2005 సెక్షన్ (3) కింద ఏర్పాటైన ఒక చట్టబద్ధమైన సంస్థ, CPCR చట్టం, 2005లోని సెక్షన్ 14 కింద విచారణ జరిపిన తర్వాత ”ఎఫ్ఎస్ఎస్ఏఐ మరియు మోండెలెజ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమాలు మరియు నిబంధనలు ప్రకారం హెల్త్ డ్రింక్స్ నిర్విచించబడలేదు” అని మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.
హెల్త్ డ్రింక్ లేదా ఎనర్జీ డ్రింక్స్ కేటగిరి కింద ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో విక్రయించబడుతున్న డైరీ బెస్డ్ బెవరేజ్ మిక్స్, సెరియల్ బేస్డ్ బెవరేజ్ మిక్స్, మాల్ట్ బేస్డ్ బెవరేజ్‌లు సమీప కేటగిరితో ‘ప్రొప్రైటరీ ఫుడ్’ కింద లైసెన్స్ పొందిన ఆహార ఉత్పత్తులని గుర్తించిన తర్వాత FSSAI నుంచి ఈ ప్రతిస్పందన వచ్చింది. దీంతో FSSAI అన్ని ఇ-కామర్స్ కంపెనీలకు వారి వెబ్‌సైట్‌లలోని ‘హెల్త్ డ్రింక్స్/ఎనర్జీ డ్రింక్స్’ కేటగిరి నుంచి అటువంటి పానీయాలను తీసేయాలని లేదా తొలగించడం ద్వారా ఈ తప్పుడు వర్గీకరణను వెంటనే సరిదిద్దాలని సూచించింది.


మరోవైపు, బోర్న్‌విటాలో షుగర్ లెవల్స్ ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యమైన పరిమితుల కంటే చాలా ఎక్కువగా ఉందని ఎన్‌సిపిసిఆర్ చేసిన పరిశోధన నేపథ్యంలో ఈ ఆర్డర్స్ వచ్చాయి. భద్రతా ప్రమాణాలు మరియు మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన మరియు పవర్ సప్లిమెంట్లను ‘హెల్త్ డ్రింక్స్’గా అంచనా వేస్తున్న కంపెనీలపై చర్య తీసుకోవాలని NCPCR భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI)ని కోరింది.