Karungali Mala: మీ మెడలో ఈ మాల ఉంటే, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, చేతబడి కూడా పని చేయదు!

కరంగుళి మాల (ఓంకార్ మాల లేదా శివ మాల) అనేది ఎక్కువగా శివ భక్తులు ఉపయోగించే పూజా వస్తువు. ఈ మాలలోని తగిన మణులు వివిధ రకాల శక్తుల్ని, స్వాతంత్య్రాన్ని, మనస్సు స్థితిని పెంచడంలో సహాయపడతాయి.


దీనిని ధరించడం వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుండడంతో ప్రజలందరూ దీనిని ధరించేందుకు ఇష్టపడుతుంటారు. అలాగే దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ స్టోరీలో కరంగళి మాల ధరించడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆధ్యాత్మిక ప్రయోజనాలు

కరంగుళి మాల ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఏకాగ్రత పెరుగుతుంది. ఇది ధ్యానం మరియు యోగా వంటి ఆధ్యాత్మిక సాధనలకు సహాయపడుతుంది. శివ భక్తులకు ఇది మరింత శక్తివంతమైన పూజా వస్తువుగా భావిస్తారు. ఇది శివుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందేందుకు సహాయపడుతుంది. ఆధ్యాత్మిక శక్తి పెరగడంతో మనిషికి అంతర శక్తి కూడా పెరుగుతుంది. దీంతో చెడు శక్తులను సమర్థవంతా ఎదుర్కోగలుగుతారు. అలాగే చేతబడి వంటి వాటిని ఎదుర్కునే అవకాశం ఉంటుంది.

శారీరక ప్రయోజనాలు

కరంగుళి మాల ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి మరియు గుండె జబ్బులను నివారించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది. శరీరంలో శక్తి లభిస్తుంది.

మానసిక ప్రయోజనాలు

కరంగుళి మాల ధరించడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతాయి. ఇది సానుకూల ఆలోచనలను ప్రోత్సహిస్తుంది మరియు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడినైనా చాలా సులభంగా మ్యానేజ్ చేయగలుగుతారు. కరంగుళి మాల ధరించడం వల్ల దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది మరియు అదృష్టం పెరుగుతుంది అని నమ్ముతారు.