Nandamuri Chaitanya Krishna: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్..

Nandamuri Chaitanya Krishna: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్..


నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ముఖ్యంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా సక్సెస్ అయ్యారు. అలాగే తారక రత్న, హరికృష్ణ కూడా హీరోలుగా చేసి ఆకట్టుకున్నారు. అయితే ఈ ఇద్దరూ ఎక్కువ సినిమాల్లో నటించలేదు. ఇక బాలయ్య గురించి ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ అటు హీరోగా ఇటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాను అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ చేయనున్న సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో వెలుగులోకి వచ్చారు. ఆయనే నందమూరి చైతన్య కృష్ణ. 2003లో వచ్చిన ‘ధమ్’ సినిమాతో చైతన్యకృష్ణ వెండితెరకు పరిచయం అయ్యారు. కాకపోతే ఈ సినిమాలో జగపతిబాబు కూడా ఉన్నారు.

ఆ తర్వాత 20 ఏళ్లకు బ్రీత్ అనే సినిమాతో హీరోగా రీ లాంచ్ అయ్యారు చైనత్య కృష్ణ. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఎంత డిజాస్టర్ అంటే టాలీవుడ్ లోనే జీరో కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు చైతన్య కృష్ణ. తెలుగు దేశం పార్టీని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తూ ఉంటారు. అలాగే తమను విమర్శించినా వారిపై కూడా చైతన్య కృష్ణ ఫైర్ అవుతూ ఉంటారు. తాజాగా చైతన్య కృష్ణ జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వైసీపీ ఫ్యాన్స్ కు కలిపి వార్నింగ్ ఇచ్చారు చైతన్య కృష్ణ.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. జూనియర్‌ఫ్యాన్స్ కు ఇదే నా వార్నింగ్‌.. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నేతలు కొండాలి నాని, వల్లభనేని వంశీ. మీరు సపోర్ట్ చేశారు అని అంటారు. కానీ మీరు ఎవరు సపోర్ట్ చేయడానికి.? మా బొ** కూడా పీకలేరు.. నేను ఉండగా చంద్రబాబు మావయ్య, బాలకృష్ణ బాబాయ్‌ని ఎవరూ ఏం చేయలేరు అంటూ తన ఫెస్ బుక్ లో రాసుకొచ్చారు నందమూరు చైతన్య కృష్ణ. అలాగే నా సినిమా బ్రీత్ మూవీ రిలీజ్ టైంలోనూ జూనియర్ ఫ్యాన్స్, వైఎస్సార్ సీపీ వాళ్లు కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారని, జాగ్రత్త గా ఉండండి అంటూ కృష్ణ చైతన్య వార్నింగ్‌ ఇచ్చారు. ఈ వార్నింగ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.