పచ్చి పల్లీలను తింటున్నారా? అయితే ఇది మీ కోసమే!

చాలామంది పల్లీలను ఇష్టంగా తింటారు. కొందరు వేరు శనగ గింజలను ఉడకబెట్టుకుని తింటే, కొంతమంది వేయించుకొని తింటారు. మరికొంతమంది పచ్చివే ఇష్టంగా తింటారు.


అసలు పచ్చి పల్లీలు తినడం మంచిదేనా? పల్లీలు తింటే ఏమవుతుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. పచ్చి పల్లీల లో బోలెడు పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పల్లీలలో ముఖ్యంగా విటమిన్ ఈ ఉంటుంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

పచ్చి పల్లీలు తింటే ఈ లాభాలు

పచ్చి పల్లీలను తినడం మంచిదే. పచ్చి పల్లీలను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పచ్చి పల్లీలను తినడం వల్ల ఇందులో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తుంది. పచ్చి పల్లీలతో ఎముకల బలం పెరుగుతుంది. పల్లీలు మన ఎముకలను లోపల నుండి బలోపేతం చేస్తాయి.

పల్లీలతో బరువుకు, ఏజింగ్ సమస్యలకు చెక్

పల్లీలలో ఉండే ఫైబర్ కారణంగా ఆకలి నియంత్రణలోకి వస్తుంది. ఫలితంగా మనం బరువును కూడా తగ్గవచ్చు. పల్లీలు వృద్ధాప్యం దరిచేరకుండా నిత్య యవ్వనం తో ఉండేలా చేస్తాయని కొంతమంది చెబుతారు. వయసు మీద పడ్డట్టు కనిపించకుండా, శరీరం పైన ముడతలు రాకుండా నున్నగా ఉంచేలా పల్లీలు చేస్తాయి. పల్లీలను పరిమిత మోతాదులో తింటే డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది. ముఖ్యంగా ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది.

పల్లీలు ఎక్కువ తింటే అనవసరమైన రోగాలు

అయితే పచ్చి పల్లీలను తినడం మంచిదే అయినప్పటికీ వీటిని ఎక్కువ మోతాదులో తినడం మాత్రం మంచిది కాదు . పచ్చి పల్లీలను అధికంగా తింటే అనవసరమైన ఇబ్బందులు వస్తాయి. పచ్చి పల్లీలను అధికంగా తినడం వల్ల బరువు పెరిగే సమస్య వస్తుంది. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

పల్లీలు తింటే ఇలానే తినాలి

అలర్జీలతో బాధపడేవారు పచ్చి వేరుశనగ గింజలను తినకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ తినాలనుకుంటే నానబెట్టి లేదా ఉడికించి తింటే మంచిది. మొత్తం మీద పల్లీలను ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యమే కాబట్టి నిరభ్యంతరంగా పల్లీలను తినవచ్చు. కాకుంటే పరిమిత మోతాదులో తినడమే ముఖ్యం. పరిమిత మోతాదులో తినకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.