రాత్రి Wifi ఆన్ చేసి ఉంచుతున్నారా?

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా అవుతుంది. చాలామంది మొబైల్ లో ఇంటర్నెట్ డేటా వేసుకోవడం కంటే.. వైఫై ద్వారా ఎక్కువగా వినియోగం చేస్తున్నారు.


జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలకు చెందిన రూటర్లను కొనుగోలు చేసి వాటి ద్వారా మొబైల్, టీవీ, కంప్యూటర్లకు ఇంటర్నెట్ వాడుతున్నారు. అయితే ఇంటర్నెట్ వాడే సమయంలో ఇంట్లో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని ఇక్కడికి కొందరు సాంకేతిక నిపుణులు తెలిపారు. దీంతో రేడియేషన్ ప్రభావం కూడా ఉంటుందని పేర్కొన్నారు. అయినా కొన్ని అవసరాల నిమిత్తం ఈ రూటర్ ను వినియోగించక తప్పడం లేదు. అయితే ఈ రూటర్ ను కొన్ని సమయాల్లో ఆఫ్ చేయడం మంచిది. లేకుంటే అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. మరి ఏ సమయాల్లో వైఫై రూటర్ ను ఆఫ్ చేయాలి..?

కొంతమంది వైఫై రూటర్ ను నిత్యం ఆన్ లో ఉంచుకోవాలని చెబుతూ ఉంటారు. కానీ ఇలా 24 గంటలు వైఫై రూటర్ ఆన్ లో ఉండడం వల్ల సేఫ్ కాదు. ఎందుకంటే వైఫై రూటర్ ఆన్ లో ఉన్న సమయంలో రేడియేషన్ ప్రభావం వల్ల ఆ ప్రాంతం వేడిగా ఉంటుంది. అంతేకాకుండా వైఫై వల్ల కొన్ని డివైస్ లు ఆటోమెటిగ్గా ఆన్ అవుతూ ఉంటాయి. దీంతో ఇవి ఇంటర్నెట్ తో రన్ అవుతూ ఉంటాయి. ఫలితంగా వాటి కెపాసిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మొబైల్ వైఫై ఆన్ చేసుకొని ఉంటే.. ఇందులో ఉండే కొన్ని సాఫ్ట్వేర్లు ఆటోమేటిగ్గా రన్ అవుతూ ఉంటాయి.

రాత్రి సమయంలో వైఫై ఇంటర్నెట్ ను ఆఫ్ చేయడం మంచిది. ఎందుకంటే ఇది ఆన్ లో ఉన్న సమయంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండి మనిషి మెదడుపై ప్రభావం పడుతుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వైఫై ఆన్ లో ఉన్న సమయంలో రేడియో తరంగాలు ప్రసరిస్తూ ఉండడం వల్ల నిద్రలేమి సమస్య ఉంటుంది. దీంతో రాత్రి నిద్ర పోయేవారికి ఇది సమస్యగా మారుతుంది. అంతేకాకుండా రాత్రి సమయంలో పడుకునే గంట ముందే ఇంటర్నెట్ ఆఫ్ చేసి నిద్రించాలి. అలా చేయడంవల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం ఉండకుండా చేస్తుంది.

అలాగే రాత్రి సమయంలో ఇంటర్నెట్ ఆన్ లో ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. దీంతో దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల రాత్రి సమయంలో ఇంటర్నెట్ ఆఫ్ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా రాత్రి సమయంలో కేవలం మొబైల్ వాడేవారు మొబైల్ డేటా ఆన్ చేసుకోవడం మంచిది. అలా చేస్తేనే ఇంట్లో రేడియో తరంగాల ప్రసారం తగ్గిపోయి.. ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.