వన్‌ప్లస్ ఈ సంవత్సరం జులైలో వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా నార్డ్ 5, నార్డ్ CE 5 విడుదల అయ్యాయి.
నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఫుల్ HD+ డిస్ప్లే, 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 6 సంవత్సరాల వరకు అప్డేట్స్ను పొందుతుంది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28,999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.1500 డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి వచ్చింది. రేపటి నుంచి అందరూ పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫోన్ ధరలు ప్రస్తుతం రూ.23,499, రూ.25,499, రూ.27,499 గా ఉంది. SBI బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
7100mAh బ్యాటరీ :
వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అపెక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR5x ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పైన పనిచేస్తోంది. 80W SUPERVOOC ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్టుతో 7100mAh బ్యాటరీని కలిగి ఉంది.
సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. 16MP సోనీ IMX480 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రైమరీ కెమెరాతో 60fps వద్ద 4K వీడియోలను రికార్డు చేయవచ్చు.
FHD+ అమోలెడ్ డిస్ప్లే :
ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల ఫుల్ HD అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్. 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. అల్ట్రా HDR ను సపోర్టు చేస్తుంది. ఈ డిస్ప్లే అక్వా టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ నెక్సస్ బ్లూ, మార్బుల్ మిస్ట్, బ్లాస్ ఇన్ఫినిటీ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
AI ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ అనేక AI ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో AI కాల్ అసిస్టెంట్, AI Voice Scribe తో పాటు AI Best Face, AI Eraser వంటి ఎడిటింగ్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ IR బ్లాస్టర్‌ను కూడా కలిగి ఉంది. 4 ఆండ్రాయిడ్ OS అప్డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ను పొందవచ్చు.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్సెట్ 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, WiFi 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ భద్రత కోసం ఫేస్ అన్‌లాక్‌తోపాటు ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.
































