మాంసాహార ప్రియులు చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, పీతలు వంటి అనేక రకాల ఆహార పదార్ధాలను ఇష్టంగా తింటారు. అయితే ఎక్కువ మంది చికెన్ ను ఇష్టపడతారు. చికెన్ బిర్యానీ, పులావు, కూర ఫ్రై ఇలా రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేసుకుంటారు. అయితే కొన్ని చికెన్ ఐటమ్స్ ను మాత్రం ఇంట్లో తయారు చేసుకోవడం రాక.. రెస్టారెంట్ కు వెళ్తారు. వాటిల్లో ఒకటి చిల్లీ చికెన్. ఇది ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు రెస్టారెంట్ లో కూడా ఫేమస్. ఈ రోజు చిల్లీ చికెన్ ను రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం..
చికెన్ అంటే ఇష్టం ఉన్నవారు చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తారు. బోన్ లెస్ చికెన్. బోన్ ఇన్ చికెన్ లను ఉపయోగించి రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. వాటిల్లో ఒకటి చిల్లీ చికెన్.. అంటే పచ్చి మిర్చితో చేసే చికెన్. దీనిని చిల్లీ చికెన్ ను అంటారు. ఇది ప్రసిద్ది చెందిన ఇండో-చైనీస్ వంట. చాలా మంది చిల్లీ చికెన్ అంటే ఇష్టంతో ఇంట్లో చేసుకోవడం రాక రెస్టారెంట్ కి వెళ్లి తింటారు. అయితే కొంచెం ఇష్టంగా ట్రై చేస్తే మంచి టేస్టీగా చిల్లీ చికెన్ తయారు చేసుకుని తినవచ్చు. ఈ రోజు చిల్లీ చికెన్‌ను ఎలా తయారు చేసుకోవాలి రెసిపీ తెలుసుకుందాం..
చిల్లీ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్ – అర కిలో
కార్న్ ఫ్లోర్ – రెండు టీ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు- మూడు టీ స్పూన్లు
కోడి గుడ్డు – ఒకటి
మిరియాల పొడి – అర టీస్పూన్
సోయాసాస్ – 1 టీస్పూన్
పచ్చి మిరపకాయలు – 5
వెల్లుల్లి రెబ్బలు – 4(చిన్నగా కట్ చేసిన ముక్కలు)
చక్కెర- ఒక టీ స్పూన్
నీరు – 2 కప్పులు
నూనె -తగినంత
కొత్తిమీర – కొంచెం
ఉప్పు -రుచికి సరిపడా
తయారీ విధానం: ముందుగా చికెన్ ను శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో చికెన్ ముక్కలు వేసి అప్పుడు తీసుకున్న కార్న్ ఫ్లోర్, సోయా సాస్, ఉప్పు వేసి తర్వాత కోడి గుడ్డు పగలగొట్టి తెల్ల సోన, పచ్చ సోన వేసి చికెన్ ముక్కలకు ఈ మిశ్రమం బాగా పట్టేలా కలపాలి. చికెన్ ముక్కలకు మిశ్రమం పట్టించిన తర్వాత గిన్నె మీద మూత పెట్టి.. అర గంట పైగా ఓ పక్కకు పెట్టాలి. ఇప్పుడు మార్నేట్ చేసిన చికెన్ ని వేయించడానికి ఒక పాన్ ను తీసుకుని అందులో తగినంత నూనె వేసి వేడి ఎక్కిన తరవాత స్విమ్ మీద మంట పెట్టి మారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకూ వాటినివేయించాలి. ఇప్పుడు వీటిని ఓ పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం నూనె వేసి సన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి ముక్కలను, వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి. తర్వాత రెండు కప్పుల నీరు పోసుకుని బాగా మరిగించాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో టీ స్పూన్ షుగర్, మిరియాల పొడి, ఉప్పుడు, కొంచెం సోయా సాస్ వేయాలి. వీటిని బాగా కలిపి వేయించి పక్కకు పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి ఈ మిశ్రమం బాగా పట్టేలా కలపాలి. నీరు పోయే వరకూ చికెన్ ను ఉడికించి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కట్ చేసిన కొత్తిమీర వేసి దించెయ్యాలి. అంతే టేస్టీ టేస్టీ చిల్లీ చికెన్ రెడీ..