సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తికి జగన్‌ ఝలక్‌!

సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్‌.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఝలక్‌ ఇచ్చారు. తాను పుట్టిన ప్రాంతంపై ప్రేమతో సాగునీటి ప్రాజెక్టు కోసం జగన్‌ అధికారంలోకి వచ్చాక నారాయణమూర్తి ఆయన్ను కలిశారు. ఆ ప్రాజెక్టు సాధించడం తన చిరకాల స్వప్నమని వివరించారు. ఆ ప్రాజెక్టుని జగన్‌ మంజూరు చేశారు. అంతటి ముఖ్యమంత్రే మంజూరు చేశాక ఇంకేముంది.. త్వరలోనే ప్రాజెక్టు పూర్తయిపోతుందనుకున్నారు. ఆయనకు చేతులెత్తి మొక్కారు. జగన్‌ దేవుడని, ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కొనియాడారు. కానీ ఆ ప్రాజెక్టు ఇప్పటికీ కాగితాలపైనే ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేరు, ఉమ్మడి విశాఖ జిల్లాలోని తాండవ జలాశయాల కాలువల్ని అనుసంధానిస్తే.. రెండు ఉమ్మడి జిల్లాల్లో కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 51,465 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 2021లో ఆ ప్రాజెక్టుకి ప్రభుత్వం రూ.470 కోట్లు మంజూరు చేసింది. 2021 మార్చి 19న పాలనాపరమైన అనుమతులిచ్చింది. టెండర్లు పిలిచి.. గుత్తేదారుడినీ ఎంపిక చేశారు. ఆ తర్వాత దానికీ రాష్ట్రంలోని మిగతా సాగునీటి ప్రాజెక్టుల గతే పట్టింది. ప్రాజెక్టు మంజూరు చేసి మూడేళ్లవుతున్నా.. అంగుళం కూడా ముందుకి కదల్లేదు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *