Tech Tips : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ బయటపడుతున్నాయి. ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ మరింత అడ్వాన్స్ అయింది. ప్రతిఒక్కరి అరచేతిలో స్మార్ట్‌ఫోన్ కామన్ అయింది.
ఎవరికి ఎవరు ఫోన్ కాల్ చేసినా అది వారి ప్రమేయం లేకుండానే సీక్రెట్‌గా రికార్డులు చేస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో అనేక మంది మొబైల్ యూజర్లు మోసపోతున్నారు. మీ ఫోన్ కాల్స్ కూడా ఎవరైనా ట్యాప్ చేస్తున్నారా?
మీకు తెలియకుండా మీ ఫోన్ సంభాషణను ఎవరైనా రికార్డు చేస్తున్నట్టుగా అనుమానంగా ఉందా? అయితే, తస్మాత్ జాగ్రత్త. మీ ఫోన్ కాల్ ఎవరైనా తెలిసి తెలియక చేసినా మీకు ఏ కొంచెం అనుమానంగా అనిపించినా వెంటనే అప్రమత్తం అవ్వండి. మీ ఫోన్ కాల్స్ ఎవరూ రికార్డు చేయకుండా ఉండేందుకు ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించుకోండి.
ప్రస్తుతం అనేక కొత్త అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ మీ ఫోన్ కాల్స్ ఎవరూ రికార్డు చేయకుండా అడ్డుకోవడం సవాలుతో కూడుకున్న పనే కావచ్చు. కానీ, మీరు ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే.. మీ ఫోన్ కాల్స్ రికార్డు చేయకుండా ఎలా ప్రొటెక్ట్ చేయాలో తెలుసుకోవడమే. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ యాప్స్ వాడండి : సిగ్నల్ లేదా వాట్సాప్ వంటి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందించే యాప్‌లకు మారండి. ఈ యాప్‌లు మీ కాల్‌లను ఎన్‌క్రిప్ట్ చేస్తాయి. తద్వారా థర్డ్ పార్టీ యాప్స్ మీ ఫోన్ కాల్స్ ట్రాక్ చేయలేవు.
మీ పర్సనల్ డేటా భద్రం : మీరు వాడే ఫోన్‌లో సున్నితమైన అంశాలను చర్చించడం మానుకోండి. ప్రత్యేకించి ఎవరైనా రికార్డ్ చేస్తున్నారనే అనుమానం వస్తే.. అవసరమైనప్పుడు వ్యక్తిగత సంభాషణలు లేదా సేఫ్ మెసేజ్‌లను వాడండి. ఏదైనా కోడ్ లాంగ్వేజీని వాడండి.
మీ రైట్స్ ఏంటో తెలుసుకోండి : మీ అధికార పరిధిలోని ఫోన్ కాల్ రికార్డింగ్‌కు సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచుకోండి. చాలా చోట్ల ఒక కాలర్ అనుమతి లేకుండా వారి ఫోన్ కాల్ సంభాషణను రికార్డ్ చేయడం చట్టవిరుద్ధం.
కాల్ బ్లాకర్ వాడండి : కొన్ని యాప్‌లు, సర్వీసులు అవాంఛిత కాల్స్ బ్లాక్ చేసేందుకు ఉపయోగకరంగా ఉంటాయి. మీ ఫోన్లో ఇవి ఉంటే కాల్ రికార్డ్ అవుతుందనే నోటిఫికేషన్ ద్వారా అలర్ట్ చేస్తాయి.
మీ ఫోన్ సెట్టింగ్స్ చెక్ చేయండి : కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో కాల్ రికార్డ్ అవుతుందో లేదో మీకు తెలియజేసే ఇంటర్నల్ ఫీచర్లు ఉంటాయి. ఈ సెట్టింగ్‌లను తెలుసుకుని వెంటనే ఎనేబుల్ చేసుకోండి.
మీ ప్రైవసీపై నేరుగా మాట్లాడండి : ఎవరైనా మీ కాల్‌లను రికార్డ్ చేస్తున్నారని మీరు అనుమానం వస్తే.. వెంటనే నేరుగా వారిని అడగండి. కొన్నిసార్లు మీరు మాట్లాడే విషయాల పట్ల ఇతరులతో జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం. భవిష్యత్తులో వారితో సమస్యలను ముందుగానే అడ్డుకట్ట వేసినట్టే.
ల్యాండ్‌లైన్‌లు, సేఫ్ డివైజ్‌లను ఉపయోగించండి : మీరు మొబైల్ ఫోన్ కన్నా ల్యాండ్‌లైన్ లేదా ఏదైనా సేఫ్ డివైజ్ వాడితే చాలా మంచిది. ఎందుకంటే.. రిమోట్ రికార్డింగ్‌కు తక్కువ అవకాశం ఉంటుంది. మీ కాల్స్ ఎవరూ రికార్డు చేయలేరు.
కాల్ డ్యూరేషన్ లిమిట్ : మీ వ్యక్తిగతమైన సమాచారం గురించి తెలియకుండా ఉండాలంటే మీరు ఇతరులతో ఫోన్ కాల్స్ మాట్లాడే సమయాన్ని తగ్గించండి. సాధారణంగా తక్కువగా మాట్లాడటమే మంచిది.
మీ నంబర్‌ను మార్చండి : మీ కాల్స్ ఎవరైనా పదేపదే రికార్డ్ చేస్తున్నారా? అయితే ఆ వ్యక్తి గురించి ఇక ఆందోళన అక్కర్లేదు. మీ ఫోన్ నంబర్ మార్చేస్తే సరి.
లేటెస్ట్ టెక్నాలజీపై అప్‌డేట్‌గా ఉండండి : మీ డేటాను ప్రొటెక్ట్ చేసేందుకు లేటెస్ట్ ప్రైవసీ టెక్నాలజీ, టూల్స్ వంటివి అప్‌డేట్ చేసుకోండి.