కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని జీవితంలో ఒక్కసారి అయినా దర్శించుకోవాలి అని అనుకునేవారు చాలామంది ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా తరలివచ్చేవారు ఎంతోమంది ఉన్నారు.
అయితే తన కొండకు వచ్చే ప్రతి భక్తుడికి శ్రీవారి అండ ఉంటుందని భక్తులు నమ్ముతారు. అందుకే కొందరు ఏడాదికి ఒకసారి అయినా తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే తిరుపతికి ఎన్నిసార్లు రావాలో తెలుసా?
కొందరు ఆధ్యాత్మిక పండితులు చెబుతున్న ప్రకారం తిరుమలకు రావడం వల్ల ఎన్నో రకాల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని అంటున్నారు. కలియుగ దైవంగా పిలువబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరిస్తే ఎలాంటి నగదు కొరత ఉండదని అంటున్నారు. ఎందుకంటే భక్తుల ఆర్థిక సమస్యలను తొలగించడానికి ఈ యుగంలో వెంకటేశ్వర స్వామికి మాత్రమే సాధ్యమవుతుందని చెబుతున్నారు.
అయితే ఎన్నో అప్పుల నుంచి బయటపడాలని అనుకునేవారు తిరుమల కొండకు ఏడుసార్లు నడిచి రావాలని చెబుతున్నారు. ఏడుకొండలు కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏడుసార్లు దర్శించుకుంటే ఎన్నో రకాల అప్పుల నుంచి బయట పడవచ్చని అంటున్నారు. కొందరు జీవితాంతం కష్టపడినా కూడా అప్పులు తీరకుండా ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతోకొంత అప్పు మిగిలే ఉంటుంది. ఇలాంటివారు దైవానుగ్రహం కోసం తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని అంటున్నారు. అందుకే చాలామంది తిరుమలకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది.
కొందరు ఏడాదికి ఒకసారి తిరుమలకు వస్తుంటే.. మరికొందరు ఏడాదికి రెండుసార్లు శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటారు. అయితే ఏడాదిలోనే కాకుండా జీవితంలో ఏడు సార్లు స్వామివారి దర్శనం చేసుకుంటే వారికి ఉన్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినవారు స్వామివారిని దర్శించుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో రకాల కానుకలు సమర్పిస్తూ ఉంటారు. వీటిలో బంగారం వెండితో పాటు విలువైన వస్తువులు కూడా ఉంటాయి. అయితే ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే ఆ వ్యక్తికి వెన్నంటే ఉండి కాపాడగలిగే వ్యక్తి వెంకటేశ్వర స్వామి మాత్రమేనని చెబుతున్నారు. అయితే కొందరు తిరుమలకు ఇష్టం వచ్చినట్లు వస్తున్నారని.. నిష్టతో స్వామివారిని సేవించడం వల్ల జీవితంలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని అంటున్నారు.
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీనివాసుడు రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. దీంతో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు.



































