థియేటర్లలో 90కోట్లకు పైగా కలెక్షన్లు.. ఓటీటీలోకి రీసెంట్ సూపర్ హిట్ సినిమా

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి సినిమాలు. అయితే ఈ మధ్యన కొన్ని సినిమాలు 4 వారాలకు ముందే ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల దినోత్సవం కానుకగా సెప్టెంబర్ 05న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మదరాసిఅభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా  మోస్తరుగా ఆడిందిపాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన  సినిమా ఓవరాల్ గా రూ. 91 కోట్ల కలెక్షన్లు సాధించిందిలేటెస్ట్ సెన్సేషణ్ రుక్మిణి వసంత్ మదరాసి మూవీలో హీరోయిన్ గా నటించిందిఆమె అంద చందాలుశివ కార్తికేయన్ నటనయాక్షన్ సీక్వెన్స్ లకు అభిమానుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందిఅయితే మురుగదాస్ కథస్క్రీన్ ప్లేడైరెక్షన్ ప్రేక్షకులను  మాత్రం మెప్పించలేదుదీంతో కొన్ని వర్గాల వారికి మాత్రమే  సినిమా నచ్చిందిఅయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.


మదరాసి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందిఇందుకోసం నిర్మాతలకు రూ. 60 కోట్లు అప్పగించినట్లు సమాచారం నేపథ్యంలో  అక్టోబర్ 3 నుంచి మదరాసి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోందిఅయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమేత్వరలోనే దీనిపై అమెజాన్ ప్రైమ్ నుంచి అధికారిక ప్రకటన రావొచ్చు. తమిళ్ , తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్ పై శ్రీ లక్ష్మీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. విద్యుత్ జమాల్ మెయిన్ విలన్ గా ఆకట్టుకున్నాడు. అలాగే బిజు మేనన్, షబ్బీర్ కరైక్కల్, విక్రాంత్, ఆడుకలం నరేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవి చందర్ స్వరాలు సమకూర్చారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.