వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రూట్‌లో వెళ్లకండి..

చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government) ఆంక్షలు విధించింది. రాత్రి వేళ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండా ఆంక్షల ఉత్తర్వులు జారీ చేశారు చింతూరు ఐటీడీఏపీవో శుభం నోక్‌వాల్. భద్రాచలం నుంచి రాత్రి వేళ ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాహనదారులకు ఆంక్షలపై ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేసింది.


ప్రజా భద్రత కోసం ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని ఏపీ సర్కార్ తెలిపింది. అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యలో ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ప్రయాణంపై ఆంక్షలు ఉండనున్నాయి. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని ఏపీ సర్కార్ సూచించింది.

కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో నిన్న(శుక్రవారం) తెల్లవారు జామున బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. 20మందికి తీవ్ర గాయాలయ్యాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.