విమానంలో ఆల్కహాల్ తీసుకెళ్లడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. డొమెస్టిక్ ఫ్లైట్, ఇంటర్నేషనల్ రూట్స్‌కు రూల్స్ వేరుగా ఉంటాయి.
చాలా మంది గోవా లేదా ఇతర టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్లినప్పుడు అక్కడి నుంచి ఆల్కహాల్ తీసుకొద్దాం అనుకుంటారు. కానీ, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ దగ్గర ఆపుతారేమోనని చాలా మంది టెన్షన్ పడుతుంటారు. విమానంలో ఆల్కహాల్ తీసుకెళ్లడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. డొమెస్టిక్ ఫ్లైట్, ఇంటర్నేషనల్ రూట్స్‌కు రూల్స్ వేరుగా ఉంటాయి. ముఖ్యంగా ఇండియాలోని రాష్ట్రాల నిబంధనలు ఎయిర్‌లైన్ పాలసీలు ఇవన్నీ తెలిస్తే ఈ కన్‌ఫ్యూజన్ ఉండదు. అందుకే మీ బాటిల్ ఇంటికి సేఫ్‌గా చేరాలంటే ఈ సింపుల్ గైడ్ ఫాలో అవ్వాలి.ఆల్కహాల్ లిమిట్ ఎంత?మీరు ఇండియాలో ఒక సిటీ నుంచి మరో సిటీకి ప్రయాణిస్తున్నప్పుడు చెక్‌డ్ లగేజ్‌లో ఆల్కహాల్ తీసుకెళ్లడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పర్మిషన్ (DGCA Alcohol Limit) ఇస్తుంది.
ఒక్కో ప్యాసింజర్‌కు మ్యాగ్జిమం 5 లీటర్ల వరకు ఆల్కహాల్ అనుమతి ఉంది. ఈ లిమిట్ విస్కీ, రమ్, జిన్, వోడ్కా, వైన్ వంటి వాటికి వర్తిస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన రూల్ ఏంటంటే ఆల్కహాల్ శాతం (ABV) 24 శాతం నుంచి 70 శాతం మధ్య మాత్రమే ఉండాలి. 70 శాతం కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉన్న వాటిని ఫైర్ హజార్డ్‌గా భావించి పూర్తిగా బ్యాన్ చేశారు.
ల్యాండింగ్ రూల్స్మీరు ఆల్కహాల్ (Liquor Flight Rules) తీసుకెళ్లే విషయంలో మరో ముఖ్య విషయం ఏంటంటే రాష్ట్రాల చట్టాలు. గుజరాత్ లేదా బిహార్ లాంటి కొన్ని రాష్ట్రాలలో ఆల్కహాల్ రవాణాపై పూర్తి నిషేధం ఉంటుంది. మీరు ఎయిర్‌లైన్ పర్మిషన్ తీసుకొని బాటిల్స్ తీసుకెళ్లినా, ల్యాండ్ అయిన తర్వాత లోకల్ పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. అందుకే మీరు ఏ రాష్ట్రానికి వెళ్తున్నారో ఆ స్టేట్ రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాలి. అంతే కాకుండా మీరు తీసుకెళ్లే బాటిల్స్ సీల్ చేసి తెరవకుండా, రిటైల్ ప్యాకేజింగ్‌లో ఉండాలి. ప్యాకింగ్ లీక్ అయితే బోర్డింగ్ దగ్గర ఆపే అవకాశం ఉంటుంది.
ఎయిర్‌లైన్స్ పాలసీలుDGCA హ్యాండ్ లగేజ్‌లో ఆల్కహాల్ (Liquor Flight Rules) తీసుకెళ్లడాన్ని ప్రోత్సహించదు. ఎయిర్‌లైన్స్ ఈ రూల్‌ను వేరే విధంగా అమలు చేస్తాయి. ఉదాహరణకు, ఎయిర్ ఇండియా క్యాబిన్ బ్యాగ్‌లో ఆల్కహాల్‌ను అస్సలు అనుమతించదు. ఇండిగో, ఆకాశ ఎయిర్ మాత్రం సెక్యూరిటీ దాటిన తర్వాత కొనుగోలు చేసిన ఒరిజినల్ ప్యాకేజింగ్‌లో ఉన్న ఒక లీటరు వరకు మాత్రమే అనుమతి ఇస్తాయి. స్పైస్‌జెట్ కూడా డ్యూటీ ఫ్రీ ఆల్కహాల్‌ను ట్యాంపర్ ప్రూఫ్ బ్యాగుల్లో మాత్రమే పర్మిట్ చేస్తుంది.
విదేశాలకు వెళ్లే రూల్స్మీరు విదేశాలకు వెళ్తున్నా, లేక అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వస్తున్నా రూల్స్ మారుతాయి. అమెరికా TSA (ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్) రూల్స్ ప్రకారం.. హ్యాండ్ లగేజ్‌లో కేవలం 100 మిల్లీలీటర్ల బాటిళ్లకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అది కూడా డ్యూటీ ఫ్రీ నుంచి సీల్డ్ ప్యాకేజింగ్‌లో కొంటే మాత్రం మినహాయింపు ఉంటుంది. చెక్‌డ్ బ్యాగ్‌లో 5 లీటర్ల వరకు పర్మిషన్ ఉంది. అదీ 24 శాతం నుంచి 70 శాతం ABV మధ్య ఉంటేనే. డ్యూటీ ఫ్రీ ఆల్కహాల్ (Duty Free Liquor) బాటిల్స్‌ను ట్యాంపర్ ప్రూఫ్ బ్యాగ్‌లో ఉంచడం ఇంటర్నేషనల్ కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో చాలా ముఖ్యం.
లీకేజీ సమస్య రాకుండావిస్కీ లీకైతే ఆ టెన్షన్ చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకే బాటిల్స్‌ను బబుల్ ర్యాప్ లేదా సాఫ్ట్ బట్టల్లో చుట్టండి. లీకేజీని నివారించడానికి బాటిళ్లను సీల్డ్ ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉంచండి. వాటిని సూట్‌కేస్ మధ్యలో ఉంచి చుట్టూ బట్టలతో కుషన్ లాగా సెట్ చేయండి. గ్లాస్ బాటిల్స్‌పై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండాలంటే ఓవర్ ప్యాకింగ్ అస్సలు చేయొద్దు. డ్యూటీ ఫ్రీ కొనుగోళ్లకు రసీదులు దగ్గర ఉంచుకోవాలి.
సేఫ్టీ కోసం రూల్స్ఫ్లైట్‌లో మీ సొంత ఆల్కహాల్ తాగడం పూర్తిగా నిషేధం. ఎయిర్‌లైన్ సిబ్బంది దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. సేఫ్టీ కోసమే ఈ రూల్స్ అమలు చేస్తారు. సింగిల్ మాల్ట్ అయినా సరే, దాన్ని ఇంటికి తీసుకెళ్లడం వరకే మీ పని.



































