ప్రైవేటు దిగ్గజ టెలికాం కంపెనీలకు పోటీగా ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తోంది. పెరిగిన టెలికాం ధరల తర్వాత బిఎస్ఎన్ఎల్ చార్జీలు పెంచకపోవడంతో ఎక్కువ మంది యూజర్లు బిఎస్ఎన్ఎల్ లో చేరారు. ఇందులో ఆకర్షణీయమైన ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈరోజు 80 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ఎంత తక్కువ ధరతో ఎన్నో లాభాలు అందిస్తుంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అత్యంత తక్కువ ధరలోనే టెలికాం ప్యాక్లను అందుబాటులో ఉంచుతుంది. ఈరోజు ప్రత్యేకంగా 80 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
బీఎస్ఎన్ఎల్ రూ. 485 ప్లాన్.. బీఎస్ఎన్ఎల్ ఈ రూ.485 ప్లాన్ 80 రోజుల వాలిడిటీ వస్తుంది. ఇందులో ప్రతిరోజు 2 జీబీ డేటి లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్‌వర్క్ అయినా చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. అంటే మొత్తంగా ఈ ప్లాన్ లో 160gb డేటా పొందుతారు.
ప్లాన్ పూర్తిగా అయిపోయిన తర్వాత 40 కేబీపీఎస్ డేటా లభిస్తుంది. దీని ధర కేవలం రూ.485 మాత్రమే. మీరు కూడా తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ పొందాలనే బిఎస్ఎన్ఎల్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ప్లాన్. ఇందులో ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా పొందుతారు.
బీఎస్ఎన్ఎల్ 180 రోజుల ప్లాన్.. బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ధర రూ. 897 మాత్రమే ఇందులో కూడా అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ఇతర బెనిఫిట్స్ పొందుతారు. 80 రోజులు వస్తుంది ఇందులో వాయిస్ కాలింగ్ తో పాటు 100 ఎస్ఎంఎస్ లు ప్రతిరోజు ఫ్రీ మొత్తంగా హై స్పీడ్ డేటా కూడా పొందుతారు.
ఇందులో డేటా పూర్తయిపోయిన తర్వాత 40 కేబీపీఎస్ నెట్ పొందుతారు. ఇది ఎక్కువ రోజులు వాలిడిటీ లభించే అద్భుతమైన ప్లాన్. ఇందులో అందుబాటులో ఉన్న ప్లాన్ అని చెప్పొచ్చు. తక్కువ ధరకే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
































