ఒక్కోసారి గందరగోళం, ఆందోళన, భయం కారణంగా కొందరు గోర్లు కొరుకుతుంటారు. ఈ అలవాటు ఉన్న వారు ఏ మాత్రం ఒత్తిడి కలిగిన చేతి గోర్లు నోట్లో పెట్టుకుని నమలడం, కొరకడం చేస్తుంటారు.
దీంతో గోర్లు విరగడంతోపాటు అనేక సమస్యలను కలిగిస్తాయి. గోర్లు కొరికే అలవాటు మీకు కూడా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకోండి..
సాధారణంగా ఆందోళన లేదా నెర్వస్‌నెస్ కారణంగా దానిని ఎలా వ్యక్తీకరించాలో తెలియక చాలా మంది గోళ్లు కొరుకుతుంటారు. ఇలా గోళ్లు కొరుకుతూ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, ఇది మంచి పద్ధతి కాదు. ఇది పలు రకాల శారీరక సమస్యలను కలిగిస్తుంది. మీ గోళ్లను కోరికే అలవాటును వీలైనంత త్వరగా మానుకోవాలి.
గోరు కొరకండ వల్ల శరీరంపై ఈ విధమైన చెడు ప్రభావాలు పడతాయి. గోరు కొరకడం వల్ల గోళ్ల నిర్మాణం దెబ్బతింటుంది. గోళ్లు కొరకడం వల్ల దంతాలు సైతం దెబ్బతింటాయి.
గోరు కొరకండ వల్ల శరీరంపై ఈ విధమైన చెడు ప్రభావాలు పడతాయి. గోరు కొరకడం వల్ల గోళ్ల నిర్మాణం దెబ్బతింటుంది. గోళ్లు కొరకడం వల్ల దంతాలు సైతం దెబ్బతింటాయి.
గోళ్లను నమలడం వల్ల అనేక రకాల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి వివిధ రకాల కడుపు సమస్యలను కలిగిస్తుంది.గోళ్లలోని మురికి నోటిలో పేరుకుపోయి జలుబు, ఇతర అంటు వ్యాధులు వస్తాయి. గోళ్లు కొరకడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.