Breaking: టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. వాయిదా తీర్మానం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ తమ్మినేని ఛాంబర్‌ను చుట్టిముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాయిదా తీర్మాన ప్రతులను స్పీకర్ వెల్‌పైకి విసిరేశారు. స్పీకర్ ఎంత వారించినా ఆగకుండా స్పీకర్ చాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ నేతల అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. దీంతో టీడీపీ నేతలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ మర్యాదలు కాపాలని కోరినా ఆందోళనను కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యులపై ఒక్క రోజు సస్పెన్షన్ వేశారు. సభను ఆర్డర్‌లో పెట్టేందుకే టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేసినట్లు స్పీకర్ పేర్కొన్నారు.


అయితే అసెంబ్లీలో స్పీకర్ ఏకపక్షంగా వ్యహరించారని టీడీపీ నేతలు మండిపడ్డారు. వాయిదా తీర్మానంపై పెట్టకుండా..తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సస్పెన్షన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుధలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని హెచ్చరించారు.