టెక్ విద్యార్ధులకు సీఎం చంద్రబాబు భారీ ఆఫర్

మెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 2 వేల ఏళ్ల క్రితమే ప్రపంచ జీడీపీలో 40 శాతం భారత్ నుంచే వచ్చేదని..


ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విద్యార్ధులకు వివరించారు. హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం కంటే టెక్నాలజీ అందిపుచ్చుకుని సేవల రంగంలో విప్లవం సాధించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులే అని.. వారిలోనూ ఏపీ నుంచి వెళ్లిన వారే ఉన్నారని సీఎం పేర్కొన్నారు.

టెక్ విద్యార్ధులతో క్వాంటమ్ టాక్ టాక్ బై సీఎం సీబీఎన్ లో చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తా వించారు. వచ్చే 20 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఇప్పుడే కార్యరూపం ఇస్తున్నామని తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఓ ఎకో సిస్టమ్‌ను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. భారత్‌లో నైపుణ్యాలు ఉన్నప్పటికీ , క్వాంటమ్ రంగంలో మరింత పెట్టుబడుల విస్తృతి పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా పెద్దఎత్తున ఈ రంగంలో పెట్టుబడులు, నైపుణ్య కల్పన కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని వివరించారు. ఐటీ విప్లవం లాగా ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ విప్లవాన్నీ భారతీయులు అందిపు చ్చుకోవాల్సి ఉందని సూచించారు.

విశాఖలోనూ ఇప్పుడు గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోందని సీఎం అన్నారు. గతంలో ఐటీఈఎస్ లాంటి సేవల్ని వివిధ దేశాలకు ఇక్కడి నుంచే అందించామని వివరించారు. విశాఖ ఇప్పుడు డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్‌గా మారుతోందని.. ఇక్కడి నుంచే సీ కేబుల్ లాంటి వ్యవస్థ కూడా ఏర్పాటు అవుతోందని తెలిపారు. నాలెడ్జి ఎకానమీ, క్వాంటమ్ వ్యాలీగా అమరావతి ఉంటుందని… తిరుపతి స్పేస్ సిటీగా నిర్మితం అవుతోందని.. అలాగే అనంతపురం, కడప లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ ఏరో స్పేస్ కేంద్రాలుగా ఉంటాయని చెప్పుకొచ్చారు. విశాఖ- చెన్నై, చెన్నై – బెంగుళూరు, బెంగుళూరు- హైదరాబాద్ కారిడార్‌లు అతిపెద్ద పారిశ్రామిక కారిడార్లుగా మారుతున్నాయని విద్యార్ధులకు తెలియజేశారు. ఏపీని క్వాంటమ్ తోపాటు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తున్నామని స్పష్టం చేసారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.