]అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు..సీఎం హోదాలో తొలిసారి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ అధినేతకు..పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ కేడర్‌తో చంద్రబాబు ఫోటోలు దిగారు. సెల్ఫీలూ ఇచ్చారు. ఈ క్రమంలో ఒక్కో కార్యకర్త ఒక్కోలా అభిమానం చాటుకున్నారు. వాళ్ల ఉత్సాహాన్ని చంద్రబాబు కూడా కాదనలేకపోయారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు..సీఎం హోదాలో తొలిసారి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ అధినేతకు..పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ కేడర్‌తో చంద్రబాబు ఫోటోలు దిగారు. సెల్ఫీలూ ఇచ్చారు.
ఈ క్రమంలో ఒక్కో కార్యకర్త ఒక్కోలా అభిమానం చాటుకున్నారు. వాళ్ల ఉత్సాహాన్ని చంద్రబాబు కూడా కాదనలేకపోయారు. పార్టీ అధ్యక్షుడి రాకతో పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకుంది. పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన చంద్రబాబు.. జగన్ కూల్చిన ప్రజావేదికను మళ్లీ నిర్మించేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ విధ్వంస పాలనకు సాక్ష్యంగా ప్రజావేదిక శిథిలాలను అలానే ఉంచుతామన్నారు. పోలవరంతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తానన్నారు.
అసెంబ్లీ సమావేశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. తనకు, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండకూడదన్న ముఖ్యమంత్రి..సచివాలయంలోనే వినతుల స్వీకరణకు ఆలోచిస్తున్నామని చెప్పారు. ప్రజలనుండి విజ్ఞప్తుల స్వీకరణకు వీలైనంత సమయం కేటాయిస్తానన్నారు చంద్రబాబు.