ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తి పెం చుతున్నాయి. అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ బీజేపీ దాటేసింది.
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయమైంది. బీజేపీలో కొత్త ముఖ్యమంత్రి అభ్యర్ధి పైనా చర్చ మొదలైంది. ఢిల్లీలో బీజేపీ కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేసారు. తెలుగు ఓటర్లు ప్రభావిత నియోజకవర్గా ల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఫలితాలు వెల్లడవుతున్న వేళ ఈ నియోజక వర్గాల పైన కూటమిలో ఆసక్తి కనిపిస్తోంది. అయితే, అక్కడ అనూహ్య ఫలితాలు వెల్లడి అవుతున్నాయి.
మారుతున్న లెక్కలు
ఢిల్లీ ఎన్నికల ఫలితం పై క్లారిటీ వస్తోంది. 27 ఏళ్ల తరువాత బీజేపీ అధికారం దక్కించుకోవటం ఖాయమైంది. మొత్తం 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో అధికారం దక్కించుకోవాలంటే 36 సీట్లు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ లో బీజేపీ 40 సీట్లకు పైగా ఆధిక్యతలో కొనసాగు తోంది. ఆప్ గట్టి పోటీ ఇచ్చినా అధికారం దక్కే అవకాశం కనిపించటం లేదు. కాంగ్రెస్ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోవటం కష్టంగా కనిపిస్తోంది. ఇక, ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ అభ్యర్ధుల కోసం ప్రచారం చేసారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు.
చంద్రబాబు ప్రచారం
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలోని షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్, సహద్ర నియోజక వర్గాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీటిల్లో ఒక్కటి మినహా మిగిలిన నియోజకవర్గా ల్లో బీజేపీ ప్రస్తుతం ఆధిక్యతలో ఉంది. 27 ఏళ్ల తరువాత బీజేపీ ఢిల్లీలో అనూహ్యంగా అధికారం దిశగా వెళ్తోంది. కేజ్రీవాల్ సైతం న్యూఢిల్లీ స్థానంలో గెలుపు కోసం శ్రమించాల్సి వస్తోంది. కేజ్రీవాల్ తొలి మూడు రౌండ్లలో వెనుకంజలో ఉన్నారు. తరువాత స్వల్ప ఆధిక్యత సాధించారు. అదే విధంగా ఆప్ కంచుకోటలుగా చెప్పుకునే నియోజకవర్గాల్లోనూ ఫలితాలు తారు మారవుతున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాల్లోనూ మూడో స్థానానికే పరిమితం అవ్వటం కీలక సమీకరణంగా భావిస్తున్నారు.
మారుతున్న ట్రెండ్స్
చంద్రబాబు ఢిల్లీ ప్రచారంలో కేజ్రీవాల్ పైన తీవ్ర విమర్శలు చేసారు. ఆప్ పాలన తో నష్టం జరిగిందని ఆరోపించారు. ఢిల్లీ భవిష్యత్ కోసం బీజేపీ అవసరమని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో 1995 నాటి పరిస్థితులు ఢిల్లీలో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఢిల్లీని తగిన విధంగా అభివృద్ధి చేయలేదని ప్రచారం చేసారు. టీడీపీ నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారు సైతం పార్టీ ఎంపీలతో కలిసి తెలుగు ప్రజల నియోజకవర్గాల్లో ప్రచారం చేసారు. కాగా, ట్రెండ్స్ ఒక్క సారిగా మారుతున్నాయి. ఆప్ ఆధిక్యత స్థానాలు పెరుగుతున్నాయి. దీంతో, బీజేపీ క్యాంప్ లో టెన్షన్ పెరుగుతోంది. ప్రస్తుతం బీజేపీ 40, ఆప్ 30 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి.