మీ మెడ నుండి మంగళసూత్రాన్ని తీసివేయగలరా? ఇవే షాకింగ్ నిజాలు.

 మహిళలు చాలా వరకు నేటి కాలంలో మెడలో మంగళసూత్రం ఉంచుకోవడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. ఏదో చిన్నగా స్టైల్ గా ఉండే విధంగా మంగళసూత్రాన్ని వేసుకుంటున్నారు.


హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహిత స్త్రీకి మంగళసూత్రం చాలా పవిత్రమైన ఆభరణం. నేటి కాలంలో ఈ సాంప్రదాయాన్ని ఎవరూ పెద్దగా పాటించడం లేదు. ప్రస్తుతం కొంతమంది మహిళలు ఉద్యోగానికి వెళ్తున్నామని మంగళ సూత్రాన్ని ఉంచుకోవడం లేదు. నిద్రపోయే సమయంలో కూడా చాలామంది మహిళలు మంగళసూత్రాన్ని తీసి పక్కన పెడతారు. కొంతమంది మరికొన్ని సమస్యల కారణంగా మంగళసూత్రాన్ని తీసేస్తారు.

అయితే ఇలా మంగళసూత్రం తీయడం వల్ల అరిష్టాలు సంభవిస్తాయని చాగంటి కోటేశ్వరరావు సమాధానం ఇచ్చారు. ఎలాంటి కారణాల వల్ల కూడా మంగళసూత్రాన్ని తీయకూడదని వెల్లడించాడు. ఒకవేళ ఆ మంగళసూత్రానికి ఏమైనా మరమ్మతులు చేయించాల్సి ఉంటేనే తిథి చూసుకొని మంచి రోజున తీసి మరమ్మతులు చేయించుకోవాలని వెల్లడించారు. మంగళసూత్రం తీసేసిన రోజు కనీసం మెడలో పసుపు తాడు అయినా కట్టుకోవాలని చెప్పారు.

మంగళ సూత్రం తీసేస్తే భర్త ప్రాణాలకు అరిష్టం కలుగుతుందని చాలామంది పండితులు చెబుతూనే ఉంటారు. భర్త యోగక్షేమాలు బాగుండాలంటే మంగళసూత్రాన్ని మహిళలు తీసేయకూడదు. మంగళ సూత్రం భర్తకు ప్రతిరూపం. వివాహంలో చాలామంది జనాల నడుమ, పండితుల నడుమ వేద మంత్రోచ్ఛరణల మధ్య మంగళ సూత్రాన్ని కడతారు. అలాంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని తీసివేయడం చాలా ప్రమాదకరం. ప్రతి ఒక్క స్త్రీ ఈ విషయాన్నీ గుర్తుంచుకొని మంగళసూత్రాన్ని తీసేయకూడదు. ఒకవేళ మంగళ సూత్రాన్ని తీసేసిన పసుపు తాడును కట్టుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.