మీకు కోపం అధికంగా వస్తుందా? అయితే రోజూ కాసేపు మెట్లు ఎక్కి దిగండి..

మెట్లు ఎక్కడం లేదా దిగడం వల్ల సమయాన్ని వృధా చేయకూడదని చాలా మంది అనుకుంటారు. అందుకే అంతస్తు నుంచి మరొక అంతస్తుకు నిమిషాల్లో తీసుకెళ్లగల లిఫ్ట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇలాంటి షార్ట్‌కట్‌లు ఎల్లప్పుడూ మంచిది కాదనే విషయం ఎప్పటికీ..

ప్రస్తుత కాలంలో ప్రతి భవనంలోనూ లిఫ్ట్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అధిక మంది మెట్లు ఎక్కడం మానేస్తున్నారు. మెట్లు ఎక్కడం లేదా దిగడం వల్ల సమయాన్ని వృధా చేయకూడదని చాలా మంది అనుకుంటారు. అందుకే అంతస్తు నుంచి మరొక అంతస్తుకు నిమిషాల్లో తీసుకెళ్లగల లిఫ్ట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇలాంటి షార్ట్‌కట్‌లు ఎల్లప్పుడూ మంచిది కాదనే విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే వ్యాయామం చేయడానికి సమయం లేనివారికి, జిమ్ సౌకర్యాలు లేనివారికి ఈ మెట్లు ఎక్కడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కష్టంగా అనిపించినప్పటికీ తద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి మెట్లు ఎక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ అలవాటు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..


బరువు తగ్గడంలో సహాయపడుతుంది

మెట్లు ఎక్కడం కూడా ఒక వ్యాయామం. ఇది రోజువారీ కార్యకలాపాలలో ఒక భాగం చేసుకోవడం మంచిది. మెట్లుఎక్కడం అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా అంటున్నారు. అధిక బరువు ఉన్నవారు కొన్ని రోజుల్లోనే బరువు తగ్గడానికి ఈ అభ్యాసం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇటీవలి అధ్యయనాలు కూడా మెట్లు ఎక్కడం కేలరీలను బర్న్ చేయడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుందని వెల్లడించాయి.

కండరాలు బలపడతాయి

మెట్లు ఎక్కడం అనే సులభమైన వ్యాయామంతో కాళ్ళ కండరాలు బలపడతాయి. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం వల్ల కండరాల బలహీనత నివారించబడుతుంది. అంతేకాదు, మెట్లు ఎక్కడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఇద కీళ్ల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఓర్పు పెరుగుతుంది

మెట్లు ఎక్కడం అనేది శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడే గొప్ప వ్యాయామం. క్రమం తప్పకుండా చేస్తే ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాదు, మెట్లు ఎక్కడం అనేది ఓర్పును పెంచే ఏరోబిక్ వ్యాయామం కూడా.క్రమం తప్పకుండా సాధన చేస్తే మీ ఓర్పు రెట్టింపు అవుతుంది.

నడక వంటి కార్యకలాపాల కంటే మెట్లు ఎక్కడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయని పరిశోధకులు నిరూపించారు. మెట్లు ఎక్కడం వల్ల నిమిషానికి 8 నుంచి 11 కేలరీలు ఖర్చవుతాయి. వారానికి ఐదు రోజులు దాదాపు 30 నిమిషాలు మెట్లు ఎక్కడం వల్ల బరువు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.