నిర్జల ఏకాదశి నాడు తులసితో ఈ పరిహారాలు చేయండి.. జీవితంలో డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

తెలుగు పంచాంగం ప్రకారం నిర్జల ఏకాదశి ఉపవాసం జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున పాటించబడుతుంది. నిర్జల ఏకాదశి అన్ని ఇతర ఏకాదశిల కంటే ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.


విష్ణువుకు అంకితం చేయబడిన ఈ ఉపవాసాన్ని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం ఉన్న వ్యక్తి శ్రీ హరి ఆశీస్సులు పొంది.. పాపాల నుంచి విముక్తి పొందుతాడు. అలాగే ఈ రోజున తులసితో చేసే కొన్ని పరిహారాల ద్వారా వ్యక్తి సంపద, మంచి ఆరోగ్యం, కుటుంబంలో ఆనందాన్ని పొందుతాడు. అంతేకాదు ఈ ఏకాదశి ఉపవాశం మొత్తం వంశాన్ని రక్షించే ఉపవాసంగా పరిగణింపబడుతుంది.

నిర్జల ఏకాదశి ఎప్పుడు?

వేద క్యాలెండర్ ప్రకారం నిర్జల ఏకాదశి అంటే జ్యేష్ఠ మాసంలోని ఏకాదశి తిథి జూన్ 6న తెల్లవారుజామున 2:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మరుసటి రోజు జూన్ 7న ఉదయం 4:47 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 6న ఆచరించాల్సి ఉంటుంది.

నిర్జల ఏకాదశికి తులసి పరిహారాలు

నిర్జల ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ తరువాత విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. ఆ తర్వాత తులసి మొక్క చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి. తరువాత తులసి దగ్గర దీపం వెలిగించి, తులసి మొక్కకు ఎరుపు రంగు కండువాను సమర్పించండి. ఇలా చేయడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని.. ఇంటికి ఆనందం, శ్రేయస్సు వస్తుందని నమ్మకం.

నిర్జల ఏకాదశి రోజున సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. అలాగే శ్రీ మహా విష్ణువు మంత్రాలను జపిస్తూ.. తులసి మొక్క చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయండి. హిందూ మత విశ్వాసం ప్రకారం, ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఆనందం, శాంతి ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి.

హిందూ మత విశ్వాసం ప్రకారం నిర్జల ఏకాదశి రోజున తులసిని పూజించడంతో పాటు, తులసి మంత్రాలు, తులసి చాలీసా పఠించండి. హారతిని ఇవ్వండి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా.. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. తులసి పూజ వివిధ రకాల సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది.

విష్ణువుకు సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను తప్పనిసరిగా చేర్చండి. దీని కోసం ఒక రోజు ముందుగానే తులసి దళాలను సేకరించండి. ఏకాదశి రోజున తులసి పూజ సమయంలో తులసి మొక్కను.. వాటి ఆకులను తాకరాదు. హిందూ మత విశ్వాసం ప్రకారం విష్ణువు ఆరాధనలో తులసిని ఉపయోగించడం వలన విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. సాధకుడి అన్ని దుఃఖాలు తొలగిపోతాయి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.