వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి విజయమ్మ – షర్మిలకు షాక్..!?

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాయి. బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది.
పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన షర్మిల సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ సమయంలోనే తల్లి వైఎస్ విజయమ్మ ప్రస్తావన చేస్తున్నారు. అయితే, విజయమ్మ ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారానికి సిద్దం అయినట్లు విశ్వసనీయ సమాచారం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

మారుతున్న లెక్కలు: ముఖ్యమంత్రి జగన్ పైన రాజకీయ దాడి పెరిగింది. జగన్ తాను వీరిని ఒంటరిగానే ఎదుర్కోవటానికి సిద్దమని ప్రకటించారు. అన్నను కాదని తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరిన షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన సమయం నుంచే జగన్ ను రాజకీయంగా టార్గెట్ చేసారు. వ్యక్తిగతంగానూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలు షర్మిలకు అదే స్థాయి లో సమాధానం చెబుతున్నారు.

చంద్రబాబు, పవన్ కంటే సీఎం జగన్ నే షర్మిల లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ తరహా విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ సమయంలోనే తన కుటుంబాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని..నాడు వివేకా..నేడు షర్మిలను ప్రయోగించిందని జగన్ వ్యాఖ్యానించారు.

Related News

వైసీపీకి మద్దతుగా విజయమ్మ: జగన్ వ్యాఖ్యలకు స్పందనగా షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తన తల్లి ప్రస్తావన చేసారు. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి..కొనసాగుతున్న సమయంలో విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి కుమార్తెకు అండగా నిలిచారు. తన కుమారుడు ఏపీలో సీఎంగా ఉండటంతో..తెలంగాణలో పోరాటం చేస్తున్న కుమార్తెకు మద్దతుగా నిలిచేందుకే తాను పార్టీ గౌరవాధ్యక్ష పదవి వీడుతున్నట్లు విజయమ్మ పార్టీ ప్లీనరీ వేదికగా ప్రకటించారు.

ఇక, షర్మిల కాంగ్రెస్ లో చేరటం..ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా రాజకీయంగా పోరాటం చేస్తున్న క్రమంలో విజయమ్మ పాత్ర ఏంటనేది రాజకీయంగా చర్చ జరుగుతోంది. తన సోదరి షర్మిల గురించి జగన్ ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు విజయమ్మ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్నికల ప్రచారంలోకి: ఏపీలో రాజకీయంగా తన కుమారుడికే అండగా నిలవాలని విజయమ్మ నిర్ణయించినట్లు వైసీపీ ముఖ్య నేతల సమాచారం. తెలంగాణలో వైసీపీ లేకపోవటంతో అక్కడ తన కుమార్తెకు అండగా నిలిచిన విజయమ్మ, ఏపీలో వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే తానే కావటం..ఇప్పుడు జగన్ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయం అర్దం కావటంతో వైసీపీకే మద్దతుగా నిలవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

అందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత కుమారుడు జగన్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. విజయమ్మ వైసీపీ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం ద్వారా ప్రస్తుత పరిణామాల్లో పార్టీకి నైతికంగా బలం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో, విజయమ్మ తాజా నిర్ణయం ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

Related News