ఏప్రిల్ 1 నుంచి నగదు చెల్లింపులు నిషేధం.. ఫాస్టాగ్‌తో మాత్రమే

జాతీయ రహదారులపై సులభ ప్రయాణానికి ఫాస్టాగ్ అందుబాటులోకి తెచ్చినా, కొందరు వాహనదారులు నగదు చెల్లిస్తూ ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం, ఏప్రిల్ 1 నుంచి అన్ని టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధించింది.


ఇకపై ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే టోల్ చెల్లింపులు చేయాలని, నగదు చెల్లింపులకు అనుమతి లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉమాశంకర్ స్పష్టం చేశారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.