పొరపాటున కూడా ఈ 4 వస్తువులు ఎవరికీ ఇవ్వకండి.. ఇస్తే దురదృష్టాన్ని ఆహ్వానించినట్లే !

ఇటీవల కాలంలో పుట్టిన రోజున, స్నేహితుల దినోత్సవం రోజున మిత్రులకు, కావాల్సిన వారికి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది అలవాటుగా మారిపోయింది. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


ఎవరి మీదైనా సరే మనకున్న ప్రేమను వ్యక్త పరచడానికి గిఫ్ట్స్ ఇవ్వడం ఉత్తమ మార్గం. అయితే జోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల గిఫ్ట్స్ తీసుకుంటే మీ జీవితానికి అశుభం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వకూడదో, తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

బహుమతిగా ఇవ్వకూడని 4 వస్తువులు ఇవే..

ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇస్తున్నారా..

ఉంగరాన్ని ఎవరికైనా సరే బహుమతిగా ఇవ్వకూడదు. ఎదుటి వారి నుంచి ఉంగరాన్ని అస్సలు తీసుకోకూడదు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉంగరాన్ని ఇచ్చే వ్యక్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది కాకుండా, వ్యక్తి ఆర్థిక పరిస్థితి బలహీనపడే అవకాశం కూడా ఉంది. దీనితో పాటు, ఉంగరం తీసుకునే వ్యక్తిపై కూడా ప్రభావం చూపుతుంది.

గడియారం బహుమతిగా ఇవ్వవచ్చా..

మీరు గడియారాన్ని ఏ వ్యక్తి నుంచి బహుమతిగా తీసుకోకండి. ఎందుకంటే ఒక వ్యక్తి మీకు గడియారాన్ని బహుమతిగా ఇస్తే.. అది మీ జీవితం మీద చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

పెన్నును గిఫ్ట్‌గా తీసుకోవచ్చా..

ఎవరి దగ్గరి నుంచి అయినా సరే పెన్నును బహుమతిగా తీసుకోరాదు. పెన్ను కొనడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయని నమ్ముతారు. అంటే వ్యక్తి ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

బూట్లు, చెప్పులు బహుమతిగా తీసుకోవచ్చా..

ఎవరికైనా బూట్లు లేదా చెప్పులు బహుమతిగా ఇవ్వకూడదు. వీటిని పేదరికానికి సంకేతాలుగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, షూ, చెప్పులు బహుమతిగా కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి. దీంతో పాటుగా శని ప్రభావం కూడా మీ పై పడుతుంది.