ఈ డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టకుండా అస్సలు తినకండి.. లేదంటే?

ఆరోగ్యంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ ను తింటుంటారు. అయితే కొంతమంది వీటిని నానబెట్టి తింటే మరి కొంత మంది మాత్రం అలాగే పచ్చిగానే తినేస్తుంటారు.
కానీ డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టకుండా అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.


మన ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ చాలా అవసరం. ఎందుకంటే వీటిలో పోషకాలు ఉంటాయి. ఇవి మనలో ఎన్నో రకాల పోషకాల లోపాలను పోగొడుతాయి. ఇవి టేస్టీగా కూడా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని స్నాక్స్ గా తింటుంటారు. డ్రై ఫ్రూట్స్ ను రోజూ తినడం వల్ల శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయి.

రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే కొంతమంది వీటిని నానబెట్టే తింటే.. ఇంకొంత మంది మాత్రం నానబెట్టకుండా పచ్చిగానే అలాగే తింటుంటారు. కానీ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టకుండా అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలు ఔషదం కంటే తక్కువేం కాదు. వీటిని తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. రాత్రంతా నానబెట్టి ఉదయమే వీటిని తింటే పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎసిడిటీ సమస్య కూడా తొలగిపోతుంది.

ఫిగ్

డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన ఫిగ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఈ పండు నుంచి పోషకాలను పొందాలంటే మాత్రం వీటిని ఖచ్చితంగా నానబెట్టే తినాలి. నానబెట్టకుండా తింటే ప్రమాదకరం.

ఖర్జూరాలు

ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పోగొడుతుంది. అలాగే వీటిలో పుష్కలంగా ఉండే పొటాషియం నాడీవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ ప్రయోజనాలను పొందాలంటే ఖర్జూరాలను నానబెట్టే తినాలి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

బాదంపప్పులు

బాదం పప్పులు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ ఎ, జింక్ , పొటాషియం, మెగ్నీషియం లు పుష్కలంగా ఉంటాయి.

అయితే బాదం పప్పులను పచ్చిగానే కాకుండా నానబెట్టి తినడమే మంచిది. అలా తింటేనే వాటిలో ఉండే పోషాకాలన్నీ అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.