రాంగ్ నంబర్‌కు యూపీఐ పేమెంట్ చేశారా.. ఇలా రిఫండ్ పొందండి.

ఒకప్పుడు డబ్బులు ఎవరి అకౌంట్లోకైనా పంపించాలి అంటే బ్యాంకుకు వెళ్లి పెద్ద ప్రాసెస్ చేసేవాళ్ళం. కానీ కాలం మారుతున్నా కొద్దీ బ్యాంకింగ్ సిస్టంలో చాలా వేగంగా మార్పులు జరిగాయి.


ఒక్క UPI నంబర్‌తో మన ఫోన్ లోనే సెకనులో డబ్బులు పంపించుకుంటున్నాం. కానీ ఒక్కొక్కసారి డబ్బులు వేరే వాళ్లకు పంపించి చాలా కంగారు పడుతాం. డబ్బులు పోయాయని, తిరిగి ఎలా పొందాలని ఇబ్బంది పడుతాం. ఇక ఈ టెన్షన్‌కు గుడ్ బై చెప్పేందుకు, యూజర్లు సులభతరమైన ట్రాన్సక్షన్స్ చేసేందుకు సింపుల్ ఆప్షన్స్‌ని బ్యాంకింగ్ సిస్టం తీసుకువచ్చింది. అలాగే వేరే వాళ్లకు పంపి పోగుట్టుకున్న డబ్బులను కూడా తిరిగి పోందేందుకు అనేక ఆప్షన్స్‌ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ వివరాలు అన్ని తెలుసుకుందాం..

ఎప్పుడైనా ఫోన్ పే, గూగుల్ పే, మరే ఇతర మాద్యమం ద్వారానైనా డబ్బులను వేరొకరికి పంపిస్తే.. ఆ ట్రాన్సక్షన్ డీటెయిల్స్‌ని రిపోర్ట్ చేస్తే తిరిగి డబ్బులు పొందొచ్చు. యాప్ ఓపెన్ చేసి.. ట్రాన్సాక్షన్ హిస్టరీ (Transaction History) లోకి వెళ్లండి. తప్పుగా ట్రాన్సాక్షన్ అయినది అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి. హెల్ప్(Help) లేదా రిపోర్ట్ ఏ ప్రాబ్లమ్(Report a Problem)పై క్లిక్ చేయండి. Wrong UPI Transaction ఎంచుకోండి. ట్రాన్సాక్షన్ ఐడీ (Transaction ID) తేదీ, అమౌంట్, పంపిన UPI ID లాంటి వివరాలు ఎంటర్ చేయండి. యాప్ సపోర్ట్ టీం ఈ విషయాన్ని పూర్తిగా వెరిఫై చేసి NPCI (National Payments Corporation of India) ద్వారా రీఫండ్ ప్రక్రియ ప్రారంభిస్తుంది. డబ్బులను వేరేవారికి పంపిన తరువాత ఎంత త్వరగా మనం స్పందిస్తే.. అంత తొందరగా మన డబ్బులు రిఫండ్ చేసుకోవచ్చు.

యాప్ ద్వారా సమస్య పరిష్కారం అవకపోతే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కి కాల్ చేయండి. లేదా బ్రాంచ్‌కు వెళ్లండి. UPI ట్రాన్సాక్షన్ ID, పంపిన తేదీ, సమయం, డబ్బులు పంపించిన వివరాలు, రిసీవర్ అకౌంట్ నెంబర్ లేదా UPI ID వివరాలను బ్యాంక్ అధికారులకు అందించండి. మీ అభ్యర్థనను పరిశీలించి బ్యాంక్ అధికారులే NPCI ద్వారా డబ్బు తిరిగి పొందే ప్రయత్నం చేస్తారు.

మరొక విధానం ద్వారా కూడా మనం కోల్పోయిన డబ్బులను తిరిగి పొందవచ్చు. NPCI టోల్ ఫ్రీ నంబర్: 1800-120-1740కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వారు అడిగిన వివరాలను తెలిపితే మీ డబులు తిరిగిపొందవచ్చు. వీలైనంత త్వరగా కాల్ చేయడం ఉత్తమం. ఇలా కూడా సమస్య పరిష్కారం కాకపోతే NPCI వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మీ ట్రాన్సాక్షన్ వివరాలు (UTR నంబర్, తేదీ, మొత్తం, మొదలైనవి) సిద్ధంగా ఉంచుకొని వెబ్ సైట్: https://www.npci.org.in ద్వారా కంప్లైట్ చేయవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.