Seeds For Iron : ఈ గింజలను రోజూ తింటే చాలు.. రక్తం పుష్కలంగా తయారవుతుంది..!

Seeds For Iron : మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు అనేక రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం. వాటిల్లో ఐరన్ కూడా ఒకటి. ఐరన్ మన శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.


ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. అలాగే రక్తం ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది. అందువల్ల ఐరన్ ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఐరన్ వేటిలో ఉంటుంది ? అని మీరు సందేహ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పుడు మేం చెప్పబోయే పలు రకాల గింజలను రోజూ తింటే చాలు, దాంతో మీ శరీరానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఐరన్ అధికంగా ఉండే ఆ గింజలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐరన్ ఎక్కువగా ఉండే గింజల్లో గుమ్మడికాయ గింజలు కూడా ఒకటి. ఒక ఔన్సు గుమ్మడికాయ విత్తనాలను తింటే 2.5 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. మనకు రోజుకు కావల్సిన ఐరన్‌లో ఇది 14 శాతంగా ఉంటుంది. అందువల్ల రోజూ ఈ గింజలను తినాలి. దీంతో మనకు మెగ్నిషియం, జింక్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా లభిస్తాయి. అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కనుక రోజూ గుమ్మడి గింజలను తినాలి.

Seeds For Iron
నువ్వులను రోజూ తినడం వల్ల కూడా మనకు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తిన్నా చాలు 1.3 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. అలాగే క్యాల్షియం, మెగ్నిషియం, కాపర్ కూడా మనకు నువ్వుల ద్వారా లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో దోహదపడతాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటి ద్వారా కూడా మనకు ఐరన్ లభిస్తుంది. 1 ఔన్సు పొద్దు తిరుగుడు గింజలను తింటే సుమారుగా 1.4 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. దీంతోపాటు విటమిన్ ఇ, మెగ్నిషియం, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా లభిస్తాయి. ఇక ఇవేకాకుండా అవిసె గింజలను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. దీంతో కూడా ఐరన్ లభిస్తుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.