BREAKING: పవన్ కల్యాణ్‌కు ఈసీ నోటీసులు.. వివరణ ఇవ్వాలని 48 గంటల డెడ్ లైన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల అనకాపల్లిలో నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు.


ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ పై చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని పవన్‌ను ఈసీ ఆదేశించింది. కాగా, పవన్ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.