రెగ్యులర్ గా బిర్యానీ తింటున్నారా.. అయితే, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే

రోజుల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఇష్ట పడేది బిర్యాని. వీకెండ్ వచ్చిందంటూ చాలు అందరూ బిర్యానీ సెంటర్లకు క్యూ కడతారు. కొందరైతే వారంలో నాలుగైదు సార్లు తినాల్సిందే.


కాగా, బయట దొరికే ఆహార పదార్థాలు ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు సూచిస్తున్నారు. వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు. ముఖ్యం గా చికెన్ ముక్కలు, బిర్యానీ రైస్ కోసం వాడే రంగులు, టేస్ట్ కోసం వాడే పదార్థాలు చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అయితే.. రెగ్యులర్ గా.. రాత్రి వేళ రెగ్యులర్ గా బిర్యానీ తినే వారికి మాత్రం నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.

బిర్యానీ తరచూ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మిడ్​నైట్​ బిర్యానీ, మార్నింగ్ 4 గంటలకు బిర్యానీ అంటూ పలు హోటళ్లు ఊరిస్తు న్నాయి. వేళాకాని వేళలో బిర్యానీలు తినడం అంటే అనారోగ్యం కొని తెచ్చుకోవటమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళల్లో ఎక్కువగా బిర్యానీలు తింటున్న వారు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాత్రి మరీ ముఖ్యంగా 10 గంటల తర్వాత మాంసాహారం వంటి భారీ ఆహారాన్ని ఆలస్యంగా తిన్నప్పుడు సరిగ్గా జీర్ణం కాదని, దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, రాత్రి ఆలస్యంగా తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయి ప్రభావితమై గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందంటున్నారు.

నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు భోజనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట ఆలస్యంగా తీసుకున్న ఆహారంలోని కేలరీలు పూర్తిగా ఖర్చవకుండా శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయని తెలియజేస్తున్నారు. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఇన్సులిన్ స్థాయి ప్రభావితమవుతుందని, ఇది మధుమేహం లేదా ప్రీ డయాబెటిస్ సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అధిక క్యాలరీలు, నూనె, వనస్పతి, ఫ్యాటీ మీట్స్ ఉండటం తో బిర్యానీలు అధికంగా తినేవారికి ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెటబాలిక్ సిండ్రోమ్, ఫ్యాటీ లివర్, షుగర్, బీపీ వంటి వ్యాధులు వస్తున్నాయి.

గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే యువత సంఖ్య పెరుగుతోంది. అధిక కేలరీలు ఉండే బిర్యానీ, చికెన్, మటన్ రాత్రి తినడం వల్ల జీర్ణక్రియ కు ఎక్కువ సమయం పడుతుంది. ఆలస్యంగా తినటం వలన నిద్రలేమితో పాటు ఆందోళన, కుంగుబాటు.. మానసిక సమస్యలూ ఎదుర్కోవాల్సి వస్తుందని వివరిస్తున్నారు. బిర్యానీ ఎక్కువ తినడం వల్ల ఊబకాయంతోపాటు అల్సర్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. దీంతో, పరిమితం గా తీసుకోవటం ద్వారా సమస్యలకు దూరంగా ఉండవచ్చని సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.