కమ్మని “అప్పడాల కూర” – ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సూపర్​ ఆప్షన్

తెలుగింటి భోజనంలో అప్పడం కంపల్సరీ. పప్పు, చారు, రసం, పెరుగన్నంలోకి సైడ్​ డిష్​గా నంజుకొని తినడానికి ఇది పర్ఫెక్ట్​. కేవలం అన్నంలోకి మాత్రమే కాదు ఈవెనింగ్​ స్నాక్స్​గా కూడా వీటిని తినొచ్చు. అయితే దీనిని ఎప్పుడూ సైడ్​ డిష్​గానే చూస్తున్నారా? ఓసారి మెయిన్​ డిష్​గా కర్రీ ప్రిపేర్​ చేయండి అద్దిరిపోతుంది. అప్పడాలతో కూర చేయడమేంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. అప్పడాలతో సూపర్​ టేస్టీగా కూర ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఇది రాజస్థాన్​లో మరింత ఫేమస్​. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ కర్రీ బెస్ట్​ ఆప్షన్​. ఈ కూర అన్నంతోపాటు రోటీ, చపాతీ, పరోటా వంటి వాటిల్లోకి కూడా పర్ఫెక్ట్​. మరి, లేట్​ చేయకుండా కమ్మని మసాలా పాపడ్​ కర్రీని ఎలా చేయాలో చూసేయండి.


కావాల్సిన పదార్థాలు:

  • అప్పడాలు – 4
  • నూనె- 2 టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర – అర టీస్పూన్​
  • ఆవాలు – అర టీస్పూన్​
  • ఎండుమిర్చి- 3
  • ఉల్లిపాయ – 1
  • పచ్చిమిర్చి – 3
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ – 1 టీస్పూన్​
  • వేయించిన జీలకర్ర పొడి – అర టీస్పూన్​
  • పసుపు – పావు టీస్పూన్​
  • ధనియాల పొడి – అర టీస్పూన్​
  • కారం – తగినంత
  • ఉప్పు – రుచికి సరిపడా
  • గరం మసాలా – అర టీస్పూన్​
  • ఇంగువ – చిటికెడు
  • కరివేపాకు – 2 రెమ్మలు
  • టమాటాలు – 2
  • పెరుగు – అర కప్పు
  • శనగపిండి – 1 టేబుల్​స్పూన్​
  • కొత్తిమీర తరుగు – కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా ఈ కర్రీ కోసం అవసరమైన పదార్థాలను ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం ఓ పెద్ద ఉల్లిపాయను సన్నగా తరగాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీరను వీలైనంత సన్నగా కట్​ చేసుకోవాలి.
  • టమాటాలను శుభ్రంగా కడిగి వాటిపై ఉండే తొడిమ తీసేసి మీడియం సైజ్​లో ముక్కలుగా చేసుకోవాలి. మిక్సీజార్​లోకి టమాటా ముక్కలు వేసి అస్సలు నీళ్లు లేకుండా మెత్తగా గ్రైండ్​ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ఫ్రైకి సరిపడా నూనె పోసి వేయించుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత అప్పడం వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి. మిగిలిన అప్పడాలను కూడా ఇలానే నూనెలో వేయించి తీసి పక్కన పెట్టాలి. కడాయికి కూడా దింపేసి పక్కనుంచాలి.
  • అదే స్టవ్​ మీద కర్రీ కోసం మరో పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయి వేయించాలి.
  • అనంతరం ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసి లో టూ మీడియం ఫ్లేమ్​లో గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
  • అల్లం మగ్గిన తర్వాత వేయించిన జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా వేసి నూనెలో వేయించాలి.
  • మసాలాలు పర్ఫెక్ట్​గా వేగిన తర్వాత ఇంగువ, కరివేపాకు వేసి మరో నిమిషం వేయించి గ్రైండ్​ చేసిన టమాటా గుజ్జు వేసి కలుపుతూ ఉడికించాలి.
  • టమాటా మిశ్రమం మగ్గి నూనె పైకి తేలిన తర్వాత పావు లీటర్​ వాటర్​ పోసి కలిపి హై-ఫ్లేమ్​లో మరిగించాలి.
  • ఈలోపు ఓ గిన్నెలోకి పెరుగు, శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత అర కప్పు వాటర్​ పోసి మరోసారి కలపాలి.
  • స్టవ్​ మీద వాటర్​ మరుగుతున్నప్పుడు మంటను సిమ్​లో పెట్టి పెరుగు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి.
  • టమాటా, పెరుగు మిశ్రమం బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్​లో మరో 5 నిమిషాలు మరిగించాలి.
  • వాటర్​ బాగా మరుగుతున్నప్పుడు వేయించుకున్న అప్పడాలను చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి.
  • అనంతరం నిదానంగా కలిపి మరో 5 నిమిషాలపాటు ఉడికించి కొత్తిమీర తరుగు చల్లి స్టవ్​ ఆఫ్​ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే రాజస్థాన్​ స్పెషల్​ పాపడ్​ సబ్జీ రెసిపీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
  • చిట్కాలు:

    • అప్పడాలను మనం వేయించుకుని తినే విధంగా కాకుండా కాస్త గట్టిగా ఉండేలా రెండు వైపులా లైట్​గా కలర్​ మారే వరకు వేయించాలి.
    • కారం మీ రుచికి తగినట్లుగా వేసుకోవాలి. అయితే పచ్చిమిర్చి, ఎండుమిర్చితో పాటు ఇతర మసాలాలు వాడాం కాబట్టి దాని రుచిని కూడా లెక్కలోకి తీసుకోవాలి.
    • వేయించిన అప్పడాలను మరీ ఎక్కువ సేపు గ్రేవీలో ఉడికించాల్సిన పనిలేదు. ఎక్కువ సేపు ఉడికిస్తే మరీ మెత్తగా అవుతాయి. ​
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.