Business Idea: సొంతంగా వ్యాపారం చేయాలని ఉందా.? బెస్ట్‌ బిజినెస్ ఐడియా మీకోసం..

ప్రస్తుతం సొంతంగా బిజినెస్‌ చేయాలనుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాలు పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.
అయితే వ్యాపారం అనగానే నష్టం వస్తుందేమోననే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టాలు అనేవి ఉండవు. అలాంటి బెస్ట్‌ బిజిసెస్‌ ఐడియాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ప్రస్తుతం మార్కెట్లో కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. మధ్య తరగతి కుటుంబాలు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో కార్‌ వాషింగ్ సెంటర్లకు డిమాండ్‌ పెరిగింది. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోనూ కార్ల వినియోగం పెరిగింది. దీంతో మండల కేంద్రాల్లోనూ కార్ వాషింగ్‌ సెంటర్స్‌ వెలుస్తున్నాయి. కార్‌ వాషింగ్‌ సెంటర్‌ బిజినెస్ ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఇంతకీ కార్‌ వాషింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది.? ఎలాంటి లాభాలు ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కార్‌ వాషింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడానికి కనీసం రెండు కార్లను పార్క్‌ చేసేందుకు వీలు ఉండేలా స్థలం ఉండాలి. అలాగే కార్‌ వాషింగ్‌ కోసం ఒక ప్రొఫెషనల్‌ మిషన్‌ అవసరపడుతుంది. దీని ధర రూ. 12 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. 2 హార్స్‌ పవర్ మిషన్‌ ధర రూ. 14 వేలు ఉంటుంది. ఈ మిషన్‌తో పాటు 30 లీటర్ల వ్యాక్యూమ్‌ క్లీనర్‌ అవసరపడుతుంది. దీని ధర సుమారు రూ. 9 నుంచి రూ. 10 వేల వరకు ఉంటుంది. అలాగే షాంపూ, గ్లోవ్స్‌, టైర్‌ పాలిష్‌తో పాటు 5 లీటర్ల డ్యాష్‌బోర్డ్‌ పాలసీతో సహా వాషింగ్‌ సామాగ్రి అవసరపడుతుంది.

ఇవన్నీ రూ. 1500 నుంచి రూ. 2000 వరకు ఖర్చవుతుంది. కార్‌ వాషింగ్‌ ఏర్పాటు చేయడానికి స్థలం కాకుండా కనీసం రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు అవసరపడుతుంది. ఇక లాభాలు విషయానికొస్తే.. కారు వాషింగ్‌ ఛార్జీలు స్థలం బట్టి మారుతుంది. సాధారణంగా చిన్న నగరాల్లో కారు వాషింగ్‌కు రూ. 150 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. అదే పెద్ద నగరాల్లో అయితే రూ. 250 నుంచి రూ. 800 వరకు వసూలు చేయొచ్చు. అలాగే ఎస్‌యూవీ కార్ల విషయానికొస్తే రూ. 1000 వరకు కూడా ఆర్జించవచ్చు. కారు వాషింగ్ ద్వారా రోజుకు 8 నుంచి 10 కార్లను క్లీన్ చేసినా, నెలకు సరాసరి రూ. 80 వేల వరకు సంపాదించవచ్చు.

Related News

Related News