అమెరికాలో ప్రశ్నార్థకంగా ఎంఎస్ చేస్తున్న విద్యార్థుల పరిస్థితి.. బిక్కుబిక్కుమంటున్న తెలుగు విద్యార్థులు

అమెరికాలో ఎంఎస్ చేసేందుకు వెళ్లిన వేలాది మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే చాలా మంది విద్యార్థుల హెచ్‌-1బీ దరఖాస్తులు తిరస్కరణకు గురికావడమే.
దీంతో చాలా మంది తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాలు.. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్‌) 2025 ఆర్థిక సంవత్సరం కోసం లాటరీ విధానంలో తమ దరఖాస్తులను దాఖలు చేసిన హెచ్-1బీ దరఖాస్తుదారులకు ఈ మెయిల్ నోటిఫికేషన్‌లను పంపింది. యూఎస్‌సీఐఎస్ లాటరీ విధానంలో యాదృచ్చిక ఎంపికలు జరిపిన తర్వాత.. దరఖాస్తు ఆమోదాలను, తిరస్కరణలను పంపింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

యూఎస్‌సీఐఎస్‌ తగిన సంఖ్యలో దరఖాస్తులను అందుకుంది.. అయితే ఈ పరిమితి 65,000 H-1B వీసా రెగ్యులర్ క్యాప్ కాగా, మాస్టర్స్ విద్యార్థులకు 20,000 మాత్రంగా ఉంది. అయితే వేలాది మంది ఎంఎస్ విద్యార్థులు వారి దరఖాస్తుల తిరస్కరణల గురించి తెలియజేయబడింది. దీంతో సోషల్ మీడియా ద్వారా వారు నిరాశ, విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఇప్పటికే తమ కళాశాలల కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినందున.. తదుపరి ఏమి చేయాలనే దానిపై ఎలాంటి ఆలోచన లేకుండా ఉండిపోయారు.

అయితే అలాంటి విద్యార్థులు తమ చదువులను పొడిగించుకోవడానికి భారతదేశంలోని తల్లిదండ్రుల నుంచి ఎక్కువ డబ్బు తీసుకురావాల్సి ఉంటుంది. అంతేకాకుండా హెచ్ -బీ సీజన్ తెరవడానికి వచ్చే ఏడాది వరకు వేచి ఉండాలి. అయితే వచ్చే ఏడాది వారి దరఖాస్తు ఎంపిక చేయబడుతుందనే గ్యారంటీ కూడా లేదు. మరోవైపు వచ్చే ఏడాది ప్రస్తుతం తిరస్కరణకు గురైన వారితో పాటు కొత్తవారితో కలిపి.. ఈ దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉటుంది.

Related News

ఈ పరిణామాల నేపథ్యంలో.. అమెరికాలో ఎంఎస్ చేస్తున్న మెజారిటీ భారతీయ విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కోవిడ్ అనంతరం ఉన్నత చదువులకోసం తమ దేశం రావాలని అనుకుంటున్న దాదాపు ప్రతి విద్యార్థికి అమెరికా వీసాలు జారీ చేసింది. అయితే అలా వెళ్లిన చాలా మంది విద్యార్థులు ఇప్పుడు అక్కడ కఠినమైన వాస్తవాన్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు దరఖాస్తులు ఎంపిక చేయబడిన విద్యార్థులు కూడా త్వరలో ఉద్యోగంలో చేరాల్సి రావడంతో సంతోషించలేకపోతున్నారు. ఎందుకంటే..వారు నిరంతర పేరోల్‌ను చూపించాలి, లేకపోతే వారు రెన్యూవల్స్ కోసం వెళ్లినప్పుడు భవిష్యత్తులో తిరస్కరణలను ఎదుర్కొంటారు. అయితే అందరూ కాకపోయిన.. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లినవారిలో పలువురు విద్యార్థులు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు.

లింక్డిన్‌లో శ్రేయా మిశ్రా అకౌంట్ నుంచి ఇలాటి పరిస్థితే నివేదించబడింది. ”నేను యూఎస్‌లో STEM డిగ్రీ కోసం దాదాపు $100k వెచ్చించాను. ఇప్పుడు హెచ్‌ 1బీ కోసం ఒక్క అవకాశం మాత్రమే మిగిలి ఉంది. ఇది నన్ను ఎక్కడకు తీసుకెళ్తుందో తెలియడం లేదు. నా రెండవ అవకాశంలో కూడా నేను హెచ్ 1బీ లాటరీలో ఎంపిక కాలేదని తెలుసుకుని రెండు రోజులు అయ్యింది. దీని అర్థం వచ్చే ఏడాది నా చివరి అవకాశంలో నేను హెచ్‌ 1బీ పొందకపోతే.. నేను అమెరికా వదిలి వెళ్ళవలసి ఉంటుంది” అని శ్రేయా మిశ్రా పేర్కొన్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *