ఎట్టి పరిస్థితుల్లో *401# నెంబర్‌కు కాల్ చేయొద్దు – ఎందుకంటే?

టెలికామ్‌ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ చేసి *401# డయల్ చేయమని కోరితే అలంటి వాటికి స్పందించవద్దని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) వెల్లడించింది.
ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు పొందుతున్న మరో ఎత్తుగడ ఇదని డాట్ తెలిపింది.


సమస్యల పరిష్కారం పేరుతో.. సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలియజేస్తూ.. సంస్థ ఎప్పుడూ ఫోన్ చేసి అలంటి వాటిని ఎంటర్ చేయమని చెప్పదని స్పష్టం చేసింది.

*401# కాల్ చేస్తే ఏమవుతుంది!
నిజానికి *401# నెంబర్ ఎంటర్ చేయగానే మీకు రావాల్సిన కాల్స్ గుర్తు తెలియని వ్యక్తులకు వెళ్ళిపోతాయని, కాల్‌ ఫార్వార్డ్‌కు మీరు పర్మిషన్ ఇచ్చినట్లే అవుతుందని డాట్ పేర్కొంది. మీ కాల్స్ మోసగాళ్ళు రిసీవ్ చేసుకుంటే.. అవతలి మీ స్నేహితులను లేదా బంధువులను మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెంబరుకు ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయవద్దని డాట్ హెచ్చరించింది.

ఒకవేళా మీ మొబైల్ ఫోనులో కాల్ ఫార్వార్డింగ్ యాక్టివేట్ అయి ఉంటే.. వెంటనే సెట్టింగులోకి వెళ్లి డీయాక్టివేట్ చేసుకోండి. లేకుంటే సైబర్ నేరగాళ్లు సులభంగా మీ కాల్స్ రిసీవ్ చేసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది.