chanakya niti: అలాంటి స్నేహితులను వెంటనే విడిచిపెట్టడం ఉత్తమం.. లేదంటే…

చాణక్య నీతి ఒక జ్ఞాన నిధి, దానిని పొందినవాడు జీవితాంతం సంతోషంగా ఉంటాడు. మనిషికి జ్ఞాన నేత్రాలను తెరిపించే ఈ నిధిలో ఎన్నో అమూల్యమైన విషయాలు దాగి ఉన్నాయి.
సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, చాణక్యుడు తన విలువైన ఆలోచనలను ఈ విధానాలలో చూపించాడు. చాణక్య నీతి పిల్లలు, యువత, మహిళలు, వృద్ధులకు మార్గనిర్దేశం చేస్తోంది. చాణక్యుడు ప్రతికూల పరిస్థితుల్లో లొంగిపోలేదు. తన తెలివైన తెలివితేటలతో లక్ష్యాన్ని సాధించాడు.


మీరు కూడా ఈ చాణక్యుడి మాటలను జీవితంలో అవలంబిస్తే, జీవితంలో ఎప్పటికీ తప్పులు చేయరు. పరిస్థితులు మీకు వాటంతట అవే అనుకూలంగా మారిపోతాయి. గడిచిన కాలం గురించి ఎంత ఏడ్చినా, పదేపదే స్మరించుకుంటూ పశ్చాత్తాపపడినా ఫలితం లేదన్నాడు చాణక్యుడు.
మనుషులు మాత్రమే తప్పులు చేస్తారు. ఈ పొరపాట్లు మళ్లీ జరగకూడదు, కాబట్టి వాటి నుండి పాఠాలు నేర్చుకోండి. వర్తమానాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. భవిష్యత్తు వ్యూహంపై దృష్టి పెట్టండని చాణక్యుడు సూచించాడు.
చాణక్యుడి ప్రకారం ఎవరైనా సరే శత్రువును బలహీనంగా భావించడంలాంటి తప్పు చేయవద్దు. అతనిని ఓడించడానికి, అతని బలం గురించి సరైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం, అప్పుడే మీరు అతనిపై దాడి చేసి గెలవగలరు. తొందరపాటుతో మీరు వ్యవహరిస్తే మీకు ఎదురుదెబ్బ తగలవచ్చు. మీరు శత్రువును ఓడించాలనుకుంటే, ఐక్యంగా పని చేయండి. ఐక్యతలో అపారమైన శక్తి ఉంది. ముఖం ఎదుట తియ్యగా మాట్లాడుతూ. నీ గురించి ఇతరులతో చెడుగా చెప్పే స్నేహితుడిని విడిచిపెట్టడం మంచిదని చాణక్య నీతి చెబుతోంది. ఎందుకంటే నిజమైన స్నేహితులు తమ స్నేహితులను తప్పు దారిలో నడవనివ్వరని ఆచార్య చాణక్య తెలిపారు.