Life style: కాళ్లలో కనిపించే ఈ లక్షణాలు.. లివర్‌ డ్యామేజ్‌కు సంకేతాలు..

శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు ముందస్తు వ్యాధులకు సంకేతాలుగా నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వ్యాధులకు సంబంధించి శరీరం ముందుగానే మనల్ని ఈ లక్షణాల ద్వారా అలర్ట్ చేస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

అలాంటి వాటిలో కొన్ని లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మారుతోన్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా లివర్‌ సంబంధిత వ్యాధులతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే లివర్‌ సమ్యలను ముందుగానే గుర్తిస్తే.. చికిత్స కూడా త్వరగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ లివర్‌ వ్యాధిని ముందుగా గుర్తించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కాలేయం దెబ్బతినడం ప్రారంభమైనప్పుడు. పాదాలు, చీలమండలు, అరికాళ్లు ఉబ్బుతాయి. ఇవి కాలేయ సంబంధిత వ్యాధుల సంకేతాలు కావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ వ్యాధి కారణంగా కాలేయ వ్యాధి సిర్రోసిస్‌తో పాటు కాలేయ క్యాన్సర్‌గా మారుతుంది. దీని కారణంగా కాలు వాపు ప్రారంభమవుతుంది.

Related News

* హెపటైటిస్ వ్యాధి ప్రాథమిక లక్షణాల్లో కాళ్లలో దురద కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు కాలేయ వ్యాధి ఉన్న వారికి చేతులు, కాళ్ల చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దురద ఎక్కువగా వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

* లివర్‌ వ్యాధి ప్రారంభ లక్షణాల్లో అరికాళ్లలో నొప్పి కూడా ఒకటని పుణులు చెబుతున్నారు. కాలేయం సరిగా పనిచేయని సమయంలో కాళ్లలో ద్రవాలు పేరుకు పోవడం ప్రారంభమవుతాయి. దీంతో అరికాళ్లు ఉబ్బడంతో పాటు నొప్పి కూడా మొదలవుతుంది. కాబట్టి ఈ లక్షణం కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత చికిత్స చేయించుకోవాలి.

* ఇక లివర్‌ వ్యాధికి అత్యంత సాధారణ కారణాల్లో హెపటైటిస్‌ కూడా ఒకటి. డయాబెటిక్ పేషెంట్‌కు కాలేయంలో ఎలాంటి సమస్య వచ్చినా పాదాలలో జలదరింపు, తిమ్మిరి మొదలవుతుంది. డయాబెటిక్ రోగులలో ఈ సమస్య తరచుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *