సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. సమాచారం కోసం ఈ నంబర్స్‌కి కాల్ చేయండి..

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్టు వస్తున్న వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఈ మృతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి కుటుంబాలకు తగు సహాయాన్ని అందించేందుకు గాను వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సంప్రదింపులు జరిపారు. సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్లోను ఏర్పాటు చేసినట్టు చీఫ్ సెక్రటరీ తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో +91 79979 59754, +91 99129 19545 నెంబర్ల ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.

అసలు ఏం జరిగింది..?
సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ యాత్రికులతో నిండిన బస్సు బదర్- మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్‌లోని ఇంధనం ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తాజాగా సమాచారం ప్రకారం.. మక్కా నుంచి మదీనాకు భారతీయ యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు 40 మంది మృతి చెందినట్లు సమాచారం. యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ బృందం హైదరాబాద్‌కు చెందినదని చెబుతున్నారు. ఈ బృందంలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదం భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 గంటలకు జరిగింది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న ఉమ్రా యాత్రికులను బస్సు తీసుకెళ్తోంది. మదీనా నుంచి 160 కి.మీ దూరంలో ఉన్న ముహ్రాస్ అనే ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఎంత మంది ఉన్నారనే దానిపై అధికారిక సమాచారం ఇంకా లభించలేదు. 11 మంది మహిళలు, 10 మంది పిల్లలు మరణించారని అనధికారిక సమాచారం. సివిల్ డిఫెన్స్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. దీని కారణంగా, మృతదేహాలను గుర్తించలేకపోయారు. ప్రమాదం నుంచి ఒకరు ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ప్రస్తుతం, భారతీయ ఏజెన్సీలు, ఉమ్రా ఏజెన్సీలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.