ఇప్పుడు డబ్బులు చేతిలో పెట్టుకొని బయటకు వెళ్లే రోజులు లేవు. అందరు డిజిటల్ పెమెట్స్ చేయటం షురూ చేసారు. ఐతే డిజిటల్ పేమెంట్స్ హడావిడిలో ఒక్కోసారి నంబర్ తప్పుగా కొట్టడం లేదా క్యూఆర్ కోడ్ తారుమారు అవ్వడం వల్ల మన డబ్బులు వేరే వాళ్ల ఖాతాలోకి వెళ్లిపోతుంటుంది.
అటువంటప్పుడు గుండె ఆగినంత పనవుతుంది కదా? కానీ కంగారు పడకండి! మన బ్యాంకింగ్ వ్యవస్థలో ఇటువంటి తప్పులను సరిదిద్దుకోవడానికి కొన్ని పక్కా మార్గాలు ఉన్నాయి. సరైన సమయంలో సరైన పద్ధతిలో స్పందిస్తే మీ డబ్బును సురక్షితంగా వెనక్కి తెచ్చుకోవచ్చు. మరి ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
తక్షణమే స్పందించండి: ఫిర్యాదు చేసే విధానం తెలుసుకోవటం ముఖ్యం. మీరు పొరపాటున తప్పుడు ఖాతాకు డబ్బు పంపినట్లు గుర్తిస్తే, మొదటి 48 గంటలు చాలా కీలకం. ముందుగా మీరు ఉపయోగించిన యాప్ (PhonePe, Google Pay, లేదా Paytm) ఏదైనా సరే సపోర్ట్ సెక్షన్‌లో ఫిర్యాదు చేయండి.
ఆ తర్వాత వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ‘ట్రాన్సాక్షన్ ఐడి’ వివరాలను అందించి లావాదేవీని రిపోర్ట్ చేయండి. ఒకవేళ బ్యాంక్ నుండి సరైన స్పందన రాకపోతే భారత జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI) అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి UPI Dispute Redressal Mechanism ద్వారా ఫిర్యాదును నమోదు చేయవచ్చు.
గమనిక:పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే,ఏదైనా యూపీఐ లావాదేవీ చేసే ముందు పేరును ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం ఉత్తమం. పూర్తి సాంకేతిక సహాయం కోసం మీ బ్యాంక్ మేనేజర్‌ను స్వయంగా సంప్రదించండి.




































