ఐస్ క్రీమ్.. ఇదంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతిఒక్కరూ ఐస్ క్రీమ్ ను చాలా ఇష్టంగా తింటారు. పైగా ఇందులో తమకు ఫ్లేవర్స్ ఎంచుకుని మరీ ఇష్టంటా ఆరాగిస్తారు. కానీ, ఇటీవల కాలంలో ఈ ఐస్ క్రీమ్స్ లను కూడా కొంతమంది ముఠా విడిచిపెట్టాడం లేదు. ఎవరీ వ్యాపారంకు అనుగుణంగా వారు దందాలు చేస్తూ అక్రమంగా లాభాలను పొందుతున్నారు. ముఖ్యంగా ఈ ఐస్ క్రీమ్స్ తయారీలో ఏమాత్రం నాణ్యత లేకపోవడం, కల్తీ అయిన ప్రొడక్ట్స్ తో తయారు చేయడం వంటివి చేస్తున్నారు. కాగా, ఇటీవలే ఐస్ క్రీమ్ తిందమని తీస్తే..చేతి వేలు, జర్రి వచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలు మరువక ముందే తాజాగా ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎక్కడంటే..
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో వన్ అండడ్ ఫైవ్ ఐస్ క్రీమ్ పార్లర్ కు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఐస్ క్రీమ్ పార్లర్ కు చిన్న నుంచి పెద్ద వరకు చాలామంది కస్టమర్లు ఎగబడి ఎంతో ఇష్టంగా వాటిని కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా రేటు ఎక్కువగా ఉన్నా సరే టేస్ట్ బాగుంటదని వెనకాడకుండా తింటుటారు. ఇలా తరుచు ఎంతోమంది ఈ ఐస్ క్రీమ్ పార్లర్ కు ఎగబడతుండటంతో ఎక్సైజ్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అక్కడ ఐస్ క్రీమ్ లో విస్కీని ఉపాయోగించి తయారు చేస్తున్నారని అందుకే చాలామంది ఈ పార్లర్ ఐస్ క్రీమ్ లకు ఎగబడుతున్నారని సమాచారం అందిది.
దీంతో వెంటన సమాచాారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు జూబ్లీహిల్స్ లో ఉన్న వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్లో నిర్వహించారు. దీంతో ఆ పార్లర్ లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిజంగానే ఆ పార్లర్ లోని ఐస్ క్రీమ్ లో పేపర్ విస్కీ కలిపి యజమాని విక్రయిస్తున్నాడు. సుమారు 60 గ్రాముల ఐస్క్రీమ్లో 100 మి.లీ విస్కీ కలుపుతున్నారు. దీనిని మరీంత కాష్ చేసుకునేందుకు ఫేస్ బుక్ లో ఓ యాడ్ ను ప్రకటించి మరీ కస్టమర్లకు అమ్మకాలు చెపడుతున్నారు. అందుకే ఈ ఐస్క్రీమ్ క్రీమ్ విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు. ఇక ఈ విషయం కాస్త వెలుగులోకి రావడంతో.. వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్‌లను జూబ్లీహిల్స్‌లో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఆ పార్లర్ లో ఉన్న 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.