Cardamom : సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో యాలకులను ప్రత్యేకంగా చెప్పవచ్చు. పురాతన కాలం నుంచి సుగంధ ద్రవ్యంగా యాలకులను వినియోగిస్తూనే ఉన్నారు.
యాలుకల్లో అనేక ఔషదగుణాలు ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో మసాలా దినుసులు గాను, మౌత్ ప్రెష్ నర్ గా వాడుతుంటారు. టీ తయారీలో యాలకులను ఉపయోగిస్తుంటారు.
యాలుకలతో అనేక ఆరోగ్యప్రయోజనాలు సిద్ధిస్తాయి. మానసిక ఒత్తిడిని నియంత్రించటంతోపాటు మూత్రపిండాల్లో రాళ్ళను కరిగిస్తాయి.
ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు యాలకులు చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు. యాలకుల్లో పొటాషియం, మెగ్నీషియం శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి దోహపడతాయి.
ఇందులో ఉండే ఫైబర్, కాల్షియంలు శరీర బరువును నియంత్రించటంలో సహాయపడతాయి. జీర్ణ సమస్యలు, ఆస్తమా, దగ్గు, జలుబును తగ్గించడంలో యాలకులు దోహదపడతాయి.
రోజు భోజనం చేశాక రెండు యాలకులను నమలటం వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది.
వికారం, కడుపుబ్బరం, ఆకలి మందగించడం లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు యాలకుల్ని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూడాలి. అలాగే రెండు, మూడు యాలకులు, లవంగాలు, చిన్న అల్లం ముక్క, ధనియాలను తీసుకుని పొడి చేయాలి. ఒక గ్లాసు వేడి నీటిలో కలుపుకుని తాగితే అజీర్ణ సమస్య పోతుంది.
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుందని ఆయుర్వేదనిపుణులు సూచిస్తున్నారు. యూలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. జలుబూ, దగ్గు లాంటివి సమస్యలు తొలగిపోతాయి.
యాలకుల్లో అధిక మొత్తంలో ఉండే ఐరన్ శరీరంలోని బీపిని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. స్మోకింగ్ అలవాటును దూరం చేయడంలో యాలకులు అద్భుతంగా సహాయ పడతాయి.
యాలకుల్లో ఉండే పలు రకాల కాంపౌండ్స్ సిగరెట్స్ తాగాలన్న కోరికను తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో యాలకులు బాగా సహకరిస్తాయి. యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.
యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహకరిస్తాయి. దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులతో పాటు కడుపులో మంట తగ్గుతుంది.
రాత్రి బోజనం పూర్తయ్యాక నిద్రకు ముందుగా రెండు యాలకులు తిని ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళు తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తద్వారా శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి దోహపడతాయి.
అంతేకాకుండా శృంగార సామర్ధ్యం మెరుగవుతుంది. శరీరంలో వున్న విష పదార్థాలు బయటికి వెళతాయి. ప్రతిరోజు రాత్రి వేళల్లో యాలకులు తీసుకుంటే వ్యాధులు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.